13, జనవరి 2013, ఆదివారం

పౌరుషం


         పౌరుషం
పౌరుషం అంటే -మనిషితన వ్యక్తిగత విషయంలో అనవసరంగా ఇతరులు జోక్యం చేెసుకోవడం చూసి  కోపంతో రగిలిపోవడాన్ని పౌరుషంరోషం అంటారు. పౌరుషం అనేది ఇటు సమాజ నిర్మాణంలోనూకుటుంబ జీవనంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారణంగానే ఇస్లాం ఈ గుణాన్ని ప్రత్యేకించి పేర్కొంటుంది. సయీద్‌ బిన్‌ జైద్‌ (ర) గారి కథనం - దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా సెలవిచ్చారు: ''తన ఆస్తిపాస్తుల్ని కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి షహీద్‌. తన ఆత్మ రక్షణ కోసం మరణించిన వ్యక్తి షహీద్‌.   తన ధర్మాన్ని కాపాడుతూ హత్యకు గురయిన వ్యక్తి షహీద్‌. తన (మానాన్ని) ఇంటివారిని కాపాడుతూ హతుడయిన వ్యక్తి షహీద్‌''.
ప్రవక్త (స) వారి ప్రవచనంలో పేర్కొనబడిన నాలుగు సందర్భాల్లో నూ పౌరుషమే మనిషి ని ప్రాణాన్ని సయితం పణంగా పెట్టి తన తనాన్ని,  మానాన్నిధనాన్నిధర్మాన్ని కాపా డుకునేలా ప్రేరేపించింది అన్నది నిర్వివా దాంశం. అంటే సహేతుకమయిన పౌరు షం మనిషికి ఇహలోకంలోనే కాదు పర లోకంలో సయితం 'షహీద్‌వంటి గొప్ప స్థానాన్ని ప్రసాదిస్తుంది.
పౌరుషానికి సంబంధించిన ఆదేశం:
పౌరుషం అనేది తన స్థానంలో సమతౌ ల్యాన్ని పాటించినంత కాలం ఇటు స్త్రీలకు అటు పురుషులకు - ఇరువురికీ ప్రయోజన కరమైన మంచి లక్షణమే. మంచి సహ చర్యం అనేది పౌరుషాన్ని కొరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా దంపతులిద్దరు ఒండొకరి పౌరు షాన్ని గుర్తించిగౌరవించి రాజీ పర్చుకునే రీతిన వ్యవహరిస్తే ఆ ఇల్లు ఆనందాల హరి విల్లవుతుంది. ఇదిలా ఉంటేఅర్థం లేని పౌరుషం ఏది అన్న విషయానికొస్తేదైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ''నిశ్చయంగా ఒక రకం పౌరుషాన్ని అల్లాహ్  ఇష్టపడతాడు. మరో రకం పౌరుషాన్ని అల్లాహ్  అసహ్యించుకుంటాడు. మరియు బార చాచి నడవటంలోని ఒక రకాన్ని అల్లాహ్  ఇష్ట పడతాడు. మరో రకాన్ని అసహ్యించుకుంటాడు. తగు కారణం ఉండి మనిషి పౌరుషానికి లోను కావడం అల్లాహ్ కు ఎంతో ఇష్టం.
 ఏ కారణం లేకపోయినా కేవలం ఊహాగానాలకు పోయిలేనిపోని అను మానాలు పెంచుకుని పౌరుషంతో రగిలిపోవడం అల్లాహ్‌ాకు సుతరామూ ఇష్టం లేదు. ఇక బార చాచి నడవడం అనేది - ధర్మోన్నతి కోసం పోరాడు తూదానధర్మాలు చేస్తూ గనక జరిగితే అది అల్లాహ్‌ాకు ఎంతో ప్రియం. అహంకారానికిదురభిమానానికి లోనై వ్యతిరేక భావావేశాలతోనకారాత్మక ధోరణితో బార చాచి నడవటాన్ని అల్లాహ్‌ా ఎంత మాత్రం ఇష్ట పడడు''.
 (ముస్నద్‌ అహ్మద్‌) 
అల్లాహ్  మహా రోషగాడు:
దైవప్రవక్త (స) వారితో ఇలా ప్రశ్నించడం జరిగింది. ''భర్త తన భార్యను మరో పురుషునితో (సంభోగిస్తూ) గనక చూస్తే ఏం చేయాలి?'' అందుకు దైవప్రవక్త (స) ''నలుగురు ప్రత్యక్ష  సాక్షుల్ని ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది'' అన్నారు. ఇదే విషయం తర్వాత కొందరు సహాబాల ముందు ప్రస్తావించిన ప్పుడు సహజంగానే పౌరుషం గలవారైన హజ్రత్‌ సఅద్‌ బిన్‌ ఉబాదా (ర) గారు - ఇది విని 'ఒక వేళ నేనే గనక నా భార్యను పరాయి పురుషునితో చూస్తే అక్కడికక్కడే అతన్ని కరవాలంతో నరికి పోగులెడతానుఅన్నారు. ఈ వార్త ప్రవక్త (స) వారికి అందినప్పుడు ఆయన ఇలా అన్నారు: ''సఅద్‌ పౌరుషాన్ని చూసి మీరెందుకు అంతగా ఆశ్చర్యపోతున్నారుఅల్లాహ్  సాక్షి! నేను అతనికన్నా ఎక్కువ పౌరుషం గలవాడను. మరి నాకన్నా మించిన పౌరుషం అల్లాహ్‌ాది. ఆయన మహా రోషగాడు. ఈ కారణంగానే అల్లాహ్  బహిరంగమైనగోప్యమయిన సకల అసభ్యఅశ్లీలతలను నిషేధించాడు'' అని చెప్పారు. (బుఖారీ)
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ''బాహాటంగానూగొప్యంగానూ చేసే సిగ్గుమాలిన పనులనుపాపంతో కూడుకున్న ప్రతి విషయాన్నీఅన్యాయంగా ఒకరి మీద దుర్మార్గానికి ఒడిగట్టడాన్ని - సకల విధమయినటువంటి చెడు కార్యాలను నిశ్చయంగా నా ప్రభువు నిషేధించాడని (ఓ ప్రవక్తా!) ప్రజలకి తెలియ జెయ్యి''. (ఆరాఫ్‌: 33)
మరో హదీసులో ఇలా ఉంది: ''అల్ల్లాహ్ కు పౌరుషం వస్తుంది. విశ్వాసికి కూడా పౌరుషం వస్తుంది. అయితే అల్లాహ్  విశ్వాసికన్నా మహా గొప్ప రోష గాడు''. (బుఖారీముస్లిం)
పోతేఅల్లాహ్‌ాకు కోపాన్ని తెప్పించే చర్యలుఏవంటే, ''అల్లాహ్  నిషేధించిన వాటికి దాసుడు పాల్పడటం అనేది ఆయనకు పౌరుషాన్ని తెప్పిస్తుంది''. అని ప్రవక్త (స) వారు సెలవిచ్చారు.  (బుఖారీ)
 బైబిల్‌లో నిర్గమకాండలో ఇలా ఉంది: ''నీ దేవుడయిన యొహోవా ను నేనే....నేను తప్ప  వేరొక దేవుడు నీకు ఉండ కూడదు. పైన ఆకాశమందేగాని క్రింద భూమియందేగాని భూమి క్రింద నీళ్ళ యందేగాని  యుండు దేని రూపమునయినను విగ్రహమునయిన ను నీవు చేసికొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యొహోవానగు నేను రోషము గల దేవుడను''. (నిర్గమకాండ - 20: 3-5)
 దాసుడు బాహాటంగానూరహస్యంగానూ చేసే దుష్కార్యాల్లో పరమ నీచమయిన కార్యం విగ్రహారాధనబహుదైవారాధన. అల్లాహ్  దాసుడి వల్ల జరిగే ఏ పాపాన్నయినా క్షమిస్తాడుగానీబహుదైవారాధనషిర్క్‌ను క్షమించడు. దుర్మార్గాల్లోకెల్లా అత్యంత తీవ్రమయినఘోరాతిఘోరమయిన దుర్మార్గం ''నిశ్చయంగా షిర్క్‌ - బహుదైవారాధనే'' అని ఆయనే స్వయంగా సెలవిచ్చి ఉన్నాడు. దాన్నే మనం దాంపత్య జీవితంలో స్వామి ద్రోహం అనంటాము.
 షిర్క్‌ తర్వాత అల్లాహ్ కు పౌరుషాన్ని తెప్పించే విషయం వ్యభి చారం. ప్రతి శుక్రవారం మనం ప్రసంగ వేదికల నుండి వింటూ వస్తున్న ఆదేశం ఎంత మహోత్కృష్టమైనదో చూడండి: ''ఇన్నల్లాహ యామురు బిల్‌ అద్లి వల్‌ ఇహ్సాన్‌....'' దీనర్థం ఏమిటో తెలుసా? ''నిశ్చయంగా అల్లాహ్  న్యాయం చేయమనిఉపకారం చేయమనీఉదారంగా వ్యవహరించమనీబంధువుల హక్కులను నెరవేర్చ మనీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా - నీతి బాహ్యమయిన పనుల నుండీసకల విధమయినటువంటి చెడుల నుండీఅన్ని విధాల దౌర్జన్యం నుండీ ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహిం చడానికి ఆయన స్వయంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు''.  (నహల్‌: 90)
 ఓ సారి సూర్యగ్రహణం అయింది. అప్పుడు దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఒక సుదీర్ఘమయిన ఉపన్యాసం ఇచ్చారు. అందులో ఆయన (స) ఇలా అన్నారు: ''ఓ ముహమ్మద్‌ (స) సముదాయమా! అల్లాహ్  సాక్షి! అల్లాహ్ కు మించిన రోషగాడు ఎవడూ లేడు. తన దాసుడు తన దాసితో వ్యభిచరించడంఅక్రమ సంబంధం పెట్టుకోవడం ఆయనకు మహా పౌరుషాన్ని తెప్పిస్తుంది. ఓ ముహమ్మద్‌ (స) సముదాయామా! నాకు తెలిసిన విషయాలు మీకు తెలిసి ఉంటే మీరు చాలా తక్కువగా నవ్వేవారు. చాలా ఎక్కువగా ఏడ్చేవారు''. (బుఖారీ) 
  మరో సందర్భంలో ఆయన ఇలా హెచ్చరించారు: ''(విశ్వాసి) దాసుడు వ్యభిచరించేటప్పుడు విశ్వాసం (ఈమాన్‌) అతన్నుంచి వేరయి పోతుంది. ఆ చెడు కార్యం నుండి బైట పడేంత వరకు విశ్వాసం అతని వద్దకు తిరిగి రాదు. ఆ అశ్లీల చేష్ట నుండి బైట పడిన మీదటే అది అతన్ని సమీపిస్తుంది''. (మిష్కాత్)
అంటేపౌరుషం విశ్వాసాని (ఈమాన్‌)కి సయితం వస్తుంది. ఈ కారణం వల్లనే ఆ నీతిమాలిన చర్యకు దాసుడు పాల్పడుతున్నంత కాలం అది అతన్నుండి దూరంగా ఉంటుంది. ఇది ఎంత దౌర్భాగ్య స్థితియో ఒక్కసారి ఆలోచించండి!
ఓ సారి యూదుల రాయమారి ఒకడు దైవప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి -  'మీరు తీసుకొచ్చిన స్పష్టమయిన సూచనలుఆదేశాలు ఏమిటి?' అని ప్రశ్నించాడు. అందుకు సమాధానం ఇస్తూ ''మీరు అల్లాహ్తో పాటు ఇతరుల్ని భాగస్వాములుగా చేసి పూజించకండి. దోపిడిదొంగతనాలకు పాల్పడకండి. వ్యభిచా రానికిఅక్రమ సంబంధానికి ఒడిగట్టకండి. సుశీలవతి అయిన స్త్రీ మీద లేనిపోని నిందలు మోపకండి'' అని బదులిచ్చారు. (మిష్కాత్) 
 మరో సందర్భంలో ఒక వ్యక్తి దైవప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి - ''అత్యంత ఘోరమయిన పాపం ఏది?' అని ప్రశ్నించాడు. ''అల్లాహ్  మనిషిని నఖశిఖ పర్యంతం తీర్చిదిద్ది అందంగా పుట్టిం చాడు. అయినా మనిషి అల్లాహ్ను వదలి ఇతరులను ఆరాధించండం'' అన్నారు. 'తర్వాత ఏది?' అని అడగ్గా - ''తనతోపాటు తింటాడన్న (తిండి పెట్టలేమనే) భయంతో తన సంతానాన్ని హతమార్చడం'' అని బదులిచ్చారు. 'ఆ తార్వత ఏది?' అని ప్రశ్నించగా - ''పొరుగువాని భార్యతో వ్యభిచరించడం'' అని జవాబిచ్చారు.  (బుఖారీ)
 అలాగే ప్రళయ సూచనల్ని తెలియజేస్తూ ఆయన ఇలా అభిప్రాయ పడ్డారు: ''జ్ఞానం నశించిఅజ్ఞానం సర్వత్రా వ్యాపించడం. మద్య సేవనం సర్వ సాధారణమైపోవడం. వ్యభిచారం పెచ్చరిల్లడం. (ప్రమాదకరమయిన వైరస్‌లా మానవ జీవితాల్ని అస్తవ్యస్త్యం చేయడం). పురుషుల సంఖ్య తగ్గి స్త్రీల సంఖ్య పెరగటం. ఎంత వరకంటే 50 మంది స్త్రీలకు పోషకునిగా ఒకే పురుషుడు మిగిలి ఉండటం'' అని. (బుఖారీ)
అదే విధంగా - ''ఏ జాతిలో వ్యభిచారం విచ్చలవిడిగా కొనసాగు తుందో ఆ జాతిలో మృత్యువు విలయతాండవం చేస్తుంది''. (మిష్కాత్ )
''ఏ జాతిలోనయితే వ్యభిచారం ((జారస్త్రీ) శిరసెత్తి నడుస్తుందో (నేటి సినీ తారలుఫ్యాషన్‌ భామలు) ఆ జాతిలో కరువు రక్కసి తాండవిస్తుంది. మరే జాతిలోనైతే లంచం ఒక సాధారణ విషయమైపోతుందో ఆ జాతి భయానికిఅభద్రతాభావానికిఅశాంతికిఅలజడికి గురిచేయబడుతుంది''. (మిష్కాత్ )
 దైవప్రవక్త (స) వారు తన విషయంలో ఎప్పుడూ కోపానికిఆవే శానికి లోను కాలేదు. అయితే ప్రజలు ధర్మం నిర్దేశించిన హద్దుల ను నిర్ధాక్షిణ్యంగా చెరిపివేయడం చూసి అగ్రహోదగ్రులయ్యేవారు.  ఓ గొప్ప వంశానికి చెందిన స్త్రీ విషయంలో ఒక సహాబీ సిఫారసు చేసినప్పుడు ఆయన కోపగించుకున్నారు. ధనికనిరుపేదల విష యంలో సమానంగా వ్యవహరించాల్సిందిగా ఉపదేశించారు.

కామెంట్‌లు లేవు: