30, మార్చి 2013, శనివారం

సనాతన ధర్మం ఇస్లాం

ముహమ్మద్ ఉమర్ 

  మనం  మనుషులం. అందరం సమానులం. అస్పృశ్యతా అంటరాని తనాలకు అతీతులం. దైవ దాసులం. ఆది మానవుడైన ఆదం (అ) వారి బిడ్డలం. ఒకే కుటుంబానికి చెందినవారలం. మనల్ని పుట్టించిన దేవుడు మనందరి మార్గదర్శక నిమిత్తం ఒక లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను ప్రభవింపజేయడమేగాక, అనేక గ్రంథాలను అవతరింపజేశాడు. అలా లోక కళ్యానార్థం వచ్చిన మహా మహులలో మొదటివారు ఆదమ్‌ (అ). ఆయన మొదలు ప్రవక్తలందరూ తీసుకొచ్చిన ధర్మం ఒక్కటే. అది ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” – దేవుడు ఒక్కడే. అదే నిజం. తక్కినవన్నీ మిథ్య. దేవుడు ప్రజలందరికి ఉపదేశించిన జీవన విధానం ఒక్కటే. అగ్ర వర్ణాల వారికి, అధమ వర్ణాల వారికి అంటూ వేర్వేరు శాసనాలు ఆయన చేయలేదు. ధనికులైనా, పేదలైనా, అరబ్బులైనా, అరబ్బేతరులైనా, నల్లవారైనా, తెల్లవారైనా, కనక పిపాసులైనా, కార్మికులైనా అందరి కోసం ఆయన నిర్దేశించిన జీవన విధానం ఒక్కటే. నాటి నుండి నేటి వరకు. అదే ఇస్లాం.
  ఇస్లాం చూపే జీవన విధానం అన్ని దేశాలకు, అన్ని కాలాలకు అన్ని విధాల ఆమోదయోగ్యంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ముందు మనిషి, నిజ స్వామిని గుర్తించాలంటుంది. ఆయన ప్రసన్నతను కోరుతూనే ప్రతి పని చెయాలంటుంది. తల్లిదండ్రుల్ని గౌరవించమంటుంది. వారితో కసురుకుంటూ మాట్లాడకూడదంటుంది. పొరుగువారితో మంచిగా మసలుకో మంటుంది. కుడి ఎమడల ఉన్న నలభై ఇళ్ళు పొరుగువారి క్రిందికి వస్తాయి అంటుంది. తాము పుష్టిగా భోంచేసి పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే అతను పరిపూర్ణ విశ్వాసి కాజాలడు అని హెచ్చరిస్తుంది. ఇస్లాం శుచీ శుభ్రతల గురించి నొక్కి మరీ చెబుతుంది. దేహ పరిశుభ్రత విశ్వాసంలోని సగ భాగమైతే, ఆత్మ పరిశుద్ధత విశ్వాసంలోని మరో సగ భాగం అంటుంది.
  ఇన్ని చెబుతున్న నేనెవర్ని? అని తెల్లబోతున్నారా? నా పేరు పడిగ పాలేటి. నేను 2006లో ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించాను. తోటి స్నేహితులు, మరియు అన్య పుస్తకాల నుండి ఇస్లాంను గ్రహించిన నేను ఇస్లాం ఆది ధర్మం అని గ్రహించాను. విశ్వ మానవాళి కోసం విశ్వకర్త పంపిన జీవన విధానం అని తెలుసుకున్నాను. భాష, ప్రాతం, దేశం, కాలం వేరయినా అందరూ తీసుకొచ్చిన ధర్మం ఇస్లాం మాత్రమే అని తెలుసుకున్న నేను ఇస్లాం స్వికరంచాను. నేను ఇస్లాం ధర్మాన్ని నా  జీవన విధానంగా చేసుకున్నప్పటి నుండి నాలో అనూహ్య రీతిలో మార్పు వచ్చింది. మంచి ఏది, చెడు ఏది అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే గుణం అలవడింది. ఒక్క మాటలో చెప్పాలంటే – ”మంచికి మారు పేరే ఇస్లాం”. ప్రస్తుతం నా పేరు ఉమర్‌.

మీ ప్రభు వైపునకు మరలండి

అబ్దుల్ అజీజ్

 తల్లిదండ్రులు, బంధుమిత్రులు, పొరుగువారు, అతిథుల పట్ల సద్వ్యవహారం కలిగి ఉండండి. ఒకవేళ జనాలు మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించినా మన్నింపుల వైఖరిని అవలంభించండి. అసభ్యంగా వ్యవహరిస్తే హుందాగా సలాం చేసి తప్పుకోండి. ఎట్టి స్థితిలోనూ ఎవ్వరితోనూ కయ్యానికి కాలు దువ్వకండి. సిగ్గుమాలిన పోకడల జోలికి వెళ్ళకండి. సారాయి, జూదం, వ్యభిచారం, పాచికల జోస్యం సమాజాన్ని భ్రష్టు పట్టించే, సంసారాన్ని నట్టేట ముంచే మహా భయంకర వ్యసనాలు. వీటికి దూరంగా మసలుకోండి. ఇదంతా ఎక్కడ నేర్చుకుని చెబుతన్నాడు? అంటారా-; ఇస్లాం ధర్మం నాకు నేర్పిన నైతిక విధానం ఇది. ఇది అన్నీ మతాల్లో ఉన్న అంశాలే కదా అని మీరు అనవచ్చు. నిజమే-, కానీ ఇస్లాంలో ఇలాంటి సమాజానికి పనికివచ్చే హితోక్తులు పరిపూర్ణంగా ఉన్నాయి అని నేనంటాను.
  ఒకప్పుడు నేనూ అందరిలా ఇస్లాం అంటే ఒక ప్రాంతానికి, భాషకి సంబంధించిన మతం అని, అల్లాహ్‌ అంటే కేవలం ముస్లింల దేవుడని, ఖుర్‌ఆన్‌ అంటే ఏదో కొద్దిమంది మత విశ్వాసాలకు సంబంధించిన గ్రంథమని, మహా ప్రవక్త ముహమ్మద్‌ అంటే  అరబ్బు ప్రాతానికి పరిమితమైన ప్రవక్త అని, చివరికి ముస్లిలు అంటే మహమ్మదీయులని (ముహమ్మద్‌ ప్రవక్తను ఆరాధించేవాళ్ళని) అనుకునేవాణ్ణి. కానీ నా అభిప్రాయం తప్పని పుస్తకాలు చదివిన మీదట తెలిసింది. మహా ప్రవక్త (స) వారి జీవిత చరిత్ర ద్వారా మనిషి ఎలా జీవించాలో తెలుసుకున్న నేను, ఖుర్‌ఆన్‌ గ్రంథ పారాయణం ద్వారా జీవితం – జీవితంలోని కష్ట సుఖాలు, మరణం-మరణం తర్వాతి జీవితం పరలోకం, తీర్పు దినం, స్వర్గం, నరకం మొదలైనవి గ్రహించగలిగాను.
  ‘తమ పాపాలపై పశ్చాత్తాపం చెందేవారిని పరిశుద్ధతను, పరిశుభ్రతను పాటించేవారిని అల్లాహ్‌ అమితంగా ప్రేమిస్తాడు”.
 (అల్‌ బఖరా: 222) అన్న మోక్ష సౌరభాలు నిండిన శుభవార్త ఖుర్‌ఆన్‌ లోనిదే. ఇస్లాం కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలో కూడా నేర్పుతుంది అంటే మీరు నమ్ముతారా? చూడండి!
1) మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ముందు ఎడమ కాలు పెట్టి లోనికి ప్రవేశిస్తూ ”అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్‌ ఖుబ్‌సీ వల్‌ ఖబాయిస్‌” అనాలి.
2) నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోగానీ, నీడనిచ్చే చెట్ల క్రిందగానీ, జనులు నడిచివెళ్ళే రహదారుల్లోగానీ, మల మూత్ర విసర్జన చేయకూడదు.
3) పిడకలతో, ఎముకలతో ఇస్తిన్జా చేయకూడదు. అలాగే రంద్రాల్లో, బిలముల్లో మూత్రం పోయకూడదు.
4) మైదాన ప్రదేశాల్లో కాలకృత్యాలకై వెళితే ఏదైనా వస్తును తెరగా పెట్టుకోవాలి.
5) అనివార్య పరిస్థితిలో తప్ప ఎప్పుడూ మూత్ర విసర్జన కూర్చోనే చేయాలి.
చూశారుగా ఇస్లాం చూపే జీవన సంవిధానం. త్వరపడిండి. నిజ ధర్మమేదో తెలుసుకోండి. మీ ప్రభు వైపునకు మరలిపోండి. ఆయన ప్రసన్నతను చూరగొని స్వర్గవనాలలో హాయిగా విహరించండి.

తుది నిర్ణయం మీదే

 ముఅహమ్మద్ అలీ 
నా పేరు నరసింహులు. నా వయస్సు 50 సమవత్సరాలు. 50 ఏండ్లు అపమార్గాన జీవించిన నేను ముదిమికి చేరుకునే థలో సత్యాన్ని గ్రహించాను. ఇస్లాం అంటే శాంతి, విధేయత, సమర్పణ అని తెలుసుకున్న నేను అన్ని విధాల నా జీవితాన్ని ఆ సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్‌ాకు అంకితం చేశాను. ఇకమీదట నా జీవనం, నా మరణం, నా ప్రార్థన, నా త్యాగం అన్నీ సర్వోన్నతుడైన అల్లాహ్‌ాకే అర్పితం. 
 ఇస్లాం అదో విశ్వజనీన ధర్మం. అది మనిషిని దైవభితిని, నైతిక రీతి ప్రబోధించి అతన్ని గొప్ప ధర్మపరాయణుడిగా తీర్చిదిద్దుతుంది. అతనిలో గొప్ప పరివర్తనను తిసుకువచ్చి అతని ఇహపరాల సాఫల్యానికి పూబాట వేస్తుంది. దానికనుగుణంగా నడుచుకునే వారికి అది నిజమైన గౌరవాన్ని ప్రసాదిస్తుంది. మానవులందరి ధర్మమైన ఇస్లాం ఒక్కటే, దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌ ఒక్కటే, అందరి ఆరాధ్య దైవం అల్లాహ్‌ా ఒక్కడే. మానవులంతా ఒక్కటే. 
  పూర్వాశ్రమం గురించి చెప్పాలంటే - అగ్ర వర్ణాలవారు క్రింది వర్ణ జనులతో, దళితులతో కలిసి కూర్చోవడంగానీ, కలిసి భోంచేయడంగానీ ఈ ఆధునిక యుగంలో సైతం చేయరాదు. పైగా అలా చేసేవారిని అసహ్యించుకునేవారూ లేకపోలేదు. ఇస్లాం ప్రకారం అయితే మనిషిని గౌరవించడం, మర్యాదలు చేయడం ఎలాంటి తారతమ్యం పాటించకపోవడం తప్పనిసరి. ఇక్కడ వర్ణ భేదాలు లేవు. కుల పిచ్చీ లేదు. వంశ డాంబీకాలూ లేవు. ఎవరూ పుట్టుక రీత్యా అల్పులు కాదు. మనిషి చేసుకున్న కర్మల్ని బట్టే అతని స్థానం ఏర్పడుతుంది. అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించేవారే, అందరూ దైవ దాసులే, దైవానికి చెందినవారే, సమానులే. 
  ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించిన మరుక్షణం అతనిలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అతనిపై రెండు బాధ్యతలు మోపబడతాయి. 
1) బహుదైవారాధనను త్రోసిపుచ్చటం. 2) దేవుని ఏకత్వాన్ని స్వీకరించటం. జీవితపు అన్నీ రంగాల్లో ఆయన ఆదేశాలను నిర్వర్తించటం. ఏకేశ్వరుడు చేయమన్న దానిని చేయాలి. వద్దన్న వాటిని విసర్జించాలి. అలా మనం చేసిన నాడు దైవానికి ప్రీతిపాత్రులై స్వర్గంలో మహా ప్రవక్త (స) వారి సాంగత్యాన్ని పొందే సౌభాగ్యాన్ని సొంతం చేసుకున్నవాళ్ళం అవుతాము. ఒక వర్గం స్వర్గానికి వెళితే, మరో వర్గం నరకానికెళుతుంది. ఎటు వెళ్ళాలో మీరే నిర్ణయించుకోండి. ఈ జీవితం మీది. దీన్ని సార్థకం చేసుకుంటారో, వృధా పర్చుకుంటారో మీ ఇష్టం. ధర్మంలో మాత్రం ఎలాంటి బలాత్కారం, బలవంతం లేదు.       
     
29, మార్చి 2013, శుక్రవారం

ఇస్లాం శాంతి వనం చైతన్యం జాగృతి

రచన; హాఫిజ్ ఎస్.ఎం. రసూల్ 
 ఆకాశాల్లో అల్లాహ్‌ ఆజ్ఞ ఒకటి అమల్లోకొచ్చింది. రెండు జీవాలు స్వర్గం  నుంచి స్థానభంశం చెందు తాయి. వాటిలో ఒక జీవి నమత్ర, అణకువలకు నిలువెత్తు నిదర్శనం; మరొక జీవి పగ పత్రీకారాలకు పెట్టింది పేరు. ఇరు జీవులూ నిర్ణీత కాలవ్యవధి కోసం కార్యకారక పప్రంచంలోకి పవ్రేశించాయి. ఒక జీవి 'ఆదం'గా అవతరించింది. మరొక జీవి 'షైతాన్‌'గా పత్య్రక్షమయింది.
 షైతాన్‌ది మొదటి నుండే మొండి వాదన. ఆదం మూలంగానే తాను దివ్యలోకాల నుంచి దిగి రావలసి వచ్చిందని వాడి మూఢ భావన. అందుకని ఆదంపై అతను అనవసరంగా కక్ష పెంచుకున్నాడు. ఆదం జాతి వినాశనం కళ్ళారా చూస్తేగాని వాడి కడుపు మంట చల్లారేటట్టు లేదు. దైవధిక్కార భావాలతో విశ్వం తగులబడిపోయినా, ఆ బడబాగ్నికి తానూ ఆహుతి అయిపోయినా ఫర్వాలేదు గాని, ఆదంకు, అతని సంతానానికీ మళ్ళీ స్వర్గం గడప తొక్కే భాగ్యం మాత్రం కలుగ రాదన్నది షైతాన్‌ జీవిత లక్ష్యం!
  అందుకనే వాడు ఆదంపై పగ ప్రతీకారాల ప్రచండ నిప్పుల వాన కురిపించాడు. భూమండలం నిండా అసూయా అగ్ని గుండాలు రగిలించాడు. దాంతో విశ్వమంతటా విద్వేషం, వైషమ్యాల విష వాయువులు అలుముకున్నాయి. అవని అంతా అల్లకల్లోలమయింది. 
  అల్లాహ్‌ తలచుకొని ఉంటే ఆ రోజే షైతాన్‌కు అంతిమ దినం అయి ఉండేది. భువన భాండవాలను నిర్మించిన ప్రభువుకు షైతాన్‌ పీచమణచటం పెద్ద పని కాదు. ఆ మాటకొస్తే షైతాన్‌ను సృష్టించిందీ ఆయనే! తాను సృష్టించిన జీవిని తిరిగి శూన్యంలోకి పంపించేయటం ఆయనకు ఒక లెక్కా?! అయితే అల్లాహ్‌ వ్యూహం మరోలా ఉంది. షైతానుకు వాడి అశక్తతను, వాడి దౌర్బల్యాన్ని తెలియజేయాలను కున్నాడాయన. అసత్యం ముందు సత్య బలాన్ని నిరూపించాలను కున్నాడు.
బ్రహ్మాండమైన ప్రణాళిక
  షైతాన్‌ ఆట కట్టించటానికి అల్ల్లాహ్‌ బ్రహ్మాండమైన ప్రణాళికను రూపొందించాడు. వాడి ఆగడాల నుంచి రక్షించటానికి ఆయన ఆదంను తిరిగి దివ్యలోకాలకు పిలుచుకోలేదు. మరో లోకానికి తరలించనూలేదు. ఇహలోకాన్ని  పరీక్షా   స్థలంగా   నిర్ధారించాడు.   
  దీనిని ఆచరణా నిలయం (దారుల్‌ అమల్‌)గా ఖరారు చేశాడు. ఎవరు చక్కగా రాణిస్తారో పరీక్షించే నిమిత్తం జీవన్మరణాల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి ఇహలోకంలోనే అత్యంత సుందరమైన, సుఖ దాయకమైన ఒక వనాన్ని ఆయన నిర్మించాడు. దానికి ''శాంతి వనం'' (సలామ్‌ వనం) అని నామకరణం చేసాడు. ఆదంను అందులో వసింపజేశాడు. ఇహలోకంలో షైతాన్‌ దాడుల నుంచి రక్షించుకునే స్థానం 'శాంతి వనం' ఒక్కటేనని స్పష్టంగా ప్రకటించాడు.
  షైతాన్‌ నాలుక్కరచుకున్నాడు. తన నక్కజిత్తులన్నీ ఉపయోగించి మరో ఎత్తు వేసే ప్రయత్నంలో పడ్డాడు.
శాంతివనం ఏకదైవారాధనకు ఆలయం
  శాంతి వనం ఏకదైవారాధనా భావాలు పరమళించే అందమైన పూలవనం. ఇహలోకపు స్వర్గధామం. మనుషులను షైతాన్‌ దాడుల నుండి కాపాడే రక్షణ వలయం అది. షైతాన్‌ విసిరే విషవాయువులు అందులో ప్రవేశించలేవు. దాని గోడలను తాకి వెనక్కి వచ్చేస్తాయంతే. కొద్దో గొప్పో దుష్ప్రభావం లోపలికి చొచ్చుకుపోయినా శాంతి వనంలోని సుమంగళ పుష్పాలు ఆ విషాన్ని హరించివేసి, వనంలో మళ్ళీ యధాస్థితిని నెలకొల్పుతాయి. శాంతివనంపై ముప్పేట దాడులు చేసి అందులో శరణుజొచ్చిన అల్ల్లాహ్‌ భక్తులందరినీ అపమార్గాలకు గొనిపోదామని ఆనాటి నుంచీ అలుపెరగకుండా ప్రయత్నిస్తూ ఉన్నాడు షైతాన్‌ మాయావి. కాని షైతాన్‌కు అన్ని సార్లూ నిరాశే ఎదురయ్యింది. 
షైతాన్‌ కపట నాటకం!
  అప్పుడు షైతాన్‌ బుర్రలో మెరుపు లాంటి ఒక ఆలోచన మెదలింది. మనుజ జాతిపై తన కసి తీర్చుకోవటానికి వాడు తన పంథా మార్చు కున్నాడు. మనుషులను ఏకదైవారాధన నుంచి ఏమార్చటానికి సరికొత్త దారిని వెతికాడు. వాడు చేసిందేమిటంటే -
  శాంతి వనం (ఇస్లాం వనం) చుట్టూ సర్వాంగ సుందరమైన, ముగ్ధ మనోహరమైన మరో రెండు వనాలను రూపొందింపజేశాడు. ఒకటి: దైవధిక్కార (కుఫ్ర్‌) వనం. రెండోది: బహుదైవత్వపు (షిర్క్‌) వనం. అవి అచ్చం శాంతి వనాన్ని పోలివున్నాయి. కాని వాటిలో అన్నీ దుర్గంధ భరిత విషపు మొక్కలు! విశ్వంలోని అత్యంత హానికర ముళ్ళపొదలను, విషపు గింజలను షైతాను వాటిలో నాటాడు. అయితే ముళ్ళూ ముడులూ కనిపించకుండా పైపైన ఆ చెట్లకు చూడచక్కని రంగులు అద్దాడు. కంపూగింపూ రాకుండా వాటిపై మంచి మంచి వాసనలు వెదజల్లాడు. 
    అప్పుడు ప్రకృతిసిద్ధ ఇస్లాం వనానికి - కపటమైన షైతాన్‌ తోటలకూ మధ్య వ్యత్యాసం గుర్తించటం కష్టమయింది మనిషికి. పైగా ఆ మాయలమారి పెంచుతున్న విషవనాల్లోని కొన్ని (గంజాయి) మొక్కలు ఇస్లాం వనపు వృక్షాలకంటే సుందరమైనవిగా, సౌఖ్యమైనవిగా అగుపించసాగాయి. 
ఎత్తుకు పైఎత్తు!
మానవుల్ని కష్టాల పాల్జేయటం కారుణ్య ప్రభువు అభిమతం కానేకాదు. అల్లాహ్‌ మనిషిని ఏనాడూ అతని నిస్సహాయతకు వదలి పెట్టలేదు. ఇప్పుడు కూడా అదే దైవ సంప్రదాయం పని చేసింది. 
 షైతాన్‌ మాయావి పెంచిన కపట వనాలకు దీటుగా శాంతి వనాన్నీ వికసింపజేశాడు అల్లాహ్‌. ప్రతి కాలంలో, ప్రతి యుగంలో మానవుల్లో నుంచే తన ప్రతినిధులను ఎన్నుకుని వారిని 'ఇస్లాం వన' సంరక్షకులుగా, శాంతి సీమలోని పచ్చదనాన్ని కాపాడే ప్రవక్తలుగా నియమించాడు. సాతాను కపట తోటల్లో విచ్చుకుంటున్న ప్రతి ఒక్క విషపు మొక్కకూ ఇస్లాం వనంలో ఒక విరుగుడు వృక్షం వృద్ధి చెందుతూ ఉండేలా అద్భుతమైన ఏర్పాటు చేశాడు. దాంతో ఇస్లాం వనం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతూ పోయింది. యుగాల తరబడి సాతాను విసరుతూ వచ్చిన విష వాయువులకు ఏ మాత్రం కలుషితం కాకుండా పరమ పునీతంగా, పరిశుద్ధంగా నిలిచింది. మరి ప్రపంచం పుట్టింది మొదలు నేటి వరకు ఇస్లాం వన సంరక్షణా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన హేమాహేమీలయిన ఆ వనమాలీలు ఎవరనుకుంటున్నారు?
  నూహ్‌, హూద్‌, సాలిహ్‌, ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, మూసా, ఈసా మొదలగు చరిత్ర రత్నాలే ఆ మహానుభావులు! ప్రజలకు సన్మార్గం చూపటానికి పుట్టిన మానవ నవనీతం!! ప్రపంచం ఎన్నటికీ మరచిపోలేని చరితార్థులు!!! వారి బోధనా సుధతో ఇస్లాం వనంలో ఎప్పటికప్పుడు దివ్యమైన పుష్పాలు వికసిస్తూ ఉన్నాయి. 
చిట్టచివరి వనమాలి ముహమ్మద్‌ (స)
  ఆ కోవలోని చిట్టచివరి వనమాలీయే మన ప్రవక్త ముహమ్మద్‌ (స). ఆధునిక యుగంలో షైతాను భావజాలపు కుయుక్తుల్ని ముందుగా పసిగట్టి, ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టే ప్రతి ధర్మ కుసుమమూ ఆయన వనంలో మొగ్గ తొడిగింది. గత ప్రవక్తల కాలంలో భూప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకే పరిమితమైన ఇస్లాం వనం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కాలానికి ప్రపంచమంతా వ్యాపించింది. ఈ రోజు అది ప్రతి మనిషి ముంగిట్లో అలరారుతోంది. తనకు చేరువలోనే తారట్లాడుతూ, తనలో ప్రవేశించటానికి ఆలోచిస్తున్న ఆదం పుత్రులను అది ఆర్ద్రంగా పిలుస్తోంది. సాదరంగా లోనికి ఆహ్వానిస్తోంది. తనలోకి ప్రవేశించ టానికి ఆలస్యం చేసి షైతాను చేతికి చిక్కుతున్న అమాయక ప్రజలను చూసి అది అమితంగా ఆందోళన చెందుతోంది.
  శాంతివనం సుగుణాలను అణువణువూ అధ్యయనం చేస్తున్న బుద్ధిశీలురు అబ్బురపోతున్నారు. దాని పసిడి అందాలకు పరవశులై  ఇక ఆగలేమంటూ తండోపతండాలుగా వచ్చి అందులో చేరుతున్నారు. 

పసిడి పూల పరమార్థం
  దైవప్రవక్తల శాంతివనంలో పూసేవి రజిత పుష్పాలు. అవి పసిడి పూలు కావు. పసిడిపూలకు ఇహలోక ప్రతిరూపాలు. పసిడి పూలది పరిపూర్ణ దివ్యరూపం. రజిత పుష్పానికి మూలం, మాతృకం పసిడి పూవే. పసిడి పూల అందాలు ఎన్నటికీ చెరిగిపోవు. వాటి వాసనలు తరిగిపోవు. వాటికి పుట్టట గిట్టుటలు ఉండవు. నేరుగా విశ్వప్రభువు వాణి నుంచి జాలువారిన పరమ పునీత పారిజాతాలవి. పసిడి పూల పరిమళాలతో శాంతి వనం ఎల్లప్పుడూ చిరునవ్వులను చిందిస్తూ ఉంటుంది. ఆ పసిడి పూలు మరేవో కావు, అంతిమ దైవగ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్‌లోని భావ సౌరభాలు.
  'పసిడి పూలు పరిమళించని నివేశనము శ్మశానమే!' అన్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స). అవును మరి! మన ఇండ్లు పైశాచిక దాడుల నుంచి సురక్షితంగా ఉండాలన్నా, మన మనసుల్లో తిష్ఠవేసి ఉన్న షైతానులను తరిమికొట్టాలన్నా, మన జీవితాల్లో పసిడి పూల పరిమళాలు గుబాళించటం ఒక్కటే మార్గం. శాంతి వన ప్రవేశంతోనే అది సాధ్యం!
  పసిడి పూలను పట్టుకుంటే పరలోక అదృష్టం మన చేతికి అందినట్లే. వాటిని తడిమి చూసుకునే తనువు పులకించిపోతుంది. ఆఘ్రాణించిన మస్తిష్కం ఆనందడోలికల్లో తేలియాడుతుంది. ఇక వాటిని ఆకళింపు చేసుకున్న హృదయం ఆచరణకు నాందివాచకం పలుకుతుంది. కలత చెందే మనసులను పసిడి పూల పరిమళాలు కుదుట పరుస్తాయి. కళావిహీన జీవితాల్లో కొత్త కాంతులను నింపుతాయి. 
ఇస్లాం వనంలో శరణు తీసుకున్న అల్లాహ్‌ా భక్తులు పసిడి పూల పరిమళాలను మనసారా ఆస్వాదిస్తారు. ఆ పువ్వుల్లో నుంచి జాలువారే జ్ఞాన మకరందాన్ని తనివితీరా గ్రోలుతారు. తరిస్తారు. తన్మయులవు తారు. తాదాత్మ్యం చెందుతారు. షైతాను వేసే కపట వేషాలను వీసం వీసం గుర్తిస్తారు. పరలోకంలో స్వర్గ భాగ్యాలను అనుభవించే అదృష్టవంతులైన ఆదం పుత్రులు వీరే సుమా! 

షిర్క్‌' పుట్టు పూర్వోత్తరాలు

'సమస్త వ్యవహారాల్లో సిఫారసు చేసే అధికారం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. ఆయన దగ్గరికే మీరంతా తరలి పోవలసి ఉంది''. (దివ్య ఖుర్‌ఆన్‌ 43,44)
దైవం ఈ జగతిని ఏదో ఆషామాషిగా, అల్లాటప్పాగా సృష్టించలేదు. సృష్టిని దాని మానాన వదిలేయనూ లేదు. సృష్టిరాసుల ద్వారా ఖాళీ స్థలాన్ని నింపడమూ ఆయన ఉద్దేశం కాదు. వాస్తవంగా దేవుడు మానవణ్ణి ఓ గొప్ప లక్ష్యం కోసం, ఓ అత్యున్నత కార్యం కోసం పుట్టించాడు. ఈ కార్యసాధనకు తోడుగా, భూమ్యా కాశాలను, సృష్టి సామ్రాజ్యంలోని ప్రచండ శక్తులన్నింటినీ మనిషి అధీనంలో పెట్టాడు. వీటన్నింటినీ కేవలం ఓ 'అప్పగింత'గా ప్రసాదించాడు. తాను అనుగ్రహించిన ఈ అనన్య వరాలను వాక్కు  రీత్యాగానీ, నమ్మకం రీత్యాగానీ, ఆచరణ రీత్యాగానీ మానవుడు తన మార్గంలోనే వినియోగించాలని అభిలషించాడు దేవుడు. 
  ఆదిలో ప్రజలందరూ ఆత్మ స్వభావానికి, ప్రకృతి ధర్మానికి కట్టుబడి జీవించేవారు. రుజు మార్గాన నడిచేవారు. సర్వలోక ఉపాధి ప్రదాత అయిన, ఆదీ - అంతమూ లేని అద్వితీయుడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే జన స్రవంతిలో విగ్రహారాధన, బహు దాస్యభావన అన్న మహమ్మారి  రోగం సంక్రమించిందో - అప్పుడు అల్లాహ్‌ తన సందేశహరుల్ని పంపి వారిని బహుదైవారాధన నుండి నివారించ మని చెప్పాడు.
  ఆది మానవుడు హజ్రత్‌ ఆదం (అ) గారి మరణానంతరం ఆయనగారి సంతానం 1000 సంవత్సరాల వరకు తమ తండ్రి చూపిన దైవ విధేయతా మార్గానే నడిచింది. ఆపై వారిలో క్రమేణా మార్పు రాసాగింది. దైవాదేశాల పట్ల అశ్రద్ధ, అవిధేయత, వ్యతిరేకత పొడసూపింది. వారు నిజ మార్గాన్ని మరచి మార్గవిహీనులయ్యారు. వారి ఈ అవిధేయతకు గల కారణం ఆ సమాజపు పుణ్యాత్ముల పట్ల వారికి గల వల్లమాలిన అభిమానమే. అప్పటి సంఘ సంస్కర్తల పట్ల వారికున్న మితిమీరిన గౌరవమే. కాదనలేని ఈ నిజాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: ''వారు అల్లాహ్‌ాను (నిజ ఆరాధ్యుడ్ని) వదలి తమ ధర్మవేత్తలు, సాధువులను దేవుళ్ళుగా, ప్రభువులుగా చేసుకున్నారు... ఆయన (అల్లాహ్‌)  తప్ప మరెవరూ ఆరాధనకు, దాస్యానికి అర్హులు కారు. వారు కల్పించుకున్న బహుదైవారాధనా భావాలకు, (దైవం గురించి వారు పలికే వింత విచిత్ర) పలుకులకు ఆయన ఎంతో అతీతుడు, పవిత్రుడు''.  (దివ్య ఖుర్‌ఆన్-9:31)
  మరో చోట మరింత వివరంగా పేర్కొనబడింది: (మిథ్యా దైవాలనే పట్టుకు వ్రేలాడుతూ) వారు పరస్పరం ''మీరు మీ పూజ్య దైవాలను ఎన్నటికీ విడనాడకండి. 'వద్ద్‌'నిగానీ, 'సువా'నిగానీ వదులుకోకూడదు. 'యగూస్‌'ని 'యవూఖ్‌'ని 'నసర్‌'ని కూడా వదులుకోరాదు'' అని చెప్పుకున్నారు.  (దివ్యఖుర్‌ఆన్‌ -71: 23)
  పై ఆయతులో పేర్కొనబడిన ఈ ఐదుగురు వ్యక్తులు గొప్ప పుణ్యాత్ములు. వారు సయితం మంచిని బోధించి చెడుని నివారించినవారే. అయితే వారంతా దురదృష్టవశాత్తు ఒకే నెలలో మరణించారు. అప్పటి ప్రజలు ధర్మం ఎక్కడ అంతరిస్తుందోనని ఆందోళన చెందారు. వారిలో ప్రతి ఒక్కరూ తమ తమ సమావేశాల్లో ఒక్కో వ్యక్తి రూపాన్ని గీసుకొని పెట్టుకున్నారు. ఆ పుణ్యాత్ముల మంచి మాటలు, ఆదర్శాలు వారి చిత్రాలను చూసుకొని నెమరువేసుకోవాలన్న సదుద్దేశ్యంతోనే వారు అలా చేశారు. ఎప్పుడూ వారిని దైవంగా భావించలేదు. వారిలో దైవత్వం ఉందని కూడా వాదించలేదు. కొంత కాలం గడిచింది...ఒక తరం గతించింది. అప్పుడు వచ్చిన న్యూ జనరేషన్‌  తమ పూర్వీకులకన్నా ఎక్కువగా ఆ ఐదుగురిని గౌరవించడం, అభిమానించడం మొదలెట్టారు.  ఆ తర్వాత ఓ సుదీర్ఘ కాలం గడిచింది...  ధర్మవేత్తలు, పండితులు, విద్యావంతులందరూ దాదాపు మృతి చెందారు. ధరిత్రిపై జ్ఞానసంపన్నులు మిగులలేదు. నలువైపులా అజ్ఞానం, అంధకారం రాజ్యమేలసాగింది. సరిగ్గా అప్పుడే షైతాన్‌ ఆయుధాలన్నింటిని సమీకరించుకుని రంగ ప్రవేశం చేశాడు. 
  అయ్యల్లారా! అక్కల్లారా! మహాత్ముల ఈ విగ్రహాలు ఇలానే సరదా కోసం చేయబడ్డాయి అనుకొంటున్నారా? వలదు, వలదు. ఇలా భావించడం తగదు. వాస్తవానికి ఈ పుణ్యపురుషుల అండ దండలు లేనిదే మీరు ఏమీ చేయలేరు. వారి సిఫారసు లేనిదే మీ ఆరాధనలు స్వీకరించబడవు. మీ మొరలు ఆలకించబడవు' అని కల్లిబొల్లి మాటలతో మంత్రించాడు. షైతాన్‌ విసిరిన విష బాణం బాగానే పని చేసింది. తను అల్లిన భావజాలం బాగానే ఆకర్షించింది. చివరికి ప్రజలు కూడా ఇలా చెప్పనారంభించారు:   ''ఆయన్ను (అల్లాహ్‌ను) వదలి ఇతరులను సంరక్షకులుగా, సహాయకులుగా చేసుకున్నవారు (దేవుడు ఒక్కడేనని మాకు తెలుసు) అయితే ఈ మహాత్ములు (విగ్రహాలు, దైవ దూతలు, ప్రవక్తలు, పుణ్యాత్ములు) మమ్మల్ని అల్లాహ్‌ సన్నిధికి చేర్చు తారని, ఆయనకు దగ్గర చేస్తారని మాత్రమే మేము వీరిని ఆరాధిస్తున్నాము''  (దివ్యఖుర్‌ఆన్-39:3) అని అంటారు.
  ''(అలా) వారు అల్లాహ్‌ను వదలి తమకు ఎలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించని మిథ్యా దైవాలను పూజిస్తూ అవి తమను గురించి అల్లాహ్‌ా దగ్గర సిఫారసు చేస్తాయని అంటారు. ఏమిటి, మీరు భూమ్యాకాశాల్లో అల్లాహ్‌ ఎరుగని విషయం గురించి ఆయనకు కొత్తగా తెలుపుతున్నారా? అని అడుగు వారిని''.  (దివ్యఖుర్‌ఆన్-10:18)
  ఇంకా ఇలా అను: ''ఆ నిజ స్వామిని వదలి మీరు ఇతరుల్ని సిఫారసు కర్తలుగా చేసుకున్నారా?'' వారిని అడుగు: ''ఎలాంటి అధికారం లేకపోయినా వారు సిఫారసు చేయగలరా?'' (ఇంకా) ఇలా స్పష్టపర్చు: ''సమస్త వ్యవహారాల్లో సిఫారసు చేసే అధికారం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. ఆయన దగ్గరికే మీరంతా తరలి పోవలసి ఉంది''. (దివ్య ఖుర్‌ఆన్‌ 39: 43,44)
  ఆ విధంగా వారు మార్గభ్రష్టులైపోయిన తర్వాత అల్లాహ్‌ వారి వద్దకు నూహ్‌ ప్రవక్తను పంపాడు. ఆయన తన జాతి ప్రజల దగ్గరకు వెళ్ళి ''నా జాతి ప్రజలారా! నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చినవాణ్ణి. దైవప్రవక్తను. కనుక (నా మాట విని) అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు భయపడండి. నాకు విధేయత చూపండి'' (దివ్యఖుర్‌ఆన్-71: 2,3)అని కోరారు. 
  ఈ విధంగా నూహ్‌ ప్రవక్త దాదాపు 950 ఏండ్లపాటు ప్రజలకు హితబోధ చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. బహుకొద్దిమంది మాత్రమే ఆయన్ను విశ్వసించారు. చివరికి వారు చేసుకున్న పాపాల కారణంగా వారిని జలప్రళయం ద్వారా సర్వనాశనం చేయడం జరిగింది. విశ్వాసులను ఓడలో రక్షించడం జరిగింది. అల్లాహ్‌ మిగిలిన ఆ గుప్పెడు మంది విశ్వాసుల్ని ఆశీర్వదించాడు. వారి సంపదలో, సంతానంలో గొప్ప శుభాల్ని అనుగ్రహించాడు. వారి సంతానం అభివృద్ధి చెంది నేల నలుదిక్కులా విస్తరించింది. వారు వివిధ వర్గాలుగా, తెగలుగా ఏర్పడ్డారు. అలా చాలా కాలంవరకు వారు ఇస్లాం ధర్మంపైనే బ్రతికారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ బహు దైవారాధన అనే విష వైరస్‌ వ్యాపించింది.  

19, మార్చి 2013, మంగళవారం

మన సమస్యలు తీరాలంటే…

మన -మానవ జీవితానికి సంబంధించిన సమస్యలు అనేకం. కూడు, గూడు, గుడ్డ లాంటి మౌలిక సమస్యలతోపాటు విద్యా బుద్ధులు, సంఘం, సంస్కృతి, యుద్ధం, సంధి సమస్యలు; ధన, మాన. పాణ్ర రక్షణకు సంబంధించిన సమస్యలు…ఇలా ఎన్నో సమస్యలతో మనిషి సతమతమవుతున్నాడు. మనిషికి ఎదురయి ఉన్న ఈ సమస్యల పరిధి ఒక్కోసారి వ్యక్తికి పరిమిత మయితే, ఒక్కోసారి కుటుంబానికి, సమాజానికి, దేశానికి విస్తరించి ఉంటాయి. సమస్యలు అవి ఏ రంగంతో ముడి పడి ఉన్నా వాటిని మూడు శీర్షికల్లో విభజించవచ్చు.  1) సిద్ధాంతాలు. 2) సామాజిక సంబంధాలు. 3) చట్టం. మనం, మన నిజదైవాన్ని గహ్రించి, ఆయన ఆదేశాలకనుగుణంగా నడుచుకుంటే ఈ మూడు శీర్షికల్లో విభజితమయి ఉన్న మానవ సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్న పశ్న్రకు సమాధానమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం!
మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు అంతిమ దైవ ప్రవక్త ప్రభవించిన నాటికి లోకంలో అక్కడక్కడా సత్య కాంతి మిణుకుమిణుకుమని కానవచ్చినా అధికాంశం అంధకారమయం.  జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢ నమ్మకాల దొంతరలు, సామాజిక అవగాహ నకు సూత్రం; ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధి కారం” అన్నది. సమాజం తరగతుల్లో విభా జితం: పాలకులు, స్వాములు, నాయకులు. కర్షకులు, దాసులు, బానిసలు, నౌకరులు అధ మాతి అధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష సమాజంలో ప్రధాన పాత్రాధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడా కడపటి స్థానం. ఆ చీకటి ఎడారి లో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపుతున్నాయి. ఆ పుష్పరాజం  నోట వెలవడిన సూత్రం: ”ఖూలూ లాఇలాహ ఇల్లల్లాహ్  తుఫ్‌లిహూ” – మీరు అల్లాహ్  తప్ప ఆరాధ్యులు ఎవరు లేరు అన్న పరమ సత్యాన్ని త్రికరణ శుద్ధితో స్వీకరించండి, ఇహపర సాఫ ల్యాలు మీ చిరునామ తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతాయి. మీ సకల సమస్య లు తీరతాయి. ఏ సద్వచన కారణంగా సకల సమస్యలు తీరతాయని ప్రవక్త (స) జమానతు ఇచ్చారో ఆ సద్వచనం గురించి సర్వేశ్వరు డయిన  అల్లాహ్  ఇలా సెలవిస్తున్నాడు: ”అల్లాహ్  తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో”.
ఏమిటి, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అని నోటితో ఉచ్చరించడం వల్ల, మనసుతో అంగీకరించ డం వల్ల, అది విధించే పరిధులకు లోబడి జీవించడం వల్ల మానవ – మన సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్న తదితర విష యాలను తెలుసుకుందాం!
1) సిద్ధాంతాలు: మనిషి పుట్టగానే ఒక ప్రత్యేక వాతావరణాన్ని గమనిస్తాడు. ఇక్కడ సూర్య   చంద్రాదుల ఉదయం, అస్తమయం జరుతున్న ది. పగలు వస్తుంది, రేయి పోతుంది. నింగిలో ని తారకలు తళుక్కునమెరుస్తాయి, పుసుక్కున మాయమైపోతాయి. నేల సస్యశ్యామలంగా కళకళలాడుతుంది.  ఎండి వెలవెలబోతుంది. నీరు యేరయి గలగల పారుతుంది, ఎండి పోతుంది కూడా. సృష్టిలో నిరంతరం జరిగే ఈ మార్పులు ఇట్టే దాటి పోవు.మనిషి దేహం పైనే కాకుండా ఆత్మపైనా, ఆలోచనపైన సయి తం ప్రభావం చూపుతాయి. ఉదయం ఉపాధి ఆధారమయితే, రాత్రి విశ్రాంతికి మూలం. మనిషి చుట్టూ జరిగే ఈ మార్పులు అతనికి సంతోషాన్ని, సుఖాన్నీ ఇస్తాయి. దుఃఖానికి, కష్టానికీ గురి చేస్తాయి. వీటి ద్వారా మనిషి ఆరోగ్యాన్ని పొందుతాడు, అనారోగ్యం పాలూ అవుతాడు. ఒక్కోసారి అతనికనిపిస్తుంది – తన ఆదేశం, అధికారం, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు – చివరికి తన దేహం మీద సయితం లేదు అని. ఈ భావన కలగగానే ప్రపంచంలో తనకి లాభనష్టాన్ని కలుగజేసే  ప్రతి వస్తువు అతన్ని భయపెట్ట సాగింది. ఫలితంగా మనిషి అవనిని పూజించడం ప్రారంభిం చాడు, అందులో ఎనలేని నిధులూ నిక్షేపాలు ఉన్నాయని. ఆకాశాన్ని దేవతగా భావించాడు, అది వరాల జల్లు కురిపిస్తుందని. పర్వతాల ముందు తల వంచాడు, అవి తనకన్నా ఎంతో ఎత్తయిన వనీ. సముద్రాలంటే ఆపాద మస్తకం వణకిపోయాడు, దాని పొగరుమోతు (సునామీ లాంటి) కెరటాలు తనను నాశనం చెస్తాయోమోననీ. ఇలా అండం మొదలు బ్రంహ్మాండం వరకు – అన్నింటి ని పూజించడం, గులామ్‌గిరీ చేయనారంభించాడు. దేవుడున్నాడని నమ్ముతూనే పుణ్య పురుషుల ను, సంఘసంస్కర్తలను దైవానికి సాటి చేసి కొలవనారంభించాడు. మనిషిగా పుట్టించి సృష్టిరాసు ల్లోనే శ్రేష్ఠ స్థానాన్ని దేవుడు తనకిస్తే, తన అసమర్థతతో అధఃపాతాళానికి దిగజారాడు మనిషి. ఈ యదార్థాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా అభివర్ణిస్తుంది:
”నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమయిన ఆకృతిలో సృజించాము. అటుపిమ్మట అతన్ని (అతని నిర్వాకాలకు బదులుగా) అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము”. (అత్తీన్‌: 4,5)
అతనిలో చోటు చేసుకున్న భయాలన్నీ అతను మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే ఒక్క సత్యంతో పటాపంచలు కాగలవు. కానీ, అతను ఆ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే, ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నది ఒకే ఒక్క సృష్టికర్త అని, విశ్వం మొత్తం ఆ నిజ స్వామికే తలొగ్గి మనుగడ కొనసాగిస్తుందని తెలుసుకునేవాడు. ఆ ఒక్క నిజ అధికారికి మాత్రమే భయ పడేవాడు. ఆ సత్య ప్రభువు పట్ల వాస్తవమయిన భక్తి అతన్ని సకల భయాల నుండి ముక్తి కలిగిం చేది. ఆ కృపాసాగరుని దాస్యం సకల దాస్య శృంఖలాలను త్రెంచేసేది. జ్ఞానోదయం కలిగిన అతను గొంతెత్తి ఇలా చాటేవాడు: నేను నింగిలో మెరిసే తారకల్ని చూశాను. అవి కొంత కాలం ఉంటాయి తర్వాత నిష్క్రమిస్తాయి. నేను పండు వెన్నెల్ని పంచే ప్రకాశమనయిన చంద్రుణ్ణి చూశాను. అదీ కనుమరుగవుతుంది. నేను బ్రహ్మాండంగా వెలిగిపోతున్న సూర్యున్ని చూశాను, అదీ ఓ సమయం తర్వాత అస్తమిస్తుంది. ఇలా ఒక సమయం నుండి మరో సమయం వరకూ వచ్చీపో యేవేవి దైవం కాలేవు, వాటిని నియామనుగుణంగా నడిపిస్తున్న ఆ సర్వశక్తిమంతుడే  నా ఉపా సనారీతులన్నింటికీ అర్హుడు.
”నిశ్చయంగా నేను భూమి, ఆకాశాలను పుట్టించివాని వైపునకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పు కుంటున్నాను. నేను బహుదైవరాధకుల్లోని వాడను కాను”. (అన్‌ఆమ్‌: 79)
అంటే, మనిషిలోని మతపరమయిన, విశ్వాసపరమయిన భ్రమ, భ్రాంతులన్నింటినీ ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అల్లాహ్  తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు – అన్న సద్వచనం తొలగించి, అత నికి క్రాంత దృష్టిని, శాంత స్వభావాన్ని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మతపరమయిన సకల రుగ్మతలకు, దురాచారాలకు, నూతన పోకడలకు విరుగుడు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’!
ఇదో మానవ జీవితానికి సంబంధించిన కోణమయితే, మరో కోణంలో మనిషి సృష్టిలో జరిగే ఈ మార్పుల గురించి తెలుసుకున్నాడు. ఏదో అదృశ్య శక్తి ఆదేశం మేరకు నిప్పు మండుతుందని, నీరు ప్రవహిస్తుందనీ, నేల ధాన్యం పండిస్తుందనీ,, సుభిక్షమయినా, దుర్భిక్షమయినా, కలిమి అయినా, లేమి అయినా, జననం అయినా, మరణం అయినా ప్రతిదీ ఆ అదృశ్య శక్తి ఆజ్ఞకే కట్టు బడి ఉన్నాయని గ్రహించాడు. మనిషిలో పరిశోధించాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది,  అతని అన్వేషణ మొదలయింది.  ఆ శక్తి ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని పరితపించాడు. ఆ శక్తిని తాను చూడలేడుగాని  ఆ విశ్వకర్త శక్తి సంబంధించిన నిదర్శనాలు అడుగడుగునా దర్శ నమిస్తున్నాయి.  మనిషి తనకున్న పరిమిత జ్ఞానంతోనే తర్కించడం మొదలెట్టాడు – నా కళ్లకు కనబడని, నా వీనులకు వినబడని, నా పంచేంద్రియాల పరిధిలోకి రాని ఒక వస్తువును నేనెందు కు నమ్మాలి. పురోగమానికి బదులు తిరోగమం చోటు చేసుకుంది. ఈ విశ్వంలో ఎవరి పరిపా లన సాగుతుందో తెలియనప్పుడు ఆ శక్తిని అంగీకరించి ప్రయోజనం ఏమిటి? అతను గ్రహిం చాడు; విశ్వంలో కొన్ని సాధనాలు కలిసినప్పుడు కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయి. నిప్పు కాల్చుతుంది. నీరు వల్ల మొక్కల్లో ప్రాణం వస్తుంది. విషం మనిషిని చంపుతుంది. అమృతం మనిషిని బ్రతికిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అతనో నిర్ణయానికి వచ్చాడు. తాను ఒక ప్రత్యేక వాతావరణంలో జీవిస్తున్నాడు. ఇక్కడ అతనికి ప్రతికూలంగా, అనుకూలంగా కొన్ని శక్తులు బలంగా పని చేస్తున్నాయి. అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ అనుకూల శక్తుల వల్ల ప్రయోజనం పొందడం ఎలా? ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవడం ఎలా? అన్నదే అతని ఆలోచన, అన్వేషణకు అంతిమ గమ్యంగా నిలిచింది. తాను జరిపిన పరిశోధనా మత్తులో అతను ఆ విశ్వకర్తనే నిందించాడు. ఆయనకే పోలికలు కల్పించే దుస్సాహసం చేశాడు. ఇదే విషయాన్ని సర్వేశ్వరుడయిన అల్లాహ్‌ా ఇలా తెలియజేస్తున్నాడు: ”వాడు మమ్మల్ని (ఇతరులతో) పోల్చాడు. కానీ (మరోవైపు) తన పుట్టుకనే మరచి పోయాడు. ‘కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు (రా) బ్రతికిస్తాడు?’ అని (మాకే) సవాలు విసురుతున్నాడు. (ఇలా) చెప్పు: ‘వాటిని తొలిసారి సృష్టించినవాడే (మలిసారి) కూడా బ్రతికిస్తాడు”. (యాసీన్‌: 78,79)   తన పుట్టుక ఎందు నిమిత్తం జరిగింది? తనెందుకు ఈ లోకంలో ఉన్నాడు? జీవిత గడువు ముగిశాక చచ్చి తాను ఎక్కడి వెళ తాడు? తాను చేసుకున్న పాపపుణ్యాల పర్య వసానం ఏమిటి? నిరాఘాటంగా, నిర్విఘ్నం గా, నిరంతరాయంగా ఓ కట్టుదిట్టమయిన నియమానికి లోబడి నడుస్తున్న ఈ విశ్వ వ్యవస్థ చివరికి ఏమవుతుంది? వీటి గురించి అతను అస్సలు ఆలోచించ లేదు. ఫలితం – నిజ దైవ జ్ఞానం లేని భక్తి మానవ సమాజం పాలిట ప్రమాదంగా మారినట్టే, వాస్తవదైవం పట్ల భక్తి లేని విజ్ఞానం వినాశకాలకు కారణ భూతమయింది.  అదే అతను ఈ సృష్టికి కర్త ఉన్నాడు, అతను ఒక్కడే అన్న యదార్థా న్ని అంగీకరించి ఉంటే నేడు అతను వైజ్ఞాని కంగా గొప్ప విజయాల్ని సాధించి కూడా పరిష్కరించుకోలేకపోతున్న అనేకానేక సమ స్యలు ఇట్టే సులభంగా పరిష్కారం అయ్యేవి.  అంటే దైవాన్ని విశ్వసించడంతోపాటు అనేక శక్తుల్లో విశ్వాసం గలవారు, విగ్రహారాధ కులు సృష్టి పూజారులు ‘లా ఇలాహ’అంటూ సృష్టికర్త వ్యవహారంలో సృష్టిరాసుల జోక్యాన్ని నిరాకరించాలి. ఈ సృష్టికి కర్త అనేవాడే లేడు, ఉన్నా ఆతన్ని నమ్మడం వల్ల ప్రయోజ నం లేదు అని అనుకునేవారు ‘ఇల్లల్లాహ్ ’ ఒక్క అల్లాహ్  మాత్రమే ఈ సృష్టి మొత్తాన్ని నియమబద్ధంగా నడుపుతున్నాడన్న యదార్థా న్ని అంగీకరించాలి. ‘లా ఇలాహ’ అన్న అనంగీకారం, ‘ఇల్లల్లాహ్ ’ అన్న అంగీకారం తో మానవాళి సైద్ధాంతిక పరమయిన, మత పరమయిన దొంతరలు, ద్వంద ప్రమా ణాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదే నేప థ్యంలో దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) మాన వాళిని ‘ఖూలూ లా ఇలాహ ఇల్లల్లాహ్  తుఫ్లిహూ’ అని ఘంటాపథంగా పిలుపుని చ్చారు.
లా ఇలాహ ఇల్లల్లాహ్  అని
పలుకరండి ఓ ప్రజలారా!
(మానవులందరిని దేవుడు ఒకే జాతిగా అభి వర్ణించినప్పుడు మనుషుల మధ్య ఈ భేదభా వాలు, వర్గాలు, వర్ణాలు, కులాలు, అంట రానితనాలు, అస్పృశ్యతలు ఎందుకున్నట్టు? ఈ సామాజిక అసమానతకు అసలు కారణం ఏమిటి? ఇవి ఇటువంటి ఇతర అనేక ప్రశ్న లకు జవాబు కావాలంటే  కాస్త  వేయిట్‌ చేయాల్సిందే!)
మన సమస్యలు తీరాలంటే…. 2
  ఓ ప్రజలారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గల వాడే అల్లాహ్  సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్  అన్నీ తెలిసినవాడు, అప్ర మత్తుడు. (దివ్యఖురాన్ – 49: 13)
ఈ వచనంలో దేవుడు మానవులంతా ఒక్కటే అనే సమగ్ర భావనను బోధిస్తున్నాడు.అయినా, వారిని పరస్పర ఘర్షణకు, పోరుకు పురికొలిపే విషయ మేమిటి? సమాధానమొక్కటే, దేవుడు మనిషికి బోధించిన విశాల దృక్పథాన్ని వదలి తన చుట్టు చిన్న చిన్న గీతలు గీసుకుని ఆ గీతల పరిధిలో ఉన్న వాళ్ళనే తన వాళ్ళుగా భావించసాగాడు.  ఈ భావన ఒక్కోసారి వంశం వరకు, ఒక్కోమారు భాష వరకు, ఒక్కోసారి జాతి వరకు వెళ్ళేది. అంతకు మించిన విశాలత దానికి లేదు. ఆ విధంగా పరిమిత స్థాయిలో – వంశం, భాష, జాతి మనుషులను సమైక్య పరచినప్పటికీ మాన వుని అవసరాలు, ప్రయోజనాలు బహు దూరాల వరకు వ్యాపించి ఉన్నాయి.  ప్రపంచమే ఒక గదిగా మారిపోయిన నేటి తరుణంలో ఈ ఎల్లలు ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది. మా జాతే గొప్ప జాతి అని ఒక జాతీయ నాయకుడు, అంత ర్జాతీయ స్థాయికి చెందిన వ్యక్తి చెబుతున్నాడంటే, ఇతరుల్ని అతను ఏ దృష్టితో చూస్తున్నాడో ఇట్టే అర్థమయిపోతుంది.
ఈ భావన కారణంగా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి జాతి భక్తిప్రపత్తుల, ప్రేమాభిమానాల పరిధి, మూర్తి వేర్వేరుగా ఉంటుంది. వారు తమ పరిధిని సమర్థించుకోవటానికి ఇతరుల్ని నిందిస్తారు, ఖండిస్తారు, కించ పరుస్తారు, అవసమైతే నిర్బం ధిస్తారు, బహిహ్కరిస్తారు, మరీ అవసరమను కుంటే తుదముట్టించేందుకు సయితం వెను కాడరు. ఆసియాకు చెందిన వాడు యూరప్‌ పట్ల వైషమ్యం ఏర్పరచుకుంటాడు. ఓ దేశంలో మరో దేశానికి స్థానం లేదు. ఒక ప్రాంతానికి మరో  ప్రాంతం అంటే గిట్టదు.
 వర్గం, వర్ణం, జాతి, ప్రాంతం, రంగు మొౖదల యిన ఈ వ్యత్యాసాలన్నింటికి పరిష్కారంగా విశ్వ మానవ సోదర భావం ముందుకొస్తుంది. అంటే జాతులన్నీ తమ సమిష్టి ప్రయోజనాల కొరకు పాక్షికాలను ప్రక్కన పెట్టి సమైక్యమయి పోవాలి. వాటి సాధనకు కృషి చేయాలి. తాము ప్రశాంతం గా జీవించాలి. ఇతరుల్ని ప్రశాంతంగా జీవించ నివ్వాలి. అయితే మనిషి ఏర్పరచుకున్న క్రియా జీవితం దీన్ని సమర్థించదు. మనిషి ప్రయోజనా లు అతని సిద్ధాంతాలకు లోబడి ఉంటాయి. మనిషి, యుద్ధం, సంధి, స్నేహం, శత్రుత్వం అన్నీ వ్యవహారాలు సిద్ధాంతాల ఆధారంగానే నెరుపు తాడు. సిద్ధాంతాల్లో వైవిధ్యం ఉంటే ప్రయోజ నాల్లో సమైక్యత సాధ్యం కాదు.  కమ్యూనిజాన్ని నమ్మేవాడు పెట్టుబడి దారీతో సంధి ఒడంబడిక చేయడు. జాతి తత్వంలో నమ్మకమున్నవాడు విరోధ జాతి ప్రగతిని సహించడు. సుదీర్ఘ మానవ చరిత్ర ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఈ భిన్నత్వం వల్ల మానవుల్లో సదా వివాదాలు, పోరాటాలే సాగాయి. అలాంటప్పుడు అదే వారి మధ్య ప్రేమానురాగాలకు మార్గం కావడం అసంభవం.
ఇక ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అన్న భావన పై వచ నంలా మానవులంతా ఒక్కటే అని నిర్ణయిస్తుంది. అది మానవులందరికీ ఒకే ఆశయాన్నీ నిర్ధారిస్తుం ది.  మానవులందరి కర్త, స్వామి, ఆరాధ్యుడు, పూజ్యనీయుడు ఒక్కడే అంటుంది. ఆయన భార తీయునికి వేరుగా, చైనీయునికి వేరుగా, రష్యన్‌కు వేరుగా, ఆమెరికన్లకు వేరుగా లక్ష్యాలు నిర్ణయించ లేదు అంటుంది. మానవుని సృష్టికర్త, భువిపై  నివసించే ప్రతి వ్యక్తి, ప్రతి వర్గాన్ని తన దాస్యం చేయమని కోరాడు. ఈ నిమిత్తమే ఆయన ప్రవ క్తల్ని ప్రభవింపజేశాడు. గ్రంథాల్ని అవతరింపజే శాడు. వారందరూ ప్రతిపాదించిన విషయం, మనమంతా ఒక్కటే అన్నది ఒకటయితే, ‘మనం దరి దైవం ఒక్కడే’ అన్నది మరోకటి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనల లోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి”.
 (అర్రూమ్‌: 22)
”ఒక అరబ్బుకి అరబ్బేతరునిపైగానీ, ఒక నల్ల వాడికి తెల్లవాడిపైగానీ ఎటువంటి ఆధిక్యతా లేదు; దైవభీతితో తప్ప. మీరందరూ ఆదం సంతానమే. ఆదమ్‌ను దేవుడు మట్టితో పుట్టిం చాడు” అని దైవప్రవక్త (స) అంతిమ హజ్జ్‌ సందర్భంగా ప్రకటించారు.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’కు ఇంతటి మహత్తర శక్తి ఉందా? అంటే దానికి ప్రబల నిదర్శనం నమాజే.
ఇకపోతే, ఈ సద్వచన భావమేమంటే, ‘అల్లాహ్  తప్ప వేరే ఏ ఇతర ఆరాధ్య దైవం లేదు’.కలిమా లో ఏముంది? కొన్ని అక్షరాలు మాత్రమే కదా! ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ ఈ అక్షరాలను కలిపి ఉచ్చరిస్తే ఎమయినా మాయ జరుగుతుందా? మనిషి స్థితిగతులే మారిపోవడానికి? తాము చదివే మంత్రానికి భావమేమిటో తెలియకపో యినా, మంత్రం పఠించగానే కొండలు కంపిస్తా యనీ, భూమి బ్రద్ధలవుతుందనీ, సముద్రాలు ఉప్పొంగుతాయని కొందరయితే భావించగలరు. ఎందుకంటే, పవర్‌ అంతా అక్షరాల్లోనే ఉందని, అవి నోటి నుండి వెలువడగానే మాయా ద్వారా లు తెరుచుకుంటాయని వారి విశ్వాసం. కాని ఇక్కడ అలా కాదు. ఇక్కడ అర్థానికి, అంతరాత్మ కు, ఆచరణకే ప్రాధాన్యత. చలి వేసిన వ్యక్తి ‘కంబళి, కంబళి’ ‘దూది పరుపు, దూది పరుపు’ అంటూ కూర్చుంటే ఎలాగయితే చలి బాధ తగ్గదో, సద్వచన విషయంలోనూ అంతే. మనిషి భావాలపై, ఆచరణలపై, తీర్పులపై ఈ సద్వచన ఆధిపత్యం చోటు చేసుకున్నప్పుడే లోక కళ్యాణం సాధ్యం. ఈ సద్వచనాన్ని మనస్ఫూర్తిగా నమ్నిన వ్యక్తి నోట సదా ఈ మాట ఉంటుంది:
”ఆయనే నన్ను సృష్టించినవాడు. మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు మరియు  త్రాపిస్తున్నాడు. నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు. ఆయనే నన్ను చంపుతాడు. మళ్ళి తిరిగి బ్రతికిస్తాడు. ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకు ఉంది”. (అష్‌ షుఅరా: 78-82)
ఈ భావన మానవుల మధ్య కుల, వర్ణ, వర్గ, భాష, జాతి దురభిమానాలను అంతమొంది స్తుంది. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ను త్రికరణ శుద్ధి తో విశ్వసించిన తర్వాత మనిషిలో బూటకపు కీర్తిప్రతిష్టల భేదభావాలు తలెత్తవు. ఒకే దేవుని దాసులం అన్న అత్యుత్తమ భావన, యజమాని- కార్మికులను, పాలితుల-పాలకులను, రాజు-పేద ను ఒకే వరుసలో నిష్ఠగా నిలబడేలా తీర్చిదిద్దు తుంది. మానవులందరినీ సోదరులుగా ఎంచే ఏ సిద్ధాంతమూ ఇస్లాంను మినహా లేదు. అందు వల్లనే ఇస్లాం వైపునకు దృష్టి మరలినప్పుడు మరో వైపు చూసే అవసరం ఏర్పడు. (సశేషం)