24, డిసెంబర్ 2014, బుధవారం

షైతాన్‌తో ఇంటర్‌వ్యూ



వలీద్‌: రోజురోజుకీ సమాజం బొత్తిగా పనికిరాకుండా పోతుంది.
షైతాన్‌: నువ్వో దేశోద్ధారకుడివి! నీదో సాత్విక ఆలోచననూ! వారి పాట్లు వాళ్లు పడతారు గాని, నీ సంగతి నీవు చూస్కో చాలు...
వలీద్‌: నువ్వు ఎన్నయినా చెప్పు... ఎలాగైనా సరే ప్రజల్ని ఈ గండం నుంచి గట్టెక్కించాల్సిందే. వారికి పనికొచ్చే హితవులు చేసి తీరాల్సిందే. హాఁ!
షైతాన్‌: అబ్బబ్బ...అబ్బబ్బ... ఏం దేశాభిమానం! ఏం ప్రజా శ్రేయం! కోరి మరి తలకొరివి పెట్టించుకుంటానంటే కాదనడానికి నేనెవడ్ని అంటా...
వలీద్‌: ప్రజల్ని ముప్పు నుండి రక్షించడం ప్రమాదం ఎలా అవుతుంది.? ఇది అందరికీ ప్రయోజనకరమైన కార్యం కదా!
షైతాన్‌: నంగనాచి తంగుబుర్రలా ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావే! నిజం చెప్పు... నీలో మాత్రం పదవి వ్యామోహం లేదూ? నలుగురూ నిన్ను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలన్న ఆశ లేదు? మరి ప్రదర్శనాబుద్ధి అన్నివిధాల ప్రమాదకరమే కదా! నువ్వెంత చేసినా చిత్తశుద్ధి లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే కదా నీ ప్రజాసేవ కార్యాలు. అలా చేస్తే ప్రభువు కూడా నిన్ను మెచ్చుకోడు కదా. మరి నరక కూపంలో నెట్టేస్తాడాయే!
వలీద్‌:  ఏందయ్యో నువ్వు! మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకేస్తున్నావ్‌?
నీ మాటలతో నా బుర్ర తినేస్తున్నావే. సరే నాక్కావాల్సిన కొందరు వ్యక్తుల సమాచారం అందిస్తావా?
షైతాన్‌: ప్రముఖుల గురించైనా, ప్రజల గురించైనా నువ్వడగాలే గాని ఇట్టే చెప్పెయ్యను!?

వలీద్‌: ఇమామ్‌ అహ్మద్‌, ఇమామ్‌ షాఫయీ, ఇమామ్‌ మాలిక్‌, ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ) గురించి నీ ఒపీనియన్‌?
షైతాన్‌: నన్ను తలెత్తుకు తిరగకుండా చేసింది వీరే. ''ఖుర్‌ఆన్‌ మరియు హదీసులను గట్టిగా పట్టుకోండి'' అని ప్రజలకు చెప్పి నా నోట్లో మట్టి పోశారు. నా కొంప ముంచారోయ్‌.
వలీద్‌: ఫిర్‌ఔన్‌, నమ్రూద్‌, వలీద్‌ బిన్‌ ముగైరా గురించి నీ అభిప్రాయం?
షైతాన్‌: అలాంటి వారందరికీ నా మద్దతు సదా ఉంటుంది. నా సామ్రాజ్యాన్ని థ దిశల వ్యాపింపజేసింది ఈ వర్గమేనోయ్‌.
వలీద్‌:  ఖాలిద్‌ బిన్‌ వలీద్‌, సలాహుద్దీన్‌ అయ్యూబీ, ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ వహ్హాబ్‌, ముహమ్మద్‌ బిన్‌ ఖాసిమ్‌?
షైతాన్‌: వాళ్ళంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. సలసల కాగే నూనె పెనములో వేయించాలి వీరందరిని.
వలీద్‌:  అబూ జహల్‌, అబూ లహబ్‌,సల్లాన్‌ రష్దీ, ఉమ్మె జమీల్‌, తస్లీమా నస్రీన్‌?

షైతాన్‌: మేమందరం ఒకే కుటుంబీకులం. మా అందరి లక్ష్యమూ ఒక్కటే. మానవుల్ని మార్గభ్రష్టుల్ని చేయడం. వీరందరూ మా వ్యవస్థకు వృద్ధీవికాసాలు ఇచ్చిన గొప్ప తత్వవేత్తలు...! ఆ మధ్య వీరిలో కొందరికి గొప్పగా సన్మానం కూడా జరిగింది తెలీదూ?

2, డిసెంబర్ 2014, మంగళవారం

ఎయిడ్స్‌ నివారణా మార్గంలో ఇస్లాం దృక్పథం



1) ''ఆరోగ్యకరమయిన చర్మంలో ఏయిడ్స్‌ను ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది'' అన్నది నేటి శాస్త్రవేత్తల మాట. ఇక్కడ మనం ఇస్లాం ఉపదేశాన్ని నెమరు వేసుకోవాలి. అది రోజుకు అయిదు సార్లు వుజూలో మన అవయవాల్ని కడగాల్సిందిగా, కాలకృత్యాల తీర్చుకున్న తర్వాత శుద్ధ పొందాల్సిందిగా పురమాయిస్తుంది. మనిషి తన చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే విషయంలో ఇస్లాం సూచించిన ఈ విధానంకన్నా మేలయినది ఏది లేదు. 

2) పరిశోధన వల్ల వెల్లడయిన విషయం - ''అసంబద్ధ రీతిలో రతిలో పాల్గొనడం (గుదము నుండి రతి జరపడం) వల్ల ఎయిడ్స్‌ సోకే, వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది'' అని. ఈ విషయంలో సయితం ఇస్లాం గొప్ప మార్గదర్శకత్వమే వహిస్తుంది. అది హోమియో సెక్స్‌ను వారించడమే కాక, పురుషు తన భార్యతో గుదము ద్వారా రతి జరపకూడదు అని హెచ్చరి స్తుంది. 

3) ''సంభోగ సమయంలో రక్తస్త్రావం జరుగుతుంటే ఎయిడ్స్‌ సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది'' అన్నది నిపుణుల మాట. ఈ విషయంలో ఇస్లాం ఏమంటుందంటే, ''పురుషుడు తన భార్యతో బహిష్టు సమయంలో సంబోగించకూడదు'' అని. 

4) నేటి పరిశోధనలన్నీ తీర్మానించిన విషయం - ''సకల విధమయినటుంటి అక్రమ లైంగిక సంబంధాలను పరిత్యజించడం ద్వారా మాత్రమే ఎయిడ్స్‌ను నివారించగలం'' అన్నది. నేడు ఇన్ని నష్టాలు, కష్టాల తర్వాత పరిశోధకులు తెలియజేస్తున్న ఈ విషయాలు 1436 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ప్రవచనాలకు ప్రతిబింబంగా నిలువడం ఇస్లాం ప్రకృతి ధర్మం అనడానికి ప్రబల తార్కాణం!

23, మార్చి 2014, ఆదివారం

షైతాన్‌తో ఇంటర్‌వ్యూ



శాంతి ప్రియ

వలీద్‌: రోజురోజుకీ సమాజం బొత్తిగా పనికిరాకుండా పోతుంది.
షైతాన్‌: నువ్వో దేశోద్ధారకుడివి! నీదో సాత్విక ఆలోచననూ! వారి పాట్లు వాళ్లు పడతారు గాని, నీ సంగతి నీవు చూస్కో చాలు...

వలీద్‌: నువ్వు ఎన్నయినా చెప్పు... ఎలాగైనా సరే ప్రజల్ని ఈ గండం నుంచి గట్టెక్కించాల్సిందే. వారికి పనికొచ్చే హితవులు చేసి తీరాల్సిందే. హాఁ!
షైతాన్‌: అబ్బబ్బ...అబ్బబ్బ... ఏం దేశాభిమానం! ఏం ప్రజా శ్రేయం! కోరి మరి తలకొరివి పెట్టించుకుంటానంటే కాదనడానికి నేనెవడ్ని అంటా...

వలీద్‌: ప్రజల్ని ముప్పు నుండి రక్షించడం ప్రమాదం ఎలా అవుతుంది.? ఇది అందరికీ ప్రయోజనకరమైన కార్యం కదా!
షైతాన్‌: నంగనాచి తంగుబుర్రలా ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావే! నిజం చెప్పు... నీలో మాత్రం పదవి వ్యామోహం లేదూ? నలుగురూ నిన్ను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలన్న ఆశ లేదు? మరి ప్రదర్శనాబుద్ధి అన్నివిధాల ప్రమాదకరమే కదా! నువ్వెంత చేసినా చిత్తశుద్ధి లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే కదా నీ ప్రజాసేవ కార్యాలు. అలా చేస్తే ప్రభువు కూడా నిన్ను మెచ్చుకోడు కదా. మరి నరక కూపంలో నెట్టేస్తాడాయే!

వలీద్‌:  ఏందయ్యో నువ్వు! మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకేస్తున్నావ్‌?
నీ మాటలతో నా బుర్ర తినేస్తున్నావే. సరే నాక్కావాల్సిన కొందరు వ్యక్తుల సమాచారం అందిస్తావా?
షైతాన్‌: ప్రముఖుల గురించైనా, ప్రజల గురించైనా నువ్వడగాలే గాని ఇట్టే చెప్పెయ్యను!?

వలీద్‌: ఇమామ్‌ అహ్మద్‌, ఇమామ్‌ షాఫయీ, ఇమామ్‌ మాలిక్‌, ఇమామ్‌ అబూ హనీఫా (రహ్మ) గురించి నీ ఒపీనియన్‌?
షైతాన్‌: నన్ను తలెత్తుకు తిరగకుండా చేసింది వీరే. ''ఖుర్‌ఆన్‌ మరియు హదీసులను గట్టిగా పట్టుకోండి'' అని ప్రజలకు చెప్పి నా నోట్లో మట్టి పోశారు. నా కొంప ముంచారోయ్‌.

వలీద్‌: ఫిర్‌ఔన్‌, నమ్రూద్‌, వలీద్‌ బిన్‌ ముగైరా గురించి నీ అభిప్రాయం?
షైతాన్‌: అలాంటి వారందరికీ నా మద్దతు సదా ఉంటుంది. నా సామ్రాజ్యాన్ని థ దిశల వ్యాపింపజేసింది ఈ వర్గమేనోయ్‌.

వలీద్‌:  ఖాలిద్‌ బిన్‌ వలీద్‌, సలాహుద్దీన్‌ అయ్యూబీ, ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ వహ్హాబ్‌, ముహమ్మద్‌ బిన్‌ ఖాసిమ్‌?
షైతాన్‌: వాళ్ళంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. సలసల కాగే నూనె పెనములో వేయించాలి వీరందరిని.

వలీద్‌:  అబూ జహల్‌, అబూ లహబ్‌,సల్లాన్‌ రష్దీ, ఉమ్మె జమీల్‌, తస్లీమా నస్రీన్‌?
షైతాన్‌: మేమందరం ఒకే కుటుంబీకులం. మా అందరి లక్ష్యమూ ఒక్కటే. మానవుల్ని మార్గభ్రష్టుల్ని చేయడం. వీరందరూ మా వ్యవస్థకు వృద్ధీవికాసాలు ఇచ్చిన గొప్ప తత్వవేత్తలు...! ఆ మధ్య వీరిలో కొందరికి గొప్పగా సన్మానం కూడా జరిగింది తెలీదూ?

22, మార్చి 2014, శనివారం

మానవతామూర్తితో ముఖాముఖి


శాంతి ప్రియ

స్వాతంత్య్రం అంటే?

పట్టపగలు నిలువు దోపిడి చేసి
  అర్థ రాత్రిŠ స్వాతంత్య్రం ఇచ్చారు - తెల్లవాళ్ళు
  నిశి రాత్రి  స్వాతంత్య్రం పుచ్చుకుని
  నిషాలతో తూలుతున్నారు మనవాళ్ళు.

మంచి, చెడులంటే?

పుణ్యాత్ములు చచ్చి కూడా ప్రజల హృదాయాల్లో జీవిస్తారు
   పాపాత్ములు బ్రతికుండి కూడా జనం దృష్టిలో చస్తారు.

పేదవాడు?
బ్రతుకు దారి గోదారి, ఎటు చూసినా ఎడారి.

వివేకవంతుడు?

రేపటి కోసం ఈ రోజే సిద్ధంగా ఉండేవాడు
   ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయనివాడు.

మానవతావాది?

ప్రజావేదనల్ని పలుకరించినవాడు
   అన్నార్తుల ఆక్రందనల్ని
   అక్షరాలతో విన్పించినవాడు
   ప్రజా శ్రేయం కోసం ప్రాణాలిచ్చినవాడు
   నిజ ప్రభువు ఆదేశాల్ని శిరసావహించినవాడు.

పనికిమాలిన యువతరం?
 అమ్మా - నాన్నల ఆస్తులు తింటూ
   ఫ్యాషన్‌ జీన్స్‌లు వేసి
   బజార్లలో పచార్లు చేసి
   బస్‌ స్టాపుల్లో వేచి చూసి
   సుఖాల సఖులతో తిరుగుతూ
   క్లాసుకు రాక - పాసు కాక
   అధోగతి పాలవుతున్న యువకులు.

మనిషంటే?
స్పందించే హృదయం ఉన్నవాడే నిజమైన మనిషి-
మనసున్న మనిషి - నికార్సయిన మహా మనీషి!

మీ సూక్తి?
చీకూ చింతలతో చితికిపోవడం కన్నా చేతనైన మంచి చేసి చిరు దీపం వెలిగించడం మిన్న.

 మీ గీతం?
    సర్వమానవ సౌభ్రాతృత్వం నాగీతం
    కామాంధుల పాలిట కొరడా నాగీతం
   దుర్జనుల పాలిట సమర శంఖం నాగీతం
   సజ్జనుల పాలిట సమరస సంగీతం నాగీతం
   ఎదిగే సూర్యునికి సంకేతం నాగీతం
   ప్రగతి పథంలో పయనించే రథం నాగీతం.

 

ఓ భార్యగా నేను - ఓ భర్తగా నేను



ఓ భర్తగా నేను

- ఉమ్మె హసన్‌

స్వాగతం

  నేను మా శ్రీవారిని పూర్తి ఉత్సాహంతో ఘనంగా స్వాగతిస్తాను. వారు ఎప్పుడు ఎదురైనా నవ్వుతూనే పలకరిస్తాను. నేను వారి రాకకై పరితపిస్తున్నట్టు, ఎదురుచూస్తున్నట్టుగా వారికి అవగతమయ్యేలా ప్రయత్నిస్తాను.
 
వారు ఇంట్లో ప్రవేశించేటప్పుడు నేను చిరునవ్వుతో వారి అలసటను దూరం చేస్తాను.
 
ఇంట్లో ప్రవేశించాక దుస్తులు మార్చుకునేంతవరకు, ప్రశాంతంగా కూర్చునేంతవరకు నేను వారితోనే ఉంటాను.
 
నేను వారి ఆరోగ్యం గురించి అడుగుతాను. వారి దిన చర్యల గురించి ప్రశ్నిస్తాను.
 
వారికోసం నేను నీళ్ళగ్లాస్‌ అందజేస్తాను. పళ్ళరసాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా శరీరం నుండి ఎలాంటి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడతాను.

బంధు మిత్రులు

   శ్రీవారి బంధువులు- అతిథుల  కోసం నేను మెచ్చేది కాక వారు ఇష్టపడే  వంటకాలని చేసి పెడతాను.
 
వారు విశ్రాంతి తీసుకునే గదులను నీటుగా ఉంచుతాను. నేను వారందరితో ప్రేమతో వాత్సల్యంతో మసలుకుంటాను.

భర్త కోపం

నేను వారి ముఖ్య కార్యాల్లో తలదూర్చను.ఏదైనా మాటనికాని లేక నా కోరికను గాని మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించను.

నేను వారిని చాలా మృదువుగా పలకరిస్తాను. నా మాట సరైనదైనా ఆ సమయంలో నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను మంచి సమయం చూసి వారికి చెప్పి ఒప్పిస్తాను.

వారు ఏదైనా మరచిన ఎడల నేను వారిని చాలా సున్నితమైన రీతిలో తెలియపరుస్తాను.

వారు రాజీపడిన తరువాతే నిద్రిస్తాను. వారికి ముందు నిద్రించను.

అప్పుడప్పుడు ప్రవక్త(స) గారి ఈ సద్వచనాన్ని వారి చెవిన వేస్తుంటాను. ''నీ భార్యే నీ స్వర్గం, నీ భార్యే నీ నరకం''.


ఓ భర్తగా నేను

- అబుల్‌ హసన్‌

 జీవితపు అన్ని ఘడియల్లో నేను ఆమెను సుఖ పెడతాను.
ఆమె లోపాలని పదేపదే ఎత్తి చూపను. దుస్తుల్లో వంటకాల్లో, మాటల్లో ఉన్న లోపాలను అప్పటికప్పుడు వేలెత్తి చూపను. మరొకరితోనూ చెప్పుకోను.

అప్పుడప్పుడు ఆమె కోసం స్త్రరితీశి కొని, దాచి - కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకున్న తరువాత ఇస్తాను.

ఆమె నాకు స్త్రరితీశి ఇచ్చినప్పుడు ఆమెను నేను ఎంతగానో మెచ్చుకుంటాను.

ఆమె నాతో ఏదైనా చెప్పదలిస్తే నేను ఆమెను ప్రోత్సహిస్తాను. నేను ఆమెకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఆమె భావోద్దేశాలను దృష్టిలో ఉంచుకుంటాను. పొలం విషయంలోనైనా, వంట విషయంలోనైనా గుడ్డలు కుట్టే కుట్టించే విషయంలోనైనా, అవసరమనిపిస్తే వెనకడుగు వెయ్యను. నా వల్ల కాదు, కూడదు అని సాకులు చెప్పను.

కొన్ని సందర్భాల్లో ఆమె పట్ల నా ప్రేమని ఎక్కువ ప్రదర్శిస్తాను. ముఖ్యంగా బహిష్టు సమయంలో, గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవించినప్పుడు.

నేను ఆమెతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించను. ఆమె ఓ స్త్రీ అనీ, స్త్రీ గాజులాంటిదని సదా దృష్టిలో ఉంచుకుంటాను. ప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ''వారు (స్త్రీలు) గాజుల్లా నాజుకైన వారు. వారితో మృదువుగా ప్రవర్తించండి''.

అప్పుడప్పుడు ఆమెకు ఇష్టమైన వస్తువులు నాకు ఇష్టం లేకపోయినా తెచ్చిస్తాను.

నేను ఆమెను మంచి పేరుతో పిలుస్తాను. ప్రవక్త(స) మన అమ్మగారైన ఆయిషా(ర) ని ప్రేమతో 'ఆయిష్‌' అని పిలిచేవారు  కదా!

ఆమె నా కోసం శ్రమించినప్పుడల్లా, నేను ఆమెపై ప్రశంసావర్షం కురిపిస్తాను.

 నేను ఇంట్లో అడుగుపెట్టాక బయటి విషయం గురించి ఆలోచించను. నేను ఆమెకు తోడుగా ఉంటూ, రోజూ
 
అవసరమయిన వాటి గురించి చర్చిస్తాను. దీనీ ఇజ్తెమాలలో, సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనమని ఆమెకు చెబుతూ ఉంటాను.

తస్మాత్‌ జాగ్రత్త!


 - అబుల్ హసన్

షైతాన్‌ నన్ను విచ్చలవిడిగా పాపాలకు పాల్పడేలా పురిగొల్పుతాడని నేను భయపడటం లేదు... కానీ పాపాన్ని విధేయతా ముసుగులో పెట్టి నన్ను మోసగి స్తాడేమోనని భయపడుతున్నాను...

కరుణ, జాలి, పరామర్శ అన్న గాలంతో వాడు నిన్ను ఓ స్త్రీ ఉచ్చులో బిగించవచ్చు...

ముందుచూపు అంటూ ఐహిక తళుకు బెళుకుల ఆకర్షణకు లోను చేసి నీలో ఐహిక లాలసను పెంచవచ్చు...

దుష్ట శిక్షణ అనే సాకుతో నిన్ను చెడు సావాసానికి ఉసి గొల్పవచ్చు.

దుర్మార్గుల సంస్కరణ నేపంతో నిన్ను కాపట్యరోగానికి గురిచేయవచ్చు.

ప్రత్యర్ధిపై పగసాధింపు చర్య ద్వారా మంచిని పెంచటం చెడుని నిర్మూలించడం నుండి నిన్ను దూరం చేయవచ్చు.

సత్యాన్ని సూటిగా చెప్పాలన్న ప్రేలాపనతో నిన్ను జమాఅత్‌ (సంఘం) నుండి వేరు చేయవచ్చు.  


నిన్ను నీవు సంస్కరించుకో, నీ లోపాల్ని సరిదిద్దుకో అన్న పిలుపుతో సమాజ సంస్కరణ నుండి నిన్ను తొలగించవచ్చు. విధివ్రాతను నమ్ముకుంటే చాలు అన్న వక్ర భాష్యంతో కర్తవ్యం నుండి నిన్ను దూరం చేయవచ్చు. సోమరిగా తయారు చేయవచ్చు.

ప్రార్థనలో లీనమై ఉండాలన్న నెపంతో విద్యావివేకాల సముపార్జన నుండి దూరం చేయవచ్చు.

'పుణ్యాత్ముల అనుసరణ ముఖ్యం' అన్న ప్రేరణతో నిన్ను ప్రవక్త (స) వారి సంప్రదాయాలకు దూరం చేయవచ్చు.

బాధితుల సానుభూతి అన్న నీతితో నీవు అఘాయిత్యాలకు పాల్పడేలా పురి గొల్పవచ్చు.

 షైతాన్‌ నీకు బహిరంగ శత్రువు. ఏ వేషంలో వచ్చినా అతన్ని నీ శత్రువుగానే ఎంచు. అంతేగాని ఏదో మేలు చేస్తాడు అనుకుంటే మాత్రం నీ తండ్రి ఆదం, తల్లి హవ్వాలు మోసపోయినట్లుగా నీవు మోసపోయే ప్రమాదం ఉంది సుమా!
   

పరీక్ష



- శాంతి ప్రియ

అలసి సొలసి ఒడ్డుకు చేరేవేళ ఆఖరి అడుగు
జారి సుడిగుండంలో కొట్టుకుపోతున్న దృశ్యం పరీక్షంటే...
ఎంత తనవారైనా అవసరానికొక్కరూ
పనికిరాలేదన్న నిస్సహాయ  క్షణం పరీక్షంటే...
ఒకానొక అమాయకపు ఉదయాన మోగే ఫోన్‌
ఉన్న ఫళాన బతుకుని బద్దలు చేసే భయంకర కబురు పరీక్షంటే...
ఆకాశానికికెగిసే అందమైన ఆశలు
అకస్మాత్తుగా కరుగుతున్న కలలై నేలకొరగటం పరీక్షంటే...
నిలువెత్తు శోకంపై శిలువైనాక  క్షణాల్ని
లెక్కిస్తూ బతకాల్సి రావటం పరీక్షంటే...
కళ్ళ ముందు కదిలే కనుపాపల్లా మెరిసే వాళ్ళు
కాగితాలపై అక్షరాలుగా మిగలటం పరీక్షంటే....
జనన పత్రాల్ని సరిచూసుకోవాల్సిన వేళ
మరణ పత్రాల మీద పేరుని మార్చలేకపోవటం పరీక్షంటే....
బతుకెలాగూ శాశ్వతం కాదని తెలుస్తున్నా అన్నదాతలు
ఆకలి దాహాల్తొ మరణాన్ని ఎదుర్కోవడం పరీక్షంటే...
ఈదడమంటూ నేర్చాక అంతులేని జీవన సాగరంలో
బ్రతుకు ఛిద్రమౌతున్నా ఈదుతూ ఉండాల్సిందే
అంతు చిక్కే వరకు పరమాత్మ ప్రసన్నత పొందేవరకు!

''భయం, ఆకలి, ధన ప్రాణ, పంట నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము. అలాంటి (క్లిష్ట) స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు 'ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజివూన్‌' అని పలికేవారికి వారి ప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (బఖర : 155-157)

చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం?


- అబూ అనస్‌

నేటి పేరెంట్స్‌ ప్రవర్తనపై నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. తమ సంతానం ఐహికంగా గొప్ప హోదాలను పొందాలని, ఆర్థికంగా బిల్‌గేట్స్‌ను మించిపోవాలనీ ఆశిస్తున్నారు. తప్పులేదు. కానీ తమ సంతానం నైతికంగా ఎదగాలనీ, ధార్మికంగా వృద్ధి చెందాలనీ, సత్కార్యాలలో పోటీపడాలనీ, స్వర్గ హోదాలను అధిరోహించాలనీ, జన్నతుల్‌ ఫిర్‌దౌస్‌ను తమ సొంతం చేెసుకోవాలనీ, అక్కడ ప్రియ ప్రవక్త(స) వారి సహచర్యం పొందాలనీ, దైవ దర్శనంతో పునీతులవ్వాలనీ మాత్రం కోరుకోవడం లేదు. ఇది కడు శోచనీయం. ఐహికంగా, ఆర్ధికంగా సంతానం ఎంతగా ఎదిగినా పేరెంట్స్‌ కంటి చలువ కానేరదు. వారి ద్వారా మనశ్శాంతి లభిస్తుందని ఆశించనూ లేము. తమ సంతానం బాగుండాలనీ, వారు గొప్ప ప్రయోజకు లవ్వాలనీ, మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని మొక్కుకునే తల్లిదండ్రులకు తమ పిల్లల పరలోక సాఫల్యం, స్వర్గ ప్రాప్తి కొరకు దుఆ చేసే తీరిక ఎక్కడిది? అసలు తల్లిదండ్రుల కంటి చలువ పరలోక సాఫల్యం అన్న వాస్తవం ఎంత మంది పేరెంట్స్‌కి తెలుసని? పైగా మా పిల్లలు పాడైపోయారు ఒక్కడూ మా ముసలి బ్రతుకు గోడు పట్టించుకోవటం లేదు అని విచారించడం ఒకటి. అసలు మన సంతానాన్ని అలా పెంచింది ఎవరు? ఆనంద నిలయవు ఆ మల్లెల్ని మందారాల్ని ఫలాల్ని చెరపట్టింది ఎవరు? పేరెంట్స్‌ కారా? తల్లిదండ్రులు కారా?! అవును ఇందులో వారి ప్రమేయమే ఎక్కువగా ఉంది. దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ''పుట్టే ప్రతి శిశువు ప్రకృతి (సహజ) ధర్మంపైనే జన్మిస్తాడు. కాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదుడిగానో, క్రైస్తవునిగానో, మజూసిగా (అగ్ని ఆరాధకులు)నో మార్చివేస్తారు.
మంచి సంతానం కావాలని తాపత్రయపడేవారు భార్యను కలిసిన ప్రతి రాత్రి మొదట 'బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్‌నష్‌ షైతాన వ జన్నిబిష్‌ షైతాన మా రజఖ్‌తనా' (అల్లాహ్‌ా పేరుతో, ఓ అల్లాహ్‌ా మమ్మల్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ కీడు నుండి కాపాడు. నీవు ప్రసాదించే మా సంతానాన్ని కూడా షైతాన్‌ బారి నుండి కాపాడు). (బుఖారీ) అన్న దుఆ చదవాలని  తెలిసినా చదివేవారు ఎంత మంది? సంతానం కలిగాక షైతాన్‌ బారి నుండి వారి రక్షణ కోసం ''ఉయీజుకుమ్‌ బికలిమాతిల్లాహిత్తామ్మతి మిన్‌ కుల్లి షైతానివ్‌ వ హామ్మతిన్‌ వమిన్‌ కుల్లి ఐనిల్‌ లామ్మతి'' (నేను మిమ్మల్ని ప్రతి షైతాన్‌ మరియు విష జంతువుల బారి నుండి అన్ని రకాల చెడు దృష్టి నుండి అల్లాహ్‌ా సంపూర్ణ వచనాల రక్షణలో ఇస్తున్నాను.) అని చదివేవారు ఎందరు? ఏమిటి ఈ దుఆలదేముందంటారా? మీ దృష్టిలో ఈ ప్రార్థనల ప్రాముఖ్యత ఏమి లేదా?? అయితే దైవ ప్రవక్త(స) ఈ ప్రార్థలను తన అనుచరులకు ఎందుకు బోధించినట్టు? తాను స్వయంగా ఎందుకు చదివినట్టు? ఏమిటి, మన తల్లులు విశ్వాసుల మాతల కన్నా గొప్పవారా? మన సంతానం హసన్‌, హసైన్‌ల కన్నా ఉత్తములా?
నిజమైన దైవ దాసులు తమకు దేవుడు నేర్పించిన, దైవ ప్రవక్త(స) ప్రబోధించిన దుఆలను చదవడంతోపాటు ఖుర్‌ఆన్‌లోని ఈ దుఆను సైతం సదా చేస్తూ ఉంటారు. ''రబ్బనా హబ్‌లనా మిన్‌ అజ్‌వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్‌ వజ్‌అల్‌నా లిల్‌ ముత్తఖీన ఇమామా''.                              (సూరా ఫుర్ఖాన్‌ : 74)
(వారు దైవ సన్నిధిలో చేతులు జోడించి) ప్రభూ! మా భార్యా పిల్లల ద్వారా మాకు కంటి చలువ ప్రసాదించు. మేము దైవభీతిపరులకు నాయకులయ్యేలా చెయ్యి అని ప్రార్థిస్తారు.)
 ఈ దుఆకు భాష్యం చెబుతూ హసన్‌ బస్రీ (రహ్మ) ఇలా అన్నారు: దేవుడు దాసుడికి సంతానాన్ని ప్రసాదించడంతో పాటు వారి ద్వారా తల్లిదండ్రుల కంటి చలువను అనుగ్రహించడం అనేది గొప్ప వరం. నిజమైన విశ్వాసులు దైవాదేశాలకు కట్టుబడి జీవించే బిడ్డలను, మనవరాళ్ళను, బంధువుల్ని చూసి ఎంతో ఆనందిస్తారు. ఈ విధంగా ఇహపరాల వారికి కంటి చలువ ప్రాప్తమవుతుంది. దీనికి ఇక్రమా (ర) వివరణ ఇస్తూ: ''ఈ దుఆ ముఖ్యోద్దేశం అందమైన శరీరాకృతి, సుందరమైన రూపకల్పన  గల సంతానం కాదు. దైవాదేశాలకు దైవప్రవక్త (స) వారి సంప్రదాయాలకు తలొగ్గించే సంతానం అన్నమాట'' అన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రవక్తలందరి పితామహులు అయిన ఇబ్రాహీమ్‌(అలై) దైవాన్ని ''రబ్బి హబ్‌లీ మినస్సాలిహీన్‌'' (ప్రభూ! నాకొక సద్గుణ సంపన్నుడైన కుమారుడ్ని ప్రసాదించు) అని ప్రార్థించారు. మేమతనికి సహనశీలుడైన ఒక పిల్లవాడు కలుగుతాడని శుభవార్త తెలిపాము (సాఫ్ఫాత్‌ 100,101)అన్నాడు అల్లాహ్‌.
ఈ ఆశయంతోనే ప్రవక్త జకరియ్యా 'రబ్బి హబ్‌లీ మిల్లదున్‌క జుర్రియతన్‌ తయ్యిబహ్‌ా. ఇన్నక సమీవుద్దుఆ' (ప్రభూ! నీ వద్ద నుండి నాకు ఉత్తమ సంతానం ప్రసాదించు. నిస్సందేహంగా నీవే నా మొరాలకించేవాడివి) అని వేడుకున్నారు.
ఆ తర్వాత ఏం జరిగింది?
 అతనలా ప్రార్థన గదిలో నిలబడి ప్రార్థన చేస్తుండగానే దైవదూతలు వచ్చి అతని పిలిచారు: ''ఓ జకరియ్యా! నిశ్చయంగా అల్లాహ్‌ా నీకు యహ్యా పుడతాడన్న శుభవార్త తెలియజేస్తున్నాడు. అతను అల్లాహ్‌ా నుండి వెలువడే ఒక వాణిని ధృవపరుస్తాడు. పైగా అతను నాయకత్వపు లక్షణాలతో భాసిల్లుతూ ఎంతో నిగ్రహ శక్తి గలవాడై ఉంటాడు. దైవ ప్రవక్త అవుతాడు; సజ్జనులలో పరిగణించబడతాడు'' అని చెప్పారు వారు. (ఆలి ఇమ్రాన్‌ : 39)
ఇదే తపనతో హజ్రత్‌ మర్యం (అలై) గారి తల్లి దైవాన్ని ఇలా వేడుకొంది: ''ఇన్నీ ఉయీజుహా బిక వ జుర్రియ్యతహా మినష్‌ షైతానిర్రజీమ్‌'' (నేనీ పాపకు మర్యం అని పేరు పెట్టాను) ఈమెను ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారిన పడకుండా నీ రక్షణ లో ఇస్తున్నాను) అన్నది ఆమె. (ఆలి ఇమ్రాన్‌ 36)

 ఆ తర్వాత ఏం జరిగింది?

 ఆ తర్వాత ఆమె ప్రభువు ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి, చక్కగా పెంచి పోషించాడు. కొన్నాళ్ళకు జకరియ్యాను ఆమెకు సంరక్ష కునిగా నియమించాడు. జకరియ్యా ఆమె ప్రార్థన గదిలో ప్రవేశించి నప్పుడల్లా అక్కడ ఆహారపదార్ధాలు ప్రత్యక్షమై ఉండేవి. అది చూసి ''ఓ మర్యమ్‌! నీకీ ఆహారం ఎక్కడ్నుంచి వస్తోంది?''
 అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. దానికి ఆమె ''అల్లాహ్‌ దగ్గర్నుంచి వస్తోంది. నిశ్చయంగా అల్లాహ్‌ా తాను కోరిన వారికి ఇతోధికంగా ఆహారం ప్రసాదిస్తాడు'' అని సమాధానమిచ్చింది. (ఆలి ఇమ్రాన్‌ : 37)
చూశారా! ప్రవక్తలు, పుణ్య స్త్రీలు తమ సంతానం ఉత్తమమైన సంతానం కావాలని దీనాతిదీనంగా దైవాన్ని వేడుకుంటుంటే మనం చేస్తున్నదేమిటి? నాకు పుట్టబోయే బిడ్డ ఇంజనీర్‌ కావాలనీ, డాక్టర్‌ కావాలనీ, కలెక్టర్‌ కావాలనీ ఇంకా ఏదేదో అవ్వాలని కోరుకుంటున్నామే గానీ, ధర్మపరాయణుడు, నీతి నిజాయితీపరుడు, ఉత్తమ పౌరుడ,ు మంచి సంతానం కావాలని కోరుకోవటం లేదు. అందుకే మన సంతానం ఇలా తగలడింది. తల్లిదండ్రుల మీద దయలేదు వారికి, డిగ్రీలున్నాయి. వారు మనకే పుట్టారు. కానీ పుట్టి వారు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. పుట్టలోని చెదలు పుట్టి గిట్టినట్లే వారు సైతం -------- తల్లిదండ్రుల్ని నానా యాతనలకి, ఇబ్బందులకి గురిచేస్తున్నారు. కారణం కొంత వరకు మనమైతే, కొంత వరకు వారు కూడా.
సంతానం ఎవరికి ప్రియం కాదు? కానీ ఉత్తమ లక్షణాలు, గొప్ప గుణాలు గల సంతానం కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఎందరున్నారు? సంతాన లేమి అయితే మంచి వైద్యుడ్ని సంప్రదిస్తాం, పంటలేమి అయితే సూచనలు అనుభవజ్ఞులను కలిసి తీసుకుంటాం.
మన ప్రయోజనాల కోసం ప్రాపంచిక విషయాలపై ఆధారపడే మనం ఎప్పుడైనా లోకకర్త సృష్టికర్త ముందు మన బాధల్ని చెప్పుకోవడానికి ప్రయత్నించామా? మీరు అడగండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు పదేపదే చెబుతుంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది మన పరిస్థితి.
''ఏమైంది మీకు? అల్లాహ్‌ ఔన్నత్యాన్ని నమ్మరెందుకు? ఆయనే కదా మిమ్మల్ని వివిధ ఘట్టాలలో రూపొందించినవాడు. ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలు సృష్టించాడు. అందులో చంద్రుడ్ని (చల్లటి వెన్నెల్ని వెదజల్లే) జ్యోతిలా చేశాడు. సూర్యుడ్ని దేదీప్యమానంగా (ప్రకాశించే) దీపంగా సృజించాడు. ఇదంతా మీకు కన్పించడం లేదా? (నూహ్‌ :13-16)


'దగాకోరు దేవుళ్ళ'ను ప్రజా జీవితాలనుండి ఏరివేయాలి


- శాంతి ప్రియ

 దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ''అతి త్వరలో ఓ కాలం రానున్నది. ఆ కాలంలో ఇస్లాం (ధర్మం) నామ మాత్రంగా ఉండి పోతుంది. ఖుర్‌ఆన్‌ (దైవ గ్రంథ) పఠనం ఒక ఆచారంగా మిగిలి పోతుంది. ప్రజల ప్రార్థనా మందిరాలు (రకరకాల అలంకరణలతో) కళకళ లాడుతుంటాయి. కానీ సన్మార్గం, హితబోధల రీత్యా నిర్మానుష్యంగా, నిర్జీవంగా ఉంటాయి. అప్పటి వారి ధర్మవేత్తలు ఆకాశం క్రింద (లోకంలో) ఉండేవారందరిలోకెల్లా అతి నికృష్టు లవుతారు. వారి వల్ల ఉపద్రవాలు (సంక్షోభాల, సమస్యల సుడిగుండాలు) జనిస్తాయి. తరువాత అవి వారిని సైతం చుట్టుముడుతాయి.'' (బైహఖీ)
 
భేషజాలను పక్కనపెట్టి నిర్మొహమాటంగా వాస్తవ దృక్పథంతో నిజాన్ని అంగీకరించే ప్రయత్నం చేస్తే ఈ వ్యాసంలోని వాస్తవాలు అన్ని వర్గాలవారిలోనూ కనిపిస్తాయి. ఇందులో ప్రతి విషయం నిజంగా జరిగినదే, జరుగుతున్నదే. మతం పేరుతో, దేవుడి పేరుతో దగా మోసాన్ని ఎండగట్టడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.  
                                                                   
  'మతం అంటే మత్తు మందు' మత గురువులంటే 'వంచకులు' అనే భావజాలం ప్రబలుతున్న దినాలివి. ఇటువంటి పరిస్థితిలో నిజానిజాలను బైట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన మతధర్మం అంటే మానవత్వమని, దోపిడి చేసేది, ధనార్జన లక్ష్యంతో సాగేది, జన వంచనతో వృద్ధి చెందాలనుకునేది అసలు మతం కాదని, అదో ఉన్మాదం, ఉపద్రవం, పచ్చి మోసమని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అవును మతధర్మం జనోద్ధరణ కోసమేగానీ ధనార్జన కోసం ఎంతమాత్రం కాదు. దైవ ప్రవక్తలందరూ వచ్చింది మానవ కళ్యాణం, లోక శాంతి కోసమే. ముఖ్యంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). అనేక విధాల హెచ్చతగ్గులున్న, అసమానతలున్న, అస్పృశ్య తలున్న సమాజాన్ని అన్ని విధాల సంస్కరించి
అందరినీ ఒకటిగా చేసి శాంతి- సౌభ్రాతృత్వాలు-సమానత్వం స్థాపించడానికే మహా ప్రవక్త (స) వచ్చారన్నది ఆయన చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మహా ప్రవక్త (స) వారు మొదట నుండీ పీడిత జనాల పక్షం వహించారు. ఆయన దళిత జనాల కోసమే వచ్చారు. 'సాటి మనిషి అవసరాన్ని మీరు తీర్చండి. దేవుడి మీ అవసరాలన్నింటినీ తీరుస్తాడు' అన్నారు.  'మంచిని బోధించేవాడు  స్వయంగా మంచి చేసినవాడితో సమానం' అన్నారు. 'ప్రజల సొమ్ముల్ని అన్యాయంగా దోచుకు తినేవారు తమ కడుపుల్ని నరకాగ్నితో నింపుకుంటున్నారు' అని హెచ్చరించారు.
  అయితే నేడు మన సమాజంలో మతం పేరుతో ప్రబలుతున్న వికృత చేష్టలను చూసినవారికి సహజంగానే విసుగు, చిరాకు కలుగుతుంది. సంఘ శ్రేయోభిలాషులు, శాంతి కాముకులు ఆశించిన సమాజం ఇదేనా? అంటే 'కాదు' అనేది నిజాయితీతో కూడిన సమాధానం. ఏళ్ళ తరబడి అంతర్మథనం చెందిన ఓ సోదరుడు తన గాధను ఇలా చెప్పుకు వచ్చాడు-  
 
   కొందరు మంచి ధార్మిక అవగాహన గల విద్యార్థుల సహచర్యం వల్ల క్రమేణా నిజానిజాలను తెలుసుకోగలిగాను. ఆ మధ్యనే డా.అంబేద్కర్‌ గారి మాటలు నా కంట పడ్డాయి. ''వేలాది మంది ముస్లింలు పీర్ల దగ్గరకు వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారు. వాస్తవానికి కొన్ని చోట్ల ముస్లిం పీరుకు వంశపారంపర్యంగా పౌరోహిత్యం చేస్తూ పీరు దుస్తులు ధరిస్తున్న బ్రహ్మణులున్నారు. ఇక గుజరాత్‌, పంజాబ్‌ విషయానికొస్తే - లగకణులు రాజపుత్ర, జాట్‌, బనియాల సంతతికి చెందినవారు ఒకరినొకరు నమస్కారం చేసుకునేటప్పుడు 'రాం రాం' అనే అంటారు. మసీదుకు తరచుగా వెళ్తుంటారు. 'సుంతీ' చేయించుకుంటారు. శవాలను ఖననం చేస్తారు. అటువంటిదే మరో వర్గం - 'మోమన్లు' సుంతీ పాటిస్తారు. శవాలను ఖననం చేస్తారు. గుజరాతీ భాషలో చదువుతారు. కాని ఇతర అన్ని సందర్భాల్లో భారతీయ విగ్రహారాధకుల్లానే ప్రవర్తిస్తారు''.
  ఈ పంక్తులు చదివాక ఇస్లామీయ చరిత్రను, ఖుర్‌ఆన్‌ మరియు హదీసులను క్షుణ్ణంగా  తెలుసుకోవాలన్న తపన నాలో మొదలయ్యింది. అలా నా సత్యాన్వేషణ ప్రారంభమయింది. తరువాత చరిత్రతో పాటు ఖుర్‌ఆన్‌, హదీసులను చదివి క్రమంగా మారుతూ, నన్ను నేను ప్రశ్నించుకుంటూ నిజమైన ముస్లింని అయ్యాను.
 
  ''పుట్టే బిడ్డ ఎవరి ఇంట్లో పుట్టినా - తను మాత్రం ప్రకృతి ధర్మంపైన్నే పుడుతుంది' అన్నది జగమెరిగిన సత్యం. జగత్ప్రవక్త చెప్పిన సత్యం. అయితే పిల్లవాడు పుట్టాక వారికిష్టమొచ్చిన మార్గంలోకి మార్చుకుంటారు. ఈ వాస్తవాన్ని చాలా ఆలస్యంగా తెలుకున్న నేను చాలా తొందరగానే వాటన్నింటికీ స్వస్తి పలికాను. అల్‌హమ్దులిల్లాహ్‌! ఇప్పుడు నాలో ఎలాంటి అపచారాలు, మూఢ విశ్వాసాలు లేవు. భవిష్యత్తులో ఇలా జరుగుతుందన్న  భయంతోనే దైవ ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: ''నా సమాధిని జాతర స్థలంగా, సంబరాల కేంద్రంగా చేయకండి''. (అబూ దావూద్‌)

 (సోదరులారా! ప్రవక్తలందరి నాయకులైన అంతిమ ప్రవక్త (స) వారి సమాధినే జాతర స్థలంగా, ఉత్సవ స్థలిగా చేసుకోవడం తప్పయినప్పుడు ధార్మిక వ్యక్తుల సమాధుల్ని ప్రదక్షిణా కేంద్రంగా మార్చుకోవడం ఎంతవరకు సమంజసం? ''ప్రవక్తల సమాధుల్ని సజ్దా నిలయాలుగా చేసుకున్నందుకు దేవుడు వారిని శపించాడు'' అని ప్రవక్త (స) అంటుంటే మనం పుణ్యాత్ముల సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అవివేకం! అర్థ రహితం!! విడ్డూరం!!! ప్రవక్తల్ని పూజించినందుకు వారు నరకవాసులైతే పుణ్యాత్ముల్ని దైవ భాగస్వాములుగా నిలుపుతున్న మనం నేరుగా స్వర్గానికి చేరుకుంటామా? మీరే ఆలోచించండి! మానవ చరిత్రను పరిశీలిస్తే మానవుడు ప్రకృతి వైపరీత్యాలకు భయపడి, అవగాహన లేమి, అజ్ఞానంతో ప్రకృతిలోని అనేకానేక వస్తువులను దైవంగా భావించి పూజించినట్లు గ్రహిస్తాం. ఉదాహరణకు: అగ్ని, వాయువు, వాన, సూర్యచంద్ర నక్షత్రాలు, పాములు.... మొదలైనవాటిని పూర్వం నుండి ప్రపంచపు అన్నీ ప్రాంతాల్లోనూ  మనిషి పూజిస్తూ వస్తున్నాడు. వీటిలో ఏ ఒక్కటీ దైవం కాజాలదన్న విషయం ఆలోచనా శక్తిగల ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది.  కాబట్టి శక్తివంతుడైన మనిషి శక్తిహీనమైన, కదలిక లేని జడపదార్థాల  ముందు తలవంచడం స్వయంగా అతనికే అవమానకరం! ఇది అన్ని విధాల మూర్ఖత్వం, అవివేకమే అవుతుంది.

ఒక హైందవ వ్యక్తి బాధతో చెప్పుకున్న ఉదంతం ఇది:
నా బాల్యంలో  జరిగిన సంఘటన. ఒక్కసారి నిద్రలేస్తూ పిల్లి ముఖం చూశాను. మా అమ్మ అది అశుభమని చెప్పి, మళ్ళీ ఇంకోసారి పడుకుని లేవమంది. మా అమ్మ దృష్టిలో - ఆదివారం అమావాస్య, కాకి, పిల్లి, తుమ్ము, తలంటుకున్నరోజు ఊరు దాటడం,
వితంతువు ఎదురు రావడం - ఇవన్నీ అపశకునాలు, అశుభాలు. కాకపోతే వితంతువు అయిన నా సొంత చెల్లెలు ముఖం చాలా సార్లు చూడవలసివచ్చేది. ఎదిరించి అడుగుదాం అంటే - అపచారం అని నా నోరు నొక్కేసేది మా అమ్మ. ఆ తర్వాత బాగా పరిశీలించాక తెలిసింది - ఇవన్నీ వట్టి బూటకాలని.
  అలాగే నా చిన్నప్పుడు మా ఊరికి ఓ దగాకోరు దేవుడొచ్చాడు. కుతూహలంతో అతనితో కలిసి ఊరంతా తిరిగాను. అతను అర చేతులు చూసి జాతకం చెప్పేవాడు. అతను చెప్పేది నేను చాలా జాగ్రత్తగా వినేవాడిని. అతను అందరికి ఒకేలాగున చెప్పేవాడు. ముందు మంచిగా చెప్పి, తర్వాత ఏదో ఒక దోషం అంటగట్టేవాడు. ఏ దోషమూ తోచనప్పుడు 'వాస్తు దోషం' వారి మీద బలవంతాన రుద్దేవాడు. జనం భయపడి ఆ దోషం పోవడానికి అతని దగ్గర విభూది, వేరు ముక్కలు కొనుక్కునేవారు. అప్పట్లో ఆ దగాకోరు దేవుడు బాగానే డబ్బు లాగాడు. ముఖ్యంగా స్త్రీల నుండి. ఆ తర్వాత నేను ఎదిగినకొద్దీ ఇవన్నీ కూటి కొరకు నేర్చుకున్న విద్యల్లో ఒకటని గ్రహించాను.

అప్పటి నుండి ఈ దగాకోరు దేవుళ్ళ మీద పూర్తిగా నమ్మకం పోయింది. 'స్వామి ధర్మ తీర్థ' మాటల్లో చెప్పాలంటే - దేవాలయాలు మనం
ఎట్లా రూపొందిస్తే అట్లా తయారవుతాయి. అవిగాని, వాటిలోని శిలాప్రతిమలుగాని వాటంతట అవి మంచీ చేయలేవు. చెడూ చేయలేవు. మనం బుద్ధీహీనులమైతే పూజారులు దేవాలయాల్ని ఉపయోగించుకుని విగ్రహా రాధనని ప్రోత్సహించి మూడ విశ్వాసాలని పెంచి పోషిస్తారు. అమాయక జనాన్ని దోపిడీ చేస్తారు. మనం తెలివైన వారిమైతే దేవాలయాలను ఉపయోగించి ప్రజల జీవితాలను తీర్చిదిద్దవచ్చు. కులం విభేదాలను రూపుమాపవచ్చు. వాళ్ళను సమైక్యపర్చవచ్చు.అందుకు దేవాలయాలను ప్రజల విద్యను  బోధించే ఆరామాలుగా మార్చి ప్రజల పురోభివృద్ధి, పౌరోభివృద్ధి కోసం ఉపయో గించాలి.
  భారత దేశానికి కులం, అస్పృశ్యతల బదులు సహోదరత్వం అపూర్వ సమానత్వం కావాలి. ప్రజలందరి మధ్య ఐక్యత కావాలి. 33 కోట్ల మంది దేవుళ్ళు, 54 కోట్ల మంది భగవానులు, దెయ్యాలు వారి భార్యలు, వారికి పెట్టే విభిన్న నైవేద్యాల సమాజం పోయి ఒకే శాస్త్రీయమైన (అందరికీ ఆమోదయోగ్యమైన, అందరూ సులభంగా ఆచరించదగిన) ఆలోచన కావాలి.    
                (హిందూ సామ్రాజ్యవాద చరిత్ర)
  ఇంకో వ్యక్తి ఇలా అంటారు- నేను క్రైస్తవ సమాజంలో పెరిగిన వాడిని. బాల్యంలో మా చిట్టి బుర్రలకు అర్థం కానీ అనేకానేక ప్రశ్నలుండేవి. ప్రశ్నించేందుకు ప్రయత్నించి  నప్పుడల్లా 'బైబిల్‌ని ప్రశ్నించినవాడు సాతాను శోధకుడు' అని మా నోర్లు మూసేసేవారు.    
  అలాగే 'ఇది ఏసు రక్తం, ఇది ఏసు మాంసం'
అంటూ తినిపించే సజ్జ రొట్టెలు త్రాగించే పానకం మాకు మింగుడు పడేవి కావు. రక్తం...! మాంసం....!! అందులోనూ ఆ ప్రేమమూర్తి రక్తం...! ఆ దయాస్వరూపుడి మాంసం...!! మనం తినడమేమిటి అనే ప్రశ్న మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు. ఇలాంటి  ఎన్నో   ప్రశ్నలు ఉబికివచ్చినా 'ఫాదర్‌' ఎక్కడ
'సాతాను శోధకుడు' అని నామకరణం చేస్తాడోనని అడిగే ధైర్యం, తెగింపు లేకపోయేవి. చివరికి నా దృష్టి యేసువారి ఈ వాక్యాలపై పడింది. ఆయన ఇలా అన్నారు:
  శాస్త్రుల గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువటంగీలు ''ధరించుకొని తిరుగగోరుచు సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరములలో అగ్ర పీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా ధీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి మరి విశేషముగా శిక్ష  
పొందుదురు''. (లూకా-25:45-47)
  ఇలా ధర్మాన్ని ధనార్జన మార్గంగా మార్చుకున్నవారు ఏ వర్గానికి చెందిన వారైనా వారు చట్టం రీత్యా శిక్షార్హులు. 'చట్ట తన పని తాను చేసుకుపోతుంది' అన్నది ఎంత వరకు నిజమో గానీ మనం మాత్రం సభ్య సమాజ పౌరులుగా చేయగలిగింది చెయ్యాలి. లేకపోతే ఆ పరమ దాత రేపు మనల్ని నిలదీ స్తాడు.

  మహా ప్రవక్త (స) వారు ప్రభవింపజేయడానికి కారణం కూడా ఇదే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ''ఉమ్మీ ప్రవక్త ప్రస్తావన వారి దగ్గరున్న తౌరాత్‌ సువార్త గ్రంథాలలో కూడా ఉంది. అతను మంచి పనులు చేయమని (ప్రజలను) ఆదేశిస్తాడు. (వారిని) చెడుల నుండి వారిస్తాడు. వారి కోసం పరిశుద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతం చేస్తాడు. అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు. వారి మీద పడిన (లేనిపోని ఆంక్షల) భారాన్ని తొలగిస్తాడు. వారు చిక్కుకున్న (దురాచార) బంధనాల నుండి వారికి విముక్తి కలిగిస్తాడు. కనుక ఎవరైతే అతడ్ని విశ్వసించి సమర్ధించి అతనితో సహకరిస్తూ, అతనిపై అవతరించిన (ఖుర్‌ఆన్‌) జ్యోతిని అనుసరిస్తారో వారే సార్ధక జీవులు. వారినే విజయం వరిస్తుంది''.  (ఆరాఫ్‌; 157)

షైతాన్‌తో ముఖాముఖి


- శాంతి పియ్ర

ప్రశ్న:  నీ పేరు?
జ:    అజాజీల్‌

ప్రశ్న:  నీ బిరుదు?
జ:     ఇబ్లీస్‌ - షైతాన్‌ - మర్‌దూద్‌

ప్రశ్న:  ఇంతకీ నీకీ బిరుదులు ఎందుకు లభించినట్టో?
జ:      దైవాజ్ఞను అతిక్రమించినందుకు 'షైతాన్‌', ఆది
         మానవుణ్ని 'నేను నీ శ్రేయోభిలాషిని' అని చెప్పి
         మోసగించినందుకు 'ఇబ్లీసు', దైవ సన్నిధి నుండి
         వెలి వేయబడినందుకు మర్‌దూద్‌.

ప్రశ్న:   నీ హాబీలు?
జ:      మనుషుల్ని మోసపుచ్చి సన్మార్గం నుండి
        తొలగించడం, మంచిని తుంచడం, చెడును
        పెంచడం. అశాంతి అలజడులను సృష్టించడం,
        తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని , పిల్లల నుంచి
        తల్లిదండ్రుల్ని దూరం చేయడం. భార్యాభర్తల
        మధ్య   చిచ్చుపెట్టి పచ్చని కాపురాల్లో నిప్పులు
        పోయడం. ప్రజల్ని చెడు కార్యాలకై
        పురిగొల్పడం, దైవాదేశాల్ని, హద్దుల్ని
        అతిక్రమించేందుకు ఉసిగొల్పడం. స్వర్గానికి
        దూరం చేయడం. నరకానికి దగ్గర చేయడం.
        యువతను పోరంబోకుల్లా తయారు చేయడం.
        ఇహమే సర్వం, పరమే లేదు అని
        నమ్మ బలకడం...ఇలా చెప్పుకుంటూ పోతే
        ఇంకా చాలా ఉన్నాయిలెండి.

ప్రశ్న:   నీ లక్ష ్యం ? 
జ:      ధర్మపరాయణుల భ్రష్టు కొరకు
          పాపిష్టుల ప్రగతి కొరకు
          దుర్మార్గుల వృద్ధి కొరకు
          దుర్గుణాల పెరుగుదల కొరకు
          రాత్రింబవళ్ళు ప్రయత్నించటం.


8, ఫిబ్రవరి 2014, శనివారం

తన కోపం తన శత్రువు

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

అరిషడ్వర్గాలలో రెండోదైనది క్రోధం. అది ఎంత భయంకరమయిన దంటే దానిని ఆశ్రయించిన వ్యక్తికి పతనం తప్ప ప్రగతి ఉండదు. కోపం లేని మానువుడు ఉండడు అన్నది వాస్తమే. కానీ; స్థాయికి మించిన కోపం మనిషి జీవితాన్ని అనర్థం పాలు చేస్తుంది. ఒక్క క్షణం నిగ్రహం కొండంతటి ప్రామాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం ఆవేశం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.  మనం జీవితంలో ఏది సాధిం చాలన్నా కసి, ఆవేశం, ఆగ్రహంతోపాటు నిగ్రహం, సంయమనం ఎంతో అవసరం. ఈ కారణంగానే 'ఏదైనా ధర్మోపదేశం చేయండి, ఓ దైవప్రవక్తా!' అని అడిగిన ఓ వ్యక్తికి హితోపదేశం చేస్తూ 'కొపగించు కోకు' అని దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. అది సరే, ఇంకేదైనా, మరేదైనా సెలవియ్యండి అని ఆ వ్యక్తి విన్నవించుకోగా, అడిగిన ప్రతిసారీ ప్రవక్త (స)  'కోపగించుకోకు!' అనే హితవు పలక డం ద్వారా సదరు వ్యక్తిలో గల ఆ అవలక్షణాన్ని తొలగించి అతన్ని నిగ్రహంగల నిండు మనీషిగా మలచదలిచారు ప్రవక్త (స). 
  
 కోపం ఎందుకు వస్తుంది? అంటే, సాధారణంగా కోరింది కోరినట్లు గా జరగకపోవడం, అనుకున్నది సమయానికి అవ్వక పోవడం, అహం దెబ్బ తినడం, తనకు వ్యతిరేకంగా సృష్టించబడిన వదంతుల్ని వినడం, తనకు దక్కాల్సిన హుక్కు దక్కకపోవడం, తృప్తి స్థానే తృష్ణ చోటు చేసుకోవడం, తీవ్రమయిన నిరాశనిస్పృహలకు లోనవ్వడం- మొదలగు కారణాల వల్ల కోపం కలుగుతుంది. సరయిన సమయం లో, సరయిన మోతాదులో, సరైన వారిపై, సరైన రీతిలో కోపాన్ని పదర్శించడం కూడా ఒక కళే. ఆ మాత్రం కోపాన్ని  సయితం మనిషి ప్రదర్శించలేకపోతే అతను, అతనికి సంబంధించిన ప్రతిదీ చులకనై పోతుంది. అలా అని ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుండటం మంచిది కాదు. అలాంటి వ్యక్తికి స్వంత  సంతానం కూడా జడుసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేకపోతు గాంభీర్యమూ కూడదు. గుంట నక్క  వినయమూ వలదు.  కోపాన్నిగానీ, హాస్యాన్నిగాని సహజశైలి లో ప్రదర్శించాలి.
     
 ఈ సందర్భంగా ప్రవక్త (స) వారు చేసిన హితవు గమనార్హం! ''బల్ల యుద్ధంలో ప్రత్యర్థిని చిత్తు చేసినవాడు కాదు గొప్పోడు; కోపం వచ్చినప్పుడు ఎక్కడ ఎంత తగ్గాలో అంత తగ్గడం తెలిసి నోడు గొప్పోడు''. ఎందుకంటే, మితిమీరిన కోపం వల్ల ఆరోగ్యం ఎలాగూ పాడవుతుంది. దానికితోడు క్రోధం కలవాడికి కర్తవ్యం గోచరించదు. తరచూ తీవ్ర భావావేశానికి గురయ్యే వ్యక్తి ప్రాణ ఘాతుకమయిన హింసాచరణకు పాల్పడే ప్రమాదం ఉంది. రాపిడి వల్ల ఉద్భవించి అగ్ని ఆ చెట్టునే దహించివేసినట్లు దేహోత్పన్నమ యిన ఆగ్రహం పూర్తి శరీరాన్నే బూడిద పాలు చేసి వేస్తుంది. అందుకే-'తన కోపం తన శత్రువు, తన శాంతం తన మిత్రుడు' అన్నారు వెనుకటికి మన పెద్దలు.  

 ఆలస్యంగా ఆవేశానికి లోనయి, తొందరగా ఉపశమనాన్ని పొందే వ్యక్తి ఉత్తముడయితే, తొందరగా ఆవేశానికి గురై తొందరగా దాన్నుండి బయట పడే వ్యక్తి మధ్యముడయితే, తొందరగా కాని, ఆలస్యంగా కానీ క్రోధావేశానికి లోనై ఎంత సేపటికీ దాన్నుండి బయట పడక లోలోన దావానలంలా రగులుతూ ఉండే వ్యక్తి అధ ముడు. కాబట్టి మన కోపం సయితం ఆశీర్వచనం అయ్యేలా మనం చూసుకోవాలి. 'అల్లాహ్‌ా తేరా భలా కరే-అల్లాహ్‌ా నీకు సద్బుద్ధిని అనుగ్రహించు గాక!' వంటి పదాలను ఆవేశ ఘడియల్లో సయితం అలవాటు చేసుకోవాలి. 

నిగ్రహాన్ని  అర్థం చేసుకోవడం చాలా సులువు. బయట ప్రపంచం మన ఆలోచనలకు అనుగుణంగా లేదు. నాగరికమో, అనాగరిక మో, ఆధునికమో, ఆటవికమో-ఏమో కానీ అంతా తల్లక్రిందులవుల వుతోంది. మన మాట ఎవ్వరూ వినడం లేదు. మనం అనుకున్న ఏదీ జరగటం లేదు.చిర్రెత్తుకొస్తోంది. ఎదుటి వ్యక్తి పట్టుకొని చితక బాదేయాలనిపిస్తోంది. ఆ సమయంలో శాంతాన్ని ఆశ్రయించి చిరు నవ్వు చిందించడమే నిగ్రహం. ఇది అందరికీ అవసరమయిన గుణమే అయినా ఆధ్యాత్మిక రంగంలో అవిరళంగా పరిశ్రమిస్తున్న వారికి మరీ ముఖ్యావసరం అనే చెప్పాలి. ఈ సద్గుణం మనకుంటే ప్రత్యర్థులు మనల్ని కోపానికి లోను చేసి మన మనోభావాలతో ఆడు కోవాలనుకున్నా మన మనో నిర్మలం చెదరదు. ఇది చెప్పడానికి సులుళువుగానే చెప్పేసినా ఆచరణలో పెట్టడం మాత్రం అంత సులువు కాదు.ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటోంది:

 ''మంచీ-చెడు (ఎట్టి స్థితిలోనూ) సమానం కాలేవు. చెడును మంచి ద్వారా తొలగించండి. (ఆ తర్వాత మీరే చూద్దురు గాని) నీకు- తనకూ మధ్య బద్ధ విరోధం ఉన్న వ్యక్తి సయితం నీకు ప్రాణ మిత్రుడయి పోతాడు. అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగు తారు''. (హామీమ్‌ అస్సజ్దా: 34, 35) 

స్వాతంత్య్రం పరిమళించాలంటే..


సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

మేరా ముల్క్‌, మేరా దేశ్‌, మేరా యే వతన్‌
శాంతికా, ఉన్నతికా, ప్రేమ పూవనం

 అవును విశ్వంలోనే విశిష్ఠమయినది మన దేశం. మనకు దేశం అంటే ఎంతటి అభిమానమంటే, రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను చూస్తే చాలు అన్నీ మర్చిపోతాము. ఏదో తెలియని మధురానుభూతి, మరేదో చైతన్యం వీటన్నింటికీ మించి మది నిండా పొంగి పొర్లే దేశాభి మానం. జాతీయ జెండాను చూడగానే మనం పులకించి పోతాము, పరవశించి పోతాము. బహుశా ఇదే భారతీయతలోని గొప్పతనమేమో! ప్రపంచంలో ఏ దేశానికి లేని మానవ సంపద మన సొంతం. 

మన ఈ స్వాతంత్య్ర భారత దేశం  ఒకరిద్దరి కృషితో సాధ్యమయింది కాదు. ఒకరి కోసం కొందరు, కొందరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు పోరాడితే వచ్చింది కాదు నేటి మన ఈ స్వాతంత్య్రం. అందరి కోసం అందరూ కలిసి ఏక త్రాటిపై నిలిచి సమిష్టి పోరాడి సాధించుకున్నది నేటి మన ఈ స్వాతంత్య్రం. ఒక్క క్షణంలోనో, ఒక్క గంటలోనో, ఒక్క రోజులోనో వచ్చింది కాదు నేటి మన ఈ స్వాతం త్య్రం. కొన్ని వందల సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడితే వచ్చింది నేటి మన ఈ స్వాతంత్య్రం. ఎంతో మంది అమరవీల, వీర జవానుల, చరితార్థుల త్యాగ ఫలితం నేటి మన ఈ స్వాతంత్య్రం. అద్వితీయంగా, అపురూపంగా నాటి స్వాంతంత్ర సంగ్రామం సాగింది గనకే,ఆ మహో న్నత అధ్యాయం నేటికీ అందరి చేతా కొనియాడ బడుతోంది. స్వాతం త్య్రమనే నిధి సాకారమయిన ఆ అద్భుత ఘట్టాన్ని తల్చుకున్నప్పుడల్లా భారతీయుడయిన ప్రతి పౌరుని హృదయంలో ఉద్వేగం ఉప్పొంగు తుంది. మది దాటిన సంతోషం 'జైహింద్‌' అని స్మరిస్తుంది. 

భారత దేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం ఓ మహోజ్వల ఘట్టం. భార తీయుల పోరాట పటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశాభిమానా నికి ఈ సమరం నిలువుటద్దం.ఈ సమరాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకో న్ముఖంగా ఆత్మార్పణలకు పోటీ పడటటం అమోఘం,అమేయం, అపూ ర్వం. ఒకే నినాదంగా, ఒకే లక్ష్యంతో, ఒకే మాటగా, ఒకే బాటగా కోట్లాది ప్రజానీకం ముందుకు సాగడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహత్తర ఘట్టం.  

ఈ పోరాటానికి భారత దేశపు అతి పెద్ద అల్ప సంఖ్యాక వర్గమయిన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన సాహసాలతో భారత ముస్లింలు మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొని పునీతులయ్యారు. -

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికీ 67 వసంతాలు. కొన్ని రోజుల క్రితమే మనం 65వ గణతంత్ర సంబరాల్ని జరుపుకున్నాము. ఈ సుదీర్ఘ కాలంలో భారత్‌ పరిస్థితి మూడడుగులు ముందుకు రెండ డుగులు వెనక్కి అన్న రీతిలో ముందుకు సాగుతోంది.ఇందుకు ప్రధాన కారణం-స్వార్థపరులు, అవినీతిపరులు, అక్రమార్కులు, అసమర్థుల యిన నాయకులు, అటువంటి నేతలను ఎన్నుకొన్న ప్రజలు-మనం కూడా. నేడు మనం రాజకీయంగా ఎంతో చైతన్యవం తులయినప్పటి కీ, విద్యావంతులయినప్పటికీ కుల, మత, ప్రాంత, భాష వంటి వల్ల తీవ్ర ప్రభావితులయిన కారణంగా, సదరు నేత ఎంత అవినీతిపరుడ యినా, అయోగ్యుడయినా,నరరూప రాక్షసుడని తెలిసినా, తమ కులం వాడో, తమ మతంవాడో అయితే అతని అక్రమాలను, అఘాయిత్యాల ను పట్టించుకోకూడదనే ఒక మూర్ఖ సిధ్ధాంతానికి లొంగి బ్రతకడమే కాక, సదరు నేత వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమయినా అతన్ని విమర్శించినవారిని ఎదుర్కొవడం తమ నైతిక బాధ్యతగా భావి స్తున్నాము గనకే అట్టి అవినీతిపరుల ఆటలు ఇంకా కొనసాగుతు న్నాయి. 

 కావాల్సినంత ధనదాహం...టాక్స్‌ సేవింగ్‌కి సరిపడేంత దానగుణం ..ఒంటి నిండా స్వార్థం..ఊరి నిండా లంచం..వ్యవస్థ మొత్తం అస్త వ్యస్థం..హృదయం-శ్మశానమంత విశాలం..గుణం-మానభంగం చేసే ంత పైశాచికం..చచ్చేంత భయం..చప్పేంత ధైర్యం...మౌనం కూడా సిగ్గు పడేంత చేతకానితనం..ఎప్పుడూ కలహం..అప్పుడప్పుడు ఐకమ త్యం...ఇది నేటి మన భాతరం. ఇదా మన పెద్ద ఆశించిన దేశం? 'నా దేశం చంద్రుని మీద మనిషిని నిలబ్టెకపోయినా ఫర్వా లేదు, భూమ్మీద మనిషిని మనిషిగా చూస్తే చాలు' అని డా.అంబేడ్కర్‌ చేప్పిన మాట అక్షరాల అచరణీయం. 
  
మన పూర్వీకులు శ్రమకోర్చి మనకు స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు...ఎంత స్వాతంత్య్రం అంటే, ఉగ్రవాదం అనుకుంటూనే... విచక్షణారహితంగా కాల్పులు, పేలుళ్లు జిరిపేతంట, ప్రేమించలేదని ఆసిడ్‌ దాడి చేసేటంత, కట్నం తేలేదని కాటికి పంపించేటంత, అమ్మ నాన్నను వృధ్దాశ్రమానికి తరలించేంతట...ఆఖరికి సహజీవనం చేసే టంత, స్వలింగ సంపర్కానికి అధికారికంగా అనుమతి కోరేటంత, సొంత ప్రాణం తీసుకునే అంత, ఇతరుల స్వేచ్ఛను హరించేటంత స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాము..శభాష్‌!

 'ఫ్రీడం ఈజ్‌ రెస్పాన్సిబిలిటీ'  బాధ్యతారహిత స్వేచ్ఛ 'పిచ్చోడి చేతి లో రాయి' చాలా ప్రమాదకరం...మనకి వద్దు. మనం ప్రశాంతంగా బ్రతుకుతూ ఇతరులను కూడా ప్రశాంతంగా బ్రతకనిస్తే అది స్వేచ్ఛ. లేకపోతే అది జంతు స్వేచ్ఛ. కాబట్టి మన ప్రవర్తనను సమీక్షించు కుంటూ ముందడుగు వేయాలి. కోట్లాది జన హృదయాల ఆశలకు అనుగుణంగా మన భారతావనిని తిర్చిదిద్ది మన దేశ శక్తికి కీర్తి కిరి టాలు తొడిగించేందుకు ఆందరు కలిసికట్టుగా ముందుకు వస్తారని ఆశిస్తూ...!


ఇది మనుషులు చేసే పనియేనా?


సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ


''మీరు అల్లాహ్‌కు భయపడరా?...మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే?! మీరు లోకంలోని పురుషుల వద్దకు పోతున్నారేమిటి? అల్లాహ్‌ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెతున్నారే! మీరు మరీ బరితెగించిన జనంలా ఉన్నారు''. (ఖుర్‌ఆన్‌: 29:161-166) అని తన జాతి వారినుద్దేశించి అన్నారు ప్రవక్త లూత్‌ (అ). 
 పై ఆయతులో పేర్కొనబడిన 'నీతిమాలిన పని' అంటే స్వలింగ సంపర్కం. ఈ అసహజ లైంగిక చేష్టకు మానవ చరిత్రలోనే తొట్టతొలి సారిగా పాల్పడిన పాపం లూత్‌ జాతి వారిది. 'కామా తురా ణాం న భయం న లజ్జ' అన్నట్లు కామంతో కన్ను మిన్ను కానక వ్యవహరించారు. దాని కోసం ప్రకృతి సిద్ధంగా నిర్దేశించబడిన సహజ పద్ధతి కూడా వారికి తృప్తినీయలేదు. బరితెగించి మరీ అస హజమైన పద్ధతి ద్వారా వారి కామ తాపాన్ని చల్లార్చుకున్నారు. వారు పాల్పడిన ఈ చేష్టకుగాను అల్లాహ్‌ా వారిని మహా భయంకరంగా శిక్షించాడు. 'స్వలింగ సంపర్కం మరియు  సహజీవనం (వ్యభి చారం) ఈ రెండూ జీవితంలోని 72 రకాల పాపాలకు ప్రేరకం' అని హజ్రత్‌ అలీ (ర) గారు చెప్పా రంటే ఈ ముదనష్టపు వ్యవహారం ఎంత ప్రమాదకరమైనదో ఆలోచనాపరులు అర్థం చేసుకోవచ్చు. 

 స్వలింగ సంపర్కం అత్యంత నీతి బాహ్యమయిన చేష్టగా, అసాంఘీక కార్యకలాపంగా ప్రపంచ మతాలన్నీ పరిగణిస్తున్నప్పటికీ, నేడు 126 దేశాలు స్వలింగ సంపర్కం నేెరం కాదని ఈ ముదనష్టపు చేష్టకు చట్టబద్ధతనివ్వడం అనేది ఆయా దేశ పాలకుల ఆలోచనలు ఏ దిశకు పయనిస్తున్నాయో చెప్పకనే చెబుతుంది. ఈ దుష్కృతి విష వీచికలు కొన్నేళ్ళుగా మన దేశ వాతావరణాన్ని సయితం కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.  ఇక ఎయిడ్స్‌ వ్యాధి అనేది స్వలింగ సంపర్కులకు ఎక్కువ గా సక్రమిస్తుందనేది అందరికి విదితమయిన విషయమే. 
 11.12.2013న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో స్వలింగ సంపర్కం చట్టం దృష్టిలో నేరం. స్వలింగ సంపర్కం ఏ రూపంలో  ఉన్నా అక్రమం, అనైతికం, అసహజమయినదేనని ఖరారు చేసింది ధర్మా సనం. 'పరస్పర సమ్మతితో స్వలింగ సంపర్కానికి పాల్పడితే అది నేరం కాదం'టూ ఢిల్లీ హైకోర్టు 2009లో ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందిస్తూ అప్పటి నెలవంక గౌరవ సంపాదకులు ముహమ్మద్‌ అజీజు ర్రహ్మాన్‌ గారు 'ఈ రోగ కారకాలను ప్రజా జీవితాల నుండి ఏరి వేయాలి' అంటూ ఈ దుష్చర్యను దుయ్య బట్టారు. అప్పటికీ-ఇప్పటికీ స్పష్టంగా కానవచ్చే తేడా ఏమిటంటే, దాదాపు ఐదు సంవత్స రాల చట్టబద్ధతత, భద్రత లభించిన కారణంగా నేటి ప్రజల గళంలో మార్పు కొట్టుకొచ్చినట్లు కన బడుతోంది. దీనికి తోడు బడా బాబుల సమర్థన కూడా పెద్ద ఎత్తునే వినబడుతోంది. 'వారూ మను షులే, వారికీ మనసుంటుంది, వారికీ మెదడుంటుంది' అనే ప్రబుద్ధులు, 'సహజీవనం అంతా ప్రమో దమే ప్రమాదం ఏమీ లేదు' అని ఉద్దండగా ఉపన్యాసాలిచ్చే ఉదారవాదులు ఒక్కసారి కాదు, వంద సార్లు ఆలోచించాలి! 
 సహజీవన విధానంగానీ, స్వలింగ సంపర్కంగానీ వీటి వల్ల జీవన విలువలు భ్రష్టు పడతాయి. ఇవి అటు వ్యక్తికి, ఇటు సంఘానికీ అనర్థదాయకం. ఈ రెంటి వెనకాల ఎవరు ఎంత కాదన్నా కామ తాపం చల్లార్చుకోవడమే  లక్ష్యంగా కొనసాగుతున్నది.'వినాశకాలే విపరీతి బుద్ధి' అన్నట్టు వికృత చేష్టలు అవి ఏ రూపంలో ఉన్నా విపరీతమయిన ఫలితాలే ఉంటాయి. ఈ నీతి మాలి చేష్టల్లో ఓ చేష్ట పూర్తిగా అసహజమయినదయితే, మరోకటి పూర్తిగా అధర్మమయినది. 
 'బుద్ధి కర్మానుసారిణి' అంటారు. కానీ మనిషి బుద్ధే చెడ్డది. 'పేళ్ళి అనేది పాత కాన్పెప్ట్‌' అంటూ నైతికతకు ఉన్న ఆ కాసిన్ని వలువల్ని సయితం ఊడబెరికే ప్రయత్నంలో మంచిని సమాధి చేసేవారికి నేడు మన సమాజంలో కొరత లేదు. కఠినమయిన చట్టాలు ఉంటేనే నేరాలూ, ఘోరాలూ ఆగడం లేదు.ఇక నేరానికే చట్టబద్ధత లభిస్తే నేరగాళ్ళకు, కామాంధులకు పట్టపగ్గాలుండవు. సతీ సహగమన స్థితి నుండి వేలాది సంస్కరణల ఫలితమే నేటి మన భాతర సమాజం. నాగరికత అనేది మనిషికి మరింత మంచిని, న్యాయాన్ని అందించాలి. అంతేగాని అధఃపాతాళానికి నెట్టేదిగా ఉండకూడదు. 
  పోతే, 377 నిబంధన కేవలం స్వలింగ సంపర్కులకే కాదు - దీని ప్రకారం పునరుత్పత్తికి దోహ దం చేయని ఏ రకమయిన లైంగిక ప్రక్రియ అయినా శిక్షార్హమే.భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 377 (అస హజ నేరాలు) ప్రకారం ప్రకృతి విరుద్ధమయిన శృంగార కార్యకలాపానికి పాల్పడిన వారికి పదేళ్ళ దాకా శిక్ష విధించేందుకు అవకాశముంది. కాగా ఇదే సమయంలో ఈ ధోరణులు ఉన్న వారినిలో చట్టం విధించే శిక్ష పట్ల భయంతోపాటు, దైవభీతిని, నైతిక రీతిని పెంపొందించే ప్రయత్నం చేయ డం మనందరి కనీస మానవీయ ధర్మం! 

13, జనవరి 2014, సోమవారం

సమయం – సందర్భం


ప్రతి భాషలోనూ మాట్లాడే తీరు, ప్రసంగించేె విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ భాషలో మాట్లాడదలచిన వారు వాటిని తెలుసుకోవడం అత్యవసరం. అది ప్రాతీయ చలోక్తులు, సామెతలు, శతకాలు, సుభాషితాలు, పద్యాలు, గద్యాలు, కావ్యాలు ఏవైనా కావచ్చు. వీటి మాధ్యమంతో శ్రోతల హృదయాలను హత్తుకునేలా మాటను చెప్ప గలుగుతాము. అలాగే శ్రోతలను బట్టి భాష, విషయం ఉండాలి. ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అన్నట్టు సామాన్యులతో తాత్విక భాషణలు, చర్చలు లేవనెత్తడం, బరువయిన పదాలను, సమాసాలను వాడటం ఎంత మాత్రం వివేకం అన్పించుకోదు. పైగా ఈ వైఖరి వల్ల మనం అందించాలనుకున్న సందేశం వైఫల్యం చెందుతుంది. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) గురించి ఆయన సతీమణి విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర) ఇలా అభిప్రాయపడ్డారు: ”ఆయన (స) మాట ఎంతో విపులంగా, సరళంగా స్పష్టంగా ఉంటుంది. విన్న ప్రతివాడు ఇట్టే అర్థం చెసుకునేవాడు”. (అబూ దావూద్‌)
ఇకపోతే, మనిషి మానసికంగా మాటను విని జీర్ణించుకోగల స్థితిలో ఉన్నప్పుడే ఏదైనా విషయాన్ని అతనికి బోధించాలి. అలా కాక మనసు పరధ్యానానికి లోనై ఉన్నప్పుడు బలవంతంగా ఏదయినా వినిపిస్తే మొండిగా ఆ బోధను తిరస్కరించే ప్రమాదముంది. వివేకం కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తించే అవకాశమూ లేకపోలేదు. హజ్రత్‌ అలీ (ర) ఇలా ఉపదేశించారు: ”మనసులకు (హృదయాలకు) కొన్ని తత్వాలుంటాయి. కొన్ని ప్రీతికర విషయాలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆంత ర్యాలు మాటను స్వీకరించటానికి అనుకూలంగా ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో వాటిలో వెన్ను చూపే స్వభావం ప్రబలి ఉంటుంది. కనుక ప్రజల ఆంతర్యాల తత్వాన్ని బట్టి, అవి హితవును అంగీకరిం చేందుకు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిలో ప్రవేశించండి. ఎందు కంటే, మనసును బలాత్కరించినప్పుడు అది గుడ్డిదయిపోతుంది”. (కితాబుల్‌ ఖిరాజ్‌ – అబూ యూసుఫ్‌)
మరో సదర్భంలో హజ్రత్‌ అలీ (ర) ఇలా అభిప్రాపడ్డారు: ”ఎవరైతే ప్రజల్ని అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశకు గురి చెయ్యడో, వారు దైవాజ్ఞల్ని ఉల్లంఘించడానికి అనుమతించడో, వారిని అల్లాహ్‌ శిక్ష  పట్ల భయపడనట్లు చెయ్యడో – అలాంటి ధర్మ జ్ఞానియే నిజమైన స్థిత ప్రజ్ఞుడు”. (కితాబుల్‌ ఖిరాజ్‌)
అంటే – ప్రజలు తమ మోక్షం పట్ల, అల్లాహ్‌ా కారుణ్యం పట్ల నిరాశ చెందేలా నకారాత్మక బోధనలు చేయడం (బాధ గురువులుగా వ్యవ హరించడం) ఎంత తప్పో, ఆల్లాహ్‌ా క్షమా గుణాన్ని, కృపాకటాక్షాల్ని, ప్రవక్త (స) వారి సిఫారసును తప్పుగా చిత్రీకరించి ప్రజలు దైవాజ్ఞ ఉల్లంఘనకు పాల్పడేలా చేయడం, వారిని మొరటు వ్యక్తులుగా తయారు చేసే ఊక దంపుడు ఉపన్యాసాలివ్వడం కూడా అంతే ఘోర మైన నేరం. సరయిన పంథా ఏమంటే, ఉభయ కోణాలూ ముందుం డాలి. అటు నిరాశా జనించకూడదు. ఇటు నిర్భయము, దుస్సాహ సమూ కలగకూడదు.
దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రజల్ని తీర్చిదిద్దే నిమిత్తం సరైన సమయం సందర్బం కోసం ఎదురు చూస్తుండేవారు. అలా ప్రాప్త మయిన మంచి అవకశాన్ని ఆయన సద్వినియోగ పరచుకునేవారు.
ఓ సారి దైవ ప్రవక్త (స) వారి సమక్షంలోకి కొంత మంది ఖైదీలు తేెబడ్డారు. ఆ ఖైదీలలో ఓ మహిళ కూడా ఉంది. ఆమె స్తనాల్లో పాలు నిండుగా ఉన్నాయి. ఆ ఖైదీలలో ఒక పసి బాలుడు ఏడ్వడం చూసి ఆమెలోని మమత ఉప్పొంగింది. వెళ్ళి అ పసికందుని అమాంతంగా తన గుండెలకు హత్తుకుని పాలు పట్ట సాగింది. ఈ అద్భుత ధృశ్యాన్ని మహా ప్రవక్త (స) మరియు ఆయన సహచరులు తిలకిస్తున్నారు. (తన సహచరుల్ని ఆ తల్లి ప్రేమ ఆశ్చర్యచకితుల్ని చేెసిందన్న విషయాన్ని గ్రహించిన ప్రవక్త (స) సత్యోపదేశం కోసం ఇది సువర్ణ సమయ మని భావించి) ”ఈ మాతృమూర్తి గురించి మీ అభిప్రాయమేమిటి? ఈమే తన సొంత కుమారుణ్ణి స్వహస్తాలతో అగ్నికి ఆహుతి చెయ్య గలదా?” అని వారిని ప్రశ్నించారు. ‘అల్లాహ్‌ా సాక్షి! ఈ తల్లి తన చేజే తులా తన పిల్లవాణ్ణి నిప్పుల్లో పడవేయజాలదు’ అని సహాబా ముక్త కంఠంతో బదులిచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త (స) ఇలా హితోపదేశం చేశారు: ”ఈ మాతృమూర్తికి తన పిల్లవానిపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే (మరో ఉల్లేఖనం ప్రకారం 70 తల్లులకంటే) ఎక్కువ ప్రేమ అల్లాహ్‌ాకు తన దాసులపై ఉంటుంది”. (బుఖారీ ముస్లిం)
ఓ సారి దైవ ప్రవక్త (స) బజారు గుండా వెళుతున్నారు. ఆయన ఇరుప్రక్కల జనం ఉన్నారు. దారి ప్రక్కన చచ్చి పడి ఉన్న పొట్టి చెవులు గల ఓ మేక పిల్లను చూశారు. (క్రింద కూర్చోని) దాని చెవి పట్టుకొని: ”మీలో ఎవరైనా దీన్ని ఒక్క దిర్హముకైనా కొనడానికి ఇష్టపడతారా?” అని ప్రశ్నించారాయన.
అందుకు – ‘దిర్హముకన్నా తక్కువ ఖరీదుకు కూడా మేము దాన్ని తీసుకోము. ఒకేళ తీసుకున్నా దాన్ని మేమేం చేసుకుంటాము?’ అని బదులిచ్చారు ప్రజలు. అది విన్న దైవ ప్రవక్త: ”ఒకవేళ ఉచితంగా లభిస్తే తీసుకోవడానికి ఇష్టపడతారా?” అని మళ్ళీ అడిగారు. దానికి వారు – ‘అల్లాహ్‌ా సాక్షి! ఒకవేళ అది బ్రతికున్నా (మేము దాన్ని తీసు కోవడానికి ఇష్టపడేవారము కాము) దీనిలో లోపం ఉంది. దీని చెవులు పొట్టిగా ఉన్నాయి. ఇక చచ్చిపోయిన తర్వాత ఎలా తీసుకుం టాం?’ అని అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త (స) ”వల్లాహి! ఈ మేక పిల్ల మీ దృష్టిలో ఎంత హేయమైనదో అల్లాహ్‌ా దృష్టిలో ఈ లోకం అంతకన్నా హేయమైనది” అని హితవు పలికారు. (ముస్లిం)
చచ్చి కంపు కొట్టే పశువు దగ్గర నిలబడటం ఎవరికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఆ మార్గం గుండా వెళ్ళాల్సి వస్తే ముక్కు పుటాలు మూసుకుని మరీ తొందరగా ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు ప్రజలు. ఆ చచ్చిన మేక పిల్ల పట్ల అక్కడున్న ప్రజల్లో గల ఏహ్య భావాన్ని గమనించిన ప్రవక్త (స) ఏం చేశారంటే – ముందు ఆ మేక పిల్ల వద్దకు వెళ్ళారు. తర్వాత దాని చెవులు పట్టు కున్నారు. ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ సందర్భాన్ని హితవు గరిపేందుకు మంచి అవకాశంగా భావించి, వారికి ఐహిక వాస్తవికతను తెలియ పర్చడమే కాక, వారిలోని ప్రాపంచిక వ్యామో హాన్ని అంతమొందించి, పరలోకం కోసం పాటుపడేలా వారిని ప్రేరే పించారు. సుబ్హానల్లాహ్‌!
ఓ సారి ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి – ”యా రసూలల్లాహ్‌ా! ప్రళయం ఎప్పుడొస్తుందంటారు?” అని ప్రశ్నించాడు.
చూడబోతే ఈ ప్రశ్న చాలా సామాన్యమైన ప్రశ్నగానే గోచరిస్తుంది. ఆ వ్యక్తి అడిగిన తీరు కూడా సాధారణమైనదే. ప్రవక్త (స) అతనికి బదులిచ్చి సాగనంపాల్సింది. కొన్ని ప్రళయ సూచనలు తెలియజేసి అతని నోరు మూయించాల్సింది. లేదా ఆ దినం గూర్చిగానీ, ఆ ఘడియ గూర్చి గాని నాకు తెలియదు అని, అల్లాహ్‌ాకు మాత్రమే తెలుసునని దాట వేయాల్సింది. కాని ఆయన (స) అలా చేయలేదు. ఆయన అతని అంతర్మధనాన్ని అంచనా వేశారు. పరలోక భీతితో అతని మనో స్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ కారణంగానే తను ఈ ప్రశ్న అడిగాడు. ఇది శిక్షణకు సరైన సమయం అని భావించి ప్రవక్త (స) – జవాబివ్వడానికి బదులు అతనికే ఎదురు ప్రశ్న వేశారు: ”ఆ ఘడియ కోసం నువ్వు ఏ విధమైనటువంటి సామగ్రిని కూడబెట్టు కున్నావు?” అని.
ఈ చిన్న ప్రశ్నతో దైవ ప్రవక్త (స) అతని ఆలోచనా స్రవంతిని సకా రాత్మక దిశన పయనించేలా చేశారు. ప్రళయం ఎప్పుడు వస్తుందన్నది కాదు సమస్య. ప్రళయం కోసం మనం ఏం సమకూర్చుకున్నామన్నది అసలు సమస్య. ఒకవేళ ప్రళయం ఆలస్యంగా వచ్చినా మన వద్ద ఏ విధమైనటువంటి ముందస్తు సామగ్రి లేకపోతే ప్రయోజనం పూజ్యం. అదే మనం అన్ని విధాల సమాయత్తమయి ఉంటే ప్రళయం ఈ క్షణం వచ్చినా భయం లేదు అని స్వయంగా ఆ వ్యక్తి గ్రహించేలా, ఆత్మావ లోకనం చేసుకునేలా చేశారు. అది విన్న ఆ వ్యక్తి తన యావత్తు జీవితాన్ని సునిశితంగా పరిశీలించి ఇలా అన్నాడు: ”అల్లాహ్‌ పట్ల మరియు ఆయన ప్రవక్త (స) పట్ల ప్రేమ”.
అంటే, నేను కూడబెట్టుకున్న పరలోక సామగ్రల్లా దైవ ప్రేమ, మరియు దైవ ప్రవక్త (స) వారి ప్రేమ అంతే. జీవిత అన్ని రంగాల్లో అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త (స)ను ప్రసన్నుల్ని చేయడమే నా ల క్ష్యం. నా జీవిత ధ్యేయం దైవ దాస్యం. నా జీవితం అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్తకే అంకితం అన్నాడు. అతని నోట ఈ మాట విన్న విశ్వ నాయకులు (స) సంతోషంతో పరవశించిపోతూ అతనికి శుభవార్తను అందజేశారు:
”నువ్వు ప్రేమించే, అభిమానించే వారి సరసనే రేపు ప్రళయ దినాన నువ్వుంటావు” అన్నారు. సుబ్బానాల్లహ్‌! (బుఖారీ, ముస్లిం)

31, డిసెంబర్ 2013, మంగళవారం

కాలం పరిణామశీలం


కాలమనే కడలిలో మరో కెరటం లేచింది. మానవ చరిత్ర మరో మైలు రాయి దాటింది. చరిత్రలో ఏ సంవత్సరానికా సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కొత్తదనం అంటే చిత్తానికి ఎప్పుడూ ఉత్తేజమే. పాత జ్ఞాపకల స్థానంలో రానున్న భవిష్యత్తును ఊహించుకుంటూ రాబోయే సమయం సంతోషంగా గడవాలని కోరుకుంటాడు మనిషి. ఉషాకాంతుల వంటి పసిడి కలలతో మిసిమి భవితవ్యానికి సుస్వాసగం పలికే సంప్రదాయం వెనుకున్న రహస్యం – మనిషి నిత్య ఆశావాది కావడమే! ఆ ఆశావాదమే అడవి మనిషిని అణు అధికారిగా మార్చింది. ఎదురుదెబ్బలెన్ని ఎదురైనా అదరక, బెదరక సమస్యల సునామీలకు ఎదురేగి మరీ దూసుకుపోయే సుగుణమే మనిషిని ఇతర జీవరాసులలో శ్రేష్ఠుణ్ణి చేసింది. శిశిరం వస్తుంది, పోతుంది, మళ్లీ వస్తుంది. అయినా వసంత పవన తాకిడికే పరవశించిపోతుంది కోయిల. మధు మాసం రాగానే మావి చిగురు కొమ్మ మీద చేరి రాగాలాపన చేస్తుంది. అలాగే గత అనుభవాలు ఎలా ఉన్నా – రాబోయే కాలమంతా సర్వే జనా సుఖినోభవంతు, సర్వ జనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించడం ఒక్క మనిషికే చెల్లింది. అయితే 2013లో ఈ మనిషి చేసిందేమిటి? అంటే, ‘పతనంతో పోరాటం’ అనక మానదు.
పోరాటం – అది అరబ్బు ప్రపంచంలో నియంతలపై సాగిన ఆగ్రహ జ్వాలలే కావచ్చు. మళ్ళి నిరాయుధ ప్రజలను గురి పెట్టి చూసిన కరకు మర తుపాకులే కావచ్చు. మళ్లీ మళ్ళీ శాంతి కపోతాల రక్తాన్ని చవి చూసిన ఇనుప మూతి కాకులే కావచ్చు. ఐరోపాలో ఆర్థిక సంకోభంపై సమరమే కావచ్చు. భారత దేశంలోనిర్భయ నిరసనలే కావచ్చు. రూపిణి పతనావస్థకు గురి చేసిన పరిస్తుతులే కావచ్చు.సామ్రాజ్యవాదులను సమస్యల్లోకి, సామాన్యులను కష్టాల్లోకి నెట్టిన, ముంచుతున్న ఆర్థిక సంకోభమే కావచ్చు. వెరసి 2014 వీటికి ఓ పెను సవాల్‌!
ఏది ఏమైనా, కాలం – దాని విలువ అమూల్యం. అది కలిమితో కొనలేనిది, బలిమితో వశపర్చుకోలేనిది. ఒక్కసారి చేజారితే తిరిగి సంపాదించుకోలేనిది. మ్రొక్కి పట్టుకోలేనిది, వెతికి వెనక్కి తెచ్చుకోలేనిది. నియతి తప్పక నడితే ఆ కాలం మనిషికిచ్చే సందేశం – శిశిరంలో సయితం వసంతాన్నే కలగనమని. గతి తప్పిన చోటు నుంచే మతి మార్చుకుని మసలుకోమని. మానవ జాతికి ఊపిరి స్వాతంత్య్రం – అది జ్యోతిగా వెలిగే చైెతన్యం – ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యం అని. శిఖరంలా ప్రతి మనిషీ శిరసెత్తిన నాడే, అవనీ ఆకాశం, సూర్య చంద్ర నకత్రాల్లా ఆ సర్వేశ్వరుడికి తల వంచిన నాడే, జల నిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయం అని. అది గతాన్ని సింహావలోకనం చేసుకుని బంగారు భవిష్యత్తుకు దైవవిధేయతా పునాదులు వేసుకోవడంతోనే సాధ్యమని.
”కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు”. (అల్‌ అస్ర్‌: 1-3)

మధురమైన మాట


నేటి యువతరంల్లో నానాటికీ అభద్రతా భావం అధికమైపోతూంది.అలాగే వయసు మీద పడిందని మదనపడే పెద్దలకీ కొరవ లేదు. ఇట్టి పరిస్థితుల్లో ఒకరి సమక్షంలో వారు ఆనందంగా గడపడానికీ, వారి మనోభావాలను వ్యక్తపరచడానికి, వారి ఫీలింగ్స్‌ని చెప్పుకోవడానికీ, ‘నీకు నేను న్నాను’ అన్న ఫీలింగ్‌ కలగటానికీ నిజ మైన హితుడి ప్రాణ మిత్రుడి అవసరం ఉంటుంది. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్నేహాన్నే కాంక్షిస్తారు. ఆ స్నేహ కాంక్షని మనం పాలతో పోల్చ వచ్చు. అవతలి వ్యక్తి ఇచ్చేది పంచాదార అయితే మనలో కరిగిపోతుంది. ఉప్ప యితే విరగ్గొడుతుంది. పెరుగయితే మన అస్థిత్వాన్ని మారుస్తుంది. నీరయితే పలు చన చేస్తుంది. కనుక మన పాలు ఎవరి పాలవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి. ‘నేను చాలా ఒంటరిని నాకంటూ ఎవరూ లేరు. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు. అందరితో నేను కలవలేక పోతున్నాను.’ అన్న దుర్భర స్థితి నుంచి ముందు బయట పడాలి.
ఇక వృద్ధుల విషమంటారా..! నిజంగా పరిశీలించి చూస్తే అసలైన జీవితం నలభై సంవత్సరాల తర్వాతే ప్రారంభమవు తుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ ప్రవక్తలకు, ప్రవక్త పదవి 40 ఏండ్ల తర్వాత ప్రసాదించడమే. సగం జీవితం – ఇచ్చిన అనుభవ పరంపర నుంచి సరికొత్త జీవితం ప్రారంభించాలి. ఆ వయసు దాటాక జీవితం కాటికి కాలుజాచి ఉం టుందనుకోవటం మూర్ఖత్వం. నిజంగా ఆ వయసు నుంచే కొత్త జీవితం ప్రారంభ మవుతుంది అని అనుకుంటే ఆ సరికొత్త జీవితం మరింత ఆనందప్రదంగా ఉం టుంది. వృద్ధాప్యం వయసుకే గానీ, మన సుకీ కాదని తెలుసుకోవాలి. మనిషి ఒం టరి తనానికి, అశాంతికి, అసంతృప్తికి బద్ధ శత్రువకటుంది. అది ‘వ్యాపకం’. ఒక మంచి వ్యాపకం మనిషి జీవితంలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అర్థం చేసుకోగలిగితే, ఒక పుస్తకం, లేద ఒక గొప్ప వ్యక్తి చరిత్ర మనకి ప్రేరణ ఇస్తుంది. ‘ఇలా చెయ్యి’ అని శాసించకుండా ఎలా చేస్తే బావుంటుందో సలాహా ఇస్తుంది.
నేను, నా జీవితం, నా చదువు, నా ఉద్యోగం, నా కుటుంబం, నా బ్యాంక్‌ బ్యాలెన్సు అనుకుంటే నూతిలోని కప్పకీ ఒడ్డునున్న మనిషికీ తేడా ఏం ఉంటుంది చెప్పండి. కనుక జీవితం నిరాసక్తంగా అని పించినప్పుడు ఒంటరితనంతో సతమతమై పోయే బదులు రోజుకో గంట, వారానికో రోజు, నెలకో నాలుగు రోజులు, ఏడాదికో యాభై రోజులు మనకంటు ఓ గుర్తింపు నిచ్చిన సమాజం కోసం కేటాయించినప్పుడే జీవితానికి సార్థకత. సమాజ సేవ చేసినంత సేపూ ఇష్టంగా చేయండి. అందులో మమేకమైపోండి. ఆ శ్రమలో కష్టం ఉండదు. అసలట అసలే అన్పిం చదు. ప్రతిఫలాన్ని కోరుకోం కాబట్టి ఆశా నిరాశలుండవు. ఎవరో నెత్తిన కూర్చొని ఆజమాయిషీ చేస్తున్న భావనే కలుగదు. ఆ అదృష్టం సేవకులకే దక్కుతుంది. పరిమిత మైన అనుభావాలతో, పరిమితమైన వ్యక్తుల మధ్య బతికే బతుకు, జైలు జీవితం కంటే ఎక్కువేం కాదు. మన ఇల్లు, మన కుటుంబం, మన స్నేహితులు…అంతా ఇరుకిరుగా ఉంటుంది. బయటికెళ్తే బోలెడంత ప్రపంచం. ఓ కవి అన్నట్టు
ఓ ఫూల్‌ సర్‌ చడా జో చమన్‌సే నిక్‌లా’
‘ఉస్‌ షక్స్‌కు ఇజ్జత్‌ మిలీ జో వతన్‌సే నిక్లా.
మనిషికైనా, మరే మహాత్ముడికైనా గడప దాటాకే బుద్ధి వికసించింది.
ఒంటరితనంతో బాధ పడుతున్న వారికీ, డిప్రెషన్‌ లాంటి సమస్యలు వేధిస్తున్న వారికి సృష్టిరాసుల సేవకు మించిన చికిత్స లేదు అంటున్నారు మానసిక నిపుణులు.
అంత మంది కోసం పని చేస్తున్న ప్పుడు ఒంటరి భావనకు చోటెక్కడిది చెప్పండి. మనిషి ఎదుర్కొనే మానసిక సమస్యలకు బంధాల్ని మించిన, స్నేహపరా మర్శలకు మించిన మందేముంటుంది చెప్పండి. పైగా సమయాన్ని సృష్టి సేవ కోసం కేటాయించేవారు, మిగతావారికన్నా ఆరోగ్యంగా ఉంటారనీ, వారి ఆయుష్షు పెరుగుతుందిని, వారి సంపాదనలో శుభం కలుగుతుందిని ప్రవక్త (స) వారి పలు ప్రవచనాల ద్వారా రూడీ అవు తుంది. నిజమే మనకు బాగా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండదు. మనసు సేద తీరుతుంది. గుండే సాఫీగా పని చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అలాగే భరించలేని దిగులు ఆవరించిన ప్పుడు ప్రవక్త (స) గారి ”యా బిలాల్‌ అరిహ్‌ నా బిస్సలాత్‌” (ఓ బిలాల్‌! మాకు నమాజు ద్వారా విశ్రాంతినివ్వు) అన్న మాటను అనుసరిస్తూ, తాగుడికి ఇతర వ్యర్థ వ్యసనాలకి బానిసకాకుండా, మస్జి దుకు వెళ్ళటం, దైవ సన్నిధిలో సజ్దా చేయటాన్ని అలవాటు చేసుకోండి. మరీ బోరుగా ఉన్నప్పుడు సిగరెట్‌ తాగాలనిపిం చటం, చుట్ట పీల్చాలనిపించడం ఒక హానికర వ్యసనమైతే, మంచి స్వరం గల ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని, పరలోక భీతిని పెంచే హితబోధనం వినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ..?
చెడ్డ వ్యసనం మనల్ని అధిగమించి ఎంతగా తన చెప్పు చేతలలో ఉంచుకొం టుందో, మంచి అలవాటు ఒక స్నేహి తునిగా, మన పక్కన చేరి, మనతో పాటు ఉండి స్పూర్తినిస్తుంది. అందుకే ఒక ప్రముఖ మేధావి ఇలా అన్నాడు:
(1) ఒక మంచి ఆలోచనకి అంకురంగా వెయ్య ండి. ఒక స్పూర్తి మొలక పైకొస్తుంది.
(2) ఒక స్పూర్తి మొలకని అంటు కట్టండి. ఒక చర్య పుష్పిస్తుంది.
(3) చర్య అనే పుష్పాన్ని ఫలించనివ్వండి. అలవాటు అనే ఫలం పక్వానిని కాస్తుంది.
(4) ఆ ఆరాధన (అలవాటు) అనే ఫలాన్ని ఆస్వాదించండి. అది మీకు లక్ష్యం చేరుకొనే శక్తినిస్తుంది.

మీరూ విజేత కాగలరు!



జీవితంలో అప్పుడప్పుడే అడుగు పెడు తున్న వ్యక్తికి 'నీకు ఏం కావాలి? భవి ష్యత్తుల్లో నువ్వు ఏం సాధించదలచుకు న్నావు?' అని అడిగితే చాలా మంది దగ్గర నుంచి సమాధానం ''నేను బాగా చదువు కొని, నా కాళ్ళ మీద నేను నిలబడగల గాలి. చక్కటి సంసారం, అందమైన ఇల్లు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండి, మిగతా జీవితం విశ్రాంతి తీసుకుంటూ, మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకుంటూ జీవితం సాగితే అంతకన్నా ఇంకేం కావాలి'' అంటారు. మరి కొంత మంది అయితే ఇంకాస్త ముందుకెళ్ళి-ఏ అమేరి కాకో, దుబాయ్‌కో వెళ్ళి అక్కడ కొంత కాలం (ఇష్టం లేకపోయినా) కష్టపడి అక్కడి నుంచి మా ఇంటికి డబ్బు పంపిస్తూ, పొదుపు చేసుకుంటూ తర్వాత స్వదేశానికి వచ్చి స్థిరపడి ఒక ఇల్లు కట్టుకుని..... (ఇక్కడి నుంచి మళ్ళి మామూలు సమాధా నమే) చెప్తారు. 
 'నాకు అనిల్‌ అంబానీలకున్నంత ఆస్తి ఉంటేనా -దర్జాగా కొంతకాలం బ్రతికి ఆ తర్వాత హాయిగా చచ్చిపోతాను' అనుకునే వాళ్ళకూ కొదువ లేదు. అలాగే 'నేను ఏమవ్వాలో, ఏం అవ్వకూడదో విధే నిర్ణయి స్తుంది' అని సంతాప పడేవారూ ఉంటారు.
 అందచందాలతో అలరారుతూన్న ఈ వింత విచిత్ర లోకాన్ని చూసి నేడే కాదు నాడు సైతం అనేకులు ఈ విధంగా ఆశించారన్నది గమనార్హం.  ఓ రోజు అతను (ఖారూన్‌) పూర్తి ఠీవి దర్పాలతో ప్రజల ముందుకు వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక వ్యామోహపరులు కొందరు అతడ్ని చూసి 'ఖారూన్‌కు లభిం చిన సిరిసంపదలు మనకూ లభించుంటే ఎంత బావుండు! ఖారూన్‌ ఎంతో అదృష్ట వంతుడు' అన్నారు. అయితే జ్ఞానం కల వారు (వారి ఆలోచనా ధోరణిని విమ ర్శిస్తూ) ''మీ వైఖరి చాలా విచారకరం'' అన్నారు. (ఖసస్‌:79)

 'మీరన్నది సరైంది కాదు. పిల్లల్ని బాగా చదివించాలి. దానికి డబ్బు కావాలి. ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేయించడానికి మంచి సంబంధం రావాలంటే ఏదో అంతో ఇంతో ఇచ్చుకునే స్థోమత, హోదా ఉం డాలి కదా! ఇందులో తప్పేముంది?' అని మీరు అనొచ్చు. సరే మీ మాటను కాదన టం లేదు. కాని 'ఏదో ఈ బ్రతుకు ఇలా సంతృప్తిగా సాగిపోతే చాలు' అన్న మామూలు స్థాయి నుంచి 'ఇహ పరలోకం లో మనక్కావాల్సిందేదో మనం సాధించి తీరాలి' అన్న అత్యుత్తమ ఆలోచనాస్థాయికి వెళ్ళడం ఆరోహణ! అసలు సిసలైన కీర్తి శిఖర అధిరోహణ!! ఎందుకంటే, దేవుడు చేసిన ప్రకృతి నియమం అది. 
 ''ఏ జాతి అయినా తనను తాను సంస్క రించుకోనంత వరకూ అల్లాహ్‌ా కూడా నిశ్చయంగా దాని పరిస్థితిని మార్చడు, ఇదొక యదార్థం''. (రాద్‌:11)  తుమ్మ విత్తనం నాటి నిమ్మ చెట్టు మొల కెత్తాలని కోరుకోవడం అత్యాశ, పేరాశే కావచ్చు. కాని మామిడి విత్తనం నాటి మామిడి చెట్టే మొలకెత్తాలని, వివిధ మామిడి అంట్లు కట్టి రకరకాల మామిడి ఫలాల్ని పండించాలని కోరుకోవడంలో అత్యాశ ఏమీ లేదు. అసహజత ఎంత మాత్రం కాదు. అది మానవ సహజంతో పాటు మానవలోకాన్ని ప్రగతి పథంలో నడిపించే గొప్ప అభియోగం.
  మనిషి కృషి చేసిన ప్రతి రంగంలో ఫలం పొందుతున్నాడు. అయితే ఎవరి కార్య దృష్టి ఎన్ని దూరాల వరకు వెళ్ళగలుగు తుందో ప్రతిఫలమూ అంత దీర్ఘమయినదే ప్రాప్తిస్తుంది. ఈ  క్షణం కష్టపడితే మరు క్షణం ఫలం దక్కాలని కోరుకునేవారొకర యితే, యౌవనంలో పడిన శ్రమకు బదులు వృద్ధాప్యం హాయిగా గడపాలని ఆశించే వారు మరొకరు. ఇంకా కొందరయితే తాము కృషి సలిపిన దానికి తమ తర్వాతి తరాల వారు  సుఖ పడితే చాలనుకుం టారు. అలాగే బ్రతికుండి కూడా మరణిం చిన వారు కొందరైతే... తమ కృషి కార్య దీక్ష, దక్షతల మూలంగా మరణించి కూడా  ప్రజల హృదయాల్లో బ్రతికే ఉన్నవారు. శాశ్వత పేరు ప్రఖ్యాతలతో వర్థిల్లుతున్న వారు ఎందరో మహానుభావులు!
 దైవప్రవక్త(స) ఇలా ప్రబోధించారు:      ''స్వర్గం మనసుకి నచ్చని విషయాలతో కప్పబడి ఉంది. నరకం చుట్టూ మనో (తుచ్ఛ) కోరికలు అల్లుకొని వున్నాయి.'' కనుక ఏది నాటుతామో దాన్నే కోస్తాము.   ''జైసి కర్నీ వైసి భర్నీ - కమా తుదీను తుదాను'' మనం కోరుకునే ప్రతి వస్తు వును (స్వర్గంతో సహా) తీవ్ర తపన, శ్రమ వల్ల పొందగలం. లోకులు చూసే బాహ్య శక్తి మనలో వున్నట్లే, మనలోని అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం కూడా విజయం కోసం అంతే అవసరం. మనతో మనం తరచు వేసుకోవాల్సిన ప్రశ్న ''నిన్ను నీవు ఎలా భావిస్తున్నావు ?'' అన్నదే కాని నిన్ను లోకులు ఏ దృష్టితో చూస్తున్నారన్నది కాదు. పూర్వం గొప్ప ప్రసిద్ధి గాంచిన నానుడి ఒకటుండేది. ప్రజలు మూడు రకాలు.
1) లోక చరిత్రతో వీరికి ఎటువంటి సం బంధం ఉండదు.
2) లోకంలో జరిగే సంఘటనలను ప్రేక్ష క పాత్రతో చూస్తుండిపోయేవారు.
3) కొత్త చరిత్రకు నాంది పలికేవారు.
  మరో విధంగా చెప్పాలంటే, గొప్పవాళ్ళు వ్యూహల గురించి, మధ్యములు సంఘట నల గురించి, అధములు వ్యక్తుల గురించి మాట్లాడుతారు. ఈ ముగ్గురిలో ఎవరు కాదల్చుకుంటున్నామో? మనమే నిర్ణయిం చుకోవాలి.
 కొందరి సంభాషణల్లో ఎక్కువ ఇతరుల గురించే ఉంటుంది. అందులో ఎక్కువ చెడే ఉంటుంది. తమకు తెలియని (ఆ వ్యక్తుల వ్యక్తిగత) విషయాలు కూడా తాము కళ్ళతో చూచినట్టుగా రెచ్చిపోయి మరీ చెప్పేస్తుంటారు. వీరే అధములు. 
 కాశ్మీర్‌ నుంచి కాల్ఫోర్నియా వరకూ వీరు చర్చిస్తుంటారు. అందులో వాస్తవం కన్నా కల్పన, అభిప్రాయమూ ఎక్కువ వుంటుం ది. వీరే మధ్యములు. 
 అదే గొప్పవారు, అనవసర విషయాలకి తమ సంభాషనాల్లో అంతగా ప్రాముఖ్యత ఇవ్వరు. వారి దృష్టిలో-1) అక్కడ లేని వ్యక్తి గురించి కానీ, 2) తమకు సంబం ధం లేనీ సంఘట గురించి గాని, 3) తమ లో లేని గొప్పల గురించిగాని చర్చించట మంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. సంభాషణ వల్ల తాము నేర్చుకుంటారు. లేదా, ఇతరులకి నేర్పుతారు. 
 జీవితంలో అది దేనికి సంబంధించిన దైనా పైకి రావాలంటే మూడు ప్రశ్నలు తప్పని సరి! 1) మన తప్పు ఎంత తొంద రగా సరిదిద్దుకుంటాము? 2) ఇతరుల తప్పుల్నుంచి (గుణపాఠం) ఎంత తొందరగా గ్రహిస్తాము? 3) మన బలహీనతల్నుంచి ఎంత తొందరగా బయట పడతాము? అందుకే పెద్దల న్నారు: ''ఇతరుల తప్పుల్నుంచి నేర్చుకోక తప్పదు. ఎందుకంటే, అన్ని తప్పులూ మనమే చేయటానికి సమయం సరిపోదు కాబట్టి''. మన జీవిత గృహాల్లోకి ఎందరో వస్తూ పోతూ  ఉంటారు.  కొందరే  తమ ప్రభావితపు ప్రతిభ పరిమళాల్ని వదిలి వెళ్తారు. అలాంటి వారి సహచర్యమే మన తదుపరి కర్తవ్యం.
  ఈ జీవితం నిరంతర సమర  క్షేత్రం. మనిషి కళ్ళు తెరవగానే ప్రారంభమవు తుంది. మళ్ళీ కళ్ళు మూసుకునే వరకు సాగుతుంది. మనిషి తన ఆత్మ చక్షువుల్ని తెరువగలిగే క్షణం మహత్తరమయినది. అది జీవన సంగ్రామానికి శంఖారావం. సంఘర్షణ సంరంభానికి ప్రారంభం. 
మన అంతర్‌చ్చక్షువుల్ని తెరిచే రెండు పరీక్షలు.....!

1 - మిమ్మల్ని మీరు పరీక్షంచుకోండి.....! 
1) మీరు మానసిక వ్యధ, అలజడితో సతమతమౌతున్నారా? అయితే మీ విజయాన్ని  గూర్చి పునరాలోచించుకోండి.
2) ఇతరులతో మీకు గల ప్రతి సంబంధం తెగిపోయిందని ఫీలవుతున్నారా? అయితే మీ విజయాన్ని గూర్చి పునరాలోచించుకోండి.
3) ఈ లక్ష్య సాధన కోసం ఇన్ని త్యాగాలు అవసరమా? అన్న ప్రశ్న మిమ్మల్ని కలచి వేస్తూందా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.
4) మీరు విజేతలయి, ఇతరులు సాధించే విజయాల పట్ల అసూయ చెందుతున్నారా? 
 అయితే మీ విజయాన్ని పరిశీలించుకోండి.
5) 'నేను చెయ్యగలను' అన్న ఆత్మవిశ్వాసం గాక 'నేను మాత్రమే చెయ్యగలను' అన్న  ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఇతరుల సలహాలను పట్టించుకోవటం లేదా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.
6) పడకపై మేను వాల్చి - లోకమంతా ప్రశాంతంగా నిద్రిస్తుంటే నాకు మాత్రం నిద్ర  పట్టడం లేదు, అన్న ఆలోచనతో మీ బుర్ర వేడెక్కుతుందా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.
   
గుర్తుంచుకోండి! కోపం ద్వేషం - రెండింటి చివరి అక్షరమూ ఒకటే. వాటి వల్ల మిగిలేది కూడా అదే!.....''సున్నా'' !!
ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు.....!
''నేను నిజంగానే విజేతనా ?''     2 - మీరు విజేతలేనా.....?
 ఇది ఒక పరీక్షకన్నా ఘనపాటిది. జవాబివ్వక ముందు బాగా చదివి అర్థం చేసుకోండి. జవాబిచ్చే విషయంలో మీ ఆత్మే మీకు ప్రత్యక్ష సాక్షి! ఏది వ్రాసినా ఆత్మ సాక్షితోటి వ్రాయండి.                  
           
రంగం                             ప్రవర్తన                                          ఎల్లప్పుడు /   అప్పుడప్పుడు /    ఎప్పుడూ లేదు.
                
                             (అ) గుర్తు చేసుకుంటాను
అల్లాహ్‌తో                 (ఆ) మరువను
                             (ఇ) కలవాలన్న కుతుహాలం
ఆత్మతో                   (అ)ఆందోళన లేకుండా
                             (ఆ)విమర్శ పరశీలన
                             (ఇ) ఆత్మ పరిశీలన సమర్థించుకోవటం.
తల్లిదండ్రులతో           (అ) విధి నిర్వాహణ
                             (ఆ) సత్ప్రవర్తన
                             (ఇ) ఉపకారం
దాంపత్యం                 (అ) ఏదో తోసుకెళ్తున్నాం
                             (ఆ) పరస్పర కరుణ,దయ,జాలి.
                             (ఇ) పరస్పర ప్రేమాభిమానాలు.
సంతానంతో               (అ) సపోర్ట్‌ సమర్థించుట
                             (ఆ) దిశా  నిర్దేశం.
                             (ఇ) గాలికి వదిలెయ్యడం.శిక్షణారాహిత్యం.
బంధువులతో             (అ) కేవలం గుర్తు చేసుకుంటాను.
                             (ఆ) కేవలం వారితో కలిసి వుంటాను.
                             (ఇ) వారితో మంచిగా ప్రవర్తిస్తాను.
స్నేహితులతో            (అ) స్వార్థం
                             (ఆ) పరస్పర సహకారం శ్రేయం
                             (ఇ) జస్ట్‌ టైమ్‌ పాస్‌
పనితో                     (అ) కర్తవ్యాన్ని నెరవేరుస్తాను.
                             (ఆ) పనీ చేస్తాను. సహాయపడతానుకూడా
                             (ఇ) పనిలో ఆనందాన్ని ఆస్వాదిస్తాను
తోటి కార్మికులతో         (అ) రస్సా కషీ
                             (ఆ) ఏదో కలిసి వున్నాం
                             (ఇ) నిజమైన మిత్రుత్వం
అధికారులతో             (అ) నాపనేదో నేను చేసుకుంటాను.
                             (ఆ) అవసరం అన్పిస్తే సలహా ఇస్తాను.  హితవూ చెప్తాను.
                             (ఇ) వారితో కలిసి వుంటాను.
ప్రతిభావంతులతో        (అ) మంచిగా వ్యవహరిస్తాను
                             (ఆ) ఆదర్శంగా తీసుకుంటాను
                             (ఇ) శ్రేయోభిలాషిగా మసలుకుంటాను.
 సమయంతో             (అ) తప్పించుకు తిరిగే యత్నం
                             (ఆ) మధ్యే మార్గం
                             (ఇ) అత్యవసరమైన వాటికి ప్రాధాన్యత