21, అక్టోబర్ 2013, సోమవారం

ప్రయాణికుని నమాజు


యాలా బిన్‌ ఉమయ్యా (ర) గారి కథనం - ఆమె ఇలా అన్నారు: నేను హజ్రత్‌ ఉమర్‌ (ర) గారితో ''మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీకు బహిరంగ శత్రువులే''. (నిసా: 101) అన్న వచనం విన్పించి ఇప్పుడయితే మునుపటి లాంటి భయోత్పాత స్థితి లేదు కదా! అన్నాను. అందుకు ఆయన (ర) నీకు ఈ విషయం వింతగా తోచినట్లే నాకూ తోచింది. నేనీ విషయమయి దైవప్రవక్త (స) వారిని సంప్రదించగా ఆయన (స) ఇలా ఉపదేశించారు: ''నమాజును ఖస్ర్‌ చేసుకునే సౌలభ్యాన్ని కలుగజేసి అల్లాహ్‌ మీకు మేలు చేశాడు. అల్లాహ్‌ చేస్తున్న మేలును వద్దనకండి''. (ముస్లిం: 686) 


అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ''ధర్మ విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు''. (హజ్జ్‌: 78)
అంటే మానవమాత్రులు భరించలేని క్లిష్టతరమయిన బాధ్యతలను దేవుడు మీపై విధించలేదు. మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడం ఆయన అభిమతం కానేకాదు.
ఇక ప్రయాణం అనేది యాతనలోనీ ఓ భాగం అన్న విషయం విదితమే. ప్రయాణావస్థలో మనిషి అనేక విషయాలను కోల్పోతాడు. ఓ చోటు  నిలకడగా ఉండలేడు. ఈ కారణంగానే కృపాశీలుడయిన అల్లాహ్‌ా ప్రయాణికునికి అనేక రాయితీలను ఇచ్చి సౌలభ్యాన్ని కలుగజేశాడు. ఈ కోవకు చెందిన రాయితీల్లో నమాజుకు సంబంధించిన రాయితి ఒకటి. అది రెండు రకాలు.
అ) రకాతుల సంఖ్యను తగ్గించడం 'ఖస్ర్‌'.
ఆ) రెండు నమాజులను కలిపి చదువుకునే సౌకర్యం 'జమా బైనస్సలాతైన్‌'.
అ) ఖస్ర్‌: నాలుగు రకాతుల నమాజును - జుహ్ర్‌ా, అస్ర్‌, ఇషాలను రెండుగా కుదించి కలిపి చదవడం. క్రింది దైవాదేశంలో అదే విషయం ప్రస్తావించబడింది.
 ''మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీకు బహిరంగ శత్రువులే''. (నిసా: 101)
యాలా బిన్‌ ఉమయ్యా (ర) గారి కథనం - ఆమె ఇలా అన్నారు: నేను హజ్రత్‌ ఉమర్‌ (ర) గారితో ''మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీకు బహిరంగ శత్రువులే''. (నిసా: 101) అన్న వచనం విన్పించి ఇప్పుడయితే మునుపటి లాంటి భయోత్పాత స్థితి లేదు కదా! అన్నాను. అందుకు ఆయన (ర) నీకు ఈ విషయం వింతగా తోచినట్లే నాకూ తోచింది. నేనీ విషయమయి దైవప్రవక్త (స) వారిని సంప్రదించగా ఆయన (స) ఇలా ఉపదేశించారు: ''నమాజును ఖస్ర్‌ చేసుకునే సౌలభ్యాన్ని కలుగజేసి అల్లాహ్‌ మీకు మేలు చేశాడు. అల్లాహ్‌ చేస్తున్న మేలును వద్దనకండి''. (ముస్లిం: 686)

ఈ హదీసురీత్యా ఖస్ర్‌ చేయడం కేవలం భయముంటేనే అన్న ప్రత్యేకత ఏమీ లేదు. అయితే ప్రయాణంలో ఖస్ర్‌ చేయాలంటే దానికి కొన్ని నమయాలున్నాయి.
1) ఖస్ర్‌ అనేది ప్రయాణంతో ముడిపడి ఉన్న విషయం కనుక ప్రయాణావస్థలో మాత్రమే ఖస్ర్‌ చేయాలి.
ప్రయాణానికి బయలుదేరక ముందు నమాజు వేళ అయితే ఆ నమాజు పూర్తిగా చదవాల్సి ఉంటుంది.  ప్రయాణం మొదలయిన తర్వాత నమాజు సమయం అయి, అతను అదే నమాజు  చివరి ఘడియలోపు గమ్యం చేరుకుంటే అప్పుడు కూడా అతను నమాజును పూర్తిగా చేయాలి.

2) తాను బయలుదేరిన పట్టణ కోటలను అతను దాటి వెళ్ళాలి. ఒకవేళ ఆపట్టణంలో కోటలు లేకపోతే ఆ పట్టణ పరిసరాల్ని దాటాలి.
ఎందుకంటే, పట్టణ కొటల, పరిసరాల పరిధిలో ఉన్న వ్యక్తి ప్రయాణికుడిగా పరగణించబడడు.  అంటే అతని ప్రయాణం పరిసర పరిధుల్ని దాటిన మీదటే ప్రారంభమవుతుంది. అలాగే అతని ప్రయాణం స్వస్థలానికి తిరిగి రావడంతో పూర్తవుతుంది. కాబట్టి ఈ షరతు లేని పక్షంలో ఖస్ర్‌ చేసే అనుమతి అతనికి ఉండదు.
హజ్రత్‌ అనస్‌ (ర) గారి కథనం - ''నేను మదీనాలో దైవప్రవక్త (స) వారి సరసన జుహ్ర్‌ నమాజు నాలుగు రకాతులు చేశాను. అస్ర్‌ నమాజు రెండు రకాతులు జుల్‌ హులైఫాలో చేశాను''. (బుఖారీ-1039, ముస్లిం - 690)
3) బయలుదేరిన రోజు మరియు తిరిగి వచ్చిన రోజును మినహాయించి తాను వెళ్ళే ప్రదేశంలో నాలుగు రోజులుంటానని సంకల్పం చేసుకోకూడదు.
ఒకవేళ అతను అటువంటి సంకల్పం చేసుకుంటే, అతను వెళ్ళే పట్టణం అతని నివాస స్థలం అవుతుంది.  అప్పుడు అతను ఖస్ర్‌ చేసుకునే అనుమతి ఉండదు. అతను కేవలం మార్గం మధ్యలో మాత్రమే ఖస్ర్‌ పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ అతను నాలుగు రోజులకన్నా తక్కువగా ఉంటానని సంకల్పం చేసుకున్నా లేదా ఎన్ని రోజులుంటాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో ఖరారు చేసుకోలేక పోయినా అట్టి స్థితిలో బయలుదేరిన రోజు మరియు తిరిగి వచ్చే రోజును మినహాయించి 18 రోజులపాటు అతను ఖస్ర్‌ పాటించ వచ్చు.

హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (ర) గారి కథనం - ''నేను దైవప్రవక్త (స) వారి సరసన ఓ యుద్ధంలో పాల్గొన్నాను. ఆయనతోపాటు మక్కా విజయంలో పాల్గొన్నాను. అప్పుడు ఆయన (స) మక్కాలో 18 రాత్రులు ఉన్నారు, ఆ మధ్య కాలంలో ఆయన (నాలుగు రకాతుల నమాజును) రెండుగా మాత్రమే చేశారు''. (అబూ దావూద్‌ - 1229)
4) స్థానికుని సారథ్యంలో నమాజు చేయకూడదు: ఒకవేళ స్థానికుని సారథ్యంలో నమాజు చేసినట్లయితే పూర్తి నమాజును అతను చదవాల్సి ఉంటుంది. అక్కడ అతనికి ఖస్ర్‌ అనుమతి ఉండదు.  అదే తాను సారథ్యం వహించి నమాజు చేయిపిస్తున్నట్లతే దానికి అనుమతి ఉంటుంది. పద్ధతి ఏమిటంటే, తాను రెండు రకాతుల తర్వాత ముక్తదీలను ఉద్దేశించి - 'నేను ప్రయాణికుణ్ణి మీరు మీ నమాజు పూర్తి చేయండి' అనాలి. (నమాజుకు ముందు ప్రకటించినా పరవాలేదు).
 (ఆ) జమా: (రెండు నమాజులను కలిపి చదవడం)

 అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌(ర) ఇలా అన్నారు: దైవప్రవక్త(స) ప్రయాణవస్థలో స్వారీపై ఉన్నప్పుడు జుహ్ర్‌ా మరియు అస్ర్‌ నమాజులను కలిపి చదివేవారు. అలాగే మగ్రిబ్‌ మరియు ఇషా నమాజులను కలిపి చదివేవారు. (బుఖారి 1056)
అనస్‌(ర) వ్రపక్త(స)వారి గురించి ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఆయన(స) ప్రయాణానికి తొందరగా బయలుదేరాల్సి ఉంటే జుహ్ర్‌ా నమాజును అస్ర్‌ నమాజు మొదటివేళ వరకు ఆలస్యం చేసి ఆ రెంటిని కలిపి చదివేవారు. అలాగే మగ్రిబ్‌ నమాజు ఇషా వరకు ఆలస్యం చేసి రెంటిని కలిపి చదివేవారు. అరుణ ఛాయలు కనుమరుగయినప్పుడు. (ముస్లిం 704)
 నమాజును కలిపి చదవడం అనేది రెండు రకాలు:
 (అ) జమా తఖ్దీమ్‌: తర్వాతి నమాజు ముందు నమాజుతో కలిపి చదవడం.
 (ఆ) జమా తాఖీర్‌: మొదటి నమాజుని తరువాతి నమాజుతో కలిపి చేయడం.
 పై పేర్కొనబడిన వాటిలో ఏ నమాజులను కలిపి చేయవచ్చునో అవి: జుహ్ర్‌ను అస్ర్‌ నమాజుతో కలిపి చేయడం. మగ్రిబ్‌ను ఇషాతో కలిపి చదవడం. అయితే ఫజ్ర్‌ నమాజు దానికి ముందు నమాజుతోనూ, తర్వాతి నమాజుతోనూ కలిపి చేయకూడదు అలాగే అస్ర్‌ మగ్రిబ్‌లను కలిపి చేయకూడదు.

జమా షరతులు:

(అ) జమా తఖ్దీమ్‌ షరతులు:
   1. క్రమం: మొదటి నమాజు వేళకు ప్రారంభించి తర్వాతి నమాజు తర్వాత చేయడం.
   2. మొదటి నమాజుని ముగించక మునుపే తర్వాతి నమాజు సంకల్ఫం చేసుకోవడం. అయితే తక్బీర్‌ ఇహ్రామ్‌తో పాటు
      సంకల్పం చేసుకోవడం సున్నతు.
   3. రెండు చేసిన వెంటనే తర్వాతి నమాజు చేయడం. ఆ రెంటికి మధ్య ఎటువంటి విరామం ఉండకూడదు. ఒకవేళ రెంటికి మధ్య విరామం పెరిగితే జమా భంగం అవుతుంది. రెండో నమాజును దాని వేళ వరకు ఆలస్యం చేసి చేయడం వాజిబ్‌ అవుతుంది.


 అబ్దుల్లాహ్‌బిన్‌ ఉమర్‌(ర)కథనం: నేను దైవప్రవక్త(స)వారిని చూశాను. ఆయన(స) ప్రయాణానికి తొందరగా బయలుదేరాల్సి ఉంటే మగ్రిబ్‌ నమాజును ఆలస్యం చేసి మూడు రకాతు సలిపి సలామ్‌ చెప్పేవారు. తర్వాత కాసింత విరామం తర్వాతనే ఇషా నమాజు సలిపేవారు. ఇషా రెండు రకాతులు(ఖస్ర్‌) చేసి తర్వాత సలామ్‌ చెప్పేవారు.                       (బుఖారి 1041)
   4. రెండో నమాజు వేళవరకు ప్రయాణం కొనసాగాలి. అంటే రెండో నమాజు సమయానికి గమ్యానికి చేరుకుంటే
      ఎలాంటి అభ్యంతరం లేదు.

 (ఆ) జమా తాఖీర్‌ షరతులు:
   1.మొదటి నమాజుని దాని వేళలోనే ఆలస్యం చేసి తర్వాతి నమాజుతో చేస్తానని సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ జుహ్ర్‌ా నమాజు వేళ ముగిసిపోయింది కానీ జమా తాఖీర్‌ సంకల్పం చేసుకోకపోతే అది ఖజా అయిపోతుంది. అలాగే ఆలస్యం చేసిన పాపం అతనికుంటుంది.
   2. ప్రయాణం రెండు నమాజులను కలిపి చదివేంత వరకు కొనసాగాలి. రెండో నమాజు పూర్తవక ముందే ప్రయాణం ముగిస్తే ఆలస్యం చేసి చేస్తున్న నమాజు ఖజా అవుతుంది.
 ఇక్కడ రెంటికి మధ్య క్రమం అన్నది షరతు కాదు. ఏ నమాజుతోనయినా ప్రారంభించవచ్చు. అలాగే ఇక్కడ ఒకటి తర్వాతనే మరొకటి చేయడం సున్నత్‌ మాత్రమే. షరతు కాదు.

ఖస్ర్‌ మరియు జమా అనుమతి ఉండే ప్రయాణం షరతులు:
 1.కనీసం 81 కి.మీ దూరం ప్రయాణం ఉండాలి. దానికన్నా తక్కువ దూరం గలది ప్రయాణంగా పరిగణించబడదు.
 2. ప్రయాణం ఒక గమ్యాన్ని ఉద్దేశించి ఉండాలి. ఇక ఎవరయినా ఒక గమ్యం, దిశ లేకుండా ప్రయాణం చేస్తారో అది ఖజా ఖస్ర్‌ అనుమతి ఉండే ప్రయాణంగా పరగణించబడదు. ఏక్షణం అయితే అతను దిశను, గమ్యాన్ని నిర్ణయించుకున్నాడో మరుక్షణం ప్రయాణ మార్గాన్ని బట్టి అతనికోసం జమా,ఖస్ర్‌ అనుమతి ఉంటుంది.
 3.ప్రయాణ ఉద్దేశ్యం ఏ పాప,చెడు ఉద్దేశ్యం అయి ఉండకూడదు. చెడు, పాప ఉద్దేశ్యం అయితే అది ఖస్ర్‌,జమా వీలుండే ప్రయాణంగా పరగిణించబడదు. ఉదాహరణకు మాదక ద్రవ్యాల వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయడం.
 వాన కురిసే వేళలో రెండు నమాజులను జమా చేయడం:
అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌(ర) కథనం: దైవప్రవక్త(స) జుహ్ర్‌ా, అస్ర్‌ నమాజులను మరియు మగ్రిబ్‌ ఇషా నమాజులను కలిపి చదివారు. ఎలాంటి భయంగాని, ప్రయాణంగాని లేనప్పుడు. (ముస్లిం 705)
 వర్షం కురిసేటప్పుడు రెండు నమాజుల మధ్య జమా తఖ్దీమ్‌ చేసుకోవచ్చు. మొదటి నమాజును తర్వాతి నమాజుల వేళలో చేసే అనుమతి లేదు. ఎందుకంటే అప్పటి వరకు వర్షం ఆగిపోవచ్చు.
 ఇటువంటి జమా కోసం షరతులు:
 1. సామూహిక నమాజు దూర ప్రాంతంలో ఉన్న మస్జిద్‌లో ఉండాలి.వర్షం కారణంగా మస్జిద్‌కెళ్ళడం ఇబ్బందిగా
    ఉన్నప్పుడు.
 2. రెండు నమాజులలో మొదటి నమాజు వేళ వర్షం కురుస్తుంది. మొదటి నమాజు సలామ్‌ చెప్పేంత వరకూ కురుస్తూనే
    ఉండాలి.

 భయం,ఆందోళన కలిగినప్పుడు చేసే నమాజు
ఇటువంటి నమాజు అనుమతి యుద్ధ సమయాల్లో ఉంటుంది. శత్రు సేనలతో పోరాడుతూ చేసే సామూహిక ఫర్జ్‌ నమాజు యుద్ధవీరుల సౌకర్యార్థం. ఈ నియమం నమాజు విశిష్ఠతను తెలియజేస్తుంది.

 పరీక్ష 18

   సరైన సమాధానాలతో ఖాళీ స్థలాలను పూరించండి:

  (అ) చేయడం  (ఆ) జమా  (ఇ) ఖజా  (ఈ) 81  (ఉ) 11  (ఊ) 50  (ఎ) ఖస్ర్‌  (ఏ) 17
  1. ఆల్లాహ్‌ మనకు ప్రయాణంలో రెండు రాయితీలను అనుగ్రహించాడు. అవి...............మరియు....................
  2. ప్రయాణంలో మొదటి నమాజుని తర్వాతి నమాజుతో కలిపి చేసేటప్పుడు మొదటి నమాజు మధ్యలోనే రెండో నమాజు
     సంకల్పం చేసుకోవడం తప్పనిసరి. అన్యదా మొదట నమాజు...............................అవుతుంది.
  3.ప్రయాణావస్థలో రోజుకి.......................రకాతులకి బదులు......................రకాతులు చదవాలి.
  4.ప్రయాణంలో రాయితీని అనుమతించే షరతుల్లో ఒకటి ఏమిటంటే ప్రయాణం ..................కి.మీ దూరమై ఉండాలి.

    సరైన సమాధనం ఎన్నుకోండి:

  5. ఓ ముస్లిం సోదరుడు మక్కా వెళ్ళి అక్కడ 4 రోజులు విడది చేస్తానని సంకల్పించుకున్నాడు. అతను ఇషా
      నమాజు.................... ..రకాతులు చేయాలి.
     (అ) 1
     (ఆ) 4
     (ఇ) 2
  6.ప్రయాణికుడి మొదటి నమాజు వేళలోనే జమా సంకల్పం చేసుకున్నట్లయితే మొదటి నమాజుని తర్వాతి నమాజు వరకు
     ఆలస్యం చేసి చదువుకోవచ్చు.
     (అ) అవును
     (ఆ) కాదు
  7.వెళ్ళి వచ్చే ప్రయాణం దూరం 28 కి.మి ఉండే ప్రయాణికుడు నమాజును ఖస్ర్‌ చేసుకోవాలి.
     (అ) అవును
     (ఆ) కాదు
  8. ప్రయాణికుడు నమాజును ఖస్ర్‌ చేయాలంటే అతను ప్రజలు నివశించని ప్రదేశం ఉండాలి.
     (అ) అవును
     (ఆ) కాదు
  9. ప్రయాణం దూరం ప్రయాణికుని బయలు దేరే ప్రదేశం (అతని ఇంటి)నుండి లెక్కించబడుతుంది.
     (అ) అవును
     (ఆ) కాదు
  10. నేను 15రోజుల కోసం ప్రయాణమవుతున్నాను (ఫ్రాన్స్‌,లండన్‌,దుబాయి) ప్రతి దేశంలోనూ అయిదు రోజులు
       ఆగుతాను. మరి ఈ 15రోజుల మధ్య నేను ఖస్ర్‌ చేసుకోవచ్చా?
     (అ) చేసుకోవచ్చు
     (ఆ) చేసుకోకూడదు

కామెంట్‌లు లేవు: