7, ఫిబ్రవరి 2013, గురువారం

దేశాభిమానం



ప్రేమ మనిషి నైపుణ్యాన్ని మెరుగులు దిద్ది, అతని ప్రతిభాపాటవాలను ప్రగతి పథంలో పయనింపజేసి, అతనిలో సృజనాత్మక శక్తిని పెంపొందించి, నిర్మాణాత్మక వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోవకు సంబంధించినదే దేశాభిమానం. ఏ నేలలోనైతే తను జీవం పోసుకున్నాడో, ఏ నేలలోనైతే తను సభ్యతాసంస్కారాలు నేర్చుకున్నాడో, ఏ నేలలోనైతే తన ఆప్తులు, కన్నవారున్నారో ఆ నేల కోసం తన, ధన,  మానాలను సయితం త్యాగం చెయ్యడానికి సిద్ధమవుతాడు మనిషి. అలా సిద్ధమయినవాడే దేశాభిమాని. ఆ విషయంలో అగ్రభాగాన ఉంటాడు ముస్లిం.
కరుణ, సత్యాలే ఆయుధాలుగా మానవ జాతిని మోక్ష మార్గాన నడిపిన మహా ప్రవక్త (స), మానవ జాతి దాస్య విముక్తికై రాజీ లేని పోరు సలిపిన మహా ప్రవక్త (స), స్వార్థచింతన లేకుండా మానవాళి ఇహపరాల సాఫల్యాల కోసం అహరహం శ్రమించిన మహా ప్రవక్త (స), జాతి, కులం, భాష, ప్రాంతం అంటూ ఎవరికి వారుగా ఉన్న మానవ జాతిని ’మీరంతా ఆదంతో, అదం మట్టితో’ - మీరంతా పరస్పరం దైవదాసులుగా, అన్నదమ్ములుగా మసలుకోండి, మీ కోసం దేన్నయితే ఇష్ట పడతారో మీ సోదరుల కోసం సయితం వాటినే ఇష్టపడండి. మిమ్మల్ని మీ తాతముత్తాతల్ని పుట్టించిన ఒకే ఒక్క సృష్టికర్త అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధిం చండి’ అని అందరిని ఏకతాటి మీదకు తీసుకు వచ్చిన మహా ప్రవక్త (స), సంకల్ప శుద్ధి, ఆత్మ పవిత్రత, నిర్మల మనస్తత్వం, నిస్వార్థ సేవ స్వర్గ లక్ష్య సిద్ధికి చేరువ చేస్తాయని ఎరుకపరచిన మహా ప్రవక్త (స), రవి అస్తమించని సామ్రాజ్యాలుగా విర్రవీగిన రోమ్‌, పర్షియన్లను సత్యతా కరావాలంతో మట్టి కరిపించి హృద యాల విజేతగా నీరాజనాలు అందుకున్న మహా ప్రవక్త (స), మూఢాచారాల, మింగుడు పడని సిద్ధాంతాల కాడిని మానవ భుజాల మీద నుండి తొలగించి ప్రవక్తలందరికి నాయకుడుగా, సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా ప్రభుచే ప్రశంస పత్రాన్ని పొందిన మహా ప్రవక్త  ముహమ్మద్‌ (స) సయితం తన జన్మ భూమిని ప్రేమించారు. తను పుట్టిన గడ్డ  పట్ల తనకున్న అభిమానాన్ని ఆయన అనేక సందర్భాల్లో వ్యక్త పర్చారు కూడా.
దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత - ’నేను కూడా యువకుడినై, ప్రజలు మిమ్మల్ని మీ జన్మ భూమి నుండి బహిష్కరించే కాలం వరకూ బ్రతికుంటే ఎంత బాగుండేది’ అని వరఖా బిన్‌ నౌఫల్‌ సానుభూతిని కనబరచినప్పుడు, దైవ ప్రవక్త (స) ఆశ్చర్యపోతూ - ”ఏమిటి నా జాతి ప్రజలు నన్ను నా స్వస్థలం నుండి వెలివేస్తారా?” అని అడిగారు.   తర్వాత దైవాజ్ఞ  మేరకు మక్కాను వదలి వెళ్ళ వలసిన సమయం వచ్చినప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) కాబా వైపు ఆఖరి సారి చూస్తూ, ”ఓ మక్కా! నువ్వు నాకు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన భూభాగానివి. నా జాతి ప్రజలు నన్ను వెలివేయకుండా ఉండి ఉంటే నేను నిన్ను వదలి వేరే భూభాగంలో నివాసం ఏర్పరచుకునేవాడను కాను” అన్నారు.   (తిర్మిజీ) ఈ సంఘటన తర్వాత అభయమిస్తూ అల్లాహ్  ఈ వచనాలను అవతరింపజేశాడు: ”(ఓ ప్రవక్తా!) నీపై ఖుర్‌ఆన్‌ను అవతరింప జేసినవాడు నిన్ను తిరిగి పూర్వ స్థలానికి చేర్చనున్నాడు”.   (ఖసస్‌: 85)

నిజం – మనిషికి తన ప్రాణమన్నా, తన దేశం అన్నా వల్ల మాలిన అభిమానం. ప్రాణం పోవడాన్ని, దేశం నుండి వేరవడాన్ని ఏ వ్యక్తి సులభంగా ఇష్ట పడడు. మనిషి ఈ స్వభావాన్నే అల్లాహ్‌ా ఇలా తెలియ జేస్తున్నాడు: ’ఒకవేళ మేము ”మిమ్మల్ని మీరు చంపుకోండి లేదా మీ ఇళ్ల నుంచి వెళ్లిపోండి” అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే, వారిలో బహుకొద్ది మంది మాత్రమే దాన్ని పాటించేవారు’. (అన్నిసా: 66)
ఇబ్రాహీమ్‌ బిన్‌ అద్హమ్‌ (ర) ఇలా అభిప్రాయపడ్డారు: ”నేను అనేకుల్ని మానసికంగా చికిత్స చేశాను. అప్పుడు వారిలో దేశాభిమానం అనేది చాలా బలంగా ఉందన్న విషయాన్ని నేను గ్రహించాను”.   ముహమ్మద్‌ గజాలీ ఇదే విషయమై ఇలా అన్నారు: ”మనుషులు తమ స్వస్థలం పట్ల అందలి వస్తువుల పట్ల, అభిమానం కలిగి ఉంటారు. చివరికి అది నిర్జన అరణ్య ప్రాంతమైనా సరే. దేశాభిమానం మానవ హృద యాల్లో వేళ్లూనుకొని ఉంటుంది. ఆ కారణంగానే మనిషి తన దేశంలో నివాసం ఉండటానికి ఇష్ష పడతాడు. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల దేశం వదలి వెళ్ళ వలసివచ్చినా తిరిగి వచ్చేంత వరకు హృదయం స్వదేశ దర్శనానికై పరితపిస్తూనే ఉంటుంది. ఈ కారణంగానే తన దేశం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడి తే సహించడు మానసం గల మనిషి. ఒకవేళ దాన్ని కబళించాలని ఎవరైనా చూస్తే భరించడు అత్మాభిమానం గల మనీషి. పై పేర్కొనబడిన అభిమానం వల్లనే కువైటీ ప్రజలు తమ దేశ స్వాతంత్రదినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మన దేశ ప్రజలూ ఎందరో ప్రతి ఏడాది కువైట్‌లోని మన దేశ దౌత్య కార్యాల యం నిర్వహించే స్వాతంత్య్ర, గణతంత్ర సంబరాల్లో పాల్గొనడం శుభ సూచకమే. కానీ, వారి సంఖ్య బహు స్వల్పం. భారతీయులు – వారు ఏ మతస్థులైనా ఈ విషయమై నిశితంగా ఆలోచించాలి. ఇకపోతే -,
ఆరుగాలం శ్రమించి జాతి ప్రాణాలు నిలిపే ఆహారాన్ని అందించేది రైతులైతే, అన్ని కాలాల్లో ఎన్నో కష్టాల కోర్చి ప్రజల ప్రాణాలు కాపాడేది సరిహద్దు సైనికులు. దేశ రక్షణ కోసం అంకితమై, స్వంత జీవితానికి దూర మై, ప్రాణాన్ని పణంగా పెట్టి, కొండల్లో, కోనల్లో, మండే ఎండల్లో, వణికించే చలి మంటల్లో అహర్నిశలు తమ బాధ్యతను నిర్వహించే త్యాగధనులు వీర సైనికులు. మనం ఈ రోజు హాయిగా గుండె మీద చేయి వేసుకుని ఉండటానికి కారకులు వారు. వారి త్యాగం వెలకట్టలేనిది. అలా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో పథకాలు అమలు పర్చారు. వారందరి లక్ష్యం ఒక్కటే – మానవ జాతి స్వేఛ్చా వాయువుల్లో జీవించాలి. ప్రతి మనిషికి ఆత్మగౌరవంతో బ్రతికే కనీస సౌకర్యం కలుగుజేయాలి.
సిద్ధాంత, సంక్షేమ రహిత రాజకీయాలు, శ్రమ రహిత సంపద, నీతిరాహిత్య వ్యాపారం, నైతికత శూన్య విద్య, హృదయ రహిత ఆనందం, మమత కరువైన (మర) జ్ఞానం, ఆత్మశుద్ధి లేని ఆరాధనలతో నేడు ముప్పూటలా కడుపు నిండా మెక్కే నాయకులకు  ఆ రైతుల గోడు అర్థం కాదు. స్వార్థ ప్రయోజనాల కోసం మారణ హోమాన్ని సృష్టిస్తున్న అల్ప బుద్ధి అలగాజనాలకు, మత ఛాందస వాదులకు ఆ సైనికుల త్యాగం బోధ పడదు. పదవికి కావాల్సింది కులం, వారసత్వం, ఆకర్షణ కాదు. పదవి అంటే ప్రజలకు సేవ చెయ్య డానికి లభించిన సువర్ణావకాశం అని కుయుక్త హృదయులకు అర్థమయయ్యేది ఎప్పుడు? మన జాతి గతి సుగతి అయ్యేదెప్పుడు? మనుషుల్ని ప్రేమించి వస్తువుల్ని వాడుకోవాల్సింది పోయి, వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకొంటున్న దుర్భిక్ష  స్థితి మనది. దీని తీరుతెన్నులు మారేదెప్పుడు?   మనం తయారు చేెసుకునే బొమ్మకి ఆందమైన ఆకారం కావాలంటే చక్కనైనా నమూనా ఎంచుకోవాలి.  సేవ చేసే నాయకులు కావాలంటే ’ఖలీఫా అబూ బకర్‌ మరియు ఉమర్‌ (ర)’ల గురించి గాందీ గారు చెప్పి మాటలు గుర్తు తెచ్చుకోవాలి.  అలాంటి నాయకుల్ని మనమే ఎంచుకోవాలి లేదా తయారు చేసుకోవాలి. అప్పుడుగాని అనేక సమస్యలతో సతమతమవుతున్న బ్రతుకులు తెప్పరిల్లవు.
”స్వాంతత్య్రం వచ్చింది…దేశం మనదైంది…అని ఇష్ట వచ్చినట్లు ప్రవర్తించలేము. ఇప్పుడే మనం మరింత క్రమశిక్షణతో, ఆత్మనిగ్రహంతో మసలుకోవాలి. అన్యోన్య సౌహార్దామృతంతో భారతావనిని అగ్రగామి చేయాలి” అన్న ఓ మేధావి మాట మనందరికి స్ఫూర్తి కావాలి.

ABHILASHA: అమ్మ పాలు అమృతం

ABHILASHA: అమ్మ పాలు అమృతం: తల్లి పాలలో పోషక విలువలు మెండుగా ఉండటమే కాకుండా, బేబీ యొక్క అతి సున్నితమైన జీర్ణవ్యవస్థచే అవి సులభంగా జీర్ణం కాబడతాయి. ఆ విధంగా వాటిన...

4, ఫిబ్రవరి 2013, సోమవారం

రక్తం – జీవాన్నిచ్చే ద్రవం


రక్తం యొక్క ప్రధానమైన విధులు

మన శరీరానికి జీవాన్నిచ్చే ద్రవమే రక్తం. అది మన శరీరంలో ప్రసరణ జరుగుతున్నంత కాలం, అది శరీరాన్ని వేడిగా, చల్లగా, పోషణ నిస్తూ మరియు హానికరమైన వాటిని శుభ్రపర చడం ద్వారా మనకు రక్షణనిస్తుంది. మన శరీరాలలో సందేశాలను అందించే విషయం లో దాదాపుగా ఈ రక్తమే పూర్తి బాధ్యతను తీసుకుంటుంది. అంతేకాకుండా నరాల గోడ లలోని పగుళ్ళను వెంటనే రిపేర్‌ చేసి, వ్యవస్థ కు తిరిగి కొత్త జీవాన్నిస్తుంది.
సగటున 60 కేజీల బరువుండే మానవుని శరీరంలో దాదాపు 5 లీటర్ల రక్తముంటుంది. ఈ మొత్తం రక్తాన్ని మన శరీరంలో సులభం గా ప్రసరణ చేయడానికి మన గుండెకు 8 సెకన్లు చాలు. అయినప్పటికీ, పరుగెత్తేటప్పు డుగాని, ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడుగాని, ఈ రక్త ప్రసరణ వేగం ఓ 5 రెట్ల వరకూ పెరగ గలుగుతుంది. మన తల వెండ్రుకల కుదుళ్ళ నుండి, కాలి వ్రేళ్ళ వరకూ, వేర్వేరు సైజులలో నున్న దమనుల లోపల ప్రతీచోటుకి రక్తం ప్రవహిస్తుంది. రక్తం ప్రవహించడానికి ఏ అడ్డూ లేకుండా, వ్రవాహంలో ఏ ఘనపదా ర్థం తయారవ్వకుండా దోషరహితమైన నిర్మా ణంతో నరాలను సృష్టించడం జరిగింది.
ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”ఆయన ఒకదానిపై నొకటి ఏడు ఆకాశాల ను సృజించాడు. నీవు కరుణామయుని సృష్టి లో ఎలాంటి క్రమరాహిత్యాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకేమైనా లోపం కనిపిస్తున్నదా? మళ్ళీ మళ్ళీ చూడు, నీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి. (దివ్యఖుర్‌ఆన్- 67:3)
ఎన్నో రకాల పోషక పదార్థాలు మరియు వేడి, ఈ సంక్లిష్ట వ్యవస్థ ద్వారా తీసికెళ్ళ బడతాయి.
ఆక్సిజన్‌ కారియర్‌
మన మనుగడకు చాలా ప్రధానమైనది మరియు మూలాధారమైనది – మనం పీల్చే గాలి. కొయ్య దుంగను మండించినట్లు, ‘సుగర్‌’ని మండించడానికి మన  జీవకణాలకి ఆక్సిజన్‌ కావాలి. ఆ సుగర్‌ను మండించడం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. అందుకే మన ఊపిరితిత్తుల నుండి జీవకణాలకు ఆక్సిజన్‌ తీసుకెళ్ళబడుతుంది. పైప్‌లైన్లను కలిపే అల్లిక వలే ఉండే ఈ రక్త ప్రసరణ వ్యవస్థే ఆక్సిజన్‌ ను తీసుకెళుతుంది.
ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌ పరమాణు వులు ఆక్సిజన్‌ను తీసుకు వెళతాయి. డిస్క్‌ ఆకారంలో ఉండే ఎర్రరక్తకణంలోని ప్రతీ రక్త కణం దాదాపు 300 మిలియన్ల(30 కోట్ల) హిమోగ్లోబిన్‌ పరమాణువులను తీసుకువెళు తుంది. ఈ రక్త కణాలు దోషరహితమైన నిధానాన్ని చూపుతాయి. అవి ఆక్సిజన్‌ను తీసుకు వెళ్ళడమే కాకుండా ఎక్కడ ఆక్సిజన్‌ అవసరమో అక్కడే ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి. ఉదా: కండరాల కణంలోని ఎర్ర రక్త కణాలు టిష్యూలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. చక్కెరను కాల్చడం వలన ఉత్ప న్నమైన కార్బన్‌ డైయాక్సైడ్‌ను తీసుకుని తిరిగి వెనక్కు అంటే ఊపిరితిత్తులకు చేరుకుని అక్కడ వదిలేస్తాయి. మరలా అక్కడి నుండి ఆక్సిజన్‌ను తీసుకుని, టిష్యూలకు తీసుకెళ తాయి.
పీడన సమతుల్య ద్రవం
ఆక్సిజన్‌తో పాటు హిమోగ్లోబిన్‌ పరమాణు వులు నైట్రోజెన్‌ మోనాక్సైడ్‌ను మోసుకెళ తాయి. ఈ గ్యాస్‌ కనుక బ్లడ్‌లో లేకపోతే, రక్తం యొక్క ప్రెషర్‌ స్థిరంగా మారిపోతూ ఉంటుంది. టిష్యూలకు ఎంత మోతాదులో ఆక్సిజన్‌ను అందివ్వాలో, నైట్రోజెన్‌ మోనా క్సైడ్‌ ద్వారా హిమోగ్లోబిన్‌ క్రమబద్ధీకరిస్తుంది.
ఇక్కడ వింత ఏమిటంటే, ఇలా క్రమబద్ధీక రించేది ఏమిటో కాదు ఓ పరమాణువు. ఈ పర మాణువుకి బ్రెయిన్‌గాని, కళ్లుగాని ఉండవు. మన శరీరాలని క్రమబద్ధీకరించేవి ‘కొన్ని పరమాణువుల సముదాయం’. ఇది దోషరహితంగా మన శరీరాలని సృష్టించిన అల్లాహ్‌ా యొక్క అనంత జ్ఞానానికి సూచన.
కణాల (సెల్స్‌) యొక్క ఆదర్శ డిజైన్‌
రక్తకణాలలోని మెజారిటీ రక్తకణాలు ఎర్ర రక్త కణాలే. పురుషుని రక్తం 30 బిలియన్‌ ఎర్ర రక్త కణాలను కలిగి ఉంటుంది. వాటి ఉపరితలాలను కలిపితే ఫుట్‌బాల్‌ మైదానం లో దాదాపు సగం ఉంటుంది. ఈ కణాలే రక్తానికి ఆ రంగును ఇస్తాయి.
ఎర్ర రక్త కణాలు చూడటానికి డిస్క్‌ల్లాగా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగించే వాటి మెత్త దనం (ఫ్లెక్సిబిలిటి) వలన, వెంట్రుక వాసి నాళాల నుండి, సూక్ష్మమైన రంధ్రాల నుండి అవి పీల్చబడతాయి. అవి అంత ఫ్లెక్సిబుల్‌ కాకపోతే, అవి శరీరంలోని చాలా చోట్ల అడ్డుపడిపోయి ఉండేవి.
ఒక అంగుళం వెడల్పున్న దానిని 10 లక్షల భాగాలుగా చేస్తే, ఆ విధంగా భాగాలైన సూక్ష్మ భాగాలలోని 39 భాగాలను కలిపితే ఎంత సూక్ష్మమైన వెడల్పు ఉంటుందో, అంత సైజు ఉంటుంది ఒక్కొక్క ఎర్ర రక్తం. ఈ రక్త కణం తనకంటే చిన్నదైన అంటే తన సైజులో మూడింట రెండు వంతులుండే రక్త నాళం (క్యాపిల్లరీ) గుండా పోగలుగు తుంది.
అంత ఫెక్సిబుల్‌ (మెత్తదనం)తో ఎర్రరక్త కణాలను సృష్టించకపోయి ఉంటే ఏం జరి గుండేది? ‘డయాబెటిస్‌’ పరిశోధకులు ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు చెప్పారు. డయాబెటిక్‌ రోగులలో, ఎర్ర రక్తకణాలు తన మెత్తదనాన్ని కోల్పోతాయి. ఇలా మెత్త దనం కోల్పోయిన రక్తకణాలు రోగి యొక్క కన్నులలోని సున్నితమైన టిష్యూలలో ఆగి పోవడం వలన, గుడ్డితనానికి దారి తీస్తాయి
ఆటోమెటిక్‌గా పనిచేసే అత్యవసర వ్యవస్థ
ఎర్ర రక్తకణం యొక్క జీవితకాలం దాదాపు 120 రోజులు. ఆ తరువాత వాటి ని స్లీప్‌ (ప్లీహం) తొలగిస్తుంది. ఈ నష్టాన్ని సరి చేయడానికి, నిరంతరం కొత్త కణాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సాధారణ పరిస్థితుల లో ఒక సెకనులో 2.5 మిలి యన్ల ఎర్రరక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అవసరమైన ప్పుడు, ఈ సంఖ్య పెరుగు తుంది. కిడ్నీలలో తయారయ్యే ‘ఎరిథ్రో పోయ్‌టిన్‌’ అనే హోర్మోన్‌ ఈ ఉత్పత్తి వేగాన్ని క్రమబద్ధీకరి స్తుంది. ఉదాహరణకు, ప్రమాదాల వల్ల భారీ గా రక్తం కారడం లేదా ముక్కునుండి రక్తం కారడం జరిగినప్పుడు, ఆ నష్టం వెంటనే బేలన్స్‌ అవుతుంది.
అంతేకాకుండా, గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గితే, ఈ ఉత్పత్తి వేగం పెరుగుతుంది. ఉదా హరణకు, బాగా ఎతైన ప్రదేశాలపై ఎక్కుతున్న ప్పుడు, గాలిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గుతూ ఉన్న ప్పుడు, శరీరం ఆటోమెటిక్‌గా రక్తకణాల ఉత్ప త్తిని పెంచి, అందుబాటులో ఉండే ఆక్సిజన్‌ను చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుం టుంది.
పెర్‌ఫెక్ట్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యవస్థ
రక్తంలో ఉండే ద్రవ భాగాన్ని ప్లాస్మా అం టారు. ఈ ప్లాస్మా రక్త కణాలనే కాకుండా శరీరంలో ఉండే ఇతర పదార్థాలను కూడా తీసుకెళుతుంది. ప్లాస్మా స్పష్టమైన పసుపు రంగు ద్రవం. ఈ ప్లాస్మా సాధారణ శరీర బరువులో 5 శాతం ఉంటుంది. ఈ ద్రవం లో 90 శాతం నీరే. దీనిలో లవణాలు, మినరల్స్‌, కార్బోహైడేట్స్‌, కొవ్వు మరియు వందల సంఖ్యలో భిన్న రకాల ప్రోటీనులు మునిగి త్రేలుతూ ఉంటాయి. రక్తంలోని ఈ ప్రోటీను లలోని లిపిడ్స్‌ను కలిపి ఉంచి, టిష్యూలకు తీసుకు వెళ్ళే ట్రాన్స్‌పోర్ట్‌ ప్రోటీనులు కొన్ని ఉంటాయి. ఈ ప్రోటీన్‌లు కనుక ఈ విధంగా లిపిడ్స్‌ను తీసుకెళ్లకపోతే, ఈ లిపిడ్స్‌ ఓ పద్ధతి లేకుండా త్రేలుతూ, తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.  ప్లాస్మాలోని హోర్మోనులు ప్రత్యేకమైన కొరియర్ల పాత్ర పోషిస్తాయి. ఇవే శరీరం లోని అవయవాలకు, కణాలకు మధ్య రసా యన సందేశాల ద్వారా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడాన్ని సులువుచేస్తాయి.
అల్బుమిన్‌ ప్లాస్మాలోని ప్రముఖ ప్రోటీన్‌, ఇది ఒక ట్రాన్స్‌పోర్టర్‌. ఇది కోలెస్ట్రాల్‌, హోర్మోనులు, బిలిరుబిన్‌ లేక పెన్సిలిన్‌ వంటి మెడిసిన్స్‌ వంటి లిపిడ్స్‌ని కలిపి ఉంచుతుంది. విషపదార్థాలను లివర్‌లో వదలిలేసి, మిగతా పోషక పదార్థాలని మరియు హోర్మోనులను వాటి అవసరం ఎక్కడైతే ఉందో ఆ చోటుకి తీసుకెళతాయి.
ఈ విషయాలన్నింటినీ గనుక మనం పరి గణలోకి తీసుకుంటే, మనకి స్పష్టమయ్యే దేమిటంటే మన శరీరం ఎంతో గొప్పగా  (ఇన్‌ ఎక్స్‌టర్‌మెలయ డీటైల్డ్‌వే) సృష్టించ బడింది. ప్రతీ ఒక్క ప్రోటీన్‌ యొక్క సామ ర్థ్యం ఎలా ఉంటుందంటే లిపిడ్‌, హోర్మోన్‌ మరియు మెడిసిన్‌ల మధ్య ఉండే తేడాను అది గుర్తించ గలుగుతుంది. అంతే కాదు వీటి అవసరం ఎక్కడ ఉందో, ఎంత మోతాదులో వీటి అవసరం ఉందో అన్నీ తెలుసుకోగలుగుతుంది.
అల్లాహ్‌ా యొక్క దోషరహిత డిజైన్‌కు స్పష్టమైన సూచనలే ఇవన్నీ. ఆశ్చర్యాన్ని కలిగించే ఇటువంటి జీవరసాయన చర్యలు వేల సంఖ్యలో మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. ట్రిలియస్‌ సంఖ్యలో ఉండే మన శరీరంలోని పరమాణువులన్నీ అద్భు తమైన సామరస్యంతో పనిచేస్తాయి. వాస్తవే మిటంటే ఈ పరమాణు వ్యవస్థలన్నీ కూడా తల్లి గర్భంలో ఏర్పడిన ఒకే ఒక కణం నుండి విభజన జరిగి ఏర్పడినవే.
ఇది ఓగొప్ప విషయాన్ని స్పష్టం చేస్తుంది. మానవ శరీరం యొక్క అద్భుత వ్యవస్థ ఒకే బిందువు నుండి మానవున్ని  సృష్టిం చిన అల్లాహ్‌ా యొక్క అద్భుత ఆర్టిస్ట్రీకి ప్రత్యక్ష సాక్ష్యం. ఖుర్‌ఆన్‌
”మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము. ఆ తరువాత  ఈ  బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆపైన ముద్ద ను కండగా చేశాము. తరువాత మాంసపు కండను ఎముకలుగా చేశాము. ఆ తరు వాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము. ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిల బెట్టాము. కనుక అల్లాహ్‌ా ఎంతో శుభ ప్రదుడు, సృజనకారులందరిలో కెల్లా ఉత్తమ సృజనకారుడు”  (ఖుర్‌ఆన్‌ 23:12-14)
ప్రత్యేకమైన కంట్రోల్‌ మెకానిజమ్‌
ఆర్టెరీస్‌ (ధమనుల) నుండి పోషక పదా ర్థాలు అవసరమైన టిష్యూలలోకి చొచ్చుకు పోవడానికి ఆర్టెరీ గోడలను దాటవలసి ఉంది. ఆర్టెరీ గోడలు చాలా సూక్ష్మ రం ధ్రాలు కలిగి ఉన్నప్పటికి, ఏ పదార్థమూ దానంతట అదే చొచ్చుకుపోలేదు. ఈ చొచ్చుకు పోవడాన్ని సులువు చేసేది బ్లడ్‌ ప్రెషర్‌. అయినప్పటికీ అవసరానికంటే ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు టిష్యూలకు వెళితే, ఆ టిష్యూలలో మంట కు ఇవి కారణమవుతాయి. అందువలన దానికొక ప్రత్యేకమైన మెకానిజమ్‌ ఏర్పాటు చేయబడింది. దాని ద్వారా బ్లడ్‌ప్రెషర్‌ని బేలన్స్‌ చేస్తూ, ద్రవాన్ని వెనుకకు తిరిగి బ్లడ్‌లోకి తీసుకోవడం జరుగుతుంది.
ఈ బాధ్యతను అల్పుమిన్‌ తీసుకుంటుంది. ఆర్టెరీ గోడలలోని రంధ్రాలకంటే ఈ అల్బు మిన్‌ పెద్దగా ఉంటుంది. ఇది రక్తంలో చాలా సంఖ్యలో సరిపోయినంత ఉం టుంది. స్పాంజ్‌ పీల్చినట్లు వాటర్‌ని పీలు స్తుంది. శరీరంలో అల్బుమిన్‌ లేకపోతే, ఎండిన చిక్కుడు గింజను నీటిలో వదలి ఉంచితే ఎలా ఉబ్బిపోతుందో అలా శరీరం ఉబ్బిపోతుంది.

రక్తం – జీవాన్నిచ్చే ద్రవం


రక్తం యొక్క ప్రధానమైన విధులు

మన శరీరానికి జీవాన్నిచ్చే ద్రవమే రక్తం. అది మన శరీరంలో ప్రసరణ జరుగుతున్నంత కాలం, అది శరీరాన్ని వేడిగా, చల్లగా, పోషణ నిస్తూ మరియు హానికరమైన వాటిని శుభ్రపర చడం ద్వారా మనకు రక్షణనిస్తుంది. మన శరీరాలలో సందేశాలను అందించే విషయం లో దాదాపుగా ఈ రక్తమే పూర్తి బాధ్యతను తీసుకుంటుంది. అంతేకాకుండా నరాల గోడ లలోని పగుళ్ళను వెంటనే రిపేర్‌ చేసి, వ్యవస్థ కు తిరిగి కొత్త జీవాన్నిస్తుంది.
సగటున 60 కేజీల బరువుండే మానవుని శరీరంలో దాదాపు 5 లీటర్ల రక్తముంటుంది. ఈ మొత్తం రక్తాన్ని మన శరీరంలో సులభం గా ప్రసరణ చేయడానికి మన గుండెకు 8 సెకన్లు చాలు. అయినప్పటికీ, పరుగెత్తేటప్పు డుగాని, ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడుగాని, ఈ రక్త ప్రసరణ వేగం ఓ 5 రెట్ల వరకూ పెరగ గలుగుతుంది. మన తల వెండ్రుకల కుదుళ్ళ నుండి, కాలి వ్రేళ్ళ వరకూ, వేర్వేరు సైజులలో నున్న దమనుల లోపల ప్రతీచోటుకి రక్తం ప్రవహిస్తుంది. రక్తం ప్రవహించడానికి ఏ అడ్డూ లేకుండా, వ్రవాహంలో ఏ ఘనపదా ర్థం తయారవ్వకుండా దోషరహితమైన నిర్మా ణంతో నరాలను సృష్టించడం జరిగింది.
ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”ఆయన ఒకదానిపై నొకటి ఏడు ఆకాశాల ను సృజించాడు. నీవు కరుణామయుని సృష్టి లో ఎలాంటి క్రమరాహిత్యాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకేమైనా లోపం కనిపిస్తున్నదా? మళ్ళీ మళ్ళీ చూడు, నీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి. (దివ్యఖుర్‌ఆన్- 67:3)
ఎన్నో రకాల పోషక పదార్థాలు మరియు వేడి, ఈ సంక్లిష్ట వ్యవస్థ ద్వారా తీసికెళ్ళ బడతాయి.
ఆక్సిజన్‌ కారియర్‌
మన మనుగడకు చాలా ప్రధానమైనది మరియు మూలాధారమైనది – మనం పీల్చే గాలి. కొయ్య దుంగను మండించినట్లు, ‘సుగర్‌’ని మండించడానికి మన  జీవకణాలకి ఆక్సిజన్‌ కావాలి. ఆ సుగర్‌ను మండించడం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. అందుకే మన ఊపిరితిత్తుల నుండి జీవకణాలకు ఆక్సిజన్‌ తీసుకెళ్ళబడుతుంది. పైప్‌లైన్లను కలిపే అల్లిక వలే ఉండే ఈ రక్త ప్రసరణ వ్యవస్థే ఆక్సిజన్‌ ను తీసుకెళుతుంది.
ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌ పరమాణు వులు ఆక్సిజన్‌ను తీసుకు వెళతాయి. డిస్క్‌ ఆకారంలో ఉండే ఎర్రరక్తకణంలోని ప్రతీ రక్త కణం దాదాపు 300 మిలియన్ల(30 కోట్ల) హిమోగ్లోబిన్‌ పరమాణువులను తీసుకువెళు తుంది. ఈ రక్త కణాలు దోషరహితమైన నిధానాన్ని చూపుతాయి. అవి ఆక్సిజన్‌ను తీసుకు వెళ్ళడమే కాకుండా ఎక్కడ ఆక్సిజన్‌ అవసరమో అక్కడే ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి. ఉదా: కండరాల కణంలోని ఎర్ర రక్త కణాలు టిష్యూలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. చక్కెరను కాల్చడం వలన ఉత్ప న్నమైన కార్బన్‌ డైయాక్సైడ్‌ను తీసుకుని తిరిగి వెనక్కు అంటే ఊపిరితిత్తులకు చేరుకుని అక్కడ వదిలేస్తాయి. మరలా అక్కడి నుండి ఆక్సిజన్‌ను తీసుకుని, టిష్యూలకు తీసుకెళ తాయి.
పీడన సమతుల్య ద్రవం
ఆక్సిజన్‌తో పాటు హిమోగ్లోబిన్‌ పరమాణు వులు నైట్రోజెన్‌ మోనాక్సైడ్‌ను మోసుకెళ తాయి. ఈ గ్యాస్‌ కనుక బ్లడ్‌లో లేకపోతే, రక్తం యొక్క ప్రెషర్‌ స్థిరంగా మారిపోతూ ఉంటుంది. టిష్యూలకు ఎంత మోతాదులో ఆక్సిజన్‌ను అందివ్వాలో, నైట్రోజెన్‌ మోనా క్సైడ్‌ ద్వారా హిమోగ్లోబిన్‌ క్రమబద్ధీకరిస్తుంది.
ఇక్కడ వింత ఏమిటంటే, ఇలా క్రమబద్ధీక రించేది ఏమిటో కాదు ఓ పరమాణువు. ఈ పర మాణువుకి బ్రెయిన్‌గాని, కళ్లుగాని ఉండవు. మన శరీరాలని క్రమబద్ధీకరించేవి ‘కొన్ని పరమాణువుల సముదాయం’. ఇది దోషరహితంగా మన శరీరాలని సృష్టించిన అల్లాహ్‌ా యొక్క అనంత జ్ఞానానికి సూచన.
కణాల (సెల్స్‌) యొక్క ఆదర్శ డిజైన్‌
రక్తకణాలలోని మెజారిటీ రక్తకణాలు ఎర్ర రక్త కణాలే. పురుషుని రక్తం 30 బిలియన్‌ ఎర్ర రక్త కణాలను కలిగి ఉంటుంది. వాటి ఉపరితలాలను కలిపితే ఫుట్‌బాల్‌ మైదానం లో దాదాపు సగం ఉంటుంది. ఈ కణాలే రక్తానికి ఆ రంగును ఇస్తాయి.
ఎర్ర రక్త కణాలు చూడటానికి డిస్క్‌ల్లాగా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగించే వాటి మెత్త దనం (ఫ్లెక్సిబిలిటి) వలన, వెంట్రుక వాసి నాళాల నుండి, సూక్ష్మమైన రంధ్రాల నుండి అవి పీల్చబడతాయి. అవి అంత ఫ్లెక్సిబుల్‌ కాకపోతే, అవి శరీరంలోని చాలా చోట్ల అడ్డుపడిపోయి ఉండేవి.
ఒక అంగుళం వెడల్పున్న దానిని 10 లక్షల భాగాలుగా చేస్తే, ఆ విధంగా భాగాలైన సూక్ష్మ భాగాలలోని 39 భాగాలను కలిపితే ఎంత సూక్ష్మమైన వెడల్పు ఉంటుందో, అంత సైజు ఉంటుంది ఒక్కొక్క ఎర్ర రక్తం. ఈ రక్త కణం తనకంటే చిన్నదైన అంటే తన సైజులో మూడింట రెండు వంతులుండే రక్త నాళం (క్యాపిల్లరీ) గుండా పోగలుగు తుంది.
అంత ఫెక్సిబుల్‌ (మెత్తదనం)తో ఎర్రరక్త కణాలను సృష్టించకపోయి ఉంటే ఏం జరి గుండేది? ‘డయాబెటిస్‌’ పరిశోధకులు ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు చెప్పారు. డయాబెటిక్‌ రోగులలో, ఎర్ర రక్తకణాలు తన మెత్తదనాన్ని కోల్పోతాయి. ఇలా మెత్త దనం కోల్పోయిన రక్తకణాలు రోగి యొక్క కన్నులలోని సున్నితమైన టిష్యూలలో ఆగి పోవడం వలన, గుడ్డితనానికి దారి తీస్తాయి
ఆటోమెటిక్‌గా పనిచేసే అత్యవసర వ్యవస్థ
ఎర్ర రక్తకణం యొక్క జీవితకాలం దాదాపు 120 రోజులు. ఆ తరువాత వాటి ని స్లీప్‌ (ప్లీహం) తొలగిస్తుంది. ఈ నష్టాన్ని సరి చేయడానికి, నిరంతరం కొత్త కణాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సాధారణ పరిస్థితుల లో ఒక సెకనులో 2.5 మిలి యన్ల ఎర్రరక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అవసరమైన ప్పుడు, ఈ సంఖ్య పెరుగు తుంది. కిడ్నీలలో తయారయ్యే ‘ఎరిథ్రో పోయ్‌టిన్‌’ అనే హోర్మోన్‌ ఈ ఉత్పత్తి వేగాన్ని క్రమబద్ధీకరి స్తుంది. ఉదాహరణకు, ప్రమాదాల వల్ల భారీ గా రక్తం కారడం లేదా ముక్కునుండి రక్తం కారడం జరిగినప్పుడు, ఆ నష్టం వెంటనే బేలన్స్‌ అవుతుంది.
అంతేకాకుండా, గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గితే, ఈ ఉత్పత్తి వేగం పెరుగుతుంది. ఉదా హరణకు, బాగా ఎతైన ప్రదేశాలపై ఎక్కుతున్న ప్పుడు, గాలిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గుతూ ఉన్న ప్పుడు, శరీరం ఆటోమెటిక్‌గా రక్తకణాల ఉత్ప త్తిని పెంచి, అందుబాటులో ఉండే ఆక్సిజన్‌ను చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుం టుంది.
పెర్‌ఫెక్ట్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యవస్థ
రక్తంలో ఉండే ద్రవ భాగాన్ని ప్లాస్మా అం టారు. ఈ ప్లాస్మా రక్త కణాలనే కాకుండా శరీరంలో ఉండే ఇతర పదార్థాలను కూడా తీసుకెళుతుంది. ప్లాస్మా స్పష్టమైన పసుపు రంగు ద్రవం. ఈ ప్లాస్మా సాధారణ శరీర బరువులో 5 శాతం ఉంటుంది. ఈ ద్రవం లో 90 శాతం నీరే. దీనిలో లవణాలు, మినరల్స్‌, కార్బోహైడేట్స్‌, కొవ్వు మరియు వందల సంఖ్యలో భిన్న రకాల ప్రోటీనులు మునిగి త్రేలుతూ ఉంటాయి. రక్తంలోని ఈ ప్రోటీను లలోని లిపిడ్స్‌ను కలిపి ఉంచి, టిష్యూలకు తీసుకు వెళ్ళే ట్రాన్స్‌పోర్ట్‌ ప్రోటీనులు కొన్ని ఉంటాయి. ఈ ప్రోటీన్‌లు కనుక ఈ విధంగా లిపిడ్స్‌ను తీసుకెళ్లకపోతే, ఈ లిపిడ్స్‌ ఓ పద్ధతి లేకుండా త్రేలుతూ, తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.  ప్లాస్మాలోని హోర్మోనులు ప్రత్యేకమైన కొరియర్ల పాత్ర పోషిస్తాయి. ఇవే శరీరం లోని అవయవాలకు, కణాలకు మధ్య రసా యన సందేశాల ద్వారా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడాన్ని సులువుచేస్తాయి.
అల్బుమిన్‌ ప్లాస్మాలోని ప్రముఖ ప్రోటీన్‌, ఇది ఒక ట్రాన్స్‌పోర్టర్‌. ఇది కోలెస్ట్రాల్‌, హోర్మోనులు, బిలిరుబిన్‌ లేక పెన్సిలిన్‌ వంటి మెడిసిన్స్‌ వంటి లిపిడ్స్‌ని కలిపి ఉంచుతుంది. విషపదార్థాలను లివర్‌లో వదలిలేసి, మిగతా పోషక పదార్థాలని మరియు హోర్మోనులను వాటి అవసరం ఎక్కడైతే ఉందో ఆ చోటుకి తీసుకెళతాయి.
ఈ విషయాలన్నింటినీ గనుక మనం పరి గణలోకి తీసుకుంటే, మనకి స్పష్టమయ్యే దేమిటంటే మన శరీరం ఎంతో గొప్పగా  (ఇన్‌ ఎక్స్‌టర్‌మెలయ డీటైల్డ్‌వే) సృష్టించ బడింది. ప్రతీ ఒక్క ప్రోటీన్‌ యొక్క సామ ర్థ్యం ఎలా ఉంటుందంటే లిపిడ్‌, హోర్మోన్‌ మరియు మెడిసిన్‌ల మధ్య ఉండే తేడాను అది గుర్తించ గలుగుతుంది. అంతే కాదు వీటి అవసరం ఎక్కడ ఉందో, ఎంత మోతాదులో వీటి అవసరం ఉందో అన్నీ తెలుసుకోగలుగుతుంది.
అల్లాహ్‌ా యొక్క దోషరహిత డిజైన్‌కు స్పష్టమైన సూచనలే ఇవన్నీ. ఆశ్చర్యాన్ని కలిగించే ఇటువంటి జీవరసాయన చర్యలు వేల సంఖ్యలో మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. ట్రిలియస్‌ సంఖ్యలో ఉండే మన శరీరంలోని పరమాణువులన్నీ అద్భు తమైన సామరస్యంతో పనిచేస్తాయి. వాస్తవే మిటంటే ఈ పరమాణు వ్యవస్థలన్నీ కూడా తల్లి గర్భంలో ఏర్పడిన ఒకే ఒక కణం నుండి విభజన జరిగి ఏర్పడినవే.
ఇది ఓగొప్ప విషయాన్ని స్పష్టం చేస్తుంది. మానవ శరీరం యొక్క అద్భుత వ్యవస్థ ఒకే బిందువు నుండి మానవున్ని  సృష్టిం చిన అల్లాహ్‌ా యొక్క అద్భుత ఆర్టిస్ట్రీకి ప్రత్యక్ష సాక్ష్యం. ఖుర్‌ఆన్‌
”మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము. ఆ తరువాత  ఈ  బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆపైన ముద్ద ను కండగా చేశాము. తరువాత మాంసపు కండను ఎముకలుగా చేశాము. ఆ తరు వాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము. ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిల బెట్టాము. కనుక అల్లాహ్‌ా ఎంతో శుభ ప్రదుడు, సృజనకారులందరిలో కెల్లా ఉత్తమ సృజనకారుడు”  (ఖుర్‌ఆన్‌ 23:12-14)
ప్రత్యేకమైన కంట్రోల్‌ మెకానిజమ్‌
ఆర్టెరీస్‌ (ధమనుల) నుండి పోషక పదా ర్థాలు అవసరమైన టిష్యూలలోకి చొచ్చుకు పోవడానికి ఆర్టెరీ గోడలను దాటవలసి ఉంది. ఆర్టెరీ గోడలు చాలా సూక్ష్మ రం ధ్రాలు కలిగి ఉన్నప్పటికి, ఏ పదార్థమూ దానంతట అదే చొచ్చుకుపోలేదు. ఈ చొచ్చుకు పోవడాన్ని సులువు చేసేది బ్లడ్‌ ప్రెషర్‌. అయినప్పటికీ అవసరానికంటే ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు టిష్యూలకు వెళితే, ఆ టిష్యూలలో మంట కు ఇవి కారణమవుతాయి. అందువలన దానికొక ప్రత్యేకమైన మెకానిజమ్‌ ఏర్పాటు చేయబడింది. దాని ద్వారా బ్లడ్‌ప్రెషర్‌ని బేలన్స్‌ చేస్తూ, ద్రవాన్ని వెనుకకు తిరిగి బ్లడ్‌లోకి తీసుకోవడం జరుగుతుంది.
ఈ బాధ్యతను అల్పుమిన్‌ తీసుకుంటుంది. ఆర్టెరీ గోడలలోని రంధ్రాలకంటే ఈ అల్బు మిన్‌ పెద్దగా ఉంటుంది. ఇది రక్తంలో చాలా సంఖ్యలో సరిపోయినంత ఉం టుంది. స్పాంజ్‌ పీల్చినట్లు వాటర్‌ని పీలు స్తుంది. శరీరంలో అల్బుమిన్‌ లేకపోతే, ఎండిన చిక్కుడు గింజను నీటిలో వదలి ఉంచితే ఎలా ఉబ్బిపోతుందో అలా శరీరం ఉబ్బిపోతుంది.

అమ్మ పాలు అమృతం



తల్లి పాలలో పోషక విలువలు మెండుగా ఉండటమే కాకుండా, బేబీ యొక్క అతి సున్నితమైన జీర్ణవ్యవస్థచే అవి సులభంగా జీర్ణం కాబడతాయి. ఆ విధంగా వాటిని జీర్ణం చేసుకోవడానికి బేబీకి తక్కువ శక్తిసరిపోవడం వలన, మిగిలిన శక్తి శరీరం యొక్క ఇతర విధుల,పెరుగుదల, అవయాల అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
(అల్లాహ్  ఇలా ఆదేశిస్తున్నాడు): ”మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచి తనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది. మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లి తండ్రులకు కృతజ్ఞుడై ఉండు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది”  (ఖుర్‌ఆన్‌ 31:14)
పసిపాపకు పోషక అవసరాలను తీర్చడానికి మరియు అవకాశమున్న ఇన్‌ఫెక్షన్ల నుండి   రక్షించడానికి తల్లిపాలు రూపంలోే పోల్చలేని మిశ్రమ పదార్థాన్ని అల్లాహ్‌ా సృష్టించాడు. తల్లి పాలలోని పోషక పదార్థాల సమతుల్యం సరియైన స్థాయిలో ఉంటుంది. పసిపాపకు అన్ని విధాల ఈ పాలు సరిపోతాయి.
అంతే కాకుండా నరాల వ్యవస్థ అభివృద్ధి మరియు మెదడు కణాల పెరుగుదల త్వరితం కావడానికి ఉపయోగపడే పోషకాలతో తల్లి పాలు నిండి ఉంటాయి. పసిపిల్లల కొరకు నేటి టెక్నాలజీ ద్వారా తయారు చేసే కృత్రిమ ఆహారం, తల్లిపాల వంటి అద్భుత ఆహారం అవసర లోటును భర్తీ చేయలేదు.
తల్లిపాల వలన కలిగే లాభాల జాబితాలో ప్రతీ రోజూ కొత్త విషయాలు చేరుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదరశోక (రెస్పి రేటరీ) మరియు జీర్ణ వ్యవస్థలకు సంబంధిం చిన ఇన్‌పెక్షన్ల నుండి పసిపాపలను తల్లిపాలు రక్షిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇది ఎలా అంటే, తల్లిపాలలోని యాంటీ బాడీస్‌ ప్రత్యక్షంగా ఇన్‌ఫెక్షన్లతో పోరాడ తాయి.
ఇన్‌పెక్షనని ఎదుర్కొనే తల్లిపాలలోని ఇతర లక్షణాలు మేలు చేసే బాక్టీరియా (నార్మల్‌ ఫ్లోరా) ఉండటానికి అనువైన వాతారవణాన్ని ఏర్పరుస్తాయి. ఆ విధంగా హానికలిగించే పరాన్న జీవులు, వైరస్‌లు, బాక్టీరియాలకు అడ్డుగా నిలుస్తాయి. అంతేకాకుండా నిరూ పితమైన మరో విషయం ఏమిటంటే, తల్లి పాలలోని అంశాలు అంటురోగ వ్యాధులకు వ్యతిరేకంగా ఇమ్యూన్‌ సిస్టమ్‌ని ఏర్పరచడమే కాకుండా దానిని సవ్యంగా పని చేసేలా చేస్తాయి.
తల్లిపాలు ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి కనుక, పసిపిల్లలకు ఇది చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం, తల్లి పాలలో పోషక విలువలు మెండుగా ఉండటమే కాకుండా, బేబీ యొక్క అతి సున్నితమైన జీర్ణవ్యవస్థచే అవి సులభంగా జీర్ణం కాబడతాయి. ఆ విధంగా వాటిని జీర్ణం చేసుకోవడానికి బేబీకి తక్కువ శక్తిసరిపోవడం వలన, మిగిలిన శక్తి శరీరం యొక్క ఇతర విధుల,పెరుగుదల, అవయాల అభివృద్ధి కొరకు ఉపయోగపడు తుంది.
కొంతమంది పిల్లలు నెలలు నిండకుండానే పుడతారు. అలాంటి పిల్లలను ప్రసవించిన తల్లుల పాలలో ఆ పిల్లల అవసరానికి సరి పోయేలా ఎక్కువ మోతాదులో కొవ్వు, ప్రొటీన్‌, సోడియం, క్లోరైడ్‌ మరియు ఐరన్‌ ఉంటాయి. ఇలాంటి పిల్లలలో ‘కళ్ళ’కు సంబంధించిన విధులు చాలా బాగా అభివృద్ధి చెందేది తల్లిపాల వల్లనేనని తెలుసుకున్నారు. అంతే కాకుండా అటువంటి పిల్లలు ఇంటెలి జెన్స్‌ పరీక్షలలో బాగా రాణించారు. తల్లిపాల వలన ఇంకా చాలా ఉపయోగా లున్నాయి. పుట్టిన బిడ్డ అభివృద్ధికి సంబంధిం చిన వాటిలో అతి ముఖ్యమైనది తల్లి పాలు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇందులో ఒమేగా – 3 ఆయిల్‌ అల్ఫాలైనోలీక్‌ యాసిడ్స్‌      ఉంటాయి. ఇది మెదడుకు మరియు రెటీనాకు చాలా ముఖ్యమైన మిశ్రమపదార్థమే కాకుండా, కొత్తగా పుట్టిన పిల్లల దృష్ట్యా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒమేగా-3కి సహజమైన మరియు పరిపూర్ణమైన స్టోర్‌ తల్లిపాలు. అంతే కాకుండా తల్లిపాల వలన దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయని, అవి ఏమి టంటే బ్లడ్‌ ప్రెషర్‌పై మంచి ప్రభావాన్ని కలిగి ఉండి, గుండెపోటు సమస్యను తగ్గిస్తుందని బ్రిస్టల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలియ జేశారు.
మెడికల్‌ జర్నల్‌ ‘సర్క్యులేషన్‌’లో ప్రచురిం చిన పరిశోధనా ఫలితాలను బట్టి తల్లి పాల వలన పెరిగే బిడ్డలో గుండె సంబంధిత వ్యాధులు రావడం తక్కువని తెలుస్తుంది.తల్లి పాలలో పోలీ అను సాట్యురేటెడ్‌ ఫేటీ యాసిడ్ల పొడవాటి చైన్‌ ఉండటం వలన, అది ఆర్టెరీస్‌ గట్టి పడకుండా నిరోధిస్తుంది.  తల్లి  అమెరికాలోని చిన్న పిల్లల హాస్పిటల్‌ మెడికల్‌ సెంటర్‌ టీమ్‌కి నాయ కత్వం వహించిన డా.లిసా మార్టిన్‌,  అనే ప్రొటీన్‌ హార్మోన్‌ అధిక మోతా దులో తల్లిపాలలో ఉన్నట్లు కనుగొన్నారు. రక్తంలో అధిక మోతాదులో ఉంటే హార్ట్‌ ఎటాక్‌ సమస్య తగ్గుతుంది. హార్ట్‌ ఎటాక్‌కు ఎక్కువగా కారణమయ్యే స్థూల కాయం కలవారిలో  తక్కువ స్థాయిలో ఉంటుంది.
ఈ హార్మోన్‌ వలన స్థూలకాయ సమస్య తల్లి పాలతో పెరిగిన పిల్లలలో తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. లెప్టిన్‌ అనే మరో హార్మోన్‌ను కూడా తల్లి పాలలో కను గొన్నారు. ఇదిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
శరీరంలో కొవ్వు ఉందని మెదడు సంకేత మిచ్చేది లెప్టిన్‌ అని నమ్ముతారు. డా. మార్టిన్‌ ప్రకటనను బట్టి, పసిప్రాయంలో తల్లిపాల నుండి గ్రహించబడిన ఈ హార్మోన్‌లు స్థూల కాయం, టైప్‌ 2 డయాబెటిస్‌ మరియు ఇన్సులిన్‌ నిరోధక శక్తి మరియు కరోనరీ ఆర్టెరీ మొదలైన వ్యాధుల సమస్యలను తగ్గి స్తాయి.
తాజా ఆహారం గురించి వాస్తవాలు
తల్లిపాలకు సంబంధించిన నిజాలు పైన చెప్పిన వాటితో పూర్తయి పోలేదు. బిడ్డ పెరుగుతున్నప్పుడు, ఆ పెరిగే థలను బట్టి, ఆ థలకు సరిపోయే ఆహారం అవసర మౌతుంది. దానికి తగ్గట్టుగా పాలలోని పోషక పదార్థాలు ఈ ప్రత్యేక అవసరాలకు సరిపోయే విధంగా మారుతూ ఉండాలి. ఆ విధంగానే బిడ్డ ఎదుగుదలను బట్టి తల్లి పాలలో ఉండే పదార్థాలు మారుతూ ఉంటాయి.
తల్లి పాలు అన్ని సమయాలలో సరియైన ఉష్ణోగ్రత (వేడి)లో లభ్యమౌతాయి. మెదడు అభివృద్ధిలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. ఎలా అంటే పాలు తనలో కలిగి ఉండే సుగర్‌ మరియు కొవ్వు (తీబిశి)  వలన. దీనితో పాటు, కాల్షియం వంటి మూలకాలు బిడ్డ ఎముకల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
‘పాలు’ అని పిలువబడుతున్నప్పటికీ, ఈ అద్భుత మిశ్రమ పదార్థంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆహారంతోపాటు, పసి పిల్లలకి నీటి రూపంలో ద్రవం కూడా కావాలి. తల్లిపాలకంటే పరిశుభ్రమైన నీరు గాని, ఆహారపదార్థాలు గాని తయారుకాలేదు. తల్లిపాలలోని 90 శాతం నీరు పరిశుభ్రమైన వాతావరణంలో బిడ్డ అవసరాన్ని తీరుస్తుంది.
కొలోస్ట్రమ్‌
కొలోస్ట్రమ్‌ అనేది బిడ్డకు జన్మనిచ్చాక ప్రారంభంలో తల్లి స్తన్యాల నుండి వచ్చే ద్రవం. సాధారణ తల్లి పాలకంటే, దీనిలో అధికంగా ప్రోటీన్లు, ఎ-విటమిన్‌, సోడియమ్‌ క్లోరైడ్‌ మరియు యాంటీబాడీస్‌   ఉంటాయి. తక్కువ మోతాదులో కార్బో హైడ్రేట్లు, లిపిడ్లు మరియు పొటాషియం ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క జీర్ణ వ్యవస్థ చాలా చిన్నదిగా ఉంటుంది. అటు వంటి సమయంలో బిడ్డకు తక్కువ మరి మాణంలో ఎక్కువ పోషకాలున్న ఆహారం కావాలి. ఆ అవసరాన్ని కొలస్ట్రమ్‌ తీరు స్తుంది. బిడ్డకు జాండిస్‌ రాకుండా కాపాడు తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి రోగ నిరోధక శక్తే బిడ్డను కాపాడుతుంది. ప్రస వించాక, ఈ కొలస్ట్రమ్‌ వ్యాధికారకాల నుండి బిడ్డను కాపాడుతుంది.
తల్లిపాలు మరియు ఇంటెలిజెన్స్‌
ఇతర పిల్లల కంటే తల్లిపాలు త్రాగిన బిడ్డ లోనే జ్ఞానాభివృద్ధి ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. జేమ్స్‌ డబ్ల్యూ ఆండర్‌సన్‌ (కెంటకీ యూని వర్శిటీ ఎక్స్‌పర్ట్‌) తల్లిపాలు త్రాగిన పిల్లలకు, కృత్రిమ ఆహారాన్ని తీసుకున్న పిల్లలకు మధ్య తులనాత్మక అధ్యయనం చేశారు.   తల్లిపాలు త్రాగి పెరిగిన పిల్లలలో ఐ.క్యూ 5 పాయింట్లు ఎక్కువగా ఉందని తెలుసు కున్నారు. 6 నెలల వరకూ తల్లిపాలు త్రాగిన పిల్లలకు ఇంటెలిజెన్స్‌కు ప్రయోజనం కలుగు తుంది. 8 వారాలకంటే తక్కువ కాలం పాటు పాలు త్రాగిన వారికి ఐ.క్యూ ప్రయోజనం లేదు.
ల్లిపాలు కాన్సర్‌ని ఎదుర్కొంటాయా?
కాన్సర్‌ నుండి తల్లిపాలు కాపాడతాయని  నిరూపించబడింది. ఈ విషయం పై ఎన్నో పరిశోధనా పత్రాలు ప్రచురించబడ్డాయి. అయితే ఇది ఎలా జరుగుతుందో, ఆ మెకాని జమ్‌ గురించి ఇంకా పూర్తిగా తెలుసు కోవలసి ఉంది.  లేబొరేటీరీలలో జరిపిన పరీక్షల వలన తెలి సినదేమిటంటే, తల్లిపాలలోని ప్రోటీన్‌ ఆరో గ్యంగా ఉండే కణాలను నష్టం కలిగించ కుండా కేవలం ట్యూమర్‌ కణాలనే చంపు తుంది. స్వీడన్‌లోని లండ్‌ యూనివర్శిటీ క్లిని కల్‌ ఇమ్యూనాలజీ ప్రొఫెసర్‌ ్పుబిశినీబిజీరిదీబి ఐఖీబిదీలీళిజీవీ ఓ పరిశోధనా బృందానికి నాయ కత్వం వహించారు. వీరే తల్లిపాల యొక్క ఈ అద్భుత రహస్యాలను కనుగొన్నారు. తల్లిపాలు ఎన్నో రకాల కాన్సర్ల నుండి రక్షించడం ఓ అద్భుత పరిశోధనగా ఈ బృందం వర్ణిం చింది.   ప్రారంభంలో, కొత్తగా జన్మించిన పిల్లల ప్రేవుల నుండి మ్యూకస్‌ కణాలను తీసుకుని, వాటిని తల్లిపాలతో ట్రీట్‌ చేశారు. వారు గమనించింది ఏమిటంటే చీదీలితిళీళిబీళిబీబీతిరీ అనే బాక్టీరియా ద్వారా వచ్చే ‘న్యూమోనియా’ వ్యాధి ని, తల్లిపాలు లితీతీరిబీరిలిదీశి గా ఆపడాన్ని గమనిం చారు.
అల్లాహ్‌ా నుండి అందిన ఈ బహుమతి – పోల్చలేని ఓ వరమే! బేబీ పాలి దివ్యా మృతమే!!
తల్లిపాల యొక్క మరొక అద్భుత అంశమే మిటంటే, రెండు సంవత్సరాల పాటు తల్లి పాలు త్రాగితే అది బిడ్డకు చాలా ప్రయోజన కారి అవుతుంది. ఈ విషయం ఈ మధ్య కాలంలోనే సైన్స్‌ ద్వారా కనుగొనబడింది.
అయితే; ఈ విషయాన్ని అల్లాహ్  1432 సంవత్సరాల క్రితమే క్రింది ఖుర్‌ఆన్‌ వాక్యం ద్వారా తెలియజేశాడు:
”పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తి చేయవలెనని కోరినట్లయితే, తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి”. (ఖుర్‌ఆన్‌ 2:233)
ఇదే విధంగా, బిడ్డ అవసరాలకి అన్ని విధాల సరిపోయే సరియైన పోషకాలుండే పాలను, ఆ పాల ఉత్పత్తిని తల్లి నిర్ణయించ లేదు. పాలలో వివిధ పోషక పదార్థాల స్థాయిని కూడా తల్లి నిర్ణయించలేదు. ఇది సర్వ శక్తిమంతుడైన అల్లాహ్‌ాకే తెలుసు. ప్రతీ జీవి యొక్క అవసరాలు, ప్రతీ జీవిపై చూప వలసిన కరుణ గురించి ఆయనకే తెలుసు. ఆయనే తల్లి శరీరంలో పాలను సృష్టించింది. కాబట్టి ఏదో అనుకోకుండా తయారు కాలేదు ఇది. ఈ సృష్టినంతటినీ ఓ పద్ధతిలో సృష్టించిన సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఒక్కే ఒక్కడు.

