15, సెప్టెంబర్ 2013, ఆదివారం

అమానవీయం

 నేడు వైజ్ఞానిక, సాంకేతిక అభివృద్ధి కొన్ని ప్రాంతాల్లో వికటించి ముప్పుగా పరిణమిస్తోంది.  అందరికి అందుబాటులో ఉన్న అంతర్‌ జాలాన్ని అవకాశంగా తీసుకుని కొన్ని అరాచక శక్తులు, కల్లోల జనకులు నకిలి వార్తలు, వీడియోలు వ్యాప్తి చేసి  ప్రజలను తరచూ తీవ్ర భావోద్వేగాలకు లోను చేస్తున్నారు. ఇటువంటి మత కలహాలు, మారణ కాండలు జరుగుతాయన్న పక్కా సమా చారం అందినా, పరిపాలకు అచేనావస్థలో ఉండటం క్షమించరాని నేరం. నిజానికి 2011లోనే రాష్ట్ర ప్రభుత్వం మత కలహాలు, హింసకాండల నిరోధక బిల్లు తీసుకురావాలన్న ప్రతిపాదన పెట్టినా ఇప్పటి వరకు జాప్యం వహించడం ముమ్మాటికీ గర్హనీయం! ఏది ఎలా ఉన్నా, ప్రభు త్వం స్పందించినా, స్పందించకపోయినా ప్రజలు స్వతహాగా ఇటువంటి చర్యలను, శక్తులను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.  

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
వందల పసి నలుసుల్ని చిదిమేసిన మారణ కాండ ఆగస్టు 31 బుధవారం జరిగింది. సిరియాలో జరిగిన ఈ దారుణ కాండకు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాదాపు 2000 మందిని పొట్టన బెట్టుకున్న ఈ దహనకాండ ప్రపంచ దేశాలన్నింటినీ నివ్వెర పర్చింది. ఈ పైశాచికానికి బలయినవారిలో అన్యంపుణ్యం ఎరుగని పసిమొగ్గలు అధిక సంఖ్యలోనే ఉన్నారు. వివిధ ఛానెల్స్‌, ఫెస్‌బుక్‌ల ద్వారా ప్రచారం అవుతున్న ఈ దృశ్యాలు మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి గుండెను పిండేస్తున్నాయి. ఏమిటీ దారుణం? మానవాభ్యదయానికి ఉపయోగ పడాల్సిన సాంకేతిక, ఆధునిక పరిజ్ఞానం ఇలా మానవ వినాశనానికి ఉపయోగించడం నిజంగా అమానవీయం. ఇంకా ఇలా ఎంత మంది బలైపోవాలి? పైశాచికం, రాక్షసత్వం వంటి మాటలు కూడా ఈ దారుణాన్ని వర్ణించడానికి సరిపోవు. ఈ పదవీ వ్యామోహ పోరులో ఎటువంటి సంబంధం లేని అమాయక పసి పిల్లలు హత్య చేయబడటం చూసి ప్రతి హృదయం తల్లడిల్లి పోతుంది. విష వాయువుల ప్రయోగంతో శ్వాస పీల్చుకోవడం కష్టమయి ఎక్కడి వారు అక్కడే పడి పోవడం, మృతి చెందడం, క్షతగాత్రులు కావడం మొదలగు దృశ్యాలు ఎంతటి బండరాయి గుండెనయినా కరిగించేస్తాయి.

ఇదిలా ఉండగా మొన్న ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌ నగర్‌లో చోటు చేసుకున్న మత కలహాల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ముజఫ్ఫర్‌ నగర్‌లో  ప్రారంభమయిన ఈ శవ రాజకీయాల హింసాకాండ సెగ క్రమంగా మీరట్‌, బరేలీ, షామిలి, ఆజంగడ్‌, అహ్మద్‌ నగర్‌ తదితర ప్రాంతాలకు కూడా తాకడం, అనేక మంది అన్యం పున్యం ఎరుగని అమాయకుల జీవి తాల్ని అతలాకుతలం చేయడం మత చాంధసత్వం మనుషుల్లో ఏ స్థాయిలో ఇన్జెక్ట్‌ చేయ బడిందో చెప్పకనే చెబుతోంది.  ఇటువంటి సంఘటనలు అతి పెద్ద ప్రాజాసామ్య దేశం భారత దేశం అన్న మాటను ఎగతాళి చేస్తున్నాయి. సమరస భావంతో, శాంతి వాతావరణంలో సహజీవనం సాగిస్తున్న ఇరువర్గాల మధ్య విద్వేషాగ్ని రాజేసి పబ్బం గడుపుకోవాలనుకయనే కుసంస్కృతి ప్రియులు, కుమతాగ్రేసరులు   ఓ నకిలీ వీడియో మాధ్యమంతో ఈ మారణకాండ కు కారణమయ్యారు. 2014 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆడుతున్న ఈ రాజకీయ చదరంగం లో ఇంకెందరు బలి కావాల్సి ఉందో కాలమే నిర్ణయించాలి.

 నేడు వైజ్ఞానిక, సాంకేతిక అభివృద్ధి కొన్ని ప్రాంతాల్లో వికటించి ముప్పుగా పరిణమిస్తోంది.  అందరికి అందుబాటులో ఉన్న అంతర్‌ జాలాన్ని అవకాశంగా తీసుకుని కొన్ని అరాచక శక్తులు, కల్లోల జనకులు నకిలి వార్తలు, వీడియోలు వ్యాప్తి చేసి  ప్రజలను తరచూ తీవ్ర భావోద్వేగాలకు లోను చేస్తున్నారు. ఇటువంటి మత కలహాలు, మారణ కాండలు జరుగుతాయన్న పక్కా సమా చారం అందినా, పరిపాలకు అచేనావస్థలో ఉండటం క్షమించరాని నేరం. నిజానికి 2011లోనే రాష్ట్ర ప్రభుత్వం మత కలహాలు, హింసకాండల నిరోధక బిల్లు తీసుకురావాలన్న ప్రతిపాదన పెట్టినా ఇప్పటి వరకు జాప్యం వహించడం ముమ్మాటికీ గర్హనీయం! ఏది ఎలా ఉన్నా, ప్రభు త్వం స్పందించినా, స్పందించకపోయినా ప్రజలు స్వతహాగా ఇటువంటి చర్యలను, శక్తులను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.

 పోతే, 2009లో సార్వత్రిక సమయానికి ముందే ప్రధాని అభ్యర్థిగా ఖరారై పోయన కురు వృద్దుడి అభ్యంతరాల్ని సయితం తోసి పుచ్చి 2001లో గుజరాత్‌ మారణ హోమానికి కారకుడ యిన మతవాద మచ్చలున్న మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం నిజంగా మానవ త్వానికి మచ్చే. ఆరెస్సెస్‌ ఆశీస్సులతోనే మోడీకి ఈ కిరీటధారణ జరిగిందన్నది నిర్వివాదాంశం. 'హింస-ప్రతిహింస' సిద్ధాంతంతో  తన అసమర్థతను, అమానుషాన్ని, అమానవీయతను సమ ర్థించుకోబోయిన మోడీకి నాటి ప్రధాని వాచ్‌పేయి రాజపాఠము బోధించిన సంఘటనకు 11 ఏండ్లయింది.

 ఈ శవ రాజకీయాలు ఎవరు చేశారు, చేస్తున్నారు, చేయబోతారు అన్న విషయాన్ని ప్రక్కన బెడితే, ఎవరు ఈ దుష్చర్యలకు, దమనకాండలకు  పాల్పడ్డారో, ఇక మీదట పాల్పడతారో వారు మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులే. ఒకవేళ ఇక్కడ తన కలిమి, బలిమిని ఉపయోగించి శిక్ష నుండి బైట పడగలము వారు అనుకుంటే అల్లాహ్‌ పట్టు నుండి, రేపు ప్రళయ దినాన న్యాయాధిపతి అయిన అల్లాహ్‌ా వారికి విధించే కఠిన శిక్ష నుండి తప్పించుకోలేరు. ఇది సత్యం! కఠోర నిజం!!

కామెంట్‌లు లేవు: