7, జనవరి 2013, సోమవారం

మన -మానవ జీవితానికి సంబంధించిన సమస్యలు అనేకం. కూడు, గూడు, గుడ్డ లాంటి మౌలిక సమస్యలతోపాటు విద్యా బుద్ధులు, సంఘం, సంస్కృతి, యుద్ధం, సంధి సమస్యలు; ధన, మాన. పాణ్ర రక్షణకు సంబంధించిన సమస్యలు…ఇలా ఎన్నో సమస్యలతో మనిషి సతమతమవుతున్నాడు. మనిషికి ఎదురయి ఉన్న ఈ సమస్యల పరిధి ఒక్కోసారి వ్యక్తికి పరిమిత మయితే, ఒక్కోసారి కుటుంబానికి, సమాజానికి, దేశానికి విస్తరించి ఉంటాయి. సమస్యలు అవి ఏ రంగంతో ముడి పడి ఉన్నా వాటిని మూడు శీర్షికల్లో విభజించవచ్చు.  1) సిద్ధాంతాలు. 2) సామాజిక సంబంధాలు. 3) చట్టం. మనం, మన నిజదైవాన్ని గహ్రించి, ఆయన ఆదేశాలకనుగుణంగా నడుచుకుంటే ఈ మూడు శీర్షికల్లో విభజితమయి ఉన్న మానవ సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్న పశ్న్రకు సమాధానమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం!
మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు అంతిమ దైవ ప్రవక్త ప్రభవించిన నాటికి లోకంలో అక్కడక్కడా సత్య కాంతి మిణుకుమిణుకుమని కానవచ్చినా అధికాంశం అంధకారమయం.  జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢ నమ్మకాల దొంతరలు, సామాజిక అవగాహ నకు సూత్రం; ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధి కారం” అన్నది. సమాజం తరగతుల్లో విభా జితం: పాలకులు, స్వాములు, నాయకులు. కర్షకులు, దాసులు, బానిసలు, నౌకరులు అధ మాతి అధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష సమాజంలో ప్రధాన పాత్రాధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడా కడపటి స్థానం. ఆ చీకటి ఎడారి లో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపుతున్నాయి. ఆ పుష్పరాజం  నోట వెలవడిన సూత్రం: ”ఖూలూ లాఇలాహ ఇల్లల్లాహ్  తుఫ్‌లిహూ” – మీరు అల్లాహ్  తప్ప ఆరాధ్యులు ఎవరు లేరు అన్న పరమ సత్యాన్ని త్రికరణ శుద్ధితో స్వీకరించండి, ఇహపర సాఫ ల్యాలు మీ చిరునామ తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతాయి. మీ సకల సమస్య లు తీరతాయి. ఏ సద్వచన కారణంగా సకల సమస్యలు తీరతాయని ప్రవక్త (స) జమానతు ఇచ్చారో ఆ సద్వచనం గురించి సర్వేశ్వరు డయిన  అల్లాహ్  ఇలా సెలవిస్తున్నాడు: ”అల్లాహ్  తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో”.
ఏమిటి, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అని నోటితో ఉచ్చరించడం వల్ల, మనసుతో అంగీకరించ డం వల్ల, అది విధించే పరిధులకు లోబడి జీవించడం వల్ల మానవ – మన సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్న తదితర విష యాలను తెలుసుకుందాం!
1) సిద్ధాంతాలు: మనిషి పుట్టగానే ఒక ప్రత్యేక వాతావరణాన్ని గమనిస్తాడు. ఇక్కడ సూర్య   చంద్రాదుల ఉదయం, అస్తమయం జరుతున్న ది. పగలు వస్తుంది, రేయి పోతుంది. నింగిలో ని తారకలు తళుక్కునమెరుస్తాయి, పుసుక్కున మాయమైపోతాయి. నేల సస్యశ్యామలంగా కళకళలాడుతుంది.  ఎండి వెలవెలబోతుంది. నీరు యేరయి గలగల పారుతుంది, ఎండి పోతుంది కూడా. సృష్టిలో నిరంతరం జరిగే ఈ మార్పులు ఇట్టే దాటి పోవు.మనిషి దేహం పైనే కాకుండా ఆత్మపైనా, ఆలోచనపైన సయి తం ప్రభావం చూపుతాయి. ఉదయం ఉపాధి ఆధారమయితే, రాత్రి విశ్రాంతికి మూలం. మనిషి చుట్టూ జరిగే ఈ మార్పులు అతనికి సంతోషాన్ని, సుఖాన్నీ ఇస్తాయి. దుఃఖానికి, కష్టానికీ గురి చేస్తాయి. వీటి ద్వారా మనిషి ఆరోగ్యాన్ని పొందుతాడు, అనారోగ్యం పాలూ అవుతాడు. ఒక్కోసారి అతనికనిపిస్తుంది – తన ఆదేశం, అధికారం, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు – చివరికి తన దేహం మీద సయితం లేదు అని. ఈ భావన కలగగానే ప్రపంచంలో తనకి లాభనష్టాన్ని కలుగజేసే  ప్రతి వస్తువు అతన్ని భయపెట్ట సాగింది. ఫలితంగా మనిషి అవనిని పూజించడం ప్రారంభిం చాడు, అందులో ఎనలేని నిధులూ నిక్షేపాలు ఉన్నాయని. ఆకాశాన్ని దేవతగా భావించాడు, అది వరాల జల్లు కురిపిస్తుందని. పర్వతాల ముందు తల వంచాడు, అవి తనకన్నా ఎంతో ఎత్తయిన వనీ. సముద్రాలంటే ఆపాద మస్తకం వణకిపోయాడు, దాని పొగరుమోతు (సునామీ లాంటి) కెరటాలు తనను నాశనం చెస్తాయోమోననీ. ఇలా అండం మొదలు బ్రంహ్మాండం వరకు – అన్నింటి ని పూజించడం, గులామ్‌గిరీ చేయనారంభించాడు. దేవుడున్నాడని నమ్ముతూనే పుణ్య పురుషుల ను, సంఘసంస్కర్తలను దైవానికి సాటి చేసి కొలవనారంభించాడు. మనిషిగా పుట్టించి సృష్టిరాసు ల్లోనే శ్రేష్ఠ స్థానాన్ని దేవుడు తనకిస్తే, తన అసమర్థతతో అధఃపాతాళానికి దిగజారాడు మనిషి. ఈ యదార్థాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా అభివర్ణిస్తుంది:
”నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమయిన ఆకృతిలో సృజించాము. అటుపిమ్మట అతన్ని (అతని నిర్వాకాలకు బదులుగా) అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము”. (అత్తీన్‌: 4,5)
అతనిలో చోటు చేసుకున్న భయాలన్నీ అతను మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే ఒక్క సత్యంతో పటాపంచలు కాగలవు. కానీ, అతను ఆ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే, ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నది ఒకే ఒక్క సృష్టికర్త అని, విశ్వం మొత్తం ఆ నిజ స్వామికే తలొగ్గి మనుగడ కొనసాగిస్తుందని తెలుసుకునేవాడు. ఆ ఒక్క నిజ అధికారికి మాత్రమే భయ పడేవాడు. ఆ సత్య ప్రభువు పట్ల వాస్తవమయిన భక్తి అతన్ని సకల భయాల నుండి ముక్తి కలిగిం చేది. ఆ కృపాసాగరుని దాస్యం సకల దాస్య శృంఖలాలను త్రెంచేసేది. జ్ఞానోదయం కలిగిన అతను గొంతెత్తి ఇలా చాటేవాడు: నేను నింగిలో మెరిసే తారకల్ని చూశాను. అవి కొంత కాలం ఉంటాయి తర్వాత నిష్క్రమిస్తాయి. నేను పండు వెన్నెల్ని పంచే ప్రకాశమనయిన చంద్రుణ్ణి చూశాను. అదీ కనుమరుగవుతుంది. నేను బ్రహ్మాండంగా వెలిగిపోతున్న సూర్యున్ని చూశాను, అదీ ఓ సమయం తర్వాత అస్తమిస్తుంది. ఇలా ఒక సమయం నుండి మరో సమయం వరకూ వచ్చీపో యేవేవి దైవం కాలేవు, వాటిని నియామనుగుణంగా నడిపిస్తున్న ఆ సర్వశక్తిమంతుడే  నా ఉపా సనారీతులన్నింటికీ అర్హుడు.
”నిశ్చయంగా నేను భూమి, ఆకాశాలను పుట్టించివాని వైపునకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పు కుంటున్నాను. నేను బహుదైవరాధకుల్లోని వాడను కాను”. (అన్‌ఆమ్‌: 79)
అంటే, మనిషిలోని మతపరమయిన, విశ్వాసపరమయిన భ్రమ, భ్రాంతులన్నింటినీ ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అల్లాహ్  తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు – అన్న సద్వచనం తొలగించి, అత నికి క్రాంత దృష్టిని, శాంత స్వభావాన్ని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మతపరమయిన సకల రుగ్మతలకు, దురాచారాలకు, నూతన పోకడలకు విరుగుడు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’!
ఇదో మానవ జీవితానికి సంబంధించిన కోణమయితే, మరో కోణంలో మనిషి సృష్టిలో జరిగే ఈ మార్పుల గురించి తెలుసుకున్నాడు. ఏదో అదృశ్య శక్తి ఆదేశం మేరకు నిప్పు మండుతుందని, నీరు ప్రవహిస్తుందనీ, నేల ధాన్యం పండిస్తుందనీ,, సుభిక్షమయినా, దుర్భిక్షమయినా, కలిమి అయినా, లేమి అయినా, జననం అయినా, మరణం అయినా ప్రతిదీ ఆ అదృశ్య శక్తి ఆజ్ఞకే కట్టు బడి ఉన్నాయని గ్రహించాడు. మనిషిలో పరిశోధించాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది,  అతని అన్వేషణ మొదలయింది.  ఆ శక్తి ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని పరితపించాడు. ఆ శక్తిని తాను చూడలేడుగాని  ఆ విశ్వకర్త శక్తి సంబంధించిన నిదర్శనాలు అడుగడుగునా దర్శ నమిస్తున్నాయి.  మనిషి తనకున్న పరిమిత జ్ఞానంతోనే తర్కించడం మొదలెట్టాడు – నా కళ్లకు కనబడని, నా వీనులకు వినబడని, నా పంచేంద్రియాల పరిధిలోకి రాని ఒక వస్తువును నేనెందు కు నమ్మాలి. పురోగమానికి బదులు తిరోగమం చోటు చేసుకుంది. ఈ విశ్వంలో ఎవరి పరిపా లన సాగుతుందో తెలియనప్పుడు ఆ శక్తిని అంగీకరించి ప్రయోజనం ఏమిటి? అతను గ్రహిం చాడు; విశ్వంలో కొన్ని సాధనాలు కలిసినప్పుడు కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయి. నిప్పు కాల్చుతుంది. నీరు వల్ల మొక్కల్లో ప్రాణం వస్తుంది. విషం మనిషిని చంపుతుంది. అమృతం మనిషిని బ్రతికిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అతనో నిర్ణయానికి వచ్చాడు. తాను ఒక ప్రత్యేక వాతావరణంలో జీవిస్తున్నాడు. ఇక్కడ అతనికి ప్రతికూలంగా, అనుకూలంగా కొన్ని శక్తులు బలంగా పని చేస్తున్నాయి. అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ అనుకూల శక్తుల వల్ల ప్రయోజనం పొందడం ఎలా? ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవడం ఎలా? అన్నదే అతని ఆలోచన, అన్వేషణకు అంతిమ గమ్యంగా నిలిచింది. తాను జరిపిన పరిశోధనా మత్తులో అతను ఆ విశ్వకర్తనే నిందించాడు. ఆయనకే పోలికలు కల్పించే దుస్సాహసం చేశాడు. ఇదే విషయాన్ని సర్వేశ్వరుడయిన అల్లాహ్‌ా ఇలా తెలియజేస్తున్నాడు: ”వాడు మమ్మల్ని (ఇతరులతో) పోల్చాడు. కానీ (మరోవైపు) తన పుట్టుకనే మరచి పోయాడు. ‘కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు (రా) బ్రతికిస్తాడు?’ అని (మాకే) సవాలు విసురుతున్నాడు. (ఇలా) చెప్పు: ‘వాటిని తొలిసారి సృష్టించినవాడే (మలిసారి) కూడా బ్రతికిస్తాడు”. (యాసీన్‌: 78,79)   తన పుట్టుక ఎందు నిమిత్తం జరిగింది? తనెందుకు ఈ లోకంలో ఉన్నాడు? జీవిత గడువు ముగిశాక చచ్చి తాను ఎక్కడి వెళ తాడు? తాను చేసుకున్న పాపపుణ్యాల పర్య వసానం ఏమిటి? నిరాఘాటంగా, నిర్విఘ్నం గా, నిరంతరాయంగా ఓ కట్టుదిట్టమయిన నియమానికి లోబడి నడుస్తున్న ఈ విశ్వ వ్యవస్థ చివరికి ఏమవుతుంది? వీటి గురించి అతను అస్సలు ఆలోచించ లేదు. ఫలితం – నిజ దైవ జ్ఞానం లేని భక్తి మానవ సమాజం పాలిట ప్రమాదంగా మారినట్టే, వాస్తవదైవం పట్ల భక్తి లేని విజ్ఞానం వినాశకాలకు కారణ భూతమయింది.  అదే అతను ఈ సృష్టికి కర్త ఉన్నాడు, అతను ఒక్కడే అన్న యదార్థా న్ని అంగీకరించి ఉంటే నేడు అతను వైజ్ఞాని కంగా గొప్ప విజయాల్ని సాధించి కూడా పరిష్కరించుకోలేకపోతున్న అనేకానేక సమ స్యలు ఇట్టే సులభంగా పరిష్కారం అయ్యేవి.  అంటే దైవాన్ని విశ్వసించడంతోపాటు అనేక శక్తుల్లో విశ్వాసం గలవారు, విగ్రహారాధ కులు సృష్టి పూజారులు ‘లా ఇలాహ’అంటూ సృష్టికర్త వ్యవహారంలో సృష్టిరాసుల జోక్యాన్ని నిరాకరించాలి. ఈ సృష్టికి కర్త అనేవాడే లేడు, ఉన్నా ఆతన్ని నమ్మడం వల్ల ప్రయోజ నం లేదు అని అనుకునేవారు ‘ఇల్లల్లాహ్ ’ ఒక్క అల్లాహ్  మాత్రమే ఈ సృష్టి మొత్తాన్ని నియమబద్ధంగా నడుపుతున్నాడన్న యదార్థా న్ని అంగీకరించాలి. ‘లా ఇలాహ’ అన్న అనంగీకారం, ‘ఇల్లల్లాహ్ ’ అన్న అంగీకారం తో మానవాళి సైద్ధాంతిక పరమయిన, మత పరమయిన దొంతరలు, ద్వంద ప్రమా ణాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదే నేప థ్యంలో దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) మాన వాళిని ‘ఖూలూ లా ఇలాహ ఇల్లల్లాహ్  తుఫ్లిహూ’ అని ఘంటాపథంగా పిలుపుని చ్చారు.
లా ఇలాహ ఇల్లల్లాహ్  అని
పలుకరండి ఓ ప్రజలారా!
(మానవులందరిని దేవుడు ఒకే జాతిగా అభి వర్ణించినప్పుడు మనుషుల మధ్య ఈ భేదభా వాలు, వర్గాలు, వర్ణాలు, కులాలు, అంట రానితనాలు, అస్పృశ్యతలు ఎందుకున్నట్టు? ఈ సామాజిక అసమానతకు అసలు కారణం ఏమిటి? ఇవి ఇటువంటి ఇతర అనేక ప్రశ్న లకు జవాబు కావాలంటే  కాస్త  వేయిట్‌ చేయాల్సిందే!)
మన సమస్యలు తీరాలంటే…. 2
  ఓ ప్రజలారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గల వాడే అల్లాహ్  సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్  అన్నీ తెలిసినవాడు, అప్ర మత్తుడు. (దివ్యఖురాన్ – 49: 13)
ఈ వచనంలో దేవుడు మానవులంతా ఒక్కటే అనే సమగ్ర భావనను బోధిస్తున్నాడు.అయినా, వారిని పరస్పర ఘర్షణకు, పోరుకు పురికొలిపే విషయ మేమిటి? సమాధానమొక్కటే, దేవుడు మనిషికి బోధించిన విశాల దృక్పథాన్ని వదలి తన చుట్టు చిన్న చిన్న గీతలు గీసుకుని ఆ గీతల పరిధిలో ఉన్న వాళ్ళనే తన వాళ్ళుగా భావించసాగాడు.  ఈ భావన ఒక్కోసారి వంశం వరకు, ఒక్కోమారు భాష వరకు, ఒక్కోసారి జాతి వరకు వెళ్ళేది. అంతకు మించిన విశాలత దానికి లేదు. ఆ విధంగా పరిమిత స్థాయిలో – వంశం, భాష, జాతి మనుషులను సమైక్య పరచినప్పటికీ మాన వుని అవసరాలు, ప్రయోజనాలు బహు దూరాల వరకు వ్యాపించి ఉన్నాయి.  ప్రపంచమే ఒక గదిగా మారిపోయిన నేటి తరుణంలో ఈ ఎల్లలు ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది. మా జాతే గొప్ప జాతి అని ఒక జాతీయ నాయకుడు, అంత ర్జాతీయ స్థాయికి చెందిన వ్యక్తి చెబుతున్నాడంటే, ఇతరుల్ని అతను ఏ దృష్టితో చూస్తున్నాడో ఇట్టే అర్థమయిపోతుంది.
ఈ భావన కారణంగా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి జాతి భక్తిప్రపత్తుల, ప్రేమాభిమానాల పరిధి, మూర్తి వేర్వేరుగా ఉంటుంది. వారు తమ పరిధిని సమర్థించుకోవటానికి ఇతరుల్ని నిందిస్తారు, ఖండిస్తారు, కించ పరుస్తారు, అవసమైతే నిర్బం ధిస్తారు, బహిహ్కరిస్తారు, మరీ అవసరమను కుంటే తుదముట్టించేందుకు సయితం వెను కాడరు. ఆసియాకు చెందిన వాడు యూరప్‌ పట్ల వైషమ్యం ఏర్పరచుకుంటాడు. ఓ దేశంలో మరో దేశానికి స్థానం లేదు. ఒక ప్రాంతానికి మరో  ప్రాంతం అంటే గిట్టదు.
 వర్గం, వర్ణం, జాతి, ప్రాంతం, రంగు మొౖదల యిన ఈ వ్యత్యాసాలన్నింటికి పరిష్కారంగా విశ్వ మానవ సోదర భావం ముందుకొస్తుంది. అంటే జాతులన్నీ తమ సమిష్టి ప్రయోజనాల కొరకు పాక్షికాలను ప్రక్కన పెట్టి సమైక్యమయి పోవాలి. వాటి సాధనకు కృషి చేయాలి. తాము ప్రశాంతం గా జీవించాలి. ఇతరుల్ని ప్రశాంతంగా జీవించ నివ్వాలి. అయితే మనిషి ఏర్పరచుకున్న క్రియా జీవితం దీన్ని సమర్థించదు. మనిషి ప్రయోజనా లు అతని సిద్ధాంతాలకు లోబడి ఉంటాయి. మనిషి, యుద్ధం, సంధి, స్నేహం, శత్రుత్వం అన్నీ వ్యవహారాలు సిద్ధాంతాల ఆధారంగానే నెరుపు తాడు. సిద్ధాంతాల్లో వైవిధ్యం ఉంటే ప్రయోజ నాల్లో సమైక్యత సాధ్యం కాదు.  కమ్యూనిజాన్ని నమ్మేవాడు పెట్టుబడి దారీతో సంధి ఒడంబడిక చేయడు. జాతి తత్వంలో నమ్మకమున్నవాడు విరోధ జాతి ప్రగతిని సహించడు. సుదీర్ఘ మానవ చరిత్ర ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఈ భిన్నత్వం వల్ల మానవుల్లో సదా వివాదాలు, పోరాటాలే సాగాయి. అలాంటప్పుడు అదే వారి మధ్య ప్రేమానురాగాలకు మార్గం కావడం అసంభవం.
ఇక ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అన్న భావన పై వచ నంలా మానవులంతా ఒక్కటే అని నిర్ణయిస్తుంది. అది మానవులందరికీ ఒకే ఆశయాన్నీ నిర్ధారిస్తుం ది.  మానవులందరి కర్త, స్వామి, ఆరాధ్యుడు, పూజ్యనీయుడు ఒక్కడే అంటుంది. ఆయన భార తీయునికి వేరుగా, చైనీయునికి వేరుగా, రష్యన్‌కు వేరుగా, ఆమెరికన్లకు వేరుగా లక్ష్యాలు నిర్ణయించ లేదు అంటుంది. మానవుని సృష్టికర్త, భువిపై  నివసించే ప్రతి వ్యక్తి, ప్రతి వర్గాన్ని తన దాస్యం చేయమని కోరాడు. ఈ నిమిత్తమే ఆయన ప్రవ క్తల్ని ప్రభవింపజేశాడు. గ్రంథాల్ని అవతరింపజే శాడు. వారందరూ ప్రతిపాదించిన విషయం, మనమంతా ఒక్కటే అన్నది ఒకటయితే, ‘మనం దరి దైవం ఒక్కడే’ అన్నది మరోకటి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనల లోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి”.
 (అర్రూమ్‌: 22)
”ఒక అరబ్బుకి అరబ్బేతరునిపైగానీ, ఒక నల్ల వాడికి తెల్లవాడిపైగానీ ఎటువంటి ఆధిక్యతా లేదు; దైవభీతితో తప్ప. మీరందరూ ఆదం సంతానమే. ఆదమ్‌ను దేవుడు మట్టితో పుట్టిం చాడు” అని దైవప్రవక్త (స) అంతిమ హజ్జ్‌ సందర్భంగా ప్రకటించారు.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’కు ఇంతటి మహత్తర శక్తి ఉందా? అంటే దానికి ప్రబల నిదర్శనం నమాజే.
ఇకపోతే, ఈ సద్వచన భావమేమంటే, ‘అల్లాహ్  తప్ప వేరే ఏ ఇతర ఆరాధ్య దైవం లేదు’.కలిమా లో ఏముంది? కొన్ని అక్షరాలు మాత్రమే కదా! ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ ఈ అక్షరాలను కలిపి ఉచ్చరిస్తే ఎమయినా మాయ జరుగుతుందా? మనిషి స్థితిగతులే మారిపోవడానికి? తాము చదివే మంత్రానికి భావమేమిటో తెలియకపో యినా, మంత్రం పఠించగానే కొండలు కంపిస్తా యనీ, భూమి బ్రద్ధలవుతుందనీ, సముద్రాలు ఉప్పొంగుతాయని కొందరయితే భావించగలరు. ఎందుకంటే, పవర్‌ అంతా అక్షరాల్లోనే ఉందని, అవి నోటి నుండి వెలువడగానే మాయా ద్వారా లు తెరుచుకుంటాయని వారి విశ్వాసం. కాని ఇక్కడ అలా కాదు. ఇక్కడ అర్థానికి, అంతరాత్మ కు, ఆచరణకే ప్రాధాన్యత. చలి వేసిన వ్యక్తి ‘కంబళి, కంబళి’ ‘దూది పరుపు, దూది పరుపు’ అంటూ కూర్చుంటే ఎలాగయితే చలి బాధ తగ్గదో, సద్వచన విషయంలోనూ అంతే. మనిషి భావాలపై, ఆచరణలపై, తీర్పులపై ఈ సద్వచన ఆధిపత్యం చోటు చేసుకున్నప్పుడే లోక కళ్యాణం సాధ్యం. ఈ సద్వచనాన్ని మనస్ఫూర్తిగా నమ్నిన వ్యక్తి నోట సదా ఈ మాట ఉంటుంది:
”ఆయనే నన్ను సృష్టించినవాడు. మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు మరియు  త్రాపిస్తున్నాడు. నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు. ఆయనే నన్ను చంపుతాడు. మళ్ళి తిరిగి బ్రతికిస్తాడు. ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకు ఉంది”. (అష్‌ షుఅరా: 78-82)
ఈ భావన మానవుల మధ్య కుల, వర్ణ, వర్గ, భాష, జాతి దురభిమానాలను అంతమొంది స్తుంది. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ను త్రికరణ శుద్ధి తో విశ్వసించిన తర్వాత మనిషిలో బూటకపు కీర్తిప్రతిష్టల భేదభావాలు తలెత్తవు. ఒకే దేవుని దాసులం అన్న అత్యుత్తమ భావన, యజమాని- కార్మికులను, పాలితుల-పాలకులను, రాజు-పేద ను ఒకే వరుసలో నిష్ఠగా నిలబడేలా తీర్చిదిద్దు తుంది. మానవులందరినీ సోదరులుగా ఎంచే ఏ సిద్ధాంతమూ ఇస్లాంను మినహా లేదు. అందు వల్లనే ఇస్లాం వైపునకు దృష్టి మరలినప్పుడు మరో వైపు చూసే అవసరం ఏర్పడు. (సశేషం)

3, జనవరి 2013, గురువారం

ఇస్లామీయ 
సంస్కృతి - శిక్షాస్మృతి 

మానవుని స్వాభావిక భావోద్రేకాలను ఆరోగ్యవంతమయినవని, పరి శుద్ధమయినవని ఇస్లాం ప్రకటించిన రీతిలో ప్రపంచంలోని మరే మత ధర్మమూ చెప్పలేదు. దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: 
'జనులకై-మనోభిరామమయిన కాంక్షలు, స్త్రీలు, సంతానం, వెండి బంగారాలు, మన్నికయిన గుర్రాలు, పశువులు (పాడి), వ్యవసాయ భూములు - ఇవన్నీ మనోజ్ఞంగా చెయ్యబడ్డాయి'. (ఆలి ఇమ్రాన్‌:14) 
షహవాత్‌-అంటే సహజంగా మనిషి ఇష్టపడే, అతని మనసును దోచుకునే వస్తువులు అని భావం. అందుకే ఆ వస్తువులు కోరుకోవ డం, వాటి పట్ల మోజు చూపడం తప్పు కాదు. కాకపోతే ఈ విష యంలో మనిషి మితి మీరకూడదు. షరీతయతు విధించిన హద్దుల ను అతిక్రమించకూడదు. వాటిని మనిషి కొరకు ఆకర్షవంతంగా, మనోజ్ఞమైనవిగా చేయడం అన్నది కూడా దేవుని తరఫు నుంచి ఓ పరీక్షే. ''మేము మనుషులను పరీక్షించే నిమిత్తం భూమిపై ఉన్నవాటిని మనోజ్ఞమయినవిగా చేశాము''. (అల్‌ కహఫ్‌: 7)

ఇస్లాం కోరికల దాస్యాన్ని మంచి దృష్టితో చూడదన్న విషయం నిజమే. అది మనిషిపై కళ్ళెం లేని కోరికలు, భావేద్రేకాలు అధికారం చెలాయించే వరకు వీటికై అర్రులు చాచడానికి వీలు పడదు అం టుంది. ఎందుకంటే కళ్లెం లేని కోరికలు మనిషిలోని శక్తిసామర్థ్యాల కేంద్రాన్ని సర్వనాశనం చేసి వేస్తాయి. మనిషిని పశు స్థాయికి దిగ జార్చుతాయి. ఈ విషయమై ఇస్లాం వ్యక్తిపై కొన్ని ఆంక్షలు విధించ డానికి కారణం అతను తన స్వేచ్ఛ దుర్వినియోగం చేసి తన స్వయాని కి, కుటుంబానికి, సమాజానికి ఎలాంటి హాని కలుగజెయ్యకుండా ఆనంద మకరందాన్ని గ్రోల గలగాలన్నదే. మనోనిగ్రహంకై చేెసే సూచన నిర్బంధ శాసనం కాదు. దీని వెనక ఎంతో నిగూఢ వివేచన దాగి ఉంది. ప్రపంచ సుఖాలను జీవితాశయానికి తగినట్లుగా మలచు కోవడం. ఏ జాతి ప్రజలయితే తమ మనోకాంక్షల్ని, భావోద్రేకాలను తమ అధీనంలో ఉంచుకోలేరో, మరెవరైతే అవసరం ఏర్పడినా తమకు ప్రియమైన వాటిని వదులుకోవడం ఇష్టపడరో అలాంటి జాతి నాయ కత్వపు హోదాను పొందజాలదు. అలాగే అంతర్జాతీయ సంఘర్షణల్లో ఏ జాతి జనులయితే కష్టాలను, ఆపదలను భరించే సామర్థ్యం కలిగి ఉంటారో, ఎవరయితే అవసరం కలిగినప్పుడు తమ మనోభిరామమ యిన కోరికల్ని గంటలు, దినాలే కాదు సంవత్సరాల తరబడి త్యజించి నిబ్బరం చూపగలరో అలాంటి దృఢ సంకల్పులకే, ఉత్తములకే, పురుషోత్తములకే విజయశ్రీ కాళ్ళు పడుతుంది. ఇక పిచ్చి స్వేచ్ఛ కోసం మనసిచ్చిన మనిషి, ఒక ఉన్నతాశయం కోసం కొన్ని గంటల యినా తన మనోకాంక్షల పొగరుబోతు గుర్రాన్ని కళ్ళెం వెయ్యలేని మనిషి కూడా ఒక మనిషేనా? ఇటువంటి కాంక్ష దాసులు మానవాళికి ఎన్నడూ ఎలాంటి సెవనూ చెయ్యలేరు. తనకు ప్రియమైన విలాసాలను త్యాగం చేసే సాహసించలేరు.
ఇస్లాం సాధించిన మహత్కార్యాల్లో, మహాద్భుతాల్లో, అలనాటి అరబ్బు ఆటవిక, అనాగరిక, మొరటు ప్రజల్ని సంస్కారవంతులయిన మానవుల సంఘంగా, ఓ ఉత్తమ జాతిగా తీర్చిదిద్దడం ఒకటి. అది వారికి కేవలం రుజుమార్గం మాత్రమే చూపలేదు. కేవలం వారిని పాశవిక స్థాయి నుండి లేవనెత్తి వారికి మానవత్వపు ఉన్నత విలువల ను పరిచయం చెయ్యడమే కాదు, వారిని ఇతరులకు మార్గదర్శకులు గా, దైవధర్మధ్వజవాహకులు, ప్రచారకులుగా కూడా తీర్చిదిద్దింది.
మచ్చుకు కొన్ని సంఘటనలు:
ఉహద్‌ సంగ్రామం అనంతరం హజ్రత్‌ హమ్జా (ర) గారి మృత దేహం ముక్కలు ముక్కలుగా ఖండించబడి, చెవులు, ముక్కు కోయ బడి ఎంతో భయంకరంగా, కడు దయనీయంగా ఉంది. దాన్ని చూడగానే దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరి గాయి. ఆవేదనాభరితమైన ఆయన హృదయం నుంచి సన్నగా (ఈ క్రింది) శబ్ద తరంగిణి జాలువారింది. 'అబ్బా! ఇంతటి దారుణమైన దృశ్యం నేనింత వరకు చూడలేదు. హమ్జా సోదరి సఫియా మనసు బాధ పడుతుందన్న భయమే గనక లేకపోయి ఉంటే, ఈ పని నా అనంతరం అనవతర ఆచారంగా మారుతుందేమోనన్న భయమే గనక లేకపోయి ఉంటే నేను హమ్జా దేహాన్ని ఇలాగే గద్దలకు, మృగాలకు, క్రీమికీటకాలకు వదిలి పెట్టేవాడ్ని. ప్రళయ దినాన తాను ఆయా ప్రాణుల పొట్టల నుండి లేప బడేవాడు'.(అబూ దావుద్‌, తిర్మిజీ)
పై సంఘటనలో భావోద్రేకాల వెల్లువ కట్టులు తెంచుకోబొతుండగా వెలువడి మాటలు అవి. అయితే మహా ప్రవక్త ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు భావోద్రేకాల ప్రవాహంలో కొట్టుకుపోలేదు. న్యాయానికి, కరుణకి కట్టు బడ్డారు. ఆయన హమ్జా మృతదేహాన్ని ఖననం చేశారు.
హజ్రత్‌ అలీ (ర) గారి కథనం - దైవ ప్రవక్త (స) వారు కొందరిని సైనిక చర్యల నిమిత్తం పంపిస్తూ, వారికి నాయకునిగా ఒక అన్సారు వ్యక్తిని నియమించి, అతని పట్ల విధేయత కనబర్చవలసిందిగా పుర మాయించారు. (ప్రయాణం మధ్యలో ఏదోక కారణంగా) ఆ వ్యక్తి అగ్ర హోదగ్రుడయ్యాడు. (కోపంతో ఊగిపోతూ) 'ఏమీ! నా పట్ల విధేయత కనబర్చమని ప్రవక్త(స)వారు చేసిన హితవు నిజం కాదా?' అన్నాడు.
అందరూ నిజమే అన్నారు ముక్తకంఠంతో. అలాగయితే నా ఆజ్ఞ మేరకు కట్టెల్ని ప్రోగు చేయండి. వారు మారు మాట్లాకుమడా కట్టెల్ని ప్రోగు చేశారు. వాటికి నిప్పంటించండి అని మళ్ళి గర్జించాడు. నిప్పం టించడం జరిగింది. అవి బాగా కాలాక-అందరినీ ఉద్దేశ్యించి 'నేనాదే శిస్తున్నాను మిమ్మల్ని మీరు ఈ అగ్నికి ఆహుతి చేసుకోండి' అని అరిచాడు. అందరూ అయోమయంలో పడ్డారు.
ఒకరు మరొకరిని పట్టి లాగనారంభించారు. ఈ అగ్నికి ఆహుతి అవ్వడంకన్నా ప్రవక్త (స) వారి కారుణ్య సన్నిధికి పారిపోడం మేలని భావించారు. నిప్పు పూర్తి ఆరిపోయేంత వరకు వారి స్థితి అలానే ఉంది. చివరికి మంటా చల్ల బడింది, అతని కోపమూ తగ్గింది. ఈ విషయం తర్వాత కారుణ్యమూర్తి(స) వారి కర్ణపుటాలకు చేరింది. సాంతం విన్న కారుణ్యమూర్తి (స) ఇలా అభిప్రాయపడ్డారు: ''ఒకవేళ వారు అతని మాటననుసరించి అగ్నికి ఆహుతి అయ్యుంటే ప్రళయం వరకు దాన్నుండి బైటకు రాగలిగేవారు కాదు. విధేయత అన్నది మంచి కార్యాల్లో మాత్రమే సుమీ!'' అని మందలించారు.
(బుఖారీ, ముస్లిం)
పై సంఘటనలో మనసు ప్రవక్త (స) వారి ఆజ్ఞను గౌరవిస్తూ నాయకుని మాటకు విధేయత చూపాలని పదే పదే చెబుతున్నా, మేలిమి మెదడు దాన్ని నిరాకరిస్తోంది. ప్రేమకు నిలయమైన, కరుణకు ఆలయమైన ఇస్లాం ధర్మంలో మేధకు మింగుడు పడని విషయానికి విధేయత చూపాలన్న ఆజ్ఞ ఎలా ఉండగలదు? అని ప్రశ్నిస్తోంది. కాబట్టి అట్టి సందర్భాలు ఎవరికి ఎప్పుడు, ఎక్కడ ఎదురయినా భావోద్రేకానికి లోనయి ధర్మం కోరని త్యాగానికి పూనుకోవడం మాని ధర్మం అంగీకరించిన మేలిమి మేధ చూపే న్యాయానికి కట్టుబడాలని దైవప్రవక్త (స) సెలవిచ్చారు.

ఇస్లాంలో ఆరాధనా గృహాన్ని నేలమట్టం చేయడం, అటువంటి కట్టడానికి నష్టం చేకూర్చడం, అందులో ఆరాధన నుండి, దైవనామ స్మరణ నుండి జనులను ఆపడం, షరీయతు ఆదేశాలను పాటించ కుండా నిరోధించడం ఇత్యాదివన్నీ నిషిద్ధం. అయితే ఆరాధన కోసం కాక కేవలం ముస్లింల మధ్య గల ఐకమత్యాన్ని నీరుగార్చే దురుద్దేశ్యం తో నిర్మించబడే మస్జిద్‌ను విద్వాంసులు 'మస్జిదె జిరార్‌'గా అభివర్ణిం చారు. కాబట్టి ముస్లింలలోని చీలికను నివారించడానికీ, వారి సంఘ టిత వ్యవస్థకు విఘాతం కలుగకుండా ఉండటానికి అటువంటి మస్జిద్‌ లను కూల్చివేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఖుర్‌ఆన్‌లోని ఓ ఆయతు ద్వారా రూఢీ అవుతుంది. సాధారణంగా ఇటువంటి వాటిని మస్జిద్‌ పట్ల మర్యాద గల మనసు అంగీకరించదు. అయితే మేలిమి మేధ చూపే న్యాయానికి అనుగుణంగానే అల్లాహ్‌ా ఈ ఆదేశాన్ని అవ తరింపజేశాడు:

''(కపటులలో) మరికొంత మంది కూడా ఉన్నారు - కీడు కలిగించే, అవిశ్వాసం కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశ్యంతో, విశ్వాసుల మధ్య చీలికను తెచ్చే లక్ష్యంతో, అంతకు మునుపు అల్లాహ్‌ాను, ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనతో వారు ఒక మస్జిదు నిర్మించారు. (ఈ కట్టడాన్ని నిర్మించటంలో) తమ ఉద్దేశ్యం మేలు చేయడం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్దాలకోరులన్న విషయానికి అల్లాహ్‌ా సాక్షి''. (అత్‌ తౌబా: 107)
వివరాల్లోకెళితే-
కపటులు ఒక మస్జిదు నిర్మించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు, చలి గాలులు వీస్తున్నప్పుడు, తీవ్రమైన ఎండ పడుతన్నప్పుడు తమలోని బలహీనులు, వృద్ధులు దూరం నుంచి మస్జిదె నబవీ వరకూ రావడం కష్టంగా ఉందనీ, వారి సౌలభ్యం కోసమే తాము మరొక మస్జిదును కట్టామని వారు దైవప్రవక్త (స) వారిని నమ్మబలకడంతోపాటు, తమరు గనక ఒకసారి వచ్చి అందులో నమాజు చేస్తే ఎంతో శుభం చేకూరు తుందని విజ్ఞప్తి కూడా చేశారు. కాని ఆ సమయంలో ప్రవక్త (స) తబూక్‌ యుద్ధానికి బయలుదేరుతున్నారు, ప్రయాణ నుంచి తిరిగి వచ్చాక, అక్కడికి వచ్చి నమాజు చేస్తానని వాగ్దానం చేశారు. అయితే తబూక్‌ నుండి తిరిగి వస్తున్నప్పుడు అల్లాహ్‌ా, వహీ ద్వారా ఆ మస్జ్జిద్‌ వెనుక ఉన్న దురుద్దేశాలను బట్టబయలు చేశాడు. ముస్లింల మధ్య మనస్పర్థలను సృష్టించడం, అవిశ్వాసాన్ని వ్యాపింపజేయటం, దైవానికి, దైవప్రవక్తకు శత్రువుగా వ్యవహరిస్తున్న వారి కోసం ఆసరాను సమ కూర్చడం వారి ఉద్దేశ్యం అని తెలియజెయ్యడమేకాక లోగడ నువ్వు చేసిన వాగ్దానాన్ననుసరించి ఆ మస్జిద్‌కు వెళ్ళకు అని ఆదేశించాడు కూడా: ''నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు. అయితే తొలినాటి నుంచే దైవభీతి-తఖ్వా పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిల బడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్ట పడేవారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్దతను పాటించేవారిని అల్లాహ్‌ా ప్రేమిస్తాడు''. (తౌబా:108)
ముస్లింల మధ్య మనస్పర్థల్ని సృష్టించే ఉద్దేశ్యంతో నిర్మితమైన ఎలాంటి విగ్రహ ప్రతిమలు లేని మస్జిద్‌లలోనే నిలబడకూడదు, వాటిని కూల్చేయాలని అల్లాహ్‌ా అదేశిస్తున్నప్పుడు, నేడు ముస్లింల విశ్వాసానికి తూట్లు పొడవాలన్న, వారి పురోభివృధ్దిని అసలు కారక మైన తౌహీద్‌ను అడుసులో తొక్కెయ్యాలన్న ఉద్దేశ్యం పునాదిగా కుత్సిత మతుల కుయుక్తులతో నిర్మించబడిన శవాలు పూడ్చబడిన దర్గాల గురించి ఇస్లాం ఎలాంటి ఆదేశాలు కలిగి ఉంటుందో సుమతులైన సమాలోచనాపరులు సునిశితంగా ఆలోచించాలి. అలాగే పాక్షికమైన కొన్ని విభేదాలను ప్రధానమయినవిగా చిత్రీకరిస్తూ కేవలం దైవారాధన కోసం నిర్మించబడే మస్జిద్‌లను కూల్చడం, కాల్చడం ఎంతటి భయం కర నేరమో యోచించాలి. అదే పని ఒక ముస్లిమేతరుడు చేస్తే కాఫిర్‌ (అవిశ్వాసి-తిరస్కారి), నరకవాసి అని ఫత్వాలు జారీ చేసే పండిత మహాశయులు ఆయా సమాధుల్లో గల వ్యక్తుల పట్ల అభిమానంతో భావోద్రేకాలకు లోనవ్వకుండా ధర్మం చెప్పే తీర్పుకి, చూపే న్యాయాని కి తల వంచాలి. అలా వంచిన నాడే మళ్ళీ ముస్లిం సమాజం నిండు స్వేచ్ఛతో తలెత్తుకుని పురోగమనం వైపు సాఫీగా అడుగెయ్యగలదు. ఇహంలో విజేతగా నిలిచి, పరంలో స్వర్గవాసిగా నీరాజనాలందుకొ గలదు.
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: 'ఓ అజ్ఞానుల్లారా! అల్లాహ్‌ాను వదలి ఇతరుల ను పూజించమని మీరు నాకు ఆజ్ఞాపిస్తున్నారా?' అని ఓ ప్రవక్తా వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకు, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం ఇది: ''ఒకవేళ నువ్వు గనక బహు దైవారాధన (షిర్క్‌)కు పాల్పడితే నువ్వు చేెసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేర్తావు. కాబట్టి, నువ్వు మాత్రం (ఒక్కడైన) అల్లాహ్‌ానే ఆరాధించు. అనంతరం అనవతరం కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో''.
(జుమర్‌: 64-66)
షైతాన్‌ ఎత్తుగడలు

పషైతాన్‌ ఎత్తుగడలు, కుట్రలు, పన్నాగాలు అనేకం. అతని ఇంద్రజాలం మరియు విష వలయాల్లో ఒకటి-మనిషికి సిరి సంపదలు ప్రాప్తమయితే అతనిలో వ్యతిరేక భావావేెశాల్ని పురి గోల్పుతాడు. తత్కారణంగా అతను తన ఆస్తి అంతస్థులని చూసు కొని మిడిది పడుతూ మైమరచి ప్రవర్తిస్తాడు. దైవ దాసుల్ని చీడపురుగుల్లా భావించే అహం అనే మహమ్మారి వాతన పడ తాడు. ఫలితంగా దైవాన్ని విస్మరించి ఇతర విషయాలపై మనసు లగ్నం చేస్తాడు. 
పసోమరితనం, బద్ధకం షైతాన్‌ గుణాలు. విశ్వాసులు కూడా
వీటికి బానిస అవ్వాలని షైతాన్‌ అభిలషిస్తాడు.
పబజారులో మొదటి వ్యక్తి ప్రవేశంతోపాటే షైతాన్‌ బృందాలు
కూడా రంగురంగుల జెండాలతో ప్రవేశిస్తాయి. చివరికి వ్యక్తి
బజారు నుండి వెలుపలికి రాగ అవీ బైటకొస్తాయి.
పఒంటరిగా ఉన్న వ్యక్తితో షైతాన్‌ ఉంటాడు. ఇద్దరైపోతే తను
పారిపోతాడు.
పషైతాన్‌ మీ వద్దకు వచ్చి, మిమ్మల్ని ఎవరు పుట్టించాడు? అని ప్రశ్నిస్తాడు. దానికి అల్లాహ్‌ా అన్న సమాధానం ఇవ్వబడుతోంది. ఆ తరువాత మళ్ళి మిమ్మల్ని మీ పూర్వీకుల్ని పుట్టించింది ఎవరు? అని మళ్ళి ప్రశ్నిస్తాడు. అల్లాహ్‌ా అని సమాధానం ఇవ్వబడు తోంది. చివరికి అల్లాహ్‌ాను పుట్టించిందెవరు? అని అడుగుతాడు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు-'నేను అల్లాహ్‌ాను మరియు దైవప్రవక్త (స)ను విశ్వసించాను' అనండి. అంతే షైతాన్‌ మీ నుండి దూరంగా పారిపోతాడు.
పషైతాన్‌ రక్తం ప్రవహించినట్లు మీ నరనరాల్లో ప్రవహిస్తుం
టాడు.
పఒకరి పాపాల వల్ల అల్లాహ్‌ా అతన్ని నాశనం చేయాలను కుంటే, అతనిలో సిగ్గు లేకుండా చేస్తాడు. అతనిలో సిగ్గుబిడి యాలు దూరమైన తరువాత అతనికి ప్రజలంటే విరక్తి కలుగు తోంది. ప్రజలు సయితం అతన్ని అసహ్యించుకుంటారు. ఈ పరిస్థితి గనక దాపురిస్తే 'అతని నుండి సచ్చీలత' గుణం కూడా దేవుడు తీసుకుంటాడు. అలా అతను నమ్మకద్రోహిగా మారిపో తాడు. అప్పుడు అతన్నుండి తన కరుణ కటాక్షాల్ని కూడా లాక్కుం టాడు. ఆ విధంగా అతను దైవం నుండి ధిక్కరించబడిన దౌర్భా గ్యుడవుతాడు. ఆ తరువాత అతన్నుండి 'ఇస్లాం' శాంతి సుస్థిరతల ను దూరం చేస్తాడు.
పఅహం, గర్వం అనేది 70 ఏండ్ల ఆరాధనను వృధా చేస్తుంది.
కోపం, క్రోధం, తొందరపాటు షైతాన్‌ తరపు నుండి. షైతాన్‌ అగ్గితో సృజించబడ్డాడు. అగ్గిని జలం ఆర్పివేెస్తుంది. కనుక మీకు కోపం వచ్చినప్పుడల్లా వుజూ చేసుకోండి అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స)
.

మృదువుగా సలహా ఇవ్వాలి
'ఎవరయితే ఇతరుల తప్పులను క్షమిస్తారో అల్లాహ్‌ా వారి తప్పులను క్షమిస్తాడు' అని మానవ మహోపకారి ముహమ్మద్‌ (స) వారు సెలవి చ్చారు. మనం బజార్లలో తిరుగుతూ ఉంటాము. చెత్తాచెదారం చుట్ట ప్రక్కల పేరుకొని ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒకటి రెండు ముల్లులయితే తీసేస్తాము. అధికంగా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా తెలియజేస్తాం. అంతేకాని చెత్తను అధికంగా వ్యాపింపజేయలేం కదా! అలాగే మనం ఇతరులతో ఏవైనా లోపా లుంటే వారి మనసు గాయపడకుండా సర్ది చెప్పి, వారిని మార్చడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని అందరితో చెప్పి పరువు తియ్యం కదా! ఒక వేళ మనం చెప్పినా వినకపోతే అతని విజ్ఞతకే వదిలి వేస్తాం.

హజ్రత్‌ ఉమర్‌ ఫారూక్‌ (ర) ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు రాత్రిళ్ళు గస్తీ తిరుగుతుంటారు. ఆయన వెంట అబ్దుల్లా అనే అనుచ రుడు కూడా ఉన్నాడు. వీరికి ఒక ఇంటిలో నుంచి వెలుతురు కనబ డింది. హజ్రత్‌ ఉమర్‌ (ర) ఆ ఇంటిలోకి ప్రవేశించి చూడగా ఒక వృద్ధుడు మద్యం సేవిస్తూ కనబడ్డాడు. వెంటనె ఆయన ఆగ్రహోదగ్రు డయ్యారు. 'ఈ వయసులో మద్యం సేవించడానికి నీకు సిగ్గుగా లేదు?' అని నిలదీశారు. అప్పుడా వృద్ధుడు 'మీరు రెండు తప్పులు చేశారు. ఒకటి - నా ఇమట్లో నా అనుమతి లేకుండా ప్రవేశించారు. రెండోది - పనికట్టుకొని నా లోపాలను వెతుకుతున్నారు' అన్నాడు. ఈ మాటలు విన్న హజ్రత్‌ ఉమర్‌ (ర) వెంటనే తిరిగి వచ్చేశారు. కొంత కాలం తర్వాత ఆ వృద్దుడు హజ్రత్‌ ఉమర్‌ గారి సభలో కూర్చొని ఉన్నాడు. ఉమర్‌ (ర) పిలిచారు. వృద్ధుడు శిక్షిస్తారేమోనని భయ పడ్డాడు. అప్పుడు ఉమర్‌ (ర) వృద్ధునితో 'నేను నీ తప్పుని ఎవరితోనూ చెప్పలేదు. కనీసం నా వెంట ఉన్న అబ్దుల్లాతో కూడా!' అన్నారు. అప్పుడా వృద్ధుడు 'నేను కూడా మద్యం సేవించడం మానేస్తున్నాను. అందుకు మీరే సాక్షి' అన్నాడు.

ఇలా మనం చెప్పేది సమసరస భావంతో సలహా ఇస్తే ఎంతటి కఠినుడైనా ఇన్షా అల్లాహ్‌ా తప్పక మారగలడు. అలాగే అద్ధం అందరినీ ప్రతిబింబిస్తుంది. కాని అది ఒకరి లోపాలను మరొకరికి నివేదించదు. అందరి రహస్యాలను తనలో దాచుకుంటుంది. ఎవరి లోపాలైనా చెప్పి నప్పుడు అతను కోపంతో ఒకవేళ దాన్ని పగులగొట్టినా ఆ ముక్కల్లోంచి చూస్తే మళ్ళీ అదే లోపం కనిపిస్తుమది. అంతేగాని పగిలిపోయాను కదా అని అబద్ధం చెప్పదు. అదే విధంగా మనం కూడా ఎంతటి క్లిష్ట స్థితులు ఎదురైనా, ఎంతటి బాధలు పడాల్సి వచ్చినా, ఎన్ని కష్టాలు భరించాల్సి వచ్చినా మంచిని విడనాడకూడదు. వీలైనంత వరకూ సమాజంలో సంస్కరణలకు పునాది వేయాలే తప్ప మనకెందుకులే అని మన స్వార్థం మనం చూసుకోకూడదు. దైవం ప్రసాదించిన ఈ విలు వైన శరీరాన్ని ఎంతో కొంత నిస్వార్థంగా జీవితం సాగించడంలోనే నిజమైన ఆనందం ఉంది. ఆందులోనే పరలోక సాఫల్యం ఉంది.
దైవ ప్రవక్త (సఅసం) సమాధిని మస్జిదె నబవీలోనికి
తీసుకోవటంలోని ఔచిత్యం?

సందేహం: ఇంతకీ మహాప్రవక్త (సఅసం) వారి సమాధిని మస్జిదె నబవీ లోపలికి తీసుకోవటంలోని ఆంతర్యం ఏమిటి?
సమాధానం: ''యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్‌ా శాపం పడుగాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిద్‌ (సాష్టాంగ ప్రణామ స్థలం) గా చేసుకున్నారు'' అని మహాప్రవక్త (సఅసం) ప్రవ చించారు (బుఖారీ, ముస్లిం).
వేరొక హదీసు ద్వారా కూడా రూఢీ అయ్యేదేమిటంటే హజ్రత్‌ ఆయిషా (ర.అన్‌హా) కథనానుసారం - ఉమ్మె సలమా, ఉమ్మె హబీబాలిద్దరూ (ర.అన్‌ హుమా) దైవప్రవక్త (స) దగ్గర ఒక చర్చీ గురించి ప్రస్తావించారు. ఆ చర్చీలో చిత్ర పటాలు, విగ్రహాలు ప్రతిష్ఠించి ఉండటం తాము చూశామని వారు చెప్పగా, ఆయన (సఅసం) ఇలా అన్నారు; ''వారు (గ్రంథంగల ప్రజలు) తమలోని పుణ్య పురుషులు చనిపోయినప్పుడు వారి సమాధులపై ఆరాధనాల యాన్ని నిర్మించి, వాటిలో వారి చిత్రపటాలను ఆవిష్కరించేవారు. అల్లాహ్‌ా దృష్టిలో అత్యంత నికృష్ట జనులు వీరే''. (బుఖారీ, ముస్లిం).
ఇంకొక హదీసు -
ఇమామ్‌ ముస్లిం (రహ్మ.లై) గారు తన సహీహ్‌ా ముస్లింలో హజ్రత్‌ జున్దుబ్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ా (రజి) ఉల్లేఖనాన్ని పొందుపరిచారు. దానిప్రకారం ఆయనిలా అన్నారు: దైవ ప్రవక్త (సఅసం) చెప్పగా నేను విన్నాను - ''జాగ్రత్త! మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల, సజ్జనుల సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు. మీరు మాత్రం అలాంటి చేష్టలకు ఒడిగట్టకండి అని నేను మీకు తాకీదు చేస్తున్నాను''.
హజ్రత్‌ జాబిర్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం ''మహనీయ ముహమ్మద్‌ (సఅసం) వారు సమాధులను పటిష్ట పరచటాన్ని, వాటిపై కూర్చోవటాన్ని, వాటిపై నిర్మాణాలు చేపట్టడాన్ని వారించారు''.
(ముస్లిం)
పైన పేర్కొనబడిన ప్రామాణిక హదీసులను బట్టి ఎట్టి పరిస్థితిలోనూ సమాధులను 'సజ్దా' స్థలాలుగా చేసుకోరాదని స్పష్టంగా విదిత మవుతోంది. అలాగే గోరీలపై నిర్మాణం చేయటం, గుంబదులు వంటివి కట్టడం కూడా అధర్మమే. ఎందుకంటే ఇవన్నీ ప్రజలను దేవుని ఏక త్వం నుండి దూరం చేసి, షిర్క్‌ (బహుదైవోపాసన) కు మార్గం తెరు స్తాయి.
ఇక ప్రవక్త (సఅసం) సమాధిని మస్జిద్‌ లోపలికి తీసుకోవటం గురించి చెప్పుకుందాం -
దైవప్రవక్త (సఅసం) గానీ, ఆయన గారి ఇద్దరు ప్రియ సహచరులు (అబూబక్ర్‌, ఉమర్‌) గానీ వాస్తవానికి మస్జిద్‌ లోపలి భాగంలో ఖననం చేయబడలేదు. నిజానికి వారు ముగ్గురూ హజ్రత్‌ ఆయిషా (ర.అన్‌హా) నివసించే కుటీరంలో ఖననం చేయబడ్డారు. అయితే మస్జిద్‌కు వచ్చేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండటం వల్ల వలీద్‌ బిన్‌ అబ్దుల్‌ మలిక్‌ కాలంలో మస్జిదె నబవీ విస్తృతి జరిగింది. ఆ సందర్భంగా - హి. మొదటి శతాబ్ది చివర్లో - హజ్రత్‌ ఆయిషా (ర.అన్‌హా) గారి కుటీరం కూడా మస్జిద్‌లో విలీనం చేసుకోబడింది.
తత్కారణంగా దైవ ప్రవక్త (సఅసం) సమాధితోపాటు, ప్రియ సహచరులిద్దరి సమాధులు కూడా ఆ విలీన స్థలంలో అంతర్లీనమై నాయి. కాబట్టి ఇది మస్జిద్‌లోపల జరిగిన ఖనన సంస్కారం అని చెప్పటం సరైనది కాదు. ( - షేఖ్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ బాజ్‌ - రహ్మ)

ఫోన్‌లో 'మైనె ఖుబూల్‌ కియా' అంటే సరిపోతుందా?
సందేహం: ఈ మధ్య ఇంటర్‌నెట్‌, ఫోన్ల ఆధారంగా ఎన్నో చోట్ల నికాహ్‌ాలు (వివాహాలు) జరుగుతున్నాయి. ఈ రకమైన వివాహాలు షరియతు పరంగా ధర్మబద్ధమేనా?
సమాధానం: నికాహ్‌ాలో 'ఏజాబ్‌ వ ఖుబూల్‌' (ప్రతిపాదన, ఆమోదం) కీలకమైనది. వివాహబంధంలో ఇమిడిపోయే నూతన వధూవరులు కూడా స్వయానా ఈ తంతు జరుపుకోగలరు. లేదా వారిరువురి తరఫు 'పెద్ద మనుషులు' కూడా జరిపించగలరు. ఒక సారి దైవప్రవక్త (సఅసం) ఒక వ్యక్తినుద్దేశించి, ''నీ వివాహం ఫలానా స్త్రీతో జరిపించమంటావా?'' అని అడగ్గా ''సరే'' నని ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడాయన (సఅసం) వారిరువురికీ నికాహ్‌ా జరిపిం చారు (సుననె అబుదావూద్‌).
నికాహ్‌ా (వివాహం) కోసం షరీయతు ప్రకారం నాలుగు మూలాంశాలుంటాయి. (1) వధువు అంగీకారం (2) ఆమె సంరక్ష కుని అనుమతి (3) మహర్‌ సొమ్ము నిర్థారణ (4) సాక్షులు. నికాహ్‌ా సందర్భంగా ఈ షరతులు పూర్తవ్వాలి. అన్యధా అట్టి నికాహ్‌ా సరైనది కాదు.
ఇక ఫోన్‌ లేదా ఇంటర్‌నెట్‌ సంభాషణ ద్వారా నికాహ్‌ా విషయానికి వస్తే - అందులో 'ఖుబూల్‌' చేసే వ్యక్తి గురించి పెళ్ళి కూతురు తరఫువారు 'ఆ వ్యక్తి అతనే' నని నిజ నిర్థారణ చేయాలి. అంటే ఆ స్థలంలో 'వరుడు' ఉండడు. కానీ దూర భాషణ ద్వారా అతని 'ఆమోదకంఠం' మాత్రం వినబడుతుంది. ఆ వివాహ మహో త్సవానికి విచ్చేసిన వధువు తరఫువారు, సాక్షులు, ఇతర బంధు మిత్రులు ఒక నిర్థారణకు వస్తారు. ఇలాంటి 'నికాహ్‌ా'లో షరీయతు పరంగా ఎలాంటి దోషం లేదు. కాకపోతే ఇంతకు ముందు పేర్కొన బడిన నికాహ్‌ా 'నియమ నిబంధనలు' పరిగణనలోకి వచ్చి ఉండాలి. (నిజము దేవుడెరుగు)
నమాజులో తల్లిదండ్రుల కొరకు 'దుఆ' చేయవచ్చా?
సందేహం: ఫర్జ్‌ నమాజులో తల్లిదండ్రుల కోసంగానీ, వేరితరుల కొరకుగానీ 'దుఆ' చేయటం సమ్మతం కాదని కొందరంటున్నారు. ఇది నిజమేనా?
సమాధానం: నమాజులో దుఆ - తన కోసం చేసుకున్నా, తన తల్లి దండ్రుల, వేరితరుల కోసం చేసుకున్నా - ఆక్షేపణీయం ఏమీ కాదు. ''దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంలో ఉండేది 'సజ్దా' స్థితిలోనే కాబట్టి మీరు (ఆ స్థితిలో) అత్యధికంగా దుఆ చేసుకోండి'' అని మహనీయ ముహమ్మద్‌ (స) వారు ఉపదేశించారు (ముస్లిం).
ఆయన (సఅసం) ఇంకా ఈ విధంగా ప్రవచించారు; రుకూలో మీ ప్రభువు ఔన్నత్యాన్ని కీర్తించండి. సజ్దాలో మాత్రం అత్యధికంగా వేడుకోలు చేయండి. బహుశా మీ వేడుకోలు ఆమోదించబడవచ్చు. (ముస్లిం)
హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ మస్‌వూద్‌ (రజి) ఇలా అన్నారు: మహా ప్రవక్త (సఅసం) తనకు తషహ్హుద్‌ నేర్పిన తర్వాత ఇలా ఉద్బోధించారు - ''ఇక నీవు నీకు ఎంతో ఇష్టమైన దుఆను ఎంపిక చేసుకుని దుఆ చెయ్యి. లేదా నీకు కావలసినది కోరుకో (వేడుకో)'' అన్నారు. (బుఖారీ, ముస్లిం)
కాబట్టి ఎవరయినా నమాజు ముగించక ముందే సజ్దా స్థితిలో గాని, ఖాయిదా స్థితిలోగానీ తన కోసం లేదా తన మాతాపితల కోసం, ఇంకా సమస్త ముస్లిముల కోసం వేడుకుంటే అది అభ్యంతర కరం ఏమీ కాజాలదు. ఇది ధర్మసమ్మతమే.
-షేఖ్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ బాజ్‌ (రహ్మ.లై)

వికసించే ఈ లేత మొగ్గలను కాపాడుకోండి
ప్రవాసాంధ్ర సోదరులారా!

దేవుడు మిమ్మల్ని విదేశాల-కు చేర్చాడు. జీవనోపాధిని సమకూర్చాడు. మీరు మీ కాళ్ళపై నిలబడగలిగారు. ఓ ఇంటి వారయ్యారు. దేవుడు మీకు పండంటి బిడ్డలను కూడా ప్రసాదించాడు. అక్కడ మీ ఇల్లు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే ఇక్కడ మీరు వారి గురించి నలుగురితో చెప్పుకుని, వారి ఫోటోలు చూపించుకుని ఆనందిస్తున్నారు. నిజంగా ఈ ఆనందం వెలకట్టలేనిది. సదా మీ ఇల్లు ఇలాగే కళకళ లాడాలన్నది, మీ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలన్నది మా ఆకాంక్ష.

అయితే మీరు పెంచే పూవనంలోని ముసిముసి నవ్వుల పాలబుగ్గలు, వికసించే లేత మొగ్గలు మున్ముందు మీకు కన్నుల పండుగ కావాలంటే, మీ చల్లని లోగిలిలో ఆనందం నిండాలంటే, అనురాగం పండాలంటే వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికెలాంటి తెగులు పట్టకుండా, కాలుష్యం కాటేయకుండా కాపాడుకోవాలి. అంటే పసితనం నుండే ధార్మికంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలి. సంస్కారం నేర్పాలి. కుటుంబ విలువలను, నైతిక విలువలను నూరిపోయాలి. స్కూలు చదువుతోపాటు, దీని తాలీమ్‌ కూడా ఇవ్వాలి. మీ మీ పేటలలోని మస్జిద్‌లలో జరిగే ఖుర్‌ఆన్‌ బోధనా తరగతులకు వారిని పంపుతూ ఉండాలి. ముఖ్యంగా వేసవి సెలవులలో వారి సమయం వృధా కానివ్వ కుండా - స్థానిక దీనీ సంస్థలు కండక్ట్‌ చేసే శిక్షణా క్లాసులకు మీ పిల్లల్ని పంపించాలి. వీటన్నింటితో పాటు పిల్లల హోంవర్క్‌ను, వారి దిన చర్యలను శ్రద్ధగా వాచ్‌ చేస్తూ ఉండాలి.
తండ్రులు తమ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత తల్లులపై అధికంగా ఉంటుంది. అయినాసరే అడుగడుగునా తండ్రుల గైడెన్స్‌ అవసరం. కాబట్టి మీరు తరచూ ఇంటికి ఫోన్‌ చేసి పిల్లల చదువు సంధ్యల గురించి ఆరాతీయటంతో పాటు, వారు నమాజు చేస్తున్నారో లేదో నిలదీసి అడగాలి. మస్జిద్‌కు వెళ్ళి మరీ నమాజు చేస్తున్నారా లేదా అని మగపిల్లల్ని అడగాలి. అమ్మ మాట వినాలని పిల్లలకు తాకీదు చేస్తూం డాలి. అలాగే - ''మన పిల్లలే మన అసలు ఆస్తి'' అని భార్యకు పదే పదే నొక్కి చెబుతుండాలి.
బ్రతుకు తెరువుకోసం విదేశాలకు వెళ్ళిన చాలా మంది సోదరులు ఆర్థికంగానైతే బాగానే ఉంటారుగాని పిల్లల శిక్షణలో మాత్రం వెనుకంజ వేస్తారు. తత్కారణంగా వారి పిల్లలు నైతికంగా దెబ్బతింటారు. వారిలో విచ్చలవిడితనం వచ్చేస్తుంది. ఇంట్లో డబ్బు ఉంటుంది. అడగంగానే కోరిక తీర్చే అమ్మ ఉంటుంది. టెన్త్‌ పూర్తి కాక ముందే చేతిలో మొబైల్‌ ఫోన్‌, మోటర్‌ బైక్‌ వచ్చేస్తుంది. దాంతో పిల్లల ఊహలకు రెక్క లొచ్చేస్తాయి.

ప్రవాసాంధ్ర సోదరా!
మీరు గనక శ్రద్ధ వహిస్తే, అక్కడ మీ ఇల్లాలు కూడా మీ పిల్లల్ని అదుపులో ఉంచి, సంస్కారవంతుల్ని చేయగల్గుతుంది. వర్తకం నిమిత్తం దూర దేశాలకు వెళ్ళే ఎంతో మంది పురుషుల ధర్మపత్నులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వగలిగారని చరిత్ర చెబుతోంది. హజ్రత్‌ సుఫియాన్‌ సౌరీ (రహ్మ) గారి తల్లినే చూడండి, పేదరికంలో మ్రగ్గుతూ కూడా దూది ఏకి తన కొడుకుని చదివించారామె. పైగా ఆమె తన పిల్లాడికి తరచూ చెబుతుండేది - ''నాయనా! నువ్వు ఎప్పుడు పది వాక్యాలు నేర్చుకున్నా, వాటి ద్వారా నీ భక్తిలో, సభ్యతా సంస్కార్లాల్లో, వినయ వినమ్రతలలో ఏపాటి ఎదుగుదల వచ్చిందో బేరీజు వేసుకో. ఒకవేళ ఎదుగుదల లేకపోతే ఈ చదువు వల్ల నీకు కలిగింది కీడేగాని, మేలు కాదు అని గుర్తుం చుకో''.
ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ) గారి గురువు అయిన రబీఅతుర్రాయ్‌ (రహ్మ) ఉదాహరణను తీసుకోండి - ఈయన పసివాడుగా ఉన్నప్పుడు తండ్రి 30 వేల దీనార్లు ఇల్లాలికి ఇచ్చి, ఒక ముఖ్యమైన పనిపై విదేశానికి వెళ్ళిపోయారు. బాధ్యత గల ఆ ఇల్లాలు ఆ డబ్బంతా ఆ అబ్బాయి చదువు కోసం వెచ్చించి అతన్ని ఆ కాలపు సాటిలేని మేటి విద్వాంసునిగా తీర్చి దిద్దింది. సుదీర్ఘకాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి, తన కుమారుని పాండిత్యాన్ని చూసి ఆనందంతో పరవశించిపోతాడు.
పసిపిల్లలు ప్లెయిన్‌ పేపర్‌ లాంటివారు. దానిపై ఏది గీస్తే అదే ముద్రపడుతుంది. ''మొక్కై వంగనిది మ్రానై వంగునా!?'' అన్న సామెతను జ్ఞప్తికి తెచ్చుకోండి. లేత వయసులో మనం మన పిల్లల్ని ఎలా మలచుకుంటే అలాగే తయారవుతారు. కాబట్టి తల్లి దండ్రులు తమ పిల్లల మంచి శిక్షణకై జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు వారు స్వయంగా పిల్లలకు ఆదర్శప్రాయులుగా ఉండాలి. విదేశాల్లో ఉండే తండ్రులు వీలైనంత త్వరగా సెలవుపై వెళుతుండాలి. సాధ్యమైనంత ఎక్కువ సమయం ఆలుబిడ్డలతో గడపాలి.
(1) ఇంట్లో చిన్నతనం నుంచే పిల్లలకు 'సలాం' చేయటం నేర్పాలి. కలిమాలు కంఠస్థం చేయించటంతోపాటు వాటి భావార్థాన్ని విడమరచి చెప్పాలి. (2) బాల్యం నుంచే నమాజు పట్ల శ్రద్ధాసక్తులను కలిగించాలి. ఏడేండ్లు వచ్చాక నమాజు చేయమని ప్రోత్సహించాలి. పదేండ్ల ప్రాయంలో నమాజుకై గట్టిగా ఆదేశించాలి. ఈ వయసులో పిల్లల పడకలను కూడా వేరుచేయాలి. (3) దుర్భాషలకు, దురాచారాలకు, చెడు సావాసాలకు వారిని దూరంగా ఉంచాలి. (4) ముఖ్యంగా ఆడ పిల్లల్లో సిగ్గు, బిడియం, అణకువను చిన్నప్పటి నుండే ఒంట బట్టించాలి. పసితనం నుంచే సంస్కారవంతమైన వస్త్రధారణ గురించి నొక్కి చెప్పాలి. (5) పిల్లలను చాలా జాగ్రత్తగా, సూక్ష్మదృష్టితో గమనిస్తూ ఉండాలి. అంటే - వారి సావాసాలు ఎలాంటివి? ఎక్కువ సమయం వారు ఎవరితో గడుపుతున్నారు? వారి రోజువారి కార్యక్రమాలేమిటి? లాంటి విషయాలను అబ్జర్వ్‌ చేస్తుండాలి.
వేళాకోళానికి కూడా పిల్లల ముందు చెడు అనరాదు. ఆడిన మాట తప్పరాదు. అబద్ధాలు చెప్పరాదు. వెకిలి సైగలు చేయరాదు. ఇతరులను చెడు పేర్లతో పిలవరాదు. పైగా పిల్లల వల్ల జరిగే తప్పులను ఎప్పడికప్పుడు సరిదిద్దుతూ ఉండాలి. వారు చేసే ప్రతి మంచి పనిపై 'శభాష్‌!' అంటూ ఎంకరేజ్‌ చేస్తుండాలి.

కమ్యూనిజంకంటే ఉన్నతమైన వ్యవస్థ
ట్టుబడిదారీ వ్యవస్థ వెన్నెముకను విరిచే సిద్ధాంతాలు రెండు - ఒకటి కమ్యూనిజం, రెండోది ఇస్లాం.
ఇక్కడ (భారత దేశంలోని) కమ్యూనిస్టుల్లో కొంతమంది మాత్రమే 'దాస్‌ కాపిటల్‌' ( )ను లోతుగా అధ్యయనం చేసి ఉంటారు. మార్క్స్‌ సిద్ధాంతాలలో 'మిగులు విలువ' ( ) అన్నదొకటి. ఈ సూత్రాన్ని మార్క్స్‌ మూడు గ్రంథాల్లో విశదీకరించాడు.
పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడతాడు. శ్రామికుడు తన శ్రమతో ఆ పెట్టుబడికి లాభం చేకూరుస్తాడు. ఈ లాభం అసలు మూల ధనం కంటే అధికంగా ఉంటుంది. ఈ అధికాదాయంతో పెట్టుబడిదారుడు మరో ప్యాక్టరీ స్థాపనకు పూనుకుంటాడు. ఈ విధంగా అతడు సామాన్యుల్ని దోచుకుంటాడు- ఇదీ కమ్యూనిజం వాదన, ఈ స్థితిలో కమ్యూనిజం రంగప్రవేశం చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు అసలు బలమైన ఈ 'మిగులు విలువ'ను అంతమొందించగోరుతుంది. అది పెట్టుబడిదారీ వ్యవస్థను తుదముట్టించి ఉత్పత్తి సాధనాలన్నింటినీ జాతీయం చేసుకుంటుంది.
పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల సమస్య పరిష్కృత మవుతుందా? అన్నది ఆలోచించవలసిన విషయం. జాతీయం చేయబడిన పరిశ్రమల నుండి కూడా మిగులు విలువ ఉత్పన్నమవుతుంది. ఈ లాభాన్ని ఎటు తరలించాలన్నది ప్రశ్న. నేడు ఆచరణాత్మకంగా ఈ లాభం ఏమవుతుంది అన్నదాన్ని కూడా చూడాలి.
ముందు పరిశ్రమలు జాతీయం చేయబడతాయి. వాటినుండి వచ్చే లాభంలో కొంత భాగం కార్మికులకు ఇవ్వబడుతుంది. మిగతా ప్రజలకు ఏమీ లేదు.
ఏదైనా పరిశ్రమ వల్ల వచ్చే లాభంలో కేవలం ఆ పరిశ్రమలో పని చేసే కార్మికులకు మాత్రమే భాగం లభిస్తుంది. ఇతర రంగాల్లో పని చేసే శ్రామికులు, దేశంలోని నిరుపేదలు, నిరాధార జీవులకు ఇందులో ఎలాంటి వాటా లేదన్న మాట. జాతీయకరణ ఉద్దేశం ఇది కారాదు. లాభం అన్నది యావత్తు జాతి ప్రజలకు పంపిణీ కావాలి.
కమ్యూనిస్టు ప్రభుత్వం శాసన దండంతో ఈ లాభాన్ని ఒకరి నుండి లాక్కొని మరొకరికి ఇస్తుంది. దీనికి భిన్నంగా ఇస్లాంలో, మిగులు విలువ ( )ను - దానికి అర్హులైన వారందరికీ పంచేందుకు ప్రేరేరింపజేయడం జరుగుతుంది. దాని గురించి ఉపదేశించబడింది కూడా. ఇస్లాంలో ఈ పంపిణీ వెనుక ప్రేరణ శక్తి ప్రభుత్వ ఒత్తిడి కాదు- విశ్వాస బలమై ఉంటుంది.
కమ్యూనిస్టు దేశాల్లో పరిశ్రమల్ని మాత్రమే జాతీయం చేయడం జరుగుతుంది. ఆదాయం పంపిణీ అయ్యేదేదో ఆ పరిశ్రమల్లోనే అవుతుంది. ఇక వ్యక్తుల ఆధీనంలోనున్న ఆస్తిపాస్తులపై వచ్చే లాభాల పంపిణీకి సంబంధించిన భావన లేనే లేదు. ఆచరణాత్మకంగా కూడా అలాంటి ఏర్పాటేదీ ఉన్నట్లు కానరాదు. కాని ఇస్లాం, వ్యక్తుల ఆదాయంలోని 'మిగులు విలువ'ను కూడా సమాజంలోని ఇతరులపై వెచ్చించాలని తాకీదు చేస్తోంది. మిగులు విలువలో నుండే ఒక భాగం తీసి సత్కార్యాలకై ఖర్చు చేయడాన్ని జకాత్‌ అనంటుంది ఇస్లాం. అరబీ బాషలో 'జకాత్‌' అంటే పరిశుద్ధపరచుట అని అర్థం. వ్యక్తులు తన ఆదాయంలోని ఒక భాగాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడమే జకాత్‌. అంటే జకాత్‌ ఇచ్చి మనిషి తన ధన సంపత్తిని పరిశుద్ధ పర్చుకుంటాడన్న మాట. అలా చెయక పోతే అతని యావత్తు ధనసంపద అశుద్ధమైపోతుంది. ఇంతటి ఉన్నతమైన బోధన, శిక్షణలు ప్రపంచంలో కేవలం ఇస్లాం మాత్రమే ఇచ్చింది. ధనంలో నుండి కొంత భాగం మంచి పనులకై ఖర్చు పెట్టే ప్రబోధనలైతే ఆ మతం యొక్క సిఫారసులు మాత్రమే కదా. ధనవంతుడైనా మోసగించదలిస్తే అతన్ని దాన్నుంచి వారించేదెలా? అని ఎవరైనా ఆక్ష్షేపించవచ్చు.
అయితే ఈ ఆకేపణకు సమాధానం మనకు చరిత్రలో లభిస్తుంది. జకాత్‌ ఇవ్వడానికి నిరాకరించినవారికి వ్యతిరేకంగా ప్రథమ ఖలీఫా హజ్రత్‌ అబూబకర్‌ సిద్దీఖ్‌ (రజి) కరవాలం చేబూనారు. నిజానికి నాడు జకాత్‌ను తిరస్కరించినవారు బాహ్యంలో ముస్లింలే. ఇస్లాం ధర్మావలంబీకులే. విశ్వాసులు, మహనీయ ముహమ్మద్‌ (స) అనుయాయులు, నమాజ్‌ను ఆచరించేవారయిన ముస్లింలకు వ్యతిరేకంగా ఈ కరవాలం ఝుళిపించబడింది. వారు ఏ నేరానికి (జకాత్‌ను ఎగ్గొట్టే) పాల్పడ్డారో అది అంత కఠినమైందన్న మాట. దైవాన్ని విశ్వసించిన తర్వాత ఇస్లాం ఒక వ్యక్తిపై విధిగా మోపే బాధ్యత, చాలా గట్టిగా తాకీదు చేసే విషయం- జకాత్‌. అంటే తన ఆదాయంలో నుండి ఒక నిర్ణీత బాగాన్ని తీసి తన తోటి బలహీన సోదరులకు సహాయం చేయడం అన్న మాట.
ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే, వ్యక్తి తన సొంత ఆదాయం మరియు సొంత పెట్టుబడిలో నుండి ఇతరుల కోసం ఖర్చు చేయమని కమ్యూనిజం బోధించదు. అయితే ఇస్లాం ఈ విషయమై గట్టిగా తాకీదు చేస్తుంది- ఇటువంటి ఖర్చు తప్పక చేయాలని కోరుతుంది. ఈ ఖర్చును ఎవరైనా చెయ్యకపోతే (అతడు ముస్లిం అయినప్పటికీ) ఇస్లాం అతనికి వ్యతిరేకంగా ధ్వజమెత్తుతుంది. అందుకే ఇస్లాం కమ్యూనిజంకంటే ఉన్నతమైనది, శ్రేష్టమయినది.
సాధారణంగా పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తి తన ఈ ధనం తన సొంత సుఖభోగాలకని భావిస్తాడు. తన ఆదాయాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడం స్వయంగా లేమిని కొనితెచ్చుకోవడమేనని కూడా అతడు తలుస్తాడు. ఈ సంశయమే ప్రజల్ని సాధారణంగా సంకట పెడుతుంది.
ఇస్లాం అన్నింటికంటే ముందు ఈ భావనను వ్రేళ్ళతో సహా పెకలించి పారేస్తుంది. ఇతరులపై ఖర్చు చేయడం వల్ల సంపద తరగదు - పెరుగుతుంది అని ఖుర్‌ఆన్‌ చాటి చెబుతోంది.
''దారిద్య్ర ప్రమాదం చూపి షైతాన్‌ మిమ్మల్ని భయపెడతాడు. నీతిబాహ్యమైన, నీచమయిన మార్గం అవలంబించమని ప్రేరేపిస్తాడు. కాని మిమ్మల్ని క్షమిస్తానని, కరుణిస్తానని అల్లాహ్‌ా వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్‌ా అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు''. (బఖర - 268)
పిసినారితనం అంటే ఏమిటి? తన కోసం, తన భార్యాపిల్లల కోసం, తోటి సమాజంలోని వారి అవసరాల కోసం ఖర్చు చేయడానికి బదులు ఒక్కొక్క పైసాను కూడబెట్టడమే పిసినిగొట్టుతనం.
తమిళ సినీ పరిశ్రమలో ఒక ప్రసిద్ధ గాయకుడుండేవాడు. అతను అత్యంత పిసినారి. తన కొడుకు కాలికి గాయమైతే వైద్య చికిత్స చేయించడానికి కూడా అతను వెనుకంజ వేసేవాడు. పర్యవసానంగా అతని పుత్రుడు చనిపోయాడు. ఇదీ పిసినారితనానికి ప్రతిఫలం! ఇలాంటి పిసినారితనాన్ని, సంకుచిత హృదయాన్ని ఇస్లాం గట్టిగా వ్యతిరేకిస్తుంది.
ఇస్లాం ఇతరులకై ఖర్చు చేసేందుకు కేవలం ఉపదేశాలు మాత్రమే ఇవ్వలేదు. దాంతోపాటు ఖర్చు చేయాల్సిన నియమాలను, పద్ధతులను కూడా అది నేర్పింది. కొంతమంది ఖర్చు చేస్తారుగాని ఇతరులను దెప్పి పొడవటం, ఉపకారం చేసి తమ ప్రతిష్టను పెంచుకోవటం వారి ఆశయమయి ఉంటుంది. ఇవి, ఇంకా ఇలాంటి ఇతర ఉద్దేశ్యాలు ధర్మబద్ధం కావని ఇస్లాం చెబుతుంది. దానం చెయ్యడం ధార్మికమైన విధి అని, ఇది నమాజు తర్వాత రెండో పెద్ద అంశం అని ఇస్లాం చెబుతుంది. తోటి వారికై ఖర్చు చేసి దైవ ప్రసన్నతను బడయటం తప్ప మరే ఉద్దేశ్యం దానధర్మాలకు ఉండరాదన్నది ఖుర్‌ఆన్‌ ఉపదేశం.
నేనొక చోట చూశాను - ఒకాయన ఓ సంస్థకు ట్యూబ్‌ లైట్‌ను విరాళంగా ఇస్తూ, దానిపై తన పేరును వ్రాయించారు. ఎంత ఘోరంగా వ్రాయించారంటే - ఆ లైటు వెలుగు అసలు బయటికి రాలేదు. ఇలాంటి దానధర్మం, ఇటువంటి సహాయం కేవలం తప్పు మాత్రమే కాదు. అది అతని సకల సత్కార్యాల ప్రతిఫలాలను నాశనం చేసివేస్తుందని ఇస్లాం హెచ్చరిస్తుంది. కొంత మంది ధన సహాయమో లేక వేరే ఏదయినా సహాయమో చేస్తారు కానీ తమ పెత్తనాన్ని సహాయం పొందిన వ్యక్తిపై రుద్ద్దుతారు. తత్ఫలితంగా సహాయం పొందిన ఆ వ్యక్తి మనసు గాయపడుతుంది. ఈ పోకడలన్నీ అధర్మ మయినవని ఇస్లాం ఉద్ఘాటిస్తుంది. దివ్య ఖుర్‌ఆన్‌లో ఉంది:
మనసును గాయపర్చే దానం కంటే, మృదుభాష్యం, క్షమాబుద్ధి ఎంతో మేలయినవి''. (అల్‌ బఖర - 263)
వినోబాభావే భూదాన ఉద్యమం నడిపినప్పుడు కొందరు సారవంత మయిన భూముల్ని కూడా దానం చేసిన వారున్నారు. కాని చాలా మంది భూస్వాములు బంజరు భూములను, రాళ్ళు-రప్పలు నిండిన భూముల్నే దానం చేశారు.
తమ ఇంట్లోని చినిగిపోయిన దుస్తుల్ని, చద్ది అన్నాన్ని, విరిగిపోయిన,పగిలిపోయిన సామాన్లను ఇతరులకు దానం చేసే దాతలు కూడా కానవస్తారు. చినిగిపోయిన నోట్లను, చెల్లని నాణాలను దానం చేసే వారూ ప్రపంచంలో ఉన్నారు. కాని, ఇస్లాం మీ వద్ద ఉండే మంచి వస్తువుల్ని దానం చేయమని ప్రబోధిస్తోంది. దానం చెయ్యదలిస్తే - మీరు ఇష్టపడే దుస్తులు స్వయంగా మీరు తినే పదార్థాలు, మీకు ప్రియమైన సంపద - వీటన్నింటినీ అల్లాహ్‌ా మార్గంలో ఖర్చు చెయ్యమని తాకీదు చేస్తోంది ఇస్లాం. మీరు సంపాయించేదాన్లో అన్నింటికంటే మంచి వస్తువులను దేవుని బాటలో ఖర్చుపెట్టాలి. ఇది ఇస్లాం ఉద్బోధన. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
''విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాయించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసినదానిలోని మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఇవ్వడానికి పనికిరాని వస్తువుల్ని ఏరి తీసే ప్రయత్నం చెయ్యకండి''. (బఖర - 267)
మీరు ఇతరులకు చేసే అన్నదానమయినా, దుస్త్తులయినా లేక ధన సహాయమయినా - వీటిని రహస్యంగా ఇవ్వడం ఉత్తమ విధానమని ఇస్లాం ప్రకటిస్తోంది. అయితే బహిర్గత సహాయం చెయ్యాల్సిన అవసరం లేక స్థితి ఏర్పడితే అలా చెయ్యవచ్చు. దివ్య ఖుర్‌ఆన్‌ ఉపదేశమిది:
''మీరు మీ దానధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే. కాని రహస్యంగా నిరుపేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది''. (2: 271)
దానధర్మాల విషయంలో, ఎవరయినా ఒక త్రాగుబోతు లేక డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టేవాడు మీ వద్దకు వచ్చి సహాయం అర్ధించే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఒకవేళ అలాంటి వారికి సహాయం చేస్తే అదేమవుతుంది? ఈ ప్రశ్నలకు కూడా జవాబిచ్చింది ఇస్లాం. దుర్మార్గులకు, వ్యర్థప్రలాపనలకు పాల్పడేవారికి డబ్బు సహాయం ఇవ్వరాదన్నది ఇస్లాం ఉపదేశం. అయితే తిండి, దుస్తులు ఏర్పాటు చేయవచ్చు. దివ్య కుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
''అల్లాహ్‌ా మీ కొరకు ఏ సొమ్మునయితే జీవనాధారంగా చేశాడో, దాన్ని అవివేకులకు అప్పగించకండి. అయితే దాన్నుండి వారి అన్న వస్త్రాలకు ఇవ్వండి. ఇంకా వారికి హితబోధ చేయండి''. (అన్‌ నిసా-5)
ఇలాంటివారి తిండి, బట్ట వంటి కనీసావసరాల ఏర్పాటు పూర్తయ్యాక, ఇక ఈ విషయంలో ఇస్లాం ఇచ్చే మార్గదర్శక సూత్రాలేమిటో చూడండి:

సెకనుకి విలువ ఇవ్వలేని వారు నిమిషానికి విలువ ఇవ్వ లేరు. కొన్ని నిమిషాలు వృధా అయితే కొన్ని గంటలు వేస్ట్‌ అయినట్టే లెక్క. అలాంటి కొన్ని గంటలు కలిస్తే ఒక రోజు! ఒక నెల! ఒక సంవ త్సరం!! ఒక జీవితం!!! 

మన అదృష్టం కొద్ది రోజుకి 24 గంటలు మాత్రమే ఉన్నాయి. వాటిని సద్విని యోగ పర్చుకోలేకపోతే రోజులు వాటంతట అవే గడి చిపోతూ ఉంటాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే చేయ వలసిన పనులు ఎన్నో మిగిలి ఉంటాయి. పూర్తి చేసిన పను ల మాత్రం కొన్నే కనబడతాయి.
ప్రవక్త (స) ఇలా ప్రవచిం చారు: ''మహా గొప్ప అనుగ్రహాలు రెండు. అత్యధిక శాతం మంది ప్రజలు ఈ రెంటిని గురించి నిర్లక్ష్యానికి, ఏమరు పాటుకు గురై ఉంటారు. వాటిలో ఒకటి - ఆరోగ్యం అవగా, మరొకటి తీరిక సమయం''. (బుఖారీ)

14, మార్చి 2012, బుధవారం

kallu ela chaduvutayi

NewsListandDetails
బాలలూ! చదవడమనే ప్రక్రియలో ఒక క్రమపద్ధతిలో ఉన్న అక్షరాలు మన మెదడు గుర్తింపుకు లోనవ్ఞతాయి. కళ్లు వాటిని అదే క్రమంలో అనుసరి స్తాయి. 'లిపి విషయానికి వస్తే, మనం ఎడమవైపునుంచి కుడివైపుకు రాస్తాం. కొంతమంది కుడినుంచి ఎడమదిశగా రాస్తారు. విదేశీ భాషలలో కొన్ని పైనుంచి కిందకు అంటే నిట్టనిలువ్ఞగా రాస్తారు. బొమ్మలతోనే లిపి ఉన్న భాష కూడా ఉంది. ఆయా అక్షర సంకేతాలను ఆయా లిపులతో సంబంధం ఉన్నవారి మెదడు అర్థంచేసుకుంటుంది. ప్రాథమిక తరగతిలో మనం భాష విషయంలో ఏ తరహా శిక్షణ పొందుతామో, అదే విధంగా అక్షరాల గుర్తింపు, అవి ఏయే శబ్దాలను సూచిస్తాయో  తెలుసుకోగలగడం- ఆ తర్వాత క్రమక్రమంగా పదాలు, పదబంధాలు, వాక్యాలు, పేరాలు, వ్యాకరణం తద్వారా భాషా స్వరూపం మొదలైనవి నేర్చుకుంటుంటే ఏక కాలంలో కళ్లు, మెదడు కూడా సంయుక్తంగా శిక్షణ పొందుతాయి. ఆ తర్వాత కాలంలో చదవడమనేది అతి సహజమనిపిస్తుంది.  నిజానికి మనం చదివేటప్పుడు కళ్లు అక్షరాల మీద సమాంతరంగా కదలవ్ఞ. వేగ వంతంగా చదవాలనుకున్నప్పుడు కూడా అదే వేగంతో ప్రయాణించలేవ్ఞ. రెప్పపాటు కాలం ఆగి ఆగి, వాక్యం ప్రారంభించి, చివర వరకూ సాగి, తిరిగి రెండవ పంక్తి వద్దకు చేరతాయి. ప్రత్యేకంగా నామవాచకాలు, పారి భాషిక పదాలు (అర్థంకాని కొత్తపదాలు), గణాంకాల వద్ద క్షణకాలం ఆగు తాయి. అయితే ఇవేమీ మన స్పృహకు అందవ్ఞ. బాగా తెలిసి ఉన్న పదాలు లేదా పదం తర్వాత వచ్చే పదాలు మన ఊహకు అందిన సంద ర్భాలలో- ఆ పదాలను గూర్చి మన కళ్లు పట్టించుకోవ్ఞ. ముందుకు వెళ్లిపో తాయి. ఇక్కడే ప్రూఫ్‌రీడర్లు తప్పుచేస్తుంటారు. మన మెదడు పూర్వజ్ఞానా నికి అందని కొత్తపదాలను చదువ్ఞతున్నప్పుడు మనకు తెలిసీ, తెలియ కుండానూ కళ్లు క్షణకాలం ఆగిపోతాయి. మెదడు తనపొరలనుంచి అవగాహన తెప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో కంటి దృష్టిని రెప్పపాటు కాలం స్తంభింపజేస్తుంది. చాలా సందర్భాలలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు కళ్లు ఆ పంక్తి ప్రారంభానికి వెళ్లి చదివి ఉన్న మొదటి పదం నుంచి, ఆగిపోవలసిన పదం వరకు తిరిగి ప్రయాణిస్తాయి. ఈ అర్థంకాని పదానికి భావం స్ఫురించేవరకు కళ్లు ఆగిపోతాయి. కొంతమంది అర్థంకాకపోయినా ముందుకు వెళ్లిపోతారు. మొత్తంమీద పాఠకులందరూ ఒకే విధానంలో చదవరని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆయా సందర్భాలు, అవసరాలను అనుసరించే మనం చదివే పద్ధతులను మలచు కోవడం ఉత్తమం. మన కంటి దృష్టికి కనపడే అక్షరాలు, పంక్తులు, వాక్యాలు అన్నీ రెటీనా మధ్యలో బింబంపడే కేంద్రకంలోనూ, దానిచుట్టూ ఉన్న ప్రాంతంలోనూ, ఇంకా వెలుపలి ప్రాంతంలోనూ ఉంటాయి. ఈ మూడు ప్రదేశాలలో లభ్యమయ్యే సమాచారాన్ని మెదడు స్వీకరిస్తూనే కళ్లను చదువ్ఞమీద కేంద్రీకరింపజేస్తుంది. ఈ పరిస్థితిలో రెటీనా మధ్య లోని బింబం మధ్యభాగం దాదాపు రెండు డిగ్రీల కోణానికి పరిమితమై ఉంటుంది. అది మూడు, నాలుగు పదాలకు సమానంగా ఉంటుంది. వాస్తవంగా చదివేటప్పుడు ఈ మూడు నాలుగు పదాలకే మన దృష్టి పరిమితమై ఉండబోదు. చుట్టూ ఉన్న అక్షరాలను అస్పష్ట అవగాహనతో చూస్తూనే ఉంటాం. బాగా పరిచయమై ఉన్న పదాలను దాటివేస్తాము. వాక్యం పూర్తిగా చదవడం పూర్తయ్యేలోగా కొన్ని వాక్యాల అర్థం తెలిసి ివస్తుంది. వాక్యం చివర పదాలను చదివిన తర్వాత పూర్తి అర్థమయ్యే పరిస్థితీ ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంమీద కంటిచూపుకూ, మెదడు పనితనానికి సమన్వయం ఉండి తీరుతుందని మనం గ్రహించాలి