13, జనవరి 2013, ఆదివారం

ధర్మోపదేశం

ధనం ఏ నీడ  ఉండని అంతిమ దినాన అది ఏ విధంగానూ అతనికి పనికి రాదు. పైగా దానిమీద మోజు పెంచుకునియుక్తాయుక్తాలను వీడిన్యాయాన్యాయాలనుపెడ చెవిన పెట్టి బ్రతికిన వారిని అది మహా సర్పమయి యమ యాతనలకు గురి చేస్తుంది. ఆ విషయాని కొస్తే మనిషి ఎంత సంపాదించినా చచ్చాక తోడు తీసుకెళ్ళేది చిల్లిగవ్వ కూడా కాదుగా! అతను చేసుకున్న పాపపుణ్యాలే అతనికుంటాయి అంతే. ధనం ఇహ లోక జీవి తాన్ని సుఖంగా గడపడానికి సహాయ పడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే,  దాన్ని ధర్మ పద్ధతిలో సంపాదించిధర్మ పరిధిలో ఖర్చు పెడితేగాని అది పరలోక మోక్షానికి ఉపయోగ పడదు.ధర్మం ఏ ఒక్క వర్గానికిప్రాంతానికి చెందినసొత్తు కాదు.ధర్మం అందరిది. ధర్మాన్ని పాటించడంధర్మ విధుల్ని నిర్వర్తించడం ఏకొంద రి బాధ్యత కాదుఅందరిది. మహా తెలివివంతులుమొదలుమామూలు స్థాయి తెలివి గల వారి వరకుబాగాచదువుకున్న వారు మొదలు అక్షరం ముక్క రాని వారి వరకు,బలవంతులు మొదలు బలహీనుల వరకుకుబేరులు మొదలు కార్మికులుకూటికి లేని వారి వరకు- ధర్మాన్ని తెలుసుకునేప్రశ్నిం చేపాటించే హక్కు అందరికీ ఉంటుంది. ఉండితీరాలికూడా. ఫలానా ప్రాంతంలో పుడితేనోఫలానా యూనివర్సిటిలో చదువుకుంటేనోఫలానా కులంలో జన్మిస్తేతేనోఫలా నా భాష మాట్లాడితేనోఫలానా వేషధారణ కలిగి ఉంటేనోఫలానా రంగు కలి గుంటేనోపురు డైతేనోపెద్దవారయితేనో మాత్రమే ధర్మాన్నిధర్మ గ్రంథాన్ని చదవాలి. పాటించాలన్న రూలేం లేదు. ఓటు బ్యాంకు కోసంనోటు బ్యాంకు కోసం వీటి అవసరం ఏ మేరకు ఉన్నాధర్మాన్ని నిష్ఠగా పాటి చడానికి వీటన్నింటితో పని లేదు. మరి అవసర మైనవి ఏమిటంటే..ధర్మాన్ని తెలుసుకోవాలన్న తపనధర్మాన్ని ఎలా పాటించాలన్న స్పష్టత! ఆ స్పష్టతే ధర్మాధర్మాల మధ్య విభ జన రేఖ. ఆ మాత్రం అవగాహన ఉంటే మన అధ్యాత్మికలక్ష్యం సగం నెరవేరినట్లే. మిగతా యాభై శాతాన్ని సాధి ంచడానికి కార్యాచరణ అవసరం. ప్రణాళికవ్యూ హం... దానికి ఏ పేరయి నా పెట్టుకోవచ్చు.  కొంత మందిలో ధర్మాన్ని పాటించాలన్ననిష్టగా జీవింతాలన్న తపన ఉంటుందిగానీఎలాఏ పరిధిలో అన్న స్పష్టత ఉండదు. అలాంటివారే ఎంతో నిష్టతో జీవిస్తున్నట్లు మనకు కనబడినా దర్గాల దగ్గరకెళ్ళి మోకరిల్లుతారు. పీరు బాబాల కోసం ఎగబడతారు. మోసపోతారు.    మరికొందరుంటారుగుంట నక్కలు - వీరు సమయం కలిసొస్తే తమల్ని తాము బాబాలుగా ప్రకటించుకొన్ని పట్టపగలే నిలువు దోపిడికి పాల్పడతారు.  ప్రజల్ని అన్ని విధాలా కొల్ల గొడ తారు. వారి రక్తమాంసాలతోనే వ్యాపారం చేస్తా రు. ఆ వ్యాపార కేంద్రాల్నే పవిత్ర క్షేత్రాలుగా ప్రచారం చేస్తారు. 
  ధర్మం మీద అపారమైన ప్రేమ ఉంటే సరిపోదు ...ప్రాథమిక సూత్రాలు తెలుసుకోకుండా వీణ మీటితే అపస్వరాలు పలికినట్లుధర్మం విషయం లో సయితం ప్రాథమిక పరిజ్ఞానమే లోపిస్తే అప సవ్యతలు చోటు చేసుకొని అపమార్గం పాల్జే స్తాయి. అఖీదయే ధర్మానికి అసలైన పునాది. అర్కానుల్‌ ఈమాన్‌ ఏమిటోఅర్కానుల్‌ ఇస్లాం ఏమిటోకలిమా అర్థం ఏమిటో తెలుసుకోకుండా ధర్మాన్ని పాటించిన ఏ వ్యక్తీ ఎంతో కాలం సత్య బాటన నడవలేడు. ఏ రంగానికయినాఏ వ్యాపా రానికయినా ఈ సూత్రమే వర్తిస్తుంది.  ఓ పది లక్షలు పెట్టి వైద్య శిబిరాలు నిర్వహిం చామనుకోండిలేదా ఓ 10 కోట్లు పెట్టి అనాథలఅభాగ్యులవితంతువుల సంక్షేమ  క్షేత్రాలు నిర్మించామనుకోండి - దాన్ని అల్లాహ్‌ా తనకు ఇవ్వబడిన రుణంగా అంగీక రించి ఉత్తమ రీతిలో దాన్ని తిరిగిస్తాడనిఅలా చేయడం స్వయంగా అల్లాహ్‌ాను సేవిం చుకున్నట్టే అవుతుందనిఅటువంటి బృహ త్తర కార్యం వల్ల అల్లాహ్  ఎంతో ప్రసన్నుడవు తాడనితన దాసుల అవసరాలు తీర్చడంలో నిమగ్నుడయి ఉండే దాసుని అవసరాలు   స్వయంగా తానే తీరుస్తాడని దైవప్రవక్త (స) వారు పలు ప్రవచనాల ద్వారా రూఢీ అవు తుంది.
అదే ఏ ఉమ్రాకోహజ్జ్‌కో వెళ్ళామనుకోండి - అది మన పాప ప్రక్షాళన కోసం పనికొ స్తుంది. 'ఒక ఉమ్రా మరో ఉమ్రాకి మధ్యఒక జుమా మరో జుమా మధ్య జరిగే పాపా లను ప్రక్షాళిస్తాయ'న్నారు ప్రవక్త (స).   దురదృష్టకరం ఏమిటంటే బాగా ధార్మిక విద్యార్జనప్రాపంచిక విద్యార్జన గరిపినవారుమంచీ చెడుల విచక్షణ ఉన్నవారు కూడా ధర్మాన్ని రక్షగా కాకఅదో దైవం తమపై విధించిన శిక్షగా భావిస్తున్నారు. నిజంగా నిశితంగా మనం పరిశీలించినట్లయితే ధర్మానికంటూ మనం పెట్టే పెట్టుబడి మనకే చెందుతుందిమనకే చేరుతుంది. మనం ధర్మ పద్ధతిలో మన కోసంమన వారి కోసం మనం వెచ్చిస్తున్నది ఆవగింజంతటిదయినా అందులో చిత్తశుద్ధి ఉంటే మహా పర్వత రూపంలో తిరిగి మా వద్దకు వస్తుంది. 
ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకొని సంపాదించడంలో బిజీగా ఉన్న ఒక కుమారుడు  ముదిమి థకు చేరుకున్న అమ్మానాన్నలకు వారికిష్టమయిన వస్తువులు కొనిపెట్టాడానుకోండి. అదీ పెట్టు బడే. స్వర్గసౌధాలకు పెట్టే పెట్టుబడి. 'తల్లి పాదాల చెంత స్వర్గం ఉందనితండ్రి స్వర్గపు ద్వారం అనివారిరువురి ప్రసన్నతలోనే దైవ ప్రసన్నత దాగుంద'ని దైవప్రవక్త (స) నొక్కి వక్కా ణించారు. భార్యాపిల్లలపై పెట్టే పెట్టుబడి ఇహంలో జీవన మకరందాన్నిపరంలో శాశ్వత కీర్తిని తెచ్చి పెడుతుంది. 'నీ భార్యకునీ సంతానానికి నీవు పెట్టే ముద్దలో సయితం నీకు పుణ్యం ఉందిఅని స్వయంగా ప్రవక్త (స) వారు సెలవియ్యడమే కాక, 'సజ్జన సంతానం మరణానంతరం కూడా పనికొస్తుంది. రేపు ప్రళయ దినాన కూడా వారి కారణంగా తల్లిదండ్రుల్ని కీర్తికిరీటాలు తొడిగించి సన్మానించడం జరుగుతుంద'ని తెలియజేశారు. 
ఓ పది లక్షలు పెట్టి వైద్య శిబిరాలు నిర్వహిం చామనుకోండిలేదా ఓ 10 కోట్లు పెట్టి అనాథలఅభాగ్యులవితంతువుల సంక్షేమ  క్షేత్రాలు నిర్మించామనుకోండి - దాన్ని అల్లాహ్‌ా తనకు ఇవ్వబడిన రుణంగా అంగీక రించి ఉత్తమ రీతిలో దాన్ని తిరిగిస్తాడనిఅలా చేయడం స్వయంగా అల్లాహ్‌ాను సేవిం చుకున్నట్టే అవుతుందనిఅటువంటి బృహ త్తర కార్యం వల్ల అల్లాహ్‌ా ఎంతో ప్రసన్నుడవు తాడనితన దాసుల అవసరాలు తీర్చడంలో నిమగ్నుడయి ఉండే దాసుని అవసరాలు   స్వయంగా తానే తీరుస్తాడని దైవప్రవక్త (స) వారు పలు ప్రవచనాల ద్వారా రూఢీ అవు తుంది.
అదే ఏ ఉమ్రాకోహజ్జ్‌కో వెళ్ళామనుకోండి - అది మన పాప ప్రక్షాళన కోసం పనికొ స్తుంది. 'ఒక ఉమ్రా మరో ఉమ్రాకి మధ్యఒక జుమా మరో జుమా మధ్య జరిగే పాపా లను ప్రక్షాళిస్తాయ'న్నారు ప్రవక్త (స).   ఓ హదీసు గ్రంథాన్ని,ఒక ఖుర్‌ ఆన్‌ గ్రంథాన్ని మన కొసమే కాక మస్జిద్‌కొచ్చేవారు చదివేం దుకు కొన్నామనకోండి అవి మనో వికాసానికిపూణ్యానికి కారణభూతం అవుతాయి. మనం చేసే ఈ సత్కార్యాలు ప్రత్యక్షంగానోపరోక్షంగానో మానసికంగానోఆధ్యాత్మికం గానో సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ధర్మాన్ని పాటిం చడం ద్వారా లభించే ప్రయో జనాల్ని ధనంతో కొనలేము కదా!
ఇకపోతే ధార్మిక విద్యనుచదివే విద్యార్థులుచదివించే తల్లిదం డ్రులు మూడు రకాలుగా ఉం టారు. నాసి రకంమధ్య రకంనాణ్యత గలవారు. ఈ మూడు వర్గాల్లో నాసిరకం తల్లి దండ్రులు నాసిరకపు ఆలోచన ల్నే తమ పిల్లలకిచ్చి ధార్మిక పాఠశాలలకు పంపుతారు.వీరు ఏదోలా చదివి..ఏదోకటి చేసు కు బ్రతకాలి అన్న పరిధి    శారీరకంగానో,మానసికంగానోఆధ్యాత్మికంగానో సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మాన్ని పాటించడం ద్వారా లభించే ప్రయోజనాల్ని ధనంతో కొన లేము. దాటవు వీరి లక్ష్యాలు. చదువు పూర్తవడమే ఆలస్యం ఇక పులులుసింహాలుతోడెళ్లు లాగా జన వాసాల మీద పడి వారి ఇహాన్ని పరాన్ని భ్రష్టు పట్టిస్తూ ధర్మాన్ని ధనార్జన మార్గంగా చేసుకుని సిగ్గు లేకుండా బ్రతికేస్తారు. వీరు ఊబి నేలను పోలి ఉంటారు. ఇక మధ్య రకం విధ్యార్థులు ఒకరిని మోసం చేసి బ్రతకా లన్న  ఉద్దేశ్యం లేకపోయినా వారి ఆర్జించిన విద్య వల్ల వారి కివారి కుటుంబానికి ఏ మేర కు ప్రయోజనం కలుగుతుం దన్న విషయాన్ని ప్రక్కన పెడితే ప్రజలకు మాత్రం వీరి వల్ల ఎలాంటి ధార్మిక ప్రయొజనం చేకూరదు. ఆ దిశగా వారు ఆలోచించరు కూడా. అంటే వీరు ధార్మిక విద్యార్జన గరి పారుగానీధర్మాన్ని తమ కోసం గానీఇతరుల కోసం గానీ శుభప్రదమయినదిగా భావించలేదు.  ఒకవేళ వీరికి సంతానం కలిగి మంచి ఆర్థిక స్తోమత ఉన్నా వారు తమ పిల్లలను ధార్మిక పాఠశాలల్లో మాత్రం చేర్చే సాహసం చేయరు. వారి దృష్టిలో ధార్మిక పాఠశాలలో పడిన శ్రమనేర్చుకున్న విద్య ఒక వృధా ప్రయాస తప్ప మరేమీ కాదు. ఒకవేళ అదృష్టవశాత్తు ధార్మిక సేవలు అందించే సువర్ణవకాశం వచ్చినా మొత్తుకుంటూ పని చేస్తారేగానీ మన స్ఫూర్తిగా పని చెయ్యరు. అంతర్జాతీయ వేెదిక పై ధర్మంధర్మావలంబీకులు పడరాని పాట్లు పడుతున్నా పట్టనట్టుగా ఉండి పోతారు తప్ప తమవంతు కర్తవ్యంగా ఏదయినా నివారణనిరసన చర్యలు చేపడ దామన్న ఆలోచన కూడా వీరి మెదళ్లలో మెదలదు. అంటే వీరు ప్రత్యక్షంగా ఒకరికి కీడు తల పెట్టక పోయినా మేలు చేసే సద వకాశాన్ని సయితం వదులుకుం టారు.
ఇక నాణ్యమైన ఆలోచనలు కలిగిన తల్లిదం డ్రులు వారి సంతానం-వారు ధనికులయినానిరుపేదలయినా నిస్వార్థంగా తమ పరిధులలో ధార్మిక సేవల్ని అందించే ప్రయత్నం  చేస్తారు. తాము ఆర్జించిన విద్యనువిజ్ఞానాన్ని లోకాని కిలోకవాసులకు అందజేస్తారు. అంటే కొంద రు ఆధార పడతారు. కొందరు సొంత కాళ్ళ మీద నిలబడతారు. కొందరు సొంత కాళ్ళ మీద నిలబడటమేకాక ఇతరులకు ఆధారం ఇచ్చే స్థాయికి ఎదుగు తారు. తల్లిదండ్రులుగా మనం ఏ జాబితాలో చేెరాలోమన పిల్లల్ని ఏ కేటగిరిలో చేర్చాలో మనమే నిర్ణయించుకో వాలి. ఉత్త తల్లిదండ్రులుగా మిగిపోతామోఉత్తమ తల్లిదండ్రులుగా మన పేరు నమోదు చేసుకుంటామో మన చేతుల్లోనే ఉంది.ఒకవేళ అల్లాహ్  మనల్ని సజ్జన సంతానానికి తల్లిదం డ్రులుగా 'కీర్తి కిరీటాలుతొడిగించి సన్మానిం చాలనుకుంటే అంత మాత్రం శ్రమ తీసుకోక తప్పదు.
అమ్మనాన్నలుగా మనం చదువు-ఉద్యోగానికి మించి ఎందుకు ఆలోచించంఎల్ల కాలం మన పిల్లలు ఒకరి క్రింద పని చేయాలని మనం ఎందుకు ఆశిస్తాము. ప్రాపంచిక విద్య ను నేర్పే తల్లిదండ్రుల ధోరణి ఎలా ఉన్నా ధార్మిక విద్యను చదివించే మన బుద్ధులకు ఏమయింది? 'ఎవరి దగ్గరయినా ఉద్యోగం చేయాల్సి వచ్చినా పని నేర్చుకోవడానికే చే యాలి. ఆ పనిలో పరిపూర్ణతను సాధించాక రెక్కలు వచ్చిన పక్షివి నువ్వు! ఎంత దూరం వెళ్లగలవన్నది నీ ఇష్టమ. ఎంత పైకి ఎగరగల వన్నది నీ ధైర్యంఅని మనం మన పిల్లలకు ఎందుకు బోధించముపిల్లల పెంపకంలో ఆధ్యాత్మిక వికాసమూ ఓ ముఖ్య భాగమే.ధర్మం గురించిధర్మనిర్వహణ గురించీ బాల్యంనుండే నూరిపోయాలి. ఈ ఆధ్యాత్మిక అక్షరాభ్యాసం ఎంత తొందరగా జరిగితే అంతే మంచిది. ఇక కన్నవారు నేర్పించినానేర్పించకపోయినా పిల్లలుగా వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విష యాలు కొన్నుంటాయి. ఎందుకంటే అందరు తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా అధ్యాపక స్థాయి కి చెందిన వారు కాలేరు గనక.
 భయం యువత ప్రధమ శత్రువు. పిరికివాడు గొప్ప ఆలోచనల జోలికి వెళ్ళడు. ఆలోచనలు గొప్పవిగా లేనప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం ఏమంత గొప్పగా ఉండదు.  సలహాలుసంప్ర తింపులు ప్రతి విషయంలోనూ అవసరమే. కానీవారి ప్రతిభాపాటవాలుశక్తిసామర్థ్యాల గురించి తెలిసిన వారి సలహాలు మాత్రమే తీసుకోవాలి. ''ఒకవేళ మీకు తెలియకపోతే జ్ఞానం గలవారిని అడిగి తెలుసుకోండి''.  అల్లాహ్  ఇలా ఎందుకు చెప్పాడంటేదారిన పోయే దానయ్యలందరూ ఆధ్యాత్మిక గురువు లు కాలేరు గనక. బద్ధకం మహా ప్రమాద కారి. సమర్థునికిఅసమర్థునికి మధ్య గల వ్యత్యాస రేఖ ఒక్కటే - 'కష్టమే కాని సాధ్యంఅంటాడు సమర్థుడు. 'సాధ్యమే కాని కష్టంఅంటాడు అసమర్థుడు. కాబట్టి 'నావల్ల కాదు,  నేను చేయలేనేమోఅంత స్థోమతస్థాయిశక్తి నాకు లేదుఅన్న నిరాశభరిత నిస్పృహల కు స్వస్తి పలికిఆ స్థాయిస్థోమతశక్తి ఎలా వస్తుందో ఆలోచించాలి.  దురలవాట్లుదుర్వ్య సనాలుదురాలోచనలుధరాలోభంధన దాహంలోభంమోహంమదంమత్సర్యా లు ధార్మిక విద్యార్థిని దుర్మార్గునిగా పిరికివాని గా తయారు చేస్తాయి. కుబేరుల గుమ్మం దగ్గర చేతులు జోడించి నిలబడే (?) స్థాయికి దిగజార్చుతాయి. పోతే కోపం పతనానికి తొలి మెట్టు. ఈ కారణంగానే 'మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని మట్టి కరిపించివాడు కాదు బలవం తుడుకోపం వచ్చినప్పుడు తన కోపాన్ని నిగ్ర హించుకున్న ధీరశాంతుడే సిసలైన బలశాలిఅని ప్రవక్త మహనీయులు (స)వారు చెప్పారు.
'ధార్మికంగా జీవించడం చాలా కష్టంఅన్న నిరాశజనితమైనది. ధార్మికంగా జీవించడం అంటే కోర్కెల్ని చంపుకొని బ్రతకడం కాదు. ధార్మికంగా నడుచుకుంటూ జీవితంలోని మక రందాన్ని గ్రోలుతూనూటికి నూరు శాతం ఆనందిస్తూనేకోర్కెలకు ఎక్కడ కళ్ళెం వేయా లో అక్కడ మాత్రమే వేయాలి. కోర్కెల్ని అదుపు లోపొదుపులో పెట్టుకోవాలన్నది త్యాగం కాదు. అలా అని మడి కట్టుకు కూర్చోమని ధర్మం ఉపదేశించదు. దైవానికి బాగా ఇష్టమ యిన పనుల కోసంమన దేహాలకు సుఖాన్ని కాకుండామన ఆత్మలకు శాంతాన్నిఆనం దానిచ్చే కార్యాల కోసం మన స్థోమత కొద్దీ  ఖర్చు పెట్టవచ్చు.  అదే సమయంలో ధర్మం అంగీకరించనిఅభిలషణీయం కాని వాటి విష యంలో ధర్మం ఎన్ని ఆంక్షలు విధించినా విసుగు చెందాల్సిన అవసరం లేదు. లోకులు ఏమనుకుంటారో,  బంధువులు ఏమనుకుం టారో అన్న సంశయమే ఉండ కూడదు. భూ మ్యాకాశాలంతటి సువిశాలమయిన స్వర్గవనా లలో విహరించాలన్నది మన ఆకాంక్ష అయితే దైవాదేశాలనుదైవప్రవక్త (స) వారి సంప్రదా యాలను మాత్రమే ఆచరణలో పెట్టాలి.'గొప్ప ఆలోచనలుగొప్ప కార్యాలన్నీ అవహేళతోనే మొదలవుతాయిఅన్న విషయాన్ని విస్మరించ కండి. సున్నత్‌ స్వర్ణ సౌధాలు నిర్మించాలి. బిద్‌అత్‌లకు గోరీ కట్టాలి. అధిక శాతం విగ్ర హారాధనసమాధుల ప్రదక్షిణఫాతెహాలపది మంది స్త్రీల కహానీలపుక్కిటి పురాణాల సమాజంలో ధర్మాన్ని ఇంత నిష్టగా పాటిస్తే   నలుగురు నవ్విపోతారేమో అన్న అర్థం లేని సంకోచాలు వద్దు. మన ఆర్థిక పరిస్థితులు అనుకూలించినాప్రతికూలించినా మనం మాత్రం ధర్మానికిన్యాయానికి కట్టుబడి జీవిం చాలి.  స్వర్గశిఖర భాగాన్ని అధిరోహించిసత్యప్రవక్త సహచర్యాన్ని సొంతం చేసుకొనిసత్యప్రభువు దివ్య దర్శనంతో పునీతులం అవ్వాలనుకునే మనకు ఎవరో గేలి చేస్తారన్న చింత ఎందుకు?
చిత్తశుద్ధి ప్రాధాన్యతా క్రమంలో మనల్ని మనం వర్గీకరించుకోవాలి. మనం చేసే ప్రతి కార్యంఖర్చు పెట్టే ప్రతి పైసా..మనకు ఆత్మా నందాన్నివ్వాలి. అలా ఇవ్వలేనప్పుడు ఎందుకు అలా లేదో ఆత్మపరిశీలన చేెసుకోవాలి. కటిక దారిద్య్రంలో ఉన్నా ధర్మాన్ని చీదరించుకోకూ డదు. ధార్మిక విద్య వల్ల ఒనగూడేదేమి లేదం టూ చులకన చేసి మాట్లాడకూడదు. 'దినార్‌ దిర్హమ్‌ లేెనోడు కాదు దరిద్రుడుధర్మం లేనో డుధర్మప్రకారం బ్రతకనోడు సిసలయిన దరిద్రుడుఅన్న ప్రవక్త (స) వారి మాటను సదా గుర్తుంచుకోవాలి. 'ధార్మిక విద్యార్థి పాదా ల క్రింద దైవదూతలు తమ రెక్కల్నిపరుస్తారు. సృష్టిలోని ప్రతి ప్రాణి అతని కోసం దుఆ చేస్తుందిఅన్న విషయాన్ని విస్మరించకూడదు. మనం ధర్మ పరిధిలో దేన్ని కోరుకున్నాఅది జన్నతుల్‌ ఫిర్‌దౌసిల్‌ ఆలా అయినా సరేబలంగా కోరుకోవాలి. దాన్ని నిజం చేయడా నికి యావత్తు సృష్టీ ఏకమవుతుంది.
అంతిమంగా ఒక విన్నపం - మన జీవితంలో చివరి నిమిషం మనల్ని నిజంగా ప్రేమించే వారు ఎంత మంది ఉంటారుఅని సమీక్ష జరుపుకోవాలి. ఎంత ఎక్కువ మంది ఉంటే మనమదేస్థాయి విజేతలం. మన పిల్లల్నిమనం బద్ధకస్థులుగానిరాశావాదులుగా తయారు చేయకూడదు. వారి జీవితాన్ని వారు నిర్మించు కోగలరన్న స్థాయికి వారిని చేెర్చాలి. సమస్య కంటే తామే శక్తిమమంతులమని వారు నమ్మాలి. సవాళ్లలోను అవకాశాల్ని వెతుక్కో వాలి. అవసరమయితే పద్దతిని మార్చుకోవాలే గానీ మార్గం తప్పకూడదు. ఎందుకంటే వైఫ ల్యం కూడా ఒంటరిగా రాదుఅద్భుతమయిన అవకాశాలను వెంటేసుకుని మరీ వస్తుంది. అయితే ఆ సమయంలో నిరాశ నిస్పృహలలో నిండా మునిగి ఉంటాము గనక వాటిని గమ నించము. ధర్మ మార్గంలో జీవిస్తూ కట్టుబట్ట లతో నడి బజారులో నిలబడాల్సి వచ్చినా సరే వైఫల్యాన్ని అంగీకరించకూడదు. ఎందుకంటే మన అనుమతి లేకుండా మనల్ని ఏదీఎప్పుడూ ఓడించలేదు. మేమోడిపోయామని మనం అనుకుంటే తప్ప. చివరిగా -ఆధ్యాత్మిక నటన మహా ప్రమాదకారి. పామరుల నుంచి పండి తుల దాకా.ఇది అందరికీ వర్తించే బహిరంగ హెచ్చరిక!    

ప్రముఖ హదీసువేత్తలు

1.ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (రహ్మలై)
 ధార్మిక జగత్తులో పీష్వాలుగామార్గదర్శకులుగా పరిగణింబడే నలుగురు ఇమాములో ఈయన ఒకరు. ఈయన అసలు పేరు అబూ అబ్దుల్లాహ్  అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ బిన్‌ హంబల్‌ షైబానీ. హిజ్రీ 174వ సంవత్సరం రబీవుల్‌ అవ్వల్‌ నెలలో జన్మించారు. హిజ్రీ 241, రబీవుల్‌ అవ్వల్‌ నెల 12వ తేదీ శుక్రవారం నాడు బాగ్దాద్‌లో కాలధర్మం చెందారు. ధర్మమార్గంలో కఠినాతికఠినమైన పరీక్షల్ని ఎదుర్కొనికదలని కొండలా స్థయిర్యాన్ని ప్రదర్శించిన గొప్ప విద్వాంసులు. ఈయనకు 10లక్షల హదీసులు కంఠస్థం అయి ఉండేవి. ఈయన మరణించిన రోజున 20వేల మంది క్రైస్తవులుయూదులుపారసీకులు ధర్మపరివర్తన చెంది ఇస్లాం పరిధిలోకి వచ్చారని అనబడుతోంది.
2. ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ (రహ్మలై)
 హదీసు విద్యలో ఈయన హదీసువేత్తలందరికీ ఇమామ్‌గా పరిగణించబడతారు. పూర్తి పేరు అబూ అబ్దుల్లాహ్  ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ బిన్‌ ముగీరా బిన్‌ బర్దిజ్బాహ్  జూఫీ బుఖారీ. ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారాలో హిజ్రీ 194వ సంవత్సరం షవ్వాల్‌ మాసంలో జన్మించారు.
హదీసుల సంకలనం కోసం ప్రపంచంలో విస్తృతంగా పర్యటించారు. హదీసు విద్యకు సంబంధించినంత వరకు ఈయన 'దేవుని చిహ్నం'గా భావించబడేవారు. ఆయన సంకలనం చేసిన హదీసు గ్రంథం ''అల్‌ జామె అస్సహీహ్ '' దివ్య ఖుర్‌ఆన్‌ తరువాత ఇస్లాం జగత్తులో అత్యంత ప్రామాణికమైన గ్రంథంగా పరిగణించబడుతోంది. ఈయన హిజ్రీ 256వ సంవత్సరం ఈదుల్‌ ఫిత్ర్‌ రాత్రి సమర్‌ఖండ్‌లో తనువు చాలించారు.
3.ఇమామ్‌ ముస్లిం బిన్‌ హజ్జాజ్‌ (రహ్మలై)
 ఈయన ప్రఖ్యాత హదీసు ఇమాములలో ఒకరు. పూర్తిపేరు ముస్లిం బిన్‌ హజ్జాజ్‌ ఖుషైరీ నీసాపూరీ. ఈయన హిజ్రీ శకం 204లో మష్‌హద్‌ నగరానికి సమీపంలో వున్న నీసాపూర్‌ పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఈ స్థలం ఈరాన్‌లో ఉంది. ఈయన సంకలనం చేసిన 'సహీహ్‌ా ముస్లింగ్రంథం ప్రపంచంలో 'సహీహ్  బుఖారీతరువాత రెండో ప్రామాణిక హదీసుల సంకలనంగా పరిగణించబడుతు న్నది. ఈయన ఇమామ్‌ బుఖారీతో సహా అనేకమంది అగ్ర ఇమాముల ద్వారా హదీసులు విన్నారు. హదీసు విద్యార్జన కోసం ఇరాఖ్‌హిజాజ్‌ ప్రాంతాలలో పర్యటించారు. హిజ్రీ 271లో మరణించారు.
4. ఇమామ్‌ అబూదావూద్‌ సులైమాన్‌ బిన్‌ అష్‌అస్‌ (రహ్మలై)
 ఎన్నదగ్గ హదీసువేత్తలలో ఈయన కూడా ఒకరు. పూర్తి పేరు అబూదావూద్‌ సులైమాన్‌ బిన్‌ ఇస్‌హాఖ్‌ అజ్‌దీ సజిస్తానీ. 'సుననె అబూదావూద్‌ఈయన విరచితమే. ఈయన హిజ్రీ 276 షవ్వాల్‌ నెల 15వ తేదీ శుక్రవారం నాడు తన నిజప్రభువు వద్దకు చేరుకు న్నారు. హదీసు విద్యలో సాటిలేని మేటి. ఈ విద్య ఆయనకు కొట్టిన పిండి అనీహజ్రత్‌ దావూద్‌ అలైహిస్సలాం ముందు ఉక్కు ఎలా మెత్తబడిపోయిందో అలాగే హజ్రత్‌ అబూదావూద్‌ ముందు హదీసు విద్య సులువై పోయిందని మేధావులు కొనియాడారు. మహాప్రవక్త (స) వారి ఐదు లక్షల ప్రవచనాలను తాను లిఖించా ననీతాను వ్రాసిన సునన్‌ గ్రంథంలోని హదీసులు ఆ ఐదు లక్షల హదీసుల్లో కొన్ని మాత్రమేనని ఆయన అంటుండేవారు.
5. ఇమామ్‌ అబూ ఈసా ముహమ్మద్‌ బిన్‌ ఈసా తిర్మిజీ (రహ్మలై)
 ఇమామ్‌ బుఖారీ (ర) గారి శిక్షణలో పోత పోయబడిన ప్రియ శిష్యులలో ఇమామ్‌ తిర్మిజీ ఒకరు. ఉజ్బెకిస్తాన్‌లోని తిర్మిజ్‌  అనే పట్టణంలో హిజ్రీ 209లో జన్మించారు. 'జామె తిర్మిజీఅనే గ్రం థాన్ని సంకలనం చేశారు. ఇందులో సుమారు 4 వేల హదీసులు న్నాయి. తన గురువర్యులైన ఇమామ్‌ బుఖారీ (ర) మరణంపై ఈయన అమితంగా దుఖించారు. ఆ దుఖంలోనే ఆయన కంటి చూపు పూర్తిగా పోయింది. చాలా కాలం పాటు అంధులుగానే ఉండిహిజ్రీ 279లో తన నిజ నేస్తాన్ని చేరుకున్నారు.
 6. ఇమామ్‌ అబూ అబ్దుర్రహ్మాన్‌ అహ్మద్‌ బిన్‌ షుఐబ్‌ నసాయి (రహ్మలై)
 ఖురాసాన్‌లోని 'నసాపట్టణంలో హి.శ. 215లో ఇమామ్‌ నసాయి పుట్టారు. హదీసు విద్యలో నిష్ణాతులు. హదీసులను కంఠ స్థం చేసుకోవటంలో దిట్ట. అందుకే హాఫిజె హదీస్‌గా పిలువ బడ్డారు. సహీహ్  బుఖారీసహీహ్  ముస్లిం గ్రంథాల తరువాత చాలా తక్కువ బలహీన (జయీఫ్‌) ఉల్లేఖనాలు గల హదీసు సంక లనాల్లో ఇమామ్‌ నసాయి గారి 'సునన్‌ఒకటి. ఈయన ఈజిప్టు లో కొంత కాలం స్థిరపడిన తరువాత డెమాస్కస్‌కు ప్రస్థానం చేశారు. అక్కడి నుంచే ''అల్‌ ఖసాయిస్‌ ఫీ ఫజ్లె అలీ -రజి'' అనే రచన చేశారు. దీనిపై తీవ్ర విమర్శల వెల్లువ పెల్లుబికింది. విమర్శ కులు ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం ఆయన మక్కా నగ రానికి చేరుకున్నారు. మక్కాలోనే హి.శ. 303లో తనువు చాలిం చారు.
7. ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ మాజా (రహ్మలై)
 ఇబ్నె మాజాగా సుప్రసిద్ధులు. హి.శ. 207లో ఖజ్వీనీలో జన్మించారు. ఈయన సునన్‌ అను గ్రంథాన్ని రచించారు. ఈయన ఇమామ్‌ మాలిక్‌ సహవాసుల నుండి హదీసులను విన్నారు. ఇమామ్‌ మాలిక్‌ శిష్యునిగా అధ్యయనం చేశారు. ఈయన ద్వారా భారీ సంఖ్యలో జనులు హదీసులను ఉటంకించారు. ఈయన హదీసులలో బలహీన (జయీఫ్‌) ఉల్లేఖనాలు అనేకం ఉన్నాయి. ఇమామ్‌ ఇబ్నె మాజా హి.శ. 273 రమజాన్‌ నెలలో మరణించారు.

ఇల్లు ఆనందాల హరివిల్లవ్వాలంటే....

బాబుల్‌కి దుఆఁయేఁ లేతీ జా
తుర్‌­కో సుఖి సంసార్‌ మిలే
మైకేకి కభీ నా యాద్‌ ఆయే
ససురాల్‌మే ఇత్నా ప్యార్‌ మిలే
హోఁటోఁపె హన్సీకి ధూప్‌ ఖిలే
మాథేపె ఖుషీగా తాజ్‌ రహే
కూతురి ఇల్లు ఆనందాల హరివిలవ్వాలని కోరుకోని  తల్లిదండ్రులుండరు. ఇది ప్రతి తల్లి దండ్రుల కలఆశఆశయం కూడా. వారి ఈ కల ఫలించాలంటే వారి దీవెనలతోపాటు వధువుగా వెళుతున్న కూతురిలో సయితం కొన్ని ఉత్తమ లక్షణాలు ఉంటేనే అది సాధ్య మవుతుంది. ఆ మేరకు దోహదపడే కొన్ని విషయాలను తెలుసకుందాం!
 భార్యాభర్తలు ఒండొకరి పట్ల గౌరవమర్యాదలు కలిగి ఉండాలనిఒండొకరి బావోద్వేగాలను అర్థం చేసుకుని మసలుకోవాలని. మన్నింపుల వైఖరి అవలంబించాలని ఇస్లాం హితవు చేస్తోన్ది. పూర్వ కాలం నుండి అన్ని సమాజాల్లో నూ ఉన్న సంప్రదాయం ఏమిటంటేకూతురి ని పెళ్ళి చేసి భర్త ఇంటికి సాగనంపేటప్పుడు తల్లులు తమ కుమార్తెలకు భర్త పట్ల కలిగి ఉండవలసిన గౌరవమర్యాదల గురించి మరియు అతని పట్ల చూపించవలసిన శ్రద్ధ గురించి నొక్కి వక్కాణించేవారు. ప్రాంతంసంప్రదాయాన్ని బట్టి ఆ హితవు ఉత్తమంగా నూఅత్యుత్తమంగాను ఉండేది. అటువంటి ఓ తల్లి హితోపదెశాన్ని ఇక్కడ పొందు పరుస్తు న్నాము. నిజంగా ఆ మాతృమూర్తి మాటలు ముత్యాలే!
ఆమె భర్త పేరు ఔఫ్‌ బిన్‌ ముహల్లమ్‌ ఆష్‌ షైబానీ. ఈయన ఆరబ్బుల్లో గొప్ప వంశానికి చెందిన కీర్తిప్రతిష్టలు గల నాయకుల్లో ఒకరు.  ఆయన సతీమణి మహా గొప్ప వివేకం గల మహిళ. ఆమె తన కూతురిని సాగనంపుతూ ఇలా హితవు పలికింది: ఓ నా గారాలపట్టీ! నీవు గొప్ప వంశానికి వార సురాలివి మరియు మంచి నడవడిక కలదాని వి కాబట్టి ఈ సలహా నీకు అవసరమా?అంటేఅవసరమే అంటాను. ఎందుకంటే ఈ సుగు ణాలు నీలో పుష్కలంగా ఉన్నాయని నాకు తెలుసు. కాని మరచిపోయిన పాఠాన్ని జ్ఞాప కం చేసినట్లుగానుగుర్తుంటేసలహాగాను ఉంటుందుందని నేనీ మాటలు చెబుతున్నాను. నా ఈ మాటలను మూట కట్టుకో. ఓ నా చిట్టి తల్లీ! తన తండ్రి ఐశ్వర్యవంతుడు అన్న ధీమాతో భర్త లేకుండా ఓ స్త్రీ అన్నీ చేసు కోగలిగితే మేమంతా భర్త లేకుండానే అన్ని చేసుకోగలిగేవాళ్లము. వాస్తవంగా స్త్రీలుపురుల కోసంపురుషులు స్త్రీల కోసం సృష్టించబడ్డారు. కనుక వివాహం అనేది ఓ అనివార్య అంశం.
ఓ నా చిట్టి తల్లీ! నీవు ఏ ఇంటిలో పెరిగావోఎక్కడ నడకనడవడిక నేర్చుకున్నావో ఆ పరి చయ ప్రాంతాన్ని వదిలి తెలియని చోటుకి వెళుతున్నావు. నీకు అంతకు ముందు పరిచ యం లేని ఓ సహచరునితో నీ జీవితాన్ని పంచుకోబోతున్నావు. అతనితో కలిసి బ్రతికేం దుకు బయలుదేరుతున్నావు.నిన్ను మనువాడటం ద్వారాఅతడు నీకు యజమాని అయ్యాడు కాబట్టి అతని వద్ద నీవు సేవకురాలి వలే ఉండెఅతను నీకు సేవకుడి గా మారతాడు.
నేను నా స్వహస్తాలతో పొదిగిన ముత్యాల హారాన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను. అది నీకో జ్ఞాపిక మరియు మార్గదర్శి కూడా. మొదటి ముత్యం: నీవు నీ భర్త సహచర్యం లో తృప్తి ఉండు. సర్దుకుపోయే గుణం నీలో ఉండాలి. నీ భర్త మాటఆదేెశం పట్ల విధే యత కలిగి ఉండు.
రెండవ ముత్యం: సంతృప్తి మనశ్శాంతిని స్తుంది. అసంతృప్తి అనర్థాలను సృష్టిస్తుంది. అలాగే భార్య భర్త పట్ల విధేయత కలిగి ఉండ టం అల్లాహ్‌ాను రాజీ పరుస్తుంది.
మూడవ ముత్యం: నీ భర్త నీ నుండి సువా సన పరిమళాన్ని ఆఘ్రాణించాలేగానీదుర్వా సన ఆనవాళ్ళు నీలో కనబడకూడదు.
నాల్గవ ముత్యం: నీవు సదా అతని ముందర అందంగాసుకుమారంగా ఉండేందుకు ప్రయ త్నించు. నీ దుస్తుల్లోగానీమాటనడవడికలో గానీ అతను ఎలాంటి వికారాన్ని చూడకూ డదు. కాటుక అలంకరణని పెంచుతుందని గుర్తుంచుకో.
అయిదవ ముత్యం: భోజన సమయానికి రుచికరమయిన వంటకాలను అతని కోసం సిద్ధ పరచి ఉంచు. (అతను భోంచేసేంత వరకు ఇంటి విషయాలుబైటి వ్యవహారాల గురించి చర్చించకు.)
ఆరవ ముత్యం: అతను విశ్రాంతి తీసుకునే సమయంలో ఎలాంటి అలికిడి కాకూండా చూసుకో. ఆకలి తీవ్రత మండుతున్న జ్వాల వంటదయితేనిద్రాభంగం కోపాన్ని తెప్పించే విషయం అని మరువకు.
ఏడవ ముత్యం: అతని నౌకర్లు మరియు సంతానం పట్ల శ్రద్ధ వహించు. అతని సంద నుసంసారాన్ని చక్కబెట్టు.
ఎనిమిదవ ముత్యం: నీవు అతని సంపద విషయంలో తీసుకునే జాగ్రత్త నిన్ను అతను

మెచ్చుకునేలా చేస్తుంది. నీవు అతని సంతానం నౌకర్ల విషయంలో చూపే శ్రద్ధ నీలోని ప్రతిభను అతను గుర్తించేలా చేస్తుంది.
తొమ్మిదవ ముత్యం: నీవు నీ భర్త రహస్యా లను ఎన్నటికీ బయట పెట్టకు. అతని ఆజ్ఞ ఉల్లంఘనకు పాల్పడకు.
పదవ ముత్యం: నీవు అతని రహస్యాలను బహిర్గతం చేస్తే అతనికి చేెసిన ద్రోహ భావం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీవు ఆతని ఆజ్ఞ ఉల్లంఘనకి పాల్పడితే అతని హృదయం లో నీ పట్ల ద్వేషభావం చోటుచేసుకుంటుంది.
ఓ నా చిట్టి తల్లీ జాగ్రత్త! అతడు విచారంగా ఉన్నప్పుడు అతని ముందు సంతోషాన్ని ప్రదర్శి ంచకు. అతను సంతోషంగా ఉన్నప్పుడు అతని  ముందు విచారాన్ని కనబర్చకు. ఎందుకంటే మొదటిది యుక్తాయుక్తాల జ్ఞానలేమిని సూచిస్తేరెండవది - బాధ కలిగిస్తుంది.
నీకు సాధ్యమయిన స్థాయిలోరీతిలో అతని పట్ల గౌరవభావం కలిగి ఉండు. నీకు వీలయి నంతగా అతనికి అనుకూలంగా మసలుకో.  అప్పుడు నీ సహచర్యంనీతో సంభాషణ అతనికి ఆనందాన్నిస్తుంది. తద్వార మీరిరు వురు జీవిత మకరందాన్ని తనివితీరా ఆస్వా దించవచ్చు.
తెలుసుకో ఓ నా చిట్టి తల్లీ! నీ సంతోషంకన్నా ముందు అతని సంతోషానికి ప్రాధాన్యతనివ్వు. నీ కోరికలకు ముందు అతని కోర్కెలకు ప్రాముఖ్యతనివ్వు.
ఈ తల్లి చేసిన ఈ మహోపదేశాల్ని తూచా తప్పకుండా పాటించిన ఆ కూతురి కడుపున జన్మించినవారు తర్వాత రాజులై పరిపానా పగ్గాలు చేపట్టారు. అందుకే పెద్దలన్నారు:'ప్రతి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది'' అని.

పౌరుషం

         పౌరుషం
పౌరుషం అంటే -మనిషితన వ్యక్తిగత విషయంలో అనవసరంగా ఇతరులు జోక్యం చేెసుకోవడం చూసి  కోపంతో రగిలిపోవడాన్ని పౌరుషంరోషం అంటారు. పౌరుషం అనేది ఇటు సమాజ నిర్మాణంలోనూకుటుంబ జీవనంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారణంగానే ఇస్లాం ఈ గుణాన్ని ప్రత్యేకించి పేర్కొంటుంది. సయీద్‌ బిన్‌ జైద్‌ (ర) గారి కథనం - దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా సెలవిచ్చారు: ''తన ఆస్తిపాస్తుల్ని కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి షహీద్‌. తన ఆత్మ రక్షణ కోసం మరణించిన వ్యక్తి షహీద్‌.   తన ధర్మాన్ని కాపాడుతూ హత్యకు గురయిన వ్యక్తి షహీద్‌. తన (మానాన్ని) ఇంటివారిని కాపాడుతూ హతుడయిన వ్యక్తి షహీద్‌''.
ప్రవక్త (స) వారి ప్రవచనంలో పేర్కొనబడిన నాలుగు సందర్భాల్లో నూ పౌరుషమే మనిషి ని ప్రాణాన్ని సయితం పణంగా పెట్టి తన తనాన్ని,  మానాన్నిధనాన్నిధర్మాన్ని కాపా డుకునేలా ప్రేరేపించింది అన్నది నిర్వివా దాంశం. అంటే సహేతుకమయిన పౌరు షం మనిషికి ఇహలోకంలోనే కాదు పర లోకంలో సయితం 'షహీద్‌వంటి గొప్ప స్థానాన్ని ప్రసాదిస్తుంది.
పౌరుషానికి సంబంధించిన ఆదేశం:
పౌరుషం అనేది తన స్థానంలో సమతౌ ల్యాన్ని పాటించినంత కాలం ఇటు స్త్రీలకు అటు పురుషులకు - ఇరువురికీ ప్రయోజన కరమైన మంచి లక్షణమే. మంచి సహ చర్యం అనేది పౌరుషాన్ని కొరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా దంపతులిద్దరు ఒండొకరి పౌరు షాన్ని గుర్తించిగౌరవించి రాజీ పర్చుకునే రీతిన వ్యవహరిస్తే ఆ ఇల్లు ఆనందాల హరి విల్లవుతుంది. ఇదిలా ఉంటేఅర్థం లేని పౌరుషం ఏది అన్న విషయానికొస్తేదైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ''నిశ్చయంగా ఒక రకం పౌరుషాన్ని అల్లాహ్  ఇష్టపడతాడు. మరో రకం పౌరుషాన్ని అల్లాహ్  అసహ్యించుకుంటాడు. మరియు బార చాచి నడవటంలోని ఒక రకాన్ని అల్లాహ్  ఇష్ట పడతాడు. మరో రకాన్ని అసహ్యించుకుంటాడు. తగు కారణం ఉండి మనిషి పౌరుషానికి లోను కావడం అల్లాహ్ కు ఎంతో ఇష్టం.
 ఏ కారణం లేకపోయినా కేవలం ఊహాగానాలకు పోయిలేనిపోని అను మానాలు పెంచుకుని పౌరుషంతో రగిలిపోవడం అల్లాహ్‌ాకు సుతరామూ ఇష్టం లేదు. ఇక బార చాచి నడవడం అనేది - ధర్మోన్నతి కోసం పోరాడు తూదానధర్మాలు చేస్తూ గనక జరిగితే అది అల్లాహ్‌ాకు ఎంతో ప్రియం. అహంకారానికిదురభిమానానికి లోనై వ్యతిరేక భావావేశాలతోనకారాత్మక ధోరణితో బార చాచి నడవటాన్ని అల్లాహ్‌ా ఎంత మాత్రం ఇష్ట పడడు''.
 (ముస్నద్‌ అహ్మద్‌) 
అల్లాహ్  మహా రోషగాడు:
దైవప్రవక్త (స) వారితో ఇలా ప్రశ్నించడం జరిగింది. ''భర్త తన భార్యను మరో పురుషునితో (సంభోగిస్తూ) గనక చూస్తే ఏం చేయాలి?'' అందుకు దైవప్రవక్త (స) ''నలుగురు ప్రత్యక్ష  సాక్షుల్ని ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది'' అన్నారు. ఇదే విషయం తర్వాత కొందరు సహాబాల ముందు ప్రస్తావించిన ప్పుడు సహజంగానే పౌరుషం గలవారైన హజ్రత్‌ సఅద్‌ బిన్‌ ఉబాదా (ర) గారు - ఇది విని 'ఒక వేళ నేనే గనక నా భార్యను పరాయి పురుషునితో చూస్తే అక్కడికక్కడే అతన్ని కరవాలంతో నరికి పోగులెడతానుఅన్నారు. ఈ వార్త ప్రవక్త (స) వారికి అందినప్పుడు ఆయన ఇలా అన్నారు: ''సఅద్‌ పౌరుషాన్ని చూసి మీరెందుకు అంతగా ఆశ్చర్యపోతున్నారుఅల్లాహ్  సాక్షి! నేను అతనికన్నా ఎక్కువ పౌరుషం గలవాడను. మరి నాకన్నా మించిన పౌరుషం అల్లాహ్‌ాది. ఆయన మహా రోషగాడు. ఈ కారణంగానే అల్లాహ్  బహిరంగమైనగోప్యమయిన సకల అసభ్యఅశ్లీలతలను నిషేధించాడు'' అని చెప్పారు. (బుఖారీ)
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ''బాహాటంగానూగొప్యంగానూ చేసే సిగ్గుమాలిన పనులనుపాపంతో కూడుకున్న ప్రతి విషయాన్నీఅన్యాయంగా ఒకరి మీద దుర్మార్గానికి ఒడిగట్టడాన్ని - సకల విధమయినటువంటి చెడు కార్యాలను నిశ్చయంగా నా ప్రభువు నిషేధించాడని (ఓ ప్రవక్తా!) ప్రజలకి తెలియ జెయ్యి''. (ఆరాఫ్‌: 33)
మరో హదీసులో ఇలా ఉంది: ''అల్ల్లాహ్ కు పౌరుషం వస్తుంది. విశ్వాసికి కూడా పౌరుషం వస్తుంది. అయితే అల్లాహ్  విశ్వాసికన్నా మహా గొప్ప రోష గాడు''. (బుఖారీముస్లిం)
పోతేఅల్లాహ్‌ాకు కోపాన్ని తెప్పించే చర్యలుఏవంటే, ''అల్లాహ్  నిషేధించిన వాటికి దాసుడు పాల్పడటం అనేది ఆయనకు పౌరుషాన్ని తెప్పిస్తుంది''. అని ప్రవక్త (స) వారు సెలవిచ్చారు.  (బుఖారీ)
 బైబిల్‌లో నిర్గమకాండలో ఇలా ఉంది: ''నీ దేవుడయిన యొహోవా ను నేనే....నేను తప్ప  వేరొక దేవుడు నీకు ఉండ కూడదు. పైన ఆకాశమందేగాని క్రింద భూమియందేగాని భూమి క్రింద నీళ్ళ యందేగాని  యుండు దేని రూపమునయినను విగ్రహమునయిన ను నీవు చేసికొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యొహోవానగు నేను రోషము గల దేవుడను''. (నిర్గమకాండ - 20: 3-5)
 దాసుడు బాహాటంగానూరహస్యంగానూ చేసే దుష్కార్యాల్లో పరమ నీచమయిన కార్యం విగ్రహారాధనబహుదైవారాధన. అల్లాహ్  దాసుడి వల్ల జరిగే ఏ పాపాన్నయినా క్షమిస్తాడుగానీబహుదైవారాధనషిర్క్‌ను క్షమించడు. దుర్మార్గాల్లోకెల్లా అత్యంత తీవ్రమయినఘోరాతిఘోరమయిన దుర్మార్గం ''నిశ్చయంగా షిర్క్‌ - బహుదైవారాధనే'' అని ఆయనే స్వయంగా సెలవిచ్చి ఉన్నాడు. దాన్నే మనం దాంపత్య జీవితంలో స్వామి ద్రోహం అనంటాము.
 షిర్క్‌ తర్వాత అల్లాహ్ కు పౌరుషాన్ని తెప్పించే విషయం వ్యభి చారం. ప్రతి శుక్రవారం మనం ప్రసంగ వేదికల నుండి వింటూ వస్తున్న ఆదేశం ఎంత మహోత్కృష్టమైనదో చూడండి: ''ఇన్నల్లాహ యామురు బిల్‌ అద్లి వల్‌ ఇహ్సాన్‌....'' దీనర్థం ఏమిటో తెలుసా? ''నిశ్చయంగా అల్లాహ్  న్యాయం చేయమనిఉపకారం చేయమనీఉదారంగా వ్యవహరించమనీబంధువుల హక్కులను నెరవేర్చ మనీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా - నీతి బాహ్యమయిన పనుల నుండీసకల విధమయినటువంటి చెడుల నుండీఅన్ని విధాల దౌర్జన్యం నుండీ ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహిం చడానికి ఆయన స్వయంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు''.  (నహల్‌: 90)
 ఓ సారి సూర్యగ్రహణం అయింది. అప్పుడు దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఒక సుదీర్ఘమయిన ఉపన్యాసం ఇచ్చారు. అందులో ఆయన (స) ఇలా అన్నారు: ''ఓ ముహమ్మద్‌ (స) సముదాయమా! అల్లాహ్  సాక్షి! అల్లాహ్ కు మించిన రోషగాడు ఎవడూ లేడు. తన దాసుడు తన దాసితో వ్యభిచరించడంఅక్రమ సంబంధం పెట్టుకోవడం ఆయనకు మహా పౌరుషాన్ని తెప్పిస్తుంది. ఓ ముహమ్మద్‌ (స) సముదాయామా! నాకు తెలిసిన విషయాలు మీకు తెలిసి ఉంటే మీరు చాలా తక్కువగా నవ్వేవారు. చాలా ఎక్కువగా ఏడ్చేవారు''. (బుఖారీ) 
  మరో సందర్భంలో ఆయన ఇలా హెచ్చరించారు: ''(విశ్వాసి) దాసుడు వ్యభిచరించేటప్పుడు విశ్వాసం (ఈమాన్‌) అతన్నుంచి వేరయి పోతుంది. ఆ చెడు కార్యం నుండి బైట పడేంత వరకు విశ్వాసం అతని వద్దకు తిరిగి రాదు. ఆ అశ్లీల చేష్ట నుండి బైట పడిన మీదటే అది అతన్ని సమీపిస్తుంది''. (మిష్కాత్)
అంటేపౌరుషం విశ్వాసాని (ఈమాన్‌)కి సయితం వస్తుంది. ఈ కారణం వల్లనే ఆ నీతిమాలిన చర్యకు దాసుడు పాల్పడుతున్నంత కాలం అది అతన్నుండి దూరంగా ఉంటుంది. ఇది ఎంత దౌర్భాగ్య స్థితియో ఒక్కసారి ఆలోచించండి!
ఓ సారి యూదుల రాయమారి ఒకడు దైవప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి -  'మీరు తీసుకొచ్చిన స్పష్టమయిన సూచనలుఆదేశాలు ఏమిటి?' అని ప్రశ్నించాడు. అందుకు సమాధానం ఇస్తూ ''మీరు అల్లాహ్తో పాటు ఇతరుల్ని భాగస్వాములుగా చేసి పూజించకండి. దోపిడిదొంగతనాలకు పాల్పడకండి. వ్యభిచా రానికిఅక్రమ సంబంధానికి ఒడిగట్టకండి. సుశీలవతి అయిన స్త్రీ మీద లేనిపోని నిందలు మోపకండి'' అని బదులిచ్చారు. (మిష్కాత్) 
 మరో సందర్భంలో ఒక వ్యక్తి దైవప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి - ''అత్యంత ఘోరమయిన పాపం ఏది?' అని ప్రశ్నించాడు. ''అల్లాహ్  మనిషిని నఖశిఖ పర్యంతం తీర్చిదిద్ది అందంగా పుట్టిం చాడు. అయినా మనిషి అల్లాహ్ను వదలి ఇతరులను ఆరాధించండం'' అన్నారు. 'తర్వాత ఏది?' అని అడగ్గా - ''తనతోపాటు తింటాడన్న (తిండి పెట్టలేమనే) భయంతో తన సంతానాన్ని హతమార్చడం'' అని బదులిచ్చారు. 'ఆ తార్వత ఏది?' అని ప్రశ్నించగా - ''పొరుగువాని భార్యతో వ్యభిచరించడం'' అని జవాబిచ్చారు.  (బుఖారీ)
 అలాగే ప్రళయ సూచనల్ని తెలియజేస్తూ ఆయన ఇలా అభిప్రాయ పడ్డారు: ''జ్ఞానం నశించిఅజ్ఞానం సర్వత్రా వ్యాపించడం. మద్య సేవనం సర్వ సాధారణమైపోవడం. వ్యభిచారం పెచ్చరిల్లడం. (ప్రమాదకరమయిన వైరస్‌లా మానవ జీవితాల్ని అస్తవ్యస్త్యం చేయడం). పురుషుల సంఖ్య తగ్గి స్త్రీల సంఖ్య పెరగటం. ఎంత వరకంటే 50 మంది స్త్రీలకు పోషకునిగా ఒకే పురుషుడు మిగిలి ఉండటం'' అని. (బుఖారీ)
అదే విధంగా - ''ఏ జాతిలో వ్యభిచారం విచ్చలవిడిగా కొనసాగు తుందో ఆ జాతిలో మృత్యువు విలయతాండవం చేస్తుంది''. (మిష్కాత్ )
''ఏ జాతిలోనయితే వ్యభిచారం ((జారస్త్రీ) శిరసెత్తి నడుస్తుందో (నేటి సినీ తారలుఫ్యాషన్‌ భామలు) ఆ జాతిలో కరువు రక్కసి తాండవిస్తుంది. మరే జాతిలోనైతే లంచం ఒక సాధారణ విషయమైపోతుందో ఆ జాతి భయానికిఅభద్రతాభావానికిఅశాంతికిఅలజడికి గురిచేయబడుతుంది''. (మిష్కాత్ )
 దైవప్రవక్త (స) వారు తన విషయంలో ఎప్పుడూ కోపానికిఆవే శానికి లోను కాలేదు. అయితే ప్రజలు ధర్మం నిర్దేశించిన హద్దుల ను నిర్ధాక్షిణ్యంగా చెరిపివేయడం చూసి అగ్రహోదగ్రులయ్యేవారు.  ఓ గొప్ప వంశానికి చెందిన స్త్రీ విషయంలో ఒక సహాబీ సిఫారసు చేసినప్పుడు ఆయన కోపగించుకున్నారు. ధనికనిరుపేదల విష యంలో సమానంగా వ్యవహరించాల్సిందిగా ఉపదేశించారు.

7, జనవరి 2013, సోమవారం

ఇమామత్‌ ఆదేశాలు

నాయకుణ్ణి, పరిపాలకుణ్ణి ‘ఇమామ్‌’ అని పిలుస్తారు. కాని ఇక్కడ మాత్రం ఇమామ్‌ అంటే నమాజ్‌ చేస్తున్న వారికి సారథ్యం వహించే వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో అతని వెనుక నమాజ్‌ చేసేవారందరూ ‘ముక్తదీలు’ అనబడతారు.
ఇమామత్‌కు ఎవరెక్కువ అర్హులు?
హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: దైవగ్రంథాన్ని బాగా పారాయణం చేసే వ్యక్తి (నమాజులో) ప్రజలకు సారథ్యం వహించాలి. ఒకవేళ ప్రజలందరూ కూడా గ్రంథ పారాయణంలో సమవుజ్జీలయినప్పుడు వారిలో దైవప్రవక్త విధానం (సున్నత్‌) గురించి అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి సారథ్యం వహించాలి. ఒకవేళ సున్నత్‌ జ్ఞానంలో కూడా ప్రజలందరూ సమానులే అయితే వారిలో ప్రప్రథమంగా దైవమార్గంలో హిజ్రత్‌ చేసినవారు సారథ్యం వహించాలి. ఒకవేళ హిజ్రత్‌ చేయటంలో కూడా అందరూ సమానులయి ఉంటే, అప్పుడు వయసులో అందరికన్నా పెద్దవాడు వారికి సారథ్యం వహించాలి. ఒకరి నియమిత చోటులో అతని అనుమతి లేకుండా ఇంకొకరు ఇమామత్‌ చేయకూడదు. ఇంకొకరి ఇంట్లో వారి గౌరవాసనం మీద వారి అనుమతి లేకుండా కూర్చోకూడదు. (ముస్లిం, అహ్మద్‌)
గుడ్డివారూ నమాజుకు సారథ్యం వహించవచ్చు
దైవప్రవక్త (సల్లం) హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమ్మె మక్తూమ్‌ (రజి)ని మదీనాలో రెండుసార్లు తన ప్రతినిధిగా నియమించారు. ఆ సమయంలో ఆయన ప్రజలకు నమాజ్‌ చేయించేవారు. మరి చూడ బోతే అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమ్మె మక్తూమ్‌ అంధులు. (అహ్మద్‌, అబూ దావూద్‌)
యుక్త వయస్సుకు చేరని పిల్లవాడు ఇమామత్‌ చేయగలడు
తన తండ్రి తనతో ఇలా చెప్పారని అమ్ర్‌ బిన్‌ సలమా (రజి) తెలియజేశారు: ” నేను దైవప్రవక్త (సల్లం) సన్నిధికి హాజరై తిరిగి వస్తుండగా దైవప్రవక్త (సల్లం) నన్ను ఉద్దేశించి, ‘నమాజ్‌వేళ అవగానే మీలో ఎవరయినా ఒకరు అజాన్‌ ఇవ్వాలి. ఆ తర్వాత అందరికన్నా ఎక్కువగా ఖుర్‌ఆన్‌ జ్ఞానం కలిగివున్న వ్యక్తి నమాజ్‌కు సారథ్యం వహించాలి’ అని ఉపదేశించారు”.
అప్పుడు మా తెగవారికి ఖుర్‌ఆన్‌ గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వారెవరూ కనిపించలేదు. అంచేత వారు తమకు ఇమాముగా నన్నే ఎన్నుకున్నారు. అప్పట్లో నా వయసు ఆరేడు సంవత్సరాలు ఉండి ఉంటుంది. అంతే.  (బుఖారీ, అబూదావూద్‌)
ఇమామ్‌ ప్రజలకు భారం అనిపించని విధంగా నమాజ్‌ చేయించాలి
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: నమాజ్‌కు వచ్చేవారిలో బలహీనులు, వ్యాధిగ్రస్తులు, ముసలివారు కూడా ఉంటారు. అందువల్ల ప్రజలకు నమాజ్‌ చేయించే వ్యక్తి (ఎవరికీ భారం అనిపించకుండా) సంక్షిప్తంగా నమాజ్‌ చేయించాలి. తను ఒంటరిగా నమాజ్‌ చేసుకుంటున్నప్పుడయితే, అతను తనకిష్ట మైనంత సుదీర్ఘంగా నమాజ్‌ చేసుకోవచ్చు.  (బుఖారీ)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటుండేవారు: ”నేను సుదీర్ఘ నమాజు చేయాలన్న ఉద్దేశ్యంతో నమాజు మొదలు పెడతాను. కాని తర్వాత ఏదయినా బిడ్డ ఏడ్పు వినబడగానే, బిడ్డ ఏడ్పు వల్ల ఆ బిడ్డ తల్లి బాధపడుతుందేమోనని నేను నమాజును సంక్షిప్తం చేస్తాను”. (బుఖారీ)