14, మార్చి 2012, బుధవారం

kallu ela chaduvutayi


NewsListandDetails
బాలలూ! చదవడమనే ప్రక్రియలో ఒక క్రమపద్ధతిలో ఉన్న అక్షరాలు మన మెదడు గుర్తింపుకు లోనవ్ఞతాయి. కళ్లు వాటిని అదే క్రమంలో అనుసరి స్తాయి. 'లిపి విషయానికి వస్తే, మనం ఎడమవైపునుంచి కుడివైపుకు రాస్తాం. కొంతమంది కుడినుంచి ఎడమదిశగా రాస్తారు. విదేశీ భాషలలో కొన్ని పైనుంచి కిందకు అంటే నిట్టనిలువ్ఞగా రాస్తారు. బొమ్మలతోనే లిపి ఉన్న భాష కూడా ఉంది. ఆయా అక్షర సంకేతాలను ఆయా లిపులతో సంబంధం ఉన్నవారి మెదడు అర్థంచేసుకుంటుంది. ప్రాథమిక తరగతిలో మనం భాష విషయంలో ఏ తరహా శిక్షణ పొందుతామో, అదే విధంగా అక్షరాల గుర్తింపు, అవి ఏయే శబ్దాలను సూచిస్తాయో  తెలుసుకోగలగడం- ఆ తర్వాత క్రమక్రమంగా పదాలు, పదబంధాలు, వాక్యాలు, పేరాలు, వ్యాకరణం తద్వారా భాషా స్వరూపం మొదలైనవి నేర్చుకుంటుంటే ఏక కాలంలో కళ్లు, మెదడు కూడా సంయుక్తంగా శిక్షణ పొందుతాయి. ఆ తర్వాత కాలంలో చదవడమనేది అతి సహజమనిపిస్తుంది.  నిజానికి మనం చదివేటప్పుడు కళ్లు అక్షరాల మీద సమాంతరంగా కదలవ్ఞ. వేగ వంతంగా చదవాలనుకున్నప్పుడు కూడా అదే వేగంతో ప్రయాణించలేవ్ఞ. రెప్పపాటు కాలం ఆగి ఆగి, వాక్యం ప్రారంభించి, చివర వరకూ సాగి, తిరిగి రెండవ పంక్తి వద్దకు చేరతాయి. ప్రత్యేకంగా నామవాచకాలు, పారి భాషిక పదాలు (అర్థంకాని కొత్తపదాలు), గణాంకాల వద్ద క్షణకాలం ఆగు తాయి. అయితే ఇవేమీ మన స్పృహకు అందవ్ఞ. బాగా తెలిసి ఉన్న పదాలు లేదా పదం తర్వాత వచ్చే పదాలు మన ఊహకు అందిన సంద ర్భాలలో- ఆ పదాలను గూర్చి మన కళ్లు పట్టించుకోవ్ఞ. ముందుకు వెళ్లిపో తాయి. ఇక్కడే ప్రూఫ్‌రీడర్లు తప్పుచేస్తుంటారు. మన మెదడు పూర్వజ్ఞానా నికి అందని కొత్తపదాలను చదువ్ఞతున్నప్పుడు మనకు తెలిసీ, తెలియ కుండానూ కళ్లు క్షణకాలం ఆగిపోతాయి. మెదడు తనపొరలనుంచి అవగాహన తెప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో కంటి దృష్టిని రెప్పపాటు కాలం స్తంభింపజేస్తుంది. చాలా సందర్భాలలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు కళ్లు ఆ పంక్తి ప్రారంభానికి వెళ్లి చదివి ఉన్న మొదటి పదం నుంచి, ఆగిపోవలసిన పదం వరకు తిరిగి ప్రయాణిస్తాయి. ఈ అర్థంకాని పదానికి భావం స్ఫురించేవరకు కళ్లు ఆగిపోతాయి. కొంతమంది అర్థంకాకపోయినా ముందుకు వెళ్లిపోతారు. మొత్తంమీద పాఠకులందరూ ఒకే విధానంలో చదవరని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆయా సందర్భాలు, అవసరాలను అనుసరించే మనం చదివే పద్ధతులను మలచు కోవడం ఉత్తమం. మన కంటి దృష్టికి కనపడే అక్షరాలు, పంక్తులు, వాక్యాలు అన్నీ రెటీనా మధ్యలో బింబంపడే కేంద్రకంలోనూ, దానిచుట్టూ ఉన్న ప్రాంతంలోనూ, ఇంకా వెలుపలి ప్రాంతంలోనూ ఉంటాయి. ఈ మూడు ప్రదేశాలలో లభ్యమయ్యే సమాచారాన్ని మెదడు స్వీకరిస్తూనే కళ్లను చదువ్ఞమీద కేంద్రీకరింపజేస్తుంది. ఈ పరిస్థితిలో రెటీనా మధ్య లోని బింబం మధ్యభాగం దాదాపు రెండు డిగ్రీల కోణానికి పరిమితమై ఉంటుంది. అది మూడు, నాలుగు పదాలకు సమానంగా ఉంటుంది. వాస్తవంగా చదివేటప్పుడు ఈ మూడు నాలుగు పదాలకే మన దృష్టి పరిమితమై ఉండబోదు. చుట్టూ ఉన్న అక్షరాలను అస్పష్ట అవగాహనతో చూస్తూనే ఉంటాం. బాగా పరిచయమై ఉన్న పదాలను దాటివేస్తాము. వాక్యం పూర్తిగా చదవడం పూర్తయ్యేలోగా కొన్ని వాక్యాల అర్థం తెలిసి ివస్తుంది. వాక్యం చివర పదాలను చదివిన తర్వాత పూర్తి అర్థమయ్యే పరిస్థితీ ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంమీద కంటిచూపుకూ, మెదడు పనితనానికి సమన్వయం ఉండి తీరుతుందని మనం గ్రహించాలి