సర్వేంద్రియానం నయనం ప్రధానం


(ఈ పృధ్వి ఆయనది. ఈ అపార విస్తృత ఆకాశం ఆయనది. ఉభయ సాగరాలు ఆయనవి. అయినా ఆయన్ను చిన్న నీటి చెలమల్తో కూడా తెలుసుకోవచ్చు. ఆయన ఇలా పబ్రోధించాడు: ”నమ్మేవారికి భూమిలో అనేక నిదర్శనాలున్నాయి. స్వయంగా మీ అస్తిత్వంలో కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా”? (జారియాత్‌: 21) అని. మనం మన పూర్తి శరీర నిర్మాణం గురించి కూలంకషంగా తెలుసుకోవాలంటే మనకు కొన్ని వందల వేల పుస్తకాల అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టు సమయమూ కావాలి. ఎందుకంటే మనపై ఉన్న అల్లాహ్  అనుగహ్రాలు లెక్కింపసాధ్యం కానివి. ఆయన అనుగహ్రాల్లోని ఓ అనుగహ్రం – నేతం  (సర్వేందియ్రానం నయనం పధ్రానం) గురించి మానవ మేధకు అందిన కొన్ని యదార్థాల్ని తెలుసుకునేందుకు పయ్రత్నిద్దాం. హారూన్‌ యహ్యా గారి విలువైన ఆర్టికల్‌ని అనువదించి తనదైన పంథాలో పచ్రురించిన శాంతి బాట టీమ్‌ వారికి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.  - ఎడిటర్‌)
ఈ క్షణం భూమి మీద గొప్ప అద్భుతాల్లోని ఓ అద్భుతం జరు గుతూ ఉంది. అదేమంటే – మీరు ఈ వ్యాసం చదువుతున్నారు. కాగితంపై నల్లటి అక్షరాలు, మీ చుట్టూ వస్తువులు, పరిసరాలు, మీరు చూస్తున్న వాటి రంగులు, దగ్గర-దూరం, ప్రకృతి సౌందర్యం, సుకుమారతలు – అన్నీ మీకు తెలుస్తున్నాయి కదా! ఇది ఎలా సాధ్యం అయింది? అని ఎప్పుడైనా ఆలోచించారా?
మీ మెదడులో ఉండే కటిక చీకటిలో ఇవన్నీ రూపుదిద్దుకోవడం వల్లనే ఇవన్నీ తెలుస్తున్నాయి. మీకు కళ్ళతో పాటు చూసే చక్కటి శక్తి ఉంది కాబట్టి మీరు సృష్టి సౌందర్యాన్ని చూడగలుగు తున్నారు. మీ కుటుంబం, మీ ఇల్లు, మీ ఆఫీసు, మీ ఆప్తులు, మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి దాన్ని మీరు ఇట్టే పసిగట్ట గలుగు తున్నారంటే కారణం మీ చూపు. కళ్ళు లేకుండా మీ చుట్టూ ఉండే దేని గురించైనా కరెక్ట్‌గా సెన్స్‌ చేయలేరు కదా! కళ్ళు లేకుండా రంగులు, రూపాలు, రమణీయ దృశ్యాలను ఒక్కసారి ఊహించుకోండి!
సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువు ఫోటో తీయాలంటే, ఆ వస్తువు దూరంగా ఉంటే ఫోకస్‌ ఎడ్జస్ట్‌  చేసుకోవాలి. అది దగ్గరగా ఉంటే క్లోజ్‌అఫ్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. కాని మన కళ్ళల్లో ఉండే లెన్స్‌లు అటువంటి ఆప్టికల్‌ కొలతలు తీసుకోకుండానే వెంటనే ఫోకస్‌ చేెసుకుంటాయి. అంటే మనం ఓ వస్తువును చూడాలనుకుంటే చాలు, క్షణంకంటే తక్కువ సమయంలోనే, మన కళ్ళు ఫొకస్‌ చేెసుకోవడం, మెదడుకి అందించడం, మన కు ఆ వస్తువు గురించి తెలియడం వెంటవెంటనే జరిగి పోతాయి.
మరి ఈ మహిమ నేత్రాలదో, మెదడు, మేధకి సమబంధించి నదో కాదు; ఇది సర్వలోక సృష్టికర్త, పాలకుడు, పరిపోషకుడు అయిన అల్లాహ్‌ాది. ఆయనే మనల్ని శూన్యం నుండి సృష్టిం చింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”అల్లాహ్  మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి బయటకి తీశాడు (పుట్టించాడు).  అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడిని, కళ్ళనీ ఇంకా హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని”. (16: 78)
కంటి యొక్క ఖచ్చితమైన నిర్మాణం
గడిచిన కొన్ని సెకన్లలో, మన కళ్ళల్లో సుమారు వంద బిలి యన్ల చర్యలు పూర్తి అయి ఉంటాయన్న విషయం మీకు తెలుసా? విశ్వం యొక్క టెక్నాలజీకి సంబంధించిన ఓ ఉదా హరణ కన్ను రూపంలో మన దగ్గరే ఉందంటే అశ్చర్యమేస్తుంది కదూ! ఈ విశ్వ కర్త టెక్నాలజీని అంచనా వేయడం విషయం అలా ఉంచితే దాని దరిదాపులకు కూడా ఏ సైంటిస్టు చేరుకోలే డన్నది కఠోర సత్యం. దానిని పోలినది మనిషేదైనా కని పెట్ట వచ్చు అంతే.
కళ్ళ యొక్క నిర్మాణం మరియు వాటి పనిని బట్టి  అవి మన శరీరంలోని చిన్న ప్రదేశాన్ని మాత్రమే ఆక్రమించాయి. కళ్ళు ఉండే ప్రదేశం కరెక్టుగా – మన శరీరవయాలన్నింటిని సరైన విధంగా కంట్రోల్‌ చేసే సూచనలిచ్చే వీలు కల్పిస్తుంది అంటే ఆశ్చర్యం వేయకమానదు. ఒక్క నిమిషం ఆలోచించండి! ఒకవేళ మన కళ్ళు మేకాళ్ళ దగ్గరనో. లేక చీలమండల దగ్గరనో ఉండి ఉంటే ఎలా ఉండేది? అప్పుడు మనం నడుస్తున్నప్పుడు మన క్రింది దారి కనబడుతుందేగాని, పైన ఏముందో కనబడదు.  అలానే మనం నడిచి వెళితే ఏదోకదాన్ని వెళ్ళి ఢీకొనడం ఖాయం. అటువంటి పొందిక లేని శరిర నిర్మాణమే గనక మనం కలిగి ఉంటే, మామూలుగా చేసే చాలా పనులు – తినడం, త్రాగడం, పరికరాలను ఉపయోగించడం మొదలైనవి చాలా కష్టమయ్యెది. దీనికి భిన్నంగా  మన  కళ్ళు సరైన  చోట
ఉండటమే కాక, మన ముఖంలో అవి చాలా ఖచ్చితమైన స్థానంలో అందంగా అమర్చబడి ఉన్నాయి. సుబ్హానల్లాహ్‌ా!
మరో ఉదాహరణ – మన కళ్ళు ఒకవేళ ముఖం మీదే ముక్కు క్రింద ఉండి ఉంటే చూడటానికి వికారంగా ఉండటమేకాక, సురక్షితమైన కోణంలో (సేఫ్‌ ఎంగిల్‌) చూడటం మనకు సాధ్య మయ్యేది కాదు. కాబట్టి సుందరాంగుడైన ఆ సృజనశీలుడు అవి ఉండాల్సిన స్థానంలోనే వాటి అందంగా అమర్చాడు. ఇదొక్కటే కాదు  కనుబొమ్మల నుండి కార్నియా వరకు, కన్నీళ్ళు ఏర్పడ టం నుండి కనురెప్పలు వాల్చడం వరకూ ప్రతిదానిలోనూ ఓ ప్రత్యేకమైన అద్భుతం, ప్రబల నిదర్శనం ఉంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”ఇదీ అల్లాహ్‌ా  సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి?” (లుఖ్మాన్‌: 11)
నిజంగా మనిషి సృష్టించిందంటూ ఏది లేదు. ఉన్న వాటికి కొత్త రూపం ఇచ్చాడు అంతే. శూన్యం నుండి ఏ ఒక్క వస్తు వును సృష్టించడం ఎవరి తరమూ కాదు.
కనురెప్పలు
మనకు తెలియకుండానే రోజుకి వేల సార్లు మనం మన కళ్ళ ను బ్లింక్‌ చేస్తుంటాము. ఇలా మన ప్రమేయం లేకుండానే జరిగే కదిలికలు చాలా వరకు తీవ్రమైన వెలుగు నుండి, బాహ్య ధూళి కణాల నుండి, కళ్ళు తమను తాము భద్రంగా ఉంచుకోవ డానికి  దోహదపడుతుంటాయి. ఇలా మనం తెరుస్తూ మూస్తూ ఉన్నప్పుడు, కనురెప్పలు కన్ను యొక్క ఉబ్బెత్తుగా ఉండే ఆకా రానికి సరిపోతాయి. అందువలన కంటి యొక్క ఉపరితలాన్ని కనురెప్ప పూర్తిగా కప్పకలుగుతుంది.
కనుగుడ్డు వంపుకు అంత ఖచ్చితంగా కనురెప్ప ఫిట్‌ కాకపోతే, చేరుకోలేని కంటి మూలల నుండి ధూళి కణాలను తొలగిం చడం అసాధ్యమయ్యేది. మనకు తెలియకుండా జరుగుతున్న ఈ ప్రక్రియ నిజానికి మనకు పోల్చసాధ్యం కాని  ఓ వరమే. ఖచ్చితమైన ఈ నిర్మాణం గురించి ఖుర్‌ఆన్‌ ఇలా చెబుతుంది:
”నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) విధి ప్రకారమ సృష్టించాము”. (ఖమర్‌: 49)
ఒకవేళ పైన పేర్కొన్న విధంగా ఆటోమెటిగ్‌ బ్లింకింగ్‌ జరగకపోతే ఏమవుతుంది? ఏమవుతుందంటే – కళ్ళల్లో దుమ్ము బాగా ఎక్కువ చేరినప్పుడు మాత్రమే మనురెప్పలు ఆడించాలని మనకు జ్ఞాపకమొస్తుంది. ఫలితంగా, అతి చిన్న ధూళి కణం కూడా చివరికి పెద్ద సమస్యే సృష్టిస్తుంది. అది ఇన్ఫెక్షన్‌కి దారి తిస్తుంది.
ఇలా సగం మాత్రమే కళ్ళు శుభ్రమయితే, చూపు కూడా మందగిస్తుంది. ఇందులో మరో ట్విస్ట్‌ ఏమిటంటే బ్లింకింగ్‌ (కను రెప్పవాల్చడం) మధ్యనున్న కాలవ్యవధి. ఎటువంటి అవరో ధాలు లేకుండా మనిషికి తన చుట్టూ మారుతున్న పరిశరాలు తెలియజేస్తూ ఉండాలి. ఉదాహరణకు మనం కారులో వెళు తుంటే మన చుట్టూ ఉండే ప్రదేశాలు మారిపోతూ ఉంటాయి కదా! అందుకని మనం చూస్తున్న వస్తువు నిరంతరం కన్పించ డానికి ఈ బ్లింకింగ్‌ చాలా తక్కు సమయంలోనే జరగాలి. ఒక వేళ ఈ బ్లింకింగ్‌ వెంటవెంటనే జరగకుండా ఎక్కువ సమ యాన్ని తీసుకుంటే తీవ్ర ప్రమాదాలకి కారణం అవుతుంది. హైవే మీద ప్రయాణం చేస్తున్నారనుకోండి. రెప్పలు మూసుకుని వెంటనే తెరుచుకోకుండా కాసేపాగాక తెరుచుకుంటే భయకర మైన యాక్సిడెంట్‌కి దారి తీస్తుంది.  ఇక్కడ మనం గమనించా ల్సిన విషయం ఏమిటంటే – మన కనురెప్పల బ్లింకింగ్‌ మనకు తెలియకుండానే జరుగుతూ ఉంది. బ్లింకింగ్‌ కావడంలోని ఈ సున్నితమైన బ్యాలెన్స్‌ మనం పుట్టినప్పటి నుండి జరుగుతూనే ఉంది. ఇది పోల్చ శక్యం కాని దైవ సృష్టికి ప్రతక్ష్య సాక్ష్యం! మరి ఇంత తెలిసిన, తెలుసుకుంటున్న మనషి ఆ పరమ దాత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు? ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా ప్రశ్నిస్తుంది:
”ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? (యదార్థానికి) ఆయనే నిన్ను సృష్టించాడు. నఖశిఖపర్యంతం ఎలాంటి లోపం లేకుండా నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు. ఆపైన నిన్ను తగు రితిలో పొందికగా మలిచాడు. తాను తలచిన ఆకారంలో నిన్ను కూర్చాడు”.     (82: 6-8)
కన్నీరు – ఖచ్ఛితమైన కన్నీటి బొట్టు
కన్నీటి బొట్టు చాలా అసాధారణమైన ద్రవం. ఇది విభిన్న అంశాలను కలిగి, వివిధ ప్రత్యేకమైన పనులకు ఉపయోగ పడుతుంది. ప్రాథమికంగా కన్నీటి  బొట్టు కంటిని క్రిముల నుండి కాపాడుతుంది. కన్నీటిలో లైసోజైమ్‌ అను జెర్మిసైడల్‌ ఎంజైమ్‌ ఉంటుంది. ఇది కళ్ళలో క్రిములు లేకుండా చేస్తుంది. మైక్రోబ్‌ను చంపే సామర్థ్యం ఈ ఎంజైమ్‌కి ఉంది. చాలా రకాల బాక్టీరియాను చిదిమి వేస్తుంది. శక్తివంతమైన లైసోజైమ్‌ వాస్తవానికి, మన ఇళ్ళలోని క్రిములను చంపడానికి వాడే కొన్ని రసాయనాల (కెమికల్స్‌) కంటే కూడా బలమైనది. ఇటువంటి ప్రభావాల ను కలిగి ఉండి, మన కళ్ళకు పూయ కలిగే కృత్రిమమైన క్రిమి సంహారి లేనే లేదు. అంతే కాకుండా మరో అద్భుతం ఏమిటంటే, అలాంటి బలమైన పదార్థం అయి ఉండి కూడా మన కళ్ళకు స్వల్ప మైన ప్రమాదాన్ని కూడా కలుగజేయదు. ఇంత సున్నితంగా ఖచ్చితమైన లెక్క ప్రకారం ఏర్పాటు చేసిన వ్యవస్థను మన కంటిలో సృష్టించిందెవరు? సర్వ శక్తి మంతుడైన అల్లాహ్‌ా కాదా? ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”వాస్తవంగా మేము మానవుడిని సర్వ శ్రేష్టమైన ఆకారారంలో సృష్టించాము”. (అత్తీన్ :4)
చాలా దగ్గరగా పరీక్షిస్తే, ఈ కన్నీటి బొట్టు తయారీలో ఎలాంటి అద్భుతం దాగి ఉందో బాగా అర్థం చేసుకోగలుగుతాము కార్నియా తడిగా ఉండేలా, దానిని పొడి కాకుండా రక్షించడానికి మరియు కనుగ్రుడ్డు యొక్క జారే గుణాన్ని కొన సాగించడానికి  కావలసినంత కన్నీరు మాత్రమే ఖచ్చితమైన పరిణామంలోనే విడుదల అవుతుంది. ఈ విధంగా కంటిల నీరు విడుదల అవడం వలన మనుగ్రడ్డు తిరుగుతున్నప్పుడు, దీని పై భాగానికి మరియు కనురెప్ప లోపలి భాగానికి మధ్య అసౌకర్యమైన ఘర్షణ  లేకుండా ఉంటుంది.
ఒకవేళ కన్నీరు గనక కావాల్సిన మోతాదులో తయారు కాకపోతే, కనురెప్ప మరియు కనుగ్రుడ్డు మధ్య ఘర్షణ ఏర్పడి భరించరాని నొప్పి కలుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు మన కళ్ళల్లో ఇసుక ఉన్నట్లుగా నిరంతరం మండుతున్న అనుభూతి కలుగుతుంది. కళ్ళు ఎర్రగా ఉబ్బుతాయి. మరీ ఎక్కువైతే గ్రుడ్డితనానికి దారి తీస్తుంది. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా ధూళి కణంగాని మన కళ్ళల్లో పడి చికాకు పెడితే వెంటనే ఆటోమెటిక్‌గా కళ్ళలో నీరు ఎక్కువగా తయారవుతాయి.
మరోలా చెప్పాలంటే, ఖచ్ఛితమైన మరియు సరైన అవయవ నిర్మాణాన్ని కలిగి ఉండే కన్నీటి గ్రంధులు ఖచ్ఛితంగా కావలసిన పరిణామంలోనే కంటిలో నీటిని విడుదల చేసేలా కంట్రోల్‌ చేస్తూ ఉంటాయి. పూర్వ కాలంలో మనిషికి కన్నీళ్ళు వచ్చాయి. ఇప్పుడూ మనిషికి కన్నీరు వస్తుంది. అవి మనిషి నుండి  మనిషికి మారవు. ఖురాన్‌లో ఇలా ఉంది:
”ఆయన (అల్లాహ్‌ా) తన ఇష్టాను సారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చిదిద్దుతాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సర్వ శక్తి మంతుడు, మహా వివేెకవంతుడు”.  (ఆలి ఇమ్రాన్: 6)
చూపు  ఎలా కూర్చబడుతుంది?
పుట్టనప్పటి నుంచి మనిషి చూసే ప్రతీ  దృశ్యం కూడా మెదడులో కొన్ని ఘనపు సెంటీ మీటర్ల పరిమాణంలో ఉండి, కంటి చీకటి మరియు తేమగా ఉండే వాతావర ణంలో ఉండే ‘దృశ్య కేంద్రం’గా పిలువబడే ప్రదేశంలో కూర్చబడుతుంది.చిన్న గదియొక్క దృశ్యాలే కాకుండా సువిశాలమైన ప్రకృతి దృశ్యాలు కూడా ఏర్పడేవి మెదడులోని ఈ చిన్న ప్రదేశం లోనే. మన సొంతమైనవి, మన బాల్యం, మనం వెళ్ళిన స్కూలు, మన ఇండ్లు, పని, కుటుంబం, దేశం, క్లుప్తంగా మనం చూసిన ప్రతీ చిన్న వివరం-అన్నీ కూడా మెదడులోని చిన్ని భాగంలోనే ఉంటాయి.
మన చూపులో మొదటి
కాంతి కిరణాలు మన కళ్ళల్లోకి ప్రవేశించి కార్నియా, కనుపాప మరియు లెన్స్‌ (కటకాల) ద్వారా కంటి లోపలికి ప్రయాణిస్తాయి. రెటీనాలోని కాంతికి ప్రభావితమయ్యే కణాలు, ఆ కాంతిని ఎలక్ట్రికల్‌ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపుతాయి. రెటీనా నుంచి వచ్చే దృశ్యం తలక్రిందులుగా ఉంటుంది. కాని మెదడు ఈ దృశ్యాన్ని సరియైన విధంగా తిరగ వేస్తుంది. ప్రతీ కన్ను నుండి వచ్చే సంకే తాలలో వస్తువుకు సంబంధించి గ్రహించిన దృశ్య వివరాలు ఉంటాయి.
రెండు కళ్ళ నుండి వచ్చిన దృశ్యాలను ‘మెదడు’ (ఔజీబిరిదీ) కలిపి, ఒకే త్రీ డైమన్షనల్‌ దృశ్యాన్ని తయారు చేస్తుంది. టూ డైమన్ష నల్‌ దృశ్యానికి ఉదాహరణ ఫోటో  అయితే, త్రీ డైమన్షనల్‌ దృశ్యానికి ఉదాహరణ వీడియో. అంతే కాకుండా ఆ దృశ్యానికి సంబంధించిన రంగులు మరియు అది మనకు ఎంత దూరంలో ఉందో మొదలైన విషయాలను మెదడు నిర్థారిస్తుంది. ఈ మొత్తం పని అంతా మెదడులో ఒక సెకనులో పదవ వంతు కంటే తక్కువ సమయంలోనే జరుగు తుంది. సుబ్హానల్లాహ్‌ా!
మన కన్ను లెక్కలేనన్ని రకరకాల భాగాల తో మరియు పొరలతో తయారైంది. వీటిలో కొన్ని: కార్నియా (కంటి గుడ్డు మీద ముందు ఉండే పారదర్శకమైన గట్టి భాగం). ఐరిస్‌ (కంటిపాపకు చుట్టూ ఉండే నల్లని పొర). పుపిల్‌ (కనుపాప). లెన్స్‌ (కనురెప్ప), రెటీనాను మెదడుకు కలిపే నరాలు మరియు లెక్కలేనన్ని ఇతర నిర్మాణాలు. ఇవన్నీ కలిసి ఒకేసారి మొత్తంగా మాత్రమే పని చేస్తాయి. కళ్ళు వేటినైనా చూడాలంటే, పై నిర్మాణాలను మరియు అదే సమయంలో టిష్యూలను కూడా కలిగి ఉండాలి. అవి ఖచ్ఛితంగా మరియు సంపూర్ణంగా ఏక కాలంలో ఒకేసారి పని చేయాలి. ఈ వ్యవస్థలన్నిం టిని సృష్టించి, వాటి మధ్య గొప్ప సామర్థ్యాన్ని ఏర్పాటు చేసిన అల్లాహ్‌ా సర్వ శక్తిమంతుడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏమీ లేని శూన్యం నుండి సృష్టించినవాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణ యించుకున్నప్పుడు దానికి కేవలం – ‘అయిపో!’ అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది”. (బఖరా: 117)
మనం ఏమైతే చూస్తున్నామో వాటి గురించి తెలుసుకోవడం
మానవుని మెదడులో తను చూసే దృశ్యాలు దాచ బడతాయి. ఈ విధంగా మెదడులో దాచబడిన సమాచారాన్ని మరలా ఉపయోగించుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. మనం ఏదైనా  ఓ వస్తువుని గాని, ఓ వ్యక్తిని గాని మొదటి సారి  చూసినప్పుడు ఉదాహరణకు ఆ వస్తువు లేదా వ్యక్తి కొరకు మన మెమోరీ (జ్ఞాపక శక్తి)లో ఓ కొత్త ఫైల్‌ ఓపెన్‌ అవు తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా అదే
దృశ్యాన్ని మరలా మనం చూసినప్పుడు మన జ్ఞాపక పొరలలోనున్న ఫైల్‌ తిరిగి తెరచుకుని, ఆ ఫైల్‌లో భద్రపరచబడిన దృశ్యంతో, ఈ దృశ్యాన్ని పోల్చి చూసుకుం టుంది.
ఉదాహరణకు మన్‌మోహన్‌సింగ్‌ గారిని మొదటిసారి చూసినప్పుడు ఆయన యొక్క ఫోటో మన మెదడులో మన్‌మోహన్‌సింగ్‌ గారి పేరు మీద రికార్డ్‌ అవుతుంది. ఆ తర్వాత  మరెప్పుడైనా ఆయనను చూసి నపుడు మన మెదడులోని ఫైల్‌లో ఉన్న మన్‌ మోహన్‌సింగ్‌ గారి ఫోటోతో పోల్చు కోవడం జరుగుతుంది. పోలిక సరిపోతే మనం చూసే వ్యక్తి మన్‌మోహన్‌ సింగ్‌ అని మనకు తెలుస్తుంది.
ఈ విధంగా మనం చూసే దృశ్యాలను మన మెదడు నిర్ధారిస్తుంది. ఈ విధంగా జరగడం మానవులందరిలోనూ ఆటో మెటిక్‌గా జరిగిపోతుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకూ ఈ వ్యవస్థ అందరి మెదళ్ళలోనూ ఒకే విధంగా పని చేస్తూ ఉంటుంది.
మనకు తెలియకుండా జరుగుతున్న ఇటు వంటి పనుల గురించి మనకు ఎప్పుడు స్పష్టంగా తెలుస్తుంది? మన మెదడులోని ఈ వ్యవస్థ పనిచేయకుండా ఆగిపోయి నప్పుడు మాత్రమే తెలుస్తుంది.
(ఈ విషయం అర్థం కావడానికి వీడియోలో చూపబడిన ఓ సన్నివేశం గురించి ఇక్కడ వర్ణిస్తున్నాము.)
డాక్టర్‌ చూపిస్తున్న ఫోటోలను గుర్తు పట్టడానికి ఓ ముసలాయన ప్రయత్నిస్తు న్నాడు. ఈయన కొద్ది క్షణాల క్రితం చూసిన దృశ్యాలు కూడా అతని మెదడు లోని జ్ఞాపకాల నుండి మాయమవుతు న్నాయి. అంటే కాసేపటి క్రితం చూసిన వాటిని కూడా మర్చిపోతున్నాడు.
”ఈ ఫోటోలలో కన్పిస్తున్న వ్యక్తి తెలిసిన వాడులా అనిపిస్తున్నా సరే, ఆయనెవరో నాకు తెలియదు. ఆనెవరో నేను చెప్ప లేను.”
ఆ విధంగా ఆయన గుర్తు పట్టని వ్యక్తు లలో ఆయన భార్య కూడా ఉంది. ఆమె అతనితో 48 సంవత్సరాలుగా కాపురం చేసింది కూడా. అలాగే కొద్ది సేపటి క్రితం తన చేతిలో చేతినుంచుకుని నడి పించుకుని తీసుకుని  వెళ్ళిన తన మను మడిని కూడా అతను గుర్తుపట్ట లేడు. ఇంతకీ జరిగిందేమిటి?  అంటే,
మనుష్యుల ముఖాలను కనుగొనే శక్తిని, తనకు జరిగిన బ్రెయిన్‌ ఆపరేషన్‌ ఫలి తంగా ఈయన కోల్పోయాడు.ఆయన యొక్క ఈ పరిస్థితిని స్వయంగా ఆయన యొక్క మాటలలోనే తెలుసుకుందాం.
”ఒక షాపు ముందు ఇద్దరు స్నేహితుల తో నా కుమారుడు నిలుచున్నప్పుడు, వారి ముఖాలను నేను గుర్తు పట్టలేక పోతున్నాని నేను గ్రహించడమే మొదటి ఉదాహరణ.”ఆ ముగ్గురిలో కనీసం ఒక్కరి గురించి నేను తెలుసుకోవాలి. అందుకోసం వారివైపు నడచివెళ్తూ వారి ముఖాలను అధ్యయనం చేస్తున్నాను. వారి మధ్యలోని ఒకరు ‘హాయ్‌ డాడ్‌’ అని పిలిచే వరకూ, వారిలో ఎవరు నా కొడుకో నాకు ఐడియా లేకుండా పోయింది”.
ఎవరినైనా కనుగొనడానికి ప్రయత్నించ డం పెద్ద విషయం కాకపోయినా, వారు నాకు ఎంత బాగా తెలుసు అనే విషయం తెలియడం నాకు అసాధ్యమైన పని అయి పోయింది. నేను పిల్లల కోసం బీచ్‌కి వెళ్ళ వలసి వస్తుంది. అంతవరకూ బాగా నే ఉంటుంది. ఆ బీచ్‌లోని అంతమంది  లో నా పిల్లలిద్దరినీ కనుగొనడం ఎలా?
ఇతని కొడుకు తన తండ్రి యొక్క ఆరోగ్యలోపాన్ని ఈ విధంగా వర్ణించాడు. ”మీరు నా ముఖాన్ని చూసినప్పుడు, నా మొత్తం ముఖాన్ని ఒకే పిక్చర్‌గా చూడగలుగుతారు.(అలా చూడటంలో) నా చెవులు చిన్నవా? పెద్దవా? చిన్న ముక్కా? లేదా నా కళ్ళ యొక్క రంగు ఏమిటో మీరు చూడగలరు.(కాని) ఈయన మిమ్మల్ని చాలా దగ్గరగా చూడ వలసి వస్తుంది. ఈయన మీ ఎడమ కన్నును చూడగలడు, ఆ తర్వాత మీ ముక్కును చూడగలడు, మీ పెదవులను మరియు మీ నోటిని చూడగలడు. కాని ఈయన సమస్య ఏమిటంటే, ఇలా విడి విడిగా చూసిన వీటన్నింటినీ ఒకేసారి ఒకే పిక్చర్‌లో పెట్టలేడు.” అంటే మీ ముఖంలో భాగాలను చూడగలడు గాని ఒకేసారి మీ
ఇక్కడ స్పష్టంగా తెలిసేది ఏమిటంటే, మన మెదడులో జరగవలసిన అవసరమైన పనులు నిరంతరం ఆగకుండా జరుగకపోతే, మనం ఏ ఎన్విరాన్‌మెంట్‌లో నివసిస్తున్నామో, ఆ ఎన్విరాన్‌మెంట్‌లోని మనచుట్టూ ఉన్నవాటినీ, మనకు ప్రియమైన వారిని గుర్తుపట్టలేం! పైన చెప్పిన ముసలాయన మాటలు మరొక సారి మనకు ఓ వాస్తవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.
”ముఖాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో, దానిని పోగొట్టుకునే వరకూ నేను ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయాను.”
ప్రతీ రోజూ మరలా మరలా మనం ఉపయో గించుకోవడానికి వీలుగా మన మెదడు కొన్నింటిని రికార్డ్‌ చేసుకుని భద్ర పరచుకుం టుంది. కాని ఈ దృశ్యాలు ఎక్కడ రికార్డ్‌ చేయ బడతాయి? ఎలా రికార్డ్‌ చేయబడ తాయి? ఏ విధంగా మరియు ఎవరిచే అవి రీకవర్‌ చేయబడతాయి? ఉదాహరణకు కం ప్యూటర్‌లో సమాచారాన్ని హార్డ్‌ డిస్క్‌లోగాని, సీడీలలోగాని, డివిడీలలోగాని స్టోర్‌ చేస్తారు. అయితే వాటియొక్క కెపాసిటీ చాలా తక్కువ. కంప్యూటర్‌ గురించి తెలియని వారికి చాలా స్పష్టంగా అర్థం కావడానికి ఓ ఉదాహరణ ఇక్కడ అందిస్తున్నాము.
ఒక వ్యక్తి తన గత 20 సంవత్సరాల నుండి చేస్తున్న ప్రతీ పనిని ఓ వీడియోలో రికార్డ్‌ చేయించుకుంటున్నాడు అనుకుందాం. అంటే 20þ365 రోజులు = 7,300 రోజులు. రోజుకి 24 గంటలు కాబట్టి ఒక రోజును పూర్తిగా మంచి క్వాలిటీలో రికార్డ్‌ చేయడానికి 6 డివిడీలు అవసరం అనుకుందాం. మరి 7,300 రోజులను పూర్తిగా రికార్డ్‌ చేయడాని కి 7,300þ6 = 43,800 డివిడీలు కావాలి. పోనీ 40,000 డివిడీలు అవసరం అనుకుం దాం. ఈ 40 వేల డివిడీలలో ఆ వ్యక్తి యొక్క గడచిన 20 సంవత్సరాల జీవిత విష యాలున్నాయన్న మాట.
ఆ వ్యక్తి ఓ పది సంవత్సరాల క్రితం అంటే 2001 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున జరిగిన ఓ ముఖ్య సంఘటనను గుర్తు చేసు కున్నాడు. ఆ సంఘటన గురించి అతనికి ఆలోచన వచ్చిన మరుక్షణమే ఆతని మెదడు లో అప్పటి ఆ   సంఘటన కదలాడింది.
మరలా ఆ సంఘటన తన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక సెకను కంటే అతి తక్కువ కాలంలో ఇది జరిగింది. మరి ఇదే సంఘటనను ఆ 40వేల డివిడిలలో వెతకడానికి మీకు ఎంత సమయం పడు తుంది? ఆ 40వేల డివిడిలను ఉంచడా నికి ఎంత స్థలం కావాలి? కాని ఇన్ని వేల డివిడీ లలో పట్టే సమాచారమంతా, మెదడులోని ఓ అతి చిన్న ప్రదేశంలో నిక్షిప్తమయి ఉందంటే, అది ఎంత అద్భుతం!
”మరి ఆయన (అల్లాహ్‌ా) మీరు అడిగిన (అవసరమైన) దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లాహ్‌ా చేసిన మేళ్లను- అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించ లేరు”. (ఇబ్రాహీమ్: 34)
అల్లాహ్‌ా అనుగ్రహాలు అగణ్యమైనవి. వాటి ని ఎవరయినా ఎంచదలిస్తే లెక్కించ లేరు. ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుకో దలిస్తే అది మన వల్ల కాదు కూడా. ఒక ‘అసర్‌’ ఉల్లేఖనంలో హజ్రత్‌ దావూద్‌ (అ) గారి మాట ఇలా ఉంది:’ఓ అల్లాహ్‌ా! కృతజ్ఞత తెలుపుకోవడం అనేది కూడా నీ తరఫున ప్రసాదించబడిన ఒక వరమే అయినప్పుడు, ఏ రీతిన నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకోను స్వామీ!?’ అన్నారు. దానికి సమాధానంగా అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”దావూద్‌! ఇప్పుడు  నువ్వు కృతజ్ఞతలు చెల్లిం చావు. ఎందుకంటే నాకు కృతజ్ఞతలు చెల్లించ గలిగే శక్తి లేదని నువ్వు అంగీకరించావు. అదే నీలోని కృతజ్ఞతాభావానికి ప్రతీక”. (తఫ్సీర్‌ ఇబ్నె కసీర్‌)
మన కనులకుండే లెన్స్‌ల ద్వారా మనం చూస్తున్న ప్రతీ విషయం రికార్డ్‌ అవుతుందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఒకొక్కసారి మనం ఏదో ఆలోచనలో ఉన్న ప్పుడు మన ముందు జరగుచున్న విషయం (లేదా) మన కనులు చూడగలిగేంత దూరం లో జరగుచున్న విషయాలను మనం గమనిం చం.కాని ఎవరైనా హిప్నాటిస్ట్‌, మనల్ని హిప్న టైజ్‌ చేసి, ఫలానా రోజు మీరు నడుస్తూ వెళు తున్నప్పుడు, మీ ముందు వెళుతున్న కారు నంబర్‌ చెప్పండి అని అడిగినప్పుడు, చెప్ప గలుగుతాము.ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్య మైంది అంటే మనం పట్టించుకోని చాలా విష యాలు కూడా మన మెదడులో రికార్డ్‌ అవు తున్నాయని తెలుస్తుంది.
పైన చెప్పుకున్నట్లు, ప్రస్తుతం అందుబాటు లోనున్న టెక్నాలజీ ద్వారా 20 సంవత్సరాల జీవితాన్ని రికార్డ్‌ చేయడానికి 40వేల డివి డిలు కావాలి. సైన్స్‌ లేదా ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులు, పై విషయాలు చదివి డివిడీల కంటే ఎక్కువ సమాచారాన్ని రికార్డ్‌ చేసుకునే
పరికరాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. కాని పెద్దగా చదువుకోలేని వారికి కూడా ఈ వ్యాసం అర్థం కావాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ డివిడీల గురించి చెప్పడం జరిగింది. డివి డీిలు మాత్రమే కాకుండా ఏ మెమోరీ డివైస్‌ ను మీరు తీసుకున్నా సరే, ఈ వ్యాసంలో చెప్పబడిన విషయాలకు సరిపోతుంది.
కళ్ళతో చూసే ఈ చూపుకు సంబంధించిన ఇంద్రియ జ్ఞానం మరియు అందులో దోషం లేని ఆ వ్యవస్థలు, అల్లాహ్‌ా యొక్క అంతు లేని శక్తిని మనకు తెలియజేస్తున్నాయి.
”కనుక మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు?” (అర్రహ్మాన్:13)
సృష్టికర్త అయిన  అల్లాహ్‌ా మానవ శరీర లోతులలో, కంటికి కనిపించని చిన్న ప్రదే శాలలో కూడా అద్భుతాలను ఉంచాడు. అవి మానవుడు అర్థం చేసుకోవడానికి అతీతంగా ఉన్నాయి.
కళ్ళతో చూసే ఈ చూపుకు సంబంధించిన ఇంద్రియ జ్ఞానం మరియు అందులో దోషం లేని ఆ వ్యవస్థలు, అల్ల్లాహ్‌ా యొక్క అంతు లేని శక్తిని మనకు తెలియజేస్తున్నాయి. ప్రతీ క్షణం, మనం గ్రహించే ప్రతీ దృశ్యం, అల్లాహ్‌ా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆ కారణం చేతే, ప్రతీ క్షణం మనం చూసేది మన కోసం విడిగా ఓ పరిక్షే! ఈ వాస్తవం ఖుర్‌ఆన్‌లో తెలియజేయబడింది.
”నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ బిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము.” (దివ్యఖుర్‌ఆన్‌ 76:2)
రెండు కళ్ళు – ఒకటే చూపు
మనం రెండు కళ్ళతో పుట్టామని తెలుసు కాని, ఒకే చూపుకు రెండు కళ్ళు ఎందుకు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? వాస్తవానికి ప్రతీ కన్ను దానికంటూ విడిగా ఓ దృష్యాన్ని ఏర్పరచుకుంటుంది. ప్రతీ కన్ను విడివిడిగా దృశ్యాలను ఏర్పరచుకుంటే, మరి రెండు కళ్ళు ఎందుకు? ఒకటి చాలు కదా! అని అనిపిస్తుంది. రెండు కళ్ళ మధ్య దూరం సుమారుగా 5 సెంటమీటర్లు ఉంటుంది. అలాగే బాహ్య ప్రపం చంతో ఒకొక్క కన్ను ఒకొక్క దృక్కోణాన్ని కలిగియుంటుంది.
2-డైమన్షన్‌లో ఒకొక్క కన్నుకు అందిన దృశ్యాన్ని మెదడు స్వీకరించి, ఈ రెండు కళ్ళ నుండి రెండు 2-డైమన్షన్‌ దృశ్యాలని కలిపి త్రీ డైమన్షన్‌ (త్రీడీ)లో దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఆ విధంగా రెండు కళ్ళ నుండి అందిన దృశ్యాల మధ్య ఉండే తేడాలను గమనించి, ఆ దృశ్యాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఏ డెప్త్‌లో ఉన్నాయనేది మెదడు నిర్ధారిస్తుంది. ఒకవేళ రెండు కళ్ళ నుండి అందిన రెండు దృశ్యాలను సరిగ్గా గనుక మెదడు కలపలేకపోతే, మనకు ఒకే దృశ్యం రెండుగా కనిపిస్తుంది. అంతేకాకుండా అది టూ డైమన్షన్‌లోనే ఉంటుంది.
ఈ విషయం అర్థం కావడానికి ఓ ఉదాహరణ: ఏదైనా చెట్టు కొమ్మల ను రెండు కళ్ళతో చూడండి. కాస్సేపటి తరువాత ఒక కన్నును మూసు కుని, రెండవ కన్నుతో మీ దృష్టిని ఆ కొమ్మలపై సారించండి. ఒక నిమి షం తరువాత మీ కన్ను తెరవండి. ఆ కొమ్మలు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
రెండు విడివిడి దృశ్యాలు కలిసి ఒకే త్రీడీ దృశ్యంగా కనిపించాలంటే, ఎంత ఖచ్చితంగా మెదడు లెక్క గట్టాలో ఆలోచించండి. ఇది అర్థం కావాలంటే మరొక సింపుల్‌ ఉదాహరణ చెప్పాలి. మీరు కలర్‌ వాల్‌ పోస్టర్లను చాలాసార్లు చూసే ఉంటారు. ఒకొక్క సారి వాల్‌పోస్టర్‌పై ఒకే బొమ్మ, రెండింటిగా కొంచెం తేడాతో వేరే రంగులో కనిపిస్తుంది. బ్లర్‌గా కనిపిస్తుంది. సాధారణంగా పోస్టర్‌ ప్రింట్‌ చేసేటప్పుడు, 4 రంగులతో 4 ప్లేట్లు ఉపయోగించి ప్రింట్‌ చేస్తారు. అందులో ఏ ఒక్క ప్లేట్‌ కొంచెం ప్రక్కకి జరిగినా చాలు, ప్రింట్‌ అయిన బొమ్మ కదలి పోయినట్లు కనిపిస్తుంది. అందుకోసం ప్రెస్‌లో చాలా శ్రద్ధ తీసుకుని, జాగ్రత్తగా ప్లేట్ల స్థానాలను సరి చేస్తారు.మరి మన మెదడు ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ఇప్పుడు మీకర్థమై ఉంటుంది. ఒక సెకనులో ఎన్నో దృశ్యాలను కళ్ళు మెదడుకు పంపుతూ ఉంటాయి. ఈ ఫ్రేమ్‌లన్నింటిని జాగ్రత్తగా, అతి తక్కువ సమయంలో కలిపి మనకు నిరంతరంగా మన ముందరి ప్రపంచం కనిపిస్తూ ఉండేలా చేస్తుంది మన మెదడు. ఒక నిమిషంలో మెదడు చేసే కాల్‌క్యులేషన్స్‌ని మనం కాల్‌క్యులేటర్‌ ఉప యోగించి చేస్తే, ఎన్ని గంటలు పడుతుందో తెలిస్తే ఆశ్చర్యమేయక మానదు. ఇలాంటి లోపం లేని వ్యవస్థను సృష్టించింది మరెవరో కాదు, సర్వమూ తెలిసిన సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ాయే. అల్లాహ్‌ా సృష్టిలో లోపం లేకపోవడాన్ని క్రింది ఖుర్‌ఆన్‌ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు.
”ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్ని చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు! ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా?”  (ఖుర్‌ఆన్ -67:3)

ఖుర్‌ఆన్‌ మహిళా సాధికారత



మా నవ సమాజపు సూక్ష్మ రూపమే కుటుం బం!ఈ కుటుంబ వ్యవస్థ, అందులోని సభ్యుల మానసిక స్థితి, వారి స్థానాలు సహజంగా నూ, ఆరోగ్యవంతంగానూ వుంటేనే సమాజం ఆరోగ్యవంతంగా వుంటుంది. సమాజ నిర్వ హణకు, సమాజ సభ్యుల మధ్య పని విభజన ఎంత అవసరమో… కుటుంబంలోనూ పని విభజన అంతే అవసరం. అప్పుడే ఇటు కుటు ంబం, అటు సమాజంలోని కార్యాలు సవ్యం గా, సహజంగా, సుందరంగా, సశాస్త్రీయం గా నెరవేరు తాయి. పని విభజన అనేది కేవ లం ఆర్థిక పరమైన పరిభాష కాదు. అది బాధ్యతాయుతమైన సంక్షేమకర పరిభాష కూడా. స్త్రీ,పురుషులిరువురూ వారి వారి శారీరక, మానసిక, ప్రాకృతిక మరియు సహ జసిద్ధమైన భిన్నత్వాల మూలంగా వారివారి కార్యక్షేత్రాలు విభిన్నంగా, ప్రత్యేకంగా వుండక తప్పదు. ప్రకృతిని, అందులోని జంతుజాలా లను, వాటి మధ్యనున్న వైవిధ్యాలను పరిశీ లిస్తే… ఈ విషయమే మనకు స్పష్టంగా అర్థ మవుతుంది.
తల్లి స్థానం   -   ఆరోగ్యకరమైన సమాజానికి-ఆరోగ్యకరమై న మానసిక, తాత్విక చింతనలు కలిగిన మనుషులు అవసరమవుతారు. ఇటువంటి మానవులు ఆకాశం నుండి ఊడిపడరు. నేల నుండి పుట్టుకు రారు. ఏఫ్యాక్టరీలోనూ తయా రు కారు. వారు తల్లి గర్భం నుండి జన్మి స్తారు. అమ్మ ఒడిని మొదటి బడిగా వారు జన్మతః పొందుతారు. మొట్టమొదటి ఉపాధ్యా యురాలిగా, శిక్షకురాలిగా వారు తమ తల్లిని సహజసిద్ధంగా పొందుతారు. ఉపాధ్యాయురాలి బాధ్యతను నిర్వర్తించడం- శిక్షకురాలి కర్తవ్యాన్ని నిర్వహించడం తల్లి యొక్క మొట్టమొదటి బాధ్యతగా ఉంటుంది. తన తల్లి ద్వారా శిక్షణ పొందడం బిడ్డ యొక్క జన్మ హక్కుగా కూడా వుంటుంది. ప్రకృతిలో సంఘ జీవనం గల జంతుజాలాన్ని గమనిస్తే ఈ సత్యమే ప్రస్ఫుటంగా మనకుగోచరిస్తుంది.
మహిళా స్థాయి -  నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీ సమానత్వం, సాధికారత పేరుతో స్త్రీ విముక్తి మహిళా వాదం తదితర ఇజాల పేర్లతోనూ మహిళను తన సహజ స్థానం నుండి దిగజార్చే ప్రయ త్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంటిని వదిలి బయటకు రాకుండా స్త్రీ విముక్తి లేక సాధికారత సాధ్యం కాదని నేటి మహిళా సంఘాల తమ ప్రచార హోరుల ద్వారా మహిళా సమాజాన్ని ఉత్తేజ పరుస్తు న్నాయి. ఈ ప్రచార ప్రభావంలో స్త్రీలు ఇరు క్కోవడం, పురుషులకు కూడా ప్రయోజనకారి గా వుండటంతో వీరు కూడా వంత పాడటం మొదలెట్టారు. ఇంటిలో పిల్లల పోషణ, శిక్షణ, గృహ నిర్వహణతోపాటు ఆమె డబ్బు సంపా దించే యంత్రంగా మార్చడం తనకు అన్ని విధాలా లాభదాయకమని పురుషుడు భావిం చి స్త్రీ తన సహజమైన స్థానాన్ని వీడిపోయేం దుకు సహకరిస్తున్నాడు.నేటి కుటుంబ వ్యవస్థ బీటలువారడానికి ప్రధాన కారణం ఇదే.
స్త్రీకి సహజ ఆభరణాలయిన బిడియం, నాజూకుతనం, ఓర్పు, ప్రేమ, మాతృత్వపు మాధుర్యాలతోపాటు ప్రత్యేక శరీర ఆకృతి ఆమె సొంతం. సంతానానికి శిక్షణ, బాధ్యతల నిర్వహణ వంటి సహజ వరాల నుండి ఆమెను దూరం చేసి మోయ లేని భారాన్ని ఆమెపై రుద్ది మగువను మానసిక వత్తిడికి, ఆందోళన కు గురి చేస్తున్నారు.
ఆకర్షణీయ వంచన -  నేటి ఆధునిక సిద్ధాంతాలు స్త్రీని అత్యంత అశ్లీలంగా మార్చేస్తున్నాయి. ఉనికిలో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీని ఫ్యాషన్‌ పెరేడ్‌ల కు, వ్యాపారప్రకటనలకు ఉపయోగపడే అంద మైన వస్తువుగా భావించింది. పెట్టుబడీదారి వ్యవస్థలో సర్వం వ్యాపారమయమే. ఇక్కడ స్త్రీ అంగాంగాలు వ్యాపార వస్తువులుగా వాడుతు ంటారు. ఒక గౌరవనీయమైన మహిళ తన శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకునేలా మానసిక తర్ఫీదు ఇక్కడ ఇస్తారు. ’నా శరీరం నా ఇష్టం’ లైంగిక స్వేచ్ఛలాంటి భావనలను ఆమె మెదడులో గుదిగుచ్చడానికి స్త్రీవాద సంఘాల ద్వారా అంతర్జాతీయ స్థాయి నుండి ప్రాంతీయ స్థాయి వరకు చర్చిస్తారు. సైద్ధాంతి క వ్యాసాలు హృద్యంగా రాయబడతాయి. ఫలి తంగా స్త్రీ తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా మార్కెట్‌లో ప్రదర్శనా వస్తువుగా, విక్రయ వస్తువుగా, మార్చుకుంటోంది. ఇందుకుగాను  మల్టీ నేషనల్‌ కంపెనీలు, సినీ తారలు, క్రీడా కారులు, రాజకీయ బేహారులు అందరూ సహ కరిస్తారు. స్త్రీని నైతిక పతనం వైపునకు దిగ జార్చడానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు.
పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఉనికిలోకి వచ్చిన సోషలిస్టు వ్యవస్థ ”కొల్యం తొవ్‌” లాంటి మహిళా సాహితీకారులను సృష్టించింది. వీరి విపరీత సాహిత్యం, అనైతిక రచనలు స్త్రీని నైతిక పతనానికై ప్రోత్సహిం చాయి. విచిత్రంగా ఈ రెండు వ్యవస్థలు కూడా ”స్వేచ్ఛ”, విముక్తి లాంటి అందమైన పద బంధాలు వాడటం ద్వారా స్త్రీని కుటుం బం నుండి బలవంతంగా బయటికి లాగే ప్రయత్నం చేశాయి. సోషలిస్టు సిద్ధాంతకర్తలు ఏకంగా వ్యక్తిగత ఆస్తికి మూలం కుటుంబం కనుక కుటుంబాన్ని రద్దు చేయడం ద్వారా మాత్రమే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయొచ్చని సిద్ధాంతీకరించారు. అంటే.. కుటుంబం ధ్వం సం అయిన తర్వాత లైంగిక అవసరాలు కోరు కున్న వారితో కోరుకున్న విధంగా తీర్చు కోవచ్చు. వివాహ బంధమనేది గత కాలపు పనికిమాలిన బంధంగా, వెనుకబాటుతనానికి నిదర్శనంగా మిగిలిపోతుంది. ”పిల్లల శిక్షణ” అనే అత్యంత కీలకమైన కర్తవ్యం నుండి తల్లి ని తొలగిస్తారు. దానికి బదులుగా ”టెక్నికల్‌ కేర్‌ టేకర్స్‌” ఉనికిలోకి వస్తారు. వారు పిల్లల పెంపకాన్ని అత్యంత సాంకేతికంగా చేస్తారు. ఉత్పత్తి సాధనాలు, సమాజ పరమైనట్లుగానే సమాజ ఉమ్మడి ఆస్తి అయిన ఈ పిల్లలు కూడా సమాజ పరం అవుతారు. మమకారం, వాత్సల్యం, మృదుత్వం, మానవత్వం భావోద్వే గాలు అన్ని కూడా వర్గ కసికి బలైపోతాయి. రాజ్యాంగపు దుడ్డుకర్రను కుటుంబ వ్యవస్థను రద్దుచేయడానికి ఉపయోగించిన తర్వాత సోష లిస్టు వ్యవస్థ దానిని దూరంగా విసిరివేస్తుంది.
భవిష్యత్తు భయానకం
ఈ అమానవీయ భౌతిక పరిస్థితుల నుండి ఉద్భవించే సమాజంలోని మానవులు వారి మానసిక స్థితి ఎలా రూపొందుతుంది? వావి వరుసలు కనుమరుగైన సమాజపు జుగుప్సా కర సంఘటనలు అమెరికా, యూరప్‌లతో పాటు అనేక దేశాలలో దర్శనమిస్తున్నాయి. ఆ   ఆ సమాజాలలో అశాంతి, అసహనం రోజు రోజుకూ పెరుగుతోంది. హత్యలు, ఆత్మహత్య ల శాతం పెరుగుతోంది. తల్లి కుమారుల మధ్య, తండ్రి కుమార్తెల మధ్య,సొంత సోదర సోదరీమణుల మధ్య లైంగిక సంబంధాలు పెరిగి పోతున్నాయి. స్వలింగ సంపర్కాలు సైద్ధాంతిక రూపం దాలుస్తున్నాయి. వ్యభిచా రం గౌరవ వృత్తిగా మారిపోయింది. సహ జీవనం పేరుతో వివాహ బంధం ఎగతాళికి గురౌతోంది. సింగిల్‌ మ్యాన్‌, సింగిల్‌ ఉమెన్‌ సంస్కృతి ప్రబలి పోతోంది. మరోవైపు ప్రకృతి కి విరుద్ధంగా మనిషి తన జీవన శైలిని తీర్చి దిద్దుకున్న ఫలితంగా మానసిక రోగాలు రెం డింతలయ్యాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్లు 60 శాతం అభివృద్ధి చెందాయి. గర్భ సంచి క్యాన్సర్లు రెండింతలు నమోదౌతున్నాయి. అభంశుభం తెలియని పసిపిల్లలు కూడా ఎయిడ్స్‌ మహ మ్మారికి బలవుతున్నారు. ఈ భయానక పరిస్థి తికి మన భారత దేశం మరెంతో దూరంలో లేదు. సభ్యత, సంస్కృతులకు, నైతిక విలువల కు కాణాచి అయిన మన సుందర భారతావని రూపు రేఖలు అత్యంత వికృతంగా మారబోతు న్నాయి.దీనికి కారణం సృష్టికర్త అయిన దైవం మానవ సౌఖ్యం, సంక్షేమం కోసం ఏర్పరిచిన సహజ సిద్ధమైన సులభమైన హద్దులను మీరటమే.
దివ్యఖుర్‌ఆన్‌ దృష్టిలో మహిళా స్థాయి - స్త్రీ మహోన్నత బాధ్యత అయిన మాతృత్వం, పిల్లల శిక్షణ, కుటుంబ పరిరక్షణ, ఆమె నైజా నికి సరిపోయేవి కనుక ఆ బాధ్యతలు మాత్రమే దైవగ్రంథం దివ్యఖుర్‌ఆన్‌ ఆమెకు అప్పగించింది. ఈ మహోన్నత కృషికిగాను ఆమెకు మగ వానికంటే మూడు రెట్లు సేవలు పొందే గౌరవం ప్రసాదించింది. ఆమె పాదాల కింద ఏకంగా స్వర్గాన్ని ఉంచింది. ఇస్లాంలో సంపాదించడమైనా, ఖర్చు చేయడమైనా, దైవాదేశాలకు అనుగుణంగా వుండాలి. ఒక ముస్లిం పురుషుడు, స్త్రీపై ఆర్థిక ఆధిపత్యం వహించడం సాధ్యమే కాదు. స్త్రీకి ఆస్తిలో వారసత్వపు భాగం ఇవ్వబడింది. భర్త, తండ్రి, తల్లి, బిడ్డల సోదరుల ఆస్తులలో భాగ స్వామ్యం ఆమెకుంది. వ్యాపార లావాదేవీలు నిర్వహించే స్వేచ్ఛ హద్దులకు లోబడి ఇవ్వ  బడింది. విద్యా, జ్ఞానాలను ఆర్జించడం ఆమె కు విధిగా చేయబడింది. ఇదంతా 1430 సంవత్సరాల క్రితమే అరబ్‌ ప్రాంతపు మహిళ పొందిన హక్కులని గుర్తించాలి. నేటి మహిళ కూడా ఇస్లాం ఛాయల్లో ఈ సాధికరతను సాధించుకోవచ్చు.
ఖుర్‌ఆన్‌ – మహిళ
1) ”ఆయన మిమ్మల్ని (స్త్రీ పురుషులను) ఒకే ప్రాణి నుండి పుట్టించాడు.” (ఖుర్‌ఆన్‌-4:1)
2) ”పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి.” (ఖుర్‌ఆన్‌-2:228)
3) ”తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది.”      (ఖుర్‌ఆన్‌-4: 7)
4) ”మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది.”     (ఖుర్‌ఆన్‌-2: 178)
5) ”మీ స్త్రీలు మీకు దుస్తులు. మీరు వారికై దుస్తులు”.(ఖుర్‌ఆన్‌-2:187)
6) ”తల్లి బలహీనతపై బలహీనతను సహించి కడుపున మోసింది.. రెండేళ్ళు పాలు తాగించింది.” (ఖుర్‌ఆన్‌-31: 14)
7) ”విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరికొకరు సహచరు లు, వారు మేలు చెయ్యండని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు. నమాజ్‌ ను స్థాపిస్తారు. జకాత్‌ను ఇస్తారు అల్లాహ్‌ా పట్ల, ఆయన ప్రవక్తల పట్ల విధే యత పాటి స్తారు…. విశ్వాసులైన ఈ పురుషులకూ, స్త్రీలకు అల్లాహ్‌ా వాగ్దానం చేశాడు, క్రింద కాలువలు ప్రవహించే తోటలను వారి కి ఇస్తాను అని. వారు వాటిలో శాశ్వతంగా ఉం టారు. నిత్యమూ కళకళలాడే ఆ ఉద్యాన వనాలలో వారి కొరకు పరిశుద్ధమైన నివాసా లుంటాయి.” (ఖుర్‌ఆన్‌ 9:71,72)
8) ”ఎవరైనా సౌశీల్యవతులైన స్త్రీలపై నింద మోపి నలుగురు సాక్షులను తీసుకురాకపోతే వారిని ఎనభై కొరడా దెబ్బలతో కొట్టండి. వారి సాక్ష్యాన్ని ఇక ఎన్నడూ అంగీకరించ కండి”. (ఖుర్‌ఆన్‌ 24 : 4)

ABHILASHA: మనం అలా లేమే…!

ABHILASHA: మనం అలా లేమే…!: తనను ఒకరితో పోల్చుకోవడం మనిషికి బాల్యం నుండి అలవడే ఓ ప్రక్రియ. ఇది మనిషి జీవితంలో మమేకమయి ఉండటాన్ని మనం గమనించగలం. ఎవరి అస్తిత్వం వారిది....

స్వర్గధామం



”మరి ఎవరయితే తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి తన మనసుని దుష్ట వాంఛలకు దూరంగా ఉంచాడో అతని నివాసం స్వర్గం అవుతుంది. అతను దానిలో సదా ఉంటాడు”.(నాజిఆత్‌: 40,41)
”నిజం – ఎవరయితే నరకాగ్ని నుండి కాపాడ బడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వారే అసలు సిసలయిన విజేతలు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 185)
కాలం నిర్విఘ్నంగా ముందుకు దూసుకుపోతూ ఉంది. ప్రతి వ్యక్తి జీవన యాత్ర చేస్తూ గమ్యం వైపునకు సాగిపోతున్నాడు.  ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకుని, దాన్ని ఛేదించే దిశలో దూసుకుపోతు న్నారు. కాని ఈ లక్ష్య సాధనలో అందరూ సఫలీకృతులు కాలేరు. ఎందరో అలసిసొలసి విఫలురై పోతారు. అయితే అల్లాహ్  ప్రీతిని పొందే ఉద్దేశ్యంతో ముందుకు సాగే వ్యక్తి శ్రమ ఎన్నటికీ వృధా కాదు. అలాంటి వ్యక్తి నోట సదా ఈ వేడుకోలు వచనం జాలువారుతూ ఉంటుంది - ”ఓ మా ప్రభూ! ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మాకు మంచిని ప్రసా దించు. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడు”. (బఖరా: 201)
అతని కోసం సృష్టిలోని సకల జీవరాసులు దుఆ చేస్తాయి. ఈ దుఆలు మరియు జనుల, దైవ దూతల దీవెనలు స్వర్గ రూపంలో ప్రతిఫలిస్తాయి. ఇంతకీ ఎవడా అదృష్టవంతుడు? ఈ మహా భాగ్యం ఎవరి ఖాతాలో చేరుతుంది? అతడు – పడుకునేటప్పుడు వుజూ చేెసుకొని నిద్రపోయాడు. ’అస్స లాతు ఖైరుమ్మినన్‌నౌమ్‌ – నిద్రకన్నా నమాజు మేలయినది’ అన్న ముఅజ్జిన్‌ పిలుపు చెవిలో పడగానే సుఖ నిద్రను పరిత్యజించి లేచి వుజూ చేసుకున్నాడు. నమాజు కోసం బయలుదేరాడు. భక్తీప్రపత్తులతో నమాజు చేశాడు. అల్లాహ్‌ాను ఎంతో తాదాత్మ్యంతో స్మరించాడు. ఆ భక్తిపరుడు ఎన్నో పనులతో తలమునకలయి ఉన్నాడు. కానీ, ‘హయ్యా అలస్సలాహ్‌ా -నమాజు వైపునకు రండి!  అన్న పిలుపు వినబడింది. అల్లాహ్‌ా విధిని నిర్వర్తించడానికి సకల పనులను ప్రక్కన పెద్ద మస్జిద్‌ వైపు నడవనారం భించాడు.
శుక్రవారం నాడు తన షాపు ముందు చాలా మంది కష్టమర్లున్నారు. వ్యాపారం మంచి ఊపు మీద ఉంది. అంతలోనే ’హయ్యా అలల్‌ ఫలాహ్  - సాఫల్యం వైపునకు రండి!’ అన్న నినాదం కర్ణపుటాలకు తాకింది. తక్షణమే అతనికి అల్లాహ్‌ా చేసిన హితువు గుర్తుకొచ్చింది- ”ఓ విశ్వసించినవారలారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచిన ప్పుడు అల్లాహ్  సంస్మరణ వైపునకు పరుగెత్తండి. క్రయావిక్రయా లను వదిలి పెట్టండి…నిజంగా వినోదక్రీడలకంటే, వ్యాపారంకంటే అల్లాహ్‌ా వద్ద ఉన్నదే శ్రేష్ఠమయినది. అల్లాహ్  అందరికంటే మేలయిన ఉపాధప్రదాత”. (జుమా: 9) అంతే, షాపు మూసేసి మస్జిద్‌ వైపు జుమా నమాజు కోసం సాగిపోయాడు. ఆ సత్యప్రియుడు గదిలో కొందరు స్నేహితులతో కూర్చొని ఉన్నాడు. ఏదో విషయమయి గొప్ప చర్చే జరుగుతోంది. ఉన్నట్లుండి వ్యర్థ ప్రలాపనలు, అశ్లీల పరాచికాలు మొదలయ్యాయి. అంతే. అతను వెంటనే దైవాగ్రహానికి కారణభూతమయ్యే ఆ స్థలానికి, అట్టి స్నేహానికి స్వస్తి పలికాడు. ఆ సద్వర్తనుడు చాడీలు చెప్పి, తమ సాటి సోదరుని మృత కళేబరాన్ని భక్షించే వారి సమావేశాల్లోకి వెళ్లడుగాక వెళ్లడు. ఒకరి వీపు వెనకాల మాట్లాడటం, ఎదుటివారిలో చిచ్చు పెట్టి వేెడుక చూడ టం అతని బొత్తిగా నచ్చదు. ఆ పుణ్యాత్ముడు పలికితే సత్యమే పలుకు తాడు. దైవాదేశాలకు, దైవప్రవక్త (స) నియమావళికి లోబడి జీవిస్తాడు. రమజాను ఉపవాసాలుంటాడు. జకాత్‌ను విధిగా చెల్లిస్తాడు. విరివిరిగా దానధర్మాలు చేస్తాడు. అనాథలకు ఆశ్రయం ఇస్తాడు. నిరు పేదలు, వితంతువులు, వికలాంగుల బాగోగులను గమనిస్తాడు. ఇరుగు పొరుగు వారి శ్రేయాన్ని కోరుతాడు, తల్లిదండ్రులను సేవిస్తాడు. పగవారితో సయితం ప్రేమగా వ్యవహరిస్తాడు. సంతానానికి సరైన సంస్కారాన్ని నేర్పుతాడు. భార్యతో ఉదారంగా వ్యవహరిస్తాడు. చిన్న చీమ మొదలు స్వర చేప వరకూ ప్రతి జీవి క్షేమాన్ని మనసారా కాంక్షిస్తాడు. అందరి లాగే అతనికీ మరణం సంభవించింది.
దైవ సన్నిధి -   ఆ దాసుడు అల్లాహ్  ముందు నిలబడి ఉన్నాడు. అల్లాహ్  అతన్నుద్దే శించి: ’ఓ నా దాసుడా! నీ వల్ల జరిగిన ఫలానా పాపాన్ని గుర్తుచేసుకో’ అంటాడు. దాసుడు గుర్తు చేసుకుమటాడు. ’ఓ నా ప్రభూ!నేను సర్వ నాశనమయి పోయాను’ అని మొరపెట్టుకూమటాడు. దానికి అల్లాహ్ : ’నువ్వు ఈ పాపంపై పశ్చాత్తాపం చెందావు గనక ప్రపంచ జీవితంలో నీ ఈ పాపాన్ని పరుల నుండి కప్పిపుచ్చాను. నువ్వు నన్నే నుమ్ముకున్నావు గనక ఈ రోజు నిన్ను క్షమిస్తున్నాను’ అంటాడు. ఇక ఆ దాసుని ఆనం దానికి మేరే ఉండదు.
మిత్రులరా! మనలో పాపం చేయని వారు ఎవరు? అయితే పాపం చేసి పశ్చాత్తాపం చెందిన వారే ధన్యులు. నిజ దైవ దాసుల లక్షణం కూడా అదే - ”వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరి ని అవలంబిస్తారు. అలాంటి సదాచార సంపన్నులనే అల్లాహ్  ప్రేమిస్తాడు. మరియు వారు తమ ద్వారా ఏదయినా నీతిబాహ్య మయిన పని జరిగి పోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదయినా అన్యాయం చేెసుకుంటే వెంటనే అల్లాహ్‌ాను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్‌ా తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు? - వారు తమ వల్ల జరి గింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు”.(ఆలి ఇమ్రాన్‌: 134-135) ”వారికే తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభిస్తుంది…ఈసత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!”. (ఆలి ఇమ్రాన్‌: 136)
దాసుడి లెక్కల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడింది. వెంటనే తన వారి వైపునకు పరుగులు తీశాడు. ఈ రోజు అతని ఆనందానికి అవ ధులు లేవు. సంతోషంతో అతని ముఖం అరవిందంలా విప్పారింది. తన ప్రగతి పత్రాన్ని అందరి ముందూ ప్రదర్శిస్తూ - ’ఇదిగో,చూడండి! నా కర్మల పత్రాన్ని. మీరు చదవండి….నా కర్మలకుగాను మంచి ప్రతి ఫలం లభిస్తుందని నేను అనుకుంటూ ఉండేవాడను. ఓ మహ్షర్‌ మైదా నంలో ప్రోగయి ఉన్న ప్రజలారా! చూడండి! నా కర్మల పత్రం నా కుడి చేతిలో ఇవ్వబడింది. ఏం చూస్తున్నారు? ఇది నమాజు! ఇది అన్న దానం! అదేమో ఉపవాసాలు! అవేమో హజ్జ్‌ ఉమ్రాలు, దుఆ,జిహాద్‌లు – ఇవన్నీ పుణ్యాలే. మీకు కానరావడం లేదా? నిశ్చయంగా నా ఈ కర్మల పత్రంలో పశ్చాత్తాపం – తౌబా ఉంది, క్షమాభిక్ష – ఇస్తిగ్ఫార్‌ ఉంది. దేవుని స్తుతిస్తోత్రాలు, పవిత్రతా కీర్తనలు – తస్బీహ్ , తహ్మీద్‌, తహ్లీల్‌ కూడాఉన్నాయి. అల్లాహ్  వైపుకు ఆయన దాసుల్ని సాదరంగా ఆహ్వానించడం, ధర్మాన్ని, ఖుర్‌ఆన్‌ని నేర్చుకొని ఇతరులకు నేర్పించడ మూ ఉంది.  బాగా చూడండి! ఇది ఫజ్ర్‌, జుహ్ర్  , అస్ర్‌, మగ్రిబ్‌, ఇషా నమాజు. అదేమో తహజ్జుద్‌, ఇష్రాఖ్‌, ఇస్తిఖారా, ఇస్తిస్ఖా, తసీబీహ్‌ా నమాజు. నేను మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి వచనాన్ని ఇహ లోకంలోనే గ్రహించాను ’ఖుర్‌ఆన్‌ను నేెర్చుకొని ఇతరులకు నేర్పేవాడు మీలో ఉత్తముడు’ అని. (బుఖారీ)
‘మరెవరయితే తమ ఫ్రభువుకు భయపడేవారో వారిని బృం దాలు బృందాలుగా స్వర్గం వైపునకు తీసుకుపోవడం జరుగు తుంది”.(జుమర్‌:73) ఈ సౌభాగ్యవంతులు స్వర్గం వైపునకు తీసుకు పోబడతారు. అక్కడికెళ్ళి అందరూ ఎదురు చూస్తున్నారు. ఏమయింది? ఈ ఎదురు చూపులు ఎవరి కోసం? అవునవును….వారు తమ ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) కోసం వేచి ఉన్నారు. మనుషుల్లో మహామనీషి! ప్రవక్తలందరిలో అగ్రజులు!! విశ్వ కారుణ్యమూర్తి! మానవ మహో పకారి!! దివ్యతేజస్సుతో కాంతులీనుతూ దేదీప్యమానమయిన ముఖార విందంతో ప్రజల ముందు ప్రత్యక్షమవుతారు. అప్పుడు అందరూ మహా ప్రవక్త ముహమ్మద్‌ (స)తో కలిసి స్వర్గం తలుపుల దిశగా అడుగులు వేస్తారు.
స్వర్గం – స్వర్గానికి ఎనిమిది ద్వారాలు. స్వర్గాన్ని స్వయంగా అల్లాహ్‌ా, ప్రియమైన దాసుల కోసం తన స్వహస్తాలతో అలంకరించాడు. స్వర్గం లో ఒక బాణం పెట్టుకునేంత చోటు లభించినా అది ప్రాపంచిక సకల సంపదలకంటే ఎంతో ఘనతరమయినది. అందులో మొదట ప్రవేశించే అదృష్ట సముదాయం మహా ప్రవక్త ముమహమ్మద్‌ (స) వారి సముద యం. ఇదిగో! మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) అడుగు ముందుకు వేశారు. స్వర్గం తలుపు తడుతున్నారు. ’ఎవరు మీరు?’  స్వర్గదూతలు ప్రశ్నిం చారు. ”నేను…ముహమ్మద్‌ని (స)”.’ఓ ప్రవక్తా! మీ గురించి మాకు ఆజ్ఞాపించబడింది’.'ఏమని?’ ’మీరు వచ్చే వరకూ స్వర్గ ద్వారాలు తెరవకూడదని’. అల్లాహు అక్బర్‌! స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయి. ”వారు అక్కడకు చేరుకునేటప్పడికే దాని ద్వారాలు తెరవబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారి నుద్దేశించి, ‘మీపై శాంతి కురియుగాక! – సలామున్‌ అలై కుమ్‌’. మీరు హాయిగా ఉండండి” అని (సాదరంగా స్వాగతిస్తారు) అంటారు. (జుమర్‌: 73)
 అది ఎలాంటి సన్నివేశం?! అందరి ముఖాలు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాయి. వారు అనందాతిశయంతో అల్లాహ్‌ా ఘనకీర్తిని చాటుతు న్నారు. స్వర్గ నిర్వహణాధికారులు వారితో - ’మీరు భాగ్యవంతుల య్యారు. మీరు ఇహలోకంలో మంచిగా మసలుకున్నారు. అం దుకే స్వర్గంలో ని సకల భోగబాగ్యాలను అనుభవించేందుకు అందులో ప్రవేశించండి. ”అక్కడ దయాసాగరుడయిన అల్లాహ్  తరఫు నుండి వీరికి ’సలామ్‌’ చెప్పబడుతుంది’. (యాసీన్‌:58) ఎంత అదృష్టం! మరెంత భాగ్యం!!
స్వర్గద్వారాల వద్ద నిలబడి దైవదూతలు పిలుపునిస్తున్నారు: ’క్రమం తప్పకుండా నమాజు చేసినవారలారా! రండి, ‘బాబుస్సలాత్‌ – నమాజు ద్వారం’ గుండా స్వర్గంలో ప్రవేశించండి. నిష్ఠగా ఉపవాసం పాటించే వారలారా! మీ కోసం బాబుర్రయ్యాన్‌ సిద్ధంగా ఉంది. నిజాయితీగా జకాతు చెల్లించే వారలారా! మీరు బాబుజ్జకాత్‌ ద్వారా స్వర్గంలో ప్రవే శించండి. పుణ్యఫలాపేక్షతో దానధర్మాలు చేసినవారలారా! మీ కోసం బాబుస్సదఖా ఉంది. ప్రాణాలొడ్డి దైవ మార్గంలో పోరాడిన ఓ జిహాద్‌ యోధులారా! దేవుడ స్వయంగా ఈ బాబుల్‌ జిహాద్‌ను తయారుచేశాడు రండి. కొందరు భాగ్యవంతుల్ని రెండేసి ద్వారాల గుండా పిలుపునివ్వ డం జరుగుతుంది. మరికొంత మంది అదృష్టవంతుల్ని మూడు ద్వారాల గుండా, ఇంకొందరిని నాలుగు ద్వారాల గుండా పిలవడం జరుగు తుంది. వారిలో మరీ అదృష్టవంతులుంటారు. వారిని స్వర్గపు అన్నీ ద్వారాల గుండా స్వాగతించడం జరుగుతుంది. అల్లాహ్‌ాను తన ప్రభు వుగా, ముహమ్మద్‌ (స)ను తన ప్రవక్తగా నమ్మి, అయిదు పూటల నమాజు చేసి, రమజాను ఉపవాసాలు ఉండి, జకాత్‌ చెల్లించి, హజ్జ్‌ చేసి, తన భర్తతో మంచిగా నడుచుకున్న మహిళామూర్తులు కూడా ఈ జాబితాలో చేరతారు అని మహా ప్రవక్త ముహ్మద్‌ (స) వారే స్వయంగా సెలవిచ్చారు. వారికి నచ్చిన ద్వారం గుండా వారు స్వర్గంలో ప్రవేశించ వచ్చు. సుబ్హానల్లాహ్!
సోదరా, సోదరీ! స్వర్గపు ఒక్కో ద్వారం వెడల్పు ఎంత ఉంటుందనుకుం టున్నావు? నలభై సంవత్సరాలు ఆగకుండా నడిచినా తరగనిదంత! ఇక్కడో విచిత్రం ఉంది. అదేమిటంటే – ఆ రోజు ఆ ద్వారాలే స్వర్గ వాసులతో కిటకిటలాడుతుంటాయి. అల్లాహు అక్బర్‌! ! సోదరా, సోదరీ! ఆలోచించు! నీవు స్వర్గవాసివన్న శుభవార్త ఇవ్వబ డింది. దైవకృపతో నువ్వు పుల్‌సిరాత్‌ను దాటుకొని ఖన్తర అనే ప్రదేశానికి చేరుకున్నావు. నీలోని కల్మషాన్ని, కల్లాకపటాన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. ఆనక నువ్వు స్వర్గపు తలుపుల దగ్గరకు వచ్చావు. ’బిస్మిల్లాహ్‌ా’ అంటూ నీ కుడి పాదాన్ని  స్వర్గంలో మోపావు. ఏం కనబడుతోంది? అక్కడ నువ్వు ఎటు చూసినా దైవానుగ్రహాలే. ’ఒక మహత్త సామ్రాజ్య వైభవం అక్కడ నీకు కనబడుతుంది’.ఒకేఒక్క అడుగు – దాసుడు ప్రపంచపు సకల బాదలను, దుఃఖాలను మరచిపో తాడు. అసలు ఇహలోకమన్నదే అతనికి జ్ఞప్తికి రాదు. నమాజు అలసట ఎటెళ్ళింది? జిహాద్‌ అలసట ఎటు మాయమయింది? భార్యాబిడ్డల, తల్లిదండ్రుల కోసం ధర్మసమ్మతమయిన సంపాదన కావాలని పడిన శ్రమంతా ఏమయింది? అన్నీ పోయాయి..మిగిలిందొకటే…అది అతని అదృష్టం! ఒక్క పాదమే కదా మోపింది! ఇంతలోనే అంత మహిమ.మరి ఇప్పుడతను రెండో పాదం మోపుతున్నాడు. ఎలా ఉంది స్వర్గం?……..-


స్వర్గధామం – అది సుఖసంతోషాలకు, భోగభాగ్యలకు, అపార వరానుగ్రహాలకు శాశ్వత స్థావరం. శ్రమ, అలసట, బాధ, దుఃఖం, ఆందోళనలు మచ్చుకయినా ఉండని శాంతి నిలయం. అసూయ, అసంతృప్తి, విరోధం, విద్వేషాలకు ఏమాత్రం తావు లేని ఏక హృదయ కోశం. కోరిన వరం తక్షణం లభించే ఆనంద నిలయం. అనుక్షణం ఆనంద డోలికల్లో ఉర్రూతలూగించే నిత్య హరిత వనం. ఆత్మ, అంతరంగం, దేహం, చైతన్యాలలోని అణువణు వును పులకింపజేస్తూ దైవదర్శనా భాగ్యం కలిగించే ముక్తిప్రదాయని. మానవుణ్ణి కర్తవ్యోన్ముఖుడిగా మార్చే ఖుర్‌ఆన్‌ లో ఇలా సెలవియ్యబడింది: ”వారు చేసుకున్న సత్కర్మలకు ప్రతిఫలంగా వారి కళ్లను చల్లబర్చే అఫూర్వ సామగ్రి వారి కోసం దాచబడి ఉంది. దాన్ని గురించి ఏ మనిషికీ తెలియదు. (అది ఊహాతీతమయినా అద్భుత మహా భాగ్యం)”. (దివ్యఖుర్‌ఆన్‌: 32: 17)

ఇహలోకంలోని యావత్తు సంపదతో పోల్చితే స్వర్గంలో ఏ ఒక్క వస్తువుకు కూడా మనం విలువ కట్టలేము. ’స్వర్గంలో ఒక కమ్చీ (చర్నంక్రోలు) ఆక్రమించుకునేంతటి (చాలా కొద్దిపాటి) స్థలం యావత్తు ప్రపంచం, ప్రపం చంలోని సమస్త వస్తువులకంటే  ఎంతో శ్రేష్ఠ మయినది’ (ముస్లిం) అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స).
యుగాలు మారిన, జగాలు మారినా, సూర్యా చంద్రాలున్నంత వరకూ మానవుని మాధవుని తో కలిపే, మానవాళి ఆచరించి తరించాల్సిన మహోపదేశం అయిన హదీసె ఖుద్సీలో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”నేను సజ్జనుల యిన నా దాసుల కోసం స్వర్గంలో ఎలాంటి అపురూప వస్తు సంపదను తయారు చేెసి పెట్టానంటే,  వాటిని ఇంత వరకు ఎవరి కళ్ళు కనలేదు. ఎవరి చెవులూ వినకలేదు.  చివరి మానవుని మనస్సు సయితం వాటిని గురించి ఊహించలేదు”. (ముత్తఫఖున్‌ అలైహి) ”స్వర్గంలో విశ్వాసి కొరకు ఒక ముత్యగుడారు (ఖైమా) ఉంటుంది. ఆ కుటీరం మొత్తం ఒకే ఒక్క ముత్యంతో తయారు చేయబడి ఉంటుం ది. అది అరవై మైళ్ళ పొడుగు ఉంటుంది”. (ముత్తఫఖున్‌ అలైహి)

సజ్జనుడయిన ఆ దైవ దాసుడు ఇప్పుడు రెండో కాలు కూడా మోపాడు. ఏమిటి? స్వర్గ నేల తెల్లగా ఉందే అని ఖంగు తిన్నాడు.  చూపులు  పైకెళ్ళాయి సూర్యుడు కన్పించలేదేమిటా అని ఉలిక్కిపడ్డాడు. ప్రజలని నేనెలా చూడగలను? నా స్నేహితులని, ఆప్తులని ఎలా గుర్తు పట్టగల ను? ఆశ్చర్యం! ఏమిటి? అక్కడ వెలుగు ఉండ దా? తప్పకుండా ఉంటుంది. కాని సూర్య రహిత ఆ వెలుగు ఎక్కడిది? ఆ దివ్యకిరణాలు ఎటువైపు నుండి వస్తున్నాయి!! ఆఁ… అల్లాహ్  అర్ష్‌ యొక్క వెలుగుతో స్వర్గమంతా కాంతు లీనుతూ ఉంటుంది. అంటే స్వర్గ వాసులపై అల్లాహ్  అర్ష్‌ యొక్క కాంతి ఉంటుంది. సుబ్హానల్లాహ్‌ా! సోదరా! సోదరీ! ఆలోచించు - ’అల్లాహ్  అర్ష్‌ యొక్క వెలుగు’! అందులో తీవ్ర ఎండగానీ, తీవ్ర చలిగాని ఉండదు. స్వర్గ వాసులకు ఎండ వేడి బాధించదు. చలి తీవ్రతా వేధించదు.
స్వర్గపు నేల అద్దంలా ఎంతో తెల్లగా నిగనిగ లాడుతూ ఉంటుంది. దాసుని దృష్టి అతని పాదాల క్రింది భూమిపై పడుతుంది. క్రింద గులకరాళ్ళున్నాయి…కాని అవి ఒట్టి రాళ్ళు కావు…వజ్రాలు, మణిమాణిక్యాలతో స్వర్గనేల చక్కగా అలంకరించబడి ఉంది. అదీ ఎక్కడా.. స్వర్గవాసి పాదాల క్రింద…దాసుడు వాటిని త్రొక్కుతూ ముందుకు సాగిపోతున్నాడు.  ప్రపంచంలో పసిడి కలలు కన్న ఓ మాన వుడా! రా! చూడు, ఈ రోజు నీవు ఎంతో విలువైనవని తలిచిన ఈ ముత్యాలు, ఈ పగ డాలు, ఈ మణిమాణిక్యాలు-ఒకటా రెండా.. లక్షలకొలది వజ్రవైఢూర్యాలు. దైవ దాసుడు వాటిని తన పాదాలతో త్రొక్కుకుంటూ వెళ్ళి పోతున్నాడు…చూడు, సర్వాధికారి అయిన అల్లాహ్‌ా తన దాసుణ్ణి ఎలా సత్కరిస్తున్నాడో! ఎన్ని అనుగ్రహాలతో సన్మానిస్తున్నాడో!!   దాసుడు స్వర్గంలో ప్రవేశించాడు. స్థలం కొత్త…నడిచే మార్గం…స్వర్గం కొత్త. మరి దాసుడు తన ప్రాసాదాన్ని తెలుసుకుంటాడా? ఎటువైపు ఉందో పసిగట్టగలడా? తప్పకుండా …ఎలాగయితే ఇహలోకంలో తన ఇంటిని గుర్తు పట్టేవాడో అలాగే గుర్తు పడతాడు.  తన నివాసం వైపు పరుగిడుతాడు. సోదరా! ఏం ఆలోచిస్తున్నావు? ఆ దాసుని ప్రాసాదం దేనితో నిర్మించబడి ఉంటుందనుకుంటున్నావు? మట్టి ఇటుకల నిలయమా! అద్దాల మేడనా!!… అవును కట్టడం ఇటుకలతోనే కట్టబడి ఉం టుంది, కానీ, ఒక ఇటుక వెండితో, ఒక ఇటుక పసిడితో, ఘాటయిన సువాసనగల కస్తూరి గచ్చుతో, మణిమాణిక్యాల కంకరతో, కుంకుమ పువ్వు వాసన గల ఒక విధమయి నటువంటి మట్టితో నిర్మించబడి ఉంటుంది.   ఈ ముత్యాలు, పగడాలు ప్రపంచంలో ఉన్న ట్లుగా ఉండవు. వాస్తవం ఏమిటంటే, స్వర్గపు ఏ వస్తువూ ఇక్కడి వస్తువుల్ని పోలి ఉండదు. ”భయభక్తులు గల వారికి వాగ్దానం చేయ బడిన స్వర్గం యొక్క వైభవం ఇలా ఉం టుంది” (ఖుర్‌ఆన్‌-47:15) మరి.

దాసుడు మార్గాన సాగి పోతున్నాడు. అతని ముఖకవళికల్లో ఆశ్చర్యం కొట్టుకొచ్చినట్టు కన బడుతోంది. ఏం చూశాడో ఏమిటో!  అవును, ‘అక్కడ అణుమాత్రం కూడా కలుషితంకాని  స్వచ్చమయిన  నీరు గల సెలయేరులు ఉం టాయి’.ఆ కాలువలు ప్రపంచ కాలువల్ని పోలి ఉంటాయనుకుంటున్నావా?ముమ్మాటికీ కాదు; ఆ సెలయేరుల్లోని నీరు ఎప్పటికీ చెడిపోదు. వాటికిరు వైపులా ముత్యాలు అమర్చబడి ఉం టాయి. ఇంకా ఏముంటుంది? ”ఏ మాత్రం రుచి కోల్పోని స్వచ్ఛమయిన పాల నదులుం టాయి”. ఎంత త్రాగాలనుకుంటావో త్రాగు. జలకాలాడాలని ఉందా. సరే కానివ్వు.    ఇంకా, ”పానప్రియులకు అమిత రుచికరం గా ఉండే వారుణీ వాహినీలు ఉంటాయి”. మధురాతి మదురమయిన మద్యం కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి.
ఓ మానవుడా! ఇహలోకంలో అల్లాహ్‌ా నిషే ధించిన మద్యానికి బానిసయి స్వర్గపు మద్యా న్ని చేెజార్చుకున్నవాడా! చూడు, స్వర్గంలో మద్యం కాలువలు ప్రవహిస్తున్నాయి. ఇది కరు ణామయుని వారుణి. ఇది చేదుగా ఉండదు, సేవించే వారు మతిస్తిమితం కోల్పోవడం జర గదు. అది చాలా రుచికరంగా ఉంటుంది. అక్కడ ముఖబంధిత మధుకలశం కూడా ఆ దాసుని ముందు సమర్పించబడుతుంది. ”వారక్కడ కుర్చీలపై ఎదురెదురుగా కూర్చుం టారు. వారుణీ వాహిని నుండి నింపిన మధు పాత్రలు వారి ముందు ఉంచబడతాయి. అది కాంతిమంతమైన (విశేష) మధువు. సేవించే వారికి ఎంతో మధురంగా ఉంటుంది. దాని వల్ల వారి దేహారోగ్యానికి ఎలాంటి నష్టం వాటి ల్లదు. వారి బుద్ధీవివేచనలు కూడా మంద గించవు”. (ఖుర్‌ఆన్‌-37: 43-47) ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాం ఏముందో? అదుగో అటు చూడు! ”ఎంతో నిర్మలమయిన తేనె ఝరులు (నిరంతరం) ప్రవహిస్తూ ఉన్నాయి”. సోదరా! తేనె తెట్లు కాదు, అక్ష రాల తేనె నదులు! అల్లాహు అక్బర్ !”అసలు ఇలాంటి అనుగ్రహాల కోసమే కర్మ శీలురు కృషి చెయ్యాలి, పోటీ పడాలి”.
దాసుడు తన ప్రాసాదాన్ని సమీపించాడు. కోట ప్రక్కనే ఉన్న ఓ గుడారును చూశాడు. అది కూడా ముత్యాలతో అలంకరించబడి ఉంది. దాని పొడుగు అక్షరాల అరవై మైళ్ళు. అందులో ప్రవేశించాడు. లోపల హూర్లు అన బడే స్వర్గపు సుకన్యలున్నారు. వారు ఎలా ఉం టారు? సిగ్గులొలికే చూపులు గల సుకన్యలు, వారి చెంపల కెంపులు ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటాయి. అల్లాహ్  ఇలా సెలవిస్తున్నాడు: ”మేము వీరిని ప్రత్యేకంగా సరికొత్త పంథాలో సృష్టించాము. వారిని కన్య లుగా చేశాము. వారు తమ భర్తలని అమితం గా ప్రేమిస్తారు. వయస్సులో సమంగా ఉం టారు.” (అల్‌ వాఖిఅహ్‌ా: 35)
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”స్వర్గం లో ప్రవేశించే మొట్టమొదటి సమూహంలోని ప్రజల ముఖాలు పున్నమి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటాయి. వారి తర్వాత స్వర్గంలో ప్రవేశించే వారి ముఖాలు ఆకాశంలోని అత్యంత ప్రకాశవంతమయిన నక్షత్రం వలే మెరిసిపోతూ ఉంటాయి. స్వర్గ వాసులు మల మూత్ర విసర్జన చేయరు. వారు ఉమ్మరు, ముక్కు కూడా చీదరు. వారి దువ్వెనలు బం గారంతో చేసినవై ఉంటాయి.   వారి  చెమట  కస్తూరి వలే సువాసనలు వెదజల్లుతూ ఉం టుంది. వారి ఉంగరాల్లో సుగంధభరిత మయిన సామ్రాణి జ్యలిస్తూ ఉంటుంది. వారి భార్యలు విశాలమయిన కన్నులు గల స్వర్గ కన్యలై ఉంటారు…”. (ముత్తఫఖున్‌ అలైహి) ”వారు ఎంత అందంగా ఉంటారంటే, విప రీతమయిన అందం మూలంగా వారి పిక్కల మాంసంలో నుంచి లోపలి గుజ్జు కూడా కన బడుతూ ఉంటుంది”. (బుఖారీ)
స్వర్గవాసులు వస్త్రాలు ధరిస్తారు. అవెక్కడి నుండి వస్తాయి, ఎలా ఉంటాయనుకున్నావు? అబ్దుల్లాహ్  ఇబ్నె అబ్బాస్‌ గారి మాటల్లో - ”స్వర్గంలో ఓ ప్రత్యేకమయిన వృక్షం ఉంటుం ది. దానికి దానిమ్మకొమ్మల్లాంటి పండ్లు కాస్తా యి. స్వర్గవాసి ఏదయినా దుస్తులు ధరించ దలచుకుంటే, ఆ చెట్టు రెమ్మ అతని దగ్గర వస్తుంది. తరువాత దానికి కాసిన పండ్లలో ఒక పండు విచ్చుకుంటుంది. అందులో డెబ్భయి రకాల దుస్తులు ఉంటాయి. స్వర్గవాసి వాటిని తీసుకోగానే ఆ రెమ్మ యథాతథంగా మారి తిరిగి తన స్థానంలోకి వెళ్ళి పోతుంది”.     (తర్గీబ్‌ -ఇబ్నె అబిద్దున్యా)  ”స్వర్గపు దుస్తులు మాసి పోవడంగాని, చీకి పోవడంగాని జరగదు. స్వర్గవాసుల యౌవనం కూడా ఏ మాత్రం తగ్గదు”. (అహ్మద్‌, తిర్మిజీ)
స్వర్గ వాసులు పట్టు వస్త్రాలు ధరిస్తారు. పట్టు వస్త్రాలపై కూర్చుంటారు. పట్టు పడకలపై నిద్రిస్తారు. పట్టు కుర్చీలపై కొలువుదీరు తారు. థ దిశల నుండి పట్టు జడి వానలా కురుస్తూ ఉంటుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”స్వర్గవాసులు బంగారు జలతారు అంచులుం డే పట్టు పరుపులపై మెత్తటి దిండ్లకు ఆనుకొని కూర్చుంటారు”. (ఖుర్‌ఆన్‌-55:76)  ”ఆ స్వర్గంలో సెలయేర్లు ఉంటాయి. ఎత్తయి న ఆసనాలుంటాయి. (త్రాగటానికి) మధు పాత్రలు కూడా పెట్టబడి ఉంటారయి. ఇంకా వరుసలు వరుసలుగా దిండ్లు పేర్చబడి ఉం టాయి. పట్టు తివాచీలు పరచబడి ఉం టాయి”. (ఖుర్‌ఆన్‌-88:12-16) ”వారు రత్నఖచిత ఆసనాల మీద మెత్తటి దిండ్లకానుకొని పరస్పరం ఎదురెదురుగా కూర్చుంటారు”. (56: 15,16)  ”వారి సమావేశాలలో నిత్య బాలకులు వారుణీ వాహిని నుండి స్వచ్ఛమయిన మధువుతో నిండిన గిన్నెలు, గ్లాసులు, కూజాలు తీసుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు” (ఖుర్‌ఆన్‌-56: 17, 18)
మరి వారు ఎలా ఉంటారు? ”వారి సేవ కోసం నిత్య బాలలు అటుఇటూ పరుగిడుతూ ఉంటారు. నీవా పిల్లల్ని చూస్తే చెదరిన ఆణి ముత్యాల్లా కన్పిస్తారు.    ”నీవక్కడ ఎటు చీసినా రంగ రంగ భోగ భాగ్యాలు, మహోన్నత సామమ్రాజ్య వైభ వాలు కన్పిస్తాయి”.(ఖుర్‌ఆన్‌-76: 19,20)  దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”నక్ష త్రాలపై పూర్ణ చంద్రునికి ఎంత ఔన్నత్యం ఉంటుందో, ఈ బాల సేవకులపై వారి చేత సేవ చేయిపించుకునే వారికి అంత ఔన్న త్యం ఉంటుంది”. (తఫ్సీర్‌ మజ్హరీ)  స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రపు అం చులు గల తివాచీలపై దిండ్లకు ఆను కొని కూర్చొని ఉంటారు. వారు ఏదయినా పండు తీసుకోదల చినప్పుడు స్వయంగా ఆ పండ్ల రెమ్మ పరమ విధేయురాలిగా వారి దగ్గరికి వచ్చేస్తుంది. స్వర్గవాసులు నిలబడి ఉంటే ఆ రెమ్మ పైకి లేచి అతని దగ్గరకు వస్తుంది. అతను కూర్చోని ఉంటే లేదా పడుకోని ఉంటే అది అతని దగ్గరకు వంగి వస్తుంది. (తఫ్సీర్‌ ఇబ్ను కసీర్ )
ప్రపంచంలో మనిషి ఆశించేదేమిటి? బాగా సంపాదించాలని. తన ధన కన నిధులు పెరగాలనీ, తనను ప్రేమించే మంచి భార్య ఉండాలనీ, సదా తన సేవలో తరించే మంచి సంతానం ఉండాలనీ, ఉండటానికి ఓ పెద్ద బంగలా కావాలనీ, ఆ బంగలాలో స్విమ్మింగ్‌పూల్‌ కూడా ఉండాలనీ, చుట్టూ సువాసనలు వెదజల్లే అందమైన పూలవనం ఉండాలనీ, ఆ వనంలో రంగురంగుల కుర్చీలు అమర్చబడి ఉండాలనీ, ఆకుర్చీలపై తను కొలువుదీరి ఉంటే- సేవకులు కావా ల్సిన ప్రతి వస్తువునీ తన వద్దకు చెర్చాలనీ, తనకు ఎలాంటి బాధగానీ, దుఃఖంగానీ కలగరాదనీ, ఏ విధమయినటువంటి నష్ట వాటిల్లరాదనీ, తను ఏ చీకూచింతా లే కుండా ప్రశాంతంగా జీవించాలనేగా మనిషి కోరుకునేది!?
”ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువు గురించి ఏవిషయం నిన్ను మోసం లో పడవేెసింది? యదార్థానికి ఆయనే నిన్ను పుట్టించాడు. నిన్ను చక్కగా చీర్చిదిద్దాడు. ఆపైన తగురీతిలో నిన్ను పొందికగా అమ ర్చాడు. తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు”. (ఇన్ఫితార్‌: 6-8) ”ఏమిటి, నిన్ను మట్టితో చేసి, ఆ తార్వత వీర్యపు బిందువుతో సృష్టించి,  ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (అల్లాహ్‌ానే) తిరస్కరిస్తున్నావా?”(కహఫ్‌:37)
మానవులు సహజంగా కోరుకునే లోకం స్వర్గ లోకం. ఈ ప్రపంచ జీవితం సుఖ దుఃఖాల సమ్మిశ్రమం. కావున మన ఆశలన్నీ ఇక్కడ తీరడం అసాధ్యం. అవి స్వర్గంలో తీరుతాయి. అది మనిషి కొరకు అనుగుణమయినది. అది సజ్జనుల శాశ్వత నివాసం కూడా. స్వర్గలోకం – అది పూర్తిగా తేజోమయమయిన లోకం. అక్కడ ఆనందం, సౌఖ్యాలు, ఉత్తమ అనుభూ తులు ఉంటాయి. అక్కడ కోరుకున్న కోరిక లన్నీ మొదటి నుండే లభ్యమయి ఉంటాయి. అది మరణరహితమయిన, వెలుగులతో నిండి న, శాశ్వత తేజస్సునిచ్చే, పతన రహితమయిన స్థలం. అక్కడ మన చిరకాల కోర్కెలన్నీ ఈడే రుతాయి. ఆ స్వర్గ లోకంలో కామం, నికా మం, సుధ, తృప్తి, ఆనందం, మోదం, ముదా వహం, ప్రమోదం ఉంటాయి. అక్కడ వృద్ధాప్య ముగానీ,అలుపుసొలుపులుగానీ, భయ భీతు లుగాని ఉండవు. ఈర్ష్యగానీ, క్రోధావేశాలు గాని ఉండవు. అటువంటి పరిశుద్ధ నందన వనాలు పుణ్యాత్ముల విలాస ప్రదేశాలు. అక్కడ అశుద్ధమైన నీచమయిన వస్తువు ఏదీ లేదు. అక్కడ సువాసనతో కూడిన గాలులు – మలయ పవనాలు వీస్తాయి. అక్కడి దైవ స్తోత్రాలు వీనులకు విందుగా, హృదయాలను రంజింపజేసేవిగా ఉంటాయి. అక్కడ శ్రమ గానీ, బాధగాని ఉండదు. ఈ లోకం సత్కర్మల ఫలితంగా లభించే లోకం. అక్కడ ప్రతి మనిషి శరీరం అతని కర్మలకు అనుగుణంగా తేజోమ యమయి ఉంటుంది. దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు:  ”స్వర్గంలో ఒక బజారు ఉంటుంది. స్వర్గ వాసులు ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్తారు. అక్కడ (ఒక విధమయిన) ఉత్తర పవనాలు వీస్తాయి. అవి స్వర్గవాసుల ముఖాలపై, దుస్తు లపై సువాసనను వెదజల్లుతాయి. దాంతో వారి అందం ద్విగుణీకృతం అయిపోతుంది. అలా వారు ఎంతో అందంగా మారి తమ తమ నివాసాలకు తిరిగి వెళ్తారు. వాళ్ల భార్యలు వారిని చూసి ’దైవసాక్షి! మీరు మా నుండి వేరయినప్పటికంటే ఇప్పుడు మీ అందం రెట్టింపయింది’ అనంటారు. వారీ మాట విని ’అల్లాహ్  సాక్షి! మేము మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీ అందం కూడా రెట్టింపయింది’ అనంటారు”. (ముస్లిం)
ఈ సుఖసంతోషాలని అనుభవిస్తూ ఉండగా అల్లాహ్‌ా వైపు నుండి పిలుపు వస్తుంది. ’మీకు ఇంకేమయినా కావాలా? అడగండి, ఇస్తాను’ అనంటాడు.  దానికి వారు: ’ప్రభూ! నువ్వు మా ముఖాలను తేజోవంతం చేయలేదా? మమ్మల్ని నరకం నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపజేయ లేదా? అని సవినయంగా విన్న వించుకుం టారు’. (ముస్లిం)
అల్లాహ్  స్వర్గవాసుల్ని సంబోధిస్తూ – స్వర్గ వాసులరా! అని పిలుస్తాడు. దానికి వారు ’మేము నీ సన్నిధిలో హాజరయి ఉన్నాము. ప్రభూ! మీ ప్రతీ ఆదేశాన్ని శిరసా వహించ డానికి మేము సదా సిద్దంగా ఉన్నాం, సెలవి య్యండి’. అనంటారు. అప్పుడు అల్లాహ్  ”మీరు నా పట్ల సంతుష్టులయ్యారా?” అని అడుగుతాడు. ’ప్రభూ! నువ్వు మాకు నీ దాసు లకెవ్వరికీ ప్రసాదించని మహాభాగ్యాలు ప్రసా దించావు. అలాంటప్పుడు మేము ఎందుకు సంతుష్టులము కాము?’ అంటారు స్వర్గవా సులు. అప్పుడు అల్లాహ్‌ా- ’సరే, ఇప్పుడు నేను మీకు ఇంతకంటే  శ్రేష్ఠమయిన మహా భాగ్యం ప్రసాదించనా?” అంటాడు. ’ఇంత కంటే శ్రేష్ఠ మయిన మహా భాగ్యం ఇంకేముంటుంది’ అంటారు స్వర్గవాసులు. ”వినండి. బాగా వినండి. నేను మీకు శాశ్వతంగా నా ప్రసన్నతా భాగ్యం ప్రసాదిస్తున్నాను. ఇక ఎప్పుడూ నేను మిమ్మల్ని ఆగ్రహించను”. (బుఖారీ, ముస్లిం)
అయితే  ఓ మా ప్రభూ! నీ దర్శనాభాగ్యాన్ని మాకు అనుగ్రహించు. అది తప్ప మాకు ఇంకే మీ వద్దు. అదే మా ఆశలకి ఆఖరి హద్దు’ అని వేడుకుంటారు.  ఆ తర్వాత అల్లాహ్  దివ్య దర్శనం కోసం తెర ఎత్తివేయబడుతుంది. అప్పుడు పరాత్పరుడ యిన అల్లాహ్‌ా స్వర్గవాసుల ముందు ప్రత్యక్ష  మవుతాడు. అపూర్వమయిన ఈ దివ్య దర్శ నంతో స్వర్గవాసుల అణువణువూ పులకి స్తుంది).ఒకే ఒక్క చూపు! ఏం జరుగుతుంది?
స్వర్గాన్ని ఒక చూపు చూసినప్పుడు ప్రాపంచిక భోగభాగ్యాలను, దుఃఖవిషాదాలను మరచిపో యినా ఆ దైవ దాసులే, అల్లాహ్  దివ్య దర్శనం చేసుకుంటున్నంత సేపూ స్వర్గపు మరే మహా భాగ్యం వైపు దృష్టి సారించరు. వారు సృష్టికర్త సౌదర్యానికి ముగ్దులయి తన్మయం చెందుతూ ఉంటారు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం-’ఒకే ఒక్క దర్శనంలో కొన్ని వేల సంవత్సరాలు గడచిపోతాయి; కానీ ఆ ధ్యాసే దాసులకు ఉండదు’-అటువంటి మహా మహి మాన్వితమ యినది అల్లాహ్  దివ్య దర్శనం. సుబ్హానల్లాహ్ ! అల్లాహ్  ఈ దివ్య దర్శనం కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుందా? తిరిగి మళ్ళీ మళ్ళీ దర్శించుకుని తాదాత్మ్యం చెందే భాగ్యం  స్వర్గవాసులకు లభించదా?
హజ్రత్‌ అబ్దుల్లాహ్  బిన్‌ ఉమర్‌ (ర) ఈ విధంగా సెలవిచ్చారు: ”స్వర్గంలో హోదాల రీత్యా అధమశ్రేణి స్వర్గవాసికి లభించే సామ్రా జ్యంలోని తోటలు, ఆసనాలు, భార్యలు, సేవ కులు, ఇతర మహా భాగ్యాలు రెండు వేల సంవత్సరాల ప్రయాణమంతా పరిధిలో విస్తరించి ఉంటాయి. పోతే అత్యున్నత శ్రేణికి చెందిన స్వర్గవాసికి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అల్లాహ్‌ా దివ్య దర్శన మహా భాగ్యం లభిస్తుంది”. ఆ తర్వాత దైవప్రవక్త (స) వారు ఖుర్‌ఆన్‌లోని ఈ (75:22) సూక్తి పఠిం చారు: ”ఆ రోజు కొందరి ముఖాలు కళ కళ లాడుతూ దేదీప్యమానంగా వెలిగిపోతుం టాయి. వారు తమ ప్రభువుని ప్రత్యక్షంగా చూస్తుంటారు”. (తిర్మిజీ)  చివరిగా స్వర్గవాసులకు అల్లాహ్  ఆశీర్వాదం (సలాం)తోపాటు వారు స్వర్గంలో కలకాలం ఉంటారన్న శుభవార్త కూడా విన్పించ బడుతోంది.
మిత్రమా! నీకు  కలగబోయే ఈ మహా భాగ్యం గురించి ఎప్పుడయినా ఆలోచించావా! ఏ మార్గాన్ని అవలంబించాలో నీ అంతరాత్మ ను అడుగు. ఓ బృందం స్వర్గవనాలలో విహరి స్తుంది.మరో బృందం నరకాగ్నికి ఆహుతి అవు తుంది. నీ ప్రభువు సత్య మార్గాన్ని స్పష్టం చేసేశాడు. అపమార్గాన్ని విడమరచి చెప్పే శాడు. ఇక నువ్వు కృతజ్ఞుడవై జీవించవచ్చు లేదా కృతఘ్నుడవై బ్రతకవచ్చు.  ”విశ్వసించిన ప్రజలారా! మీ ప్రభువు క్షమా భిక్ష  వైపునకు, భూమ్యాకాశాలంతటి విశాలమ యిన స్వర్గధామం వైపునకు పోయే మార్గంలో పోటీ పడండి”. (అల్‌ హదీద్‌: 21)