15, ఆగస్టు 2013, గురువారం

కర్తవ్యం పిలుస్తోంది... కదలి రండి!

       సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ 
   
కూపస్థ మండూకాల్లా పడివున్న ఇస్రాయీల్‌ సంతతి ప్రజలు ప్రవక్త మూసా (అ) పిలుపుతో భావ దారిద్య్రం నుండి తేరుకొని స్వేచ్ఛా   ప్రపంచంలోకి  ప్రవేశించారు. అప్పటికే  వారిపై   ఎన్నో ఆంక్షలు ఉండేవి. 70 వేల పసికందుల్ని కోల్పోవాల్సి వచ్చిన నికృష్ట సందర్భం కూడా అదే. అయినా వారు అధైర్య పడలేదు. కరుణ ఆభరణాల్లో సంకల్పాల  వజ్రాలు పొదిగి, కూర్మి కవచాలు తొడిగి సమర  క్షేత్రంలో సమరస స్ఫూర్తితో దూసుకుపోయారు. స్రీలు సయితం సమాజంలోని సగ భాగం గనుక కర్తవ్య పరాయణత పారీణతతో ప్రతి ఒక్క పడతిలో చైతన్యం పెల్లుబికింది. జాతి విముక్తి కోసం పోరాటపటిమను కొన సాగించమని కొండంత ధైర్యాన్నిచ్చి సాగ నంపారు అలనాటి వీర నారీమణులు.
  
మానవ పురోగమన పోరాటం అనేక రూపాల ఆధారంగా జరిగింది. అజ్ఞానం నుండి, భయం నుండి, దోపిడి నుండి,  పెత్తనం నుండి, నియంతృత్వ భావన నుండి, బానిసత్వం నుండి, అణచివేత నుండి విముక్తి నొందడానికి కృషి చేస్తూనే ఉన్నాడు మనిషి. ఈ కార్య సాధన కోసం అసాధారణ త్యాగాలు చేస్తూ వచ్చాడు మనిషి. విశ్వంలోని జనవాహిని సమానంగా గౌరవించబడాలని, ఆదరించబడాలని అభిలషించారు మానవోత్తములు కొందరు. ఆ విధంగా లోకవాసులంతా సమరస భావంతో విరాజిల్లాలని, వారిలో సోదర భావం వెల్లి   విరియాలని ఆకాంక్షించారు ఆ పురుషోత్తములు.

  ఈ ఆశయ సిద్ధి కొరకు పురుషులతోపాటు అపూర్వ త్యాగాలు చేసిన ఆడపడుచులు సయితం అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారిలో కొందరు ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక పరమైన త్యాగాలకు పేరెన్నికగంటే మరి కొందరు కార్య దీక్షకు, పశ్రాంత చిత్తానికి పత్రీకలయ్యారు.  కొందరు అసమాన నాయకత్వ లక్షణాలలో పస్రిద్ధి పొందగా, ఇంకా కొందరు కమ్రశిక్షణకు, ధైర్యసాహసాలకు మచ్చుతునకలయ్యారు.
  ఈజిప్టులో ప్రవక్త మూసా (అ) ఫిరౌన్‌ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చినప్పుడు గాని, పాలస్తీనాలో ప్రవక్త ఈసా (అ) అంధానుసరణకు వ్యతిరేకంగా గళం విప్పినప్పుడు గాని, అరేబియాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) విశ్వ మానవ సోదరభావంతో కూడిన సత్య శంఖాన్ని పూరించినప్పుడుగాని పురుషులతోపాటు స్త్రీలు సయితం    సహజంగానే స్పందించారు. తమవంతు సహాయం అందించారు. నిరుపమాన త్యాగాలూ చేశారు. పురుషుల్లాగే స్త్రీలూ అమరగతి నొందారు. సంఘ బహిష్క రణకు, ఏలికల వైషమ్యానికి బలయ్యారు. ఇలా తమ ధన, మాన, ప్రాణ త్యాగాలతో లోకశాంతి సిద్ధిస్తుందని పురుషులు మాదిరి వారూ కలలు కన్నారు. ఆ కలల్ని నిజం  చేసే దిశలో పయనించి పరమోన్నత ప్రభువు సన్నిధికి పయన మయిన పడతులెందరో!  లోకశాంతికి సంబంధించిన గురుతర బాధ్యతలను స్వీకరించడానికి వారు ఏనాడూ వెనుకాడి ఎరుగరు. సమరస భావం సమానత్వం, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కరుణ, దయ, జాలి, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం - తౌహీద్‌ ప్రాతిపదికలపై ఆధునిక సత్సమాజాన్ని నిర్మించాలనే తపనలో అలనాటి సుమతులు, సదయులు అహరహం శ్రమించారు. విశ్వ మానవ కళ్యాణం నిమిత్తం అంటే- వర్గ, వర్ణ, ప్రాంత, భాష, జాతి తర తమ భేదరహిత సమరస సమాజాన్ని వారు ఆకాంక్షించారు. ఈ మహోన్నత లక్ష్య పునాదులు నూహ్‌ా ప్రవక్త నాటి నుండే పాదులు వేసుకున్నాయన్నది గమనార్హం.
  కూపస్థ మండూకాల్లా పడివున్న ఇస్రాయీల్‌ సంతతి ప్రజలు ప్రవక్త మూసా (అ) పిలుపుతో భావ దారిద్య్రం నుండి తేరుకొని స్వేచ్ఛా   ప్రపంచంలోకి  ప్రవేశించారు. అప్పటికే  వారిపై   ఎన్నో ఆంక్షలు ఉండేవి. 70 వేల పసికందుల్ని కోల్పోవాల్సి వచ్చిన నికృష్ట సందర్భం కూడా అదే. అయినా వారు అధైర్య పడలేదు. కరుణ ఆభరణాల్లో సంకల్పాల  వజ్రాలు పొదిగి, కూర్మి కవచాలు తొడిగి సమర  క్షేత్రంలో సమరస స్ఫూర్తితో దూసుకుపోయారు. స్రీలు సయితం సమాజంలోని సగ భాగం గనుక కర్తవ్య పరాయణత పారీణతతో ప్రతి ఒక్క పడతిలో చైతన్యం పెల్లుబికింది. జాతి విముక్తి కోసం పోరాటపటిమను కొన సాగించమని కొండంత ధైర్యాన్నిచ్చి సాగ నంపారు అలనాటి వీర నారీమణులు.

  అప్పట్లో త్యాగాలు చేసిన మహిళా లోకంలో ఆసియా బిన్తె ముజాహిమ్‌కు గొప్ప ఖ్యాతియే లభించింది. అప్పటి నిరంకుశ చక్రవర్తి ఫిరౌన్‌కు స్వయాన భార్యగా, ఈజిప్టు దేశానికే మహారాణిగా సకల భోగభాగ్యాలు అనుభవించే వీలు ఉన్నప్పటికీ ఆమె వాటిని ఖాతరు చేయలేదు. తన చేతుల మీదుగా, తన ఒడిలోనే పెరిగి పెద్దయిన మూసా ప్రవక్త సత్య పిలుపుని విని ఉత్తేజితురాలై తన సువర్ణ సౌధాన్ని, అందలి పసిడి ఆభర ణాల్ని, వజ్ర వైఢూర్యాలు నిండిన జీవితాన్ని సన్యసించి సత్య పక్షం వహిం చింది. సత్య ధర్మ పరివ్యాప్తికి స్వయంగా ఫిరౌన్‌ రాజ భవనంలోనే పాదులు వేసి, అసత్య నిర్మూలనకై అవిరళ కృషి సలిపి త్యాగ ధనురాలయింది. పర్యవసానం చాలా భయంకరంగానే పరిణమించింది. సత్యాన్ని విడనాడమని షైతాన్‌ స్వభావుడు ఫిరౌన్‌ ఎంత ఒత్తిడి చేసినా, చివరికి సజీవంగానే శిలువపై వ్రేలాడదీసి అవయవాల్ని ఒక్కొక్కటిగా కోసినా, గుండెల్లో గునపాలు గుచ్చినా , తలలో మేకులు కొట్టినా తొణకక, పట్టు సడలని విశ్వాసంతో ధర్మోన్నతి కోసం 'రబ్బిజ్‌అల్లీ ఇన్‌దక బైతన్‌ ఫిల్‌ జన్నహ్‌' (ప్రభూ! స్వర్గంలో నా   కోసం  నీ  తరఫున  ఒక  నిలయాన్ని నిర్మించు) అంటూ తుది శ్వాస విడిచింది. ఆ విధంగా అలనాటి అనువంశిక దౌర్జన్యంపై తన చెర్నాంకోలును ఝుళిపించింది.   అలా అనితర సాధ్య ధైర్యసాహసాల్ని, మొక్క వోని సహనాన్ని పదర్శించిన ఆ మహిళా మూర్తిని సత్య దేవుడైన అల్లాహ్‌ ప్రశంసిస్తూ మానవ జాతి మనుగడకు మణి కుసుమంగా  పేర్కొన్నాడు:

  ''మరి అల్లాహ్‌ా విశ్వాసుల కొరకు ఫిరౌను భార్యను ఆదర్శంగా పేర్కొంటు న్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది: 'నా ప్రభూ! నా కోసం నీ దగ్గర - స్వర్గంలో - ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని దాష్టికా న్నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు''.  (తహ్రీమ్: 11)

 అదే రాజ మహలులోని పని మనిషి కూడా తక్కువేమీ కాదు. ఫిరౌన్‌ రాజ భవనంలో స్వయాన అతని ముద్దుల కూతురికి సేవకురాలిగా పని చేసే విశ్వాస మహిళ ఆమె. స్వేచ్ఛా పిపాసతో రగిలిపోయిన, సత్య జ్యోతి ప్రభావంతో వెలిగిపోయిన అబలగా భావించబడే సబల ఆ స్త్రీ మూర్తి.  'అన రబ్బుకు ముల్‌ ఆలా' అన్న ఫిరౌన్‌ దురహంకార గర్జనతో స్తబ్ధత ఆవరించిన ఆ సమాజంలో సత్యాగ్ని కణాన్ని రాజేసిన  ఆ మాతృమూర్తి విశ్వాసం శక్తివంత మైనది. అసలే బానిసరాలు.  ఆపై అబలయి కూడా ఆమె ప్రదర్శించిన సాహసం, సమయస్ఫూర్తి సాటి లేనిది. ఫిరౌన్‌ రాజభవనంలో  సత్య శంఖం పూరించింది. ఆమె సత్య ప్రచార శైలికి ముగ్దురాలయి 'ఆసియా బిన్తె ముజా హిమ్‌' ఇస్లాం స్వీకరించింది. ఇది తెలుసుకున్న ఫిరౌన్‌ ఆమె నలుగురు బిడ్డల్ని సలసలకాగే నూనెలో పడేసి వేయించేశాడు. ఆ నలుగురిలో ఒకడు పాలు త్రాగే పసికందు కూడా ఉన్నాడు.

   అయినా ఆమె తొణకలేదు సరికదా ''నన్ను సయితం ఈ నూనెకి ఆహుతి చేశాక మా అందరి ఎముకల్ని ఒకే చోట సమాధి చెయ్యండి. రేపు ప్రళయ దినాన  'లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా' సద్వచనం పలుకుతూ మేమంతా సమాధి నుండి లేస్తాము' అని ఘంటాపథంగా ప్రకటిం చింది. ఆమె చూపిన ధైర్యసాహసాల్ని మెచ్చుకుంటూ మేరాజ్‌ సందర్భంగా ఏడు ఆకాశాలపైన దైవ దూతల నాయకుడు జిబ్రయీల్‌ ద్వారా ప్రవక్తలందరి నాయకుడైన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి ఆమె దృష్టాం తాన్ని విన్పించాడు దేవుడు. అట్టి 'సత్య బాంధవి' అయిన ఆ వీర వనిత చరిత్రలో చిరస్మరణీయురాలయింది.

  ఆ పరంపరలో పరమ పవిత్రమైన పుణ్యస్త్రీ అయిన  జైనబ్‌ (ర)నూ విస్మరిం చలేము. ఆమె మహా నిరాడంబర జీవి. సిగ్గు సిరులే ఆమె ఆభరణాలు. నిస్వార్థ సేవే ఆమె స్వరూపం. సాత్విక ప్రేమానురాగాలే ఆమె నైజం. అనాథ బాలలు, వితంతువులు, నిరుపేదలు అభాగ్యజీవులే ఆమె అనుఁగు సంతానం. ప్రజా సేవే ఆమె ఊపిరి. సంస్కరణా    భిలాషే ఆమె మూల ధనం. సత్య ధర్మోన్నతియే ఆమె ప్రాణం. ఆ సత్య వ్యవస్థపై ఆమెకు ఎనలేని అభిమానం. మక్కా మదీనాల్లోని నిరుపేదలతోనే గడిపేది. దీన జనంపై తప్ప మరి దేని పైనా ఆమెకు మమకారం లేదు. వారి  క్షేమం కోసమే అహరహం శ్రమించేది. వారి ధ్యాసలోనే ఆమె అసువులు బాసింది. ఇటు ప్రజా సేవ, అటు దైవ సేవలో సమతౌల్యంతో జీవితాన్ని సార్థకం చేసుకుని 'ఉమ్ముల్‌ మసాకీన్‌' అన్న ప్రశంస స్వయానా ప్రవక్త (స) నోట పొందిన ధన్యజీవి విశ్వాసుల మాత హజ్రత్‌ జైనబ్‌ (ర).

  ఆ విషయానికొస్తే - సత్యోద్యమంలో, విద్యార్జనలో, ప్రవక్త (స) వారి ప్రవచ నాల్ని ప్రజలకు ప్రబోధించడంలో హజ్రత్‌ ఆయిషా (ర) మహా ధీరోదాత్త. దాదాపు ''2210'' హదీసలను ఉల్లేఖించిన ఘనత స్త్రీలలో ఆమె ఒక్కరికే దక్కింది. ప్రవక్త (స) వారి సత్య సూక్తులకు, పరలోక మోక్ష సిద్ధాంతాలకు ప్రభావితురాలయిన ఆమె తర్వాతి కాలంలో 'జమల్‌ రణ రంగం'లో పాల్గొన్నారు. అప్పట్లో  ధార్మిక  ఫత్వాలు జారీ చేసిన ధర్మ పండితురాలు. అనేక మంది సహాబాలు ఆమె వద్ద శిష్యరికం పొంది ధార్మిక విద్యార్జన చేసేవారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ పరంపరలో హజ్రత్‌ మర్యమ్‌ (అ), హజ్రత్‌ ఖదీజా (ర), హజ్రత్‌ ఫాతిమా (ర), హజ్రత్‌ అస్మా (ర), హజ్రత్‌ ఉమ్మె సలమా (ర), హజ్రత్‌ ఉమ్మె తలహా (ర) లాంటి వారెందరో ఉన్నారు. వీరంతా 'ప్రకృతి ధర్మం' నుండి ప్రేరణ పొందిన నారీమణులే. ఇస్లాం మెచ్చిన వనితలే.

  కాలంతోపాటే విలువలు కూడా మారినాయి. అన్ని రంగాలలోనూ కల కంఠి ముందంజ వేస్తున్నప్పటికీ  ఆమె కంట వొలికే కన్నీళ్ళు మాత్రం తగ్గటం లేదు. కారణం ఆధునిక దోపిడీ! నవ నాగరికత పేరిట జరిగే ఎక్స్‌పాయిటే షన్‌!! సబ్బు బిళ్ళ మొదలుకుని షేవింగ్‌ బ్లేడు అమ్మకం వరకు ప్రతి దానికీ మాననీమణి సిగ్గు సిరిని అంగడీలో ప్రదర్శించే మగ మారాజు స్వార్థానికి 'ఆమె' అవలీలగా బలైపోతున్నది. తల్లి కడుపులో ప్రాణం పోసుకుంటోందని తెలిసిన  క్షణం నుంచే 'భ్రూణ హత్య' ఆలోచనతో మొదలయ్యే ఈ ఎక్స్‌పాయిటే షన్‌ ఆమె జీవితంలోని అన్ని థలలోనూ జరుగుతున్నఇద. దానికి బదులు మానవ మనుగడలో ఆమె 'సగమ'ని, సగాలు రెండూ ఒకటైతేనే గాని జగానికి ఓ నిండుదనం రాదని గ్రహించే సహృద యత పెంపొందాలి. కోమలాంగికి ఆమె కార్య  క్షేత్రంలో నిరాటంకంగా పురోగ మించే వ్యవస్థను ఏర్పరచాలి. అదే మహిళాభ్యుదయం. అదే మహిళాభిరామం!!

 మన భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషులు సమానులని 1950లో చట్టం అమల్లోకి వచ్చినా అది  కాస్తా పురుషా హంకార చుట్టమై కూర్చుంది. 1961లో వరకట్న నిషేధం చట్టం వచ్చినా, 1956లో వితంతు వివాహాలకు వీలు కల్పిస్తూ శాసనం పుట్టినా, సుమారు 200 సం నాడు సతి సహగమన వ్యతిరేక చట్టం అమల్లో వచ్చినా ఇంకా స్త్రీలపై అనేక విధాల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.   స్వాతంత్య్రానికి పూర్వం శుల్కం చెల్లించి కన్యల్ని అమ్మే, కొనేవారు, ప్రస్తుతం వరకట్నం ఇచ్చి భర్తల్ని కొంటున్నారు, అమ్ముకొంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లోనూ బలి పశువు స్త్రీయే.
  చివరిగా ఒక మాట చెప్పక తప్పదు. ఎవరు సంకెళ్ళలో బంధించబడ్డారో వారే బంధ విముక్తికై స్థిర చిత్తంతో పోరాడాలి. 'స్త్రీ స్వర్గానికి సోపానం' అని ప్రవక్త మహాశయుల వారు ప్రకటించి ఆ ఆశయ సిద్ధికై ప్రజల్లో చైతన్య కణాల్ని రాజేసినట్లే స్త్రీలు సయితం తమ శక్తి యుక్తుల్ని వాడి స్వేచ్ఛాసమానత్వాన్ని సాధించుకునే దిశగా పయనించి సమాజాన్ని, దేశాన్ని అభ్యుదయ పథాన నడిపించిన నాడే భవిష్యదర్శనం సుఖ శాంతులకాలవాలమవుతుంది. ఇక్కడ విస్మరించరాని విషయమేమిటంటే స్త్రీల భాగస్వామ్యం లేనిదే సమాజ పురోగాభివృద్ధి అసాధ్యం. పురుష సహకారం లేనిదే అది సాధ్యం అవదు. అంటే- స్త్రీ లేని పురుష ప్రపంచాభివృద్ధి బలహీనపడితే, పురుషుడు లేని స్త్రీ సమాజ అభ్యుదయం కుంటుపడుతుంది. సంసార రథం సాఫీగా సాగదు. సంతానం సత్పౌరులుగా ఎదగరు. ఈ మటుకు విలువలు, బాధ్యతలు మృగ్యమైన ఏ దేశం అభివృద్ధిని పొందలేదు. ఈ పరిణామ ప్రక్రియలో స్త్రీల పాత్ర ఏపాటిదై ఉండాలి? అంటే- 1) స్వయం ఉద్ధరణ. 2) సమాజం యావత్తులో పరివర్తనం తీసుకురావాల్సిన బాధ్యత.

  ఆ మేరకు తల్లులుగా వారు ముందు తమ కుటుంబాల్లోనే సమరస భావానికి పునాదులు వేయాలి. పిల్లల్లో చిన్న నాటనే విశాల భావాన్ని ప్రోది చేయాలి.. స్త్రీ పురుషుల విషయంలో మహా ప్రవక్త (స) చేసిన హితవుల్ని పిల్లలకు బాల్య థ నుండే నూరిపోయాలి. వారిలో తమ చెల్లి, తల్లి, పిన్నీల పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని పెంపొందించాలి. సత్య నిరతి, సోదర ఆవం, ప్రేమ, కరుణ, దయ, క్షమ, పరోపకార పారీణత వారిలో నిత్య గుణాలుగా రూపొందాలి. 'తల్లి ఒడి ప్రాథమిక బడి' గనుక - తల్లుల ఈ శిక్షణ - సంతాన వ్యక్తిత్వాన్ని సంరక్షిస్తుంది. కుటుంబంలో శాంతిని నింపుతుంది.  ఆ దరిమిలా సమాజంలో, దేశంలో శాంతి, అభ్యున్నతి, ప్రగతి, పురోగాభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయల్లా విరాజిల్లుతుంది. స్త్రీలందరూ తమ ఈ కర్తవ్యాన్ని గుర్తించి అహరహం పరిశ్రమించినప్పుడే విశ్వ జనులందరికి సౌభాగ్యం ఇనుమడిస్తుంది. అందు నిమిత్తం కర్తవ్యం మహిళా లోకాన్ని పిలుపునిస్తోంది! స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా స్రీలందరూ సహజంగానే స్పందిస్తారని ఆశిస్తూ....
           
 
 

12, ఆగస్టు 2013, సోమవారం

వినాశకాలే విపరీత బుద్ధి

సత్యాన్వేషణా దృష్టి, సత్యావిష్కరణ కృషి నేటి ముఖ్యావసరం. ఇవే సమాజాభ్యుదయానికి, దేశాభ్యున్నతికి ప్రాణం. యజమానులు వ్యక్తి శ్రమశక్తిని వస్తువుగా మార్చి కార్మికుల హక్కులను కొల్లగొట్టడం ఒక విపరీతం. సంతానం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, తల్లిదండ్రులు సంతాన సేవల్ని గుర్తించకపోవడం రెండూ విపరీతాలే. గురువు శిష్యుల శ్రేయాన్ని కోరకపోవడం, శిష్యులు గురువును గౌరవించకపోవడం రెండూ ప్రమాదకర విషయాలే. 

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
అతిశయిల్లడం అన్ని రంగాల్లోనూ అనర్థానికి దారి తీస్తుంది. విద్యా రంగమయినా, వైజ్ఞానిక రంగమయినా, ఆర్థిక రంగ మయినా, ఆధ్యాత్మిక రంగమయినా, రాజకీయమయినా, రాజరికమయినా ఏదీ దీనికి అతీతం కాదు. సమతౌల్యత, సౌజన్యత, మధ్యేమార్గం అన్ని విధాలా శ్రేయస్కరం. సత్యాన్వేషణా దృష్టి, సత్యావిష్కరణ కృషి నేటి ముఖ్యావసరం. ఇవే సమాజాభ్యుదయానికి, దేశాభ్యున్నతికి ప్రాణం. యజమానులు వ్యక్తి శ్రమశక్తిని వస్తువుగా మార్చి కార్మికుల హక్కులను కొల్లగొట్టడం ఒక విపరీతం. సంతానం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, తల్లిదండ్రులు సంతాన సేవల్ని గుర్తించకపోవడం రెండూ విపరీతాలే. గురువు శిష్యుల శ్రేయాన్ని కోరకపోవడం, శిష్యులు గురువును గౌరవించకపోవడం రెండూ ప్రమాదకర విషయాలే. ధనం దైవ ప్రసాదితం కాదు, అది మా స్వయంకృషి ఫలితం అని శ్రీమంతులు అనుకోవడం, శ్రమను తమ నొసట వ్రాసిన శాపంగా పేదలు భావించ డం రెండూ విపరీత ధోరణులే. దీనికి భిన్నంగా ఉన్నవారు లేనివారి అవసరాల్ని గుర్తించి మానవత్వంతో వ్యవహరించగలిగితే సర్వత్రా సంతోషాలు సప్త రంగుల హరివిల్లై వెల్లివిరుస్తాయి. శ్రేయ సామరస్యాల పూలు విరబూస్తాయి. పరిశుద్ధ పోషకాహారాలు దేహపోషణకు ఎంత అవసరమో ఆరోగ్యకరమైన సాహిత్యం మేధో వికాసానికి అంతే అవసరం. అది మానవ మేధకు పదును పెట్టాలి. అయితే నేడు మార్కెట్‌లో లభించే చౌకబారు సాహిత్యం పాఠకులను పెడత్రోవ పట్టిస్తూ, ఊహాలోకాల్లో విహరింపజేస్తూ, క్రైం, సస్పెన్స్‌, సెక్స్‌, థ్రిల్లర్‌, హింస, విధ్వంసాలతో ఉత్కంఠ కలిగిస్తూ, క్షుద్ర విద్య, చేత బడులతో భయపెట్టుతూ పసలేని సమాచారాన్ని అందిస్తూ, తద్వారా పాఠకుల బలహీనతను సొమ్ము చేసుకోవడం అత్యంత విచారకరం! సాహిత్యం – అది ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందినదయినా, ప్రింటింగ్‌ మీడియాకు సంబంధించినదయినా, సినిమా రంగానికి సంబంధించినదయినా దాని మాధ్యమంతో డబ్బు కూడబెట్టుకోవాలనుకోవడంలో ఎవరి కారణాలు ఎలా ఉన్నా, తన స్వార్థం కోసం విష భావాలను విరజిమ్మడం, ధనార్జానార్థం ప్రజలను మరింత అజ్ఞానాంధకారాల్లోకి నెట్టడం ముమ్మాటికీ ఖండించదగిన విషయమే. మంచిని చేయడం సాధ్యం కాదనుకునే కుమతులు చెడు చేసే హక్కు కూడా తమకు లేదన్న విషయాన్ని గ్రహించాలి. కోరికలు మానవ సహజాంశాల్లోని ఓ భాగమే కావచ్చు. అయితే అవి శ్రుతి మించకుండా ఉండేటట్లు చూసుకోవడం నేటి అవసరం. దక్షిణాఫ్రికా గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యాచారానికి గురువుతున్న మహిళల సంఖ్య అక్కడ ఎక్కువ. ఎయిడ్స్‌ మహమ్మారి విజృంభణ కూడా అక్కడే అధికం. దక్షిణాఫ్రికా తర్వాత స్థానం భారత దేశానిదేనన్నది విశ్లేషకుల అంచనా. అంటే ఇక్కడ కూడా ‘సెక్సువల్‌ హెరాస్మెంట్‌’, మరియు లైంగిక అత్యాచార బాధితుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లే కదా! ఈ విపరీత ధోరణి వెరసి భవిష్యత్తులో ఎయిడ్స్‌ రోగుల సంఖ్యను గణనీయంగా పెంచే ప్రమాదం లేకపోలేదు. అలాగే ఈనాడు విదేశాల్లో నివసించడం, విదేశాల్లోనే విద్యనార్జించడం ఉన్నతమైన నాగరికతగా పరిగణించబడుతోంది. ఆంగ్ల భాషాభ్యసనాన్ని నవనాగరికతకు చిహ్నంగా భావించబడుతోంది. ఆంగ్లంలో మాట్లాడితే ‘గౌరవం’ అన్న వెర్రి ప్రబలు తోంది. కొందరయితే మాతృభాషలో కాకుండా ఆంగ్లంలోనే ఆలోచించే స్థాయికి ఎదిగి (?) పోయారు. అలా అని ఆంగ్ల భాషను తక్కువ చేసి చూపడం మా ఉద్దేశం కానేకాదు. భాషలన్నీ దైవం ప్రసాదించినవే. ఏ భాష ప్రాముఖ్యత ఆ భాషకుంటుంది. కానీ మాతృభాషను విస్మరించటం విపరీతం. ఇవి, ఇటువంటి అనేక రుగ్మతలు నాగరికతగా, మనిషి స్వేచ్ఛకు సంపూర్ణ రూపాలుగా ఎంచబడుతున్నప్పుడు, ప్రకృతి వైద్యం తప్పనిసరి అవుతుంది. అనాదిగా ఆ ప్రకృతి వైద్యాన్ని అందిస్తూ, మానవాళిని సకల రుగ్మతల నుండి కాపాడుతూ వస్తున్న వైద్యుల్లో అంతిమ వైద్యుడు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స). ఆయన రాకతో అనంత మానవ ప్రపంచంలో ఝంఝా మారు తాలు ప్రవేశించాయి. ఆయన తన సునిశిత, సౌజన్య, సుశీల ప్రవర్తనతో, శక్తివంతమైన ప్రబోధనంతో మానవ సమాజంలో మహా గొప్ప నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని తెచ్చారు. నేటి మానవ సమాజపు సకల రుగ్మతల నివారణోపాయం ఆయన ఆదర్శ జీవితంలోనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది వినా మార్గాంతరం కూడా లేదు. ఆ మాటకొస్తే ఆయన ప్రభవనానికి గల కారణం కూడా అదే- ”ఆ ప్రవక్త (ముహమ్మద్‌ (స)) మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు. చెడుల నుండి వారిని వారిస్తాడు. పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం (హలాల్‌)గా ప్రకటిస్తాడు. అశుద్ధమయిన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై ఉన్న (అనవసర ఆంక్షల) బరువును దించుతాడు. వారికి వేయబడిన ఉన్న సంకెళ్ళను త్రెంచుతాడు (ఇదే ఆయన ప్రభవనానికి కారణం). కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, ఆయనకు ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితోపాటు పంపబడిన జ్యోతి (ఖుర్‌ఆన్‌)ని అనుసరిస్తారో వారే నిజ సాఫల్యవంతులు”. (అల్‌ ఆరాఫ్: 157)

ఈ మార్పుకి మనం సిద్ధమేనా?

 స్వార్థంతో కూడుకున్న అహంభావం, దౌర్జన్యం, మార్గవిహీనత, క్రమ శిక్షణా     రాహిత్యం వంటి తామసిక గుణాల్ని ఆత్మ నుండి తొలగించి మనసును పరిశుద్ధ పరుస్తుంది. అది తన ఆశయాలకు అంకిత మైనవారిని – విశ్వాసమూర్తులుగా, శాంతి కాముకులుగా, నిరాడంబరులుగా, సాహస వంతులుగా, ఆదర్శప్రాయులుగా, అసత్యం పట్ల ఎన్నటికీ రాజీ పడని వారిగా, పరలోక భీతి, స్వర్గ ప్రీతి గలవారిగా తీర్చిదిద్దుతుంది.

”నిజాయితీగా బ్రతుకు…నిన్ను చూసి లోకం గర్వపడేలా బ్రతుకు…హితం కోసం పని చేయి…సాటి వ్యక్తుల యెడల దయ, క్షమ కలిగి ఉండు… దారిన పడివున్న హానికర వస్తువును తొలగించు… తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించు… పెద్దల్ని గౌర వించు… పిల్లల్ని ప్రేమించు..” అంటూ సజ్జనులైన మన పూర్వీకులు ఉగ్గుపాలతో పిల్లలకి రంగరించి ఇచ్చేవారు. ప్రస్తుతం ఇటువంటి మంచి మాటలు చెప్పేవారు, తప్పు చేస్తూ ఉండగా చూసి దండించేవారు, దండిస్తే సహించేవారు అరుదు. ఉన్న సమయమంతా కలల సౌధాలు నిర్మించుకోవడానికి, సొంత సౌఖ్యాలకే సరిపోతుంటే ఇక సమాజ సేవ శ్రేయోకామన, విలువల సంరక్షణ ఎక్కడ? ఎటు చూసినా ద్వంద్వ ప్రవృత్తి ప్రబలు తుంది. ‘లోపల ఒక విధంగా బయట మరో విధంగా’ అన్న చందాన వ్యవహరిస్తున్నారు.
  సామాజిక రుగ్మతలపై గంటల తరబడి ఊక దంపుడు ఉపన్యాసాలిచ్చే ఉత్తములు తమ విషయానికి వచ్చేసరికి నీతి నిజాయితీల్ని మర్చిపోతున్నారు. ”ఈ కాలం కుర్రాళ్ళకి గురువు పట్ల గౌరవభావమే లేదు. అదే మా కాలంలో అలా ఉంటే, తోలు వలిచేవారు” అంటాడు తన ట్యూషన్‌ కుర్రాళ్ళకి ఎక్కువ మార్కులేసే ఒక ఉపాధ్యాయుడు. ”ఈ దేశం లో కుళ్ళు రాజకీయాలు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు” అంటాడు బస్సులో ప్రయాణం చేస్తూ ‘పొగ త్రాగరాదు’ అన్న బోర్డు క్రింద నిలబడి సిగరెట్‌ కాల్చే కుర్ర ప్రయాణికుడు. ”ఈ కాలం అమ్మాయిల్ని చూస్తుంటే వీళ్ళకి అసలు శీలం పట్ల నమ్మకం ఉందా అనే అనుమానం కలుగుతుంది” అం టుంది అందాల పొటీలకు అధ్యక్షురాలైన ఆడ పడచు.”పై ప్లాటు వారు మా ఇంటి పేరట్లోకి తొక్కు విసిరేస్తారు. వారికి సివిక్సెన్స్‌ లేదు, పశువులు” అంటాడు వీధిలో చెత్త     పడేసే  క్రిందివాడు. చిత్రం ఏమిటంటే సమాజం పాడయిపోయిందని, ప్రజలు భ్రష్టు పట్టి పోయారని, విలువలు వలువలు   వీడుతున్నా  యని, మంచికి కాలం లేదని వీరు తెగ బాధ పడిపోతుంటారు కూడా. ఒక్క క్షణం తాము కూడా ఆ సమాజం అంతర్భాగమేనన్న నిజాన్ని వీరు గ్రహించరు. ఇలా ప్రతి వ్యక్తీ సమాజం పాడయిపోయింది అని విమర్శిస్తూ ఉంటాడే తప్ప, తనలోని లోపాన్ని తెలుసు కోడు. ఈ లోకంలో చాలా మంది ఎదుటి వారిలో ఎన్ని లోపాలున్నాయో చక్కగా చెప్ప గలరు. కానీ తమలోని లోపాలను తెలుసు కోవడానికి ఇష్టపడరు. చెప్పినా వినరు. పైగా వాటిని సమర్థించుకునేందుకు వీర ప్రయత్నం చేస్తారు.
 ”చెప్పేందుకే నీతులు పాటించేందుకు కావు” అని నమ్మే ఇటువంటి వారిని ఉద్దేశించి దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్వారు: ”ప్రజలు నాశనమై పోయారు, ప్రజలు భ్రష్టుపట్టి పోయారు  అన్న వ్యక్తి నాశనమయ్యేవారిలో తానే అగ్రగణ్యుడు” అన్న విషయాన్ని తెలుసు కోవాలి. (ముస్లిం)
  సమాజం మారాలని కోరుకోవడం, సమాజ సంస్కరణ కోసం పాటుపడటం మంచిదే, మెచ్చుకోదగ్గదే. కానీ సమాజం మారేంత వరకూ మనం ఆగాలా? లేదా ముందు మనం మారేందుకు ప్రయత్నించాలా? అన్న ప్రశ్న ఎవరికి వారు వేెసుకోవాలి. ఏది సులభం? మనం మారడమా? సమాజాన్ని మార్చడమా? ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
 ”ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశి స్తారు, కానీ మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథ పారాయణం చేస్తా రాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?” (అల్‌ బఖరా: 44)
 సమాజం బాగుండాలంటే దానికి మూలమైన మనం బాగుండాలి. మన లాంటి   అందరూ  బాగుండాలి. అలా జరగాలి అంటే, దైవ విధేయతా మార్గాన్ని అనుసరించాలి. ఏమిటి దాని ప్రత్యేకత అంటారా?
  అది దైవభక్తికి, మానవ ప్రేమకు పెద్ద పీట వేస్తుంది. దైవం యెడల భయాన్ని, భక్తిని, దాసుల యెడల దయను, క్షమను జనింప జేస్తుంది. ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుం డానే మనిషి నైతిక నియమాలు నిర్వర్తించేలా ప్రేరేపిస్తుంది.
  అది శుభాలన్నింటినీ, మేళ్ళన్నింటినీ  పునాదులుగా తీసుకుని, అశాంతి, అలజడి, అశుభాలకి, చెడులకి అతీతమైన ఆదర్శ జీవన విధానాన్ని ప్రతిపాదిస్తుంది. ధర్మంపై నడవడమే కాదు, ధర్మ సంస్థాపనార్థం మాన వాళిని ప్రేరేపించి అధర్మాన్ని అంతమొం దిస్తుంది. అది లాంఛనప్రాయమైన ఆచా రాలకు కట్టుబాట్లకు కట్టుబడి ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది.
  స్వార్థంతో కూడుకున్న అహంభావం, దౌర్జన్యం, మార్గవిహీనత, క్రమ శిక్షణా     రాహిత్యం వంటి తామసిక గుణాల్ని ఆత్మ నుండి తొలగించి మనసును పరిశుద్ధ పరుస్తుంది. అది తన ఆశయాలకు అంకిత మైనవారిని – విశ్వాసమూర్తులుగా, శాంతి కాముకులుగా, నిరాడంబరులుగా, సాహస వంతులుగా, ఆదర్శప్రాయులుగా, అసత్యం పట్ల ఎన్నటికీ రాజీ పడని వారిగా, పరలోక భీతి, స్వర్గ ప్రీతి గలవారిగా తీర్చిదిద్దుతుంది.
  అది మనషిలో నైతిక బాధ్యతను జనింప జేస్తుంది. ఆత్మ నిగ్రహాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ విమర్శను పెంచు తుంది. అన్ని సమ యాల్లోనూ సకల సృష్టి తాల పట్ల సమ తౌల్య ప్రవర్తనను, సాత్విక ప్రేమను, కరుణను, దయను, క్షమను సృజి స్తుంది. నిస్వార్థ భావం, నిష్కల్మష న్యాయం, నిర్మల మనస్తత్వం వంటి మంచిని మాత్రమే అందజేసే మహోన్నత సుగుణాలను మనిషిలో పెంపొందిస్తుంది. ఇంతకీ ఆ మార్గమేమి టంటారా? అదే ఇస్లాం.

మానవ మహోపకారి ముహమ్మద్‌ (స)

(టిఐపి వారి ‘మానవ మహోపకారి ముహమ్మద్‌ (స)’ పుస్తకం ఆధారంగా)
నేపథ్యం
ఆ సమాజం చీకటి సమాజం. అంతటా గాఢాంధకారం. బహు దూర తీరాలలో అక్కడక్కడ 
ఈ నిష్పక్షపాత నియమంలో నా స్వంత జనులకు, నా ఆత్మీయులకు, ఆప్తులకు, స్వయంగా నాకూ ఎలాంటి మినహా యింపు లేదు.నేను ప్రపంచంలో న్యాయ సంస్థాపనకు వచ్చాను. అందుకే నియుక్తుణ్ణి. ప్రజల మధ్య ఎటువంటి బేధభావం చూపించ కుండా న్యాయంగా వ్యవహరించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి నాపై బాధ్యత మోపబడింది. ప్రజల జీవితాలలో నెల  కొన్న అసంఖ్యాకమయిన అసంతుల నాలను రూపు మాపడానికి, అన్యాయాలను అంతమొందించడానికి, సమాజంలో పొడసూపుతున్న అసమానతలను తుడిచి ప్టెడానికి నియోగించబడ్డాను నేను. 

మిణుకుమిణుకుమనే జ్ఞాన కాంతి కానవచ్చినా అధికాంశం అంధకార మయం. జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢనమ్మకాల దొంతరలు. సామాజిక అవగాహనకు సూత్రం: ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధికారం” అన్నది. సమాజం తరగతుల్లో విభాజితం: పాలకులు, స్వాములు, నాయకులు, కర్షకులు, దాసులు, బానిసలు,నౌకరులు, అధమాతిఅధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష  సమాజంలో ప్రధాన పాత్రధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడ కడపటి స్థానం.
ఆ చీకటి ఎడారిలో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపు తున్నాయి. ఆ పుష్పరాజమే ముహమ్మద్‌ (స)! ఆయన ఒక సందేశహరుడు, దైవ సందేశహరుడు, దైవ ప్రవక్త. తాను అందజేసే సందేశం తన సందేశమన్నా, నవ సందేశమన్నా, ఆనాటికి ఆధునిక సిద్ధాంత మన్నా, ఆ వాతావరణంలో ఆయనకు ఎదురుగా నిల్చొని కాదని చెప్పగల వారెవరూ లేరు. కాని ఆయన అలా చెప్ప లేదు. ఇది అత్యంత ప్రాచీనమయిన సందేశమని, మానవాళి ఎంత పురాతన మయినదో ఈ సందేశమూ అంతే పురాతన చరిత్రగలదని ప్రకటించిన నిస్వార్థ యోధుడాయన. తన మాట, ఆ వాతావరణానికి ఎంతో వ్యతిరేకమయిన మాటే అయినప్పటికీ, ఎంతో సౌమ్యంగా, సమంజసంగా, సౌజన్యంగా, శాంతి పూర్వకంగా అందజేశారు.
ఏ మాయాగారడి వ్యవహారంగాగాని, ఏదో కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతంగాగాని ఆయన దాన్ని ప్రతిపాదించలేదు. దైవం   పంపగా  వచ్చిన   సందేశహరులందరూ, ప్రవక్తలందరూ అందజేసిన సందేశమే, మీ, మా, మన పూర్వీకులందరూ అను సరించిన సందేశమే ఇది అని చాటిన సహృదయుడు. అయినా ఆయన్ని జనం వ్యతిరేకించారు, ఏవేవో స్వార్థ ప్రయోజ నాలు ఆ సందేశం వెనుక ఉన్నట్లు దుష్ప్ర చారం చేశారు. ఎన్నెన్నో దుష్ట సంకల్పాలు ఆయనకు అంటగట్టారు. ఏ మాత్రం నీతి పట్ల నమ్ముకున్న వ్యక్తి అయినా,
 ఏ కొంత సౌజన్యశీలత ఉన్న సుహృదయుడయినా, ఏ కాస్త సామంజ్యసత, హేతుబద్ధత గల బుద్ధిమంతుడయినా ఆనాడు ఆ వ్యతిరేక తకు, ఈ సందేశానికీ ఏమయినా సంబంధముందా అని ఆశ్చర్యపోగలడు. ఆ పిలుపుకు, ఆ ప్రజల వైఖరికీ మధ్య గల తేడాను ఇట్టే గ్రహించగలడు కూడా!       ఆ మహనీయుడు, ముహమ్మద్‌ (స) అందజేసిన సందేశానికి ఆ దేశ ప్రజలు అలా తీవ్రంగా స్పందించి వ్యతిరేకించ డానికి కారణమేమిటీ అని నేడు మనమూ ఆశ్చర్యపోతాము. దాన్ని ఆకళింపు చేసు కోవడానికి ఆ సందేశమేమిటో, నాటి పరిస్థితులేమిటో, కాస్త తెలుసుకునే ప్రయత్నం చేస్తే అంతా స్పష్టమవుతుంది.
మలుపు
ఆయన అందజేసిన సందేశమిదే:
ఈ నిఖిల సృష్టికి ఒక కర్త ఉన్నాడు. ఆయనే దీనికి స్వామి, ఆయనే దీనంతటికీ ప్రభువు. ఆయనే దీనికి పాలకుడు. అందు వల్ల ఆయన ముందరే తల వంచాలి, ఆయనకే మోకరిల్లాలి, ఆయన్నే ఆరాధిం చాలి, ఆయన్నే పూజించాలి, ఆయన ఆజ్ఞలనే శిరసావహించాలి, ఆయన ఆదేశాల ప్రకారమే జీవించాలి.
ఈ సందేశానికే ఆ మూఢ ప్రజలు ఉలిక్కి పడ్డారు. తమ పూర్వీకులు పూజిస్తూ వచ్చిన నక్షత్రాలను, నదీనదాలను, వృక్షాలను, పర్వతాలను, దేవతలను, విగ్రహాలను తిరస్కరించాలా? వంశాను గతంగా వస్తున్న పూజారులు, పురోహి తుల మాటలను త్రోసిపుచ్చాలా? మా నమ్మకాలకు, మా ఆచారాలకు మేము ఎటువంటి సామంజస్యతను చూపలేక పోవచ్చు. అంత మాత్రాన మా ప్రాచీన విశ్వాసాలను వదులుకోవాలా?? మా వంశం, మా కుటుంబంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలను కాదని, మా సమాజంలో అనాదిగా పాటించబడే నియమాలను తిరస్కరించి, మా మనస్సు కోరే అనేకానేక ఆకాంక్షలను వదలిపెట్టి ఈయనగారు చెప్పే, దైవాదేశాలని తెలిపే అంశాలు హేతుబద్ధమైన విషయాలే కావచ్చు, వాటినే సత్యాలని విశ్వసిం చాలా?
ఒక జాతి శతాబ్దుల తరబడి తీవ్రమయిన అజ్ఞానం, మూఢత్వం, పతనావస్థ, దురవస్థలకు, వెనుకబాటుకు లోనయి ఉంది. అవిద్య, అనాగరికత, అవ్యవస్థ, అసభ్యతలకు ఆలవాలమయి అలరారు తోంది. అటువంటి అనిర్వచనీయమయిన స్థితిలో అకస్మాత్తుగా సృష్టికర్త, విశ్వపాలనా ధీశుడు, నిఖిల జగతి ప్రభువు కటాక్ష     వీక్షణం ఆ జాతిపై పడుతుంది. ఆయన కారుణ్యం కదలుతుంది. ఆ ఎడారి నేల పైన చల్లని జల్లులు కురుస్తాయి. వారిలో ఒక ఉత్తమ నాయకుడు ఆవిర్భవిస్తాడు. విశ్వప్రభువు, స్వామి ఆ జాతిని సముద్ధ రించి, చీకటి కుహరాల నుంచి వెలికి తీసి, వెలుగు శిఖరాలపైకి ఎక్కించడానికి స్వయంగా తన వచనాలను, స్వయంగా తన సందేశాన్ని, స్వయంగా తాను ఆమో దించిన మార్గాన్ని ఆ నాయకుడికి అంద జేస్తాడు. తద్వారా ఆ జాతి ఏమరుపాటు నుండి మేల్కొనాలని, మూఢ నమ్మకాల చక్రవ్యూహం నుండి బయట పడాలని, సత్యాన్ని గ్రహించి జీవితపు రాచబాటను అనుసరించాలని ఉద్దేశిస్తాడు.
కాని ఆ జాతి ప్రజలు అవివేకులు; స్వార్థ పరులయిన తెగల, వర్గాల చిల్లర నాయ కులు, దైవం పంపిన ఆ నాయకుని వెంటాడుతారు, ఆయన ఉద్యమం నిష్ఫలం అవ్వాలని శాయశక్తులా ప్రయత్నిస్తుం టారు. ఆయన మార్గంలో ఎనలేని అవ రోధాలు సృష్టిస్తూ ఉంటారు. ఆయన పట్ల దుష్ప్రచారానికి వెరువరు. అనుదినం వారి వైషమ్యం పెరుగుతూనే ఉంటుంది. వారి దౌష్ట్యం అంచెలంచెలుగా ఎక్కువవుతూనే ఉంటుంది.
దుర్మార్గులు ఆ నాయకుని ఆంతమొందిం చాలని కూడా కుట్ర పన్నుతారు. అటు వంటి పరిస్థితిలోనూ ఆ మహనీయుడు అంటాడు:
”మీ ఈ అవివేకం వల్ల మిమ్మల్ని సంస్కరించే కార్యాన్ని నేను వదలు కుంటానని అనుకుంటున్నారా? మీకు అందజేస్తున్న హితోపదేశాన్ని, గుణ పాఠ ప్రబోధనాన్ని అందజేయడం మాను కోవాలా? మీరు శతాబ్దులుగా పడి ఉన్న మీ పతనావస్థలోనే మిమ్మల్ని మ్రగ్గుతూ ఉండేందుకు వదలి పెట్టాలని కోరుకుంటున్నారా? కారుణ్య ప్రభువయిన దేవుని కారుణ్యం కోరేది, దాని ఆవశ్యకత కూడా ఇదే అని మీరు తలుస్తున్నారా? దైవానుగ్రహాన్ని వదలి వేయడం, సత్యం ప్రత్యక్షమయిన తరు వాత, మిథ్యను పట్టుకు వ్రేలాడటం, మిమ్మల్ని ఎటువంటి పరిణామానికి గురి చేస్తుందో ఎప్పుడయినా ఆలోచిం చారా?”
”ఇక మీ వైఖరికి బేజారెత్తిపోయి మేము ఈ హితోపదేశ ప్రబోధాన్ని మీకు అంద జేయడం మానుకోవాలా? కేవలం   మీరు హద్దులు మీరిన జనం అవడం చేతనే ఇటువంటి అంతిమ నిర్ణయం గైకొనాలా?” (దివ్యఖుర్‌ఆన్‌- అల్‌ జుఖ్రుఫ్‌: 5)
ఆయన తన సందేశాన్ని దైవ గ్రంథం రూపంలో అందజేస్తున్నాడు. ఆయన అందజేస్తున్న దివ్యవాణి, దైవగ్రంథం, ఖుర్‌ఆన్‌లోని వచనాలు ఎంతో మనోజ్ఞం గా, మనోహరంగా, కర్ణపేయంగా ఆంత ర్యంలోకి చొచ్చుకుపోయేవి. మనిషిలో సత్యప్రియత లేశమంత ఉన్నా, అజ్ఞానపు అపమార్గాల ఆకర్షణ అతన్ని లోబరచు కోకపోతే, అతను మనోకాంక్షలకు పూర్తిగా లొంగిపోయిన వ్యక్తి కాకపో యినట్లయితే ఆ సందేశం, ముహమ్మద్‌ (స) సందేశంలోని సత్యత అతన్ని ప్రభావితం చేయక మానదు.
నిజ ధర్మం
తన సందేశాన్ని ఆయన అతి స్పష్టంగా విశదీకరించాడు. పరమ ప్రభువు అల్లాహ్‌ా ఒక్కడే ఈ విశ్వాన్నం తటికీ, మానవునికీ సృష్టికర్త, స్వామి, నిజప్రభువు కాబట్టి ఆయనే మానవుని సర్వాధికారి. మానవుని ధర్మాన్ని, శాసనాన్ని, విశ్వా సాలను, ఆచరణా నియమాలను ప్రతిపాదించడం ఆయనకే చెల్లు. సత్యా సత్యాలేవో తెలుపడం ఆయన బాధ్యతే, మరే శక్తికయినాసరే మానవునికి చట్టాన్ని ఇచ్చే యోగ్యత లేదు. ఏ మానవుడూ, మరే ఇతర శక్తీ ఈ సర్వాధికార సత్తా కలిగిలేరు. కడకు దైవప్రవక్తకు కూడా ఆ స్థానం దక్కదు. ఇదే ఆధారంగా పరమ ప్రభువు మానవులకు ఒక ధర్మాన్ని, అధి కారికంగా ఒకే ధర్మాన్ని ఆమోదించి ప్రసాదించాడు. అదే దైవ విధేయతా ధర్మం, ఇస్లాం.
 ఈ ఒక్క ధర్మమే మానవులకు, సర్వ లోకాల్లోనూ ప్రవక్తల ద్వారా అంద జేయ బడుతూ వచ్చింది. ఏ ప్రవక్త అయినా సరే తనదంటూ ప్రత్యేక ధర్మాన్ని స్థాపించు కోలేదు. దేవుని ఈ ధర్మాన్నే ప్రవక్తలం దరూ ఆది నుండీ మానవాళికి దైవం తరఫున అందజేస్తూ, అనుసరిస్తూ, ప్రచారం చేస్తూ వచ్చారు. దాన్ని కేవలం అనుసరించడం, ప్రచారం చేయడం
వరకే వారి బాధ్యత కాదు. వారు దాన్ని సంస్థా పించడానికీ బాధ్యులే. అదే కృషి వారం దరూ జీవితాంతం చేెశారు.
మానవాళికి దైవం తన ప్రవక్తల ద్వారా అందజేసిన ఈ నిజ ధర్మాన్ని, ప్రవక్తల తరువాత వారి అనుయాయులూ తమ సమకాలీన మానవులకు అందజేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే అనుయా యుల్లోని స్వార్థపరులయిన వారు, తమ స్వప్రయోజనాలు, స్వీయ ఇష్టాయిష్టాలు, స్వీయో త్కర్షల కారణంగా దైవ ధర్మాన్ని విభే దాలకు గురి చేశారు. అందులో విభిన్న వ్యత్యాసాలను సృష్టించారు. ఈ విభేదాలు, వ్యత్యాసాల ఆధారంగా విభిన్న వర్గాలు, మత వర్గాలు, మతాలు కల్పించారు. ప్రజల్లో ఏర్పడిన ఈ మతాలన్నీ ఆ ఒక్క దైవ ధర్మానికి వికృత రూపాలే. ఆ ధర్మాన్నే ప్రక్షాళించి, పునరుజ్జీవింపజేసి పునః స్థాపించడానికి మహనీయ ముహమ్మద్‌ (స) ఆవిర్భవించారు.
”ఆదిలో మానవులంతా ఒకే సముదా యంగా ఉండేవారు; తరువాత వారు విభిన్న విశ్వాసాలు, పంథాలు రూపొం దించుకున్నారు. నీ ప్రభువు వద్ద తొలి నుంచే ఒక విషయం నిర్ణయమయి ఉండకపోతే వారు విభేదించుకుంటున్న విషయంలో తీర్పు చేసివేయబడేది.” (దివ్యఖుర్‌ఆన్‌- యూనుస్: 19)
విలక్షణ వ్యక్తిత్వం
ఇదీ మహనీయ ముహమ్మద్‌ (స) సందేశం. ఇదే ఆయన జీవిత   ధేయం,  ఇదే ఆయన బోధించిన పరమార్థం. ఆయన స్వయంగా తన జీవితంలో ఈ దైవ ధర్మాన్ని సైద్ధాంతిక స్థాయిలో, ఆచరణ స్థాయిలో అవలంబించి, అనుసరించి తన ఆదర్శం ద్వారా అదే నిజ ధర్మమని నిరూ పించారు. తనను నమ్మి ఈ దైవ ధర్మాన్ని స్వీకరించిన వారిని సంస్కరించి, తీర్చిదిద్ది వారి వ్యక్తి గత జీవితాలను ప్రక్షాళించి, మెరుగు పరచి ఉత్తమ మానవులుగా రూపొం దించారు. వారి ద్వారా ఏర్పడిన సమా జాన్ని ఆదర్శ సత్సమాజంగా మలిచారు.
ఆయన నిరక్షరాసి. ఆయనకు చదవనూ, వ్రాయనూ తెలియదు. గ్రంథం అంటే ఏమిటో ఆయన ఎరుగడు. నలభయ్యేళ్ళ జీవితం అలాగే సాగింది. విశ్వాసాలు, వాదనలు,చర్చలు అసలే తెలియవు. కాని అకస్మాత్తుగా నలభయ్యేళ్ళ తరువాత గ్రంథాన్ని అందజేయడం, విశ్వాసాలను సుబోధకంగా వివరించటం, ఆధారాలు, నిదర్శనాలతో చర్చించడం, వాదించడం, ఆయన దైవ దౌత్యానికి, ప్రవక్తగా నియుక్తులయ్యారనడానికి అత్యంత పటిష్ట మయిన అఖండనీయ మయిన నిదర్శనం.
  అయితే తాను అందజేస్తున్న గ్రంథం నిస్సందేహంగా దైవ గ్రంథమే, దైవ వచనమే, దైవ ప్రోక్తమే అయినప్పటికీ తాను దైవంతో ప్రత్యక్షంగా, ముఖా ముఖిగా మాటలాడానని ఆయన దావా చేయలేదు. ప్రవక్తలందరి మాదిరిగానే దైవం తనకూ దైవవాణిని పంపే తన మార్గాల ద్వారానే ఈ బోధనలు అంద జేశాడని విస్పష్టపర్చారు. ఈ తాత్విక జ్ఞానం, ఈ జీవన సంవిధానం, ఈ ప్రపంచ వ్యవహారాలన్నింటికీ సమా ధానం, తన ఆలోచనా ఫలితం కాదు దైవప్రసాదిత జ్ఞానం మాత్రమే అని అతి వినయంగా చాటుకున్నారాయన.
‘మీ సహచరుడు దారి తప్పనూ లేదు, దారి వదలనూ లేదు. అతను తన మనోకాంక్షల ఆధారంగా ఏమాటా పలు కడు, ఇదయితే ఒక వహీ (దైవాణి), అతనిపై అవతరిస్తుంది. అతనికి జ్ఞాన బోధన గరిపిన వాడు మహాశక్తిమంతుడు, ఆయన మహా వివేచనాపరుడు”.   (దివ్యఖుర్‌ఆన్‌- అన్‌ నజ్మ్: 2-4)
దేవుడు ఒక్కడే ప్రభువు, ఆయనే సకల పూజలకు అర్హుడు, అన్ని అక్కరలనూ తీర్చేవాడూ ఆయనే, అందువల్ల చట్టాన్ని అందజేసేవాడు, నియమాలను నిర్ధారించే వాడూ ఆయనే అనే మహనీయ ముహమ్మద్‌ (స) వాదనకు విస్తు పోయారు ప్రజలు. వారి ఆవేదన ఏమి టంటే అన్నీ చేసేవాడు దేవుడే అయితే మా మహనీయులు, మా ఊరి దేవతలు, ఇలవేల్పుల మాటేమిటీ అన్నది! ”అల్లాహ్‌ా మాత్రమే మిమ్మల్ని సృష్టించిన వాడు, మీకు ఉపాధినిచ్చిన వాడు, ఆపైన మీకు మృత్యువునిస్తాడు, తిరిగి ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. అయితే మీరు కల్పించుకున్న సహవర్తులలో ఎవరయినా ఉన్నారా వీటలో ఏ ఒక్క పనయినా చేసే వారు? పరిశుద్ధుడాయన, వీరు చేసే బహుదైవోపాసనకు ఎంతో అతీతుడు”.  (దివ్యఖుర్‌ఆన్‌- అర్‌ రూమ్: 40)
ఆయన తన మాటను, తన సందేశాన్ని, వాస్తవానికి దైవ సందేశాన్ని ఎన్ని విధాలుగా బోధపరచినా, ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా, ఎన్ని ఆధారాలతో రుజువు పరచినా, ఎన్ని నిదర్శనాలతో నిరూపిం చినా ప్రజలు అర్థం చేసుకోవడం లేదే అని బాధపడేవారు మహనీయ ముహమ్మద్‌ (స). తిరస్కారుల మొండి పట్టుకు, మంకుతనానికి లోలోనే కుమిలి పోయేవారు. దైవం తన గ్రంథంలో ప్రవక్త శ్రీ (స)కి సాంత్వన వచనాలు పలికి ఓదార్చేవాడు.
”సరే ముహమ్మద్‌, వారు ఈ బోధనను విశ్వసించకపోతే, ఈ బాధతో వీరి వెన కాల బహుశా నీవు నీ ప్రాణాలనే ధార బోస్తావేమో”.  (దివ్యఖుర్‌ఆన్‌- అల్‌ కహ్ఫ్: 6)
  ”ముహమ్మద్‌, బహుశా నీవు ఈ జనులు విశ్వసించడం లేదనే దుఃఖంతో నీ ప్రాణాలనే కోల్పోతావేమో. మేము కోరినట్లయితే ఆకాశం నుండి సూచనను అవత రింపజేయగలము, తద్వారా దాని సమక్షంలో వీరి మెడలు వంచేలా చేెయ గలము”. (దివ్యఖుర్‌ఆన్‌- అష్‌ షు,రా: 3,4)
దైవం కోరుకునేది, మానవులు స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా సత్యాన్ని స్వీకరించాలన్నదే అనీ, తాము ఇష్టపడిన దాన్ని ఎన్నుకునే, అవలంబించే స్వాతంత్య్రం ఇవ్వడం ద్వారానే మానవుల్ని పరీక్షించడం జరుగు తోందని అల్లాహ్‌ ప్రవక్త శ్రీ (స)కి బోధ పర్చాడు తన గ్రంథంలో. ధర్మ ప్రచార కార్యం అత్యంత కష్టభూయిష్టమయినదే. అందులో నిరంతర పరిశ్రమ, అవిరళ కృషి తప్ప మరో ప్రత్యామ్నాయం, మాయలు, మంత్రాలు, తంత్రాలు అసలే లేవని ఖచ్చితంగా చెప్పివేశారు.
”ఆదిలో మానవాళి అంతా ఒకే విధానాన్ని అవలంబించేది. (ఆ తర్వాత పరిస్థితులు మారగా విభేదాలు ఉత్పన్న మయ్యాయి) అప్పుడు అల్లాహ్‌ ప్రవక్తల్ని పంపాడు; వారు సన్మార్గావలంబనకు శుభ వార్త అందజేసేవారు, దుర్మార్గావలంబన పరిణా మం పట్ల భయపెట్టేవారు. వారితోపాటు, ప్రజల మధ్య సత్యం పట్ల పొడసూపిన విభేదాల తీర్పు చెయ్యటానికి సత్య విలసిత గ్రంథాన్ని అవతరింపజేశాడు – (ఈ విభేదాలు తలెత్తడానికి కారణం ఆదిలో జనానికి సత్యం ఏదో తెలుపక పోవడం కాదు) అలా విభేదించినవారు ఎవరో కారు, సత్యజ్ఞానం పొందిన వారే”.   (దివ్యఖుర్‌ఆన్‌- అల్‌ బఖర: 213)
”ఆ తరువాత, ముహమ్మద్‌, మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని పంపాము. ఇది సత్యం తీసుకువచ్చింది. ఇది, దీనికి పూర్వం (గ్రంథాలలో) ఉన్న అల్‌ కితాబ్‌ (ఉద్గ్రంథం)లోని అంశాలను ధ్రువీకరి స్తుంది, వాటిని కనిపెట్టుకు ఉంటుంది”.  (దివ్యఖుర్‌ఆన్‌- అల్‌ మాయిదా: 48)
ఆయన ఒకే ఒక్క దైవం సమక్షంలో తల వంచాలని, ఆయన అనుగ్రహించిన ధర్మాన్నే అనుసరించాలని మాత్రమే బోధిం చాడు. ఈ ధర్మ మార్గంలో బుద్ధి బలాన్ని ఉపయోగించుకుని   తమకంటూ  ప్రత్యేక స్థానం కోరుకునేవారికి అలాంటి అవ కాశమే లేదు. వారి పెద్దరికం చెలామణి అయ్యే పథకం లేదు. జనం వారి వెనకా ముందూ గుమిగూడి వారి సమక్షంలో తలలు వంచడమే కాక జేబులు ఖాళీ చేసే ఆస్కారం అసలే లేదు.
ఇలాంటి అత్యాశాపరులే కొంగ్రొత్త నమ్మ కాలు, తత్వాలు, సరికొత్త ఆరాధనా రీతులు, మత వ్యవహారాలు, విచిత్ర     మయిన జీవన విధానాలూ సృష్టించారు. కొత్త మతభావనలు కల్పించారు. మానవాళిని దైవవిధేయతా రాచబాట నుండి వేరు చేసి చిన్న చిన్న కాలి బాటలు అనేకం కల్పించి మానవుల్ని అనుసరింపజేసి, మానవాళిని ఛిన్నాభిన్నం చేసివేశారు. దీని ఫలితంగానే మతం పేరిట వాదులాటలు, పోరాటాలు, సంఘర్షణలు, మత ఘర్షణలు జరిగాయి, మానవ చరిత్ర అంతా రక్తసిక్తమయి పోయింది అని ఆయన మానవుల్ని హెచ్చ రించారు.
ఆయన ప్రకటన నేను మానవులకు మధ్య నెలకొన్న ఈ వర్గాలు, మఠాలు, భేదభావాలు, తార తమ్యాలు – అన్నింటికీ అతీతంగా నిష్పక్ష  పాతంగా న్యాయప్రియతను మాత్రమే ఆశ్ర యిస్తాను. నేను ఒక వర్గానికి సానుకూలం గాను  మరో వర్గానికి వ్యతిరేకంగా పక్ష పాతంతో వ్యవహరించలేను. నా సంబం ధం సకల మానవులతోనూ సమాన
మయినదే. మానవాళితో నా సంబంధం సత్యం, న్యాయం ఆధారంగానే ఏర్పడుతుంది. సత్యం ఎటువైపు ఉంటే నేను దాని పక్షాన నిలబడతాను. సత్యం ఆశ్రయించిన వ్యక్తి పరాయివాడయినా, వ్యతిరేకి అయినా, విరోధి అయినా నేనతని పక్షానే నిలు స్తాను. సత్యవిరుద్ధమయిన మాటకు నేను విరోధిని. ఆ అసత్యవాది నా వాడు, నా సన్నిహితుడు, నా మిత్రుడు, నా బంధువు అయినా నేనతన్ని వ్యతిరేకిస్తాను. నేను అసత్యానికి విరోధిని.
  నేను మీకు అందజేస్తున్నది, ప్రతిపాది స్తున్నది సత్యం. నేను ఈ సత్యాన్ని అంద జేయటానికి నియుక్తుణ్ణి. ఇందులో ఎటు వంటి వ్యత్యాసాన్ని పాటించను. ఇది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఇందులో తన వారని, పరాయివారని తేడా లేదు. పెద్దవారని, చిన్నవారని, అధము లని, అగ్రులనీ తారతమ్యం లేదు. బీద వారని, ధనవంతులని, పండితులని, పామరులని బేధభావం లేదు. శిష్ఠ జనులని, అల్ప జనులనీ హెచ్చు తగ్గులు లేవు. వేర్వేరు వర్గాలకు వేర్వేరు హక్కులు లేవు, అందరికీ సమానమయిన హక్కులే వర్తిస్తాయి.
ధర్మమయితే అందరికీ ధర్మమే. అధర్మమయితే అందరికీ అధర్మమే. ఒకరికి పాపమయినది అందరికీ పాపమే.   ఒకరికి పుణ్యప్రదమైనది అందరికీ పుణ్య ప్రదమయినదే. నేరం అన్నది ఎవరు చేసినా నేరమే. ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం వర్తించదు.
ఈ నిష్పక్షపాత నియమంలో నా స్వంత జనులకు, నా ఆత్మీయులకు, ఆప్తులకు, స్వయంగా నాకూ ఎలాంటి మినహా యింపు లేదు.నేను ప్రపంచంలో న్యాయ సంస్థాపనకు వచ్చాను. అందుకే నియుక్తుణ్ణి. ప్రజల మధ్య ఎటువంటి బేధభావం చూపించ కుండా న్యాయంగా వ్యవహరించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి నాపై బాధ్యత మోపబడింది. ప్రజల జీవితాలలో నెల  కొన్న అసంఖ్యాకమయిన అసంతుల నాలను రూపు మాపడానికి, అన్యాయాలను అంతమొందించడానికి, సమాజంలో పొడసూపుతున్న అసమానతలను తుడిచి ప్టెడానికి నియోగించబడ్డాను నేను. అంతే కాదు నేను మీ మధ్య న్యాయ మూర్తిగా కూడా వ్యవహరిస్తాను. మీలో తలెత్తే తగాదాలకు సరయిన, న్యాయవంతమయిన తీర్పులను చేయడానికి దైవం నియమించిన న్యాయ నిర్ణేతను నేను అని కూడా ఆయన చాటారు. తదనుగుణంగా మదీనా లో స్థాపించిన తొలి ఇస్లామీయ నగర రాజ్యానికి న్యాయమూర్తి, జడ్జిగా కూడా ఆయన భూమిక అద్భుతమయినది.
న్యాయానికి చిహ్నం ”మీజాన్‌” (తుల మానం, తరాజు, తక్కెడ) అని, నేటికి   పదిహేను వందల ఏళ్ళ క్రితం చాటింది, ఎత్తి చూపింది
ప్రవక్త మహనీయుల (స) ద్వారా అందిన దివ్యఖురాన్‌ మాత్రమేఅన్నది అఖండనీయమయిన సత్యం.
 ”సత్యం, ధర్మంతోపాటు ఈ గ్రంథాన్నీ, (న్యాయ నిర్ణయానికి) తులమానాన్నీ అవతరింపజేసినవాడే అల్లాహ్”.  (దివ్య ఖుర్‌ఆన్‌- అష్‌ షూరా: 17)

కలిసి నిలబడండి మీ హృదయాలు కలుస్తాయి

  సామూహిక నమాజు చేస్తున్నప్పుడు ఆ నమాజీలలో నిజమైన భక్తి, అణుకువ ఉండాలి. అరమరికలు దూరమవాలి. కల్లాకపటం నిష్క్రమించాలి. దైవ సహాయం కోసం దీనాతిదీనంగా వారి పెదవులు ప్రార్థించాలి. అప్పుడే జాతీయ జీవనంలో పరస్పర సహకార భావం జనిస్తుంది. సంఘీభావం వెల్లి విరుస్తుంది. సాటి సోదరుల పట్ల నిజమైన సానుభూతి పెంపొందుతుంది

ఏ జాతి జీవన ప్రవాహమైనా సామూహిక క్రమశిక్షణ లేకుండా చల్లగా, సజావుగా సాగదు. క్రమశిక్షణా రాహిత్యం, అస్తవ్యస్తత గనక పొడసూపితే ఇక ఆ జాతి జీవనంలో స్తబ్ధత ఆవరిస్తుంది. దాని బ్రతుకంతా చిందరవందర అయిపోతుంది.
  అందుకే ఇస్లాం తన అనుచర సమాజంలో క్రమశిక్షణ చెదరిపోకుండా ఉండటానికి ‘సామూహిక నమాజ్‌’ అనే క్రియాత్మక దృష్టాంతాన్ని నెలకొల్పింది. ఇస్లాం ప్రవక్త (స) ఈ దృష్టాంతం ఆధారంగానే చెల్లాచెదురుగా పడి ఉన్న అరబ్బు జాతిని ఓ కట్టుదిట్ట మైన జీవన విధాన మూసలో పోశారు. వారిని ఒకే త్రాటిపై నడిపించారు. ఐకమత్యం కోసం, సద్భావన కోసం, ఒకే మాటపై నిలిచి,ఒకే బాటపై నడవటం కోసం ‘సామూహిక నమాజు’ను నెలకొల్పటం ఎంత అవసరమో ఉదాహరణప్రాయంగా రూఢీ చేశారు.
  సామూహిక నమాజులో ముస్లింలు వరుసలు తీరి భుజానికి భుజం ఆనించి నిలబటం, ఒకే నాయకు(ఇమామ్‌)డ్ని అందరూ సమానంగా అనుసరించటం అపురూప విషయం. ఒక జాతి జీవనాన్ని ఒకే సమాహారంలో బంధించే విలక్షణ వ్యవస్థ ఇది. సీసం కరిగించి పోయబడిన గోడ పటిష్టంగా ఉన్నట్లే సామూహిక నమాజు వ్యవస్థలో ఇమిడిపోయిన జాతి జీవనం కూడా పటిష్టంగా, చెక్కు చెదరకుండా ఉంటుంది.
అయితే -
  సామూహిక నమాజు చేస్తున్నప్పుడు ఆ నమాజీలలో నిజమైన భక్తి, అణుకువ ఉండాలి. అరమరికలు దూరమవాలి. కల్లాకపటం నిష్క్రమించాలి. దైవ సహాయం కోసం దీనాతిదీనంగా వారి పెదవులు ప్రార్థించాలి. అప్పుడే జాతీయ జీవనంలో పరస్పర సహకార భావం జనిస్తుంది. సంఘీభావం వెల్లి విరుస్తుంది. సాటి సోదరుల పట్ల నిజమైన సానుభూతి పెంపొందుతుంది.
అందుకే -
  అంతిమ దైవ ప్రవక్త (స) వారు సామూహిక నమాజు సందర్భంగా పంక్తులు సరిదిద్దే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
”మీరు కలిసి కట్టుగా నిలబడనంత వరకూ మీ హృదయాలు కూడా పరస్పరం కలవలేవు” అని ఆ మహనీయుడు (స) నొక్కి వక్కాణించారు. (సహీహ్‌ బుఖారీ – కితాబుస్సలాత్)

రేపే ఈద్‌

ఈద్‌ అంటే సంగీతం, నృత్యాలు కాదు. అసభ్య ఆటపాటలు కాదు. వ్యర్థ మనోరంజక కార్యకలాపాలు కాదు. పైశాచిక ఆనందం, వికృత చేష్టలు అసలే కాదు. పండుగంటే కరుణామయుడైన అల్లాహ్‌ా పట్ల కృతజ్ఞతలు తెలియజేయడం, ఆయన ప్రసాదించిన వరాలను గుర్తిం చటం, ప్రభువు కరుణాను గ్రహాలను ప్రదర్శించటం, విశ్వాసుల నమ్మ కాలను స్థిర పరచటం, ఇస్లాం ధర్మాన్ని బల పర్చటం, శాంతి విఘాత కులు సృష్టించే అడ్డంకులను అవలీలగా తొలగించుకోవటం.

ఈద్‌ అంటే సంగీతం, నృత్యాలు కాదు. అసభ్య ఆటపాటలు కాదు. వ్యర్థ మనోరంజక కార్యకలాపాలు కాదు. పైశాచిక ఆనందం, వికృత చేష్టలు అసలే కాదు. పండుగంటే కరుణామయుడైన అల్లాహ్‌ా పట్ల కృతజ్ఞతలు తెలియజేయడం, ఆయన ప్రసాదించిన వరాలను గుర్తిం చటం, ప్రభువు కరుణాను గ్రహాలను ప్రదర్శించటం, విశ్వాసుల నమ్మ కాలను స్థిర పరచటం, ఇస్లాం ధర్మాన్ని బల పర్చటం, శాంతి విఘాత కులు సృష్టించే అడ్డంకులను అవలీలగా తొలగించుకోవటం.
పండుగ రోజు కార్యక్రమాలు
  ప్రతి ముస్లిం ఫిత్ర్‌ పండుగ నమాజుకు ముందు కొంత అల్పాహారం తీసుకోవాలి. అది ఉపవాస దీక్ష విరమణ సమయంలో తినే ఖర్జూర పండే కావచ్చు. ఇకపోతే, రమజాన్‌ నెలలో ఉపవాస దీక్ష విరమణ సమయంలో జరిగిన తప్పులకు, పొరబాట్లకు బదులుగా ఈ రోజు నిరు పేదలకు ‘జకాతుల్‌ ఫిత్ర్‌’ దానం చెల్లించాలి. ఇది పేదల్లో సంతోషాన్ని తెస్తుంది. ముస్లింలలో పరస్పరం దయ, సహకార గుణాలను పెంపొం దిస్తుంది. హృదయాలను శుద్ధి చేెస్తుంది. వారిలో పిసినారితనాన్ని అరి కడుతుంది.
  కొత్త బట్టలు ధరించటం, సువాస పూసుకోవటం, పండుగ నాటి కార్యక్రమాలలోని అంతర్భాగమే. అల్లాహ్‌ా కారుణ్యాన్ని అర్థం చేెసుకునే సాధనమే పండుగ. అల్లాహ్‌ా అత్యంత సుందరుడు. సౌందర్యాన్ని ఆయన ఇష్టపడతాడు. కనుక సింగారమూ పండుగలో అంతర్భాగమే! అల్లాహ్‌ా అనుగ్రహాలను ప్రదర్శించే సమయమే ఈ పండుగ.
”అల్లాహ్‌ తన దాసునికి అనుగ్రహం ప్రసాదించినప్పుడు ఆ మనిషిపై తన  అనుగ్రహం తాలూకు ప్రభావం కనిపించటాన్ని ఆయన ఇష్ట పడ తాడు” అని దైవ ప్రవక్త (స) ప్రవచించి ఉన్నారు. పండుగ ఒకరినొకరు కలుసుకునే సమయం. అభినందనలు తెలుపుకునే సందర్భం. పర స్పరం ప్రేమాభిమానాలు పంచుకునే శుభ ఘడియ. కనుక పండుగ రోజు బంధుమిత్రులతో సంబంధాలు నెలకొల్పాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు చూపాలి. పేదల పట్ల దయ కనబర్చాలి. పొరుగు వారి పట్ల సానుభూతి కలిగి ఉండాలి. ఇస్లామీయ పండుగ ఈ విష యాలన్నిటినీ తన అనుయాయులకు పదే పదే ప్రబోధిస్తుంది.
 ఇస్లామీయ పరిధుల్లో ఉంటూ ఆనంద సంబరాలను జరుపుకోవాలని ఇస్లామీయ పండుగ మనకు బోధిస్తుంది. ఇస్లామీయ పరిమితులకు లోబడి ఆహ్లాదాన్ని అనుభవించవచ్చంటుంది. వినయవిధేయతలు నిండిన క్రీడలను, ఇతరులకు ఏ మాత్రం హాని కలిగించని ఆటల్ని ఆనందించమంటుంది. ధార్మిక పరిమితులను గౌరవిస్తూ విహార సంతో షాన్ని ఆస్వాదించమంటుంది. సృజనాత్మకతను పెంచే కథలు విని హర్షించమంటుంది. ”గొప్ప సమీకరణ దిన”మైన పరలోక ప్రతి ఫల దినాన్ని తలపించే మహత్తర సందర్భం ఇది. వేలాది మంది ధనవం తుల్ని, పేదవారిని, పెద్దలను, పిన్నలను, పాలకులను, ఆనందంలో ఉన్నవారిని, బాధలు అనుభవిస్తున్న వారిని ఒకచోట చేరుస్తుంది పండుగ రోజు.
 ఈద్‌ అనేది అల్లాహ్‌ తరఫున బహుమతులు అందుకునే రోజు. పరి పూర్ణ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో ఉపవాసాలు పాటించిన వారికి, పండుగ ఓ గొప్ప బహుమానం. ఘన మైన విజయం. మహా కానుక. దీనికి భిన్నంగా ఉపవాస సమయంలో పాపాలు చేసి, అల్ల్లాహ్‌ా హద్దుల నతిక్రమించి, ఆయన ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేసినవారు తమ తప్పు తెలుసు కొని పశ్చాత్తాప పడవలసిన దినమూ ఇదే. మరి అది ఏం తీవ్రమైన నష్టమో కదా?!
   పండుగ రోజున నమాజు ముగించుకొని తిరిగి వచ్చేవారికి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకరు – ఆ రోజు అల్లాహ్‌ా తరఫున బహు మతులు పొంది ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకునేవారు. పరమ ప్రభువైన అల్లాహ్‌ా ఇటువంటి వారిని ఉద్దేశించి, ”వెళ్ళండి, నేను మిమ్మల్ని  క్షమించాను. మీరు నేనంటే ఇష్ట పడ్డారు. నేనూ మీరంటే ఇష్టపడ్డాను” అని అంటాడు.
 ఇక రెండవ వర్గం వారు రమజాన్‌ మాసపు సర్వ శుభాలూ పోగొట్టు కున్న దౌర్భాగ్యులు. వీరు నష్టాలతో, పరితాపంతో అన్నీ కోల్పోయి అసంతృప్తులై తిరిగి వస్తారు.
   కొంత మంది అరఫాత్‌ ప్రాంతం నుంచి గుర్రాలపై, ఒంటెలపై పరు గులు తీస్తున్నారు. ఉమర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ (ర) వారిని చూసి, ”గుర్రాలు లేక ఒంటెలపై స్వారీ చేసి పరుగు పందెంలో గెలిచినవారు విజేతలు కారు. ఎవరి పాపాలయితే మన్నించబడ్డాయో వారే నిజమైన విజేతలు” అని చెప్పారు.
  ఓ ముస్లిం! గత సంవత్సరం నీతోపాటు ఈద్‌ నమాజ్‌ చేసిన వారిని కాస్త గుర్తు తెచ్చుకో. వారిలో నీ తాతలు, తండ్రులు, నీవు ప్రేమించిన వారు, నీ బంధుమిత్రులూ ఉన్నారు కదూ! వారిలో కొందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏమైపోయారూ? రేపు నీకు బహుమతి ఇవ్వబడ నుంది. రేపు నీ కర్మల పత్రంలో నీ ఆచరణకు పరిపూర్ణ ప్రతిఫలం దాయబడు తుంది. అందులో కేవలం మంచి మాత్రమే నమోదు చేయ బడేందుకు గట్టిగా కృషి చేయి సుమా! అల్లాహ్‌ా అనుగ్రహాన్ని, ఆయన మన్నింపును, ఆయన క్షమాభిక్షను పొంద గలిగే రేపటి గొప్ప పండుగ దినం కోసం ఎదురు చూడు మరి!
”పతి ప్రాణీ మృత్యువు రుచి చూడ వలసిందే. ప్రళయ దినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చ యంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు సుమా!” (ఖుర్‌ఆన్-3: 185)