3, జనవరి 2013, గురువారం

ఇస్లామీయ 
సంస్కృతి - శిక్షాస్మృతి 



మానవుని స్వాభావిక భావోద్రేకాలను ఆరోగ్యవంతమయినవని, పరి శుద్ధమయినవని ఇస్లాం ప్రకటించిన రీతిలో ప్రపంచంలోని మరే మత ధర్మమూ చెప్పలేదు. దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: 
'జనులకై-మనోభిరామమయిన కాంక్షలు, స్త్రీలు, సంతానం, వెండి బంగారాలు, మన్నికయిన గుర్రాలు, పశువులు (పాడి), వ్యవసాయ భూములు - ఇవన్నీ మనోజ్ఞంగా చెయ్యబడ్డాయి'. (ఆలి ఇమ్రాన్‌:14) 
షహవాత్‌-అంటే సహజంగా మనిషి ఇష్టపడే, అతని మనసును దోచుకునే వస్తువులు అని భావం. అందుకే ఆ వస్తువులు కోరుకోవ డం, వాటి పట్ల మోజు చూపడం తప్పు కాదు. కాకపోతే ఈ విష యంలో మనిషి మితి మీరకూడదు. షరీతయతు విధించిన హద్దుల ను అతిక్రమించకూడదు. వాటిని మనిషి కొరకు ఆకర్షవంతంగా, మనోజ్ఞమైనవిగా చేయడం అన్నది కూడా దేవుని తరఫు నుంచి ఓ పరీక్షే. ''మేము మనుషులను పరీక్షించే నిమిత్తం భూమిపై ఉన్నవాటిని మనోజ్ఞమయినవిగా చేశాము''. (అల్‌ కహఫ్‌: 7)

ఇస్లాం కోరికల దాస్యాన్ని మంచి దృష్టితో చూడదన్న విషయం నిజమే. అది మనిషిపై కళ్ళెం లేని కోరికలు, భావేద్రేకాలు అధికారం చెలాయించే వరకు వీటికై అర్రులు చాచడానికి వీలు పడదు అం టుంది. ఎందుకంటే కళ్లెం లేని కోరికలు మనిషిలోని శక్తిసామర్థ్యాల కేంద్రాన్ని సర్వనాశనం చేసి వేస్తాయి. మనిషిని పశు స్థాయికి దిగ జార్చుతాయి. ఈ విషయమై ఇస్లాం వ్యక్తిపై కొన్ని ఆంక్షలు విధించ డానికి కారణం అతను తన స్వేచ్ఛ దుర్వినియోగం చేసి తన స్వయాని కి, కుటుంబానికి, సమాజానికి ఎలాంటి హాని కలుగజెయ్యకుండా ఆనంద మకరందాన్ని గ్రోల గలగాలన్నదే. మనోనిగ్రహంకై చేెసే సూచన నిర్బంధ శాసనం కాదు. దీని వెనక ఎంతో నిగూఢ వివేచన దాగి ఉంది. ప్రపంచ సుఖాలను జీవితాశయానికి తగినట్లుగా మలచు కోవడం. ఏ జాతి ప్రజలయితే తమ మనోకాంక్షల్ని, భావోద్రేకాలను తమ అధీనంలో ఉంచుకోలేరో, మరెవరైతే అవసరం ఏర్పడినా తమకు ప్రియమైన వాటిని వదులుకోవడం ఇష్టపడరో అలాంటి జాతి నాయ కత్వపు హోదాను పొందజాలదు. అలాగే అంతర్జాతీయ సంఘర్షణల్లో ఏ జాతి జనులయితే కష్టాలను, ఆపదలను భరించే సామర్థ్యం కలిగి ఉంటారో, ఎవరయితే అవసరం కలిగినప్పుడు తమ మనోభిరామమ యిన కోరికల్ని గంటలు, దినాలే కాదు సంవత్సరాల తరబడి త్యజించి నిబ్బరం చూపగలరో అలాంటి దృఢ సంకల్పులకే, ఉత్తములకే, పురుషోత్తములకే విజయశ్రీ కాళ్ళు పడుతుంది. ఇక పిచ్చి స్వేచ్ఛ కోసం మనసిచ్చిన మనిషి, ఒక ఉన్నతాశయం కోసం కొన్ని గంటల యినా తన మనోకాంక్షల పొగరుబోతు గుర్రాన్ని కళ్ళెం వెయ్యలేని మనిషి కూడా ఒక మనిషేనా? ఇటువంటి కాంక్ష దాసులు మానవాళికి ఎన్నడూ ఎలాంటి సెవనూ చెయ్యలేరు. తనకు ప్రియమైన విలాసాలను త్యాగం చేసే సాహసించలేరు.
ఇస్లాం సాధించిన మహత్కార్యాల్లో, మహాద్భుతాల్లో, అలనాటి అరబ్బు ఆటవిక, అనాగరిక, మొరటు ప్రజల్ని సంస్కారవంతులయిన మానవుల సంఘంగా, ఓ ఉత్తమ జాతిగా తీర్చిదిద్దడం ఒకటి. అది వారికి కేవలం రుజుమార్గం మాత్రమే చూపలేదు. కేవలం వారిని పాశవిక స్థాయి నుండి లేవనెత్తి వారికి మానవత్వపు ఉన్నత విలువల ను పరిచయం చెయ్యడమే కాదు, వారిని ఇతరులకు మార్గదర్శకులు గా, దైవధర్మధ్వజవాహకులు, ప్రచారకులుగా కూడా తీర్చిదిద్దింది.
మచ్చుకు కొన్ని సంఘటనలు:
ఉహద్‌ సంగ్రామం అనంతరం హజ్రత్‌ హమ్జా (ర) గారి మృత దేహం ముక్కలు ముక్కలుగా ఖండించబడి, చెవులు, ముక్కు కోయ బడి ఎంతో భయంకరంగా, కడు దయనీయంగా ఉంది. దాన్ని చూడగానే దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరి గాయి. ఆవేదనాభరితమైన ఆయన హృదయం నుంచి సన్నగా (ఈ క్రింది) శబ్ద తరంగిణి జాలువారింది. 'అబ్బా! ఇంతటి దారుణమైన దృశ్యం నేనింత వరకు చూడలేదు. హమ్జా సోదరి సఫియా మనసు బాధ పడుతుందన్న భయమే గనక లేకపోయి ఉంటే, ఈ పని నా అనంతరం అనవతర ఆచారంగా మారుతుందేమోనన్న భయమే గనక లేకపోయి ఉంటే నేను హమ్జా దేహాన్ని ఇలాగే గద్దలకు, మృగాలకు, క్రీమికీటకాలకు వదిలి పెట్టేవాడ్ని. ప్రళయ దినాన తాను ఆయా ప్రాణుల పొట్టల నుండి లేప బడేవాడు'.(అబూ దావుద్‌, తిర్మిజీ)
పై సంఘటనలో భావోద్రేకాల వెల్లువ కట్టులు తెంచుకోబొతుండగా వెలువడి మాటలు అవి. అయితే మహా ప్రవక్త ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు భావోద్రేకాల ప్రవాహంలో కొట్టుకుపోలేదు. న్యాయానికి, కరుణకి కట్టు బడ్డారు. ఆయన హమ్జా మృతదేహాన్ని ఖననం చేశారు.
హజ్రత్‌ అలీ (ర) గారి కథనం - దైవ ప్రవక్త (స) వారు కొందరిని సైనిక చర్యల నిమిత్తం పంపిస్తూ, వారికి నాయకునిగా ఒక అన్సారు వ్యక్తిని నియమించి, అతని పట్ల విధేయత కనబర్చవలసిందిగా పుర మాయించారు. (ప్రయాణం మధ్యలో ఏదోక కారణంగా) ఆ వ్యక్తి అగ్ర హోదగ్రుడయ్యాడు. (కోపంతో ఊగిపోతూ) 'ఏమీ! నా పట్ల విధేయత కనబర్చమని ప్రవక్త(స)వారు చేసిన హితవు నిజం కాదా?' అన్నాడు.
అందరూ నిజమే అన్నారు ముక్తకంఠంతో. అలాగయితే నా ఆజ్ఞ మేరకు కట్టెల్ని ప్రోగు చేయండి. వారు మారు మాట్లాకుమడా కట్టెల్ని ప్రోగు చేశారు. వాటికి నిప్పంటించండి అని మళ్ళి గర్జించాడు. నిప్పం టించడం జరిగింది. అవి బాగా కాలాక-అందరినీ ఉద్దేశ్యించి 'నేనాదే శిస్తున్నాను మిమ్మల్ని మీరు ఈ అగ్నికి ఆహుతి చేసుకోండి' అని అరిచాడు. అందరూ అయోమయంలో పడ్డారు.
ఒకరు మరొకరిని పట్టి లాగనారంభించారు. ఈ అగ్నికి ఆహుతి అవ్వడంకన్నా ప్రవక్త (స) వారి కారుణ్య సన్నిధికి పారిపోడం మేలని భావించారు. నిప్పు పూర్తి ఆరిపోయేంత వరకు వారి స్థితి అలానే ఉంది. చివరికి మంటా చల్ల బడింది, అతని కోపమూ తగ్గింది. ఈ విషయం తర్వాత కారుణ్యమూర్తి(స) వారి కర్ణపుటాలకు చేరింది. సాంతం విన్న కారుణ్యమూర్తి (స) ఇలా అభిప్రాయపడ్డారు: ''ఒకవేళ వారు అతని మాటననుసరించి అగ్నికి ఆహుతి అయ్యుంటే ప్రళయం వరకు దాన్నుండి బైటకు రాగలిగేవారు కాదు. విధేయత అన్నది మంచి కార్యాల్లో మాత్రమే సుమీ!'' అని మందలించారు.
(బుఖారీ, ముస్లిం)
పై సంఘటనలో మనసు ప్రవక్త (స) వారి ఆజ్ఞను గౌరవిస్తూ నాయకుని మాటకు విధేయత చూపాలని పదే పదే చెబుతున్నా, మేలిమి మెదడు దాన్ని నిరాకరిస్తోంది. ప్రేమకు నిలయమైన, కరుణకు ఆలయమైన ఇస్లాం ధర్మంలో మేధకు మింగుడు పడని విషయానికి విధేయత చూపాలన్న ఆజ్ఞ ఎలా ఉండగలదు? అని ప్రశ్నిస్తోంది. కాబట్టి అట్టి సందర్భాలు ఎవరికి ఎప్పుడు, ఎక్కడ ఎదురయినా భావోద్రేకానికి లోనయి ధర్మం కోరని త్యాగానికి పూనుకోవడం మాని ధర్మం అంగీకరించిన మేలిమి మేధ చూపే న్యాయానికి కట్టుబడాలని దైవప్రవక్త (స) సెలవిచ్చారు.

ఇస్లాంలో ఆరాధనా గృహాన్ని నేలమట్టం చేయడం, అటువంటి కట్టడానికి నష్టం చేకూర్చడం, అందులో ఆరాధన నుండి, దైవనామ స్మరణ నుండి జనులను ఆపడం, షరీయతు ఆదేశాలను పాటించ కుండా నిరోధించడం ఇత్యాదివన్నీ నిషిద్ధం. అయితే ఆరాధన కోసం కాక కేవలం ముస్లింల మధ్య గల ఐకమత్యాన్ని నీరుగార్చే దురుద్దేశ్యం తో నిర్మించబడే మస్జిద్‌ను విద్వాంసులు 'మస్జిదె జిరార్‌'గా అభివర్ణిం చారు. కాబట్టి ముస్లింలలోని చీలికను నివారించడానికీ, వారి సంఘ టిత వ్యవస్థకు విఘాతం కలుగకుండా ఉండటానికి అటువంటి మస్జిద్‌ లను కూల్చివేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఖుర్‌ఆన్‌లోని ఓ ఆయతు ద్వారా రూఢీ అవుతుంది. సాధారణంగా ఇటువంటి వాటిని మస్జిద్‌ పట్ల మర్యాద గల మనసు అంగీకరించదు. అయితే మేలిమి మేధ చూపే న్యాయానికి అనుగుణంగానే అల్లాహ్‌ా ఈ ఆదేశాన్ని అవ తరింపజేశాడు:

''(కపటులలో) మరికొంత మంది కూడా ఉన్నారు - కీడు కలిగించే, అవిశ్వాసం కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశ్యంతో, విశ్వాసుల మధ్య చీలికను తెచ్చే లక్ష్యంతో, అంతకు మునుపు అల్లాహ్‌ాను, ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనతో వారు ఒక మస్జిదు నిర్మించారు. (ఈ కట్టడాన్ని నిర్మించటంలో) తమ ఉద్దేశ్యం మేలు చేయడం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్దాలకోరులన్న విషయానికి అల్లాహ్‌ా సాక్షి''. (అత్‌ తౌబా: 107)
వివరాల్లోకెళితే-
కపటులు ఒక మస్జిదు నిర్మించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు, చలి గాలులు వీస్తున్నప్పుడు, తీవ్రమైన ఎండ పడుతన్నప్పుడు తమలోని బలహీనులు, వృద్ధులు దూరం నుంచి మస్జిదె నబవీ వరకూ రావడం కష్టంగా ఉందనీ, వారి సౌలభ్యం కోసమే తాము మరొక మస్జిదును కట్టామని వారు దైవప్రవక్త (స) వారిని నమ్మబలకడంతోపాటు, తమరు గనక ఒకసారి వచ్చి అందులో నమాజు చేస్తే ఎంతో శుభం చేకూరు తుందని విజ్ఞప్తి కూడా చేశారు. కాని ఆ సమయంలో ప్రవక్త (స) తబూక్‌ యుద్ధానికి బయలుదేరుతున్నారు, ప్రయాణ నుంచి తిరిగి వచ్చాక, అక్కడికి వచ్చి నమాజు చేస్తానని వాగ్దానం చేశారు. అయితే తబూక్‌ నుండి తిరిగి వస్తున్నప్పుడు అల్లాహ్‌ా, వహీ ద్వారా ఆ మస్జ్జిద్‌ వెనుక ఉన్న దురుద్దేశాలను బట్టబయలు చేశాడు. ముస్లింల మధ్య మనస్పర్థలను సృష్టించడం, అవిశ్వాసాన్ని వ్యాపింపజేయటం, దైవానికి, దైవప్రవక్తకు శత్రువుగా వ్యవహరిస్తున్న వారి కోసం ఆసరాను సమ కూర్చడం వారి ఉద్దేశ్యం అని తెలియజెయ్యడమేకాక లోగడ నువ్వు చేసిన వాగ్దానాన్ననుసరించి ఆ మస్జిద్‌కు వెళ్ళకు అని ఆదేశించాడు కూడా: ''నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు. అయితే తొలినాటి నుంచే దైవభీతి-తఖ్వా పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిల బడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్ట పడేవారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్దతను పాటించేవారిని అల్లాహ్‌ా ప్రేమిస్తాడు''. (తౌబా:108)
ముస్లింల మధ్య మనస్పర్థల్ని సృష్టించే ఉద్దేశ్యంతో నిర్మితమైన ఎలాంటి విగ్రహ ప్రతిమలు లేని మస్జిద్‌లలోనే నిలబడకూడదు, వాటిని కూల్చేయాలని అల్లాహ్‌ా అదేశిస్తున్నప్పుడు, నేడు ముస్లింల విశ్వాసానికి తూట్లు పొడవాలన్న, వారి పురోభివృధ్దిని అసలు కారక మైన తౌహీద్‌ను అడుసులో తొక్కెయ్యాలన్న ఉద్దేశ్యం పునాదిగా కుత్సిత మతుల కుయుక్తులతో నిర్మించబడిన శవాలు పూడ్చబడిన దర్గాల గురించి ఇస్లాం ఎలాంటి ఆదేశాలు కలిగి ఉంటుందో సుమతులైన సమాలోచనాపరులు సునిశితంగా ఆలోచించాలి. అలాగే పాక్షికమైన కొన్ని విభేదాలను ప్రధానమయినవిగా చిత్రీకరిస్తూ కేవలం దైవారాధన కోసం నిర్మించబడే మస్జిద్‌లను కూల్చడం, కాల్చడం ఎంతటి భయం కర నేరమో యోచించాలి. అదే పని ఒక ముస్లిమేతరుడు చేస్తే కాఫిర్‌ (అవిశ్వాసి-తిరస్కారి), నరకవాసి అని ఫత్వాలు జారీ చేసే పండిత మహాశయులు ఆయా సమాధుల్లో గల వ్యక్తుల పట్ల అభిమానంతో భావోద్రేకాలకు లోనవ్వకుండా ధర్మం చెప్పే తీర్పుకి, చూపే న్యాయాని కి తల వంచాలి. అలా వంచిన నాడే మళ్ళీ ముస్లిం సమాజం నిండు స్వేచ్ఛతో తలెత్తుకుని పురోగమనం వైపు సాఫీగా అడుగెయ్యగలదు. ఇహంలో విజేతగా నిలిచి, పరంలో స్వర్గవాసిగా నీరాజనాలందుకొ గలదు.
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: 'ఓ అజ్ఞానుల్లారా! అల్లాహ్‌ాను వదలి ఇతరుల ను పూజించమని మీరు నాకు ఆజ్ఞాపిస్తున్నారా?' అని ఓ ప్రవక్తా వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకు, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం ఇది: ''ఒకవేళ నువ్వు గనక బహు దైవారాధన (షిర్క్‌)కు పాల్పడితే నువ్వు చేెసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేర్తావు. కాబట్టి, నువ్వు మాత్రం (ఒక్కడైన) అల్లాహ్‌ానే ఆరాధించు. అనంతరం అనవతరం కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో''.
(జుమర్‌: 64-66)

కామెంట్‌లు లేవు: