10, జూన్ 2013, సోమవారం

ABHILASHA: మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి

ABHILASHA: మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి:  ’మనం అనుకుంటాం పత్రి పార్థ్రనా పార్థ్రనేనని. కానీ, దేవుడు నిర్ణయిస్తాడు ఏది పవితమ్రయి నదో అదే పార్థన్రని’ అన్నట్టు  తల్లిదండుల్రుగా మనకు...

మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి

 ’మనం అనుకుంటాం పత్రి పార్థ్రనా పార్థ్రనేనని. కానీ, దేవుడు నిర్ణయిస్తాడు ఏది పవితమ్రయి నదో అదే పార్థన్రని’ అన్నట్టు  తల్లిదండుల్రుగా మనకు ఎన్ని మంచి ఉద్దేశాలున్నప్పటి ఎక్కడో చోట పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఆ విషయానికొస్తే నేటి తరం పిలల్లకు వారి బాల్యం లేకుండా చేస్తున్నామన్న ఆవేదన ఎంత మంది తల్లిదండుల్రకుంది?

‘మనం, ఇంత కావాడానికే ఎంతో కాలం పట్టిందే! ఆ రోజా పువ్వుకు అంత కావడానికి ఎంత కాలం పట్టిందో!’ అన్న ఆత్మ సమీక్ష ఒక పూవనంలోని పువ్వు విషయంలోనే కాక మనం ఇష్ట పడి పెంచుకుంటున్న బాలవన పసి మొగ్గల విషయంలో కూడా చేసుకున్నప్పుడే తల్లిదండ్రులుగా మనం ఎదిగినట్టు! మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మనం చేపట్టే ఏ పనికయినా అవి రళ కృషి, అవిశాంత పరిశమ్ర, గట్టి పట్టుదల అవసరం. మన ఇంట ఒక మొగ్గ విర బూసిం దంటే, మనం తల్లిదండుల్రుగా అప్పుడే జన్మించామని అర్థం. మన తోటలో మనం వేసిన ఆ విత్తనం మొలకయి, మహా వృక్షాన్ని సృజించగలగాలంటే,  ఆ మహా వృక్షంలోని ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క  రెమ్మ, ఒక్కొక్క  ఆకు, ఒక్కొక్క  పువ్వు, ఒక్కొక్క  ఫలం నుండి మానవత్వపు అమృతం జాలువారాలంటే – మనం నిరంతరం మారుతూ, నేర్చుకుంటూ ఉండాలి. చేయదగిన పనులేవో, చేయకూడని పనులేవో, ఉచిత నిర్ణయాలేవో, అనుచిత నిర్ణయాలేవో వారికి అర్థమయ్యేలా బోధించాలి.
 పిల్లల్ని పెంచడం ఒక కళ. కొందరు భావిస్తున్నట్టు అది తలనొప్పి ఎంత మాతం కాదు. పిల్లలతో కలిసి ఎదగడంలో అనందం ఉంది; జీవిత సార్థకత ఉంది. మనం మన పిల్లల్ని అర్థం చేసుకోవ డం అంటే పప్రంచాన్ని అర్థం చేెసుకోవటమే. అనువయిన సమయంలో, అనువయిన రీతిలో ఆహ్లాదక వాతావరణంలో, ఆకర్షణీయమయిన శైలిలో చిన్న చిన్న కథల మాధ్యమంతో వారికి జీవిత సత్యాలను బోధించాలి. వస్తువు వెల మాతమ్రే కాదు నైతిక విలువను సయితం వారికి తెలి యజేయాలి.  మన పిల్లలు సమాజంలోకి వెళ్ళక ముందు వారు మన పేమ్రలో ఆనందంగా ఉండాలి. గతం, భవిష్యత్తు గురించి చింతించకుండా ఈ క్షణంలో మన పిల్లలతో పేమ్రగా ఉండటం మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి. మన భయాలు, మన ఆందోళనలు, స్వీయ సందేహాలు పిల్లలకు చేరకుండా పేమ్రను పంచడం, పేమ్రతోనే పెంచడం నేర్చుకోవడం చాలా అవసరం.  అవసరమయితే వారితో కాసేపు ఆడుకొని అయినా సరే వారిని దగ్గరకు తీసు కోవాలి. ఇతరుల ముందు వారిని కించపర్చ రాదు. అలాగే వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు అనుమానంతో, అసూయతో, నిరాశతో మాట్లాడకూడని నచ్చజెప్పాలి. వెరి వెకిలింపులు, వికృత ఆనందం, అతి ఉదేక్రం, చపల స్వభావం, తొందరపాటు, మానసిక బలహీనత, వ్యర్థ కాలక్షేపం, మొదలయిన దురలవాట్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే, పిల్లలను మరింత పేమ్రించే, వారి కోసం మరింత సమయం కేటాయించే సమర్థత ఉన్న పేరెంట్స్‌ సంరక్షణలో పెరిగే పిల్లల్లో, ఆత్మ విశ్వాసం, నైపుణ్యాలు బలంగా ఏర్పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆహ్లాదకరమయిన బాల్యం ఆరోగ్యకరమయిన సమాజానికి పునాది.
 ’మనం అనుకుంటాం పత్రి పార్థ్రనా పార్థ్రనేనని. కానీ, దేవుడు నిర్ణయిస్తాడు ఏది పవితమ్రయి నదో అదే పార్థన్రని’ అన్నట్టు  తల్లిదండుల్రుగా మనకు ఎన్ని మంచి ఉద్దేశాలున్నప్పటి ఎక్కడో చోట పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఆ విషయానికొస్తే నేటి తరం పిలల్లకు వారి బాల్యం లేకుండా చేస్తున్నామన్న ఆవేదన ఎంత మంది తల్లిదండుల్రకుంది? తామరాకు తల్లిదండుల్రు కొందరుంటారు. తాము చెప్పిన నీతులు నీటి బొట్లలాగా పిల్లలపై వదిలేెస్తూ ఉంటారు. ఆ నీతి వాక్యాల్ని వారు పట్టించుకోరు. కాబట్టి మనం కేవలం పాఠాలు నేర్పే బాధ గురువులుగా కాక, అనుభవాన్ని అనువైన రీతిలో, అనువైన సమయంలో, అవసరమయిన మొతాదులో చెప్పే బోధ గురువులుగా మసలుకోవాలి.  విజయం, వికాసం, మానసిక పరిపక్వత లక్ష్యంగా పిల్లలను పెం చాలి. నీతి బాహ్యతను, అశ్లీలతను అసహ్యించుకునేలా వారికి తర్పీదు ఇవ్వాలి. బాల్యంలో, యవ్వ నంలో వారు చేసే సావాసాలు వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. కాబట్టి మన పిలలు చెడు సావాసాల చెరలో బంధీలు కాకుండా జాగత్త్ర పడాలి.
 ’బిందు బిందువైతే వ్యక్తి, సింధువైతే మహా శక్తి’ అన్న ఐక్యమత్య సూత్రాన్ని వారికి అర్థమయ్యేలా చెప్ప గలగాలి.  దివ్వె వెలగాలంటే తైలం కావాలి. అలాగే మన పిల్లలు సత్పౌరులుగా ఎదగాలంటే కేవలం బడి పాఠాలే సరిపోవు. వాటికితోడు పరలోక చింతనా తైలం ఎంతో అవసరం. ‘లోకులు అనుకుంటారు రక్తం కార్చడమే కష్టమని. కానీ, అశువ్రులు కార్చడం అంతకన్నా కష్టం’ అని ఎందరికి తెలుసు అన్నట్టు రాతి చివరి వెళల్లో నిద మేల్కొని పిల్లల శేయ్రస్సు కోసం కడు దీనం గా కన్నీళ్ళు పెట్టుకుంటూ, వారిలో విశిష్ఠమైన పరివర్తన కలిగించమనీ, వారికి మంచి వైపు, సత్యం వైపు దారి చూపని, వారి ద్వారా కళ్ళకు చలువ పస్రాదించమని, వారిని దైవభీతిపరులకు నాయకులుగా తీర్చిద్దిమని అల్లాహ్‌ాను వేడుకోవాలి.  అందుకు అనువైన కాలం రమజాను మాసం. కాబట్టి మన పిల్లల బాగు కోసం మనం వారిని మరింత పేమ్రిద్దాం! మరింత సమయమిద్దాం!!

సంఘ సంస్కరణ రణ పండితాగ్రేసరులు ముహమ్మద్‌ (స)

 ధర్మమయితే అందరికీ ధర్మమే. అధర్మమ యితే అందరికీ అధర్మమే. ఒకరికి పాపమయి నది అందరికీ పాపమే. ఒకరికి పుణ్యప్రదమై నది అందరికీ పుణ్య ప్రదమయినదే. నేరం అన్నది ఎవరు చేసినా నేరమే. ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం వర్తిం చదు.

అబుల్ ఇర్ఫాన్
ప్రపంచంలో ఎందరో మహాపురుషులు, దైవప్రవక్తలు ఉద్భవించి లోక కల్యాణం కోసం తమ వంతు కృషి చేశారు. అయితే ప్రవక్తలకు, ప్రవక్తేతరులకు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రవక్తేతరులయిన మహా పురుషులు సహజసిద్ధంగా తమకున్న జ్ఞానం, శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రమే పని చేశారు, చేస్తున్నారు. కాని దైవప్రవక్తలు తమకున్న జ్ఞానం, శక్తి సామర్థ్యాలను సృష్టికర్త నుండి లభించే దివ్యజ్ఞానం ప్రకారం వినియోగిస్తూ లోక కల్యాణం కోసం పనిచేస్తారు. దైవప్రవక్త లకు ఈ జ్ఞానం సందర్భానుసారం దివ్యావిష్కృతి (వహీ) ద్వారా కొద్ది కొద్దిగా లభిస్తుంది.
  అనాది నుండి నేటి యుగం వరకు లక్షలాది మంది దైవప్రవక్తలు ప్రభవించారు. వారందరూ ఒకే విధమైన మౌలిక బోధనలు
 తెచ్చారు. అందరూ సృష్టిపూజను, మిధ్యాదైవాల ఆరాధనను ఖండిస్తూ సృష్టికర్త, విశ్వ పాలకుడు, పరిపోషకుడయిన
ఏకేశ్వరుడ్ని మాత్రమే ఆరాధిం చాలన్నారు.
ఆయన ఆజ్ఞల ప్రకారమే జీవితం గడపాలని; తద్వారా మాత్రమే ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షం లభిస్తాయని తెలియజే శారు. మహనీయ ముహమ్మద్‌ (స) కూడా ఈ విషయాన్నే బోధించారు. ఈ మౌలిక బోధ నలకు సంబంధించిన ధర్మాన్నే ఇస్లాం అం టారు. దాని అనుచరులనే ముస్లింలు అం టారు.
 దాదాపు ప్రతి జాతిలోనూ దైవప్రవక్తలు ఉద్భవించారు. అయితే గత ప్రవక్తలు తెచ్చిన బోధనలు ప్రక్షిప్తాలకు గురయి పోయినందున దేవుడు నేటి కలియుగంలో మహనీయ ముహమ్మద్‌ (స) వారిని అంతిమ దైవప్రవక్త గా ప్రభవింపజేశాడు.
   మహాప్రవక్త ముహమ్మద్‌ (స) క్రీ.శ. 570 రబీవుల్‌ అవ్వల్‌ మాసం సోమవారం నాడు అరేబియాలోని మక్కా పట్టణంలో జన్మిం చారు. ముహమ్మద్‌ (స) జన్మించడానికి కొన్నాళ్ళ పూర్వమే ఆయన తండ్రి చని పోయాడు. ఏడేళ్ళ వయసులో తల్లి కూడా ఇహలోకం వీడిపోవడంతో ఆయన అనాథ అయ్యారు. –   ఆ కాలంలో యావత్తు ప్రపంచం విగ్రహారా ధన, మూఢనమ్మకాలలో పూర్తిగా మునిగి ఉం డింది. అరేబియాలో విగ్రహారాధనతో పాటు జనం నైతికంగా అనేక చెడుగులలో బాగా కూరుకుపోయి ఉన్నారు. సభ్యతా సంస్కారాలు పూర్తిగా కొరవడ్డాయి. సభ్యతా సంస్కారాలు లేని ఆనాటి సమాజంలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మద్య సేవనం, మగువ లోల త్వం మస్తుగా ఉండేవి. వీటికి తోడు అర బ్బులు తెగ విద్వేషం, జాతీయ దురభిమానాల తో చీటికిమాటికి పరస్పరం కత్తులు దూసు కుంటూ సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసుకునేవారు.కాని బాల ముహమ్మద్‌ (స)పై ఈ చెడు సమాజం ప్రభావం పడకుండా విధి ఆయన్ని మేకల కాపరిగా చేసి ఏకాంత ప్రదేశాల్లో నోరులేని జీవాల మధ్య ప్రకృతి దృశ్యాల చాటున సుశిక్షణ ఇచ్చింది.
  యౌవన వయస్సు వచ్చిన తరువాత ఆయన వర్తకం చేసి నీతిమంతుడయిన వర్తకునిగా ఖ్యాతి చెందారు. హజ్‌ సీజన్‌ వస్తే, వర్తకులం దరిలో ముహమ్మద్‌ (స) మాత్రమే ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకట్టుకునే వారు. కారణం ఆయన ఎలాంటి మోసం చేయకుండా నిజాయితీగా వ్యవహరిస్తారు; ఇతరులకంటే తక్కువ ధరలకు సరుకు అమ్ము తారు.వ్యాపారంలో వచ్చే లాభాలను పేదలకు, అనాధలకు దానం చేసేవారు.ఇలా ప్రతి వ్యవ హారంలోను ముహమ్మద్‌ (స) కనబరచే సౌశీ ల్యం, సద్వర్తనాలు చూసి ప్రజలు ఆయన్ని సాదిఖ్‌ (సత్యమంతుడు) అని, అమీన్‌ (నిజా యితీపరుడు) అని పిలిచేవారు.
 ఆనాడు బానిసవ్యవస్థ పకడ్బందీగా ఉండేది. ముహమ్మద్‌ (స) దైవప్రవక్త అయిన తరువాత పెద్దఎత్తున బానిస విమోచనోద్యమం సాగించి వేలాదిమందికి బానిసత్వం నుంచి శాశ్వతంగా విముక్తి కల్గించారు. ఆయనసలు దైవప్రవక్త కాకముందు నుంచే బానిస వ్యవస్థను అస హ్యించుకునేవారు. అర్ధాంగి ఖదీజా (రజి) ఓ బానిస బాలుడ్ని ఇస్తే ముహమ్మద్‌ (స) తక్షణ మే ఆ బాలుడికి బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు.
 కొన్నాళ్ళకు పిల్లవాడి తండ్రి, పినతండ్రి వచ్చి ”మా పిల్లవాడ్ని మాకు అప్పగించండి; మీ రెంత ధర అడిగినా ఇచ్చుకుంటాం” అన్నారు. దానికి ఆయన ”పిల్లవాడి  ఇష్టాయిష్టాల మీద వదిలేద్దాం. పిల్లవాడు మీ దగ్గరకు వస్తానంటే తీసికెళ్ళండి; నాకు డబ్బు ఇవ్వనవసరం లేదు. నాదగ్గరే ఉంటానంటే మాత్రం నేను మీకు అప్పగించలేను” అన్నారు. పిల్లవాడు ముహమ్మద్‌ (స) సద్వర్తనంతో ఇదివరకే ప్రభావితుడయి ఉన్నందున తండ్రి, పినతం డ్రుల వెంట సొంతూరుకు పోవడానికి నిరాక రించాడు.
  వయస్సు పెరుగుతున్న కొద్దీ ముహమ్మద్‌  (స)లో ఆధ్యాత్మిక చింతన కూడా అధికం కాసాగింది.ఆయన తరచుగా ఓ కొండ గుహ కెళ్ళి దైవధ్యానంలో లీనమైపోయేవారు. ఆయన (స) 40వ ఏట దైవదౌత్యం ప్రసాదిం చబడింది.  ఈ విధంగా సృష్టికర్త నుంచి దైవ సందేశం అవతరించే దివ్యావిష్కృతి ప్రారం భం అయింది. దివ్యావిష్కృతి ద్వారా లభించిన దైవాజ్ఞల ప్రకారం ముహమ్మద్‌ (స) ఏకేశ్వరో పాసనా ప్రచారం ప్రారంభించారు.
 దేవుడు ఒక్కడే ప్రభువు, ఆయనే సకల పూజలకు అర్హుడు, అన్ని అక్కరలనూ తీర్చే వాడూ ఆయనే, అందువల్ల చట్టాన్ని అంద జేసేవాడు, నియమాలను నిర్ధారించేవాడూ ఆయనే అనే మహనీయ ముహమ్మద్‌ (స) వాదనకు విస్తు పోయారు ప్రజలు. వారి ఆవేదన ఏమిటంటే అన్నీ చేసేవాడు దేవుడే అయితే మా మహనీయులు, మా ఊరి దేవ తలు, ఇలవేల్పుల మాటేమిటీ అన్నది! దాంతో జనం మొదట్లో ఆయన్ని వింతగా చూసి హేళన చేశారు. తరువాత క్రమంగా ఆయన కు శత్రువులయిపోయారు.
 ఆయనపై కష్టాలు వచ్చిపడ్తాయి. సత్య తిర స్కారులు ఆయన్ని రకరకాలుగా వేధించే వారు. పెదనాన్న అబూలహబ్‌, అతని భార్య అయితే బంధుత్వాన్ని సైతం ఖాతరు చేయకుండా ముహమ్మద్‌ (స)ని వేధించే వారు. ఆయన నడిచే బాటపై ముండ్లు పరిచే వారు. ఇంటి ఆవరణలో ప్రార్థన చేస్తుంటే పిట్టగోడ మీదనుంచి పైన మలినాలు పడవేసే వారు. అయినప్పటికీ ఆయన చూస్తూ సహిం చడం తప్ప పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు. కాకపోతే మితిమీరిన దౌర్జన్యాలతో విసుగెత్తి ”ముత్తలిబ్‌ వంశీయులారా! మీ పొరుగువారి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా!” అని మాత్రం అనేవారు.
  మరోవైపు జనం క్రమంగా ఇస్లాంని విశ్వ సించి ఆయనకు అనుచరులై పోసాగారు. బహుదవారాధకులైన ఖురైష్‌ తెగ నాయకులు ఈ నూతన ధర్మాన్ని విశ్వసించినవారిని  కూడా హింసించడం మొదలెట్టారు. ముస్లింల సంఖ్య పెరిగిన కొద్దీ వారిపై దుష్ప్రచారం, దౌర్జన్యాలు కూడా అధికమయ్యాయి. మూడేళ్ల పాటు సంఘబహిష్కరణ కూడా జరిగింది. అయినా తౌహీద్‌ విప్లవం ఆగలేదు. రెట్టి,పు వేగంతో వ్యాపించనారంభించింది. కారణం మహాప్రవక్త (స) ప్రతిపాదించిన ప్రాథమిక సూత్రాలే.
 ధర్మమయితే అందరికీ ధర్మమే. అధర్మమ యితే అందరికీ అధర్మమే. ఒకరికి పాపమయి నది అందరికీ పాపమే. ఒకరికి పుణ్యప్రదమై నది అందరికీ పుణ్య ప్రదమయినదే. నేరం అన్నది ఎవరు చేసినా నేరమే. ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం వర్తిం చదు.
 ఈ నిష్పక్షపాత నియమంలో నా స్వంత జను లకు, నా ఆత్మీయులకు, ఆప్తులకు, స్వయంగా నాకూ ఎలాంటి మినహాయింపు లేదు.నేను ప్రపంచంలో న్యాయ సంస్థాపనకు వచ్చాను. అందుకే నియుక్తుణ్ణి. ప్రజల మధ్య ఎటువంటి బేధభావం చూపించకుండా న్యాయంగా వ్యవ హరించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి నాపై బాధ్యత మోపబడింది. ప్రజల జీవితాల లో నెలకొన్న అసంఖ్యాకమయిన అసంతుల నాలను రూపు మాపడానికి, అన్యాయాలను అంతమొందించడానికి, సమాజంలో పొడ సూపుతున్న అసమానతలను తుడిచి ప్టెడానికి నియోగించబడ్డాను నేను. అంతే కాదు నేను మీ మధ్య న్యాయమూర్తిగా కూడా వ్యవహరి స్తాను. మీలో తలెత్తే తగాదాలకు సరయిన, న్యాయవంతమయిన తీర్పులను చేయడానికి దైవం నియమించిన న్యాయనిర్ణేతను నేను అని కూడా ఆయన చాటారు. తదనుగుణంగా మదీనా-లో స్థాపించిన తొలి ఇస్లామీయ నగర రాజ్యానికి న్యాయమూర్తి, జడ్జిగా కూడా ఆయన భూమిక అద్భుతమయినది.

హలాల్‌ సంపాదన వికసిస్తుందిహరామ్‌ సంపాదన కుంచించుకుపోతుంది

మావ సమాజానికి హాని కలిగించే పద్ధతులనే దేవుడు నిషేధించాడు, మంచి మార్గాలన్నింటినీ ధర్మసమ్మతం చేశాడు. దైవం నిషేధించిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం రెండూ లేవు, దైవం ధర్మసమ్మతం చేసిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం రెండూ కలుగుతాయి. కానీ మానవులు ధనవంతులైపోవాలనే ఆశలో పడి మంచి – చెడు, ధర్మం – అధర్మమన్న మాటే మరచిపోయారు. నిర్భయంగా అక్రమ మార్గాల్లో అమాయకులను దోచుకుని, విచ్చలవిడిగా అధర్మ సంపాదనను ఆరగిస్తున్నారు. 

ముహమ్మద్ సలీం జామయి
ధర్మ సమ్మతమైన జీవనోపాధి సౌభాగ్యానికి, సమృద్ధికు పునాది
ధనం మనిషికి ఒక అవసరం. దాని కోసం ప్రతి మానవుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ధనం సంపాదించటానికి ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నాయి. అందులో కొన్ని అధర్మమైనవీ, కొన్ని సక్రమ మైనవైతే, కొన్ని అక్రమమైనవని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి మనిషి ధన సంపాదన కొరకై అవలంబిస్తున్న మార్గం ధర్మ సమ్మతమైనదా లేక అధర్మమైనదా? అని ఆలోచించాలి. ఎందుకంటే మనందరినీ సృష్టించిన దేవుడు అక్రమ మార్గాల్లో ధనం సంపాదించ టాన్ని నిషేధించాడు. ధర్మసమ్మతమైన మార్గాన్నే అవలంబించాలని ఆదేశించాడు.
  ప్రతి మనిషీ విశ్వసించాల్సిన ఒక విషయం దైవ గ్రంథంలో ఉంది. అదేమంటే మావ సమాజానికి హాని కలిగించే పద్ధతులనే దేవుడు నిషేధించాడు, మంచి మార్గాలన్నింటినీ ధర్మసమ్మతం చేశాడు. దైవం నిషేధించిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం రెండూ లేవు, దైవం ధర్మసమ్మతం చేసిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం రెండూ కలుగుతాయి. కానీ మానవులు ధనవంతులైపోవాలనే ఆశలో పడి మంచి – చెడు, ధర్మం – అధర్మమన్న మాటే మరచిపోయారు. నిర్భయంగా అక్రమ మార్గాల్లో అమాయకులను దోచుకుని, విచ్చలవిడిగా అధర్మ సంపాదనను ఆరగిస్తున్నారు. వాస్తవానికి దైవం మరియు దైవ ప్రవక్త (స) అక్రమ మార్గాలను నిషేధించి, అధర్మానికి పాల్పడినవారికి కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు.
ఉదాహరణకు ఈ విధంగా ఆదేశించబడింది: ”మీలో మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన పద్ధతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగాన్ని కాజేసే టందుకు అధికారులకు ముడుపులు చెల్లించకండి”. (బఖరా: 188)
 మహనీయ ముహమ్మద్‌ (స) ఇలా తెలియజేశారు: ”మీలోని ప్రతి ఒక్కరి – రక్తం (ప్రాణం), ధనం మరియు మానం (కాజేయటం) మరొకరిపై నిషేధించబడింది”.
  ఓ సందర్భాన ప్రవక్త మహనీయులు (స) ఇలా తెలియజేశారు: ”శరీరంలోని ఏ భాగమైతే అక్రమ సంపాదనతో పెరుగుతుందో అది నరకాగ్నికి అతి చేరువవుతుంది”.
 మరో సందర్భంలో ఇలా హెచ్చరించారు: ”మానవుల్లో కొంత మంది వేరొకరి సంపాదనలో అక్రమంగా జోక్యం చేసుకుంటారు. అలాంటివారు రేపు పరలోకంలో నరకానికి ఆహుతి అవుతారు”.
 మానవులు దేని కారణంగా ఎక్కువ నరకానికి చేరుతారని ప్రవక్త (స)ను ప్రశ్నించగా – ”మర్మాంగం మరియు నోరు (ఈ రెండింటి) కారణంగా మానవులు అధికంగా నరకానికి చేరుతార”ని ప్రపవక్త (స) చెప్పారు.
  ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, నోటి ద్వారా దుర్భాష లాడటం, నిందలు మోపటం, అపద్ధపు సాక్ష్యాలు పలకటం లాంటివి మానవుణ్ణి నరకానికి చేర్చే ఒక కారణమైతే, ఆ నోటి ద్వారా అధర్మ సంపాదనను ఆరగించటం మరో కారణమౌతుంది.
నష్టాలు
అక్రమ సంపాదన వల్ల ప్రజల్లో మానవత్వం నశించిపోవటమే కాకుండా కొన్ని ఇతరత్రా నష్టాలు కూడా జరుగుతాయి.    దేవునితో తన సమస్యలను పరిష్కరించుకోవటానికి మానవుని కోసం దైవం తరఫున ప్రతిపాదించబడిన మార్గం ప్రార్థన. అక్రమంగా సంపాదించిన ఆహారం కేవలం ఒక్క మెతుకు భుజిస్తే అతని 40 రోజలు పార్థన స్వీకరించబడదని ప్రవక్త (స) హెచ్చరించారు. మరి జీవితం మొత్తం అక్రమ సంపాదనతోనే గడిపేస్తున్నవారి పరిస్థితి ఏమౌతుందో ఆలోచించవలసి ఉంది.
  ఒకసారి దైవప్రవక్త (స) తమ అనుచరులకు ఒక ఉదాహరణ ద్వారా ఇలా తెలియజేశారు: ”ఒక బాటసారి చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తాడు. (ప్రయాణం వలన) అతని ముఖం దుమ్ము కొట్టుకుని, జుత్తంతా చిందరవందరగా ఉంటుంది. అతను రెండు చేతులెత్తి ‘ఓ దేవా! ఓ నా దేవా!, అని కడు దీనంగా ప్రార్థిస్తాడు. కాని అతను తినే తిండి హరామ్‌ తిండి, అతను త్రాగేది కూడా హరామే. అతను ధరించిన దుస్తులు కూడా హరామ్‌ దుస్తులే. అతని శరీరం అధర్మ సంపాదనతో పోషించబడింది. అలాంటప్పుడు అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?”
  అక్రమంగా సంపాదించినవాడు, దాన్ని ఆరగించినవాడు నరక శిక్షలు అనుభవిస్తాడని దైవ ప్రవక్త (స) చాలా సందర్భాలలో హెచ్చరించారు. అక్రమ సంపాదనలో దైవం తరఫున శుభం కలుగదు. అతను ఎంత తిన్నా కడుపు నిండదు. అతనికి మనశ్శాంతి కలుగదు. అందుకే మన పూర్వీకులు, ప్రవక్తలు, సహాబాలు, ఇమాములు, విద్వాంసులు అక్రమ సంపాదనకు దూరంగా ఉండేవారు.
  ముస్లింల ప్రథమ ఖలీఫా అబూ బకర్‌ (ర) ముందు, ఆయన బానిస తినటానికి ఒక పదార్థం సమర్పించాడు. అబూ బకర్‌ (ర) దాని గురించి విచారించకుండానే ఆరగించారు. కాని తను భుజించిన పదార్థం అక్రమంగా ఆర్జించబడిందని తరువాత ఆయనకు తెలిసింది. వెంటనే నోటిలో వ్రేళ్ళు వేసి అతి కష్టం మీద తిన్నదంతా కక్కేశారు. ఈ వైనాన్ని చూసిన ఒకరు, ‘చిన్న పదార్థం తిన్నంత మాత్రానికే ఇంతగా ఆందోళన ఎందుక’ని ప్రశ్నించగా, ”మానవుని శరీరంలోని ఏ భాగం అక్రమ సంపాదనతో ఎదుగుతుందో అది నరకాగ్నికి ఆహుతి అవుతుందని ప్రవక్త (స) వారు చెబుతుండగా నేను విన్నాను. ఈ పదార్థం వల్ల నా శరీరంలో ఒక్క చుక్క రక్తమయినా తయారయిందంటే నేను నరకానికి వెళ్ళాల్సి వస్తుందని భయపడి ఇలా చేశాన” ని జవాబిచ్చారు.
  ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ) బట్టల వ్యాపారం చేసేవారని చరిత్ర కారులు చెబుతారు. ఒకసారి థానులోని లోపాన్ని చూపించిన మీదటే అమ్మమని తన గుమాస్తాకి ఆదేశించి బయటికి వెళ్ళారు. కొద్దిసేపటికి ఒక కస్టమర్‌ వచ్చాడు. అతనితో మాటల్లో పడి థానులోని లోపాన్ని చూపాలన్న విషయం మరచిపోయాడా గుమాస్తా. పది వేల దిర్హముల బట్టలు కొని కస్టమర్‌ వెళ్ళిపోయాడు. తరువాత అబూ హనీఫా (రహ్మ) తిరిగివచ్చినప్పుడు ఆ గుమాస్తా తాను పది వేల దిర్హముల బట్టలు అమ్మినానని లెక్కలు చెబుతూ… థానులోని లోపం చూపలేక పోయానని చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ) ఆ పది వేల దిర్హములు అధర్మమైనవనీ, అవి తన సంపాదనలో కలిసిపోకూడదని భావించి బీదవారికి దానం చేసేశారు.
  మన పూర్వీకులు, మహనీయులు అక్రమ సంపాదనకి ఎలా దూరంగా ఉండేవారో గమనించటానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. మరి నేడు మన పరిస్థితిని చూడండి! నేడు మనం వర్తకంలో ఈ నిజాయితీని పాటించటం లేదు. హలాల్‌-హరామ్‌, ధర్మం-అధర్మం అనే తేడా చూడకుండా సంపాదిస్తూ పోతున్నాం. ఈ దిగజారుడుకు కొన్ని కారణాలు ఇవి కావచ్చు….
1) ప్రతి మనిషి తొందరగా ధనవంతుడైపోవాలని ఆశపడుతున్నాడు. సంపదలో తన సహచరులను మించిపోవాలని ఆరాటపడుతున్నాడు. ఇలాంటి ఆలోచనతోనే అతను వడ్డీ వ్యాపారం, మత్తు పదార్థాలను అమ్మటం, లంచం తీసుకోవటం, అశ్లీలమైన లిట్రేచర్‌ని అమ్మటం, దొంగతనం చేయటం, మట్కా ఆడటం… ఇంకా దిగజారిపోయి అనేక నీచమైన పనులు చేయటం, మానవత్వాన్నే మరచిపోయి మృగంలా వ్యవహరించటం లాంటి చాలా పనులు చేస్తున్నాడు. వీటన్నింటినీ ఇస్లాం ధర్మం నిషేధించింది.
  ఇలా చేసేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి అక్రమ మార్గాలు! నిషేధించబడ్డ మార్గాలు! నలుగురికీ ద్రోహం కలిగించే మార్గాలు! ఇలా దొడ్డి దోవలో వచ్చిన సంపాదనలో శుభముండదు. రేపు పరలోకంలో దేవుని ముందు చేసిన కర్మలకు లెక్క చెప్పటానికి నిలబడినప్పుడు అతను ప్రపంచంలో ధనం ఎలా సంపాదించాడు, ఎక్కడ ఖర్చు చేశాడన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అడుగు కదిలించటానికి వీలు కాదని ప్రవక్త (స) స్పష్టంగా తెలియజేశారు. ఆ రోజు ఈ అక్రమ మార్గాలతో సంపాదన కొనసాగించేవారు దేవునికి ఏమి సమాధానం చెప్పగలమన్నది ఆలోచించాల్సిన అవసరముంది.
2) అక్రమ మార్గాలతో తప్ప ధర్మసమ్మతమైన మార్గాలతో ధనవంతులం కాలేమని మరి కొందరు భ్రమ పడతారు. ఈ ఆలోచన విశ్వాసానికి, దైవ వాగ్దానాలకి విరుద్ధం. సమస్త జీవరాసులకు సౌభాగ్యాలు ప్రసాదించే ప్రభువు ధర్మసమ్మతమైన సంపాదనలో వృద్ధి కలిగిస్తానని, అక్రమ సంపాదనను  క్ష్షీణింపజేస్తానని చెప్పాడు. దైవభీతితో వ్యవహరించేవారికి (అక్రమ సంపాదనలకు దూరంగా ఉండేవారికి) వారు ఊహించని చోటు నుండి సంపాదనను కలుగజేస్తానని కూడా వాగ్దానం చేశాడు.
  నేడు అక్రమ మార్గాలకు పాల్పడి రోడ్డున పడ్డవారి  ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక మార్గం నుండి సంపాదిస్తే పది మార్గాల ద్వారా అది నాశనమైపోవటం కూడా మనం (ప్రపంచంలో) చూస్తున్న విషయమే.
  కాబట్టి మనం అక్రమ సంపాదనను ఆశించకుండా ధర్మసమ్మతమైన మార్గాన్నే అవలంబిస్తూ అందులోనే వృద్ధిని ప్రసాదించమని దైవాన్ని వేడుకోవాలి.

సుహృద్భావం సామరస్యానికి పునాది

ఏ సమాజ పురోగమనంలోనైనా, తిరోగమనంలోనైనా యువకుల పాత్ర విస్మరించరానిది. కాబట్టి వారి పాఠ్య పుస్తకాలలో మతతత్వ ప్రచారంగాని, మత వ్యతిరేక ప్రచారంగానీ ఉండకూడదు. అన్ని మతాలకు సంబంధించిన వారి పిల్లలు ఉన్న పాఠశాలలో  కేవలం ఒక మత బోధ జరిపితే, కొందరిని ప్రోత్సహించి, కొందరిలో అసంతృప్త జ్వాలలను రగిలించిన వారమవుతాము. అలాగే, నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అన్ని వర్గాల యువకులను తరచూ కలిపే క్రీడా కార్యక్రమాలు విస్తృతంగా జరగాలి. 

ప్రజలు సహజంగా శాంతికాముకులు. వారు శాంతిని, మనశ్శాంతిని, ద్వేషరహిత, అణ్వస్త్ర రహిత శాంతినే కోరుకుంటారు. అందుకే శాంతి అనేది మనుజ జాతి మనుగడతో ముడిపడి ఉన్న అవిభాజ్యాంశం అయింది నాటి నుంటి నేటి వరకు. తగాదాలను చిలికి, చిలికి గాలి వానగా చేసుకొని పరస్పర విధ్వంసానికి దారి తీసే పశు ప్రవృత్తిని శాంత స్వభావులు ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి సుహృద్భావాన్ని పెంపొందించి సామరస్యాన్ని సాధించుకునే దిశగా మనిషి పురోగమించాలి.
నిఖిల జగుత్తు నిర్వహణకర్త అయిన పోలిక, సాటి, సమానులు లేని ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్‌ సెలవిచ్చి నట్లు ”వ జఅల్నాకుమ్‌ షువూబఁవ్‌ వ ఖబాయిల లి తఆరఫూ” – ఒక ప్రాంత సంస్కృతి, ఆచార వ్యవ హారాలు, జీవన సరళి, శైలిని మరో ప్రాంత ప్రజలు చారిత్రక, సామాజిక, నైతిక నేపథ్యంలో తమ దృక్కోణం నుంచి కాక, వారి దృక్పథం ద్వారా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది.
  భాష బలమైన సంధానకర్త, భావప్రకటన ఆయువు  వంటిది. కాబట్టి ఆయా రాష్ట్రాలలో కనీసం ప్రభుత్వామోదం పొందిన భాషల్ని నేర్చుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వందల సంవత్సరాలు ప్రక్క ప్రక్కనే నివసిస్తూ  ఒకరు ఇంకొకరి భాషను మాట్టాడకపోవడం అనేది వారు అనుకోకుండానే వేర్పాటు ధోరణికి అంకురార్పణం కాగలదన్న వాస్తవాన్ని గ్రహించాలి.
   ఏ సమాజ పురోగమనంలోనైనా, తిరోగమనంలోనైనా యువకుల పాత్ర విస్మరించరానిది. కాబట్టి వారి పాఠ్య పుస్తకాలలో మతతత్వ ప్రచారంగాని, మత వ్యతిరేక ప్రచారంగానీ ఉండకూడదు. అన్ని మతాలకు సంబంధించిన వారి పిల్లలు ఉన్న పాఠశాలలో  కేవలం ఒక మత బోధ జరిపితే, కొందరిని ప్రోత్సహించి, కొందరిలో అసంతృప్త జ్వాలలను రగిలించిన వారమవుతాము. అలాగే, నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అన్ని వర్గాల యువకులను తరచూ కలిపే క్రీడా కార్యక్రమాలు విస్తృతంగా జరగాలి. ఒక మతస్తులు ఒక చోట, వేరొక మతస్తులు మరొక చోట ఆడుకునే దోష సంస్కృతి పోవాలి. గత 60 ఏండ్లలో వచ్చిన వేర్పాటు ధోరణిని అధిగమించి మతంతో, జాతితో, వృత్తితో, హోదా అంతస్థులతో నిమిత్తం లేని రీతిలో అందరూ ఒకే చోట ఆటపాటల్లో పాల్గొనటం నేటి ముఖ్యావసరంగా గుర్తించాలి. అన్ని మతాలలోని శాశ్వత మానవ విలువలైన – సత్యనిష్ఠ, ధర్మ నిరతి, దైవభక్తి, దయ, కరుణ, పరోపకారం. సానుభూతి, త్యాగం, ఔదార్యం వంటి సద్గుణాలను వెలికి తీసి, వాటిని ప్రధానాంశాలుగా భావించేటట్లు భావితరాలను తీర్చి దిద్దాలి.
   చారిత్రక, వాణిజ్య, వ్యావసాయిక కారణాల వల్ల ఒక ప్రాంతంలో ఒక మతస్తులు, మరో ప్రాంతంలో వేరొక మతస్తులు సంఖ్యాధిక్యత కలిగి ఉండవచ్చు. దాంతో అల్పసంఖ్యాకులైన సోదరులకు (వారు ఏ మతస్తులైనా) తాము అల్ప సంఖ్యాకులుగానే మిగిలిపోతామేమోననే భయం కలగటం సహజం. అయితే ఈ మానసిక దౌర్బల్యాన్ని అధిగమించడం అవసరం. ఎందుకంటే అలా భయపడినవాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోలేరు. మేము వేరు, వారు వేరు కనుక మేము ఎవరితోనూ కలిసేది లేదని అధిక సంఖ్యాకులు భావించినా, అల్ప సంఖ్యాకులు తలపోసినా – రెండూ ప్రమాదకర ధోరణులే.
  ఈ నిమిత్తం పిల్లల్లో సుహృద్భావాన్ని, సహిష్ణుతను, సోదరభావాన్ని, సమానత్వ భావ-నను, స్వేచ్ఛా పిపాసను నూరిపోయడం అవసరం. అలాగే పొరపాటు వైఖరిని అవలంబించే పెద్దలను, వైషమ్యాన్ని చిలికించే శాంతి విఘాతకులను సన్మార్గానికి మళ్ళించాల్సిన గురుతర బాధ్యత అన్ని మతస్తుల వారిపై ఉంటుంది. ‘అల్‌ ఫిత్నతు అషద్దు మినల్‌ ఖత్ల్‌’ – కల్లోలం సృష్టించటం, అలజడి రేకెత్తించటం హత్యకన్నా దారుణం అన్న యదార్థాన్ని అందరూ సమానంగా గుర్తించాలి. ‘అన్యాయంగా ఒక ప్రాణిని బలిగొంటే సమస్త మానవాళిని బలిగొన్నట్లు. ఒక ప్రాణిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లు’ అన్న ఆ సర్వేశ్వరుని శాసనానికి అందరూ తలొగ్గి జీవించాలి. గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ బృహత్తర కార్య సిద్ధికి అందరూ చిత్తశుద్ధితో పూనుకుంటారని ఆశించటం అత్యాశ కాదేమో!!

ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో

మానవుడు తన పర్యవసానం పట్ల ఏమరుపాటుకు, అజాగ్రత్తకు లోనై ఉన్నాడు. కాని నిజం ఏమిటంటే కాలం అతన్ని అత్యంత శీఘ్రంగా కోతకోసే స్థలానికి లాక్కు పోతోంది. మరి ఇతనేమో ప్రాపంచిక అల్ప వస్తువుల కోసం అర్రులు చాస్తున్నాడు. పైగా తనేదో గొప్పగా పాటు పడుతున్నట్లు భావిస్తున్నాడు. ఘనకార్యం చేస్తున్నట్లు ఊహించుకుని, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. యదార్థానికి అతను, తన సమయాన్ని వృధా చేస్తు న్నాడు. 
- మౌలానా వహీదుద్దీన్‌ ఖాన్‌
ఈ మీ జీవితం అత్యంత సుదీర్ఘమైనది, నిరంతరాయమైనది. మరణం ఈ జీవి తానికి ఆఖరి అంచు కాదు. పైగా అది మరో యుగానికి – నవ యుగానికి నాంది. మరో మాటలో చెప్పాలంటే మృత్యువు జీవిత థల మధ్య ఒక విభ జన రేఖ వంటిది. ఉదాహరణకు ఒక రైతు చేనులో నారు వేస్తాడు. నీరు పెడ తాడు. పంట కోసం పెట్టుబడి పెడతాడు. అది పండే వరకూ శ్రమిస్తాడు. పంట పండిన తర్వాత కోత కోస్తాడు. ఎందుకు? పంటను నూర్చి ఏడాది వరకూ తనకు కావలసిన ఆహారధాన్యాన్ని సమకూర్చు కునేందుకు! పంట కోతకు వచ్చిందంటే, దాని అర్థం ఒక థ ముగిసింది. రెండవ థకు లేక రెండవ యుగానికి ఆ కోత నాంది అయింది. అంతకు ముందు నారు వేయటం, పంటను తయారు చేయటం, కోత కోయటం-ఇదంతా ఏమిటి? తన అవసరాన్ని తీర్చుకోవడానికి చేసే నిరం తర సాధన. పంట ముందు వరకూ కేవలం శ్రమ తప్ప, ధన వ్యయం తప్ప మరేదీ అతనికి లభించలేదు. అయితే పంట కోసిన తరువాత ఆ రైతు తన శ్రమకు తగ్గ ఫలితం పొందాడు. తాను పెట్టిన పెట్టుబడికి తగ్గ లాభాన్ని – దిగుబడిని – ఆర్జించాడు.
  మన జీవన పరిస్థితి కూడా సరిగ్గా ఇంతే. మనం ఈ ప్రపంచంలో పరలోకం యొక్క పంటను తయారు చేస్తున్నాము. మనలో ప్రతి ఒక్కడూ పరలోకంలో తన కంటూ ఒక పంట పొలాన్ని కలిగి ఉన్నాడు. ఆ పంటపొలాన్ని అతను సేద్యం అన్నా చేెస్తున్నాడు లేదంటే బంజరుగా నైనా వదలి పెడుతున్నాడు. ఆ చేనులో అతను మేలు జాతి విత్తనాలయినా చల్లాడు లేదంటే నాసిరకం విత్తులయినా వేశాడు. విత్తనాలు వేసిన మీదట పొలాన్ని గాలికి వదిలేయడమైనా చేెశాడు లేదా విత్తనాలు చల్లిన   క్షణం  నుంచి   దాన్ని కంటికి రెప్పలా కాపలా కాయటమైనా చేశాడు. అతను నాటితే ముళ్ళ మొక్కల యినా నాటాడు లేదా మంచి మంచి పూలు పండ్లయినా పండించాడు. అతను తన శక్తియుక్తులన్నింటనీ పంట చేను మెరుగు కోసం ధారబోయడమైనా చేశాడు లేదా పొలాన్ని ఏ మాత్రం పట్టించుకో కుండా ఇతరత్రా వ్యాపకాల్లోనయినా నిమగ్నుడయ్యాడు. చావు దాపురించే దాకా ఆ పంట తయారవదు. చావు వచ్చిందంటే పరలోక పంట పొలం కోతకు వచ్చిందన్న మాటే! ఈ ప్రపంచంలో మన కన్ను మూత బడిందంటే మరో ప్రపంచంలో మన కన్ను తెరుచుకుందన్న మాట!  జీవితమంతా శ్రమించి సిద్ధం చేసిన పంట చేను అక్కడ మన ముందు ప్రత్యక్షమవుతుంది.
  గుర్తుంచుకోండి – సాగు చేసిన రైతు మాత్రమే కోత కోస్తాడు. ఏ విత్తనాన్ని వేసు కుంటాడో దాని పంటనే కోస్తాడు. అలాగే ప్రతి వ్యక్తికీ ఈ లోకంలో అతను మర ణానికి ముందు చేసుకున్న దాని ప్రతి ఫలమే లభిస్తుంది. రైతుకు వ్యవసాయోత్ప త్తుల అంచనా ఉంటుంది. తాను పెట్టిన పెట్టుబడిని బట్టి, పడిన శ్రమను బట్టి అతనికి ఇంచుమించు ఎన్ని బస్తాల ధాన్యం ఇంటికి వస్తుందో లెక్క ఉంటుంది. అదే విధంగా మనిషి ఈ ప్రపంచంలో ఏ మేరకు పాటుపడతాడో ఆ మేరకే పర లోకంలో అతనికి ప్రాప్తమవుతుంది. దేని కోసం ప్రయత్నించాడో అదే లభిస్తుంది. కష్టార్జితాన్ని పొందే స్థలం పరలోకం. మరణం తరువాత మళ్ళీ కష్టపడే అవ కాశం ఉండదు. అలాగే పరలోకానికి ఒక పరిమితి అంటూ ఉండదు. అది అనంత మైనది, శాశ్వితంగా ఉంటుంది.ఎంత  సున్నితమైన     విషయమిది! మరణానికి ముందే మానవుడు ఈ యదార్థాన్ని గ్రహిస్తే ఎంత బావుండు!! ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే మరణించిన తరువాత అతను యదార్థాన్ని . అర్థం చేసుకుని ప్రయోజనమేమీ ఉండదు. చనిపోయిన తరువాత యదార్థాన్ని గ్రహిం చాడంటే గత కాలంలో తన వల్ల జరిగి పోయిన పొరబాటుపై విచారిస్తున్నాడన్న మాట. కాని అది ఎటువంటి పొర బాటంటే ఇప్పుడది ఏ విధంగానూ సరిదిద్ద బడదు.
  మానవుడు తన పర్యవసానం పట్ల ఏమరుపాటుకు, అజాగ్రత్తకు లోనై ఉన్నాడు. కాని నిజం ఏమిటంటే కాలం అతన్ని అత్యంత శీఘ్రంగా కోతకోసే స్థలానికి లాక్కు పోతోంది. మరి ఇతనేమో ప్రాపంచిక అల్ప వస్తువుల కోసం అర్రులు చాస్తున్నాడు. పైగా తనేదో గొప్పగా పాటు పడుతున్నట్లు భావిస్తున్నాడు. ఘనకార్యం చేస్తున్నట్లు ఊహించుకుని, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. యదార్థానికి అతను, తన సమయాన్ని వృధా చేస్తు న్నాడు. అతని ముందు ఒక మహదావ కాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసు కోవటం ద్వారా తన కోసం ఉజ్వలమైన భవిష్యత్తును తయారు చేెసుకోగలడు. కాని అతనేమో నిశ్చింతగా ఉన్నాడు. అనంత మయిన సుఖాలకు, అపూర్వ  ఆదరణకు నిలయమైన స్వర్గం వైపునకు అతని ప్రభువు అతన్ని పిలుస్తున్నాడు. కాని అతనేమో మూన్నాళ్ళ ముచ్చటలో, విషయ లాలసలో మునిగి తేలుతున్నాడు. తానేదో సంపాదిస్తున్నానని అతను తలపోస్తు న్నాడు. కాని వాస్తవానికి అతను జార విడుస్తున్నాడు. ప్రపంచంలో ఇల్లు కట్టి జీవితాన్ని నిర్మించుకున్నానని అతను భావిస్తున్నాడు. అది నిర్మితమయ్యేది ఏదో ఒకనాడు కూలిపోవడానికే.

    ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు చేెయవలసిన దేమిటి? చేస్తున్నదేమిటి?

    దానవుణ్ణి జయించిన మానవుడు

    గుహను గుడిసెగా మార్చుకున్నాడు. ఇటుకే కండగా, ఇనుమే అండగా చేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఈటెల్లాంటి చేతులతో ఏటిని రెండుగా చీల్చాడు. పడవల అరి కాళ్ళతో కడలి అంచుపైన నడిచాడు. సూదిలో దారం లా చొరబడ్డాడు గిరుల గుండెల్లో. సెగ విసి రిన రాపిడిలో రాలే నిప్పును చిలికించాడు. బిగుసుకు పడి ఉన్న నేలను చిగుళ్ళ నోళ్ళతో పలికించాడు. అడవిలో పూసే అందాలను అంగణంలో నాటించాడు. కోరల మధ్య అదిరే జీవాలను ఊరి ఒడిలో పెంచుకున్నాడు.

    విశ్వం వెలుగునీడల కలయిక. పెనుగులాడుతుంటాడు మనిషి ఇది తెలియక. అడుగు నేలపై ఆనని యౌవనం అడుసులోకి దిగబడుతుందని గహ్రించక పడతాడు తికమక. నిత్యం దీప్తమని అనుకున్న జీవితం లిప్తలో ఆరిపోతుందని ఎరుగక కకావికలుడవుతాడు మనిషి.
    గాండ్రించే అరణ్యాలు, గీపెట్టే సముద్రాలు, తీండ్రించే జలపాతాలు, తిరగబడే ఝంఝా మారుతాలు, గట్లకు కాట్లు వేసే నదుల బుసబుసలు, గిరుల వేళ్ళను పెళ్ళగించే భూగర్భ రుసరుసలు – విస్మయం చెందాడు మనిషి. ఈ భువనాన అతనో అపరిచితుడు. చేదు చిలికే జీవితంలో స్వాదుతా నిలయాలుంటాయని గానీ, మధువులొలికే మాటబొమ్మల మాటు నాగపణమ్ములుంటాయనిగానీ అప్పటికి అతనికి తెలవదు. జీవితం – తృటిలో అది చేద బావి. తృటిలో అది ఎండమావి. క్షణం నిండి ఉంటుంది, క్షణం ఎండి ఉంటుంది. క్షణంలో అది పెను ఎడారి, కనులు తెరిచిన ఇనుప దారి. జీవితం – అందులో సుఖదుఃఖాలు సమపాళ్ళలో ఉంటాయి. ఈ జీవిత సత్యాన్ని గ్రహించటానికి మనిషికి చాలా సమయమే పట్టింది.
    ఇది తెలిసిన మరుక్షణం -
    గుహను గుడిసెగా మార్చుకున్నాడు. ఇటుకే కండగా, ఇనుమే అండగా చేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఈటెల్లాంటి చేతులతో ఏటిని రెండుగా చీల్చాడు. పడవల అరి కాళ్ళతో కడలి అంచుపైన నడిచాడు. సూదిలో దారం లా చొరబడ్డాడు గిరుల గుండెల్లో. సెగ విసి రిన రాపిడిలో రాలే నిప్పును చిలికించాడు. బిగుసుకు పడి ఉన్న నేలను చిగుళ్ళ నోళ్ళతో పలికించాడు. అడవిలో పూసే అందాలను అంగణంలో నాటించాడు. కోరల మధ్య అదిరే జీవాలను ఊరి ఒడిలో పెంచుకున్నాడు.
      ఉక్కును ఉప్పులా కరగబోసి, ఇనుమును జనుములా సాగదీసి, అహర్నిశలు పరిశ్ర మించి ప్రకృతిలోని చలనశీలానికి ప్రతీకగా, జగతిలో భ్రమణానికి ప్రతి రూపంగా ఎది గాడు మనిషి. తన తనువులో ఉన్నది ఆ భువ నమే. తన శ్వాసలో ఉన్నది ఆ పవనమే. తన రుధిరంలో ఉన్నది ఆ ప్రవాహమే. తన కళ్ళల్లో ఉన్నది ఆ ప్రసారమే. తన శిరసులో ఉన్నది ఆ చలనమే. ఈ పంచ భూతాల తళుకుతో, ఈ జ్ఞాంనేద్రియాల వెలుగుతో మింట (ఆకాశాన) మొలచిన మిసిమిని ఇంట నిలిపాడు దివ్వెలా. ఆ కాంతిని లోకానికందించాడు. నాకాన్ని నేల కు దించాడు. సముద్ర గర్భంలో చదరంగం ఆడాడు. ఆమెరికాలో కూర్చొని ఆంధ్ర ప్రదేశ్‌ లో కన్పించాడు. ఏమూలనో ‘హెలో’యని విశ్వం సాంతం విన్పించాడు.
      చిరకాలం మేధాసాగర మథనం చేసి మనిషి సాధించిన విషయాలు అగణ్యం. పాన్పులోంచి కదలకుండా ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. చేతికి తడి అంటకుండా చిత్రంగా భోంచ శాడు. కాలికి మన్నంట కుండా కాబా గృహం దర్శించాడు. వీటన్నింటికీ ప్రేరణగా నిలిచింది మెదడు+మనస్సు.అయితే ఇన్ని సాధింగలిగిన మనిషి తన ఆ చిట్ట్టి మనస్సును అదుపు చేయ లేకపోతున్నాడు. సమస్తాన్ని గెలిచి వచ్చిన ఈ మనిషి తన మనస్సులోని తమస్సును గెలవ లేకపోతున్నాడు. ఎంత విచారకరం! ఆ మన సుతో మనిషి సాగించిన సంబాషణ ఇది -
    మనిషి: మనసు నను లాలించే ఆత్మసఖి. మనసు నన్నూగించే అపర శిఖి. మనసే నా సారథి. మనసే నా వారిధి. మనసే నా వారధి.
    మనసు: ఆ గొంతుక ఎవరిదీ? అటునున్నది ఎవరదీ? ఒహోహో మనిషి! దీపశిఖవు కాదు సుమా వొఠ్ఠి నుసి. నేను నీ వారిధినా? నేను నీకు వారధినా? రథసారథినా… సఖినా.. ..శిఖినా…ఔనొక మాదిరిగా సఖినే, శిఖినే, వారిధినే, వారధినే. రథసారథినే.
      నాటి – ఆది కాలం నాటి మాట; నీ లోపల దైవ అవిధేయత మంచుగడ్డై పేరిన నాడు, నీలోని చైతన్యం జడీభవించిన నాడు, దైవ శిక్షకు నీవు నిలువునా కంపించి పోయిన నాడు, గుండె గుబులుతో నీ  దవడలు   వడ
     వడ వణికిన నాడు, జ్వలనధాతువునై నీలో పశ్చాత్తాపాగ్నిని రగిలించి వేడి కలిగించిన శిఖినే. గాడి తప్పిన నీ మేధను దారి మళ్ళించి దయాభిక్షకు అర్హుణ్ణి చేసిన ప్రియ సఖినే. ప్రభువు ప్రసన్నత మార్గాన నిన్ను నడిపించిన రథసారథినే. నిన్ను వీపుపై మోసిన సారిధినే. నీ ప్రగతికి పూబాటగా నిలిచిన వారధినే.
    (అంతలో తమస్సు నడుస్తున్న చప్పుడు భయంకరంగా విన్పిస్తుంది).
    మనషి: అబ్బా! దారుణ ధ్వని. పాల కడలిలో హాలహలం అలజడి. భరించలేకున్నాను. కర్ణ పుటాలు వక్కలవుతున్నాయి. మనసులోని మధువు ఆవిరైపోతున్నది. హృదయ దీపం ఆరి పోతున్నది. అయ్యో! కాటుక కొండ కదలి నట్టు. కర్రి మబ్బులు క్రమ్మినట్టు. ఆ భయం కర రూపాన్ని చూడలేను. అమ్మయ్యో! ఆ ఉక్కు పాదాలు నాదిక్కే కదులుతున్నాయి. ఆ కబంద హస్తాలు నావైపే వస్తున్నాయి. ఇప్పుడేం చేయను!
    తమస్సు: స్వర్గంలో హాయిగా విహరించ నిన్ను దైవ అభిశాపానికి, కోపానికి గురి చేసిన మసిని నేనే. నేనంటే నీకెందుకంత భయం? అప్పుడే నా శక్తిని మరచిపోయావా?
    మనిషీ! దోర్బలం ఉన్న దుర్బలుడవు నీవు. మట్టి సారంతో సృజంచబడిన సామాన్యుడవు నీవు. నీవా సృష్టి శ్రేష్ఠుడవు? నీకా నన్ను సాష్టాంగపడమని దైవం చెప్పినది?
     మానవత్వ హరణం నాకెంతో ప్రియం. మాయలు, మోసాలు, మోహాలు నా రక్త సం బంధీకులు. నగ్నత్వం నా పురోగతికి నిలువు టద్దం. పాప సంస్కృతి నివృత్తి నా ప్రవృత్తి.
    మనిషిని ‘మనీ+షి’కి బానిసగా మార్చిన దుశ్శక్తిని నేనే. నేను సైగ  చేస్తే లోకం లౌక్యం కోల్పోయి నన్నే అనుసరిస్తుంది. నేను మత్తు జల్లితే లోకులు చిత్తయిపోతారు. నన్నెదిరించే నరులను సున్నంలా చిదిమి వేస్తాను. నాకు ఎదురయ్యే మానవులను ఆకులా నలిపివేస్తాను. మానవత్వాన్ని మంట గలుపుతాను. దానవాత్వనికి ఆజ్యం పోస్తాను. వీర మానవుడు నా తాండవానికి రుగ్నాత్ముడు కావాలి. ప్రపంచం నా ఘట్టనకు శకలాలై పోవాలి. ఇదిగో కదిలాను నేను! ఇదిగో కదిసాను నేను!
    (తమస్సు కదలిక భయంకర ధ్వని విన్పిస్తుంది. కమ్రంగా ఆ ధ్వని సన్నగిల్లి పోతుంది. ఇంపైన ఓ స్వరం వినిపిస్తుంది).
    మనసు: మెరుపు ఉరిమితే ఉలిక్కిపడి అరిచే వాడవు. చంరదసూర్య గ్రహణాలను చూసి వాటిని పాము మింగేసిందని భయకంపితు డయ్యేవాడవు. నీవు పంచ భూతాలను దేవుళ్ళగా, దెయ్యాలుగా పూజించావు. చెట్టు, రాయి, రప్పలను మ్రొక్కావు. గత స్థితి నెమరు వేసుకో, కళ్ళ పొరలు తీసి వేసుకో. సమస్యల తో సతమతమవుతున్నప్పుడు నిన్ను మార్గ నిర్దేశం చేసింది నేనే. నిజ ఆరాధ్యుడు ఒక్కడే నని సృష్టి నిదర్శనానలను చూపించి చెప్పాను. ఒఠ్ఠి మనిషివైన నిన్ను మహా మనీషిగా మలిచాను.
    మనషి: పంచ ప్రాణాలు అరచేతలో ఉన్నవి. కను మూసి తెరిచే లోపుగా ఉక్కు హస్తాల్లో నలిగిపోతున్నాను. నన్ను కాపాడే తోటమాలీ! నా శ్రేయం కోరే వనమాలీ! ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు!!
    మనసు: భయపడకు సుమా, కలత చెందకు. నీ వెన్నంటి నేనుంటాను. తమస్సు వేస్తున్న వెర్రి వెషాల్ని సాంతం గమనిస్తున్నాను.
    మనిషి: పాలు పోసి పెంచుకున్న పాపమై పోయిందే తమస్సు. నానాటికీ నా లోపల దానవత ముదురుతుంది. ప్రతి క్షణం నా లోపల పైశాచికం ప్రబలుతుంది.(అంతలో మళ్ళీ తమస్సు పానకంలో పుడకలా దూరుతుంది).
    తమస్సు: భీకర డమరు ఘోషణ ముందు దొమ్మరి డోలు పోలిక ఉంది నీ సంభాషణ.
    నేను మాత్రం యథావిధిగా మోసగిస్తూనే ఉంటాను. కాకోలాన్ని కబళించి మనిషి కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. విష ధారల ను అతని జీవితంలో ప్రాకించి అతని హృదిని పాషాణంలా మార్చివేస్తాను. జలసిని జల పాతంలా దూకించి, జులుంతో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసేస్తాను. మానవత్వ మందారాల పూదోటలో మారణాయుధాల ఫ్యాకర్టీలు తెరు స్తాను. నా ఉక్కు పాదాల క్రింద సమస్తాన్ని నశ్యంలా నలిపేస్తాను.
    (తమస్సు వికృతంగా అరచి, భీకరంగా కేక పెట్టి వెళ్ళిపోతుంది). మనిషి: నా కరుణ కలువను నలిపేశాడు నిశాటుడు. నా అంతరాత్మ ఘోషను నులిపే శాడు కిరాతకుడు. నా దైవానికి నన్ను దూరం చేశాడు దుర్మార్గుడు. అయ్యో నా మతి మండ! అయ్యో తమస్వీ! పాలు పోసిన జాలి గుండెను హాలహలంతో నింపేస్తావా?!
    మనసు: గడిచిపోయిన దానికై తపించెదవేల. ఎడదనే కన్నీళ్ళ మడుగు చేసెదవేల. విల పించీ ఫలమ్మేమి మానవా! వెలుగు బాట ముందుంది కానవా!! తమస్సు ఒక మదపు టేనుగైతే నీవు మావటీడవు కావాలి. తమస్సు ఒక సుడిగుండం అయిపోతే నీవొక వారధియై నిలవాలి. పుణ్యఫలాలను పిండి అమృతం ఒలికించాలి. కరుణ రసాల్ని పండించి ప్రేమ పూలు పూయించాలి. ఖుర్‌ఆన్‌లోని ఆదేశాలు ఆలంబం కావాలి. అంతిమ ప్రవక్త (స) ఆదర్శం ప్రాణంకన్నా ప్రియమవ్వాలి.
    మనిషీ! నువ్వు తమస్సును గెలిస్తే, కోరిలకు కళ్లెం వేస్తే అప్పుడు తమస్సు ఉండదు. నీ హృది ఉషస్సు కాంతులతో తేజోవంతం అవు తుంది. అవును; ఖుర్‌ఆన్‌ ఏమంటున్నదో శ్రద్ధగా విను!
      ”నిశ్చయంగా అల్లాహ్‌ భీతిపరులు (ముత్తఖీన్‌) తమకు ఎప్పడైనా షైతాన్‌ తరఫు నుంచి చెడు ఆలోచనలు తట్టినప్పుడు వారు అల్లాహ్‌ (యొక్క ఔన్నత్య) స్మరణలో నిమగ్నులైపోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది”. (ఆరాఫ్: 201)
    చూడు అల్లాహ్‌ ఏమంటున్నాడో!
    ”నా దగ్గరకు చేరుకోవడానికి ఇదే రుజు మార్గం. (ఈ మార్గంలో నడిచే) నా (ప్రియ) దాసులపై నీ పెత్తనం చెల్లదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టుల మీదనే చెల్లు తుంది. వారందరకి నరకమే గతి. ఇది మా వాగ్దానం”. (హిజ్ర్: 41-43)
    గమనించు షైతాన్‌ ఎంత నిస్సహాయుడో!
    ”నీ గౌరవ ప్రతిష్టల సాక్షి! నేను అందరిని దారి తప్పిస్తూ ఉంటాను. నీతిమంతులైన నీ దాసులపై నా పెత్తనం చెల్లదు”. (సాద్‌: 82, 83)
    మనిషి: (ధైర్యం తెచ్చుకుని) అహో! క్షుద్ర శక్తీ! కాచుకో నా గమన ధాటి. మానవుడు మేల్కొన్నాడు. తిరగబడ్డాడు, గెలిచాడు. దానవుడు తోకముడిచి పారిపోయాడు. మానవత్వం ఇంట నిలిచింది. మింటనున్న మాధవుడు దీవించాడు. హృదయలోకంలో శాంతి, కాంతి, క్రాంతి వెల్లి విరిసింది. అదుగో! దూరాన దైవవాణి కమ్మని స్వరం విన్పిస్తున్నది:
    ”మా ప్రభువు అల్లాహ్‌ మాత్రమే అని పలికి, దానిపై స్థిరంగా ఉన్నవారి వద్దకు దైవ దూతలు దిగివచ్చి ఇలా అంటూ ఉంటారు). ‘మీరు భయపడకండి, కలత చెందకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శువార్తను అందుకోండి”.  (హామీమ్‌ అస్సద్‌దా: 30)

    9, జూన్ 2013, ఆదివారం

    ముఖ్య సూచనలు

    కువైట్‌లో నీకు స్వాగతం సోదరా! ఈ చిరు పుస్తకంలో నీ పనిని మరింత సులభతరం చేసే ముఖ్య సూచనలున్నాయి. వీటి ద్వారా నువ్వు నీ పనిని సమర్థవంతంగా నిర్వర్తించగలవన్నది మా ఆశ. ఈ సూచనల ఆధారంగా నువ్వు కువైట్‌ సమాజంలో త్వరగా కలిసి పోగలవడంతోపాటు  ఇక్కడి ఆచారవ్యవహారాలను బాగా అర్థం చేసుకోగలవన్న నమగ్మకమూ మాకుంది.  
    కార్మిక  సోదరా!
    కువైట్‌లో నీకు స్వాగతం సోదరా! ఈ చిరు పుస్తకంలో నీ పనిని మరింత సులభతరం చేసే ముఖ్య సూచనలున్నాయి. వీటి ద్వారా నువ్వు నీ పనిని సమర్థవంతంగా నిర్వర్తించగలవన్నది మా ఆశ. ఈ సూచనల ఆధారంగా నువ్వు కువైట్‌ సమాజంలో త్వరగా కలిసి పోగలవడంతోపాటు  ఇక్కడి ఆచారవ్యవహారాలను బాగా అర్థం చేసుకోగలవన్న నమగ్మకమూ మాకుంది.  అనుక్షణం నీ మేలు కోరే  ఆప్తుల మధ్య నివసిస్తున్నా నన్న గొప్ప అనుభూతి నీకు కలుగుతుంది. ఇక్కడ నీవు చూసే సత్ప్రవర్తన ఇస్లామీయ జీవన విధానా నికి తార్కాణం. మా సమాజపు ప్రత్యేకకు ప్రబల నిదర్శనం. అంతిమంగా మేము నీకు శ్రేయోశుభాలు ప్రాప్తించాలని, పుష్కలమైన ఉపాధి నీకు లభించాలాని ఆకాంక్షిస్తున్నాము!
    ముఖ్య సూచనలు
    సచ్చీలత, నిజాయితి నీ కార్యసిద్ధి రహస్యం అని, నిన్ను విజయ బాటన నడిపించే సుగుణం అని గుర్తుంచుకో.
     మనం చేసే పని పట్ల చిత్తశుద్ధి, అంకితభావం మనల్ని మన లక్ష్యానికి దగ్గర చేసే అత్యంత సులభ మయిన మార్గం.
     నగుమోము సంభాషణ నిన్ను ఎదుటి వ్యక్తి అభిమానించేలా చేస్తుందని మరువకు.
      గృహ రహస్యాల పట్ల అప్రమత్తత ఇతరులు నిన్ను ప్రేమించేలా చేసే అద్భుత అస్త్రం.
     నవ్వు పని చేస్తున్న ఇంటికి సంబంధించిన సకల వస్తుల సంరక్షణా బాధ్యత నీ మీదే ఉంటుంది. వాటిని ఒక అప్పగింతలా జాగ్రతగా కాపాడుకో.
     సత్ప్రర్తన, సత్య సంధత, సచ్చీలత అనే సుగుణాలు ఇతరులను నిన్ను నమ్మేలా చేస్తాయి.
     అందరి పట్ల గౌరవభావం కలిగి ఉండటమనేది నిన్ను వారికిష్టునిగా మారుస్తుంది.
    అబద్దం ఓ వెకిలి చేష్ట. అది మాట వరసకు, నవ్వించడానికి అన్నా సరే.
    తప్పుని ఒప్పుకోవడం, ఒప్పుని తెలుసుకొని మసలుకోవడం అనేది ఇతరులు నిన్ను మన్నించేలా,
        వారి మన్ననల్ని నువ్వు అందుకునేలా చేస్తోంది.   నీ వ్యకిగత సమస్యలనుగానీ, నీ ఇంటి వ్యవహారాలనుగాని నీ కఫీలుతో చర్చించి చులకన  కాకు.
     మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కోపంగానీ, కాఠిన్యంగాని, ధ్వేష భావన గానీ మాటల ద్వారా వ్యక్తమవ్వకుండా జాగ్రత్త పడాలి.
     పెద్ద వయస్సు వృద్దుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. వారి అవసరాల్ని సమకూర్చడంలో కడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కువైటీ కుటుంబంలో వారికే ప్రథమ స్థానం ఇవ్వబడుతుంది గనక.
     కువైటీ ప్రజల జీవన శైలి
     1) గృహ ప్రతిష్ఠ:
     మీరు, మీ యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే అపరిచితులను యజమానుల అనుమతి లేనిదే లేక వారికి తెలియకుండా ఇంట్లోకి రానివ్వకూడదు. గృహస్థులు ఇంట్లో ఉన్నప్పుడు ఇతరులు రావడానికి అనుమతి ఉన్న వేళల్లోనే పిలవాలి.
    ఇరుగుపొరుగు వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. స్వరం పెంచి మాట్లాడటంగానీ, చెత్తా చెదారం పడేయటంగాని, వారి ఇళ్ల ఎదుట వాహనాల్ని నిలబెట్టడంగాని, వారి ఇళ్ల ముందర గుమి గూడటంగానీ చేయకూడదు.
    కువైటీ సమాజం అస్సలు ఇష్టపడని విషయం – తలుపుల్లోంచిగానీ, కిటికీల్లోంచిగాని, కప్పు పై నుంచిగాని, గోడల మీది నుంచిగాని ఇంటి లోపలకి తొంగి చూడటం,
    2) సాప్తాహిక సమావేశాలు:
    కువైటీ ప్రజలు సాప్తాహిక సందర్శనాల ద్వారా బంధుత్వ సంబంధాలను బల పర్చుకుంటారు.
    భార్యాభర్తలిరువురూ సకుంటుంబ సపరివారి సమేతంగా వెళ్ళి సొంతవారిని సందర్శించి,  పరామర్శించి రావడాన్ని అమితంగా ఇష్టపడతారు.
    కుటుంబ సభ్యులు పరస్పరం కలుసుకునే సమావేశాల్లో స్త్రీపరుషులు కలిసి మెలిసి ఉండటమనేది  చాలా అరుదు.
     పరస్పర సందర్శనాలు పండగ సమయం, పెళ్ళి సమయం-ఇత్యాది శుభ సందర్బాల్లో అధికంగా ఉంటాయి.
    3) వస్త్రధారణలో హుందాతనం:
    కువైటీ స్త్రీలకు చక్కటి అందమైన వస్త్రధారణ పట్ల మక్కువ అధికం. వారు సంస్కారం ఉట్టి పడేలా నిండు దుస్తులు ధరిస్తారు. అటువంటి సాంప్రదాయబద్ధమయిన దుస్తులు తన ఇంట్లో పని చేసేవారు కూడా ధరించాలని కోరుకుంటారు.
     దేహ పరిశుద్ధత, దుస్తుల పరిశుభ్రత చాలా కీలకాంశం.
    కువైటీ స్త్రీలు శరీర ఒంపుసొంపులు కనపడకుండా చీలికలు లేని వదులు మరియు దళసరి దుస్తులు ధరిస్తారు. వారు తలకు స్కార్ఫు కూడా తప్పనిసరిగా వేసుకుంటారు. మరి కొందరు నిఖాబ్‌ కూడా ధరిస్తారు.
      4) ఇంటి వ్యవహారాల బాధ్యత:
    భర్తే కుటుంబానికి యజమాని. ముఖ్య నిర్ణయాలు అతనే తీసుకుంటాడు. ఒకవేళ అతను నాన్న ఇంట్లో ఉంటే ఇంటి పెద్దగా తండ్రి వ్యవహరిస్తాడు.
     ప్రాకృతికంగా భర్తే కుటుంబానికి పెద్ద దిక్కు. ఇంటి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలన్నీ అతని   అధీనంలోనే ఉంటాయి.
    కుటుంబంలో భర్త తల్లి (అత్త)కి ప్రత్యేక స్థానం, గౌరం ఉంటుంది.
     ప్రాజ్ఞ వయసుకు చేరని మగ సంతానంగానీ, ఆడ సంతానంగానీ  వారి వ్యక్తిగత వ్యవహారాల్లో తల్లి మీదే ఆధార పడతారు.
    5) కువైటీ ప్రజల సహజసిద్ధమయిన లక్షణాలు:
    1) కువైటీ పౌరుడు తన వ్యవహారాలన్నిటిలోనూ నిజాయితీపరుడయి ఉంటాడు. ముఖస్తుతినిగానీ,  రెండు నాల్కల ధోరణినిగాని సుతరామూ ఇష్టపడడు.
    2) కువైటీ పౌరులు సహజసిద్ధంగా ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు.
    3) కువైటీ ప్రజలు పని త్వరగా పూర్తి చేయడాన్ని, నిజాయితీగా వ్యవహరించడాన్ని ఇష్ట పడతారు.
    4) కువైటీ మహిళ తన సంతానాన్ని అమితంగా ప్రేమిస్తుంది. గొప్ప ఆత్మ విశ్వాసం కలిగి ఉంటుంది.
    5) కువైటీ పౌరులు తన దేశాన్ని ప్రేమిస్తారు, తన రాజ్యం పట్ల అంకితభావం కలిగి ఉంటారు.
    6) విశ్రాంతి వేళల్లో ఇబ్బంది పెట్టడాన్ని కువైటీ ప్రజలు సుతరామూ ఇష్ట పడరు.
    మార్గదర్శకాలు
     నీరు మరియు విద్యుచ్ఛక్తి మహదానుగ్రహాలు. కాబట్టి వాటిని వృధా ఖర్చు చేయకూడదు.
     గృహ శుభ్ర పరికరాలను అవసరానికి తగ్గట్టు మితంగా వాడాలి.
    విద్యుత్‌ పరికరాలను వాడేటప్పుడు వాటి శక్తికి మించిన భారాన్ని వేయకుండా కడు అప్రమత్తంగా  వ్యవహరించాలి.
     ప్రమాదాలకు, దుర్ఘటనలకు గురి కాకుండా ఉండాలంటే గ్యాస్‌ను తెరిచి ఉంచకూడదు.
     ఎవరూ లేని ప్రదేశంలోని లైట్లను ఆర్పి వేయాలి.
     వేరే పనిలో నిమగ్నమయి ఉన్నప్పుడు నీళ్ళ పంపుల్ని తెరిచి ఉంచకూడదు.
     ఇంటిలోపల ఎటువంటి దుర్ఘటన, నష్టంగాని చోటు చేెసుకుంటే వెంటనే యజమానికి సమాచారం అందజేయాలి.
     స్వయంగా మీకు ఏదయినా సమస్య వచ్చి పడితే దాన్ని సయితం ముందు యజమానికి తెలియ జేయాలి.
     అన్యుల వల్ల జరిగే తప్పుల నుండి గుణపాఠం నేర్చుకో. ఆ తప్పు నీ వల్ల జరగకుండా జాగ్రత్త పడు.
      ఇతరులు పని చెయ్యమని గుర్తు చేయాల్సిన గత్యంతరం నీకు రాకుండా చూసుకో.
     పెద్దలను గౌరవించడం, పిల్లలను కనికరించడం నీ నిత్య చర్యగా మార్చుకో.
    ఇంట్లో ప్రవేశించేటప్పుడు అనుమతి నిమిత్తం సలామ్‌ చేయడం, తలుపు తట్టడం, బెల్‌ నొక్కడం కనీస మర్యాద. ముఖ్యంగా గృహస్థులు ఉన్న సమయంలో, విశ్రాంతి వేళల్లోనైనా సరే.
    గృహస్థులతో, అక్కడ పని చేెసే వారితో వీలైనంతగా మర్యాదపూర్వకంగా మాట్లాడు.
    గృహస్థుల వస్తువులను సంరక్షించు. వాటిని వినియోగించక ముందు అనుమతి తీసుకోవడం మరచిపోకు.
     గృహస్థుల్తో, ముఖ్యంగా యువకుల్తో మరింత అప్రమత్తంగా వ్యవహరించు. స్త్రీపురుషుల ఎవరితో నయినా మరీ చనువు మంచిది కాదు.
     అతిథుల్ని సాదరంగా ఆహ్వానించాలి.
    అనవసరమైన సంభాషణగానీ, అవసరం లేని విషయాల్లో తల దూర్చడంగాని అవాంఛనీయం.
    హెచ్చు స్వరంతో మాట్లాడటంగానీ, పగలబడి నవ్వడంగానీ చేయకూడదు.
    అరబీ ముఖ్యమైన వాడుక వాక్యాలు
    అస్సలాము అలైకుమ్‌               (పరస్పరం కలుసుకున్నప్పుడు చేసుకునే అభివాదం)
    వ అలైకుముస్సలామ్‌               (ప్రతిగా ఇచ్చే జవాబు)
    ఈదుకుమ్‌ ముబారక్‌               (పండుగ సందర్భాల్లో)
    రమజాన్‌ కరీమ్‌                    (రమజాను మాసంలో)
    షుక్రన్‌, బారకల్లాహు ఫీక           (నీకు ఎవరయినా మేలు చేసినప్పుడు)
    అఫ్వన్‌ లేదా ఆసిఫ్‌                 (క్షమాపణ కోరాలనుకున్నప్పుడు)
    మిన్‌ ఫజ్లిక లేదా లౌ సమిహ్‌త       (అనుమతి కోరాలనుకున్నప్పుడు)
     కైఫ హాలుక                        (యోగక్షేమాల్ని విచారించాలనుకున్నప్పుడు)
    అల్‌హమ్దు లిల్లాహి అలా సలామతిక  (ప్రయాణం నుండి లేదా ఆసుపత్రి నుండి వచ్చి వ్యక్తితో   కలిసినప్పుడు)
    మఅస్సలామహ్‌                   (వీడ్కోలు పలకాలనుకున్నప్పుడు)
    తఫజ్జల్‌, అహ్లన్‌ వ సహ్లన్‌, హయ్యాకుముల్లాహ్‌ా  (అతిథిని స్వాగతించేటప్పుడు)
     అమ్మీ గైర్‌ మౌజూద్‌ ఫిల్‌ మన్జిల్‌      (కఫీల్‌ – యజమాని ఇంట్లో లేరని చెప్పాలనుకున్నప్పుడు)
     అమ్మతీ గైర్‌ మౌజూదహ్‌ా ఫిల్‌ మన్జిల్‌  (కఫీలా – యజమానురాలు ఇంట్లో లేరని చెప్పాలనుకున్న  ప్పుడు)
    తస్బహు అలా ఖైర్‌
    సలామాత్‌, అల్ఫ్‌ సలామాత్‌, ఖతాకస్సూ. అలైకల్‌ ఆఫియా (జబ్బు నుండి స్వస్థత కోరుతూ)
    మబ్రూక్‌                            (శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నప్పుడు)
    బిల్‌ బరకహ్‌, మన్జిల్‌ బరకహ్‌        (ఇల్లు కొన్నప్పుడు)
    తకబ్బలల్లాహు                      (ఆరాధనలు నిర్వహించిన తర్వాత)
    ప్రథమ చికిత్స
    అగ్ని ప్రమాదం:
    1) సంబంధిత వ్యక్తి తల్లితంద్రులకు సమాచారం అందజేయండి. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రక్కనే  నిలబడండి.
    2) ప్రమాదానికి గురైన వ్యక్తిని ప్రాణాపాయ స్థలం నుండి బైటికి తీసే ప్రయత్నం చేయండి.
    3) ఒకవేళ సదరు వ్యక్తి బట్టలకు నిప్పంటుకుంటే కంబళిని ఉపయోగించి మంటల్ని ఆర్పండి.
    4) కాలిన చోటును మీ చేత్తో తాకకండి.
    5) మీకు మీరుగా ఎటువంటి ఆయిన్ట్‌మెంట్‌ని పూయడంగానీ, బ్యాండేజిని కట్టడంగాని చేయకండి.
    పగుళ్ళు:
    పగళ్ళు అంటే, ఒక చోటగానీ, అనే చోట్లగాని చీలిక ఏర్పడం.
    పగుళ్ళ నివారణ:
    1) సంబంధిత వ్యక్తి తల్లితంద్రులకు సమాచారం అందజేయండి. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రక్కనే  నిలబడండి.
    2) విరిగిన భాగాన్ని కదిలించకండి.
    3) ఎటువంటి ప్రమాదం చోటు చేసుకున్నా అంబులెన్స్‌ కోసం వేచీ చూడండి. మీకు మీరుగా
        ఎలాంటి ముందస్తు చర్యలకు పాల్పడకండి.
    రక్తస్త్రావం మరియు గాయాలు:
    రక్తస్త్రావమంటే గాయమవ్వడం చేత, లేదా తెగడం చేత ఒకింత రక్తాన్ని కోల్పోవడం.
    గాయాల నివారణ:
    1) సంబంధిత వ్యక్తి తల్లితంద్రులకు సమాచారం అందజేయండి. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రక్కనే నిలబడండి.
    2) అంబులెన్స్‌ కోసం వేచీ చూడండి. మీకు మీరుగా ఎలాంటి ముందస్తు చర్యలకు పాల్పడకండి.
    విష పదార్థాలు:
    విషం అంటే, ఏ పదార్థమయితే తగు మోతాదులో శరీరంలో ప్రవేశిస్తే మానవ ప్రాణానికి హాని కలిగే, లేదా శరీరావయవాలు పని చేయకుండా పోయే ప్రమాదముంటుందో అది.
    విషం సంక్రమించే మార్గాలు:
    1) వాసన చూడటం (గ్యాస్)
    2) మింగటం  (ఘనములు, ద్రవములు)
    3) కుట్టడం (జంతువు కొరకటం, పురుగులు కుట్టడం)
    4) పీల్చడం (పురుగుల మందు, క్రిమి సంహారకాలు)
    విషం రకాలు:
    1) ప్రమాదకర విష పదార్థాలు (ఇంటి శుభ్రం చేసే ద్రవ పదార్థాలు, పెట్రోల్‌తో తయారయిన వస్తువులు)
    2) ప్రమాదకరం కాని విష పదార్థాలు  (క్రిమి సంహారకాలు, లేదా పాడయిపోయిన ఆహారపదార్థాలు)
    విష ప్రభావ చిహ్నాలు:
    1) పెదాలపై మచ్చలు ఏర్పడటం. (మరకలు లేదా మచ్చలు)
    2) నోటిలో మరియు గొంతులో తీవ్రమయిన నొప్పి కలగటం.
    3) వాంతి కావడం, వికారంగా అన్పించడం.
    4)  ఉదర తిమ్మిరి, విరోచనాలు
    5) మాట రావడం కష్టమవడం.
    6) శ్వాస పీల్చేటప్పుడు దుర్వాసన రావడం.
    విష నివారోపాయాలు:
    1) సంబంధిత వ్యక్తి తల్లితంద్రులకు సమాచారం అందజేయండి. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రక్కనే నిలబడండి.
    2) గాలి వెళ్లే (తలుపులు, కిటికీలు) ద్వారాలు తెరవాలి.
    3) వాంతుల చేయమని ఒత్తిడి చేయకూడదు.
    4) నోటి ద్వారా ఏ వస్తువును ఇవ్వకూడదు.
    5) సేవించబడిన విష పదార్థమేదో తెలుసుకోవాలి. తద్వారా సరైన వైద్యం చేయడానికి సులభమవుతుంది.
    6) ప్రమాదానికి గురయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలి.
      కొన్ని ముఖ్యమైన నెంబర్లు దిశ                      ఫోన్‌ నెంబరు
    ఆంబులెన్స్‌
    ఫైర్‌ ఇంజన్‌                        112
    హెల్ప్‌ సెంటర్‌

    3, జూన్ 2013, సోమవారం

    సుహృద్భావం సామరస్యానికి పునాది

      భాష బలమైన సంధానకర్త, భావప్రకటన ఆయువు  వంటిది. కాబట్టి ఆయా రాష్ట్రాలలో కనీసం ప్రభుత్వామోదం పొందిన భాషల్ని నేర్చుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వందల సంవత్సరాలు ప్రక్క ప్రక్కనే నివసిస్తూ  ఒకరు ఇంకొకరి భాషను మాట్టాడకపోవడం అనేది వారు అనుకోకుండానే వేర్పాటు ధోరణికి అంకురార్పణం కాగలదన్న వాస్తవాన్ని గ్రహించాలి.
     ప్రజలు సహజంగా శాంతికాముకులు. వారు శాంతిని, మనశ్శాంతిని, ద్వేషరహిత, అణ్వస్త్ర రహిత శాంతినే కోరుకుంటారు. అందుకే శాంతి అనేది మనుజ జాతి మనుగడతో ముడిపడి ఉన్న అవిభాజ్యాంశం అయింది నాటి నుంటి నేటి వరకు. తగాదాలను చిలికి, చిలికి గాలి వానగా చేసుకొని పరస్పర విధ్వంసానికి దారి తీసే పశు ప్రవృత్తిని శాంత స్వభావులు ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి సుహృద్భావాన్ని పెంపొందించి సామరస్యాన్ని సాధించుకునే దిశగా మనిషి పురోగమించాలి.
    నిఖిల జగుత్తు నిర్వహణకర్త అయిన పోలిక, సాటి, సమానులు లేని ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్‌ సెలవిచ్చి నట్లు ”వ జఅల్నాకుమ్‌ షువూబఁవ్‌ వ ఖబాయిల లి తఆరఫూ” – ఒక ప్రాంత సంస్కృతి, ఆచార వ్యవ హారాలు, జీవన సరళి, శైలిని మరో ప్రాంత ప్రజలు చారిత్రక, సామాజిక, నైతిక నేపథ్యంలో తమ దృక్కోణం నుంచి కాక, వారి దృక్పథం ద్వారా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది.
      భాష బలమైన సంధానకర్త, భావప్రకటన ఆయువు  వంటిది. కాబట్టి ఆయా రాష్ట్రాలలో కనీసం ప్రభుత్వామోదం పొందిన భాషల్ని నేర్చుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వందల సంవత్సరాలు ప్రక్క ప్రక్కనే నివసిస్తూ  ఒకరు ఇంకొకరి భాషను మాట్టాడకపోవడం అనేది వారు అనుకోకుండానే వేర్పాటు ధోరణికి అంకురార్పణం కాగలదన్న వాస్తవాన్ని గ్రహించాలి.
       ఏ సమాజ పురోగమనంలోనైనా, తిరోగమనంలోనైనా యువకుల పాత్ర విస్మరించరానిది. కాబట్టి వారి పాఠ్య పుస్తకాలలో మతతత్వ ప్రచారంగాని, మత వ్యతిరేక ప్రచారంగానీ ఉండకూడదు. అన్ని మతాలకు సంబంధించిన వారి పిల్లలు ఉన్న పాఠశాలలో  కేవలం ఒక మత బోధ జరిపితే, కొందరిని ప్రోత్సహించి, కొందరిలో అసంతృప్త జ్వాలలను రగిలించిన వారమవుతాము. అలాగే, నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అన్ని వర్గాల యువకులను తరచూ కలిపే క్రీడా కార్యక్రమాలు విస్తృతంగా జరగాలి. ఒక మతస్తులు ఒక చోట, వేరొక మతస్తులు మరొక చోట ఆడుకునే దోష సంస్కృతి పోవాలి. గత 60 ఏండ్లలో వచ్చిన వేర్పాటు ధోరణిని అధిగమించి మతంతో, జాతితో, వృత్తితో, హోదా అంతస్థులతో నిమిత్తం లేని రీతిలో అందరూ ఒకే చోట ఆటపాటల్లో పాల్గొనటం నేటి ముఖ్యావసరంగా గుర్తించాలి. అన్ని మతాలలోని శాశ్వత మానవ విలువలైన – సత్యనిష్ఠ, ధర్మ నిరతి, దైవభక్తి, దయ, కరుణ, పరోపకారం. సానుభూతి, త్యాగం, ఔదార్యం వంటి సద్గుణాలను వెలికి తీసి, వాటిని ప్రధానాంశాలుగా భావించేటట్లు భావితరాలను తీర్చి దిద్దాలి.
       చారిత్రక, వాణిజ్య, వ్యావసాయిక కారణాల వల్ల ఒక ప్రాంతంలో ఒక మతస్తులు, మరో ప్రాంతంలో వేరొక మతస్తులు సంఖ్యాధిక్యత కలిగి ఉండవచ్చు. దాంతో అల్పసంఖ్యాకులైన సోదరులకు (వారు ఏ మతస్తులైనా) తాము అల్ప సంఖ్యాకులుగానే మిగిలిపోతామేమోననే భయం కలగటం సహజం. అయితే ఈ మానసిక దౌర్బల్యాన్ని అధిగమించడం అవసరం. ఎందుకంటే అలా భయపడినవాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోలేరు. మేము వేరు, వారు వేరు కనుక మేము ఎవరితోనూ కలిసేది లేదని అధిక సంఖ్యాకులు భావించినా, అల్ప సంఖ్యాకులు తలపోసినా – రెండూ ప్రమాదకర ధోరణులే.
      ఈ నిమిత్తం పిల్లల్లో సుహృద్భావాన్ని, సహిష్ణుతను, సోదరభావాన్ని, సమానత్వ భావ-నను, స్వేచ్ఛా పిపాసను నూరిపోయడం అవసరం. అలాగే పొరపాటు వైఖరిని అవలంబించే పెద్దలను, వైషమ్యాన్ని చిలికించే శాంతి విఘాతకులను సన్మార్గానికి మళ్ళించాల్సిన గురుతర బాధ్యత అన్ని మతస్తుల వారిపై ఉంటుంది. ‘అల్‌ ఫిత్నతు అషద్దు మినల్‌ ఖత్ల్‌’ – కల్లోలం సృష్టించటం, అలజడి రేకెత్తించటం హత్యకన్నా దారుణం అన్న యదార్థాన్ని అందరూ సమానంగా గుర్తించాలి. ‘అన్యాయంగా ఒక ప్రాణిని బలిగొంటే సమస్త మానవాళిని బలిగొన్నట్లు. ఒక ప్రాణిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లు’ అన్న ఆ సర్వేశ్వరుని శాసనానికి అందరూ తలొగ్గి జీవించాలి. గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ బృహత్తర కార్య సిద్ధికి అందరూ చిత్తశుద్ధితో పూనుకుంటారని ఆశించటం అత్యాశ కాదేమో!!

    ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో

    సాగు చేసిన రైతు మాత్రమే కోత కోస్తాడు. ఏ విత్తనాన్ని వేసు కుంటాడో దాని పంటనే కోస్తాడు. అలాగే ప్రతి వ్యక్తికీ ఈ లోకంలో అతను మర ణానికి ముందు చేసుకున్న దాని ప్రతి ఫలమే లభిస్తుంది. రైతుకు వ్యవసాయోత్ప త్తుల అంచనా ఉంటుంది. తాను పెట్టిన పెట్టుబడిని బట్టి, పడిన శ్రమను బట్టి అతనికి ఇంచుమించు ఎన్ని బస్తాల ధాన్యం ఇంటికి వస్తుందో లెక్క ఉంటుంది. అదే విధంగా మనిషి ఈ ప్రపంచంలో ఏ మేరకు పాటుపడతాడో ఆ మేరకే పర లోకంలో అతనికి ప్రాప్తమవుతుంది. 

    మౌలానా వహీదుద్దీన్‌ ఖాన్‌