4, ఫిబ్రవరి 2013, సోమవారం

నరక కూపం



”మరి ఎవరయితే హద్దులు మీరి ప్రవర్తించి ఐహిక జీవితా నికే ప్రాధాన్యమిచ్చారో వారికి నరకమే నివాసమవు తుంది”.   (నాజిఆత్‌: 37-39)
ఎందరో మరణించారు. మరెందరో మరణ దూత వేయిటింగ్‌ లిస్టు లో ఉన్నారు. మనమందరం ఏదోక రోజు మరణించవలసిన వారమే. మనందరి శ్వాస ఏదోక రోజు ఆగిపోతుంది. మనమే కాదు ఈ పుడ మిపై మనుగడ సాగిస్తున్న ప్రతి ప్రాణికి మరణం ఉంది, ప్రతి వస్తువు కు నాశనం ఉంది. నిన్నటి వరకూ మనతో పాటు ఎందరో పరిచి తులు-అపరిచితులుండేవారు. వారిలో ఒకడు ప్రేమ కావాలనేవాడు, ఒకడు పెళ్ళి కావాలనేవాడు. ఒకడు ఖారూన్‌ అంతటి ఆస్తి ఉండా లని,  బిల్‌గెట్స్‌ అంతటి ఎత్తుకు ఎదగాలనుకునేవాడు. అయితే వీరిలో ఎందరి ఆశలు ఫలించాయో ఎందరి ఆశలు ఆడియాశలయ్యాయో ఆ దేవుడికే ఎరుక. ఏదిఏమయినా అందరి విషయంలో ఆ దేవుని మాట నిజమయింది: ”ప్రతి సముదాయానికి ఒక గడువు నిర్ణయ మయి ఉంది. ఆ గడువు పూర్తి అయినప్పుడు ఒక్క ఘడియ కాలం కూడా వెనకా ముందూ అవడం అనేది జరగదు”. (ఆరాఫ్‌: 34) మృత్యువు వారిని మెల్లగా తన ఒడిలోకి తీసేసుకుం టుంది…..
మనిషి చనిపోతాడు. పాము కుబుసం వదలి ముందుకు సాగిపో యినట్టు ఎంతో నాజుకూగా పెంచుకున్న గారాల దేహాన్ని వీడి మనిషి ఆత్మ పరలోకానికి పయనమవుతుంది. దానికి భౌతిక నేత్రాలయితే లేవుగానీ అది చూడగలుగుతోంది. దానికి మనకులాగు వీనులు లేవు గానీ, అది వినగలుగుతుంది. నరకం ఉందంటే నరలోకాన్నే నాకంలా భావించే కొందరు భ్రమ జీవులు ఎగిరి గంతులేస్తారు. కోపంతో కారాలు మిరియాలు నూరుతారు. సమాధి చేయబడిన శవం మట్టిలో కలిసి మట్టయిపోతుందనుకుంటారు. కాల్చబడిన శవం బూడిదయి కాటి మట్టిలో కలిపోతుందనుకుంటారు. ఐహిక జీవితం తప్ప పర లోక జీవితం లేదన్నది వీరి బలమయిన వాదన. దేహంకన్నా ఆత్మ కున్న ప్రాముఖ్యతను వీరు గమనించేందుకు సుముఖంగా ఉండరు. శరీరానికి మెరుగులు దిద్దుకుంటారేగానీ, ఆత్మను ప్రక్షాళనం చేసుకు నేందుకు ప్రయత్నించరు. దాని గురించి ఆలోచించనన్నా ఆలోచిం చరు. సమాధి యాతన అనేది ఎంత నికృష్టమయినదో, అక్కడికి చేరిన ఆత్మలు ఎంతగా అల్లాడిపోతాయో,  సమాధిలో పుణ్యాత్మలకు లభించే ఫలం ఎంత మధురాతిమధురమయినదో, అవి ఎంతటి సుఖవంత మయిన జీవితాన్ని అక్కడ గడుపుతాయో పూస గుచ్చినట్లు ప్రవక్త (స) వారు చెప్పినా మారని ఈ జనం  నిజంగా సమాధికేగిన ఆత్మ ల్లోని ఏ ఒక్క ఆత్మ అయినా తిరిగి భూవాసుల వద్దకు పోయి వివరించినా మారుతారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అది వారి అనుభ వంలోనికి రానిది గనక. అయినా అలా జరగడానికి వీలు లేదు. అలా వెళ్ళాలని కోరుకోని వారు ఉండరని కాదు అర్థం; ఉంటారు. కానీ వారికి లభించే సమాధానం ఏమిటి?   ”ఏమిటీ, మేము మట్టిలో కలిసి, మాయమయిపోయిన తర్వాత  కూడా మళ్లీ సరికొత్తగా సృష్టించబడతామా?” అని వారు అంటారు. అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని త్రోసి పుచ్చుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”మీపై నియమించ బడివున్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపర్చుకుంటాడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు. అపరాధులు తమ ప్రభువు సమక్షంలో తలలు వంచుకుని ఉండటాన్ని నువ్వు చూస్తే ఎంత బాగుండు! (అప్పుడు వారిలా అంటారు)’మా ప్రభూ! మేమంతా చూసుకున్నాము. (అంతా) వినేశాము. ఇక మమ్మల్ని తిరిగి పంపించు. ఇక నుంచి మేము సత్కార్యాలు మాత్రమే చేస్తాము. మాకిక పూర్తి నమ్మకం కలిగింది.” (అస్సజ్దా: 10-12)
ఒకప్పుడు వారు త్రోసి పుచ్చిన విషయాల్ని ఇప్పుడు కళ్ళారా చూసు కుంటారు. ఒకప్పుడు పరహసించిన వాటిని గురించి ప్రత్యక్షంగా వింటారు. అల్లాహ్‌ా హెచ్చరికలోని వాస్తవికత వారికి బోధ పడతుంది. ప్రవక్తలు (అ) తెలియజేసిందంతా సత్యమని అప్పుడు వారికర్థమవు తుమది. కానీ, ఏం లాభం? కర్మలు చేెసుకోవడానికి వారికివ్వబడిన గడువు తీరిపోయింది. ఇప్పుడు వారి కోసం మిగిలిందల్లా పరాభావం తో కూడిన శిక్షే   వారు ప్రాపంచిక జీవితంలో దైవాన్ని, ఆయన శాస నాల్ని, ఆయన పంపగ వచ్చిన ప్రవక్తల ప్రవచనాల్ని పెడ చెవిన పెట్టారు, ఖాతరు చేయలేదు, విస్మరించారు. కాబట్టి ఈ రోజు అల్లాహ్  కూడా వారి గోడును పట్టించుకోడు.  మనిషి మరణం తర్వాత ఎన్నో మజిలీలు ఉంటాయి. సమాధి పర లోకపు తొలి మజిలీ అయితే మహ్షర్‌ అనే చివరి మజలీలో ఎక్కడి వెళ్ళాలో తీర్పు ఇవ్వబడుతుంది.  ”ఓ బృదం స్వర్గంలో, మరో బృందం నరకంలో”. (షూరా:7)
ఒక సోదరుడేమో ఆటపాటలే జీవితమని తలపోస్తున్నాడు. మరొక మిత్రుడు దైవాదేశాలనకు శిరసావహించడమే, ఆయన్ను ఆరాధించ డమే జీవిత అర్థంగా, పరమార్థంగా భావిస్తున్నాడు.  ఒక సోదరుడేమో అశ్లీల కార్యాల్లో, నీతిమాలిన పనుల్లో ఖర్చు పెట్టేందుకు ధనాన్ని కూడబెడుతున్నాడు. ధనమే మనిషిని నడిపే ఇంధనం అని నమ్ముతు న్నాడు. తనకు ప్రాప్తయిన సిరిసంపదలు కలకాలం ఉంటాయయనీ, వాటి ప్రాతిపదికనే కీర్తిప్రతిష్టతలు ఒనగూడుతాయని భావిస్తున్నాడు. మరొక మిత్రుడు అల్లాహ్  మార్గంలో ఖర్చు పెట్టాలనీ, తల్లిదండ్రుల సేవలు చేయాలని, అనాథలను, నిరుపేదలను, వికలాంగులను, వితం తువులను ఆదుకోవాలనీ, నిస్సహాయులకు, నిరాధార జీవులకు అండ గా నిలవాలనీ, బంధుమిత్రులతో, ఇరుగుపొరుగువారితో సత్సంబం ధాలు పెంపొందించుకోవాలనీ ధర్మం సమ్మతించిన పద్ధతిలో ధనాన్ని అర్జిస్తున్నాడు.  ఒక సోదరుడేమో – విదేశాలకు వెళ్ళి విలాసాల్లో, కులాసాల్లో గడుపు తూ, అక్కడ హాయిని పొందాలని, బులపాటం తీర్చుకోవాలని, మదు పానం మైకంలో మునిగి తేలాలని కోరుకుంటున్నాడు. మరొక మిత్రుడు – హజ్జ్‌-ఉమ్రాల కొరకు మక్కా వెళుతున్నాడు. ఆఫ్రికన్‌ దేశాలలో నివసిస్తూ కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న అభాగ్యుల వద్ద కెళ్ళి రేయింబవళ్ళు వారి సేవలోనే సమయం గడుపుతున్నాడు. దైవాభీష్టానికి అనుగుణంగా జీవించి శ్వాస వదలాలని సుదూర ప్రయాణాలు చేెస్తున్నాడు. ఇలా భిన్న దృక్పథాలు గల ఈ ఇరువురూ సమానులేనా? కారు…ఎన్నటికీ కాలేరు. అవును ఇది అక్షర సత్యం - ”నరకానికి ఆహుతి అయ్యేవారు, స్వర్గానికి పోయేవారు సమానులు కాలేరు”. (హష్ర్‌:11)
నిజ దైవాన్ని గ్రహించి, మిథ్యా దైవాలను విడనాడమని, అయిదు పూటల నమాజు పాటించమని, జకాత్‌ చెల్లించమని, శాంతిని సర్వ వ్యాప్తం చేెయమని, అన్నదానాలు చేపట్టమని మనిషికి పలు విధాలుగా బోధించడం జరిగింది. ”కాని అతను తిరస్కరించాడు. పరిహసిం చాడు. పరలోక జీవితముందని అంగీకరించలేదు. ఆపై సత్య మార్గానికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నటానికి వెళ్ళిపోయాడు”. (ఖియామా) రేపు ప్రళయ దినాన అల్లాహ్‌ా ఇదే మనిషినుద్దేశించి (ఇక్కడ ముగ్గురు పండితులున్నారు) - ”ఓ మానవుడా! నేను మీకు ఆరోగ్యవంతమయిన శరీరాన్ని ఇవ్వలేదా! కాని మీరు ఈ శరీరాన్ని నా ప్రసన్నతను బడసే మార్గంలో ఉపయోగించ లేదు” అంటాడు. వారిలో ఒకడికి అప్పుడు గుర్తుకొస్తుంది. తను చేసిన పాపాలన్నిం టిని తలచుకుంటాడు. నీతిని గురించి, న్యాయాన్ని గురించి ఊక దంపుడు ఉపన్యా సాలు ఇచ్చానేగానీ, ఏనాడయినా పిసరంతయినా పాటించిన పాపానికి పోలేదు. నాదంతా వేషధారణ బ్రతుకు. భూ లోకంలోనేగానీ ఇక్కడ అబద్దమాడి తప్పించుకునేందుకు లేదు. సంగీత దర్శకులు, సినీ దర్శకులు, నటులు, నటీమణులు, కలిమి బలిమి గలవాళ్ళెందరో నా వద్దకొచ్చి ఆశీర్వాదం పొంది వెళ్ళే వారు. ఓ మోస్తరు తప్పు చేెసేవారు కూడా నన్ను చూసి వణికిపోయే వారు.  నేను మాత్రం రహస్యంగా పాపాలకు పాల్పడి ఏమీ ఎరుగని వాడిలా నటించేవాడిని. ప్రసంగాల్లో బహుదైవారాధన ఎంత ఘోర మయిన పాపమో శ్రోతల హృదయాలు కంపించిపోయేలా గద్దించే వాడిని. కానీ బహిరంగంగానే దర్గాహ్‌ా (సమాధి)పై పీఠాధిపతినయి కూర్చునేవాడిని. ఫాతెహాలు, పది మంది స్త్రీల కహానీలంటూ ప్రజలను భ్రష్టు పట్టించడమే కాక వారి సంపదను కొల్లగొట్టేవాడిని.  భార్యాభర్త లెలా సఖ్యతగా మెలగాలనే విషయంపై ఉద్ధండ ఉపన్యశించి ఇంటి కెళ్ళినప్పటి నుండి భార్యతో తిట్ల తాంబూలాలు, కొట్లాటలు. అతని ప్పుడు రక్త కన్నీరు కారుస్తున్నాడు; కాని ఫలితం లేదు.
మరో మనిషి – తనో మహా సంఘ సేవకుడని, అనాథలకు ఆశ్రయం వంటి వాడని, విధవరాళ్ళును, వయస్సుడిగిన వారికి ఆపద్భాంధవుడి లాంటి దాతని, మహా నేత అని అతన్ని జనాలు పొగిడారు. ఉదయ మొక దేశంలో, మధ్యాహ్నం మరొక దేశంలో, రాత్రి ఇంకొక దేశంలో భోంచేశాడు. విదేశాల్లో కూడా తన వాగ్ధాటికి, పవిత్ర జీవనానికి, వాక్యపరిచర్యకు గులాములయిన వారు కోకొల్లలు. వేల సంఖ్యలో అభి మానులు సభలకు హాజరయ్యేవారు. ఆంగ్లంలో ఏక ధాటిగా ఉపన్యా సాలివ్వడమే కాక, ప్రంముఖులు ఆంగ్లంలో ఇచ్చే ప్రసంగాలకు అను వాదకుడిన వ్యవహరించి ఆయా వ్యక్తుల మన్నలు పొందేవాడు. ఎన్నో ఇళ్ళ స్థలాలు, పొలాలు, పేటకొక భవనం అంతా దేవుని అనుగ్రహం అన్న అతి వినయం ఒకటి.
ఇంకో మనిషి- వర్ణ విభేదాలు, కుల రచ్చలు, జాతి వైషమ్యాలు ఎందుకు చేెసినట్టో? అతని ఇప్పుడే అర్థమయింది. తాను చెడింది గాక ఇతరులెందరినో చెడగొట్టాడు. సృష్టితాలను దైవ స్వరూపాలుగా, దైవాంశ సంభుతులుగా, దైవ అవతరాలుగా చిత్రీకరించి వాటినే పూజి ంచాలని, అదే సనాతన మతం అని మాయమాటలు చెప్పి, అభూత కల్పనలను జోడించి, పుక్కిటి పురాణాలను వ్యాపింపజేసి యుగాల తరబడి మోసగించిన నేరం అతనిది.  రొజుకో బూటకపు దైవాన్ని సృష్టించడం అతనికో ఆట. ఒక దేవునితో బోరు కొడితే వెంటనే మరో దేవుడ్ని ప్రతిష్టింపజేసేవాడు. సింహం, ఏనుగు, శునకం, వరహం కూడా దేవుళ్ళే. అతని వినోదం దేవతను సృష్టించడం. దేవుడొక్కడేనని, ఆయన అద్వితీయుడని, దేశకాలలకు పరిమితం కానివాడని, అవ్యక్త రూపుడయిన ఆయనను పాంచ భౌతి కారముగా తలంచి పూజించే వారు శుద్ధ అవివేకులని, మానవులంతా ఒక్కటేనేనని, ఒకే దేవుని దాసులని, నల్లవారికి తెల్లవారిపైగానీ, తెల్ల వారికి నల్లవారిపైగానీ ఎలాంటి ఆధిక్యత లేదు దైవభీతితో తప్ప అని దైవప్రవక్తలు ప్రబోధించినా, దైవగ్రంథాలు ప్రకటించినా అతను లెక్క చేయలేదు.  అతని స్వార్థం, మూర్ఖత్వం, మూడ విశ్వాసాలే నేడు అత నిని భయంకర నరకానికి ఆహుతి చేశాయి. ఇక్కడి నుండి తను వెళ్ళ లేడు. తనలాంటి వారికి ఈ యదార్థాన్ని చెప్పి సంస్కరించాలన్న కోరిక బలంగా ఉన్నా అది సాధ్య పడదు. ఈ విషయం తెలిసిన అతను విలవిల్లాడిపోతూ తన చేతలను కొరుక్కుంటూ: ”అయ్యో! నేను దైవ ప్రవక్తను అనుసరించి ఉంటే ఎంత బాగుండేది! అయ్యో నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయ కుండా ఉంటే ఎంత బాగుండేది! అతని మాయామాటల్లో పడి నేను నా వద్దకు వచ్చిన హితబోధను స్వీకరించలేదే!” (ఫుర్ఖాన్‌: 28,29)అంటూ కుమిలిపోతున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది?  ”సత్యాన్ని తిరస్కరించిన వారు నరకం వైపునకు గుంపులు గుంపులుగా తోలబడతారు. చివరకు వారు అక్కడ చేరిన ప్పుడు దాని ద్వారాలు తెరుచుకుంటాయి”. (జుమర్‌: 71)
నరకం – దానికి ఏడు ద్వారాలు. ”ఆ రోజు నరకం ముందుకు తీసుకు రాబడుతుంది. ఆ దినమున మానవుడు తాను చేసుకున్నదంతా జ్ఞాపకం తెచ్చుకుంటారు”. (ఫజ్ర్‌:23, 24) ”అయ్యో నా కర్మల పత్రం నాకు అసలు ఇవ్వబడకుండా ఉంటే, నా లెక్కే మిటో నాకు అసలు తెలియకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది”. (హాఖ్ఖహ్ :25-27) అని వాపోతాడు. ఏదోక రోజు నేెను చేసిన ప్రతి దానికీ లెక్క చెప్పుకోవాల్సి వస్తుందని నేను ఏ మాత్రం ఆలోచించలేదే! ”అయ్యో! నా ఆ మరణమే అంతిమ మరణ మయి ఉండి ఉంటే ఎంత బావుండేది. నా ఆస్తిపాస్తులు నాకేవిధం గానూ పనికి రాలేదే! నా అధికారమంతా అంతరించి పోయిందే!” (27,28)  అయ్యో నా సైన్యం ఏమయింది? నా ఆజ్ఞను పాలించే వారు ఏమయ్యారు. నా కీర్తికండూతి ఎక్కడా? ఏ ఇంటి నిర్మాణం కోసం పేదల కడుపులు కొట్టానో, ఏ భార్యాపిల్లల కోసం అహిర్నిశలు అవినీతి అక్రమార్కుడిలా వ్యవహరిం చానో, ఏ బూటకపు గౌరవం కోసం అఘాయిత్యాలకు పాల్పడానో వారంరూ ఇప్పుడేమయ్యారు?అని రోధిస్తాడు. కాని అతని రోధన అరణ్య రోధనే అవుతుంది. అల్లాహ్‌ా ఆజ్ఞ జారి చేెయబడుతుంది: ”అతనిని పట్టుకోండి. అతని మెడకు కంఠపాశం తగిలించండి. ఆపైన అతన్ని నరకంలో విసిరి వేయండి. అతన్ని డైభ్బై గజాల పొడుగు గల గొలుసుతో బంధించండి”.                       (హాఖ్ఖహ్ :30, 32 )
నిశి రాత్రి, పూర్ణ చంద్రుడు నడినెత్తిన వెలుగుతున్నాడు. స్మశానం నిర్మానుష్యంగా ఉందిగాని నిశ్శబ్దంగానయితే లేదు. కీచురాళ్లు నలుదిక్కుల నుంచీ గీపెడుతున్నాయి. ఒక నల్ల కుక్క వెచ్చని చోటు గా చూసి చుట్ట చుట్టుకుని పడుకుని మధ్య మధ్యలో తల ఎత్తి చంద్రునికేసి మొరచాచి ఏడుస్తోంది. చెట్ల మీద నిద్రపోయే పక్షులు మధ్య మధ్య కదలి రెక్కలు టపటపాలాడించి మళ్ళి జోకొడుతు న్నాయి. స్మశానంలో ఉన్న రాతి, మర్రి వగైరా చెట్ల ఆకుల సందుల నుంచి ఊడల్లాగా జారే చంద్రకిరణాలను చూడండి అదుగో అక్కడ పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తూ ఓ పాడు పడ్డ బంగ్లా. ఒకప్పుడు కళా కాంతులీనిన ఆ ఇల్లు ఇప్పుడెలా ఉందో! అది ఇల్లు కాదు; అదో సమాజం!!
ఈ ఇంట్లో ఒకప్పుడు మనుషులున్నారంటే నమ్మశక్యం కాదు. ఈ బావిలో నీళ్ళు తాగారంటే అవునా అనిపిస్తుంది. ఈ ఇంటి ఆవర ణంలో మానవాళికి పనికొచ్చే పూల చెట్లు, కాయల చెట్లు పెరిగా యంటే కాబోలనుకుంటాము. ఒకప్పుడు అది ప్రకృతి అంతటి నిర్మ లంగా వర్థిల్లిందంటే ఇట్టే నవ్విపోతాము. ఒకప్పుడు ఈ ఇంటిని చూసి మనుషులు గర్వపడేవారు. దీన్ని చూడగానే బలహీన వర్గాల ప్రాణాలు లేచి వచ్చాయి. ఈ ఇంటిని వీడి వెళ్ళాలంటే మనషులు హృదయాలు పుట్టెడు దుఃఖంతో కృంగి పోయేవి అంటే ఏదో కథ చెబుతున్నారనుకుంటారు. అట్టి వైభవంతో అలరారి ఆ ఇల్లు ఇలా కళాహీనంగా మారడానికి కారణం అందులో  నివాసం ఉన్న మను ష్యులే. ప్రస్తుతం ఇక్కడ నివసించే క్రిమికీటకాలు చెయ్యని అత్యాచా రాలు, విరజిమ్మని విషవాయువులు, అడవిలోని మృగాలు సయితం ఎరుగని అఘాయిత్యాలు ఆ ఇంట్లో మనుషులు చేశారు.   ఒకనాటి కాళరాత్రి ఈ వసారాలోనే ఒక అత్త కొడుకులు కలిసి నిండు శూలాలతో ఉన్న కోడలు పిల్లను నిప్పంటి, దాన్నో ప్రమాదం గా చీత్రీకరించి, లేని ప్రేమను నటిస్తూ రోధించి చుట్టప్రక్కల జనాల ఆమోదాన్ని పొందారు. అది జీవితావసరమయిన హత్య కాదు…. నిజం నిప్పులా వారిని వెంటాడింది. హత్య చేసిన ఇద్దరూ ద్వీపాంత రం తరలి వెళ్లి పోయారు. చట్టం నుంచి తప్పించుకున్నామనుకున్నారు.
ఈ ఇల్లు యుద్ధరంగంగా చాలా సార్లే మారింది. ఇక్కడ మను షులు కలిసిమెలిసి బ్రతకలేని పశువులు, కలిసుంటే  సౌఖ్యం, భాగ్యం లభిస్తుందన్న మాటే వారే ఎరుగరు. ఈ ఇంటి ఆవరణంలో చెప్పరాని అత్యాచారాలు జరిగాయి. కొడుకులు భార్యల కొంగున చేరి కన్నవారి మీదే కన్నెర్రజేశారు. వారిని తిరిగిరాని లోకాలకు సాగనంపారు. వారిని అనుమానించారు, వీధిలోకి ఈడ్చి అవమా నించారు. స్టోరు రూములో పెట్టి గొల్ళాలు పెట్టారు. తల్లిదండ్రులని చూడకుండా అమానుషంగా తన్నారు. దిక్కులు పిక్కటిల్లేలా అరచి నా కాపాడే నాధుడే లేక వారు గోడలకు కరచుకొని విలవిల్లాడి పోయారు. ఎముకలు ఉడిగిన దేహాలు…ఎన్ని హింసలని భరి స్తాయి…అలా…అలా…ఒకరోజు వారి ప్రాణాలు గాల్లో కలిసిపో యాయి.
ఈ ఇంటి పడక గదిలో భ్రూణ హత్యలు సయితం చాలానే జరి గాయి. గర్భంతో ఉన్న శిశువు ఆడపిల్ల అని తెలిసి దాన్ని హత మార్చడానికి ఈ ఇంట్లో గూడుపుఠానీలు జరిగాయి. ఒకప్పుడు ’దేహీ అన్నవారికి నహీ’ అనడం ఎరుగని ఆ ఇంట్లో దమన కాండ లు, దహనకాండలు అనేకమే జరిగాయి. ప్రస్తుతం సజ్జనులయిన వారి పూర్వీకులు స్వర్గ ద్వారాల వద్ద ఉంటే, అప్రయోజకులయిన, అసమర్థులయిన వీరేమో నరక ద్వారానికి సమీపంలో ఉన్నారు. దైవదూతలు ఇలా అడుగుతున్నారు: ”ఎపుడో ఒకప్పుడు మీరు ఈ దినాన్ని కుడా చూడవలసి వస్తుందనీ, మిమ్మల్ని హెచ్చరించిన ప్రవ క్తలు, వక్తలు మీ వద్దకు రాలేదా?”. ’ఎందుకు రాలేదు? హెచ్చ రించేవాడు వచ్చాడు. కాని మేమే అతన్ని ధిక్కరించాము. ’అల్లాహ్‌ా దేనినీ అవతరింపజేయలేదు. మీరే అపమార్గానికి గురయి ఉన్నార’ని (అవహేళనగా) అనేశాము” అని వారు (తమ నిర్వాకాన్ని) ఒప్పుకుంటారు”. (ముల్క్‌: 9)  వారు ఇంకా ఇలా అంటారు: ”మేము విని ఉంటే లేదా బుద్ధి పెట్టి ఆలోచించి ఉంటే (ఈ రోజు ఇలా) నరకాగ్నికి ఆహుతి అయిన వాళ్ళతో చేరేవాళ్ళం కాము. ఆ విధంగా వారు తమ తప్పులను (పాపాలను) ఒప్పుకుంటారు. అప్పుడు ’నరక వాసులు (దైవ కారు ణ్యానికి) దూరమవుగాక!” (అని అనబడుతోంది.)”      (ముల్క్‌: 10, 11)   నరకం-అది చాల భయంకరంగా, అంధకారంగా ఉంటుంది. ”అది కోటవలే పెద్ద పెద్ద నిప్పురవ్వలను విసురుతూంది. (ఆ నిప్పు పగిలి మరిన్ని కణాలను వెదజల్లుతుంది) ఆ రవ్వలు పశుపు పచ్చని ఒంటెలవలే కనిపిస్తాయి”. (ముర్సలాత్‌: 32,33)
”మీకు పూర్వం గతించిన జిన్నాతుల, మానవుల సమూహాలతో చేరి, (వారితోపాటు) మీరు కూడా నరకంలోకి ప్రవేశించండి” అని అల్లాహ్‌ా వారితో అంటాడు. వారిలోని ప్రతి సమూహమూ అందులో (నరకంలో) పడుతున్నప్పుడు, తన సమూహానికి శాప నార్థాలు పెడుతుంది. ఆఖరికి వారంతా అందులో చేరిపోయిన తర్వాత, తరువాతి వారు మొదటివారినుద్దేశించి, ”ఫ్రభూ! మమ్మల్ని అపమార్గం పట్టించిన వాళ్ళు వీళ్ళే. కనుక వీళ్ళకు రెట్టింపు శిక్షను విధించు” అని అంటారు. అప్పుడు అల్లాహ్‌ా ”అందరికీ రెట్టింపు శిక్షే పడుతుంది. కాని ఆ సంగతి మీకు అర్థం కాదు” అంటాడు.  మరియు మొదటి వారు తమ తరు వాతి వారినుద్దేశించి, ”మీకు మాపై ఎలాంటి ఆధిక్యతా లభించ లేదు. కాబట్టి మీరు కూడా మీరు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా శిక్షను రుచి చూడండి” అంటారు. (ఆరాఫ్‌: 38,39)
ఫలితం తెలిశాక సంజాయిషీలు మొదలయ్యాయి. తమ నాయక మన్యుల, గురుజనుల తప్పులు అప్పుడు వారి కంటికి కనబడ తాయి. ఈ నాయకాగ్రేసరులు తాము స్వయంగా చెడిపోవడమే గాకుండా తమ అనుచర గణాన్ని కూడా చెడగొట్టారు. కాబట్టి తమ అనుయాయులకన్నా ముందు ’నాయకులు’ నరకంలో పడ వేయబడతారు. మధ్యవర్తులుగా వ్యవహరించి నరకం దాటించే స్తారు అన్న భ్రాంతిలో బ్రతికిన జనాలు తమకన్నా ముందు వారిని నరకంలో చూసి ఇలా వాపోతూ: ”మీరే గనక లేకుండా ఉంటే మేము విశ్వాసులయి ఉండే వాళ్లము”. అనంటారు.   (సబా: 31)  ”ఏమిటి? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన తర్వాత దాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? వాస్తవంగా మిరంతట మీరే అపరాధానికి ఒడిగట్టారు” అని పెద్దలు బల హీన జనాలకు సమాధానమిస్తారు. (సబా: 32)
మరి (దానికి బదులుగా) ఈ బలహీన ప్రజలు పెద్దవారితో ఇలా అంటారు: ”(లేదు లేదు) రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్ర ఇది! అల్లాహ్‌ాను తిరస్కరించమని, ఆయనకు సహవర్తులు గా ఇతరులను కల్పించంని మీరు జారీ చేెసిన ఆజ్ఞలే మా అవి శ్వాసానికి కారణభూతమయ్యాయి. (నరక) శిక్షను చూడగానే వారంతా లోలోపలే పశ్చాత్తాప పడతారు”. (సబా:33)   తర్వాత ఆ పాలిత జనాలు: ”మా ప్రభూ! మేము మా సర్దారులకు, పెద్ద లకు విధేెయత చూపాము. వాళ్ళే మమ్మల్ని సన్మార్గం నుంచి పెడదారి పట్టించారు. కనుక ఓ అల్లాహ్‌ా! వీళ్ళని రెట్టింపు శిక్ష విధించు. వీళ్లను తీవ్రంగా శపించు” అనంటారు.    (అల్‌ అహ్జాబ్‌: 67,68)
అయితే ఇప్పుడు వారు వగచి లాభం లేదు. ఒకరినొకరు నిందిం చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మేలుకోవలసిన సమయంలో వీరు మేలుకోలేదు. వీరిలో ప్రతి ఒక్కరూ అపరాధే. ఎవరూ తక్కువవేమి తినలేదు. కనుక అందరికి ఏ మోతాదులో దరువు పడాలో ఆ మోతాదులో దరువు పడుతుంది.   ఒండొకరిపై బురదజల్లే ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటూంది. అంతలోనే వారు నరకాగ్ని గురవ్వడానికి అసలు సూత్రధారి అయిన షైతాన్‌ కనబడతాడు. అప్పుడు వారంతా కూడబలుక్కుని తమ పాపాల నిందను అతడిపై వెయ్యలాని ప్రయుత్నిస్తారు. తరు వాత ఏం జరుగుతుంది?  సమస్త వ్యవహారంపై తిర్పు జరిగిపోయిన తరువాత షైతాన్‌ ఇలా అంటాడు: ”అల్లాహ్‌ా మీకు సత్యబద్ధమయిన వాగ్దానం చేశాడు. నేను మాత్రం మీకు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రవర్తిం చాను. నాకు మీపై ఎలాంటి అధికారమూ లేదు. కాకపోతే, నేను మీకు పిలుపునిచ్చాను. మీరు నా మాటను అంగీకరించారు. కాబట్టి మీరు (ఇప్పుడు) నన్ను నిందించకండి; మిమ్మల్ని మీరే నిందించుకోండి. మీ మొరలను నేను ఆలకించలేను. ఇంతకు మునుపు మీరు నన్ను దైవత్వంలో భాగస్థునిగా నిలబెట్టారన్న విషయాన్ని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. నిశ్చయంగా అటు వంటి దుర్మారుగల కోసం వ్యధాభరితమయిన శిక్ష ఉంది”.     (ఇబ్రాహీమ్‌: 22)
సోదరా! సోదరీ! ఆలోచించు….పదే పదే తల దువ్వుకుంటూ అద్దమందు నీ ముద్దుమోముగని మురిసిపోయే వాడివి కదా! ధనాన్ని కూడబెట్టి మాటిమాటికీ లెక్కబెట్టి ఉంచేవాడివి నీవే కదా! నీ ధనం, నీ అందం నీకు ఏ విధంగాను పనికి రాదు. ఐహిక సకల భోగభాగ్యాలను అనుభవించిన ఓ మనిషీ! ఈ రోజు నరక వాసుల తొడిగే దుస్తులు, తీసుకునే ఆహారం ఎలా ఉంటుందో ఒక్కసారయినా ఆలోచించావా? వారు ఎక్కడ విశ్రాంతి తిసుకుం టారో, ఎక్కడ నిద్రిస్తారో? వారికి లభించే నీడ ఎటువంటిదో ఒక్క క్షణమయినా ఊహించావా? నా మాటలకేం గానీ, అల్లాహ్‌ా మాట ల్లోనే వారి అవస్థ గురించి తెలుసుకో!
”వారి కొరకు అగ్గి వస్త్రాలు కత్తిరించబడి ఉంటాయి”.    ప్రపం చంలో ఉన్న అగ్ని నరకాగ్ని యొక్క 70వ భాగమని ప్రవక్త (స) సెలవిచ్చి ఉన్నారు. ఇహలోకాగ్నియే ఇంత దారుణంగా ఉంటే, ఇక నరకాగ్ని ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ”వారికి నరకాగ్నే పాన్పు, నరకాగ్నే దుప్పటి”. అంటే వారు నర కాగ్నినే దుస్తులుగా ధరిస్తారు. నరకాగ్నిపైనే నిద్రిస్తారు. నరక నిప్పునే దుప్పటిగా కప్పుకుంటారు. మరి వారి కోసం నీడ ఉండదా? అంటే, ఉంటుంది-వారి మీద నిప్పు నీడవలే పైనుండి, క్రింద నుండి కూడా క్రమ్ముకుని ఉంటుంది. ముందు నుండి, అగ్ని, వెనుక నుండి అగ్ని, కుడివైపు నుండి అగ్ని, ఎడమ వైపు నుండి అగ్ని, ఎటు చూస్తే అటు అగ్నే అగ్ని  కురుస్తూ ఉంటుంది. ఆ రోజు చోటు చేెసుకునే ఈ పర్యవసానం గురించే అల్లాహ్‌ా తన దాసులను హెచ్చరిస్తున్నాడు: ”వాటి యాతన గురించి అల్లాహ్‌ాతన దాసులకు భయపెడుతున్నాడు. ఓ నా దాసులారా! అందుకే నా పట్ల భయం భక్తులు కిలిగి ఉమడండి”. (జుమర్‌:16)
తల్లిదండ్రి, సోదరి, సోదరులు, భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు ….ఇలా మనిషి జీవితంలో బాంధవ్య బంధాలు అనేకం. అందులో కొన్ని తియ్యగా ప్రారంభమయి మధురాతిమధురంగా మారితే,ఇంకొన్ని మధురంగా మొదలయి పరమ చేదుగా పరిణమిస్తాయి. మనలో కొంద రు తమవారిని ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు, తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేందుకు, తమ ఆడ సంతానాన్ని గొప్పంటి సంబం ధాలు చూసి పెళ్ళి చేసేందుకు కష్టాలన్నీ తాము అనుభవించి సుఖాలు మాత్రం కుటుంబ సభ్యులు అందేలా అహిర్నిశలు పరిశ్రమిస్తుంటారు. అటువంటి త్యాగధనుల్ని మరచి బ్రతికే కాలం నేటిది. తనయుడి ప్రేమ కై తపించే తల్లిదండ్రులు,అయిన వారు ఉండి కూడా ఆదర కరువైన అనాథలు, భర్త అనురాగం పొందలేని భార్యలు, భార్య ప్రేమ లభించని భర్తలు…ఇలా చెప్పుకుంటూపోతే మానవ సంబంధాలన్నీ సమస్యాత్మకం గానే ఉంటున్నాయి. ఇహంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే, ఎటువంటి సంపద, సంతానం లాభించని రోజున వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”(గూబగుయ్యిమనిపించే) గావుకేక (అంటే ప్రళయం) వచ్చినప్పుడు.. ఆ రోజు మనిషి తన (స్వంత) సోదరుని నుండి పారిపోతాడు.తన తల్లి నుండి, తండ్రి నుండి, తన భార్య నుండి, తన పిల్లల నుండి (పారి పోతాడు). ఆ రోజు ప్రతి ఒక్కరికీ తన సంగతి చూసుకోవటంతోనే సరిపోతుంది”. (అబస: 33-37)
ఇక కళ్ళ ఎదుట కనబడే కన్నవారినే పట్టించుకొని మనుషులు ఎక్కడో, ఎప్పుడో ఎదురుకాబోయే నరక పరిణామాల గురించి పట్టించుకుంటా రనుకోవడటం అత్యాశే అవుతుంది. ఈ అహంతోనే ఉన్నావా? అసలు ఉన్నావా? అని దైవాన్ని, ఆయన ఉనికినీ గద్దించి అడిగేవాళ్లు కొందర యితే, అసలు దైవం లేడు పొమ్మనేవాళ్ళు మరికొందరు మనకు తారస పడతారు. ఇటువంటి ఏమరుపాటుకు గురై జీవించే వారి మార్గదర్శ కత్వం, మేల్కొల్పడం కోసమే ప్రవక్తలు వచ్చారు. వారు నిజ దైవం ఎవరో విస్పష్ట పర్చడమే కాక, దాసుల హక్కులేమిటో, దేవుని హక్కు లేమిటో విడ మరచి చెప్పడంతోపాటు స్వర్గనరకాలు సత్యమన్న విష యాన్ని నొక్కి వక్కాణించారు. ’ప్రజలరా! నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఖర్జూరపు ఒక ముక్కను దానం చేసైనా సరే’ అని ఎంతో ప్రేమగా పిలుపు ఇచ్చారు. అయితే చేసిన, చూసిన ఉపకారాల్నే విస్మరించిన మనిషి ఈ యదార్థాన్ని త్రొసి పుచ్చాడు. దైవాన్నీ నమ్మ లేదు, నరకాన్ని స్వర్గాన్నీ విశ్వసించలేదు. అసలు మరణానంతరం జీవితం ఉంటుందన్న విషయాన్నే తిరస్కరించాడు. తను సాధించి ప్రగతి ఫలాలను చూసుకొని మురిపోతూ మిడిసిపాటుకి గురై విర్ర    వీగాడు.  తాను వీధి గుండా నడివెళితే భూమి చీలిపోతుందని, ఆకా శం బ్రద్దలవుతుందని, తాను పర్వతాలంతటి ఎత్తుకు చేరుకుంటాని తన సత్తాను తానే మత్తెక్కి కళ్ళు పైకెక్కి కన్ను మిన్ను కానక ప్రవర్తించాడు.   ఇట్టి స్వభావం గలవారు ఎవరయినా సరే వారు ఆలోచించాల్సింది ఒక్కటే; దైవప్రవక్తలు, ధర్మకర్తలు చెప్పింది వారు అనుకున్నట్టు అసత్య మయితే  ఆపాపం వారికే తగులుతుంది. వారికెలాంటి నష్టంవాటిల్లదు. కానీ…ఒకవేళ వారు చెప్పింది అక్షర సత్యమయితే? ‘చూడండి! మీరు ఇంత కలాం తిరస్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే’ అని నరక దూత వారి తో అన్నప్పుడు, అప్పుడు వారి సమాధానమేమిటి? అప్పుడు వారు ఎక్క డికి పారిపోగలరు? ఎక్కడ తల దాచుకోగలరు? ఏ ఆపద్బాంధవుడిని ఆశ్రయించగలరు?
నరకాగ్ని ఎంత వేడిగా ఉంటుందనే విషయాన్ని దైవప్రవక్త (స) ఇలా వివరించారు: ”నరకాగ్ని ఇహలోకాగ్నికంటే 70 రెట్లు అధిక వేడి కలిగి ఉంటుంది”. అంటే ఒకవేళ ప్రపంచ ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెంటి గ్రేట్‌ అయితే నరకాగ్ని వేడి 138 వేల డిగ్రీల సెంటిగ్రేడ్‌గా ఉంటుంది. ఈ భయంకరమయిన వేడితోనే నరకవాసుల దుస్తులు తయారు చేెయ బడతాయి. ఈ అగ్నితోనే వారి పడకలు కూడా తయారు చేయబడ తాయి. ఈ అగ్నితోనే వారి గొడుగులు, స్తంభాలు కూడా తయారు చేయబడతాయి. ఈ అగ్నితోనే వారి కొరకు గచ్చు పరచబడు తుంది. ఇటువంటి మహా కఠినమయిన శిక్షాస్థలంలో మానవ జీవితం ఎలా కొనసాగుతుంది? తన చేతిలో ఒక చిన్న నిప్పు రవ్వను భరించలేని మానవుడు అంతటి భయంకర నరకాగ్నిని ఎలా భరిస్తాడు? తీర్పు దినాన ఈ నరకాగ్ని జ్వాలల్ని చూసి మానవాగ్రేసరులయిన ప్రవక్తలే భయంతో వణుకుతూ అల్లాహ్‌ాను ’రబ్బి సల్లిమ్‌ సల్లిమ్‌’ అని ప్రార్థిస్తుంటే సాధారణ వ్యక్తుల పరిస్థితి, అందులోనూ పాపాత్ముల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.
స్వర్గపు శుభవార్తను పొందిన 10 మంది భాగ్యవంతుల్లో ఒకరయిన హజ్రత్‌ ఉమర్‌ (ర) ఖుర్‌ఆన్‌ పారాయణ సమయంలో నరక ప్రస్తావన ఉన్న వాక్యం పఠించి స్పృహ కోల్పోయారు.”తండ్రిగారూ! రాత్రి పూట ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నది. మరి మీరెందుకు మేల్కొనే ఉన్నారు?” అని హజ్రత్‌ రబీ (ర) గారిని ఆయన కుమార్తె ప్రశ్నించగా - ”అమ్మాయీ! నరకాగ్ని నీ తండ్రిని పడుకోనివ్వటం లేదమ్మా” అని సమాధానమిచ్చారాయన. ”నిజానికి నీ ప్రభువు శిక్ష  ఎంతో భయపడ వలసినటువంటిది”. (దివ్యఖుర్‌ఆన్‌ -17: 57)
అనాథాశ్రమాల పేరుతో ఆస్తుల్ని పెంచుకునేవారలారా! భూకబ్జాల పేరుతో శ్రామికుల నిలువు దోపిడికి పాల్పడేవారలారా! జాతి సంపదను కొల్లగొట్టేవారలారా! వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీలంటూ పేదల నడ్డీ విరగొట్టేవారలారా! మద్య పానానికి, మగువ లోలత్వానికి బానసయి బ్రతికేవారలారా! ఒక్కసారి కాదు, వందసార్లు ఆలోచించండి!
పోతే వారు ఏం భుజిస్తారు? ”వారు తమ ఉదరాలను నరకాగ్నితో నింపుకుంటారు”. ఈ వచనాన్ని వ్యాఖ్యానిస్తూ పండితులు ఏమన్నారంటే నరకవాసుల ఆకలి తీవ్రత ఎలా ఉంటుందంటే – దాని ముందు నరక శిక్షలు కూడా స్వల్పమనిపిస్తాయి. నరకావాసులకు ఆకలేస్తుంది. తమ ఆకలి తీర్చవలసిందిగా వారు అల్లాహ్‌ాను వేడుకుంటారు.  అల్లాహ్‌ా వారికి ఆహారాన్ని అందజేస్తాడు. కానీ ఆ ఆహారం ఎలా ఉంటుందను కుంటున్నారు? ”నిశ్చయంగా జఖ్ఖూమ్‌ (జెముడు) వృక్షం. పాపాత్ములకు ఆహారం అవుతుంది”.  (దుఖాన్‌: 43,44)
ఓ పాషాణ హృదయుడా! కాళనాగులా స్వల్ప లాభం కోసం స్త్రీల తన, మాన, ధనాలను కాజేసిన కుయుక్తుడా! జిత్తులమారి నక్కలా ఎన్నో కాపురాల్లో కలతలు రేపి, ఎన్నో కొంపల్ని కూల్చిన ఓ క్రూరుడా! శాంతి స్థాపన చాటున ఆరాచకాన్ని సృష్టించిన ఓ దానవుడా! ఈ జఖ్ఖూమ్‌ వృక్షం అంటే ఏమిటో నీకు తెలుసా? ఈ వృక్షపు ఒకే ఒక్క బొట్టు గనక ప్రపంచంలో పడితే వారి జీవితంలో రుచి అన్న మాటనే వారు మరచి పోతారు. పరమ చేదుగా ఉంటుంది దాని ఒక్క బొట్టు. చూడు ఆ సర్వేశ్వరుడు ఏమంటున్నాడో! ”అది నూనే గసిలాగా ఉంటుంది. అది కడుపులోకి పోయి  సలసల కాగే నీరు మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది”. (దుఖాన్‌: 45, 46)
మనిషి ఈ బాధను భరించలేక కాళ్ళూచేతులు గిలగిల కొట్టుకుంటూ నరకానికి ఓ ప్రక్క చేరుతాడు. తక్షణమే అల్లాహ్‌ా ఆజ్ఞ అవుతుంది: ”వాడ్ని పట్టుకోండి. ఈడ్చుకుమటూ పోయి నరకాగ్ని నడిబొడ్డున పడ వేయండి”. (దుఖాన్‌: 47) తర్వాత ఏమవుతుందు? ”పిదప అతని నెత్తి మీద సలసలకాగే అగ్ని ద్రవపు శిక్షను కుమ్మరిం చండి”. అని ఆదేశింబడుతుంది. (దుఖాన్‌: 48) అప్పుడు అతని పరి స్థితి ఎలా ఉంటుందంటే,  ”మరుగుతున్న నిటిని అవిశ్వాసులపై కుమ్మరించడం జరిగినప్పుడు, ఆ నీరు వారి తలలను రంధ్రం చేసుకుంటూ శరీరంలోపలి భాగాలన్నింటి నీ మాడ్చి మసి చేస్తుంది. ఆ భాగాలన్నీ మల ద్వారం ద్వారా బయల్పడి అతడి కాల్ళపై పడతాయి”. (ముస్నద్‌ అహ్మద్‌)
ఓ మానవుడా! నీకు లభించిన పరిమిత అధికారాన్ని చూసుకొని గొప్పలు పోయేవాడివి కదా! సభల్లో సమావేశాల్లో సన్మానాలు పొందే వాడివి కదా! నీ ఉక్కు పాదాల క్రింద నలిగిపోయిన నిరాధార జీవులు ఎన్నో..ఎన్నెన్నో..! అహింస…అహింస…అంటూనే నువ్వు చేసిన హింస లను… సత్యప్రియులను, శాంతికాముకులను నీవు పెట్టిన చిత్రహిం సలు చూడలేక, చూసి తాళలేక ఆకాశం విలపించింది, భూమి ప్రకం పించింది. విశ్వాసులు మంటల్లో పడి కాలిపోయతుంటే నీవు నీ మంది మార్బలమంతా చుట్టూ చేరి వికటాట్టహాసం చేస్తూ వేడుక చూసిన సందర్భం నీకు గుర్తుందా? మరి నీ ప్రభువు ఏమంటున్నాడో: ”(నరక యాతన) రుచి చూడు! నీవు గొప్ప శక్తింతునిలా, మర్యాదస్తునిలా ఉండే వాడివి కదా!” (దుఖాన్‌: 49) నరక తేళ్ళ గురించి ప్రస్తావిస్తూ దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అవి గాడిదల్లా ఉంటాయి. ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసి నలభై సంవత్సరాల వరకు దాని మంటను భరిస్తూ ఉంటాడు”. (ముస్నద్‌ అహ్మద్‌)   ”వారి (అవిశ్వాసుల)ని చితకబాదడానికి ఇనుప సుత్తులు కూడా ఉంంటాయి”., (అల్‌హజ్జ్‌: 21)   ప్రస్తుతం మనం చూస్తున్న మానవ దేహ దారుఢ్యంలో నర శిక్ష భరించే శక్తి లేదు. కాబట్టి నరకవాసుల శరీరాలను విపరీతంగా పెంచడం జరుగుతుంది. దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”నరకంలో అవిశ్వాసి యొక్క ఒక పన్ను ఉహుద్‌ పర్వతమంతటి ఉంటుంది”. (ముస్లిం).
”కొందరు అవిశ్వాసుల చర్మం మూడు రోజుల ప్రయాణం అంత వెడల్పు ఉంటుంది”. (ముస్లిం). ”కొందరి చర్మం 63 అడుగుల వెడ ల్పుగా ఉంటుంది”. (తిర్మిజీ). కొందరు అవిశ్వాసుల భుజాలు, తొడలు మహా పర్వతాల్ని తలపిస్తుంటాయి”. (అహ్మద్‌). ”(కర్మల్ని) బట్టి నరక వాసులు కొందరు ఎంత స్థూలకాయులయి పోతారంటే, వారి చెవుల నుండి – మెడ వెనుక భాగానికి మధ్య గల అంతరం ఏడు వందల సంవత్సరాలంత సుదీర్ఘమయి ఉంటుంది. వారి చర్మపు మందం 70  జానెళ్ళు ఉంటుంది. వారి దవడ ఉహుద్‌ పర్వతంమంత ఉంటుంది”.(అహ్మద్‌)
‘వారి కోసం ఎండిన ముండ్ల గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు. అది బలమూనీయదు, ఆకలినీ తీర్చదు”. (గాషియా: 6,7) అది ’గొంతులో ఇరుక్కుపోతుంది’. అప్పుడు నరకవాసి దాన్ని మింగలేక కక్కలేక చస్తాడు.  ఆఖరికి అలసిసొలసి అల్లాహ్‌ాను నీళ్ళు ఇవ్వమని ప్రాధేయ పడతాడు. నీళ్ళు ఇవ్వబడతాయి. కానీ, ”వారు గనక మంచి నీళ్ళు అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారిని సత్కరించడం జరుగు తుంది. అది వారి ముఖాలను మాడ్చి వేస్తుంది. సలసలకాగే ఆ నీరు పేగులని సయితం కోసి వేస్తుంది. ఎంత జుగుప్సారకమయిన శిక్ష  అది!” ఈ విషయమయి మహా ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ా సాక్షి! నాకు తెలిసిన విషయాలు మీరు తెలుసుకుంటే తక్కువగా నవ్వు తారు, ఎక్కువగా ఏడుస్తారు. పడకలపై మీ భార్యలతో సుఖాలు అను భవించడం మానేస్తారు. ఇంకా అల్లాహ్‌ా శరణు కోరుతూ అడవుల్లోకి, ఎడారుల్లోకి పారిపోతారు”. (ఇబ్ను మాజా)
వివరణగా ముస్నద్‌ అహ్మద్‌లో ఇలా ఉంది: ”ప్రవక్తా! మీరు ఏం చూశారు?” అని సహాబాలు ప్రశ్నించారు. అందుకు దైవప్రవక్త (స) ”నేను స్వర్గనరకాలను చూశాను” అన్నారు. వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”నరకం నుండి కాపాడబడాలను కున్న వ్యక్తి ప్రశాంతంగా నిద్ర పోడంగానీ. స్వర్గంలో ప్రవేశించాలనుకునే వ్యక్తి సుఖంగా నిద్రపోవ డంగానీ నేను చూడలేదు” అన్నారు ప్రవక్త మహనీయులు (స).
నరకవాసులు మరణాన్ని కోరుకుంటారు. కానీ, ప్రళయ దినాన మరణాన్ని సయితం అంతమొందించడం జరుగుతుంది. ”వారి దేహ చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాము. వారు శిక్షను బాగా రుచి చూడాలని”.     (అన్నిసా: 56)
ఇక రక్షణ లభించే మార్గం ఏది లేదని గ్రహించిన నరకవాసులు – చివరి ప్రయత్నంగా అల్లాహ్‌ాతో ఇలా విన్నవించుకుంటారు:”ఓ మా ప్రభూ! మా దౌర్బాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజంగానే మేము మార్గం తప్పినవారము. ఓ స్వామీ! ఇక మమ్మల్ని ఇక్కడ్నుంచి బయట కు తీయి. తరువాత మేము అటువంటి పాపాలు చేస్తే దుర్మార్గులవు తాము”. అల్లాహ్‌ా ఇలా సమాధానమిస్తాడు: ”నా ముందు  నుండి వెళ్ళి పోండి. ఇందులోనే పడి ఉండండి. నాతో మాట్లాడకండి”. (మోమినూన్‌: 106-108)
సోదరా! మేలుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నీ గమ్యసస్థానంపై దృష్టి నిలుపు. సత్కర్మలు చేస్తానని, దుష్కర్మలకు దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ  చెయ్యి. నీ లెక్కల్ని నువ్వు సరి చూసుకో. ఉన్న వెలితిని పూర్తి చేసుకో. అల్లాహ్‌ా ఎంతో ప్రేమగా ఇస్తున్న ఈ పిలుపుని సదా గుర్తుంచుకో!
”విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్‌ాకు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కొరకు ఏమి సమకూర్చాడో చూసుకోవాలి. అల్లాహ్‌ాకు భయ పడుతూ ఉండండి. మీరు చేెసే పనులన్నీ అల్లాహ్‌ాకు తెలుసు. అల్లాహ్‌ా ను మరచిపోయిన వారిలా మీరు అయిపోకండి. అల్లాహ్‌ా మరచి పోవడంవల్ల అల్లాహ్‌ా వారిని తమని తాము మరచిపోయేలా చేశాడు”. (హష్ర్‌: 18,19)
‘విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి”. (తహ్రీమ్‌:6)

స్త్రీ విముక్తికి త్రి సూత్రాలు


(కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, అశయాలు, ఆకాంక్షలతోపాటు మరెన్నో అనుమానాలు, ప్రశ్నలను వెంటబెట్టుకొచ్చింది. కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారీ జీవితంలో అంతా నవ్యంగా కాకపోయినా సవ్యంగా జరగాలను కుంటాము. కానీ అలా జరగడం లేదు. అందుకు  దేశరాజధానిలో జరి గిన ’నిర్భయ’ ఉదంతమే సాక్ష్యం!  నిన్న వరంగల్‌లో స్వప్నిక, మొన్న విజ యవాడలో ఆయిషా మీరా, ఆపై శ్రీలక్ష్షీ, నిన్న హైదరాబాదులో అరుణ …ఇలా మహిళా భద్రత దిగజారుతున్న పరిస్థితులకు ఇవన్నీ రుజువులే! అంతేనా, మణిపూర్‌లో ఉద్యోగిని, అసోమ్‌లో విద్యార్థిని, కర్నాటకలో గృహిణి, తమిళనాడులో బాలిక…దేశమంతా కామాంధుల కరాళ నృత్యానికి బలవుతోంది మహిళ. ఈ కామ కాటుకు తరతమ భేదాలు, తన, పర ఙభేదాలు లేవు. మానవజాతి మనుగడకు ప్రాణం పోసిన మగువ మాన, ప్రాణాలకు రక్షణ కరువైన తరుణం ఇది! తరుణీమణుల ఆత్మ స్థయిర్య సాధనకు అగ్ని పరీక్షా  సమయమిది!! ఈ నేపథ్యంలో నెలవంక ఎక్జ్‌క్యూటివ్‌ ఎడిటర్‌ మౌలానా అబ్దుల్‌ ఖాదిర్‌ ఉమ్రీ గారు అందించిన వ్యాసమే ఇది.   - ఎడిటర్‌)
నేడు ఒక వైపున ఆడపడచులు చదువులో నూ కొలువులోనూ ముందుకు దూసుకొని పోతూ ’హమ్‌ కిసీసె కమ్‌ నహీ’ మేమూ అనుకున్నది సాధించగలం అంటూ ’విజయ భేరి’ని మ్రోగిస్తున్నారు. ఇది ఎంతైనా హర్షించ దగ్గ విషయమే. ఇది ఒక కోణం. ఎంత చదు వుకున్నా, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, సమర్థు రాలిగా నిరూపించుకున్నా, స్వయంకృషితో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నా అనుదినం ఉన్మాదుల అఘాయిత్యాలకు బల వుతున్నారు అబలలు. ఇది మరో కోణం.నారీ మణులు నవ యుగానికి నాంది వాచకాలవ్వా లంటూ నినదించే నాయకమన్యులు సయితం స్త్రీ అణచివేతపై శీతకన్ను వేశారు.ఆ మాట కొస్తే ’స్త్రీలను గౌరవిద్దాం, వారికి కేటాయించి న సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అన్న మాట ను గౌరవ భావంతో చూసే పౌరుల సంఖ్య ఎంత?
స్త్రీమూర్తి-వివాహిత అయినా అవివాహిత అయినా ఆమెకు సమాజంలో రక్షణ కరువైపో యింది. కాలేజిలో ఉన్మాది వేధిస్తున్నాడని చదువు మానేసి ఇంట్లో ఉంటున్న అమ్మాయి కీ భద్రత అంతంత మాత్రమే. భర్త పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఇల్లాలి శీలానికీ రక్షణ పూజ్యమే. చివరికి రక్షణాలయాలలో కూడా భద్రత లేని దుస్థితి. ’ఆధునికం’ అని మనం గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నాము కానీ, నిజంగా మనం నేటికీ ఆటవికంలోనే జీవిస్తు న్నాము.
‘అబలలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపండి’ అంటూ నినాదాలు అయితే వినబడు తున్నాయి. ఎవరు ఆపాలి? ఎలా ఆపాలి? చర్చించవలసిన అవసరం లేదా? సామాజిక స్పృహ అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత దేశ పౌరలుగా మనది కాదా? అన్యా యాన్ని ఎదుర్కోవడానికి, అత్యాచారాన్ని నియ ంత్రించడానికి కావాల్సింది మానవీయ విలు వల పట్ల గౌరవం. పరిస్థితుల, పరిసర ప్రభా వాల పట్ల, సంఘ తీరుతెన్నుల పట్ల సరైన దృక్పథం, సమాజాన్ని సంస్కరించాలన్న దృఢ సంకల్పం, ప్రశ్నించే తత్వం, సాధించగలమనే ఆత్మ విశ్వాసం. ఈ భావాలన్నీ దాదాపు అంద రిలోనూ ఉంటాయి. అయితే, కొన్ని అడు గంటి పోయాయి. ఇంకొన్ని జీవం కోల్పో యాయి. మరికొన్ని నిర్లిప్తతలో పడి కొట్ట్టుకు పోతున్నాయి. ఒక దేశ సత్పౌరులుగా మనం చేయాల్సిందిల్లా వాటిని కూడగట్టుకోవడం, తిరిగి రెట్టింపు శక్తితో పోరాడటం.  అబలల రక్షణ కోసం ఇస్లాం ప్రతిపాదించే  కొన్ని సూత్రాల్ని ఇక్కడ పొందు పరుస్తు న్నాము.
మొదట సూత్రం: వయసుకు వచ్చిన పిల్లల్ని వివాహం చేసెయ్యాలి.  మానవ నైజంలో లైంగిక కోర్కెల్ని ఉంచాడు విధాత. ఆ కోర్కెల్ని అదుపులో ఉంచడానికి, ధర్మసమ్మతంగా కోర్కెల తృప్తి కోసం వివాహ వ్యవస్థను నియమించాడు ”మీలో ఎవరు వివాహం లేకుండా ఒంటరిగా ఉంటున్నారో; మీ స్త్రీ పురుష బానిసలలో ఎవరు గుణవం తులో, వారి వివాహాలు చేసి వేయండి. వారు గనక పేదవారయితే అల్లాహ్‌ా తన అనుగ్ర హంతో వారిని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్‌ా అంతులేని వనరులు కలవాడు. సర్వమూ తెలసినవాడు”. (అన్నూర్‌:32)
వివాహం లేకుండా ఎవరూ ఉండ కూడదని, వివాహ విషయంలో పేదరికం అడ్డు రాకూడ దని తెలియజేస్తూ తమ సంరక్షణలో ఉన్న వారి వివాహాలు చేయడంలో కుటుంబ పెద్దల జాప్యం కూడదని త్వర పడాలని అల్లాహ్‌ా తాకీదు చేస్తున్నాడు.  ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, యువత ఆర్థికంగా బలపడిన తరువాతే వారి వివాహాలు చేయాలన్న ఆలోచన తప్పు కాదు. కాని ’సంపాదన లేదు’ కదా అంటూ వివా హాల విషయంలో జాప్యం చేయడం వల్ల వారు అడ్డ దారులు త్రొక్కే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి వివాహాలను సులభతరం చెయ్యాలి. విలాసవంతమైన జీవితాన్ని కాంక్షి ంచకుండా, వరకట్నాన్ని రూపుమాపి లైంగిక విశృంభలత్వాన్ని అరికట్టడానికి కుటుంబ సం రక్షకులు పెద్దలు అన్నివిధాలా కృషి చేయాలి.
రెండవ సూత్రం: అశ్లీలతను  అంతమొం దించాలి.  సమాజంలో అందరూ ఒకేలా ఆలోచించరు. పుట్టి పెరిగిన వాతావరణమే కాదు, అంగాంగ ప్రదర్శనే ధ్యేయంగా ఉండే సినిమాలు, నీలి చిత్రాలు, అశ్లీల వ్యాపార ప్రకటనలు, పాశ్చా త్య దుష్కృతి అనుకరణలు, వీపరీత పోకడలు ..విచ్చలవిడితనాలు…క్లబ్బులు..ప్లబ్బులు… తెలిసీ తెలియని వయసు యువతను పెడ త్రోవ పట్టిస్తున్నాయి. ప్రమాదపుటంచుల వైపు తీసుకెళుతున్నాయి. వీటన్నింటినీ నియంత్రిం చాల్సిన ప్రభుత్వం నీళ్ల్లు నములుతోంది. కారుణ్య ప్రభువు అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు ”విశ్వాసుల వర్గంలో అశ్లీలత   వ్యాపించాలని కోరేవారు, ప్రపంచంలోనూ,పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులు”. (24:19)
‘నిర్భయ’ను రాజధానిలో నరులు నడిచి వెళుతున్న నడిరొడ్డు మీద వివస్త్రను చేసి నర రూప రాక్షసులు నిర్దయగా విసిరేస్తే ’మగువ కు మానమే ప్రాణం’ అని తెలిసిన మనషుల కు వస్త్రం కప్పాలన్న కనీస మానవత్వం కరు వవ్వడం చూసి భూమి విలపించింది. ఆకా శం ప్రకోపించి, ప్రకంపించింది.కానీ పాషాణ హృదయం చలించలేదు. మరోసారి ’మృగాల కన్నా హీనం మానవ సంస్కృతి’ అని నిరూ పించుకుంది. మన ప్రక్కనే ఒకరు వేధించబ డుతున్నా ’మనకెందుక’ని స్పందన చచ్చిన శవంలా ఉండి పోవడం సబబేనా? నేడు ఒక రికి, రేపలా మన ఆత్మీయులకే, మనకే జర గొచ్చు. ఒక కాకికి ఏదయినా జరిగితే కాకు లు సమూహాల్లా కూడతాయి. ఒక కోతి చని పోతే సకల మర్కటాలూ ఏకమవుతాయి. జంతువులకున్న కనీస సలక్షణాలు కూడా మనకు లేకుండా పోతున్నాయో దీన్నేమనాలి?
నగరంలో మురికి మాలిన్యాలు పెరగడం వల్ల అంటువ్యాధి మహమ్మారిలా వ్యాపిస్తే, గాలిలోని వైరస్‌ ఆ ఇంటివారికి  మాత్రమే సోకదు; అదే నగరంలో ఆరోగ్య సూత్రాలను స్వయంగా పాటిస్తూ ప్రతి రోజూ స్నానం చేస్తూ తన ఇంటిని ఇంటివారిని పరి శుభ్రం గా ఉంచుకునే వ్యక్తిని కూడా ప్రభావితం చేస్తాయి. మృత్యువాతన కూడా పడవచ్చు. ఈ నేపథ్యంలో విశ్వప్రభువు అల్లాహ్‌ా చేసిన హెచ్చరిక మనందరికి కనువిప్పు కావాలి:
”ఆ ఉపద్రవానికి భయ పడండి. అది కేవలం మీలో దుర్మార్గులయిన వారిపైన మటుకే ప్రత్యేకంగా దాపురించదు”. (సద్వర్తనులు సయితం దాని వాతన పడతారు. వారి గౌరవ మర్యాదలకు సయితం విఘాతం కలుగు తుంది.) (8:25) పోతే,
పిల్లల మనస్తత్వం రూపు దాల్చడంలో కన్న వారి పాత్ర చాల కీలకం అన్నది తెలిసిందే. పిల్లలపై బయటి పరిస్థితుల, చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం అధికంగానే ఉంటుంది. కాబట్టి ఇంట్ల్లో అమ్మానాన్నలు పిల్లల ప్రవర్తన ను ఓ కంట కనిపెట్టాలి.మంచీచెడులను వారి కర్థమయ్యేలా ఓపిగ్గా వివరించాలి. ముఖ్యంగా చెప్పడం వరకే పరిమితం అవ్వక చేతలకు సయితం పని కల్పించాలి.మాఅబ్బాయి చాలా మంచివాడు, మా అమ్మాయి చాలా ఉత్తము రాలు అంటూ సంబరపడిపోతే సరిపోదు.    ఇది పాత కాలపు మాటగా అన్పించవచ్చు. కానీ, ఇదే వాస్తవం. ఎవరయినాసరే, కుటుం బంగానీ, సమాజంగాని వారికిచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు. స్వేచ్ఛ పేరుతో ’మేమెలాంటి దుస్తులైనా తొడుక్కుంటాము. ముందు మీ మగ చూపుల్ని మార్చుకోండి’ అన్న బరి తెగించిన మాటలు అసలే కూడదు. లాంగ్‌ డ్రైవ్‌కి, డేటింగ్‌కి వెళ్ళడం మిక్కిలి ప్రమాదకరం. ఆటోల్లో సయితం ఒంటరి  ప్రయాణం మంచిది కాదు. ఆధునిక వస్త్రధా రణ పేరుతో బిగుతైన దుస్తులు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. జాగ్రత్త పడటం చాదస్తం కాదు. అప్రమత్తత అని గ్రహి చాలి.
మూడవ సూత్రం: మంచిని ఆదేశించాలి. చెడును నిరోధించాలి. ”మీలో మంచి వైపుకు పిలిచేవారూ, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించే వారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు.” అని విశ్వకర్త ఉపదేశిస్తు న్నాడు కాబట్టి, మనలో ఒక వర్గం ఉండాలి. అది వివేచన, విజ్ఞతల ఉత్తమ ఉపదేశం ద్వారా యువత శీలనిర్మాణం కోసం అలుపెర గని కృషి చేస్తూ ఉండాలి.
మానవతా ప్రేమికులు,మానవతా సానుభూతి పరులు జాతి స్త్రీలను కామాంధుల పంజా నుండి విమోచనం కలిగించి, వారు ఆనందం గా సురక్షితంగా, గౌరవంగా జీవించడానికి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పనంత వరకు సంతృప్తి చెందరు. విషపూరితమైన అవయవాన్ని తొలగించి ఒక ప్రాణాన్ని కాపా డినట్లు కామాంధులను, కల్లోల జనకుల్ని అంతమొందించి ’స్త్రీ’కి రక్షణ కల్పించడానికి మానవతా ప్రేమికులు ముందుకు రావాలి. ఈ విషయంలో జాప్యం వహించేవారిని అల్లాహ్‌ా ఇలా నిలదీస్తున్నాడు: ”మీకేమయింది? ‘మా ప్రభూ! దుర్మార్గుల ఈ పురము నుండి మాకు  విముక్తి నొసగు. మా కొరకు నీవద్ద నుండి ఒక సహాయకుణ్ణి నియ మించు, మాకు (అండగా) నీవద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పంపించు’ అని వేడుకుంటున్న బలహీన పురుషులు, స్త్రీలు, పసివాళ్ళ విమో చనకై మీరు అల్లాహ్‌ా మార్గంలో ఎందుకు పోరాడటం లేదు?!” (అన్‌నిసా: 75)

సమాజానికి పట్టిన చీడ వడ్డీ పీడ


వడ్డీ మానత్వానికి వ్యతిరేకంగా ఓ సామాజిక మహాపరాధం. ఇది దురదుష్టవశాత్తు మానవ సమాజాలన్నింటిలోనూ క్యాన్సర్‌లా వ్యాప్తి    చెందింది. ఏ ఒక్క మానవుడు, ఏ ఒక్క వ్యాపా రం, ఏ ఒక్క బ్యాంకు కూడా దీని ప్రభావం నుండి బహుశా సురక్షితంగా లేదేమో! ఈ పాపం ఎంతగా వ్యాప్తి చెందిందంటే దాన్ని నిషే ధంగా, పాపంగా భావించే వారిని లోకం నేరస్తులుగా చూస్తున్నది. నిజానికి ఇది ప్రళ యం సమీపించిందనటానికి ఓ ఆనవాలు. అలాగే జాతులు, రాజ్యాల వినాశానికి కూడా ఇది ఒక సంకేతం. వినాశకరమైన ఈ పాపం గురించి పాఠకులకు కొన్ని ఇస్లామీయ ఆదేశాలు తెలియపరుస్తున్నాం. బహుశా దీని ద్వారా వడ్డీ శాపానికి గురై ఉన్న సోదరులకు పశ్చాత్తా పం(తౌబా)చెందే సద్బుద్ధి లభిస్తుందని ఆశిస్తు న్నాము.
 వడ్డీ నిర్వచనం
వడ్డీని అరబీలో ”రిబా” అంటారు. నిఘంటువు ప్రకారం దీనికి వృద్ధి, అధికం, అదనం అనే అర్థాలొస్తాయి. షరీఅత్‌ పరిభాషలో ”రిబా” నిర్వచనం పలు విధాలుగా చేయడం జరిగింది. ఇమామ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ జుర్‌జానీ గారు రిబా గురించి ఇలా వివరించారు: ”ఏదైనా ఒక వస్తువుకు బదులు ఒక వర్గం మరో వర్గంపై షరతుగా విధించే ప్రతి ఒక్క అధిక సొమ్ముని రిబా అని అంటారు.      (అత్తారీఫాత్‌ లిల్‌ జుర్‌జానీ :114)
ఒక వర్గానికి అసలు ధనంపైన లాభాన్నిచ్చే ప్రతి రుణాన్ని రిబా అంటారు.  (కషాఫ్‌ ఇస్తిలా హాతుల్‌ ఫునూన్‌)   భారత ఉపఖండంలో పేరు పొందిన పండితులు మౌలానా అబ్దుల్‌ మన్నాన్‌ నూర్‌పూరీ వడ్డీ గురించి  వివరిస్తూ  ఇలా అన్నారు: ప్రజా బాహుళ్యంలో వడ్డీగా ప్రసిద్ధి చెందిన ప్రతి సొమ్మూ వడ్డీ అవుతుంది .అది వ్యక్తిగతమైనదైనా, సమాజపరమైనదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, బ్యాంకులకు సంబంధించినదైనా, ఇన్సూరెన్స్‌కు సంబంధిం చినదైనా, కంపెనీలకు సంబందించినదైనా, ముస్లిం రాజ్యంలోనయినా, ముస్లిం దేశం కాక పోయినా, ముస్లింల తరపునైనా, ముస్లిమేతరుల తరపునైనా జిమ్మీల, తరపునైనా, హర్‌బీల తరపు నైనా, ఆకాశం క్రింద భూమి పైన   ఏ భాగంలో నయినా జనబాహుళ్యంలో వడ్డీగా పరగణించ బడే ప్రతి వస్తువుని వడ్డీ అంటారు.                                                                                                                                                                                 (ఇస్తిఫాదహ్‌ అజ్‌ మఖాలాత్‌ నూర్‌పూరీ:64)
 వడ్డీ నిషేధాజ్ఞ
ఇస్లాంకు పూర్వం అరబ్బులలో వడ్డీ రివాజు సర్వసామాన్యంగా ఉండేది. వ్యాపారంలోనూ, ఇతర ఇచ్చిపుచ్చుకునే వ్యవహారలలోనూ వడ్డీ చాలా రకాలుగా వ్యాపించిపోయి ఉండేది. అప్పటికి మక్కాలో ఇస్లామీయ వ్యవస్థ పూర్తిగా స్థాపించబడలేదు.అందుచేత ఇస్లాం యొక్క ఎక్కువ ఆజ్ఞలు మదీనాలో అవతరించాయి. మదీనాలో ఇస్లామీయ సమాజం సలక్షణంగా స్థాపించ  బడి ఉండింది. అందువల్ల దైవప్రవక్త (స) యొక్క మదనీ జీవితపు మొదటి రోజులలోనే అల్లాహ్‌ వడ్డీని నిషేధించాడు.  అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:  ”ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్‌కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి. ఒక వేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు. ఒకవేళ రుణ గ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయో దాయకం”.                                              (అల్‌ బఖర:278-280)
”ఓ విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి.మీరు సాఫల్యం  పొందటానికి గాను అల్లాహ్‌కు భయపడండి. అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి. అల్లాహ్‌కూ, ప్రవక్తకూ విధేయత చూపండి-తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది.  (ఆలి ఇమ్రాన్‌:130-132)                          హజ్జతుల్‌ వదా సందర్భంగా అరేబియా నలు మూలల నుంచి సహాబాలు తరలి వచ్చారు. అటువంటి సమయంలో దైవప్రవక్త(స) మారుపరమైనా మరియు వ్యాపారపరమైన వడ్డీ నిషేధాన్ని ప్రకటించారు: ఆయన (స) ఇలా అన్నారు: ”వినండి! అజ్ఞాన కాలం నాటి ప్రతి వస్తువు నా కాళ్ళక్రిందనలిపివేయబడింది. అజ్ఞాన కాలంనాటి రక్తాలు కూడా రూపుమాప బడ్డాయి. ఇక మా రక్తాలలో నుంచి నేను తుడిచి వేస్తున్న మొదటి రక్తం రబీఅ బిన్‌ హారిస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారి కుమారునిది. ఈ పసివాడు బనీ సఅద్‌లో పాలు త్రాగే సమయంలో హుజైల్‌ తెగకు చెందినవారు (కొందరు) అతనిని  చంపివేశారు. మరి అజ్ఞాన కాలంనాటి వడ్డీ కూడా తుడిచివేయబడింది. మా వడ్డీలలో నుం చి నేను తుడిచి వేస్తున్న మొదటి వడ్డీ అబ్బాస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారిది. (బుఖారి)
హదీసులలో వడ్డీ ఖండన
హజ్రత్‌ అబూహురైర (ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ఏడు ప్రాణాంతక వస్తువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. అవి ఏమిటని ప్రశ్నించగా ఆయన (స) ఇలా తెలియజేశారు: 1.ఒక్కడైన అల్లాహ్‌కు  సహవర్తులుగా వేరొక దైవాన్ని నిలబెట్టడం. 2 . చేతబడి చేయడం, చేయించడం. 3. అన్యాయంగా హత్య చేయటం.  4. అనాధల సొమ్ము  అన్యాయంగా తినటం. 5. వడ్డీ తినటం. 6. ధర్మయుద్ధ సమయంలో యుద్ధరంగం నుండి వెన్నుచూపి పారిపోవటం. 7. పాపం ఎరుగని సౌశీల్యవతి అయిన మహిళపై అపనింద మోపడం.     (బుఖారి:2766, ముస్లిం:89)
హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ హన్‌జల (ర) (ఈయన తండ్రి హన్‌జల బిన్‌ ఆమిర్‌ని ఉహద్‌ పోరాటo లో దైవదూతలు స్నానం చేయించారు) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచిం చారు: తెలిసి కూడా వడ్డీలోని ఒక్క దిర్‌హమ్‌ తిన్నవాడు 36సార్లు వ్యభిచారం చేసినదానికన్నా ఎక్కువ పాపం చేసినట్లు లెక్క.  (అహ్మద్‌,తబ్రాని)                                        దైవప్రవక్త (స) ప్రవచించారని హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర) ఉల్లేఖించారు:  వడ్డీలో డెబ్బయి మూడు స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి యొక్క పాపం ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్ఠలను మంట గలపటం. (హాకిం,బైహఖీ)                       హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) కథనం: దైవప్రవక్త (స) వడ్డీ తీసుకునే వారినీ, ఇచ్చే వారి నీ, దీనికి సాక్షులుగా ఉండే వారినీ ధూత్కరించారు. ఆయన (స) ఇంకా ఇలా అన్నారు: ఈ పాపాన్ని మూట కట్టుకోవటంలో వీరంతా సమానులే.   (ముస్లిం )                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌(ర) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా తెలియజేసారు: ఏ ఊరిలోనైతే వ్యభిచారం మరియు వడ్డీ రివాజుగా మారిపోతుందో అక్కడి నివాసులు తమపైన దైవ శిక్షను హలాల్‌ చేసుకున్నట్లు.  (ముస్తద్‌రక్‌ లిల్‌ హాకిం)
వడ్డీ పెరగదు, తరుగుతుంది  
వడ్డీ పెరుగుతుందని భావించడం ఒక భ్రమ మాత్రమే. అల్లాహ్‌ మరియు దైవప్రవక్త (స) వ డ్డీ తరుగుతుందని అది నాశనానికి కారణమని తెలియజేశారు. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”అల్లాహ్‌ వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిస్టులను అల్లాహ్‌ సుతరామూ ప్రేమించడు. విశ్వసించి (సున్నత్‌ ప్రకారం) సత్కార్యాలు చేసే వారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింత గానీ ఉండవు”. (అల్‌ బఖర:276-277)
 ”యమ్‌హఖుల్లాహుర్రిబా” అనే వాక్యానికి వివరణ ఇస్తూ హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా అన్నారు: ముహిఖ్‌ అంటే తరగటం. అది ఎలా జరుగుతుందంటే అల్లాహ్‌ వడ్డీ తినేవాని హజ్‌, దానధర్మాలు, జిహాద్‌, బంధుత్వాలను పెంపొందించటం లాంటి పుణ్యా లు స్వీకరించడు. అనగా అతని ఏ ఒక్క పుణ్యం గాని స్వీకరించబడదు.  (తఫ్‌సీర్‌ ఖుర్‌తుబీ : 2/234)
అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌ఊద్‌ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స)ఇలా తెలియజేశారు: ఏ వ్యక్తి అయితే వడ్డీ ద్వారా ఎక్కువ ధనం సంపాదించాడో చివరకు దాని ఫలితం నశించటమే అవుతుంది. ( ఇబ్నెమాజ)    మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: వడ్డీ చూడటానికి ఎక్కువగా కనిపించినా చివరకు అది  నశిస్తుంది. (ముస్తద్‌రక్‌ హాకిం)
ప్రపంచాన్ని ప్రేమించే మనిషి వడ్డీతో ధనం పెరుగుతుందనీ, జకాత్‌తో ధనం తరుగుతుందనీ భావిస్తాడు. ఇది వాస్తవానికి విరుద్ధం. ఇలాoటి ధనపూజారుల మార్గదర్శకం కోసం వడ్డీకి బదులుగా అల్లాహ్‌ జకాత్‌ మరియు దాన ధర్మాలను పెట్టి వీటి ద్వారానే ధనం పెరుగుతుందని తెలియజేశాడు. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:   ”ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్‌ దృష్టిలో ఎంత మాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లాహ్‌ ముఖాన్ని చూచేందుకు (ప్రసన్నతను చూరగొనేందుకు) మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే -అలాంటివారే  (తమ సంపదలను) ఎన్నో రెట్లు వృద్ధిపరచుకున్న వారవుతారు. ( అర్‌ రూమ్‌:39)
       వడ్డీ తినేవారి పరిస్థితి
ప్రళయ దినాన వడ్డీ తినేవారు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటారు వీరు ప్రపంచంలో ఉన్నప్పుడు వడ్డీ తింటూ ఉండేవారని, చూసేవారు గ్రహిస్తారు. (ఇలాంటి వారి గురించి) అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు: ”వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం ”వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్‌ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధిం చాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు.  అతని వ్యవహారం దైవాధీనం. ఇక మీదట  కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు.  వారు కలకాలం అందులో పడి ఉంటారు.   (అల్‌బఖర:275)                                                                                                       హజ్రత్‌ ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలాతెలియజేశారు: ”(పశ్చాత్తాపంతోతప్ప) క్షమించబడని పాపాలనుండి మీరు మిమ్మల్ని కాపాడుకోండి.(1)ఏదైనా విషయంలో ద్రోహం చేసిన వ్యక్తి అతను ద్రోహం చేసిన వస్తువుతో ప్రళయదినాన లేపబడతాడు. (2) వడ్డీ తినటం: వడ్డీ తినేవాడు ప్రళయ దినాన పిచ్చివాడిలా తూగుతూ లేపబడతాడు. తరువాత దైవప్రవక్త(స) ఈ వాక్యాన్ని పఠించారు: ”వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్లఉన్మాది అయిన వాని లాగానే నిలబడతాడు ( తర్‌గీబ్‌ వ తర్‌హీబ్‌)
వడ్డీ ఎంత తీవ్రమైన పాపమంటే ఇది సమాధిలో శిక్షకు కారణభూతమవుతుంది. ప్రళయ దినాన కూడా శిక్షకు గురి చేస్తుంది. హజ్రత్‌ సముర బిన్‌ జున్‌దుబ్‌(ర) దైవ ప్రవక్త(స) చెప్పారని ఇలా అన్నారు: ”రాత్రి నా వద్దకు ఇద్దరు దైవదూతలు (జిబ్రయీల్‌, మీకాయీల్‌) వచ్చారు, వీరు నన్ను ఎత్తుకుని ఒక పవిత్ర స్థలం వైపునకు తీసుకెళ్ళారు, అక్కడ దైవప్రవక్త(స) ఎన్నో విషయాలను చూశారు, వీటిలో ఒకటి ఒక రక్తపు నది కనిపించింది, అందులో ఒక మనిషి ఈదుతున్నాడు, నది ఒడ్డున ఒక మనిషి నిలుచుని ఉన్నాడు అతని దగ్గర ఎన్నో రాళ్ళున్నాయి, నదిలో ఉన్న వ్యక్తి బయటకు రావటానికి ప్రయత్నించినప్పుడు ఒడ్డున ఉన్న వ్యక్తి అతని ముఖం పై రాయి రువ్వుతున్నాడు, దాంతో అతను మళ్ళీ నది మధ్యలో వెళ్ళిపోతున్నాడు, ఈ విధంగా జరుగుతూనే ఉంది.ఇంతకీ ఏమిటి ఇది? అని నేను నా వెంట ఉన్న ఇద్దరిని ప్రశ్నించ గా ‘నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి వడ్డీ సొమ్ము తినేవాడు. అందువల్ల తన కర్మకు శిక్ష  అనుభ విస్తున్నాడు, ఈ శిక్ష  ప్రళయం వరకూ అనుభవిస్తూనే ఉంటాడు అని వారు జవాబు చెప్పారు.”   ( బుఖారి)

పరివర్త్తనే పరమావధిగా…



భారతీయులు సంభాషణా చతురులు. వాక్భూషణులు. చిన్న పరిచయం చాలు ఇట్టే అల్లుకు పోతారు. పరిచయం లేకపోయినా సరే…దరహాస తోరణాలతో, అభివాద పూ బాణాలతో ఇట్టే ఆకట్టుకుంటారు. వారి ఈ విశేష గుణం కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా వారంటే అభిమానం, నమ్మకం. ప్రజలు మన పట్ల కలిగి ఉన్న ఆ నమ్మకాన్ని, ప్రత్యేకతను కాపాడు కోవాల్సిన బాధ్యత భారత సత్పౌరులుగా మనందరిపై ఉంది.
మనమందరం భారతీయులం. మనమందరం ఒకే దేవుని దాసులం. తెల్లవారయినా, నల్లవారయినా, ధనికులయినా, పేదవారయినా, ముస్లింలయినా, హిందువులయినా, సిఖ్ఖులయినా, క్రైస్తవులయినా, ఆస్తికులయినా, నాస్తికులయినా, ఆంగ్లేయులయినా, అరబ్బులయి నా  అందరం మానవ జాతికి చెందిన వారమే. జగమంతా మన కుటుంబమే.  మనమూ ఆ కుటుంబంలో అంతర్భాగమే. మనలో శత్రువుని సయితం కనికరించే ప్రేమతత్వం చిగు రించాలి. సంకుచితత్వం, స్వార్థబుద్ధి అంతరించాలి. అంటరానితనం, అస్పృశ్యత, ఓర్వలేని తనం, జాత్యాహంకారం, వర్గ దురభిమానం, కుల పిచ్చి, వేర్పాటు వాదం వంటి వినాశ కాలు దూరమవ్వాలి. మనలో ప్రతి ఒక్కరు శాంతిసుస్థిరతల వాతావరణం కోసం మన వంతు కృషి చేయాలి. శాంతి విఘాతక శక్తుల్ని, మానవతా ద్రోహుల్ని నిలువరించాలి, నియంత్రించాలి.
నేటి ఈ గణతంత్ర దిన శుభ సందర్భంగా - ’మజ్‌హబ్‌ నహీ సిఖాతా ఆపస్‌ మేఁ బైర్‌ రఖ్నా’ - ఏ మతమయినా బోధించదుగా ద్వేషాన్ని-రూపు దిద్దుదాం భిన్నత్వంలో ఏక త్వాన్ని’ అన్న మాటకు అక్షర రూపాలయి భాసిల్లాలి మనం. మనసా, వాచా, కర్మణా  దేశ అభ్యున్నతిని, దేశ సుస్థిరతను, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాలి మనం. దేశం మనకేమి చ్చిందన్న ఆత్మ నిందను మాని, మనం దేశానికి ఏమివ్వగలమన్న ఆత్మావలోకనం మనలోని ప్రతి ఒక్కరిలో చోటు చేసుకోవాలి. మనం ఎదగాలి, మన దేశాన్ని ప్రగతి పథాన నడిపిం చాలి. దేశ పౌరుల సమస్యల పరిష్కార్థం నిస్వార్థంగా ముందుకు వచ్చే ఉత్తమ లక్షణాలు గల వారినే మనం మన నాయకులుగా ఎన్నుకోవాలి. ప్రజల ప్రతి ”నిధి”ని దోచుకుని బ్యాంకుల్లో  దాచుకునే ప్రతి వంచకుణ్ణి ప్రతిఘటించాలి. దేశ రక్షణ కోసం, శాంతి విఘాతక శక్తుల నిర్మూలన కోసం పూర్తి చిత్తశుద్ధితో, అంకిత భావంతో మనమం దరం సంఘటితంగా కృషి చేయాలి.  వరకట్న దురాచారాన్ని, లంచగొండితనాన్ని పారద్రో లేందుకు ప్రతీన బూనాలి మనం. ధర్శ సంస్థాపనార్థాయః అవిరళంగా పరిశమ్రించేందుకు కంకణం కట్టాలి మనం.
పిల్లల్ని ప్రేమించాలి మనం. పెద్దలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించాలి. గురువులను అభిమానించాలి.  మనలో దాతృత్వం, సేవా దృక్పథం మొగ్గలు తొడగాలి. నిరుపేదలను ఆదుకోవాలి. అనాథలకు ఆశ్రయం కల్పించాలి. వితంతువులకు, వికలాంగులకు సహాయ పడాలి. మన ప్రేమను మానవుల వరకే పరిమితం చేయక జీవ కోటి వరకు విస్తరింప జేయాలి. తల్లిదండ్రుల ఎడల, బంధుమిత్రుల పట్ల మంచిగా మెలగాలి మనం.
ఈ శుభ సందర్బంగా ప్రవాసాంధ్రులతో  మాదో విన్నపం-తేనెలొలికే తెలుగుని కాపాడు కోవాల్సిన బాధ్యత తెలుగువారిగా మనందరిపై ఉంది. భాషకు మనసును గెలుచుకునే మహత్తర శక్తి ఎలాగయియితే ఉంటుందో, మనసుల్ని, మనుషుల్ని దూరం చేసే, విడదీసే శక్త్తి కూడా అంతే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే – మన బలహీనతా సంభాషణే, మన బలమూ సంభాషణే. మాటలు మాత్రమే కలిస్తే అదో మొక్కుబడి సంభాషణ అవు తుంది. హృదయాలు కూడా కలిసినప్పుడే దానికి అందమూ, అర్థమూ, పరమార్థమూ ఉం టుంది. సభా మర్యాదలు ఎంత అవసరమో సంభాషణా మర్యాదలూ అంతే అవసరం.
పోతే, తెలుగు పలుకుల్లో గల మాధుర్యం అనిర్వచనీయం! అవి కొత్తావకాయలా నోరూరు స్తాయి. నేతి అరిసెల్లా ఘుమఘుమలాడుతాయి. రాగి సంగటిలా కమ్మగా ఉంటాయి. సకి నాల్లా కరకరలాడుతుంటాయి. పూర్ణాల్లా నర్మగర్భంగా అనిపిస్తాయి. చల్ల మిరపకాయల్లా భలే చురకలూ పుట్టిస్తాయి. పూత రేకుల్లాంటి  తెలుగు పలుకుల సౌరభాలను విశ్వ వ్యాప్తం చేసేందుకు ప్రయత్నిద్దాం రండీ!

మనం అలా లేమే…!


తనను ఒకరితో పోల్చుకోవడం మనిషికి బాల్యం నుండి అలవడే ఓ ప్రక్రియ. ఇది మనిషి జీవితంలో మమేకమయి ఉండటాన్ని మనం గమనించగలం. ఎవరి అస్తిత్వం వారిది. ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి జీవన విధానం వారిది. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేెసుకోని కారణంగా మనిషి తన జీవనయానంలో ప్రతి థలో ఇతరులతో పోల్చుకుంటూ సమస్యల సుడి గుండంలో తనను తాను నెట్టేసుకుంటుంటాడు. అప్పుడప్పుడు పోలిక కొన్ని పనులు చేయడానికి ఉద్దీపనంలా ఉంటుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పోల్చుకునే ఈ గుణం అన్ని వేళలా శ్రేయో దాయకం కాదు.  శైశవంలో, బాల్యంలో పోల్చుకోవడం వల్ల  అనేక విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది.  ఆ మేరకు అది ఉపయుక్తంగానే ఉంటుంది.  కానీ ఒక మనిషి వ్యక్తిత్వం రూపొందే థలో ఒకరితో  పోల్చుకునే ఈ గుణం మానుకోకపోతే తనదైన రీతి, తనదైన ముద్ర ఒకటి ఏర్పడటం కష్టం అవు తుంది. ఏతా వాతా ఇది వ్యక్తిత్వ రాహిత్యానికి దారి తీసి మనిషిని అసంతుష్టుణ్ణి చేస్తుంది. ఏదో కోల్పోయినట్లు అసహనంతో వ్యవహరిస్తుంటాడు. నిజంగా తనేమిటో తనకే తెలియని స్థితి దుర్భరం.
పోల్చుకోవడం మొదలెడితే దాని హద్దూ పద్దూ ఉండదు. చాలా మంది తమల్ని ఇతరుల ఆస్తిపాస్తు లతో, హోదా అంతస్థులతో పోల్చుకుని అవి తమకు ప్రాప్తం కాలేదని తీవ్ర అసంతృప్తికి గురవుతుం టారు. ఖచ్చితంగా తమకు ఏం కావాలో తేల్చుకోని  వారే ఇలా పోల్చుకుంటుంటారన్నది మానసిక శాస్త్రవేత్తల మాట.  ఈ పోల్చుకునే గుణం చివరికి దైవానికి సయితం పోలికలు కల్పించే స్థాయికి దిగజార్చుతుంది. ఫలితం – మనిషి  ఇహపరాలు నాశనమవుతాయి. పోతే,
‘మనం అలా లేమే’ అన్న భావం చాలా మంది స్త్రీలను కృంగదీస్తుంది. ’నాకు అందం లేదనో, నా స్వరం బాగోలేదనో, నేను చాల పొట్టిననో, నేను ఫలానావిడలా లేననో’ అంటూ వాపోతుంటారు కొందరు. అర్హత లేని వారు అర్హతను నిరూపించుకునేందుకు పడే పాట్లు తెలియని కావు. అలాగే అందవిహీనంగా ఉన్న అమ్మాయే తొందరగా ఇతరుల ఆకర్షణకి గురవుతుంది అంటారు మానసిక శాస్త్రవేత్తలు. కారణం – తన మీద నమ్మకం కలిగించుకోవడం కోసం.అదే విధంగా ’స్త్రీగా పుట్టడమే నేర’మని నిరతం నిరాశనిస్పృహలకు లోనయి జీవించే స్త్రీలు పురుషుల్లాంటి దుస్తులు, వారి లాంటి నడవడికను అలవర్చుకుని తాము దేనికీ తక్కువ కామని హొయలు పోతుంటారు. ఈ రెండు ధోర ణులు న్యూనతా మూలంగా చోటు చేసుకుంటాయన్నది గమనార్హం. దీనికి భిన్నంగా స్త్రీగా తన వ్యక్తి త్వాన్ని సంపాదించుకునేందుకు కృషి చేయాలి. ఒకరితో మనల్ని మనం పోల్చుకొని మనకు లేని పోలి కల కోసం పడే కష్టం, శ్రమ, మనలోని ప్రతిభాపాటవాలను ప్రగతి బాటన నడిపే విషయంలో వెచ్చించినట్లయితే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. లేదంటే సాధించిన ఆ కొద్ది ప్రగతి కూడా పోలికలతోనే గుర్తించబడుతుంది. ఈ కారణంగానే న్యూనతకు గురి చేసే ఇటువంటి వైఖరిని నిర సిస్తూ ప్రవక్త మహినీయ (స) ఇలా అభిశపించారు: ”పురుషుల వస్త్రధారణను అలవలంబించే స్త్రీలు, స్త్రీల వస్త్రధారణను అనుకరించే పురుషులు శపించబడ్డారు”. (ముస్నద్‌ అహ్మద్‌)
స్త్రీ సమస్య అనేది ఈనాటిది కాదు. ఇది సమాజికపరమైన సమస్య. అందుకని సాంఘీక విప్లవం రావాలి. సరైన ధార్మిక అవగాహనను ప్రజల్లో పెంపొందించాలి. దానికితోడు మనో ధైర్యాన్ని శక్తిలా చేసుకుని పోరాడే వ్యక్తిత్వాన్ని స్త్రీలు పెంపొందించుకోవాలి. ’వంట ఎవరు చేెశారు? అంట్లు ఎవరు తోమారు?’ అన్నది కాదు  ముఖ్యం. దాంపత్య జీవితంలో సమ ఉజ్జీల మధ్య ఓ అవగాహనతో ఎవరు ఏ పని చేసినా తప్పు లేదు. ఇంటి పని చేయడం స్వేచ్ఛకు అవరోధం అనుకునే స్త్రీలు తమ తమ రంగాల్లో రాణించిన విశ్వాసుల మాతలు కూడా ఆ పనుల్ని ఎంతో చక్కగా నిర్వర్తించారు అని గుర్తించాలి. అలాగే ఇంటి పని, వంట పని చేయడం అవమానంగా భావించే పురుషులు అన్ని రంగాల్లో ఆదర్శంగా అందరి నీరాజనాలందుకున్న మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సయితం ఇల్లు ఊడ్చే వారు, కూరగాయలు తరిగేవారు, బట్టలు కుట్టుకునేవారు, వీలైయినంతగా ఇల్లాలికి చేదోడు వాదోడుగా ఉండేవారన్న సంగతిని విస్మరించ కూడదు.
ఎవరయినా తాను కోరుకున్న ఒక వస్తువును పొందలేనప్పుడు అసంతృప్తికి లోనవుతున్నారంటే దానికి అర్థం ఉంటుంది కానీ, ఇతరుల్ని చూసి అసూయతో రగిలిపోతూ, అసంతృప్తికి గురవ్వడం కంటే అర్థరాహిత్యమయిన అంశం మరొకటి ఉండదు. మానసిక లోకంలో మనిషి ఈ ప్రవర్తన అతని మనో వికాస పతనానికి తార్కాణం. అందుకే పోల్చుకోవడం మాని తానేమిటో తెలుసుకుని, తేల్చుకుని వ్యవహరించే వారే ప్రశాంతంగా ఉండగల్గటంతోపాటు అనుకున్నది సాధించగలుగుతారు.

30, జనవరి 2013, బుధవారం

పేరు మానవీయం తీరు దానవీయం



సన్నిహితంగా ఉండాల్సిన మానవ సంబంధాలు కాస్త పురుషాహంకార ధోరణి పుణ్యమా అని సమాజం లోనూ, వివాహ వ్యవస్థలోనూ, ఇద్దరు సమ ఉజ్జీల మధ్య, సహ భాగస్వాముల మధ్య ఉండాల్సిన బాంధ వ్యానికి బదులు యజమాని, బానిస లాంటి వాతావరణం నెలకొని ఉండటం బాధాకరం!
గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఆకుకు అందని, పోకుకు పొందని పత్రిపాదనలతో స్వేచ్ఛ పేరుతో పమ్రి దల పరువును పాశ్చాత్య దుష్కృతి పాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప స్తీక్రి సంబంధించిన సమస్య మూలాలను శోధించి సరైన పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పయ్రత్నించడం లేదు నాయక శీల్రు. తన పాణ్రం, తన మానం విలువైనదనీ, ఎదుటి వారి పాణ్రం విలువ లేనిదని భావించే నాయ కులు, అధికారులు ఉన్నంత కాలం పజ్రలకు న్యాయం జరగడం అనేది నేతి బీరలో నెయ్యి చందమే.
తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. అది మనిషి లింగం, వర్ణాన్ని బట్టి ఉండదు. పత్రిభా సంపత్తిని మనిషి లింగాన్ని బట్టి నిర్ణయించడానికి వీల్లేదు. మేధాశక్తి ఒక లింగానికి, వర్ణానికే సొంతం కాదు. సీ్తలను కించ పరిచే, న్యూనతకు లోను చేసే పాతల్రు, సంభాషణలు ఇటు సాహిత్యంలోనూ, అటు సినిమాల్లో నూ ఎక్కువే. ఎక్కువ మగ సంతానమే ఉండాలన్న విష భావం మనిషి నరనరాల్లో నాటుకుపోతోంది. ఆడ బిడ్డ దేనికి తక్కువని మగ బిడ్డంటే ఎక్కడ లేని మక్కువ? లింగ వివక్షకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్య మాలు పుట్టాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి కూడా. కాని జన సామాన్యంలో ఆడ సంతానం పట్ల మమకారాన్ని పోద్రి చేయలేకపోయాయి. అప్పుడే పుట్టిన శిశువుని సయితం లింగాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి నిర్ణయించే దుర్మార్గం మన సమాజంలో అమలులో ఉంది.
చట్ట సభల్లో  33/ రిజర్వేషన్ల కోసం పోరాటం సాగుతూంది. మహిళలు దేశాన్ని పరిపాలిస్తున్నారు కూడా. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాతమ్రే. నేటికీ దేశ వ్యాప్తంగా ఆచారాల పేరుతో పభ్రుత్వం ఎప్పుడో నిషేధించిన జోగిని దురాచారం కొనసాగుతూనే ఉంది. ఒక మన రాష్ట్రంలోనే 24 వేల మంది జోగీనులున్నారంటే ఇక దేశమంతా కలిపితే? ఈ వ్యవస్థ మన దేశంలో రకరకాల పేర్లతో కొనసాగుతోంది. కెరళాలో ’మహారి’ అని, అస్సాంలో ’నాటి’ అని, మహారాష్ట్రలో ’మురళి’ అని, తమిళ నాడులో ’దేవరడియార్‌’ అని, కర్ణాటక మరియు రాయలసీమ కొన్ని జిల్లాల్లో ’బసవి’ అని పిలుస్తుం టారు. ఈ వ్యవస్థను గూర్చి తెలుసుకోవడం అంటే ఎందరో అమాయక అబలల కన్నీటి గాధలు తెలుసుకోవడమే.
ఎక్కడోగాని కనిపించని మానవీయం గురించి పెదవి విప్పాలా? ఎక్కడ చూసిన తాండవిస్తున్న దావీయం  గురించి మాట్లాడాలా? భూణ్రహత్యలు గురించి మాట్లాడాలా? పుట్టాక ముక్కు, చెవులు మూసేసి చంపే అమానవీయత గురించి మాట్లాడాలా? వావి వరసల్ని ఖాతరు చెయ్యని వింత పశువుల గురించి మాట్లాడాలా? సొంత విద్యార్థినిని చెరిచే ఉపాధ్యాయుల గురించి మాట్లాడాలా? పెళ్లయితే హింస, పెళ్ళి కాకపోతే  హింస, గల్లీలో హింస, ఢిల్లీలో హింస, యుద్ధహింస, మతహింస ఏ హింస గురించి మాట్లాడాలి? ఎంత కాలం మాట్లాడాలి?
శిశువు తెల్లగా ఎరగ్రా ఉంటే పరవాలేదంటారు. నల్లగా ఉంటే అయ్యో పాప కరిద్రే అని పెదవి విరుస్తారు. ఆడ శిశువు పుట్టింది మొదలు రకరకాల ఈసడింపులను ఎదుర్కొంటుంది.  బిడ్డ పుట్టిన సంతోషంకన్నా ఆడ బిడ్డ పుట్ట్టిందన్న పుట్టెడు దుఃఖమే అధికంగా ఉంటుంది. స్తీగ్రా పుట్టడం ఒక అనర్హతగా, ఒక నేరంగా పరిణమిస్తుంది. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పెర్కొంటుంది: ”వారిలో ఎవరికయినా కూతురు పుట్టిందన్న శుభవార్తను విన్పిస్తే, వాడి ముఖం నల్లగా మారి పోతుంది. లోలోపలే కుతకుతలాడిపోతాడు. ఈ దుర్వార్త విన్న తరువాత (ఇక లోకులకు ముఖం ఎలా చూపేది? అని) అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలానే భరిస్తూ బిడ్డను అట్టి పెట్టుకోవాలా? లేక దానిని మట్టిలో పూడ్చి పెట్టాలా? అని (పరిపరి విధాలుగా) ఆలోచిస్తాడు. చూడు! ఎంత జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు!”  (అన్‌ నహ్ల్‌ా: 58,59)
దేవుని దృష్టిలో ఆడ-మగ వివక్ష  లేదు. లింగ పాత్రిపదికపై నిమ్నోన్నతా భేదభావాలు కూడా ఆయన వద్ద చెల్లవు. ఒకటే జననం, ఒకటే మరణం. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం కలిసి కట్టుగా ముందడుగేయాలి. ఏ ఒక్కరో కాదు, ఒక జాతి, ఒక కులమో కాదు…మనమంతా ఏకమవ్వాలి. అన్యాయాన్ని అడ్డుకోవడానికి, అధర్మాన్ని నిలదీయడానికి, అకమ్రాలను నిలువరించడానికి మానవతా మార్గంలో అడ్డు తగులుతున్న పత్రిదాన్ని తొలగించడానికి కంకణం కట్టాలి. ఈ ఉద్యుమం మరింత ఉధృతం అవ్వాలి. కొన్ని రొజులు కాదు, నిరంతరం సాగాలి. ఇది కేవలం స్తీజ్రాతి అభ్యున్నతికై ఆరాటం మాతమ్రే కాదు. ఇది మానవాళి మనుగడగై పోరాటం! అలుపెరగకుండా సాగిపోవడమే మనందరి తక్షణ కర్తవ్యం!!

14, జనవరి 2013, సోమవారం

అనుమానాలు-మనో వాంఛలు.


షైతాన్‌ రెండు ప్రధాన మార్గాల ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తాడు. ఆ రెండు మార్గా ల్లో ఒకటి: అనుమానాలు. రెండోది: మనో వాంఛలు. సాధారణంగా ఈ రెండు విష యాలే మనిషిని తన ప్రభువు పట్ల అవి ధేయతకు పాల్పడమని పురికొల్పుతూ ఉం టాయి. దైవ ప్రసన్నతను బడసేందుకు దోహదపడే పనుల నుండి ఆపుతాయి. అనుమానాలు మనోవాంఛలు మనిషిని స్వర్గం నుండి దూరం చేసి నరకాగ్నికి ఇంధనం అయ్యేలా చేస్తాయి. ఇక్కడ మేము మనుషుల్లో జనించే కొన్ని ముఖ్య మైన సంశయాలనుఅనుమానాలను గురించి పేర్కొంటున్నాం.
1. లైంగిక శక్తిపై అదుపు
ప్రజల్లో చాలామంది ఈ విధంగా ఆలో చిస్తారు. ''దేవుడు మానవుల్ని (స్త్రీ,పురుష) జంటగా సృష్టించాడు. వారిలో ఒండొకరి పట్ల లైంగిక ఆకర్షణ సృజించాడు. ఇది అమిత ప్రభావవంతమైనఅత్యంత ప్రమా దకరమైన శక్తి. దానిని ఎంతగా అణచు కోవాలని ప్రయత్నిస్తే అది అంతగా పైకి  ఉబికి వస్తుంది. దాన్ని మరీ ఎక్కువగా అదుపులో ఉంచటానికి ప్రయత్నిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అది కట్టలు తెంచుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు కప్పుకునే వస్త్రాలు వారి సౌందర్యా న్ని మరుగపరచి ఉంచుతాయి. అలాంట ప్పుడు యువకులు తమ కోర్కెల్ని అదుపు లో ఉంచుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా గనక లైంగిక కోర్కెల్ని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తే అవి విజృంభిస్తాయి. ఆ విజృంభణే కొన్ని కొన్ని సార్లు కిడ్నాపింగ్‌ (అపహరణ)రేపింగ్‌ (బలాత్కారం) లాంటి రూపాల్లో అవతరిస్తుంది. కనుక సమస్యలన్నిటికి పరిష్కారం ఒక్కటే! అదేమిటంటే స్త్రీలను 'ముసుగు'ల్లో నుంచి బయటికి తీయాలి. అలా చేస్తే యువకులకు లైంగిక కోర్కెల్ని అదుపు చేసుకోవాల్సినఅవసరం ఉండదు. స్త్రీల ఒంపుసొంపుల్ని చూసుకొని వారు కాస్తయినా ఊరటను పొందుతారు. ఆ విధంగా స్త్రీలు అర్ధనగ్నంగా కళ్ళ ముందు కనబ డుతూ ఉంటే ఆ విధంగా వారి ఈ అవస రాన్ని తీర్చుకోగలరు. పైన చెప్ప బడిన తర్కం ప్రకారం లైంగిక కోర్కెల విజృంభణ జరగకుండా ఉంటుంది''.
పై సందేహ నివృత్తి -  పైన ఉటంకించబడిన మాటలు పైకి ఎంతో హేతుబద్ధమైనవిగాసమంజసమైన విగా కనిపిస్తాయి. అంధయుగవు సమా జాలను అల్లకల్లోలం నుండి కాపాడటానికి ప్రతిపాదించబడిన గొప్ప అభ్యుదయ సూత్రాల్లాగా కనిపిస్తాయి. వాస్తవానికి ఇలాంటి సూచనలుసలహాలు సమాజా నికి ఎంతో హానికరమైనవి. ఇవి మానవ వ్యవస్థను మరింత అల్లకల్లోలానికి గురి చేస్తాయి. ఒకవేళ పై అభిప్రాయమే నిజ మైనదయితే అమెరికాయూరప్‌ దేశాల్లో కిడ్నాప్‌లు,    మానభంగాలు,  స్త్రీల పట్ల  పురుషుల లైంగిక వేధింపులు మొదలగు అనైతిక నేరాల సంఖ్య తగ్గిపోవాల్సింది కదాకొన్ని దేశాల్లోనయితే వ్యభిచార గృహాలు తామరతంపరలుగా కనిపిస్తాయి. అక్కడ వ్యభిచారిణుల తమ అందచందా లను ప్రదర్శిస్తూజనాన్ని ఆకర్షిస్తూ ఉం టారు. మరి ఇలాంటి లైంగిక విచ్చలవిడి తనం వల్ల అక్కడ స్త్రీల కిడ్నాపింగ్‌లు తగ్గిపోయాయాపరుషుల లైంగిక దాహం తీరి పోయిందాస్త్రీలు ఆన్ని రకాల ప్రమా దాల నుండి సురక్షితంగా ఉంటున్నారా?
అమెరికాప్రభుత్వం అధికారిక వివ రాలు - దేశంలో పెట్రేగుతున్న నేరప్రవృత్తి వాస్తవిక స్థితిని తెలుసుకునే ఉద్దేశ్యంతో అమెరికన్‌ ప్రభుత్వం ఒక సర్వే జరిపించింది. ఆ సర్వే రిపోర్టులోని ముఖ్యాంశాలను 'అమె రికాలో నేర ఉదంతాలుఅన్న పేరుతో ఒక పుస్తకాన్ని కూడా వెలువరించటం జరిగింది. ఈ పుస్తకం అమెరికన్‌ ప్రభు త్వం తరపు నుండే ప్రచురించబడింది. అందులో ఆరవ పేజిలో 'అమెరికాలో ప్రతి ఆరు నిషిషాల్లో ఒక మానభంగం జరుగు తుంది. దాని కోసం ఆయుధాలను కూడా ఉపయోగించటం జరుగుతుందిఅని పేర్కొనబడింది. ఇది 1988వ సంవత్సరా నికి సంబంధించిన రికార్డు. ఆ పుస్తకం లోనే నేరాల సంఖ్యఅంకెలలో ఈ విధం గా పొందుపరచబడి ఉన్నాయి.
అమెరికాలో మానభంగాలు: 
సంవత్సరం   -   మానభంగాల సంఖ్య
 1978 లో         1,47,389
 1979 లో         1,68,134
 1981 లో         1,89,450
 1983 లో         2,11,691
 1987 లో         2,21,764
 పైన పేర్కొనబడిన లైంగిక నేరాల అంచనాల ద్వారా ఇంకా ఇలాంటి ఇతర విశ్వసనీయమైన వార్తల ద్వారా బోధపడే విషయమేమిటంటేఆయా దేశాల్లో లైంగిక నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయే గాని తగ్గటం లేదు. ఈ విషయాన్ని మనం క్రింద పేర్కొన బడిన దివ్యఖుర్‌ఆన్‌ సూక్తికి క్రియాత్మక వ్యాఖ్యానంగా భావించవచ్చు.
 ''ప్రవక్తా! నీ భార్యలకూనీ కూతుళ్లకూవిశ్వాసుల స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పువారు గుర్తింపబడటానికీవేధింబడ కుండా ఉండేందుకూ ఇది ఎంతో సము చిత మైన పద్ధతి''. (అల్‌ అహ్ జాబ్‌:59)  ఇమామ్‌ ఖుర్తుబీ తన వ్యాఖ్యాన గ్రంథం లో ఈ సూక్తి నేపథ్యం గురించి ఇలా వివ రించారు: మరుగుదొడ్లు నిర్మించబడక ముందు స్త్రీలు కాలకృత్యాలు తీర్చుకోవ టానికి సాధారణంగా దూరంగా ఉండే మైదాన ప్రాంతాలకు వెళ్ళేవారు. అలా వెళ్ళే స్త్రీలలో బానిసరాళ్ళుస్వేచ్ఛాపరులైన స్త్రీలు కూడా ఉండేవారు. అయితే స్వేచ్ఛాపరురాళ్ళైన స్త్రీలు మాత్రం బురఖాలు ధరించి సౌశీల్యవతులుగా గుర్తించబడే వారు. దారిలో ఆకతాయి కుర్రవాళ్ళు బానిసరాళ్ళను వేధించేవారు. పైన పేర్కొన బడిన సూక్తి అవతరించక ముందు ఒక సారి ఒక విశ్వాసురాలైన స్త్రీ కాలకృత్యాలు తీర్చుకోవటం కోసం బహిర్భూమికి వెళ్ళింది. ఆమెను బానిసరాలిగా భావించి కొందరు తుంటరులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. 
 ఆ స్త్రీ భయంతో కేకలు పెట్టింది. దాంతో వారు పలాయనం చిత్తగించారు. ఆమె వెళ్ళి దైవప్రవక్త (స) కు ఫిర్యాదు చేసింది. అప్పుడే ఈ సూక్తి అవతరించింది. చెప్పొచ్చేదేమిటంటేవీధుల గుండా వస్తూ పోతూ ఉండే మగవారి ముందు తమ సౌందర్యాన్ని ప్రదర్శించే స్త్రీలు వాస్తవానికి తోడేలు మనస్తత్వం గల పురుషుల ముందు తమల్ని తాము సమర్పించుకుం టున్నారనే నిజాన్ని గ్రహించాలి. ఎందు కంటే పరదా రాహిత్యం అనేది కోర్కెల్ని కవ్విస్తుంది. దీనికి భిన్నంగా పరదా ధరిం చే స్త్రీలు లైంగిక వాంఛల్ని జనింపజేసే తమ అలంకరణనుశరీరావయవాలను మరుగున ఉంచుకుంటారు. కేవలం మొహంఅరచేతులు తప్ప వారి శరీరం లో మరేమీ కానరావు.మరి కొంత మంది పండితులయితే కేవలం కళ్ళు మాత్రమే కనిపించాలంటారు. మొత్తానికి ఆ విధం గా నిండుగా పరదా ధరించి తమ అంద చందాలనుశరీరభాగాల్ని కప్పి పుచ్చు కునేముఖం    అరచేతులు తప్ప   వారి శరీరభాగం ఏదీ బయటకు కనిపిం చని విధంగామరి కొందరి దృష్టిలో కళ్ళు తప్ప మరేమీ కనిపించని విధంగా పరదా పాటించే ఆ స్త్రీలు ఎటువంటి లైంగిక కోర్కెల్ని ఏ విధంగా రెచ్చగొడ్తారుఅలాంటి స్త్రీ సమాజంలో ఏర్పడే అప సవ్యతలకు కారణభూతం అవుతుందాస్త్రీలు కష్టాలకుఇబ్బందులకు లోను కాకూడదన్న ఉద్దేశ్యం తోనే దేవుడు వారికి పరదా పద్ధతిని విధించాడు. ఫ్యాషన్లు ఇతర నగ్న దృశ్యాలు లైంగిక నేరాలను పెంచి పోషిస్తాయనీఅణిగి ఉండే లైంగిక కోర్కెల్ని కవ్విస్తాయనే విషయం దేవునికి బాగా తెలుసు. ఈ విషయాలన్నిటిని చదివి కూడా ఎవరయినా తమ అభి ప్రాయమే సహేతుకమైనదని పట్టుపట్టి మొండిగా వాదిస్తే వారి ఆలోచనా వికాసం కోసం మేము క్రింద నాలుగు వాస్తవాలను పేర్కొంటున్నాంగమనించగలరు.
మొదటి వాస్తవం: పైన పేర్కొనబడిన నేరాల సంఖ్య వారి వాదనను త్రోసిపుచ్చు తోంది.
రెండవ వాస్తవం: స్త్రీ పురుషులిద్దరిలో నూ లైంగిక వాంఛలు ఉన్నాయి. దేవుడు ఎన్నో కారణాల దృష్ట్యా వాటిని ఇరువురి లోనూ పొందుపరచాడు. వాటిలో సంతా నోత్పత్తి పరిరక్షణ కూడా ఒకటి. ఈ పరి స్థితి గనక లేకపోతే జాతి ఎలా మిగిలి వుంటుందిఅన్న విషయాన్ని మనం గమ నించాలి. సహజమైన ఈ కోర్కెల్ని ఎవరూ తిరస్క రించలేరు. మరలాంటప్పుడు పురు షులు నగ్నఅశ్లీలమైన దృశ్యాలు చూసి కూడా తమ సహజమైన కోర్కెల్ని అదుపు లో పెట్టుకోగలరని ఎలా ఆశించగలం?
మూడో వాస్తవం: స్త్రీల అలంకరణఅందచందాలు పురుషుల్లో అంతర్లీనమై ఉండే లైంగిక వాంధల్ని కవ్విస్తాయన్నది ఒక వాస్తవికమైన విషయం. స్త్రీ ముఖార విందం గానిఇతర అవయవాలు గాని  ఏవీ ఇందుకు తీసిపోవు. ఏ ప్రకృతి ధర్మం పై దైవం తనను సృష్టించాడోదాన్ని వ్యతిరేకించడంఇటువంటి భావోద్రేకాల ను రెచ్చగొట్టే దృశ్యాలను చూసిన  తర్వాత కూడా  తన   సహజ కోర్కెలను అణచుకో వడం అసాధ్యం.
నాల్గో వాస్తవం: లైంగిక వాంఛల్ని కవ్వింపజేసే అశ్లీల దృశ్యాలను సర్వ సామాన్యం చేయటం ద్వారానే తమ లైంగిక కోర్కెల్ని నియంత్రించుకోవడానికి అదే సరైన చికిత్స అని భావించుకున్నట్ల యితేదానివల్ల రెండు ఫలితాలు ఎదురవుతాయి.
మొదటిది: నగ్నఅశ్లీలమైన దృశ్యాలు చూసి కూడా ఎలాంటి భావోద్రేకాలకు లోనుకాని పురుషులు వాస్తవానికి నపుంస కులు. ఎందుకంటే వారి లైంగిక శక్తి అంతరించిపోయి ఉంటుంది. కనుకనే వారికి అలాంటి తలంపులు రావటం లేదు.
రెండోది: బహిరంగంగా నగ్నఅశ్లీల మైన దృశ్యాలు చూసినప్పటికీ లైంగిక వాంఛలు కలగటం లేదంటే బహుశా అలాంటి పరుషుల్లో లైంగిక పరమైన వ్యాధులు ఉండి ఉండవచ్చు. ఈ సందేహంలోని సత్యత గురించి వాది స్తున్నట్లయితే వారు మన సమాజంలోని పురుష గ్రూపులకు చెందిన పరుషులలో చేరిపోగోరుతున్నారా
అసంతృప్తి (నొ కన్విక్షన్ ) - ఇది రెండో అనుమానం. దీన్ని అనుమా నం అనడంకన్నా మనోవాంఛలకు దాసోహం అంటే బాగుంటుంది. పరదా పాటించని స్త్రీని ఉద్దేశ్యించి 'మీరు పరదా పాటించరెందుకండీ?' అని అడిగితేదానికి ఆమె నేనింకా సంతృప్తి చెంద లేదు. సంతృప్తి కలిగినప్పుడు ఇన్షా అల్లాహ్‌ా పరదా పాటిస్తాను అని సమా ధానమిస్తుంది ఈ విధంగా జవాబు చెప్పే సోదరీమణులు రెండు విషయాల మధ్య భేదం పాటించాలి. అవి:
 మొదటి విషయం ''దైవాజ్ఞ''  రెండో విషయం  ''మానవాజ్ఞ''  
ఓ నా చిట్ట చెల్లీ! పరదా పాటించమని చెప్పిందెవరు?  ఒకవేళ పరదా పాటించటం మానవాజ్ఞ అయి ఉంటే అందులో పాపంపుణ్యం రెంటికీ ఆస్కారముంది. ఇమామ్‌ మాలిక్‌ (ర) ఇలా   అంటున్నారు: మనిషి మాట సత్యమైనా కావచ్చు లేక అసత్యమైనా కావచ్చు. కనుక ఒక్క దైవప్రవక్త(స) తప్ప మిగతావారి మాటను మీరు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించనూ వచ్చు. కాని ఏదైనా ఆజ్ఞ దైవాజ్ఞలకు సంబంధించినదయితేఅంటే దేవుడు తన పవిత్ర గ్రంథం లో ఏదయినా విషయం గురించి ఆజ్ఞాపించి ఉంటే లేక దాని గురించి మానవాళికి తెలియజేయమని తన ప్రవక్తను ఆదేశించి ఉన్నట్లయితే అలాంటప్పుడు అది తనకు సంతృప్తికరంగా లేదన్న సాకుతో ఏ మాన వుడూ దాన్ని తిరస్కరించలేడు. ఏ స్త్రీ లేక పరుషుడయినా ఫలానా ఆజ్ఞ దైవగ్రంథంలో పేర్కొనబడి ఉందని తెలిసి కూడా దాని పట్ల అభ్యం తరం తెలుపుతూదాన్ని అంగీకరించటానికి నిరాకరిస్తే వారు తమకు తాముగా ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించబడటానికి అవకాశాలు కల్పించుకుంటున్నారని గ్రహించాలి. ఎందుకంటే వారి ప్రవర్తన మూలంగా వారికి దైవాజ్ఞలు సహేతుకమైనవన్న విషయంలో నమ్మకం లేదనీ ఆ విషయంలో వారు డోలాయమాన స్థితికి లోనై ఉన్నారని అర్థ మవుతోంది. ఈ ప్రవర్తన వారి విశ్వాసానికే గొడ్డలి పెట్టు! ఇది చాలా ప్రమాదకరమైన మాట.
   ఒకవేళ ఏ సొదరి అయినా తాను పాపాత్మురాలిననీమనోవాంఛల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాననీతనకు మనోబలం బొత్తిగా లేదనీతన హృదయం బలహీనమైనదని అంటే - ఇలాంటి మాటలు మాత్రం అసంతృప్త భావనల క్రిందికి రావు. ఎందుకంటే ఆమె తన బలహీన తల్నితప్పుల్ని ఒప్పుకుంటోంది. అదీగాక ఆమె తనకు ఇష్టమైతేనే దైవాజ్ఞల్ని నెరవేరుస్తాననీకష్టమైతే మానేస్తానని చెప్పట్లేదు కదా! అందుకని ఇలాంటి మాటలు అసంతృప్తి భావనల క్రిందికి రావు. అల్లాహ్  ఇలా సెలవిస్తున్నాడు:
 ''అల్లాహ్ ఆయన ప్రవక్తా ఏ విషయంలోనయినా ఒక తీర్పు చేసి నప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికయినావిశ్వాసురాలైన ఏ స్త్రీ కయినాతరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకా ఎవడైనా అల్లాహ్‌ాకుఆయన ప్రవక్తకు అవిధేయత చూపితేఅతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురి అయినట్లే''. (అల్‌ అహ్‌ాజాబ్‌ : 36) సరైన ఆలోచనాసరళి:
 మనస్ఫూర్తిగా దైవాన్ని విశ్వసించిఆయన్ని సర్వాధికారిగా అంగీ కరించినవారు మారు మాట్లాడకుండా ఆయన ఆజ్ఞల్ని శిరసా వహించాలి. ఒక నిజమైన విశ్వాసి ముఖ్య లక్షణమేమిటంటే అతను దైవదేశాలను విన్న వెంటనే వాటిని అమలు పరచటానికి ప్రయత్ని స్తాడు. విశ్వాసులు దైవాజ్ఞల్ని విన్నదే తడవుగా ఆచరించి చూపిస్తారని స్వయంగా దివ్యఖుర్‌ఆన్‌ కూడా ధృవీకరిస్తోంది. విశ్వాసులు ఇలా అంటారు: 'మేము ఆదేశం విన్నాంశిరసా వహించాం. స్వామీ! క్షమా భిక్ష పెట్టు. చివరికి మేమంతా నీ వద్దకే మరలి వస్తాం''. (అల్‌ బఖర: 285)
  దేవుని ప్రతి ఆజ్ఞ విషయంలోనూ మనం అది మన మంచి కోసమే ఉద్దేశ్యించబడినదిఅందులో మన కొరకు మేలు దాగి ఉందని భావిం చాలి. ఆయన స్త్రీల కొరకు పరదా పద్ధతిని నిర్ణయించాడు. కనుక పరదా పద్ధతిలో తమ కొరకు మేలు ఉందనీఅవి తమ మానమర్యా దలను కాపాడుతుందని స్త్రీలు గ్రహించాలి. దేవుడు అన్నీ తెలిసిన వాడు. అంతా ఎరిగినవాడు. ఆయన జ్ఞానం విశ్వాన్నంతటినీ పరి వేష్ఠించి ఉంది. ఆయనకు మనిషి పుట్టుకకు ముందు ఏం జరిగిందోభవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలుసు. ముస్లింలమైన మనం ఈ విషయాన్ని మనసారా విశ్వసిస్తాం. అలాంటప్పుడు అనంత జ్ఞాన సంపన్నుడైన దేవుని మాటను పక్కన పెట్టి పరిమిత జ్ఞానం కల వాడైన మానవుని మాటను పట్టుకొని వ్రేలాడటం మార్ఖత్వం కాకపోతే మరేమిటి?
వాస్తవంపై ఆధారమయిన ఉదాహరణ:  పైన చెప్పబడిన విషయానికి సంబంధించి ఒక క్రియాత్మక ఉదాహ రణ ను గమనించండి. మనం ఒక కంప్యూటర్‌ కొన్నామనుకోండి. ఆ కంప్యూటర్‌ను తయారు చేసినవాడు మనకు దగ్గర్లోనే ఉన్నాడు. అతనికి కంప్యూటర్‌ ఉపయోగించే పరిజ్ఞానంతోపాటు దానికి సంబం ధించిన ఇతర వివరాలు కూడా తెలుసు. అలాంటప్పుడు మనం దారిన పోయే ఏ దానయ్యనోబండ్లుతోలే ఏ బుచ్చయ్యనో పిలుచుకు వచ్చి మాకు కంప్యూటర్‌ నేర్పించమని అంటే ఎలా ఉంటుంది.తలలో తెలి వున్న వాడెవడూ ఆ పని చేయడు. ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగిం చాలో ఒకవేళ అది చెడిపోతే దాన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుసు కోవటం కోసం నిపుణుల్ని సంప్రతించమని బుద్ధి మనల్ని ఆదేశిస్తుంది.
  ఏ శక్తి సంపన్నుడయితే మనిషిని  పుట్టించిఅతన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాడో ఆయనే మనిషికి ప్రభువు. కనుక ఒక వస్తువు వల్ల మనిషి కి లాభం చేకూరుతుందో లేక నష్టం కలుగుతుందో సహజంగానే ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు అల్లాహ్‌ాను వదలిమార్గదర్శకత్వం కోసం ఇతరుల్ని ఆశ్రయించటంసలహాలుఆదేశాల కోసం ఇతరుల్ని సంప్రతించటం అవివేకమే అవుతుంది. ముఖ్యంగా మూర్ఖుల సలహాలను పాటిస్తే మాత్రం వినాశాన్ని కొనితెచ్చుకోవలసి వస్తుంది. దైవేతరుల ముందు      తలవంచటాన్ని పిచ్చితనంగామూర్ఖత్వంగా తెలివితక్కువతనంగా అభివర్ణించవచ్చు. అవివేకుల హితబోధను ఆచరించే వ్యక్తి వినాశానికి గురౌతాడు. శోచనీయమైన విషయం ఏమిటంటే మనకు జవాబు ఇచ్చే శక్తిలేని వారిని మనం జవాబు కోరటం మనలో చాలా మందికి అసలు 'ఇస్లాంఅన్న పదానికి అర్థం ఏమిటో కూడా తెలీదు. వాస్తవానికి ఇస్లాం అంటే దైవాజ్ఞలకు శిరసావహించటంఆయనకు పూర్తిగా విధేయత చూపటంఆయన ఆదేశాల్నినిషేధాల్ని పాలించటం అని అర్థం.
సందిగ్ధంలో పడకు సోదరీ! మీరెప్పుడయినా పరదా పాటించని సోదరీమణులకు దాని ప్రాముఖ్యతను గురించి బోధిస్తే వారిలో కొంతమంది సోదరీమణులు నేనూ ముస్లింనే. విశ్వాసురాలినే. నేను కూడా ఫర్జ్‌నఫిల్‌ నమాజులు చేస్తుంటాను. రమజాన్‌ నెలలో ఉపవాసాలుంటాను. హజ్‌ లాంటి పవిత్ర విధిని కూడా నెరవేర్చాను. ఎన్నో సార్లు ఉమ్రా చేశాను. కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. కానీ పరదా విష యానికొచ్చేసరికి ఎందుకో అది నా మనసుకు నచ్చటం లేదు'' అని చెబుతుంటారు. అలాంటి మహిళకు మా సమాధానం ఇది:  చూడండి....! మీరు ఆ గొప్ప పనులన్నీ చేశారు. సంతోషకరమే! వాటన్నిటి మూలం దైవాజ్ఞలే కదా! ఆ విధుల్ని విడిచిపెడితే శిక్షకు గురవుతామన్న భయమున్నప్పుడు కొన్ని ఆజ్ఞల్ని విశ్వసించి మరి కొన్నిటిని వదలివేయటమేమిటిమరి చూడబోతే వాటన్నిటి మూలం ఒక్కటే కదా! ఉదాహరణకు దైవగ్రంథంలో నమాజ్‌ చేయటం విధి అని చెప్పబడింది కనుక మీరు నమాజ్‌ చేస్తున్నారనుకోండిమరలాంట ప్పుడు పరదాను పాటించటం కూడా విధే కదా! ఎందుకంటే ఖుర్‌ఆన్‌హదీసులలో పరదాను పాటించటం విధి అని నిరూపించబడింది. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు.
 దేవుడు ఇస్రాయీల్‌ జాతి వారిని మందలించిన విషయాన్ని మీరె ప్పుడూ వినలేదావారు కూడా దైవాజ్ఞల్లో కొన్నింటిని అంగీకరించి మరికొన్నిటిని వదలి పెట్టేవారు. వారి గురించి దేవుడు ఇలా అంటు న్నాడు: ''మీరు దైవగ్రథంలోని ఒక భాగాన్ని విశ్వసించిమరొక భాగాన్ని తిరస్కరిస్తారామీలో ఇలా చేసే వారిని ఇహలోక జీవితంలో ఘోర అవమానానికీపరలోకంలో తీవ్రమైన బాధకూ గురి చెయ్యటం తప్ప మరొక శిక్ష  ఏముంటుందిమీ చేష్టలు అల్లాహ్‌ాకు తెలియ కుండా లేవు.'' (అల్‌ బఖర:85) ఒక ప్రామాణికమైన హదీసు ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా ప్రవచించారు: ''ప్రళయదినాన నరకంలో అందరికంటే తక్కువ శిక్ష అనుభవించే వారి అరికాళ్ల క్రింద రెండు నిప్పు తునకలు ఉంచటం జరుగుతుంది. దాని వేడికి వారి మెదడు పొయ్యి మీదున్న కుండ ఉడికినట్లు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది.'' (బుఖారీ 11/376)
ప్రియ సోదరీ! ఇహలోకపు డాబుదర్పాల కోసం నీవు పరలోక జీవితాన్ని నాశనం చేసుకుంటావానిన్ను నువ్వు భయంకర మైన శిక్షకు గురి చేసుకోదలచావామా వరకు మేము పరలోకంలో నీకు మంచి జర గాలనే కోరుకుంటున్నాం. దాని కోసం నువ్వు కాస్త తెలివిగా వ్యవహ రించాలనీబాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మనసారా వేడు కుంటున్నాం. 
3) విశ్వాసం మనసులో ఉంటుంది! మీరెప్పుడయినా పరదా పాటించని స్త్రీలను తమ వైఖరికి కారణ మేమిటని అడిగితే వారు ఒక్కసారిగా ''విశ్వాసం (దైవభీతి) మనసులో ఉంటే చాలు. ఎలాంటి పరదాలూ అవసరం లేదు'' అని అనేస్తారు. మరి మీరు ఈ విషయం గురించి ఎప్పుడయినా తోతుగా ఆలోచించారాపై సందేహానికి మూలం కొంతమంది చాలా అవాంఛనీయ అర్థంతో హదీసులకు భాష్యం చెబు తారు. ఉదాహరణకు క్రింద పేర్కొనబడిన దైవ ప్రవక్త(స) ప్రవచనాన్నే తీసుకోండి.''దేవుడు మీ ముఖాలనుమీ సిరిసంపదల్ని చూడడు. ఆయన మీ మనోగతాన్నిమీ ఆచరణల్ని మాత్రమే చూస్తాడు'' అని దైవప్రవక్త (స) ప్రవచించారు.(ముస్లిం)
 విశ్వాసం మనసులో ఉంటుందన్న మాట ముమ్మాటికీ వాస్తవమే. అయితే విశ్వాసం అనేది మనసులోనే పరిపూర్ణమవుతుందని దైవప్రవక్త ప్రవచన ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. ఆచరణలు స్వీకృతిని పొంద టానికి చిత్తశుద్ధి దైవభీతి ఎంత అవసరమో తెలియజెప్పటమే ఈ హదీసు అసలు ఉద్దేశ్యం. వాస్తవం ఏమిటంటే చిత్తశుద్ధి లేకుండా దేవుడు ఏ పనినీ అంగీకరించడు. ఒకానొక సందర్భంగా దైవప్రవక్త(స) తన ఛాతీవైపు సైగ చేసి చూపిస్తూ ''దైవభీతి(తఖ్‌వా) ఇక్కడుంటుంది'' అని (మూడుసార్లు) అన్నారు. (ముస్లిం) నుజ్‌హతుల్‌ ముత్తఖీన్‌ సంకలనకర్త దానిని వివరణ ఇలా వివరిస్తున్నారు. ''అల్లాహ్‌ా ఏదయినా కర్మకు ప్రతిఫలం ఇచ్చేట ప్పుడు ఆంతర్యంమనస్సును బట్టియే నిర్ణయిస్తాడు. ఇదే విధంగా మనస్సును దైవాభీష్టానికి అనుగుణంగా మలచుకోవడంకోరికల కు సరయిన మార్గనిర్దేశనం చెయ్యడంఅల్లాహ్‌ాకు ఆగ్రహం కలి గించే దూషిత గుణాల నుండి పవిత్రం చేయడం కూడా అవసరం.
విశ్వాసానికి నిర్వచనం -  మనసులో ఉన్నంత మాత్రాన విశ్వాసం పరిపక్వత చెందదు. పరిపక్వత చెందని విశ్వాసం నరకం నుండి విముక్తి పొందటం కోసంస్వర్గంలో ప్రవేశించటం కోసం పనికి రాదు అహ్లె సున్నత్‌ వల్‌జమాత్‌కు చెందిన అత్యధిక మంది విద్వాంసులు విశ్వాసాన్ని ఈ క్రింది విధంగా నిర్వచిస్తున్నారు.   ''మనసుతో నమ్మటంనోటితో ధృవీకరించటంఅవయవాల ద్వారా దాన్ని ఆచరించటంవ్యక్తపరచడం - ఇదే విశ్వాసం.''