13, జనవరి 2013, ఆదివారం

తఖ్వా

తఖ్వా లాభాలు (తఖ్వా ప్రయోజనాలు):
 తఖ్వా మార్గం చాలా కఠినమైన మార్గం. ముళ్ళులతో నిండున్న మార్గం. ఆ మార్గంపై నడిచేవారు సైతం ఎన్నో కష్టాలను ఎదుర్కొం టారు. చివరికి పరలోకంలో నిశ్చయంగా వారు ఉద్యానవనాలలో ఎల్లప్పుడు హాయిగా ఉంటారు. దివ్యఖుర్‌ఆన్‌ అధ్యయనం ద్వారా తెలిసేదే మంటే దైవం పరలోకపు సర్వ అనుగ్రహాలను దైవభీతి గలవారికే తయారు చేసి పెట్టాడు. దివ్యఖుర్‌ఆన్‌లో పలు చోట్లలో దీని గురించి ప్రస్తావన వచ్చింది.''నిశ్చయంగా భయభక్తులు గలవారు సురక్షిత మైన స్థలములో ఉంటారు''.(అల్‌దుఖాన్‌:51) 
ఇంకో చోట ''నిశ్చయముగా భయభక్తులు కల వారు ఉద్యావనాలలోభోగభాగ్యాలలో ఉం టారు''. (అల్‌ తూర్‌:17) మరో చోట ఈ విధంగా ఉంది: ''నిశ్చయముగా భక్తులు స్వర్గ వనములలో కాలువలలో ఉంటారు''. (జారియాత్‌:15)అదే విధంగా ''నిశ్చయముగా భయభక్తులు గలవారికి వారి ప్రభువు వద్ద సౌఖ్యములు గల స్వర్గవనములు తప్పక గలవు.''  (అల్‌ కలమ్‌ : 34) ''నిశ్చయముగా భయభక్తులు గలవారికే సాఫల్యము గలదు.'' (అన్‌ నబా: 31)
పరలోకంలో  దైవభీతి గలవారికి ఓ వెలుతురు ప్రసాదించడం జరుగుతుందిదాని ద్వారా వారు తమ పరలోక ప్రయాణాన్ని సాగి స్తారు.''ఓ విశ్వాసులారా! దేవునికి భయపడండిమరియు అతని ప్రవక్తను విశ్వసించండిఅల్లాహ్‌ా మీకు తన అనుగ్రహము నుండి రెండు భాగములు ప్రసాదిస్తాడుమీకు వెలుతురు సైతం ప్రసాది స్తాడు. దానిద్వారా మీరు నడవగలరుమరియు మిమ్మల్ని క్షమిస్తాడు కూడా. అల్లాహ్‌ా క్షమించేవాడు అనుగ్రహించేవాడు.''(అల్‌హదీద్‌:28)
కేవలం పరలోక ప్రయోజనాలే కాకుండాఇహలోక లాభాలు సైతం ప్రాప్తమవుతాయి. వాటిలో కొన్ని ఇవి: అల్లాహ్ ప్రేమ: అల్లాహ్  ప్రసన్నత కొరకు దైవభీతి మరియు పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించే వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడని దివ్య ఖుర్‌ఆన్‌ తెలియజేస్తుంది. ''అల్లాహ్  భయభక్తులు గల వారంటేనే ఇష్టపడతాడు''. (తౌబా:4)
అల్లాహ్  సాన్నిధ్యం: తఖ్వా యొక్క జీవితాన్ని అవలంబించటం వల్ల దైవ సాన్నిధ్యం సైతం ప్రాప్తమవుతుంది. ''అల్లాహ్ కు భయ పడుతూ ఉండండిభయభక్తులు గలవారితోనే అల్లాహ్  ఉంటాడు అనే విషయం తెలుసుకోండి''.      (అల్‌ బఖర:194)
ఉపాధి లభించే మార్గం: దైవం దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తు న్నాడు: 'ఏ వ్యక్తి అయితే అల్లాహ్ కు భయపడతాడోఅల్లాహ్  అతనికి గట్టెక్కే మార్గాన్ని చూపుతాడు (ముక్తిమార్గము కల్పిస్తాడు) మరియు అతనికి తెలియని మార్గం ద్వారా ఉపాధి ప్రసాదిస్తాడు'. (అల్‌ తలాఖ్‌: 2,3)
గీటురాయిని ప్రాప్తిపాపాల మన్నింపు: అల్లాహ్  తన భయభక్తుల ను అవలంబించేవారికి ఓ విచక్షణా శక్తి ప్రసాదిస్తాడు. దాని ద్వారా అడుగడుగునా వారికి స్వయంగా తెలుస్తూ ఉంటుంది. ఏ మార్గం సత్యమైనదోఏది అసత్యమైనదో. ''విశ్వసించిన ప్రజలారా! మీరు గనక భయభక్తులను అవలంబిస్తేఅల్లాహ్  మీకు గీటురాయిని ప్రసా దిస్తాడుమీ నుండి మీ చెడులను దూరం చేస్గాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్  అత్యధికంగా అనుగ్రహించేవాడు.'' (అన్ఫాల్‌:29)
సదాచారాల స్వీకరణ: ఆచారాలు దైవ సమక్షంలో స్వీకరించబడ టానికి తఖ్వాయే పునాది. ''భయభక్తులు గలవారి మొక్కుబడులనే (ఆచారాలనే) అల్లాహ్  స్వీకరిస్తాడు.'' (అల్‌ మాయిదహ్‌ా:27)
గౌరవప్రాప్తి: అల్లాహ్  దృష్టిలో తఖ్వాయే అసలైన ప్రమాణం. ఆ తఖ్వా ద్వారా దాసుడు శ్రేష్ఠమైన స్థాయి పొందగలడు.భయభక్తులు గలవారికే సర్వ రకాల సాఫల్యంప్రతిఫలం లభిస్తుంది. పరలోక లాభాలే కాకుండా ఇహలోక సాఫల్యం సైతం ప్రాప్తమవుతుంది. సూర యూసుఫ్‌ అధ్యయనం చేస్తే మనం గ్రహించే నీతి ఏమంటే ప్రవక్త యూసుఫ్‌ (అ) అధికార పీఠం అధిష్టించాక ఆయన (అ) సోదరులం దరూ లేమిలో ఆయన వద్దకు వచ్చి విన్నవించుకున్నారు. ప్రవక్త యూసుఫ్‌ (అ) తమ సోదరులను సంభాషిస్తూ తన పరిచయం చేశాక తన సాఫల్యానికి కారణమయిన మౌలిక రహస్యాలను పేర్కొన్నారు.''వాస్తవం ఏమిటంటే భయభక్తులతోఓర్మితో వ్యవహరించే సత్పురుషుల ప్రతిఫలం అల్లాహ్  వద్ద వృధా కాదు.'' (యూసుఫ్‌ :90)

కామెంట్‌లు లేవు: